ట్యాక్స్‌ ఆడిట్‌కి రెడీ అవ్వండి.. | Tax Audit 2026 Income Tax Accounts TDS TCS checklist | Sakshi
Sakshi News home page

ట్యాక్స్‌ ఆడిట్‌కి రెడీ అవ్వండి..

Aug 31 2026 10:32 AM | Updated on Aug 31 2026 11:31 AM

Tax Audit 2026 Income Tax Accounts TDS TCS checklist

నేటితో ఆడిట్‌ అవసరం లేని కేసులు దాఖలు చేయడానికి గడువు తేదీ ముగిసింది. ఎటువంటి పొడిగింపు ఉండదు. ఇక మీలో ట్యాక్స్‌ ఆడిట్‌కి గురయ్యేవారు.. అందుకోసం రెడీ అవ్వండి.

అకౌంట్‌ బుక్స్‌ నిర్వహించాలి.. 
ఏప్రిల్‌ 25 నుంచి మార్చి 26 వరకు సంబంధించిన వ్యవహారాలను ఎప్పటికప్పుడు సరైన పుస్తకాల్లో, సక్రమంగా ఎంట్రీ చేసే ఉంటారు. నగదు చిట్టా, బ్యాంకు వ్యవహారాల పుస్తకం, అమ్మకాలు, కొను గోళ్లు, స్టాక్‌ బుక్స్, డెబిట్‌ నోట్లు, క్రెడిట్‌ నోట్లు, ఇలా ఎన్నో పుస్తకాలు/రిజిస్టర్లు.. రాసే ఉంటారు. మరోసారి చెక్‌ చేసుకుని వాటిని క్లోజ్‌ చేయండి. పూర్తి చేయండి. 2025 ఏప్రిల్‌ 1 నాటికి ఓపెనింగ్‌ బ్యాలెన్స్‌లు కరెక్టుగా వచ్చాయా లేదా.. అన్ని ఖాతా ల నుంచి కరెక్టుగా తీసుకొచ్చారా లేదా.. తప్పులేమీ దొర్లకుండా చూసుకోండి. ఫైనలైజ్‌ చేయండి.  

టీడీఎస్, టీసీఎస్‌లు జాగ్రత్త.. 
మీకు చెల్లింపులు చేసే వారందరూ టీడీఎస్‌ చేసేవారు. టీడీఎస్‌ చేశారా, ఎంత శాతం చేశారు, చేసిన మొత్తాన్ని ప్రభుత్వ ఖజనాకి జమ చేసి ఆ మేరకు మీకు ఫారం 16/16ఎ జారీ చేశారా లేదా.. వారు డిపార్టుమెంటు వారికి ఫారం/రిటర్నులు దాఖలు చేశారా? ఇవన్నీ మీ 26ఏఎస్‌లో ఎంట్రీ అయ్యాయా లేదా చూసుకోవాలి. ఒకవేళ అవ్వకపోతే ఇప్పటికైనా వారికి జ్ఞాపకం చేసి ఆ రికార్డులను అప్‌డేట్‌ చేయించండి. అలాగే టీసీఎస్‌ 
అంశాలు చెక్‌ చేసుకోండి.  

లెడ్జర్‌ ఖాతాలో ఎంట్రీలు 
మనం సక్రమంగా లెడ్జర్‌ ఖాతాలు నిర్వహించడం మనకూ మంచిదే. అటు పక్క వారికి కూడా మంచిదే. కొన్ని సందర్భాల్లో డిపార్టుమెంటు వారు అసెస్‌మెంట్‌లో భాగంగా ధృవీకరణ పత్రంతో పాటు లెడ్జర్‌ ఖాతా ప్రతి అడుగుతారు. ఇరు పక్షాల వారి బుక్స్‌లోనూ ఒకేలాగా వ్యవహారాలు ఉండాలి. వ్యత్యాసాలుంటే వెంటనే వారితో మాట్లాడి అన్నీ ఒకేలా ఉండేలా చూసుకోండి.

శాసనాత్మకమైన ఖర్చులు.. 
జీతం, వేతనాలు, అద్దె, కరెంటు బిల్లు, వాటర్‌ బిల్లు, టెలిఫోన్‌ బిల్లు చెల్లించండి. చెల్లించకపోతే, ఆయా ఖర్చుల్లో ఎంత భారం మిగిలిపోతోందో.. ఆ మేరకు చెల్లించాల్సిన అప్పుల్లో చూపించాలి. ఇటువంటి సర్దుబాట్లు, దిద్దుబాట్లు అవసరం కావొచ్చు. కొన్ని ఖర్చులు రోజూ జరుగుతాయి. కానీ కొన్ని నెలకోసారి, గడువు తేదీనాడే చెల్లించాలి. అద్దె, కరెంటు బిల్లు, లెడ్జర్‌ విశ్లేషించండి. ప్రతి నెలా చెల్లింపు అయిందా లేదా అని చూసుకోవాలి. చెల్లింపు అయినప్పటికీ ఆ పద్దులు కనబడకపోతే, వేరే అకౌంటులో  పోస్ట్‌ అయ్యిందేమో చెక్‌ చేయండి.

ప్రావిడెంట్, ఈఎస్‌ఐ చెల్లింపులు 
ఇవి వేరే చట్ల ప్రకారం గడువు తేదీలోపల చేయాలి. సకాలంలో చెల్లించకపోతే ఖర్చుగా పరిగణించరు. వాటిని విశ్లేషించి, తగిన చర్యలు తీసుకోండి.

రుణదాతలు.. రుణగ్రహీతలు 
వీరి వ్యక్తిగత ఖాతాలు చాలా జాగ్రత్తగా నిర్వహించండి. ఖాతాల్లో బ్యాలెన్స్‌లను ధృవీకరించమంటారు. అప్పుడు తేడాలు, హెచ్చుతగ్గులు రాకూడదు. అలాగే, సస్పెన్స్‌ అకౌంటు. ఆ సమయానికి అకౌంట్స్‌ ఆగకూడదని, ఆపకూడదని ‘సస్పెన్స్‌’ అన్న అకౌంటుని మధ్యలో పట్టుకువచ్చి అకౌంట్స్‌ని పూర్తి చేస్తాము. ఇటువంటి వాటన్నింటినీ విశ్లేషించి, 2026 మార్చి 31 నాటికి ఆయా అకౌంట్స్‌ని క్లియర్‌ చేయండి. క్లోజ్‌ చేయండి.  

భాగస్వామ్య సంస్థ అయితే.. 
ట్యాక్స్‌ ఆడిట్‌కి గురైన సంస్థ అయితే, పార్ట్‌నర్క్స్‌ అకౌంట్లు ఎంతో స్పష్టంగా, క్లారిటీగా ఉండాలి. పారితోషకం, సొంత వాడకాలు, వడ్డీలు, కమీషన్లు.. ఇలా మొదలైనవి చెక్‌ చేసుకోవాలి.

ఇక మిగతా విషయాలన్నీ షరా మామూలే! 
బుక్స్‌ని  నీటుగా నిర్వహించండి 
బుక్స్‌ని పూర్తి చేసి, క్లోజ్‌ చేయండి. 
అన్ని ఖాతాలను క్లోజ్‌ చేయండి.

ఫిక్సిడ్‌ అసెట్‌ తరుగుదల, స్థిరాస్తుల అమ్మకం, కొనుగోలు, మూలధన లాభాలు, బ్యాంకు ఫిక్సిడ్‌ డిపాజిట్లు, వడ్డీ, డివిడెండ్లు, ఇతర ఆదాయాలు, స్టాక్‌ వివరాలు ముఖ్యం. కాగితాలు, రిజిస్టర్లు, పుస్తకాలు, ఓచర్లు, ఫైల్సు, బిల్లులు, ఇన్వాయిస్‌లు, డెబిట్‌ నోట్లు, క్రెడిట్‌ నోట్లు, బ్యాంకు స్టేట్‌మెంట్లు, పాస్‌బుక్, టీడీఎస్‌ చలాన్లు, ఫారం 16/16ఏ అన్నీ సక్రమంగా నిర్వహించండి. అన్ని పూర్తి అయ్యాకే .. ట్యాక్స్‌ ఆడిట్‌ కోసం మీ ఆడిటర్‌కి సబ్మిట్‌ చేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement