2 కంపెనీల లిస్టింగ్‌ బాట | Meganet, Rediff.com file IPO papers | Sakshi
Sakshi News home page

2 కంపెనీల లిస్టింగ్‌ బాట

Nov 18 2026 5:24 AM | Updated on Nov 18 2026 5:24 AM

Meganet, Rediff.com file IPO papers

రెడిఫ్‌.కామ్, మెగానెట్‌ టెక్‌

సెబీకి ప్రాస్పెక్టస్‌ దాఖలు

న్యూఢిల్లీ: ప్రైమరీ మార్కెట్లకు దన్నుగా ఇటీవల జోరందుకున్న సెకండరీ మార్కెట్లు మరిన్ని కంపెనీల లిస్టింగ్‌కు దారి చూపుతున్నాయి. వెరసి తాజాగా రెండు కంపెనీలు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి అప్‌డేటెడ్, ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేశాయి. తద్వారా ఇంటర్నెట్‌ కంపెనీ రెడిఫ్‌.కామ్, ఏఐ సంబంధిత సేవల సంస్థ మెగానెట్‌ టెక్‌ లిస్టింగ్‌ బాట పట్టాయి. వివరాలు చూద్దాం.. 

రూ. 600 కోట్లపై దృష్టి 
ఇంటర్నెట్‌ సేవల కంపెనీ రెడిఫ్‌.కామ్‌ ఇండియా పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 600 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా తాజా ఈక్విటీని జారీ చేసే ప్రణాళికల్లో ఉంది. ఇష్యూ నిధుల్లో రూ. 225 కోట్లు పెట్టుబడి వ్యయాలకు వెచ్చించనుంది. రెడిఫ్‌ వన్, రెడిఫ్‌ పే, రెడిఫ్‌ టీవీ ప్లాట్‌ఫామ్స్‌ అభివృద్ధి, విస్తరణకు ఈ నిధులు వినియోగించనుంది. మరో రూ. 183 కోట్లు మార్కెటింగ్, బ్రాండింగ్‌కు, మిగిలిన నిధులను ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కేటాయించనుంది. కంపెనీ గోప్యతా మార్గంలో సెబీ నుంచి ఆగస్ట్‌లో అనుమతి పొందడంతో తాజాగా అప్‌డేటెడ్‌ ప్రాస్పెక్టస్‌ను సెబీకి అందించింది.  

కంపెనీ వివరాలివీ.. 
ఎవెన్యూస్‌ఏఐ లిమిటెడ్‌(గతంలో ఇనీ్ఫబీమ్‌ ఎవెన్యూస్‌)కు అనుబంధ సంస్థ రెడిఫ్‌.కామ్‌ ఇండియా 1996లో ఏర్పాటైంది. ఇంటర్నెట్‌ పోర్టల్, రెడిఫ్‌ న్యూస్‌ ద్వారా డిజిటల్‌ మీడియా సంస్థగా ప్రారంభమైంది. తదుపరి డిజిటల్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫామ్‌ సీసీఎవెన్యూ, ఎంటర్‌ప్రైజ్‌ సాఫ్ట్‌వేర్‌ ప్లాట్‌ఫామ్‌ బిల్డ్‌ఏబజార్‌ నిర్వాహక కంపెనీగా సేవలు విస్తరించింది. 1998లో ఉచిత ఈమెయిల్‌ సరీ్వస్‌ రెడిఫ్‌మెయిల్‌కు తెరతీసింది. 2007లో మనీవిజ్‌ ద్వారా వ్యక్తిగత ఫైనాన్స్‌ విభాగంలోకి ప్రవేశించింది. తదనంతర కాలంలో మొబైల్‌ అప్లికేషన్స్, ఎంటర్‌ప్రైజ్‌ ప్రొడక్టివిటీ టూల్స్, ఈకామర్స్‌ సరీ్వసులలో విస్తరించింది. ఆపై ఎంటర్‌ప్రైజ్‌ సేవలు రెడిఫ్‌ వన్‌ బ్రాండ్‌గా, బిల్డ్‌ఏబజార్‌.. రెడిఫ్‌ కామర్స్‌గా ఆవిర్భవించాయి. 2025 జూలైలో డిజిటల్‌ వీడియో, కంటెంట్‌ ప్లాట్‌ఫామ్‌.. రెడిఫ్‌ టీవీని ఆవిష్కరించింది. అదే ఏడాది డిసెంబర్‌లో ఎన్‌పీసీఐ అనుమతి పొందడంతో రెడిఫ్‌ పేకు తెరతీసింది.  

రూ. 740 కోట్లకు రెడీ 
హైఎండ్‌ కంప్యూటింగ్‌ సిస్టమ్స్, ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ మెగానెట్‌ టెక్నాలజీస్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌ రూ. 740 కోట్ల సమీకరణకు వీలుగా ఐపీవో బాట పట్టింది. దీనిలో భాగంగా రూ. 140 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 600 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 100 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు, రూ. 11 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది.  

కంపెనీ బ్యాక్‌గ్రౌండ్‌ ఇలా 
మెగానెట్‌ టెక్నాలజీస్‌ గ్లోబల్‌ ప్రధానంగా ఏఐ సర్వర్లు, వర్క్‌స్టేషన్లు, డేటా సెంటర్‌ సొల్యూషన్లు, హైఎండ్‌ కంప్యూటింగ్‌ సిస్టమ్స్, స్టోరేజీ సొల్యూషన్లు, సాఫ్ట్‌వేర్, సంబంధిత సరీ్వసులు సమకూర్చుతోంది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 2,600 కస్టమర్లకు సేవలు అందించింది. నవీముంబైలోని మహాపేలో వార్షికంగా 5,928 సర్వర్ల తయారీ సామర్థ్యం కలిగిన యూనిట్‌ను నిర్వహిస్తోంది. గతేడాది(2025–26) 2,621 సర్వర్లను రూపొందించింది. గతేడాది ఆదాయం రూ. 447 కోట్లకు బలపడగా.. నికర లాభం రూ. 38 కోట్లకు ఎగసింది. అంతక్రితం ఏడాది(2024–25) ఆదాయం రూ. 368 కోట్లుకాగా.. రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. కంపెనీ కీలక కస్టమర్లలో బ్లాక్‌ బాక్స్, మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్, ఎస్‌ఎంసీ గ్లోబల్‌ సెక్యూరిటీస్, వెస్టర్న్‌ డిజిటల్‌ టెక్నాలజీస్, యొట్ట డేటా సరీ్వసెస్‌ తదితరాలున్నాయి. ఫ్రాస్ట్‌ అండ్‌ సల్లివాన్‌ నివేదిక ప్రకారం ప్రస్తుత రూ. 45,510 కోట్ల విలువైన దేశీ ఏఐ సర్వర్ల మార్కెట్‌ 2032కల్లా రూ. 1,82,820 కోట్లకు జంప్‌చేయనున్నట్లు అంచనా. వెరసి వార్షికంగా 26 శాతం పురోగతిని సాధించనుంది.          

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement