కొత్తగా లైఫ్‌ సైకిల్‌ ఫండ్స్‌  | Sebi introduces life cycle funds | Sakshi
Sakshi News home page

కొత్తగా లైఫ్‌ సైకిల్‌ ఫండ్స్‌ 

Feb 27 2026 6:30 AM | Updated on Feb 27 2026 6:30 AM

Sebi introduces life cycle funds

సొల్యూషన్‌ ఓరియెంటెడ్‌ ఫండ్స్‌కు గుడ్‌బై 

ఫండ్స్‌ వర్గీకరణకు సవరించిన కార్యాచరణ 

న్యూఢిల్లీ: సొల్యూషన్స్‌ ఓరియెంటెడ్‌ ఫండ్స్‌ విభాగాన్ని సెబీ నిలిపివేసింది. కొత్తగా లైఫ్‌ సైకిల్‌ ఫండ్స్‌ను ప్రవేశపెట్టింది. పేరుకు తగ్గట్టు పెట్టుబడుల విధానం ఉండేలా చూడడం, పథకాల పేరుతో అత్యధిక రాబడుల హామీలను నిరోధించడం తదితర లక్ష్యాలతో సెబీ మ్యూచువల్‌ ఫండ్స్‌ వర్గీకరణ విషయంలో కొత్త నిబంధనలను తీసుకొచి్చంది. 

మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల పథకాలను ఈక్విటీ, డెట్, హైబ్రిడ్, లైఫ్‌ సైకిల్, ఇతర పథకాలు (ఫండ్‌ ఆఫ్‌ ఫండ్, ఇండెక్స్‌ ఫండ్స్, ఈటీఎఫ్‌లు) పేరుతో మొత్తం ఐదు విభాగాలుగా వర్గీకరించింది. ‘‘ఇన్వెస్టర్లు సులభంగా అర్థం చేసుకునేందుకు, ఒక విభాగంలో అన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల మధ్య పథకాల్లో ఏకరూపత కోసం, పేరుకు తగినట్టుగా పథకాలు ఉండేందుకు, పథకం రాబడులను సూచించే విధంగా పథకాలకు పేర్లు లేకుండా చూసేందుకు చర్యలు తీసుకున్నట్టు సెబీ ప్రకటించింది.   

సొల్యూషన్‌ ఫండ్స్‌ 
సొల్యూషన్‌ ఓరియెంటెడ్‌ ఫండ్స్‌ను తక్షణమే నిలిపివేస్తున్నట్టు సెబీ ప్రకటించింది. ఈ పథకాలకు సంబంధించి కొత్త చందాలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. ఈ విభాగంలో ఉన్న పథకాలను, ఇదే మాదిరి పెట్టుబడులు, రిస్క్‌ ప్రొఫైల్‌ కలిగిన పథకాల్లో అనుమతి అనంతరం విలీనం చేయాలని పేర్కొంది. విదేశీ సెక్యూరిటీలను ఇకపై ఎంత మాత్రం ప్రత్యేకమైన అసెట్‌ క్లాస్‌గా పరిగణించరు.  

లైఫ్‌ సైకిల్‌ ఫండ్స్‌ 
కొత్తగా ఓపెన్‌ ఎండెడ్‌ లైఫ్‌ సైకిల్‌ ఫండ్స్‌ విభాగాన్ని సెబీ ప్రవేశపెట్టింది. ముందుగా నిర్ణయించిన కాల వ్యవధిపై.. ఈక్విటీ, డెట్, ఇన్విట్, ఈటీసీడీ, బంగారం/వెండి ఈటీఎఫ్‌ల వారీ లక్ష్యం ఆధారిత పథకాలను ఆఫర్‌ చేయొచ్చు. కాల వ్యవధి ముగియడానికి ముందు నుంచి క్రమంగా ఈక్విటీ పెట్టుబడులను తగ్గించుకుంటూ, డెట్‌కు పెంచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది.  

→ ఇండెక్స్‌ ఫండ్స్, ఈటీఎఫ్‌లు తమ నిర్వహణ ఆస్తుల్లో 95 శాతం మేర సంబంధిత సూచీలోనే ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది.  
→ అలాగే ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (ఎఫ్‌వోఎఫ్‌) అన్నవి వాటి అంతర్లీన ఫండ్‌లోనే 95 శాతం ఇన్వెస్ట్‌ చేయాలి.  
→ ఐదేళ్లలోపు గడువు ముగిసే ఫండ్స్‌లో డెట్‌ పెట్టుబడులు అన్నవి ఏఏ లేదా అంతకంటే మెరుగైన రేటింగ్‌ సాధనాల్లోనే ఉండాలి.  
→ ఇకపై మ్యూచువల్‌ ఫండ్స్‌ తమ విభాగాల వారీగా పోర్ట్‌ఫోలియో ఓవర్‌ల్యాప్‌ ఎంత స్థాయిలో ఉందన్నది వెల్లడించాలి. అంటే వివిధ పథకాలు ఒకే కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్‌ చేస్తుంటే, అది ఎంత మేరో తెలియజేయాలి. ఇలా ఈక్విటీ–ఈక్విటీ.. డెట్‌–డెట్‌ పథకాల మధ్య పోర్ట్‌ఫోలియో ఓవర్‌ల్యాప్‌ వివరాలను వెల్లడించాలి. 
→ దేశీ, విదేశీ, హైబ్రిడ్, డెట్, ఈక్విటీ, కమోడిటీ, థీమ్యాటిక్‌ విభాగాల్లో పేర్లకు సంబంధించి ప్రామాణిక విధానాన్ని, పరిమితులను తీసుకొచ్చింది. ప్రస్తుత పథకాలకు ఈ నిబంధనలను అమలు చేయడానికి సెబీ ఆరు నెలల సమయం ఇచి్చంది. 
→ యాక్టివ్‌ ఫండ్స్‌ నిబంధనల మేరకు తమ ప్రాధాన్య కేటాయింపులు పోను, మిగిలిన మొత్తం నుంచి 35 శాతాన్ని బంగారం, వెండి ఈటీఎఫ్‌లు, ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌లకు కేటాయించుకోవచ్చు.     

సులభతరం.. 
రిటైల్‌ ఇన్వెస్టర్లు అర్థం చేసుకోవడంలో సంక్లిష్టతను తొలగించి, సులభతరానికి కొత్త నిబంధనలు వీలు కలి్పస్తాయని చాయిస్‌ వెల్త్‌ సీఈవో నికుంజ్‌ సరాఫ్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement