ఎస్‌ఎంఈ విభాగం నుంచి క్యూ1లో 4ఐపీఓలే..!

Exchanges see just 4 IPOs in June quarter, says report - Sakshi

మొత్తం విలువ 2.8మిలియన్‌ డాలర్లు మాత్రమే...

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో చిన్న మధ్య తరహా విభాగంలో కేవలం 4ఐపీఓలు మాత్రమే మార్కెట్లోకి వచ్చాయి. ఈ 4ఐపీఓల మొత్తం విలువ 2.8మిలియన్‌ డాలర్లు ఉంది. కరోనా వైరస్‌ అంటువ్యాధి ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ కుంటుబడటంతో కంపెనీలు ఐపీఓ బాటపట్టేందుకు సంశయించాయిని ఈవై ఇండియా నివేదిక తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో పెద్దగా యాక్టివిటీ లేకపోయినప్పటికీ, కంపెనీలు దీర్ఘకాలిక వృద్ధి ప్రణాళికలను పరిశీలిస్తున్నాయి. అందులో భాగంగా కొన్ని కంపెనీలు ఈ ఆర్థిక మందగమనంలోనూ ఐపీఓ ఇష్యూపై దృష్టిని సారిస్తున్నాయని ఈవై ఇండియా ఆదివారం తెలిపింది. ఇతర కంపెనీ కొనుగోళ్ల పాటు ప్రధాన సెకండరీ మార్కెట్లో ఎలాంటి ఐపీఓలు రాలేదు.

ప్రస్తు‍్తత ఆర్థిక సంవత్సరపు ఏప్రిల్‌-జూన్‌ కార్వర్ట్‌తో పాటు రెండో త్రైమాసికంలో కన్జ్యూమర్‌‌ ప్రాడెక్ట్స్‌&రీటైల్‌, డెవర్సీఫైడ్‌ ఇండస్ట్రీయల్‌ ప్రాడెక్ట్స్‌ రంగాలకు చెందిన కంపెనీలు మాత్రమే ఐపీఓ విభాగంలో చురుగ్గా పాల్గోనే అవకాశం ఉంది. ఈ రెండు సెక్టార్ల నుంచి తలా రెండు ఐపీఓలు మాత్రమే ఉన్నాయి. 4ఐపీఓల మొత్తం విలువ 2.08 మిలియన్లుగా ఉంది. 

‘‘కోవిడ్ -19 మానవ జీవితాన్ని, ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసింది. దీంతో గడిచిన 3నెలల్లో ఆర్థిక ‍వ్యవస్థ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో లాగానే భారత​ఐపీఓ మార్కెట్లోనూ ఎలాంటి యాక్టివిటీ లేదు. అయితే కోవిడ్‌-19 తర్వాత కంపెనీలకు వచ్చే ఆర్డర్ల విలువలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇప్పుడు ఇన్వెస్టర్లు,  విశ్లేషకులు ఆర్డర్ల తయారీ అవకాశాలను ఎంతమేరకు అందిపుచ్చుకుంటాయనే అంశాన్ని నిశీతంగా పరిశీలిస్తున్నారు.’’ అని ఫైనాన్సియల్‌ అకౌంటింగ్‌ అడ్వైజర్‌ సర్వీస్‌ సందీప్‌ ఖేతన్‌ తెలిపారు.  

భవిష్యత్ నిధుల సేకరణ కోసం ప్రస్తుత సమయాన్ని ఉపయోగించుకోవాలని కంపెనీలు చూస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరపు చివరికల్లా లేదా వచ్చే 2021 ఎఫ్‌వై తొలిభాగంలో ఐపీఓ యాక్టివిటీ పుంజుకోవచ్చు.’’ ఆయన తెలిపారు. అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్‌లో ఇదే ఎస్‌ఎంఈ మార్కెట్లో  14 కంపెనీలు ఐపీఓకు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top