breaking news
secondary market
-
సెబీ చెంతకు 6 కంపెనీలు
కొత్త కేలండర్ ఏడాదిలో సెకండరీ మార్కెట్లను ఓవర్టేక్ చేస్తూ చెలరేగుతున్న ప్రైమరీ మార్కెట్లు ఈ నెల(అక్టోబర్)లోనూ మరింత దూకుడు చూపనున్నాయి. శుక్రవారం(3న) వియ్‌వర్క్ ఇండియా ఐపీవో ప్రారంభంకానుండగా.. వచ్చే వారం దిగ్గజాలు టాటా క్యాపిటల్, ఎల్జీఎల్రక్టానిక్స్ ఐపీవోలు ప్రారంభంకానున్నాయి. ఈ బాటలో మరో 6 కంపెనీలు నిధుల సమీకరణ బాట పట్టాయి. వివరాలు చూద్దాం..న్యూఢిల్లీ: కొద్ది నెలలుగా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్న ప్రైమరీ మార్కెట్ల ప్రభావంతో తాజాగా 6 కంపెనీలు ఐపీవోకు అనుమతించమంటూ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. ఈ జాబితాలో విశ్వరాజ్ ఎన్విరాన్మెంట్, గౌడియం ఐవీఎఫ్ అండ్ విమెన్ హెల్త్, కామ్టెల్ నెట్వర్క్స్, శంకేష్ జ్యువెలర్స్, ప్రీమియర్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్, సీఎస్ఎం టెక్నాలజీస్ చేరాయి. రూ. 2,250 కోట్లపై దృష్టి నీటి వినియోగం, వృధా నీటి నిర్వహణ సంబంధ స ర్వీసులందించే విశ్వరాజ్ ఎన్విరాన్మెంట్ ఐపీవో ద్వారా రూ. 2,250 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా రూ. 1,250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రమోటర్ సంస్థ ప్రీమియర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మరో రూ. 1,000 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనుంది. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులతోపాటు.. మూడు కీలక ప్రాజెక్టులలో పెట్టుబడులకు వెచి్చంచనుంది. కంపెనీ ప్రధానంగా పారిశ్రామిక అవసరాలకు వినియోగించేందుకు వీలుగా వృధా నీటిని శుద్ధి చేయడం తదితరాలను చేపడుతోంది. 2025 మార్చి31కల్లా రూ. 16,011 కోట్ల విలువైన ఆర్డర్‌బుక్‌ను కలిగి ఉంది. గతేడాది(2024–25) రూ. 1,759 కోట్ల ఆదాయం, రూ. 266 కోట్ల నికర లాభం ఆర్జించింది. 19 కొత్త కేంద్రాల ఏర్పాటు ఫెర్టిలిటీ సర్వీసులందించే గౌడియం ఐవీఎఫ్ అండ్ విమెన్ హెల్త్ ఐపీవోలో భాగంగా 1.14 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 95 లక్షల షేర్లను ప్రమోటర్ మనికా ఖన్నా విక్రయించనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 50 కోట్లు దేశవ్యాప్తంగా 19 ఐవీఎఫ్ కేంద్రాల ఏర్పాటుకు వినియోగించనుంది. మరో రూ. 20 కోట్లు రుణ చెల్లింపులకు వెచి్చంచనుంది. రీప్రొడక్టివ్ టెక్నాలజీస్‌లో కంపెనీ సేవలు విస్తరించింది. జనవరిలో కంపెనీ ప్రమోటర్లు ఐపీవో ద్వారా 25.31 లక్షల షేర్లు విక్రయించేందుకు ప్రతిపాదించారు. తద్వారా తాజాగా పరిమాణాన్ని పెంచారు. ఈక్విటీ జారీని 1.83 కోట్ల షేర్ల నుంచి తగ్గించారు. కంపెనీ గతేడాది(2024–25) రూ. 71 కోట్ల ఆదాయం, రూ. 19 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇంజినీరింగ్ సంస్థ ఐపీవోలో భాగంగా స్పెషలైజ్డ్ ఇంజినీరింగ్, టెక్నాలజీ కంపెనీ కామ్టెల్ నెట్వర్క్స్ రూ. 150 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 750 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ విక్రయించనున్నారు. ఈక్విటీ జారీ నిధులను ప్రధానంగా రుణ చెల్లింపులకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ తదితర రంగాలకు కీలకమైన ఇంటెగ్రేటెడ్ టెలికమ్యూనికేషన్, సెక్యూరిటీ, సేఫ్టీ సిస్టమ్స్ డిజైనింగ్, బిల్డింగ్, ఇంప్లిమెంటింగ్ చేపడుతోంది. వైర్ తయారీ కేంద్రం ప్రీమియర్ ఇండ్రస్టియల్ కార్పొరేషన్ ఐపీవోలో భాగంగా 2.25 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 54 లక్షల షేర్లను ప్రమోటర్ విక్రయించనున్నారు. ఈక్విటీ జారీ నిధులను మహారాష్ట్రలోని హోనడ్(ఖాలాపూర్, రాయ్‌గడ్) వద్ద వైర్ తయారీ యూనిట్ ఏర్పాటుతోపాటు.. వాడ(పాల్గర్) తయారీ యూనిట్ విస్తరణకు వెచి్చంచనుంది. కంపెనీ వెల్డింగ్ కన్జూమబుల్స్ పరిశ్రమలో వినియోగించే పౌడర్లు, వైర్ల తయారీలో ఉంది. రుణ చెల్లింపులకు బంగారు ఆభరణ వర్తక కంపెనీ శంకేష్ జ్యువెలర్స్ ఐపీవోలో భాగంగా 3 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో కోటి షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 158 కోట్లు రుణ చెల్లింపులకు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు రూ. 38 కోట్లు చొప్పున కేటాయించనుంది. కంపెనీ ప్రధానంగా క్లయింట్ల అవసరాలకు తగిన విధంగా బంగారు ఆభరణాల తయారీని చేపడుతోంది. ప్రభుత్వ సేవలు.. డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, ప్రభుత్వ స ర్వీసులు(గోవ్‌టెక్), ఐటీ కన్సల్టింగ్ సర్వీసులందించే సీఎస్ఎం టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా 1.29 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా భువనేశ్వర్ కంపెనీ రూ. 150 కోట్లు సమీకరించనుంది. నిధులను వృద్ధి, టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పటిష్టత, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. 1998లో సైబర్‌టెక్ సాఫ్ట్వేర్ అండ్ మల్టిమీడియాగా ప్రారంభమైన కంపెనీ 2014లో సీఎస్ఎం టెక్నాలజీస్‌గా అవతరించింది. ప్రధానంగా ప్రభుత్వాలు, పీఎస్‌యూలకు స ర్వీసులు సమకూర్చే కంపెనీ పలు దేశాలలో అనుబంధ సంస్థలను నిర్వహిస్తోంది. గతేడాది(2024–25) రూ. 199 కోట్ల ఆదాయం, రూ. 14 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
ఐపీవో నిధుల సమీకరణకు కోత..!
ఇటీవల తిరిగి ప్రైమరీ మార్కెట్లు జోరందుకున్నప్పటికీ పలు కంపెనీలు ఐపీవో నిధుల సమీకరణకు కోత పెడుతున్నాయి. సెకండరీ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, పెట్టుబడులకు పలు అవకాశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సైతం అంతగా ఆసక్తి చూపకపోవడం వంటి అంశాలు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. నిజానికి ప్రస్తుత కేలండర్ ఏడాది (2025)లో పలు అన్‌లిస్టెడ్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు క్యూ కడుతున్నాయి. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేస్తున్నాయి. అనుమతులు సైతం పొందుతున్నాయి. అయితే జనవరి మొదలు ప్రపంచ దేశాలపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అదనపు సుంకాలను విధిస్తుండటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ప్రధానంగా భారత్ ఎగుమతులపై ఇటీవల 50 శాతంవరకూ టారిఫ్‌లను ప్రకటించడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు. యూఎస్ టారిఫ్‌ల కారణంగా సముద్ర ఉత్పత్తులు, టెక్స్టైల్స్, లెదర్, జ్యువెలరీ, కెమికల్స్ తదితర పలు రంగాలు ప్రభావితంకావచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫార్మాపై సైతం సుంకాలు విధించే వీలున్నట్లు ట్రంప్ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఫలితంగా కొద్ది నెలలుగా దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలోనే సాగుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. వీటికితోడు దేశీ కంపెనీల ఏప్రిల్–జూన్(క్యూ1) ఫలితాలు ఆకట్టుకోకపోవడంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు సైతం దేశీ స్టాక్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో పలు అన్‌లిస్టెడ్ కంపెనీలు ఐపీవో ద్వారా సమీకరించదలచిన నిధుల పరిమాణాన్ని తగ్గించుకుంటున్నాయి. పునరాలోచనలో.. ఈ ఏడాది జనవరి నుంచి పలు కంపెనీలు లిస్టింగ్‌కు ఆసక్తి చూపుతున్నప్పటికీ సమీకరించతలపెట్టిన నిధుల పరిమాణంలో కోత పెట్టుకుంటున్నట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. వెరసి 2025లో ఇప్పటివరకూ సుమారు 15 కంపెనీలు ఇష్యూల పరిమాణాన్ని తగ్గించుకున్నాయి. ఈ జాబితాలో ఇటీవల లిస్టయిన దిగ్గజాలు ఎన్ఎస్డీఎల్, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్సహా.. ఏథర్ ఎనర్జీ, ఎస్కే ఫైనాన్స్, బ్లూస్టోన్, మొబిక్విక్, ష్లాస్ బెంగళూరు(లీలా హోటల్స్), ఇండిక్యూబ్, అర్బన్ కంపెనీ, స్మార్ట్ వర్క్స్, స్వస్తికా ఇన్ఫ్రా తదితరాలు చేరాయి. 48 కంపెనీల లిస్టింగ్ ఈ కేలండర్ ఏడాదిలో ఇప్పటివరకూ 48 కంపెనీలు ఐపీవోలు చేపట్టి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాయి. తద్వారా రూ. 64,135 కోట్లు సమకూర్చుకున్నాయి. అంతక్రితం ఏడాది అంటే 2024లో 90 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి. తద్వారా ఏకంగా రూ. 1,67,535 కోట్లు(19.5 బిలియన్ డాలర్లు) సమీకరించాయి. ఇది రికార్డుకాగా.. ఈ ఏడాది ద్వితీయార్థంలోనూ పలు దిగ్గజాలు లిస్టింగ్ బాటలో సాగనున్నాయి. పలు అవకాశాలు ప్రైమరీ మార్కెట్లలో కొన్ని నెలలుగా చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎస్ఎంఈ) సైతం సందడి చేస్తున్నాయి. దీంతో ఎన్ఎస్ఈ ఎమర్జ్, బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్స్ ద్వారా పలు చిన్న కంపెనీలు సైతం భారీ స్థాయిలో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. మరో వైపు కొద్ది నెలలుగా బంగారం, వెండి వంటి విలువైన లోహాలు ఆకర్షణీయ రిటర్నులు ఇవ్వడం, రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌ల ఐపీవోలు, మ్యూచువల్ ఫండ్ల సిప్ పథకాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో మెయిన్ బోర్డ్ ప్రైమరీ మార్కెట్లో కొన్ని ఇష్యూలు మాత్రమే లిస్టింగ్‌లోనూ విజయవంతమవుతున్నట్లు వివరించారు. వెనకడుగు తీరిదీ... వివిధ ప్రతికూలతల కారణంగా తొలుత వేసిన ప్రణాళికలను సవరిస్తూ కొన్ని కంపెనీలు ఐపీవో నిధుల సమీకరణ పరిమాణంలో కోత పెడుతున్నాయి. జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ రూ. 4,000 కోట్ల విలువను రూ. 3,600 కోట్లకు సవరించగా.. ఏథర్ ఎనర్జీ రూ. 3,100 కోట్ల నుంచి రూ. 2,626 కోట్లకు తగ్గించుకుంది. ఈ బాటలో ఎస్కే ఫైనాన్స్ రూ. 2,200 కోట్లస్థానే రూ. 1,600 కోట్లు మాత్రమే సమీకరించగా.. బ్లూస్టోన్ రూ. 1,000 కోట్ల నుంచి రూ. 820 కోట్లకు వెనకడుగు వేసింది. లీలా హోటల్స్ రూ. 5,000 కోట్ల ప్రణాళికను రూ. 3,000 కోట్లకు కుదిస్తే.. మొబిక్విక్ రూ. 1,900 కోట్ల నుంచి రూ. 700 కోట్లకు భారీగా కోత పెట్టుకుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఐపీఓల జోరుకు బ్రేక్!!
న్యూఢిల్లీ: గతేడాదంతా జోరుగా దూసుకెళ్లిన ఐపీఓల మార్కెట్ ప్రస్తుతం సెకండరీ మార్కెట్లో కరెక్షన్ కారణంగా నెమ్మదించిన ధోరణి కనిపిస్తోంది. గత రెండు నెలలుగా నెలకొన్న పరిస్థితులు దీన్ని సూచిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 2024 డిసెంబర్లో ఏకంగా 16 లిస్టింగ్స్ నమోదు కాగా .. ఈ ఏడాది జనవరిలో అయిదు ఇష్యూలు మాత్రమే వచ్చాయి. ఫిబ్రవరిలో ఈ సంఖ్య నాలుగుకి తగ్గింది. అంతేగాకుండా కొన్ని కంపెనీలు ఐపీఓ ప్రణాళికలను పక్కన పెడుతున్నాయి. జనవరి, ఫిబ్రవరిలో అడ్వాన్స్డ్ సిస్–టెక్, ఎస్ఎఫ్సీ ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీస్, వినే కార్పొరేషన్ ఇలా ప్రతిపాదనలను వెనక్కి తీసుకున్న వాటిల్లో ఉన్నాయి. గత రెండు నెలల్లో ప్రధానంగా సెకండరీ మార్కెట్ కరెక్షన్‌కి లోను కావడంతో పలు లిస్టెడ్ కంపెనీల షేర్లపై ప్రతికూల ప్రభావం పడిందని ఈక్విరస్ ఎండీ భావేష్ షా తెలిపారు. దీనితో ఇన్వెస్టర్లు కొత్త లిస్టింగ్లవైపు చూడటం కాకుండా ప్రస్తుతమున్న పోర్ట్‌ఫోలియోను కాపాడుకోవడంపై దృష్టి పెడుతున్నారని పేర్కొన్నారు. ఇలా కొత్త ఐపీఓలపై ఇన్వెస్టర్ల ఆసక్తి సన్నగిల్లడంతో పబ్లిక్ ఇష్యూల మార్కెట్ కూడా నెమ్మదించిందని ఆయన పేర్కొన్నారు. పటిష్టమైన ఎకానమీ, మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు భారీగా పెరగడం వంటి సానుకూలాంశాలతో 2014లో ఏకంగా 91 ఐపీఓల ద్వారా కంపెనీలు రూ. 1.6 లక్షల కోట్లు సమీకరించాయి. అయినప్పటికీ.. ఆశావహమే.. పబ్లిక్ ఇష్యూలపై ప్రస్తుతానికి ఇన్వెస్టర్ల ఆసక్తి సన్నగిల్లినప్పటికీ .. దీర్ఘకాలికంగా చూస్తే మాత్రం మార్కెట్ సానుకూలంగానే కనిపిస్తోందని ఆనంద్ రాఠీ అడ్వైజర్స్ డైరెక్టర్ వి. ప్రశాంత్‌రావు తెలిపారు. పెద్ద ఎత్తున సంస్థలు ఐపీఓకి సిద్ధమవుతుండటమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ‘పెద్ద సంఖ్యలో ప్రాస్పెక్టస్‌లు దాఖలవుతున్నాయి. మార్కెట్లు స్థిరపడటం కోసం కంపెనీలు వేచిచూస్తున్నాయి. ప్రస్తుతం రూ. 67,000 కోట్లు సమీకరించడానికి 45 కంపెనీలకు సెబీ అనుమతులు ఉన్నాయి. మరో రూ. 1.15 లక్షల కోట్ల సమీకరణ కోసం 69 కంపెనీలు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఇందులో 45 కంపెనీలు గత కొద్ది నెలల్లో ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి‘ అని ఆయన పేర్కొన్నారు. గత రెండు నెలల వ్యవధిలోనే దాదాపు 30 కంపెనీలు సెబీకి ప్రాస్పెక్టస్‌లను సమరి్పంచినట్లు వివరించారు. సత్వ గ్రూప్, బ్లాక్‌స్టోన్ దన్ను గల నాలెడ్జ్ రియల్టీ ట్రస్ట్ ఈమధ్యే రూ. 6,200 కోట్ల సమీకరణకు సంబంధించి పత్రాలు దాఖలు చేసింది. రాబోయే కొద్ది నెలల్లో మార్కెట్లు స్థిరపడిన తర్వాత ఐపీఓలు మళ్లీ పుంజుకుంటాయనే సంకేతాలు కనిపిస్తున్నాయని షా ఆశాభావం వ్యక్తం చేశారు. మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటంతో పాటు మదుపరులు కూడా కొత్త కంపెనీల్లో తాజాగా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారని పేర్కొన్నారు. అయితే, ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడానికి కంపెనీలు, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తమ వేల్యుయేషన్లను సరిచేసుకోవాల్సి ఉంటుందని షా అభిప్రాయపడ్డారు. -
నువామా వెల్త్ చేతికి ఓయో షేర్లు
న్యూఢిల్లీ: ట్రావెల్ టెక్ యూనికార్న్ ఒరావెల్ స్టేస్ లిమిటెడ్‌లో నువామా వెల్త్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రూ. 100 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఓయో బ్రాండ్ కంపెనీ వాటాను షేరుకి రూ. 53 చొప్పున సొంతం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. సెకండరీ మార్కెట్లో లావాదేవీ ద్వారా కంపెనీ తొలి ఇన్వెస్టర్ల నుంచి వీటిని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నాయి. మరోపక్క ఆతిథ్య రంగ కంపెనీలో వాటా కొనుగోలుకి ఇన్‌క్రెడ్ తదితర సంస్థలు సైతం ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించాయి. ఇందుకు షేరుకి రూ. 53–60 మధ్య ధరను చెల్లించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వెరసి కంపెనీ విలువను 5 బిలియన్ డాలర్లకుపైగా మదింపు చేసినట్లు వివరించాయి. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. వీటి ప్రకారం ఏప్రిల్–జూన్(క్యూ1)లో సుమారు రూ. 132 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2023–24) క్యూ1లో రూ. 108 కోట్ల నష్టాలు ప్రకటించింది. -
ఇన్వెస్టర్లకు యూపీఐ.. సెబీ ఆదేశం
న్యూఢిల్లీ: సెకండరీ మార్కెట్లో ట్రేడింగ్ కోసం క్లయింట్లకు యూపీఐ ఆధారిత బ్లాక్ విధానాన్ని లేదా త్రీ–ఇన్–వన్ ట్రేడింగ్ అకౌంటు సదుపాయాన్ని అందించాలని క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్క్కు (క్యూఎస్బీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది.ప్రస్తుత ట్రేడింగ్ విధానంతో పాటు ఫిబ్రవరి 1 నుంచి ఈ రెండింటిలో ఒక సదుపాయాన్ని తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని సూచించింది. త్రీ–ఇన్–వన్ ట్రేడింగ్ అకౌంటులో సేవింగ్స్ అకౌంటు, డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ మూడూ కలిసి ఉంటాయి.ఇదీ చదవండి: సెబీకి షాక్.. ముకేశ్ అంబానీకి ఊరటయూపీఐ బ్లాక్ మెకానిజంలో క్లయింట్లు ట్రేడింగ్ సభ్యునికి ముందస్తుగా నిధులను బదిలీ చేయడానికి బదులుగా తమ బ్యాంకు ఖాతాలలో బ్లాక్ చేసిన నిధుల ఆధారంగా సెకండరీ మార్కెట్లో ట్రేడింగ్ చేయవచ్చు. ఈ సదుపాయం ప్రస్తుతం ఇన్వెస్టర్లకు ఐచ్ఛికంగానే ఉంది. -
ఐపీవోలకు కంపెనీల క్యూ..
ఇటీవల సెకండరీ మార్కెట్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సరికొత్త గరిష్టాలను తాకుతున్నాయి. పెట్టుబడుల ప్రోత్సాహంతో ప్రైమరీ మార్కెట్ సైతం కళకళలాడుతోంది. ఈ ప్రభావంతో కొత్త ఏడాది (2024)లోనూ పలు కంపెనీలు నిధుల సమీకరణకు క్యూ కట్టనున్నట్లు స్టాక్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో పబ్లిక్ ఇష్యూల వెల్లువ కొనసాగనున్నట్లు అంచనా వేశారు. న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది (2023)లో ఇప్పటివరకూ పబ్లిక్ ఇష్యూల ద్వారా కంపెనీలు రూ. 52,000 కోట్లు సమకూర్చుకున్నాయి. ప్రధాన ఎక్సే్చంజీలైన బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టింగ్ ద్వారా దేశీ కార్పొరేట్లు సమీకరించిన నిధులివి. నిజానికి ఓవైపు వడ్డీ రేట్లు, మరోపక్క భౌగోళిక, రాజకీయ రిసు్కలు పెరిగినప్పటికీ.. ఐపీవోలు దూకుడు చూపుతున్నాయి. పలు కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ కోసం వెల్లువలా సెబీ తలుపు తడుతున్నాయి. దీంతో వచ్చే ఏడాదిలోనూ ప్రైమరీ మార్కెట్ బుల్లిష్ ధోరణిలోనే కొనసాగనున్నట్లు పలువురు స్టాక్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గతేడాది (2022)లో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీని మినహాయిస్తే పబ్లిక్ ఇష్యూల ద్వారా కంపెనీలు రూ. 20,557 కోట్లు సమీకరించాయి. అంటే దీంతో పోలిస్తే ఈ ఏడాది 36 శాతం అధికంగా పెట్టుబడులు అందుకున్నాయి. ప్రధానంగా మధ్య, చిన్న తరహా కంపెనీలు హవా చూపాయి. మార్కెట్ సెంటిమెంటు బలంగా ఉండటం ఇందుకు దోహదపడుతోంది. అయితే ప్రపంచ సవాళ్ల నేపథ్యంలో ఏడాది మొదట్లో మార్కెట్లు డీలా పడిన సంగతి తెలిసిందే. కారణాలున్నాయ్.. ప్రైమరీ మార్కెట్లు జోరందుకోవడానికి లిస్టింగ్ లాభాలు, అందుబాటు ధరల్లో డీల్స్ కారణమవుతున్నట్లు పంటోమత్ క్యాపిటల్ అడ్వయిజర్స్ ఎండీ మహావీర్ లూనావత్ పేర్కొన్నారు. ఆయా రంగాల్లోని లిస్టెడ్ కంపెనీలు అధిక విలువల్లో ట్రేడవుతుండటం ఇందుకు జత కలసినట్లు అభిప్రాయపడ్డారు. పటిష్ట నియంత్రణా వ్యవస్థలు సైతం ఇందుకు అండగా నిలుస్తున్నట్లు తెలియజేశారు. 2023లో కనిపిస్తున్న ప్రోత్సాహకర పరిస్థితులు 2024లోనూ కొనసాగనున్నట్లు ఆనంద్ రాఠీ అడ్వయిజర్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఈసీఎం వి.ప్రశాంత్ రావు అంచనా వేశారు. ఇది బంగారు కాలంగా నిలిచే వీలున్నట్లు పేర్కొన్నారు. తరలివస్తున్న దేశ, విదేశీ పెట్టుబడులు, దేశీ మార్కెట్ల వృద్ధికిగల భారీ అవకాశాల కారణంగా వచ్చే ఏడాదిలోనూ ఐపీవో మార్కెట్ మరింత జోరు చూపనున్నట్లు జేఎం ఫైనాన్షియల్ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ నేహా అగర్వాల్ అభిప్రాయపడ్డారు. సార్వత్రిక ఎన్నికల పూర్తి తదితర అనిశి్చతులు తొలగితే మరిన్ని పెట్టుబడులు తరలివస్తాయని పేర్కొన్నారు. మరో రూ. 26,000 కోట్లు నిధుల సమీకరణకు ఇప్పటికే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి 24 కంపెనీలు అనుమతులు పొందాయి. ఇవి ఐపీవోలు చేపట్టడం ద్వారా రూ. 26,000 కోట్లు సమీకరించేందుకు వీలుంది. ఈ బాటలో మరో 32 కంపెనీలు లిస్టింగ్‌కు వీలుగా సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. వీటి నిధుల సమీకరణ అంచనా రూ. 35,000 కోట్లుగా ప్రైమ్ డేటాబేస్ పేర్కొంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం 2023లో ఐపీవోల ద్వారా 58 కంపెనీలు రూ. 52,637 కోట్లు సమకూర్చుకున్నాయి. వీటిలో రూ. 3,200 కోట్లు అందుకున్న నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ రీట్ ఉంది. గతేడాది ఎల్ఐసీ (రూ. 20,557 కోట్లు) సహా.. 40 కంపెనీలు ఉమ్మడిగా రూ. 59,302 కోట్లు సమీకరించాయి. అయితే అంతకుముందు 2021లో 63 కంపెనీలు ప్రైమరీ మార్కెట్ ద్వారా ఏకంగా రూ. 1.2 లక్షల కోట్లను అందుకున్నాయి. వెరసి రెండు దశాబ్దాలలోనే అత్యధిక నిధుల సమీకరణగా 2021 నిలిచింది! అధిక లిక్విడిటీ, ఇన్వెస్టర్ల ఆసక్తి, మార్కెట్ల జోరు నేపథ్యంలో గత మూడేళ్లలో 150 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. -
సెకండరీ మార్కెట్ ట్రేడింగ్‌లోనూ ‘అస్బా’
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల సొమ్ముకు రక్షణ కల్పించే బాటలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సెకండరీ మార్కెట్లోనూ అస్బాకు తెరతీసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. షేర్ల జారీ తదుపరి ఖాతాలో నిలిపి ఉంచిన సొమ్ము బదిలీ(అస్బా) పద్ధతికి దన్నుగా ప్రస్తుతం అనుబంధ విధానాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా ప్రైమరీ మార్కెట్లో వినియోగించే అస్బా సౌకర్యాన్ని 2024 జనవరి 1కల్లా సెకండరీ మార్కెట్లోనూ అమలు చేసే చర్యలకు తెరతీసింది. అప్లికేషన్ సపోర్టెడ్ బ్లాక్డ్ అమౌంట్(అస్బా) అమలు చేయడం ద్వారా ఇన్వెస్టర్ల బ్యాంకు ఖాతాలోని సొమ్ము ట్రేడింగ్ సభ్యునికి బదిలీకాకుండా నిలిచిపోతుంది. వెరసి లావాదేవీ తదుపరి ఇన్వెస్టర్లకు షేర్లు బదిలీ అయ్యాక మాత్రమే అతని ఖాతా నుంచి నిలిపి ఉంచిన సొమ్ము సంబంధిత ఖాతాకు విడుదల అవుతుంది. ప్రైమరీ మార్కెట్లో ఇప్పటికే అస్బా అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజా మార్గదర్శకాల ప్రకారం క్లియరింగ్ కార్పొరేషన్(సీసీ)కు అనుగుణంగా క్లయింట్ ఖాతాలోని సొమ్మును నిలిపి ఉంచుతారు. లావాదేవీ గడువు ముగిశాక లేదా సీసీ విడుదల చేశాక నిధులు బదిలీ అవుతాయి. దీంతో అటు సభ్యుల నుంచి సెక్యూరిటీలు, ఇటు క్లయింట్ల నుంచి నిధులు బదిలీ ద్వారా కాకుండా సీసీ ద్వారా లావాదేవీ సెటిల్మెంట్ జరుగుతుంది. ఫలితంగా క్లయింట్ల సొమ్ము అక్రమ వినియోగానికి చెక్ పడే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. -
సెకండరీ మార్కెట్లోనూ అస్బా
ముంబై: సెకండరీ మార్కెట్ లావాదేవీల్లోనూ ఏఎస్బీఏ(అస్బా) తరహా సౌకర్యాలకు తెరతీసే యోచనలో ఉన్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్‌పర్శన్ మాధవీ పురీ బచ్ తాజాగా పేర్కొన్నారు. ప్రైమరీ మార్కెట్‌కు ఇదెంతో ప్రయోజనకారిగా ఉన్నప్పుడు సెకండరీ మార్కెట్లోనూ ఎందుకు ప్రవేశపెట్టకూడదంటూ ప్రశ్నించారు. అప్లికేషన్‌కు మద్దతుగా బ్యాంక్ ఖాతాలో ఇన్వెస్టర్ సొమ్ము తాత్కాలిక నిలుపుదల చేసే అస్బా తరహా సౌకర్యాలను సెకండరీ మార్కెట్లోనూ ప్రవేశపెట్టేందుకు ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్లు గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌కు హాజరైన మాధవీ పురీ వెల్లడించారు. అస్బాలో భాగంగా ఐపీవోకు దరఖాస్తు చేసే ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు జరిగాకే సొమ్ము బ్యాంకు ఖాతా నుంచి బదిలీ అయ్యే సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెకండరీ మార్కెట్ లావాదేవీల్లో ఇన్వెస్టర్ల సొమ్ము బ్రోకర్లవద్ద ఉంటున్నదని, అస్బా తరహా సౌకర్యముంటే ఇందుకు తెరపడుతుందని తెలియజేశారు. లోపాలకు చెక్ సెకండరీ మార్కెట్లో వ్యవస్థాగత లోపాలను తగ్గించే లక్ష్యంతో అస్బా ఆలోచనకు తెరతీసినట్లు మాధవీ పురీ వెల్లడించారు. ఫిన్‌టెక్ సంస్థలను తమ వ్యాపార విధానాల(బిజినెస్ మోడల్)లో ఇలాంటి వాటికి తావీయకుండా చూడాలంటూ ఈ సందర్భంగా సూచించారు. లోపాలకు ఆస్కారమిస్తే నియంత్రణ సంస్థల చర్యలకు లోనుకావలసి వస్తుందని హెచ్చరించారు. ఆడిటెడ్ లేదా వేలిడేటెడ్కాని బ్లాక్ బాక్స్తరహా బిజినెస్ మోడళ్లను అనుమతించబోమంటూ స్పష్టం చేశారు. -
ఎస్ఎంఈ విభాగం నుంచి క్యూ1లో 4ఐపీఓలే..!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో చిన్న మధ్య తరహా విభాగంలో కేవలం 4ఐపీఓలు మాత్రమే మార్కెట్లోకి వచ్చాయి. ఈ 4ఐపీఓల మొత్తం విలువ 2.8మిలియన్ డాలర్లు ఉంది. కరోనా వైరస్ అంటువ్యాధి ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ కుంటుబడటంతో కంపెనీలు ఐపీఓ బాటపట్టేందుకు సంశయించాయిని ఈవై ఇండియా నివేదిక తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో పెద్దగా యాక్టివిటీ లేకపోయినప్పటికీ, కంపెనీలు దీర్ఘకాలిక వృద్ధి ప్రణాళికలను పరిశీలిస్తున్నాయి. అందులో భాగంగా కొన్ని కంపెనీలు ఈ ఆర్థిక మందగమనంలోనూ ఐపీఓ ఇష్యూపై దృష్టిని సారిస్తున్నాయని ఈవై ఇండియా ఆదివారం తెలిపింది. ఇతర కంపెనీ కొనుగోళ్ల పాటు ప్రధాన సెకండరీ మార్కెట్లో ఎలాంటి ఐపీఓలు రాలేదు. ప్రస్తు్తత ఆర్థిక సంవత్సరపు ఏప్రిల్-జూన్ కార్వర్ట్తో పాటు రెండో త్రైమాసికంలో కన్జ్యూమర్ ప్రాడెక్ట్స్&రీటైల్, డెవర్సీఫైడ్ ఇండస్ట్రీయల్ ప్రాడెక్ట్స్ రంగాలకు చెందిన కంపెనీలు మాత్రమే ఐపీఓ విభాగంలో చురుగ్గా పాల్గోనే అవకాశం ఉంది. ఈ రెండు సెక్టార్ల నుంచి తలా రెండు ఐపీఓలు మాత్రమే ఉన్నాయి. 4ఐపీఓల మొత్తం విలువ 2.08 మిలియన్లుగా ఉంది. ‘‘కోవిడ్ -19 మానవ జీవితాన్ని, ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసింది. దీంతో గడిచిన 3నెలల్లో ఆర్థిక వ్యవస్థ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో లాగానే భారతఐపీఓ మార్కెట్లోనూ ఎలాంటి యాక్టివిటీ లేదు. అయితే కోవిడ్-19 తర్వాత కంపెనీలకు వచ్చే ఆర్డర్ల విలువలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇప్పుడు ఇన్వెస్టర్లు, విశ్లేషకులు ఆర్డర్ల తయారీ అవకాశాలను ఎంతమేరకు అందిపుచ్చుకుంటాయనే అంశాన్ని నిశీతంగా పరిశీలిస్తున్నారు.’’ అని ఫైనాన్సియల్ అకౌంటింగ్ అడ్వైజర్ సర్వీస్ సందీప్ ఖేతన్ తెలిపారు. భవిష్యత్ నిధుల సేకరణ కోసం ప్రస్తుత సమయాన్ని ఉపయోగించుకోవాలని కంపెనీలు చూస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరపు చివరికల్లా లేదా వచ్చే 2021 ఎఫ్వై తొలిభాగంలో ఐపీఓ యాక్టివిటీ పుంజుకోవచ్చు.’’ ఆయన తెలిపారు. అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్లో ఇదే ఎస్ఎంఈ మార్కెట్లో 14 కంపెనీలు ఐపీఓకు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
ఈ ఏడాది తొలిభాగంలో ఐపీఓ అట్టర్ ప్లాప్ ..!
కరోనా కట్టడికి దేశవ్యాప్త లాక్డౌన్ విధింపుతో భారత కార్పోరేట్ వ్యవస్థ ఇప్పటికీ కష్టాలను ఎదుర్కోటుంది. ఈక్విటీ మార్కెట్లు కూడా రోలర్-కోస్టర్ రైడింగ్‌ను చేస్తున్నాయి. ఐపీఓ మార్కెట్ ఇందుకు మినహాయింపు కాదు. 2012లో మొదటి తొలిభాగం తర్వాత అత్యంత చెత్త ప్రదర్శన ఇచ్చిన తొలి అర్థ సంవత్సరంగా నిలిచిపోయింది. ఇష్యూకు ఒకే కంపెనీ మాత్రమే: ప్రధాన విభాగపు కంపెనీలకు పరిగణాలోకి తీసుకుంటే ఈ ఏడాది మొదటి 6నెలల్లో కేవలం ఒకే ఒక్క కంపెనీ మాత్రమే ఇష్యూకు వచ్చింది. అది ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ సర్వీసెస్ కంపెనీ. ఇదే క్రమంలో ఐపీఓ ప్రక్రియను పూర్తి చేసుకున్న 17 కంపెనీలు ఎక్చ్సేంజీల్లో లిస్ట్ అయ్యాయి. చిన్న, మధ్య తరహా విభాగం నుంచి 16 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వచ్చాయి. గతేడాది ఇదే తొలిభాగంలో 35 కంపెనీలు ఎక్చ్సేంజ్‌లో లిస్ట్ అయితే, ప్రధాన విభాగం నుంచి 7 కంపెనీలు ఇష్యూకు వచ్చాయి. వాస్తవానికి ఎస్బీఐ కార్డ్స్ ఇష్యూ అనంతరం చాలా కంపెనీలు ఐపీఐకు రావాల్సి ఉంది. కాని కోవిడ్-19తో వ్యాధి వ్యాప్తితో ఆర్థిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం, ఈ ఏడాది జనవరి రికార్డు గరిష్టం నుంచి భారత ఈక్విటీ సూచీలతో పాటు ప్రపంచఈక్విటీ మార్కెట్లు 40శాతం నష్టాన్ని చవిచూడటం లాంటి అంశాలు ఐపీఓ రావాలనకున్న కంపెనీల ఆశలపై నీళ్లు చల్లాయి. ‘‘ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ బ్లాక్‌బ్లాస్టర్ సబ్‌స్క్రైబ్ అయిన తర్వాత కోవిడ్-19, పరిమితంగా ఉన్న లిక్విడిటీలతో ప్రైమరీ మార్కెట్ తీవ్ర ఒడిదుడులకు ఎదుర్కోంది. ఏడాది ప్రారంభంలో కొత్తగా పుట్టుకొచ్చిన కోవిడ్-19 ఆర్థిక కార్యకలాపాలను చేయడంతో పాటు, మార్కెట్ అస్థిరతకు దారితీసింది. ఫలితంగా ఫైనాన్షియల్ రంగంలో తీవ్రభయాలు నెలకొన్నాయి. అందుకే చాలా కంపెనీలు ఐపీఓలను వాయిదా వేసుకున్నాయి.’’ అని మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే అభిప్రాయపడ్డారు. బుక్ రన్నర్లు, ప్రమోటర్లు వెనకడుగు వేయడంతో పాటు డిమాండ్ లేమితో ఐపీఓ మార్కెట్ దారుణంగా దెబ్బతింది. సెకండరీ మార్కెట్ల బలహీనత, మార్కెట్లో నెలకొన్న ఆందోళనలు ప్రాథమిక మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఇప్పుడు లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా అన్‌లాక్ ప్రక్రియతో మార్కెట్‌తో పాటు అన్ని విభాగాలు తిరిగి గాడిన పడుతున్నాయి. అయితే ఒక్క ప్రాథమిక మార్కెట్లో ఇంకా ఎలాంటి చలనం రావట్లేదు. -
మళ్లీ ఐపీవోలవైపు కంపెనీల చూపు
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకెళుతున్న నేపథ్యంలో దేశీ కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టేందుకు క్యూకట్టే అవకాశముంది. ఎన్డీఏ నేతృత్వంలో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకానున్న కారణంగా ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్‌లో పెట్టుబడులను కుమ్మరిస్తున్నారు. వెరసి మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 24,000 పాయింట్లను అధిగమించి కొత్త రికార్డును నెలకొల్పింది. దీంతో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధుల సమీకరణకు సమాయత్తంకాగలవని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐపీవోలను నిర్వహించే మర్చంట్ బ్యాంకర్ల సమాచారంమేరకు కనీసం 12 సంస్థలు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేసినట్లు తెలుస్తోంది. కాగా, ప్రైమ్ డేటాబేస్ నివేదిక ప్రకారం 14 సంస్థలు రూ. 2,796 కోట్ల సమీకరణకు పబ్లిక్ ఇష్యూలను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. మార్కెట్లు మందగించడంతో గడిచిన ఆర్థిక సంవత్సరం(2013-14)లో ఐపీవోల ద్వారా కంపెనీలు రూ. 1,205 కోట్లను మాత్రమే సమీకరించిన విషయం విదితమే.


