సెబీ నుంచి తొలి అనుమతి
త్వరలో అప్‌డేటెడ్ ప్రాస్పెక్టస్
న్యూఢిల్లీ: దేశీ డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం ఫోన్‌పే త్వరలో పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు అనుగుణంగా సెబీకి నవీకరించిన మలి ప్రాస్పెక్టస్ దాఖలు చేయనుంది. 2025 సెపె్టంబర్‌లోనే గోప్యతా విధాన సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేయగా.. తాజాగా అనుమతి లభించినట్లు తెలుస్తోంది.
కాగా.. ఐపీవోలో భాగంగా కంపెనీలో ప్రస్తుత వాటాదారులు రూ. 12,000 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ఆఫర్ చేయనున్నట్లు తెలుస్తోంది. తద్వారా కంపెనీ 15 బిలియన్ డాలర్ల విలువను ఆశిస్తున్నట్లు సమాచారం.


