Life cycle
-
కొత్తగా లైఫ్ సైకిల్ ఫండ్స్
న్యూఢిల్లీ: సొల్యూషన్స్ ఓరియెంటెడ్ ఫండ్స్ విభాగాన్ని సెబీ నిలిపివేసింది. కొత్తగా లైఫ్ సైకిల్ ఫండ్స్‌ను ప్రవేశపెట్టింది. పేరుకు తగ్గట్టు పెట్టుబడుల విధానం ఉండేలా చూడడం, పథకాల పేరుతో అత్యధిక రాబడుల హామీలను నిరోధించడం తదితర లక్ష్యాలతో సెబీ మ్యూచువల్ ఫండ్స్ వర్గీకరణ విషయంలో కొత్త నిబంధనలను తీసుకొచి్చంది. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల పథకాలను ఈక్విటీ, డెట్, హైబ్రిడ్, లైఫ్ సైకిల్, ఇతర పథకాలు (ఫండ్ ఆఫ్ ఫండ్, ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు) పేరుతో మొత్తం ఐదు విభాగాలుగా వర్గీకరించింది. ‘‘ఇన్వెస్టర్లు సులభంగా అర్థం చేసుకునేందుకు, ఒక విభాగంలో అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల మధ్య పథకాల్లో ఏకరూపత కోసం, పేరుకు తగినట్టుగా పథకాలు ఉండేందుకు, పథకం రాబడులను సూచించే విధంగా పథకాలకు పేర్లు లేకుండా చూసేందుకు చర్యలు తీసుకున్నట్టు సెబీ ప్రకటించింది. సొల్యూషన్ ఫండ్స్ సొల్యూషన్ ఓరియెంటెడ్ ఫండ్స్‌ను తక్షణమే నిలిపివేస్తున్నట్టు సెబీ ప్రకటించింది. ఈ పథకాలకు సంబంధించి కొత్త చందాలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. ఈ విభాగంలో ఉన్న పథకాలను, ఇదే మాదిరి పెట్టుబడులు, రిస్క్ ప్రొఫైల్ కలిగిన పథకాల్లో అనుమతి అనంతరం విలీనం చేయాలని పేర్కొంది. విదేశీ సెక్యూరిటీలను ఇకపై ఎంత మాత్రం ప్రత్యేకమైన అసెట్ క్లాస్‌గా పరిగణించరు. లైఫ్ సైకిల్ ఫండ్స్ కొత్తగా ఓపెన్ ఎండెడ్ లైఫ్ సైకిల్ ఫండ్స్ విభాగాన్ని సెబీ ప్రవేశపెట్టింది. ముందుగా నిర్ణయించిన కాల వ్యవధిపై.. ఈక్విటీ, డెట్, ఇన్విట్, ఈటీసీడీ, బంగారం/వెండి ఈటీఎఫ్‌ల వారీ లక్ష్యం ఆధారిత పథకాలను ఆఫర్ చేయొచ్చు. కాల వ్యవధి ముగియడానికి ముందు నుంచి క్రమంగా ఈక్విటీ పెట్టుబడులను తగ్గించుకుంటూ, డెట్‌కు పెంచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. → ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు తమ నిర్వహణ ఆస్తుల్లో 95 శాతం మేర సంబంధిత సూచీలోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. → అలాగే ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్) అన్నవి వాటి అంతర్లీన ఫండ్‌లోనే 95 శాతం ఇన్వెస్ట్ చేయాలి. → ఐదేళ్లలోపు గడువు ముగిసే ఫండ్స్‌లో డెట్ పెట్టుబడులు అన్నవి ఏఏ లేదా అంతకంటే మెరుగైన రేటింగ్ సాధనాల్లోనే ఉండాలి. → ఇకపై మ్యూచువల్ ఫండ్స్ తమ విభాగాల వారీగా పోర్ట్‌ఫోలియో ఓవర్‌ల్యాప్ ఎంత స్థాయిలో ఉందన్నది వెల్లడించాలి. అంటే వివిధ పథకాలు ఒకే కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తుంటే, అది ఎంత మేరో తెలియజేయాలి. ఇలా ఈక్విటీ–ఈక్విటీ.. డెట్–డెట్ పథకాల మధ్య పోర్ట్‌ఫోలియో ఓవర్‌ల్యాప్ వివరాలను వెల్లడించాలి. → దేశీ, విదేశీ, హైబ్రిడ్, డెట్, ఈక్విటీ, కమోడిటీ, థీమ్యాటిక్ విభాగాల్లో పేర్లకు సంబంధించి ప్రామాణిక విధానాన్ని, పరిమితులను తీసుకొచ్చింది. ప్రస్తుత పథకాలకు ఈ నిబంధనలను అమలు చేయడానికి సెబీ ఆరు నెలల సమయం ఇచి్చంది. → యాక్టివ్ ఫండ్స్ నిబంధనల మేరకు తమ ప్రాధాన్య కేటాయింపులు పోను, మిగిలిన మొత్తం నుంచి 35 శాతాన్ని బంగారం, వెండి ఈటీఎఫ్‌లు, ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లకు కేటాయించుకోవచ్చు. సులభతరం.. రిటైల్ ఇన్వెస్టర్లు అర్థం చేసుకోవడంలో సంక్లిష్టతను తొలగించి, సులభతరానికి కొత్త నిబంధనలు వీలు కలి్పస్తాయని చాయిస్ వెల్త్ సీఈవో నికుంజ్ సరాఫ్ పేర్కొన్నారు. -
ఓ గొప్ప మజిలీ
జీవితానికి ఒకే వృద్ధాప్యం. 80వ మజిలీకి సైన్‌పోస్ట్. జీవితం ఆఖరు దశకి ముఖద్వారం. ఒకనాడు అందంగా అలంకరింపబడి అలసిపోయిన ముసలి తోరణం. ఇది ప్రయత్నించినా రిటర్న్ టికెట్టు లేని ప్రయాణం. రెండు రోజుల్లో నేను 80. చాలా కారణాలకి ఇది చాలా గొప్ప మజిలీ. ఈ దేశంలో గొప్పతనా నికి మన్నిక లేకపోవచ్చుకానీ వయస్సుకి ఉంది. అది సుఖ వంతమైన జీవితానికి పెట్టు బడి. ఈ వయస్సులో శషబి షలు చెల్లిపోతాయి. ఇచ్చకా లకు కొత్త అర్థం వస్తుంది. ఎవరినయినా, ఎప్పుడైనా నిరంతరాయంగా విమర్శించవచ్చు. నచ్చితే మెచ్చుకుం టారు. నచ్చకపోతే ‘పాపం, ఆయనకి వయస్సు మీద పడిందయ్యా’ అని పక్కకి తిరిగి నవ్వుకుంటారు. నడకలో హుందాతనం పెరుగుతుంది. కుర్చీ లోంచి చక్రవర్తిలాగా ఠీవిగా లేవవచ్చు. అవి కీళ్ల నొప్పు లని మనకి తెలుస్తాయి. హుందాతనమని చూసినవారు సరిపెట్టుకుంటారు. తెలిసి తెలిసి తప్పులు చెయ్య వచ్చు. వయస్సు కనుక అందరూ అర్థం చేసుకుం టారు. అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్ధాలు చెప్ప వచ్చు. చాలామంది ముఖాలు గుర్తున్నా మరిచిపోయి నట్టు నటించవచ్చు. ‘నువ్వు వెంకటరావు కొడుకువి కదా?’ అని తెలిసి తెలిసి పలకరిస్తే– ‘కాదండీ. నేను చిన్నారావు మనుమడినని’ ఎదుటి వ్యక్తి నుంచి సమాధానం వస్తుంది. కుర్రకారుని ‘మీకేం తెలీద’ని అదిలించ వచ్చు. ఇదివరకులాగా ఆ మనిషి కోపం తెచ్చుకోడు. మనసులో ‘పిచ్చి ముండాకొడుకు’ అనుకున్నా బయ టికి చిరునవ్వు నవ్వుతాడు. వాడు అలా అనుకుంటు న్నాడని నీకు తెలుసు. అనుకున్నా వాడిని తిట్టగలిగినం దుకు నీకు ఆనందంగా ఉంటుంది. ఎన్నాళ్ల కోరిక అదో! ఇది పాత ‘మచ్చ’ని తడువుకునే పిచ్చి సుఖం. పచ్చి సుఖం. ముసలివాడులెమ్మని అందరూ నిన్ను అర్థం చేసుకున్నట్టు నటిస్తారు. నటిస్తున్నారని నీకర్థ మవుతూ ఉంటుంది. ఏ సమస్యమీదయినా నీ అభి ప్రాయాలను గుప్పించవచ్చు. చెల్లితే అనుభవం. చెల్లక పోతే ముసలితనం దిగజారుడు.వయస్సు మీద పడింది లెమ్మని అందరూ నిన్ను అర్థం చేసుకున్నట్టు నటిస్తారు. నటిస్తున్నారని నీకర్థమ వుతూ ఉంటుంది. నీ ఆలోచనల అవసరం లేకుండా నీ అభిప్రాయాలను విరివిగా గుప్పించవచ్చు. అవి నీ ‘అమోఘమైన’ ఆలోచనతో చెప్పే హితవులాగా అందరూ వింటారు. కానీ వాళ్లు తలలూపుతున్న గొర్రె లని నీ మనస్సు చెప్తూంటుంది. నీ మనస్సు నవ్వు కుంటుంది. వాళ్ల మనస్సూ ఆ పనే చేస్తోందని నీకు తెలుస్తూంటుంది. రెండురకాల ‘ఆత్మవంచన’ వ్యాయామానికి ఈ దశ ప్రారంభం. ఇష్టంలేని వాళ్ల ముఖంమీద చెడామడా తిట్ట వచ్చు. నీ పెద్దరికం కారణంగా కడుపులో రగులు తున్నా ‘పోండి సార్! మీరు మరీనూ!’ అని పిచ్చి నవ్వు నవ్వుతారు. ఆ పిచ్చి నీకు కిర్రెక్కిస్తుంది. వయస్సులో నువ్వు చేసిన తప్పిదాలను నీ భార్య సరిపెట్టుకుంటుంది. ఇప్పుడిక చేసేది లేదు కనుక. అది కేవలం సరిపెట్టుకోవడమేనన్న నీ ‘వంకర’ బుద్ధి నిన్ను ‘చక్కిలిగింత’ పెడుతుంది. పాత జ్ఞాపకం– గుర్తొచ్చిన ‘దురద’ లాంటిది. మరోసారి గోకినా ‘సుఖం’గానే ఉంటుంది. ‘ఈ కుర్రకారు తగలబడి పోతోందని’ తరచుగా పెదవులు విరవొచ్చు. ఆ కుర్ర కారు చస్తే మారదని నీకూ తెలుసు. ఇది పాత ‘దురద’ని లేకపోయినా గోక్కోవడం లాంటిది. రాసిన ప్రతీ విషయాన్నీ– ఇప్పుడు– ఎవరూ సీరి యస్‌గా తీసుకోరు. బాగులేని కథని చదివి ‘ముస లాడిలో సరుకయిపోయిందనుకుంటూ’ ‘ఆహాహా! మీరు కాకపోతే ఎవరు రాస్తారు సార్ ఇది!’ అని లుంగలు చుట్టుకుపోతాడు. ఇంకాస్త జుత్తుంటే ‘గండ పెండేర మంటారు. సగమయినా ఊడితే రెండు యూని వర్సిటీల ‘డాక్టరేట్లు’ంటాయి. మరీ జుత్తు పండి– ఇంకా బతికుంటే ఓ ‘పద్మా..’ అవార్డ్ మొహంమీద పారేస్తారు. ఎనభయ్యో పడిలో కదలలేకపోయినా మోసుకెళ్లి రెండు మూడు సన్మానాలు– మీ కోసం కాదు– ఆయా సంస్థల గొప్పతనం కోసం– చేస్తారు. రచనలన్నీ వెదికి వెదికి పునర్ముద్రణలు చేస్తారు. నువ్వే మరిచిపోయిన గతాన్ని తవ్వి అలనాడు బట్టలు ఎండేసే తాడుమీద వాలిన కాకి నీలో ఎలా మొదటి కవితా వైభవాన్ని మేలుకొలిపిందో ఓ కవి గానం చేస్తాడు– ఆవేశంగా కన్నీటి పర్యంతం అవుతూ. ఇంతకూ ఏం జరిగింది? ఇంక నువ్వు ఎక్కువ కాలం బతకవని వాళ్లకి నమ్మకం కుదిరింది. ‘నువ్వు పోయే కాలం వచ్చిందని వాళ్లకి ధైర్యం వచ్చింది. ఇప్పుడు నిన్ను మెచ్చుకోవడం ‘వారి’ అభిరుచిగా తర్జుమా చేసుకుంటారు. ఇది ‘సాహిత్య పరిణామ కంపు’. గతాన్ని అటకెక్కించే గౌరవ వందనం. అయ్యో! ఈ 80 ఏళ్ల వయస్సు ఏ 40 ఏళ్లకిందటో వచ్చి ఉంటే ఎంత బాగుండును అనిపిస్తుంది. కానీ జీవితానికి ఒకే వృద్ధాప్యం. 80వ మజిలీకి సైన్‌పోస్ట్. జీవితం ఆఖరు దశకి ముఖద్వారం. ఒకనాడు అందంగా అలంకరింపబడి అలసిపోయిన ముసలి తోరణం. ఇది ప్రయత్నించినా రిటర్న్ టికెట్టు లేని ప్రయాణం. ముందుకు వెళ్తున్న ప్రతీ క్షణమూ మళ్లీ తెరుచుకోని తలుపుల్ని ఒక్కొక్కటే మూసుకుంటూ ముందుకు సాగిపోయే ప్రస్థానంలో గంభీరమైన మజిలీ–80. గొల్లపూడి మారుతీరావు -
జీవిత చక్రం
ఫేమస్ టూన్ కదిలేది, కదిలించేది, పెను నిద్ర వదిలించేది ‘కవిత్వం’ మాత్రమే కానక్కర్లేదు... ‘కార్టూన్’ కూడా కావొచ్చు. దీనికి ఒక పెద్ద ఉదాహరణ మఖ్మూద్ ఇశోంక్లోవ్ కార్టూన్లు. ఈ ఉజ్బెకిస్తాన్ కార్టూనిస్ట్ గీసే రేఖలలో ‘హాస్యం’ మాత్రమే ఉండదు. మెదడుకు పదును పెట్టే ‘ఆలోచన’ కూడా ఉంటుంది. అవి మనసును తట్టి లేపి ‘హద్భుతం’ అనేలా చేస్తాయి! సిరియా శరణార్థుల కన్నీటిని ఒక్క మాట లేకుండా వేల పుటల్లో చెప్పినా, సామాజిక సహాయాన్ని కూడా ‘తిరుగులేని వ్యక్తిగత వ్యాపారం’ చేసుకున్న నకిలీ మానవతావాదులకు చుర్రుమనిపించేలా చురక అంటించినా... ఇశొంక్లోవ్ కుంచె తీరే వేరు. నిజానికి అది కుంచె కాదు... అంకుశం! ఉజ్బెకిస్తాన్‌లోని బేషరిఖ్ జిల్లాలో ఉన్న టెలొవ్ గ్రామంలో పుట్టిన ఇశోంక్లోవ్ గ్రాఫిక్ ఆర్ట్‌లో పట్టా తీసుకున్నాడు. ప్రస్తుతం తాష్కెంట్ సిటీలో నివాసం ఉంటున్నారు. ‘ఉజ్బెకిస్తాన్ ఆర్టిస్ట్స్ యూనియన్’, పోలెండ్ ‘గుడ్ హ్యూమర్ పార్టీ’లలో ఆయన సభ్యుడు. మనిషి ఈ భూమి మీదికి వచ్చేటప్పుడు ఏమీ తీసుకు రాలేదు. పెరిగే క్రమంలో, పెద్దవుతున్న క్రమంలో, జీవితంలో స్థిరపడుతున్న క్రమంలో, దర్జా చాటుకునే సమయంలో... ఆ మనిషికి ‘వాహనం’ కావాల్సి వచ్చింది. చివరికి మనిషిని, వాహనాన్ని వేరు చేయలేని పరిస్థితి వచ్చింది. తప్పుటడుగులు వేస్తున్నప్పుడు చిట్టి వాహనాన్ని ఆశ్రయించిన మనిషికి... చనిపోయిన తరువాత కూడా చిట్ట చివరి వాహనం ఒకటి కావాల్సి వచ్చింది. వాహనమయమైన మనిషి జీవితాన్ని, జీవిత చక్రాన్ని గురించి ఒక్క మాట కూడా లేకుండా చెప్పడానికి ఈ కార్టూన్‌ను మించింది మరేముంటుంది!


