ఐసీఐసీఐ ప్రు నుంచి 3 లైఫ్‌ సైకిల్‌ ఫండ్స్‌ | ICICI Prudential Mutual Fund Launches Life Cycle Funds 2031 2036 And 2041 For Goal Based Investing, Check More Details | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ ప్రు నుంచి 3 లైఫ్‌ సైకిల్‌ ఫండ్స్‌

Aug 31 2026 2:25 PM | Updated on Aug 31 2026 3:03 PM

ICICI Prudential Launches 3 Life Cycle Funds Long-Term Financial Goals

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ తాజాగా మూడు లైఫ్‌ సైకిల్‌ ఫండ్స్‌ను ఆవిష్కరించింది. లైఫ్‌ సైకిల్‌ ఫండ్‌ 2031, లైఫ్‌ సైకిల్‌ ఫండ్‌ 2036, లైఫ్‌ సైకిల్‌ ఫండ్‌ 2041 వీటిలో ఉన్నాయి. సెప్టెంబర్‌ 9 వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. నిర్దిష్ట లక్ష్యాల ఆధారిత పెట్టుబడులకు ఇవి అనువుగా ఉంటాయి.

ఈ స్కీములు ప్రధానంగా షేర్లు, ఈక్విటీ ఆధారిత సెక్యూరిటీలు, డెట్‌.. మనీ మార్కెట్‌ సాధనాలు, గోల్డ్‌.. సిల్వర్‌ ఈటీఎఫ్‌లు, గోల్డ్‌ .. సిల్వర్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ కమోడిటీ డెరివేటివ్స్, ఇన్విట్స్‌ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌)లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. 5,10,15 సంవత్సరాల దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు గల ఇన్వెస్టర్లు తమ ఆర్థిక ప్రణాళికల్లో వీటిని భాగం చేసుకోవచ్చు.

జీవితంలో దశను బట్టి ఆర్థిక లక్ష్యాలు మారుతుంటాయని, వాటికి తగ్గట్లుగా పోర్ట్‌ఫోలియో స్వరూపం కూడా ఉండాలని సంస్థ ఈడీ ఎస్‌ నరేన్‌ తెలిపారు. కెరియర్‌ తొలినాళ్లలో విద్యా రుణాలు తీర్చడం, మధ్య వయస్సులో ఇంటి కొనుగోలు, వివాహ వ్యయాలు, పిల్లల చదువులు, దీర్ఘకాలంలో రిటైర్మెంట్‌ ప్రణాళికలు మొదలైనవి ఉంటాయని పేర్కొన్నారు.

ఇలాంటి వైవిధ్యమైన అవసరాలుండే నేపథ్యంలో ఈక్విటీల్లో మాత్రమే ఇన్వెస్ట్‌ చేసేవారు, తమ తమ లక్ష్యాలకు చేరువయ్యే కొద్దీ పోర్ట్‌ఫోలియోను మధ్యమధ్యలో మదింపు చేసుకుంటూ, రిసు్కలను తగ్గించుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. లైఫ్‌ సైకిల్‌ ఫండ్స్‌ అనేవి తొలి నాళ్లలో అధిక రిస్కు సామర్థ్యాలు కలిగి ఉండి, లక్ష్యానికి దగ్గరయ్యే కొద్దీ క్రమంగా స్థిరత్వాన్ని కోరుకునే వారికి అనువైనవిగా ఉంటాయని నరేన్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement