Income tax returns
-
ఐటీఆర్ గడువుపై బిగ్ అప్డేట్
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. అసెస్మెంట్ సంవత్సరం (ఏవై) 2025–26కు సంబంధించి ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్‌లు) దాఖలు గడువును జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) మంగళవారం ప్రకటించింది. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్), ఆడిటింగ్ అవసరం లేని సంస్థలు ఏటా పన్ను రిటర్నుల దాఖ లుకు జూలై 31 తుది గడువుగా ఉంటోంది.సాంకేతిక సమస్యలు, ఇతరత్రా ప్రతికూల పరిస్థితుల్లో ఈ గడువును ఆదాయపన్ను శాఖ పొడిగిస్తుంటుంది. ఈ ఏడాది ఐటీఆర్‌లో మార్పులు చేయడంతో.. ఇందుకు సంబంధించి ఐటీ శాఖ వ్యవస్థలను సిద్ధం చేసేందుకు, ఐటీఆర్ యుటిలిటీలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీబీబీటీ తెలిపింది. -
ఐటీఆర్-యూ ఫైలింగ్ నిబంధనల్లో కీలక మార్పులు
ఆదాయపు పన్ను శాఖ ఐటీఆర్-యూ (అప్డేటెడ్ రిటర్న్) ఫైలింగ్ నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను సవరించడానికి అధిక సమయం ఇస్తుందని తెలిపింది. అదే సమయంలో ఆలస్యంగా సమర్పించిన రిటర్న్‌లపై భారీ జరిమానాలు ఉంటాయని స్పష్టం చేసింది. పన్ను సమ్మతిని మెరుగుపరచడం, మోసపూరిత ఫైలింగ్‌లను తగ్గించడం లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు పేర్కొంది.సవరణలు ఇలా..అప్డేటెడ్ రిటర్న్ దాఖలు చేయడానికి పన్ను చెల్లింపుదారులకు ఇప్పటివరకు అసెస్మెంట్ ఇయర్ నుంచి 24 నెలలు గడువు ఉండేది. దాన్ని తాజాగా 48 నెలలు (4 సంవత్సరాలు)కు పెంచారు. ఇది వ్యక్తులు, వ్యాపారాలకు రిటర్న్‌ల సమయంలో తప్పులను సరిదిద్దుకోవడానికి, గతంలో ఫైల్ చేయని ఆదాయాన్ని నివేదించడానికి మరింత సౌలభ్యాన్ని కలిగిస్తుంది. ఆలస్యంగా ఐటీ రిటర్న్‌లను ఫైలింగ్ చేయడాన్ని కట్టడి చేసేందుకు భారీ జరిమానాలు విధిస్తున్నట్లు ఆదాయపన్ను శాఖ వెల్లడించింది.మదింపు సంవత్సరం ముగిసిన 12 నెలలలోపు ఐటీఆర్-యూ దాఖలు చేస్తే 25 శాతం పన్ను విధిస్తారు.12 నుంచి 24 నెలల్లోపు అయితే 50 శాతం పన్ను చెల్లించాలి.మూడో సంవత్సరంలో ఫైల్ చేస్తే అదనంగా 60 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.నాలుగో సంవత్సరంలో ఫైల్ చేస్తే 70 శాతం పన్ను వర్తిస్తుంది.ఇదీ చదవండి: ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర!2024-25 ఆర్థిక సంవత్సరానికి (2025-26 అసెస్మెంట్ ఇయర్) మొత్తం ఏడు ఐటీఆర్ ఫారాలను (ఐటీఆర్-1 నుంచి ఐటీఆర్-7 వరకు) ప్రభుత్వం ఇప్పటికే నోటిఫై చేసింది. అయితే ప్రస్తుతానికి ఈ ఫారాలకు సంబంధించిన ఈ-ఫైలింగ్ సదుపాయాలు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది. రెగ్యులర్ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేవారికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2025-26) గడువు 2025 జులై 31గా ఉంది. -
అన్ని ఐటీఆర్ పత్రాలు నోటిఫై
ఆదాయపన్ను శాఖ మొత్తం ఏడు ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్) పత్రాలను నోటిఫై చేసింది. తద్వారా రిటర్నుల దాఖలుకు ఇవి అందుబాటులోకి వచ్చినట్టయింది. గత ఆర్థిక సంవత్సరానికి (2024–25) సంబంధించి ఆదాయపన్ను రిటర్నులను జులై 31లోగా దాఖలు చేయాల్సి ఉంది. వ్యక్తులు, ఖాతాల ఆడిటింగ్ లేని వారికి ఈ గడువు వర్తించనుంది.ఐటీఆర్ 2, 3, 5, 6, 7లో మూలధన లాభాల స్థిరీకరణకు సంబంధించి మార్పు చోటుచేసుకుంది. దీనికింద పన్ను చెల్లింపుదారులు తమ మూలధన లాభాలను 2024 జులై 23కు ముందు, ఆ తర్వాత అని రెండు భాగాలుగా చూపించాల్సి ఉంటుంది. అలాగే, ఐటీఆర్ 1, 4కు సంబంధించి కూడా మరో మార్పు జరిగింది. వేతన జీవులు రూ.1.25 లక్షలు మించని దీర్ఘకాల మూలధన లాభం కలిగినప్పుడు ఐటీఆర్ 1 లేదా 4 ఎంపిక చేసుకోవచ్చు. గతంలో వీరు ఐటీఆర్ 2 దాఖలు చేయాల్సి వచ్చేది. వేతనంతోపాటు దీర్ఘకాల మూలధన లాభాలు రూ.1.25 లక్షలకు మించితే అప్పుడు ఐటీఆర్ 2ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: భారత సైన్యం వేతన వివరాలు ఇలా..2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ చివరి తేదీలువ్యక్తులు, ఉద్యోగులు: జులై 31, 2025ఆడిట్ అవసరమయ్యే వ్యక్తులు, వ్యాపారాలు: అక్టోబర్ 31, 2025కంపెనీలు: అక్టోబర్ 31, 2025 -
ఐటీఆర్ దాఖలుకు 5 ప్రధాన అంశాలు
ఆదాయపు పన్ను దాఖలుకు సమయం రానే వచ్చింది. ఐటీఆర్ దాఖలుకు చివరితేదీని ప్రభుత్వం జులై 31గా నిర్ణయించింది. చివరి నిమిషంలో గందరగోళంగా పన్ను రిటర్న్‌లు ఫైల్ చేస్తే పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే అందుకు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకుని వీలైనంత త్వరగా ఐటీఆర్ ఫైల్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటి దాఖలుకు ఎలాంటి ధ్రువపత్రాలు సమకూర్చుకోవాలి.. ఎలాంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసుకుందాం.అవసరమైన డాక్యుమెంట్లు: పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఫారం 16 (వేతన జీవుల కోసం), బ్యాంక్ స్టేట్మెంట్లు, ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి.సరైన ఐటీఆర్ ఫారాన్ని ఎంచుకోవడం: మీ ఆదాయ వనరు ఆధారంగా తగిన ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) ఫారాన్ని ఎంచుకోవాలి. ఉదా. వేతన జీవులు ఐటీఆర్ -1, వ్యాపార యజమానులు ఐటీఆర్ -3 తీసుకోవాలి.పన్ను లెక్కలు: మీ మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం, మినహాయింపులు, చెల్లించాల్సిన మొత్తం పన్నును లెక్కించాలి. ఈ వివరాలు ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో ఎంతో ఉపయోగపడుతాయి.ఆన్లైన్లో ఐటీఆర్ దాఖలు: ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అయి మీ వివరాలను నమోదు చేయాలి. మీ వద్ద ఉన్న ధ్రువపత్రాలు, ఇతర ఆధారాలతో రిటర్న్‌లు దాఖలు చేయవచ్చు.ట్యాక్స్ రిటర్న్ వెరిఫై: ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి లేదా మీరు సంతకం చేసిన ఫిజికల్ కాపీలో వివరాలు నమోదు చేసి ఇన్కమ్ ట్యాక్ విభాగానికి పంపడం ద్వారా ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. చాలామంది దీన్ని విస్మరిస్తారు. కేవలం ఐటీఆర్ ఫైల్ చేయడంతోనే ప్రక్రియ పూర్తి అయిపోతుందని అనుకుంటారు. కానీ కచ్చితంగా ట్యాక్స్ రిటర్న్‌లను వెరిఫై చేయాలి. అప్పుడే మీ ఖాతాలో డబ్బు జమ అవుతుంది.ఇదీ చదవండి: ఐపీఎల్ నిలిపివేత.. కంపెనీలకు నష్టం ఎంతంటే..2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ చివరి తేదీలువ్యక్తులు, ఉద్యోగులు: జులై 31, 2025ఆడిట్ అవసరమయ్యే వ్యాపారాలు: అక్టోబర్ 31, 2025కంపెనీలు: అక్టోబర్ 31, 2025 -
ఐటీఆర్ ఫారంలను నోటిఫై చేసిన కేంద్రం
ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఇయర్ 2025–26కు సంబంధించి 1, 4 ఆదాయ పన్ను రిటర్న్ ఫారంలను కేంద్రం నోటిఫై చేసింది. ఈక్విటీలపై రూ.1.25 లక్షల వరకు వచ్చే దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్‌కి (ఎల్టీసీజీ) సంబంధించిన రిటర్నుల ఫైలింగ్‌ను సులభతరం చేసింది. వార్షికంగా రూ.50 లక్షల వరకు మొత్తం ఆదాయం ఉన్న వారు, సంస్థలు 1, 4 ఐటీఆర్ ఫారంలను దాఖలు చేయాలి.ఇకపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షల వరకు ఎల్టీసీజీ ఉన్న వేతన జీవులు, నిర్దిష్ట ట్యాక్సేషన్ స్కీము కింద ఉన్న సంస్థలు వరుసగా ఐటీఆర్–1, ఐటీఆర్–4 వేస్తే సరిపోతుంది. సాధారణంగా ఎల్టీజీసీకి మినహాయింపు ఉన్నా, ఆ వివరాలకు సంబంధించి విడిగా ఐటీఆర్–2 కూడా దాఖలు చేయాల్సి ఉంటోంది. ఇకపై పన్ను మినహాయింపు పరిధికి లోబడి ఉన్న ఎల్టీసీజీ వివరాలను సమర్పించేందుకు ఐటీఆర్–1లోనే చిన్న సెక్షన్‌ను పొందుపర్చారు. ఆ పరిధి దాటితే ఐటీఆర్–2ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐటీ చట్టం కింద లిస్టెడ్ షేర్లు, మ్యుచువల్ ఫండ్స్‌పై రూ. 1.25 లక్షల వరకు ఎల్టీసీజీపై పన్ను మినహాయింపు ఉంటోంది. అది దాటితే 12.5 శాతం ట్యాక్స్ వర్తిస్తుంది. చాలా మటుకు చిన్న, మధ్య స్థాయి ట్యాక్స్‌పేయర్లు.. ఐటీఆర్ ఫారం 1 (సహజ్), ఐటీఆర్ ఫారం 4 (సుగమ్)లను దాఖలు చేస్తుంటారు. ఇక 80సీ, 80జీజీ తదితర సెక్షన్ల కింద క్లెయిమ్ చేసే డిడక్షన్ల ఫారంలలో కొన్ని మార్పులు చేశారు. టీడీఎస్ డిడక్షన్ల విషయంలో సెక్షన్లవారీగా వివరాలను ఐటీఆర్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ఇండస్‌ఇండ్‌లో ఎగ్జిక్యూటివ్‌ల కమిటీ ఏర్పాటు ఐటీ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో ఈ ఐటీఆర్‌లు అందుబాటులో ఉంచాకా, 2024–25 ఆర్థిక సంవత్సర ఆదాయానికి సంబంధించిన రిటర్నులను అసెస్సీలు ఫైల్ చేయొచ్చు. వ్యక్తులు, ఖాతాలను ఆడిటింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉండని వారు ఐటీఆర్ ఫైలింగ్ చేయడానికి జులై 31 ఆఖరు తేదీ. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ఆఖర్లో ఫిబ్రవరి/మార్చి నాటికి ఐటీఆర్ ఫారంలను నోటిఫై చేస్తారు. కానీ ఈసారి కొత్త ఆదాయ పన్ను బిల్లుపై రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో నోటిఫై చేయడంలో జాప్యం జరిగింది. -
ఐటీఆర్ ఫైలింగ్‌కు వేళాయే..
గడిచిన 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి సమయం ఆసన్నమైంది. దీనికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ త్వరలో ఆన్లైన్ ఫైలింగ్ పోర్టల్‌ను ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో రిటర్న్స్ ఎప్పుడు దాఖలు చేయాలి, గడువు ఎప్పుడు, రిఫండ్‌ను ఎప్పుడు పొందే అవకాశం ఉందనే అంశాల గురించి తెలుసుకుంది.ఐటీఆర్‌ను ఎప్పుడు ఫైల్ చేయవచ్చు?ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత 2025-26 మదింపు సంవత్సరానికి మీ ఐటీఆర్‌ను సమర్పించవచ్చు. ఇంకా దీనికి సంబంధించిన ధ్రువీకరణ తేదీని అధికార వర్గాలు వెల్లడించలేదు. అయినప్పటికీ ఆదాయ పన్ను శాఖ సాధారణంగా ఏటా ఏప్రిల్ నాటికి ఐటీఆర్ ఫారాలను అందుబాటులో ఉంచుతుంది. ఫారాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా తమ రిటర్నులను ఈ-ఫైలింగ్ చేయడం ప్రారంభించవచ్చు.ఐటీఆర్ నమోదు చేయడానికి చివరి తేదీ ఏమిటి?గత ఏడాది షెడ్యూల్ ప్రకారం జరిమానా లేకుండా రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ జులై 31, 2024గా నిర్ణయించారు. జరిమానాలతో ఆలస్యంగా రిటర్న్స్ దాఖలు చేయడానికి డిసెంబర్ 31 వరకు అనుమతించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికైతే ఎలాంటి ప్రకటన రాలేదు.రిఫండ్లు ఎప్పుడు పొందవచ్చు?రిఫండ్ ప్రక్రియను ఆదాయపు పన్ను శాఖ మరింత సులభతరం చేసింది. చాలా మంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్స్ దాఖలు చేసిన వారం నుంచి 20 రోజుల్లో వారి రిఫండ్లను పొందేందుకు వీలు కల్పిస్తున్నారు. అయితే పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన రిటర్నుల్లో ఎలాంటి దోషాలు ఉండకూడదు. ఫైలింగ్ సమయంలో ఆధార్ ఓటీపీతో ధ్రువీకరించాలి. బ్యాంక్ ఖాతాను ముందుగా నమోదు చేసి పాన్‌తో లింక్ చేసుకోవాలి.ఇదీ చదవండి: అవి ‘అల్లం’.. ఇవి ‘బెల్లం’!కీలక డాక్యుమెంట్లు ఏమిటి?మీ రిటర్న్‌ను సజావుగా, వేగంగా దాఖలు చేయడానికి అవసరమైన అన్ని పత్రాలను ముందుగానే సేకరించుకోవడం చాలా ముఖ్యం. ఇందులో పాన్ కార్డు, ఆధార్ కార్డు, మీరు పని చేస్తున్న యజమాని నుంచి ఫారం 16, వేతన స్లిప్పులు, మీ బ్యాంకు నుంచి ధ్రువీకరణ పత్రాలు, ఏదైనా మూలధన లాభాల వివరాలు ఉంటే వాటిని సమర్పించాల్సి ఉంటుంది. అలాగే మీరు అద్దె ఆదాయం పొందినట్లయితే దానికి రుజువులను కూడా జత చేయాల్సి ఉంటుంది. -
‘కొత్త పన్ను’.. పంచ తంత్రం!
దేశంలో కొత్త పన్ను విధానం అమలులోకి వచ్చింది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 115BAC కింద దీన్ని ప్రవేశపెట్టారు. ఇది తక్కువ పన్ను రేట్లతో సరళమైన పన్ను నిర్మాణాన్ని అందిస్తుంది. కానీ పాత విధానంతో పోలిస్తే డిడక్షన్లు, మినహాయింపులు తక్కువ ఉంటాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం (అసెస్మెంట్ ఇయర్ 2026-27) కోసం కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవడం వల్ల కలిగే ఐదు ముఖ్యమైన ప్రయోజనాలేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.1.పన్ను రహిత ఆదాయ పరిమితి ఎక్కువ రూ .12 లక్షల మినహాయింపు పరిమితి, రూ .75,000 స్టాండర్డ్ డిడక్షన్ కారణంగా వేతన జీవులకు రూ .12.75 లక్షల వరకు ఆదాయం పన్ను రహితంగా ఉంటుంది. ఇది మునుపటి రూ .7.5 లక్షల పన్ను రహిత పరిమితి (రూ .7 లక్షలు + రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్) కంటే గణనీయమైన పెరుగుదల. ఇది మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది.2.అన్ని స్లాబ్‌లలో తక్కువ పన్ను రేట్లుకొత్త విధానంలో రాయితీ పన్ను రేట్లతో ఏడు స్లాబ్‌లు ఉన్నాయి. ఇవి రూ.4 లక్షల వరకు ఆదాయానికి 0% నుండి ప్రారంభమై, రూ.24 లక్షలకు పైబడిన ఆదాయానికి 30% వరకు ఉన్నాయి. ఈ విధానం ముఖ్యంగా రూ.15 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి, పెద్దగా డిడక్షన్లు క్లెయిమ్ చేయని వారికి, పన్ను బాధ్యతను తగ్గిస్తుంది. తద్వారా చేతికందే జీతం ఎక్కువౌతుంది.3.సరళమైన పన్ను ఫైలింగ్.. తక్కువ కంప్లయన్స్తక్కువ డిడక్షన్లు, మినహాయింపులతో (ఉదా., HRA, LTA, లేదా సెక్షన్ 80C ప్రయోజనాలు లేకపోవడం), కొత్త విధానం డాక్యుమెంటేషన్, కంప్లయన్స్ ఇబ్బందులను తగ్గిస్తుంది. దీంతో ఈ విధానం యువ ప్రొఫెషనల్స్ లేదా పాత విధానం డాక్యుమెంటేషన్ భారంగా భావించే వారికి అనువుగా ఉంటుంది.4.లిక్విడిటీ.. ఆర్థిక సౌలభ్యంతప్పనిసరి పన్ను ఆదా పెట్టుబడుల అవసరాన్ని (ఉదా., PPF, ELSS, లేదా ఇన్సూరెన్స్ ప్రీమియంలు) తొలగించడం ద్వారా కొత్త విధానం ఖర్చు, ఆదా, లేదా వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాల ఆధారంగా పెట్టుబడి పెట్టడానికి డబ్బు అందుబాటులోకి వచ్చేలా చేస్తుంది. ఇది కెరీర్ ప్రారంభ దశలో ఉన్న వ్యక్తులకు లేదా లిక్విడిటీకి ప్రాధాన్యత ఇచ్చే వారికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది.5.మెరుగైన స్టాండర్డ్ డిడక్షన్.. ఇతర ప్రయోజనాలుజీతం పొందే వ్యక్తులు రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ (గతంలో రూ.50,000 ఉండేది) క్లెయిమ్ చేయవచ్చు. ఫ్యామిలీ పెన్షనర్లు అయితే రూ.25,000 డిడక్షన్ (గతంలో రూ.15,000) పొందవచ్చు. అదనపు డిడక్షన్లలో యాజమాన్యం (పని చేస్తున్న కంపెనీ) ఎన్పీఎస్ కాంట్రిబ్యూషన్ (సెక్షన్ 80CCD(2)), అద్దెకు ఇచ్చిన ఆస్తులపై హోమ్ లోన్ వడ్డీ, అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కు విరాళం వంటివి ఉన్నాయి. ఇవి సంక్లిష్ట పెట్టుబడులు లేకుండా కొంత పన్ను ఉపశమనం అందిస్తాయి.ఎవరికి ఎక్కువ ప్రయోజనం?- పెద్దగా డిడక్షన్లు లేకుండా రూ.12.75 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు.- పన్ను ఆదా సాధనాలలో ఎక్కువగా పెట్టుబడి పెట్టని యువ ప్రొఫెషనల్స్ లేదా కొత్తగా సంపాదించేవారు.- దీర్ఘకాలిక, లాక్-ఇన్ పెట్టుబడులు కాకుండా సరళత, సౌలభ్యాన్ని కోరుకునే పన్ను చెల్లింపుదారులు.గమనించవలసినవి..కొత్త విధానం ఈ ప్రయోజనాలను అందించినప్పటికీ, ఇది అందరికీ సరిపోకపోవచ్చు. మీకు గణనీయమైన డిడక్షన్లు (ఉదా., రూ.30 లక్షలకు పైబడిన ఆదాయాలకు రూ.3.75 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ, HRA, సెక్షన్ 80C, లేదా హోమ్ లోన్ వడ్డీతో సహా) ఉంటే, పాత విధానం తక్కువ పన్ను బాధ్యతకు దారితీయవచ్చు. మీ ఆదాయం, డిడక్షన్లు, ఆర్థిక లక్ష్యాల ఆధారంగా రెండు విధానాలను ఆదాయ పన్ను కాలిక్యులేటర్‌ను ఉపయోగించి పోల్చుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది. -
ITR: తొలిసారి ట్యాక్స్‌పేయర్స్‌కు 5 కీలక విషయాలు
కొత్తగా ట్యాక్స్ పేయర్స్ అవుతున్నవారికి మొదటిసారి ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడం కష్టంగా అనిపించవచ్చు. కానీ ముఖ్యమైన అంశాలను అర్థం చేసుకోవడం ద్వారా ఈ ప్రక్రియ సులభం అవుతుంది. అసెస్మెంట్ ఇయర్ (AY) 2025-26, ఫైనాన్షియల్ ఇయర్ (FY) 2024-25కి సంబంధించి, మొదటిసారి పన్ను చెల్లించేవారు గుర్తుంచుకోవలసిన ఐదు కీలక అంశాలు ఇక్కడ అందిస్తున్నాం.సరైన ఐటీఆర్ ఫారమ్‌ను ఎంచుకోండిమీ ఆదాయ వనరులు, నివాస స్థితి, మొత్తం ఆదాయం ఆధారంగా సరైన ఐటీఆర్ ఫారమ్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, ITR-1 (సహజ్) అనేది జీతం, ఒక ఇంటి ఆస్తి, లేదా ఇతర వనరుల నుండి (ఉదా., వడ్డీ) రూ.50 లక్షల వరకు ఆదాయం ఉన్న నివాసిత వ్యక్తులకు సరిపోతుంది. ITR-2 అనేది క్యాపిటల్ గెయిన్స్ లేదా ఒకటి కంటే ఎక్కువ ఇంటి ఆస్తులు ఉండి వ్యాపార ఆదాయం లేనివారి కోసం ఉద్దేశించింది.ITR-3 లేదా ITR-4 ఫారాలు ప్రొఫెషనల్స్ లేదా ప్రిసంప్టివ్ టాక్సేషన్ కింద ఉన్నవారికి వర్తిస్తాయి. తప్పు ఫారమ్ ఉపయోగిస్తే రిటర్న్ తిరస్కరణకు గురికావచ్చు. కాబట్టి మీ ఆదాయ వనరులను జాగ్రత్తగా అంచనా వేయండి. ఆదాయపు పన్ను విభాగం ఈ-ఫైలింగ్ పోర్టల్ సరైన ఫారమ్‌ను నిర్ణయించడానికి ఒక సాధనాన్ని అందిస్తుంది. తప్పులు జరగకుండా అన్ని వివరాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండిపాత, కొత్త పన్ను విధానాలను అర్థం చేసుకోండిఅసెస్మెంట్ ఇయర్ 2025-26 కోసం, కొత్త పన్ను విధానం డిఫాల్ట్‌గా ఉంటుంది. ఇది తక్కువ పన్ను రేట్లను అందిస్తుంది కానీ తక్కువ డిడక్షన్లు ఉంటాయి. ఇందులో జీతం పొందే వ్యక్తులకు రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్, సెక్షన్ 87A కింద రూ.60,000 వరకు రిబేట్ ఉంటాయి. దీనివల్ల రూ.12 లక్షల వరకు ఆదాయం పన్ను రహితంగా ఉంటుంది. పాత విధానం సెక్షన్ 80C, 80D, లేదా 24(b) (హోమ్ లోన్ వడ్డీ కోసం) వంటి ఎక్కువ డిడక్షన్లను అనుమతిస్తుంది కానీ ఎక్కువ పన్ను రేట్లను కలిగి ఉంటుంది.మొదటిసారి ఫైలర్లు పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి రెండు విధానాలనూ పోల్చాలి. నాన్ బిజినెస్ పన్ను చెల్లింపుదారులు ప్రతి సంవత్సరం ఏదో ఒక విధానాన్ని ఎంచుకోవచ్చు. కానీ ఫైలింగ్ గడువు (ఆడిట్ లేని కేసులకు జూలై 31) లోపు ఎంపిక చేయాలి. గడువు మిస్ అయితే, ఆలస్య ఫైలింగ్ కోసం కొత్త విధానంలోనే ఉండాల్సి వస్తుంది.అన్ని ఆదాయ వనరులను నివేదించాలిమీ మొత్తం ఆదాయం పన్ను విధించే పరిమితి (60 ఏళ్లలోపు వ్యక్తులకు కొత్త విధానంలో రూ.3 లక్షలు) కంటే తక్కువ ఉన్నప్పటికీ, అన్ని ఆదాయ వనరులను నివేదించాలి. ఇందులో జీతం, సేవింగ్స్ ఖాతా లేదా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ, అద్దె ఆదాయం, పెట్టుబడుల నుండి క్యాపిటల్ గెయిన్స్, రూ.50,000 కంటే ఎక్కువ విలువైన బహుమతులు కూడా ఉంటాయి.ఫారమ్ 16 (యజమానుల నుండి), ఫారమ్ 26AS, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (AIS) వంటి డాక్యుమెంట్లు ఆదాయం, టీడీఎస్ వివరాలను ధృవీకరించడానికి సహాయపడతాయి. ఏ ఆదాయాన్ని నివేదించకపోతే, ఆదాయపు పన్ను విభాగం నుండి పరిశీలన లేదా నోటీసులు రావచ్చు. ఈ డాక్యుమెంట్ల రికార్డులను భవిష్యత్తు అవసరాల కోసం దగ్గర ఉంచుకోండి. అయితే వీటిని ఐటీ రిటర్నుకు జోడించాల్సిన అవసరం లేదు.గడువులను పాటించండి.. ఈ-వెరిఫై చేయండిఆడిట్ లేని పన్ను చెల్లించేవారికి ఐటీఆర్ దాఖలు చేయడానికి గడువు జూలై 31. ఈ గడువు మిస్ అయితే రూ.5,000 జరిమానా (ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉంటే రూ.1,000) చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు చెల్లించని పన్నుపై సెక్షన్ 234A కింద నెలకు 1% వడ్డీ విధిస్తారు. మీరు డిసెంబర్ 31, 2025 వరకు ఆలస్య రిటర్న్ లేదా నాలుగు సంవత్సరాలలోపు (మార్చి 31, 2029 నాటికి) అప్డేటెడ్ రిటర్న్ (ITR-U) దాఖలు చేయవచ్చు కానీ జరిమానాలు ఉంటాయి.ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత, 30 రోజులలోపు ఆధార్ OTP, నెట్ బ్యాంకింగ్ లేదా ఈవీసీ ఉపయోగించి ఈ-వెరిఫికేషన్ చేయడం తప్పనిసరి. మీ పాన్ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. ఎందుకంటే ఇనాక్టివ్ పాన్ కార్డుల వల్ల రిఫండ్లు లేదా ప్రాసెసింగ్ ఆలస్యం కావచ్చు. ఏప్రిల్ లేదా మేలో ముందుగానే ఐటీఆర్ దాఖలు చేస్తే, AIS/ఫారమ్ 26ASతో వివరాలు సరిపోలితే, ఒక వారంలో రిఫండ్లు వస్తాయి.👉 ఇదీ చదవండి: ‘పన్ను’ పాతదే కావాలంటే త్వరపడాల్సిందే..డిడక్షన్లను క్లెయిమ్ చేయండి.. తప్పులు చేయొద్దుపాత విధానంలో, సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షలు (ఉదా., PPF, ELSS), సెక్షన్ 24(b) కింద హోమ్ లోన్ వడ్డీపై రూ.2 లక్షలు, లేదా సెక్షన్ 80D కింద మెడికల్ ఇన్సూరెన్స్ వంటి డిడక్షన్లను క్లెయిమ్ చేయవచ్చు. కొత్త విధానంలో డిడక్షన్లు పరిమితం, కానీ స్టాండర్డ్ డిడక్షన్, ఫ్యామిలీ పెన్షన్ డిడక్షన్ వర్తిస్తాయి.AIS, ఫారమ్ 26ASతో క్రాస్-చెక్ చేసి ఖచ్చితత్వాన్ని నిర్ధారించండి, లేకపోతే తప్పులు ప్రాసెసింగ్‌ను ఆలస్యం చేయవచ్చు లేదా నోటీసులకు దారితీయవచ్చు. ఇక్కడ తప్పులు అంటే తప్పుడు వ్యక్తిగత వివరాలు, ఆదాయం దాచడం, తప్పు విధానం ఎంచుకోవడం వంటివి అన్నమాట. 80DD లేదా 80U వంటి డిడక్షన్లు క్లెయిమ్ చేస్తే, ఫారమ్ 10-IA దాఖలు చేయండి. ప్రక్రియను పూర్తి చేయడానికి వెంటనే ఈ-వెరిఫై చేయండి.అదనపు చిట్కాలుAIS, ఫారమ్ 26AS నుండి డేటాను ఆటో-ఫిల్ చేసే సదుపాయం ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఉంది. ఉపయోగించండి. మీ ఆదాయం ఎక్సెంప్షన్ లిమిట్ కంటే తక్కువ ఉన్నప్పటికీ, రూ.1 కోటి కరెంట్ ఖాతాలలో డిపాజిట్ చేయడం, రూ.2 లక్షలు విదేశీ ప్రయాణంలో ఖర్చు చేయడం, లేదా రూ.25,000 కంటే ఎక్కువ TDS/TCS ఉన్నట్లయితే ఐటీఆర్ దాఖలు చేయండి. క్యాపిటల్ గెయిన్స్ వంటి సంక్లిష్ట ఆదాయ వనరులకు సంబంధించి సందేహం ఉంటే టాక్స్ ప్రొఫెషనల్‌ను సంప్రదించండి. -
ఐటీ రిటర్నుకు సిద్ధంకండి.. బ్యాంకు అకౌంట్లు విశ్లేషించండి..
ఏప్రిల్‌లో అడుగుపెట్టామంటే రెండు ఆలోచనలు వస్తాయి. మొదటిది 2025 మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేయడానికి సిద్ధమవడం. రెండోది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) పన్ను ప్రణాళికలను తయారు చేసుకోవడం. అందరూ కొత్త విధానానికి మొగ్గుచూపుతున్న పరిస్థితుల్లో పెట్టుబడులు/సేవింగ్స్పరంగా ప్లానింగ్‌కి తక్కువ అవకాశాలున్నాయి. అందుకని 2025 ఆర్థిక సంవత్సరానికి రిటర్ను వేయడానికి ఎలా సిద్ధంగా ఉండాలో తెలుసుకుందాం. 1. మీకున్న అన్ని బ్యాంకుల ఖాతాలకు సంబంధించి స్టేట్మెంట్లు/పాస్బుక్స్లని అప్డేట్ చేయించండి. 2. ప్రతి బ్యాంకు అకౌంట్ సేట్ట్మెంటుని తెచ్చుకొండి. 3. గత ఆర్థిక సంవత్సరం తొలి రోజు (1.4.2024) నుంచి చివరి రోజు (31.3.2025) వరకు బ్యాంకులోని జమలు పరిశీలించండి.పతి జమకు వివరణ రాసుకొండి. అంటే నగదు ద్వారా, చెక్కు ద్వారా, బదిలీ ద్వారా, గూగుల్ ద్వారా వచ్చిందా? మీరే స్వయంగా నగదు డిపాజిట్ చేసారా అని తెలుకొండి. ఆదాయమా.. అప్పు తీసుకున్నారా..? మీకు ఎవరైనా అప్పు చెల్లించారా? డివిడెండా.. వడ్డీనా .. జీతమా.. ఇంటి కిరాయా .. వ్యాపార ఆదాయమా.. షేర్ల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయమా? క్యాపిటల్ గెయిన్స్ ద్వారా వచ్చిన ఆదాయమా.. స్థిరాస్తి అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయమా? పీఎఫ్ విత్‌డ్రా ద్వారా వచ్చినదా.. ఎన్ఎస్సీ లేదా ఎల్ఐసీ పాలసీ మెచ్యూరిటీ ద్వారా వచ్చినది డిపాజిట్ చేశారా..? అలాగే చిట్‌ఫండ్ పాట ద్వారా వచ్చిందా? మన కుటుంబ సభ్యులు పంపించారా.., మన దేశం నుంచి వచ్చిందా.., విదేశాల నుంచి వచ్చిందా అనే దానిపై కచ్చితమైన అవగాహన ఉండాలి.వీటిలో కొన్నింటిపై పన్ను ఉంటుంది. కొన్ని పన్ను భారానికి గురికావు. కొన్ని ఆదాయ పరిధిలోకి వస్తాయి. కొన్నింటికి మినహాయింపు ఉంటుంది. ఇవి నిర్ధారించాలంటే మనకు ఎవరిచ్చారో కచ్చితంగా తెలియాలి. ఇచ్చిన వ్యక్తి పేరు, చిరునామా, పాన్ నెంబర్ సిద్ధంగా ఉంచుకోవాలి. దేని నిమిత్తం వచ్చిందో రాసుకోవాలి. ప్రతిదానికి రుజువులు ఉండాలి. ఇలా అన్ని అకౌంట్లలో అన్ని జమలకు వివరణ ఉండాలి. ఎందుకంటే ఈ వివరణ మీదే మీ పన్ను భారం ఆధారపడి ఉంటుంది. ఇక రెండవ సైడు ... రెండో కాలమ్.. ఖర్చు కాలమ్. డెబిట్లోని పద్దులు/ఎంట్రీలు .. ఈ వ్యవహారాలు కూడా చాలా ముఖ్యమైనవి. ఇవి ఖర్చులే కదా అని అశ్రద్ధ వహించకండి. ఖర్చులు/డెబిట్లు మీ ఆదాయాన్ని నిర్ధారిస్తాయి. ఉదాహరణకు ఆదాయానికి మించిన ఖర్చులుంటే వాటికి తగిన ‘మార్గాలు’ లేకపోయినా .. లేదా మీరు ఇవ్వకపోయినా ఆ ఖర్చును ఆదాయంగా భావిస్తారు. ఖర్చు దేని మీద చేసారు? ఏ నిమిత్తం చేసారు అనేది మీకు డెబిట్. మరో అకౌంట్లో జమ అంటే క్రెడిట్. అది మీకు ఆదాయం కాదంటే, అటువైపు వ్యక్తికి ఆదాయం కావచ్చు/కాకపోవచ్చు. దీన్ని నిరూపించాలి.అంటే ఈ మేరకు మీరు స్వయంగా ‘కన్ఫర్మ్’ చేయాలి. అందుకని డెబిట్‌ను విశ్లేషించండి. కొన్ని చెల్లింపుల్లో ఆదాయపన్ను చట్టప్రకారం మీరే బాధ్యులుగా ఉంటారు. ఉదాహరణకు మీరు జీతం ఇస్తారనుకుందాం... టీడీఎస్ తీసేశారా (కట్ చేశారా).., కమీషన్ ఇస్తే టాక్స్ రికవరీ చేశారా.., షేర్లు కొంటే వాటి మీద డివిడెండ్ ఎంత? ఎవరికైనా అప్పు ఇస్తే వడ్డీ వచ్చిందా, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని మీద ఆదాయమెంత, ఏవైనా స్థిరాస్తులు కొంటే దాని మీద ఆదాయమెంత? ఈ స్థిరాస్తి కొనేందుకు ఎంత అయ్యింది? ఎలా ఖర్చు పెట్టారు .. సోర్స్ ఏమిటి? ఇలా ప్రతి బ్యాంకు అకౌంటులో జమలు/ఖర్చులు విశ్లేషించాలి. వివరణలు రాసుకోవాలి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
ఐటీఆర్ తప్పులు.. ట్యాక్స్‌పేయర్లకు అలర్ట్..
2024-25 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు గత రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నుల్లో ఏవైనా తప్పులు, పొరపాట్లు ఉంటే సరిదిద్దుకునే కీలక అవకాశం ఉంది. 2022 ఫైనాన్స్ చట్టంలో ప్రవేశపెట్టిన అప్డేటెడ్ రిటర్న్‌లను దాఖలు చేసే నిబంధన పన్ను చెల్లింపుదారులను 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు వారి రిటర్నులను ఈ మార్చి 31 లోపు అప్డేట్ చేయడానికి అనుమతిస్తుంది..అప్డేటెడ్ ఐటీఆర్ నిబంధనస్వచ్ఛంద సమ్మతిని ప్రోత్సహించడానికి, లిటిగేషన్‌ను తగ్గించడానికి అప్డేటెడ్ రిటర్న్ నిబంధనను ప్రవేశపెట్టారు. సంబంధిత మదింపు సంవత్సరం ముగిసిన రెండు సంవత్సరాలలోపు అప్డేటెడ్ రిటర్న్‌ను సమర్పించడం ద్వారా పన్ను చెల్లింపుదారులు గతంలో దాఖలు చేసిన రిటర్న్‌లలో తప్పులు లేదా లోపాలను సరిదిద్దడానికి ఇది అనుమతిస్తుంది. ఉదాహరణకు 2022-23 మదింపు సంవత్సరానికి (2021-22 ఆర్థిక సంవత్సరం) తమ రిటర్నులను అప్డేట్ చేయాలనుకున్నవారు 2025 మార్చి 31లోగా ఫైల్ చేయాలి.గమనించాల్సిన కీలక అంశాలుఅప్డేటెడ్ రిటర్న్ దాఖలు చేయడానికి అదనపు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అదనపు పన్ను మొత్తం సంబంధిత మదింపు సంవత్సరం ముగిసినప్పటి నుండి గడిచే సమయంపై ఆధారపడి ఉంటుంది. ఎంత ఎక్కువ జాప్యం చేస్తే అంత అదనపు పన్ను పెరుగుతుంది.కొన్ని అసాధారణ సందర్భాల్లో మినహా చాలా సందర్భాల్లో అప్డేటెడ్ రిటర్న్ దాఖలు చేయవచ్చు. ఉదాహరణకు సవరించిన ఆదాయం తక్కువ పన్ను బాధ్యతకు దారితీస్తే, పన్ను రిఫండ్ లేదా అధిక రిఫండ్‌కు దారితీస్తే లేదా పన్ను చెల్లింపుదారు పన్ను అధికారుల విచారణలో ఉంటే అప్డేటెడ్ రిటర్న్ దాఖలుకు వీలుండదు.తొలుత అప్డేటెడ్ రిటర్న్ దాఖలుకు గరిష్టంగా రెండేళ్ల వరకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత 2025 బడ్జెట్లో ఈ గడువును 48 నెలలకు పొడిగించారు. ఇది పన్ను చెల్లింపుదారులకు వారి ఫైలింగ్‌లలో ఏవైనా వ్యత్యాసాలను పరిష్కరించడానికి ఎక్కువ సమయం ఇస్తుంది.అప్డేటెడ్ రిటర్న్ ఎలా ఫైల్ చేయాలంటే..ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఐటీఆర్-యు ఫారాన్ని ఉపయోగించి పన్ను చెల్లింపుదారులు అప్డేటెడ్ రిటర్న్‌ను దాఖలు చేయవచ్చు. ఈ ప్రక్రియలో ఈ కింది దశలు ఉంటాయి..ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి వెళ్లి మీ క్రెడిన్షియల్స్‌ను ఉపయోగించి లాగిన్ చేయండి.సంబంధిత అసెస్మెంట్ సంవత్సరానికి ఐటీఆర్-యు ఫారాన్ని ఎంచుకోండి.అదనపు ఆదాయం, చెల్లించాల్సిన పన్నుతో సహా అవసరమైన వివరాలను అందించండి.సంబంధిత మదింపు సంవత్సరం ముగిసినప్పటి నుండి గడిచిన సమయం ఆధారంగా చెల్లించాల్సిన అదనపు పన్నును లెక్కించండి.వివరాలను సమీక్షించి అప్డేటెడ్ రిటర్న్ సబ్మిట్ చేయండి. -
లక్ష్యాల సాధన సాధ్యమేనా?
‘మిడిల్ క్లాస్ ఫీల్‌గుడ్ బడ్జెట్’గా 2025–26 బడ్జెట్‌కు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం లభించింది. అయితే మధ్యతరగతిని సంతృప్తి పరిచే దిశలో కొంత ప్రయత్నం జరిగినా దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణ సమస్య పరిష్కారం దిశలో బడ్జెట్లో ఎలాంటి చర్యలూ లేవు. ప్రత్యేకంగా చూస్తే దేశంలో ఆహార ద్రవ్యోల్బణం సైతం పెరుగుతోంది. వివిధ రంగాల్లో ఉద్యోగాలు, ఉపాధి కల్పన దిశగానూ ప్రత్యేక చర్యలేవీ తీసుకోలేదు. దిగువ మధ్యతరగతి, పేద ప్రజల ఆదా యాలు పెంచేందుకు అవసరమైన నిర్దిష్టమైన కార్యక్రమాలు లేదా చర్యలు చేపట్టలేదు. అంటే సమాజంలో అధిక శాతమున్న ప్రజల చేతుల్లో మరింత డబ్బు పెట్టే చర్యలేవీ తీసుకోలేదన్నమాట. అభివృద్ధి సాధనలో మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ పెట్టుబడులకు పరిమితం కావడం, ఆశించిన మేర ప్రైవేట్ పెట్టుబడులు పెరగక పోవడం, కేవలం క్యాపిటల్ ఎక్స్పెండిచర్తోనే వృద్ధిని ముందుకు తీసుకెళ్ల లేకపోవడంతో ఉద్దీపనలతో ప్రైవేట్ పెట్టుబడులను పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కీలకమైన రంగాల అభి వృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోకుండా మధ్యతరగతి చేతుల్లో డబ్బుపెట్టి కొనుగోలుశక్తి పెంచడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో వివిధ ఉత్పత్తులకు డిమాండ్ పెంచవచ్చని ఆశిస్తున్నట్టుగా కనిపిస్తోంది. వ్యవసాయ రంగం విషయానికొస్తే... దేశంలో మొత్తం ఏడు వందలకు పైగా జిల్లాలు ఉంటే... కేవలం వంద జిల్లాల్లో ‘ధన్, ధాన్య, కిసాన్ యోజన’ కింద (11 కోట్ల మంది రైతులకు గాను 1.7 కోట్ల మంది) రైతాంగానికి ప్రయోజనం కల్పిస్తామని చెబుతున్నారు. అది కూడా మూడు పప్పుదినుసులకు సంబంధించి రాబోయే ఆరేళ్లలో దీనిని చేస్తామని చెప్పడం ద్వారా ఇప్పటికిప్పుడు ఈ రైతులకు ఒనగూడే ప్రయోజనం ఏమీఉండదు. దేశ వ్యాప్తంగా విద్యాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న విశ్వ విద్యాలయాల్లో విద్యాభివృద్ధికి, దాని నాణ్యతను పెంచే దిశలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది ఎక్కడా పేర్కొన లేదు. దేశ జనాభాలో పెద్ద సంఖ్యలో ఉన్న మధ్య తరగతిని మంచి చేసుకునే ప్రయత్నంలో భాగంగా బడ్జెట్లో కొన్ని చర్యలు చేపట్టారు. ముఖ్యంగా పట్టణాల్లోని డిమాండ్ అనేది స్తబ్ధుగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ కొంత మెరుగైన పరిస్థితుల్లో ఉండడంతో అర్బన్ డిమాండ్ పెంచేందుకు ప్రైవేట్ పెట్టుబడులకు ‘ఉద్దీపన’ కింద రాయితీల కల్పన జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల్లో మధ్యతరగతి అనేది అసంతృప్తితో ఉందని, ఈ వర్గం కొనుగోలు శక్తి తగ్గిందనే అభిప్రాయం సర్వత్రా నెలకొనడంతో ఈ అంశానికి బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తోంది. వార్షిక బడ్జెట్లో ఇచ్చిన ఆదాయపు పన్ను మినహాయింపులతో దాదాపుగా అన్ని వర్గాలనూ సంతోషపరిచే ప్రయత్నం జరిగింది. ఇది ఎంతో కాలం నుంచి కోరుకుంటున్నదే. గతంలో రూ. 15 లక్షల వార్షికాదాయం గలవారు గరిష్ఠంగా 30 శాతం పన్ను కట్టేవారు. ఇప్పుడు ఈ 30 శాతం పన్ను ఏడాదికి రూ. 24 లక్షలకు పైగా ఆర్జిస్తున్నవారికి వర్తింప చేశారు. ఈ పన్ను మినహాయింపుల పరంగా చూస్తే రూ. 12 లక్షల దాకా ఆదాయం వచ్చేవారికి ప్రయోజనం కలుగుతుంది. అయితే ఇది నూతన ఆదాయ పన్ను విధానానికి లోబడి ఉన్న వారికే వర్తిస్తుంది.ఈ విధంగా రూ. లక్ష కోట్ల వరకు వచ్చే ఆదాయపు పన్ను మొత్తాన్ని మధ్యతరగతి చేతుల్లో పెట్టి కొనుగోలుశక్తి పెంచడంద్వారా డిమాండ్పెంచితే ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయనేది దీని వెనక ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే వాస్తవంగా చూస్తే... స్వేచ్చగా తమ అభిప్రా యాలను వ్యక్తపరిచే ‘వోకల్ సెక్షన్స్’ను సంతృప్తి పరిచే ప్రయత్నంగానే ఇది నిలుస్తోంది. ఇలా పెద్ద సంఖ్యలోని ప్రజలు ఇంకా కొనుగోలు శక్తి లేక ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితులే ఉంటాయి. అందువల్ల ఆదాయపు పన్ను మినహాయింపు రూపంలో ఇచ్చిన ఉద్దీపనలు ఏ మేరకు ఉపయో గపడతాయనేది ప్రశ్నార్థకంగా మారింది.ప్రొ‘‘ డి. నర్సింహా రెడ్డి వ్యాసకర్త ఆర్థికవేత్త, హెచ్‌సీయూ స్కూల్ ఆఫ్ సోషల్‌సైన్సెస్ మాజీ డీన్ -
అసలు లాభం కోటి మందికేనా?
ఇపుడు యావద్దేశమూ బడ్జెట్లో పెంచిన ఆదాయపు పన్ను పరిమితి గురించే మాట్లాడుతోంది. తాము భారతదేశ మధ్య తరగతికి ఎనలేని మేలు చేశామని, యావత్తు మధ్య తరగతికీ ఊరటనిచ్చామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మరి ఇది నిజమేనా? వాస్తవానికి 145 కోట్ల మంది భారతదేశ జనాభాలో 2024–25లో ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసినవారి సంఖ్య దాదాపుగా 8.09 కోట్లు. అందులో దాదాపుగా 6 కోట్ల మంది రూ.7 లక్షల లోపు వార్షికాదాయం ఉండి జీరో రిటర్నులు వేసినవారే. మిగిలిన వారిలో కోటి మంది రూ.12 లక్షలకన్నా ఎక్కువ వార్షికాదాయం ఉన్నవారు. అంటే మిగిలిన 1.09 కోట్ల మందికే తాజా నిర్ణయంతో ఎక్కువ మేలు కలుగుతుందన్న మాట. ఎందుకంటే వారు మాత్రమే ప్రస్తుతం రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ఆదాయం ఉండి పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నవారు. కాకుంటే.. శ్లాబుల మార్పు వల్ల రూ. 12 లక్షల నుంచి రూ. 24 లక్షల మధ్య ఆదాయం ఉండేవారికి కూడా కొంత ప్రయోజనం కలుగుతుండటం గమనార్హం. మరి ఈ 1.09 కోట్ల మందికి లబ్ధి కలిగించే నిర్ణయం తీసుకుని యావత్తు మధ్య తరగతికీ మేలు చేశామని చెప్పటం కరెక్టేనా? అసలు పన్ను పరిధిలోకే రాని 138 కోట్ల మంది సంగతేంటి? వారి బతుకు తెరువేంటి? అలాంటి వారందరినీ కూడా మధ్య తరగతిలోకో కనీసం ఆదాయ పు పన్ను పరిధిలోకో తేవాలంటే వారందరికీ తగిన ఉద్యోగాలు, ఉపాధి ఉండాలి కదా? కాకపోతే ఆ దిశగా ఈ బడ్జెట్లో తీసుకున్న చర్యలేవీ కనిపించలేదు. కాకపోతే ఉద్యోగులంటేనే ఎక్కువగా మాట్లాడేవాళ్లు. వివిధ వేదికలపై వినిపించేది వారి గొంతే. సమాజాన్ని ఎక్కువగా ప్రభావితం చేసేదీ వాళ్లే. అందుకే మోదీ వారిని లక్ష్యంగా చేసుకున్నారు. కాబట్టే ఇపుడు దేశమంతా బడ్జెట్లో మిగతా విష యాలు పక్కనబెట్టి ఆదాయపు పన్ను గురించి మాట్లాడుతోంది. లక్ష కోట్లు నష్టపోయి మరీ... ఎందుకిలా? ప్రభుత్వం తీసుకున్న తాజా చర్య వల్ల ఏడాదికి లక్ష కోట్లు నష్టపోవాల్సి వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మల చెప్పారు. మామూలుగా ఎప్పుడూ ఇంతటి నష్టం వచ్చే చర్యలు తీసుకోరు. ఎందుకంటే ఇప్పటికే రుణాలు పెరిగిపోతున్నాయి. మరి లక్ష కోట్ల ఆదాయాన్ని కోల్పోవటమంటే మాటలు కాదు కదా? కాకపోతే ప్రభుత్వ ఉద్దేశం వేరు. తాత్కాలికంగా ఉద్యోగుల్ని సంతృప్తి పరచటం ద్వారా తక్షణ ప్రయోజనాలు పొందటమే కాక... పాత పన్ను విధానాన్ని పూర్తిగా తొలగించి, ప్రతి ఒక్కరినీ కొత్త పన్ను విధానంలోకి తేవటమన్నది ప్రభుత్వ అసలు లక్ష్యం. ఇందులో భాగంగానే ఈ పరిమితి పెంపు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో పాత పన్ను విధానం నిరర్ధకమైపోతుంది. పన్ను కోసం చేసే సేవింగ్స్, అలవెన్సులు, పన్ను కోసం చేసే బీమా చెల్లింపుల వంటివన్నీ తెరమరుగైపోతాయి. మొత్తంగా అలవెన్సుల వ్యవస్థే కనిపించకుండా పోతుంది. దీనికితోడు మినహాయింపులేవీ ఉండవు కనక అత్యధిక శాతం మందికి పన్ను రిటర్నులు దాఖలు చేయటం అత్యంత సులభమైపోతుంది. రకరకాల ఆదాయాలుండి, వాటిని మేనేజ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నవారికి తప్ప.. ఒక్క జీతంపైనే ఆధారపడ్డ వారెవ్వరికీ పన్ను రిటర్నులు వేయటానికి ట్యాక్స్ అసిస్టెంట్లు, ఆడిటర్ల అవసరం ఉండదు.ఇక ఆదాయపు పన్ను విభాగంలో కూడా రిఫండ్ల వంటి ప్రక్రియ ఉండదు. పన్నుల వ్యవస్థ సరళమైపోతుంది కనక ఆదాయపు పన్ను విభాగాన్ని మరింత సమర్థంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. పైపెచ్చు సరళమైన పగడ్బందీ పన్ను విధానం అమల్లోకి వస్తుంది. రిబేట్ పరిమితి 12 లక్షల వరకూ ఉంటుంది కనక వృత్తి నిపుణులతో సహా ఎక్కువ మంది రిటర్నులు వేయటానికి ముందుకొస్తారు. ట్యాక్స్ బేస్ పెరుగుతుంది. మున్ముందు వీరంతా పన్ను చెల్లిస్తే ఆదాయ వృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పాలి. -
‘వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గించాలి’
వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లను తగ్గించడం ద్వారా ప్రజల చేతుల్లో ఖర్చు చేసే ఆదాయాన్ని పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని వాణిజ్య సంఘాలు కోరాయి. అలాగే, ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాలకు ప్రేరణనివ్వాలని, ఇంధనం(Fuel)పై ఎక్సైజ్ సుంకం తగ్గించాలని, చైనా నుంచి చౌకగా వచ్చి పడుతున్న దిగుమతులకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్(Budget 2025) ముందస్తు సమావేశంలో భాగంగా ఈమేరకు ప్రతిపాదనలు చేశాయి.ఈ కార్యక్రమంలో వాణిజ్య మండళ్ల ప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సమావేశంలో దీపమ్ కార్యదర్శితోపాటు ఆర్థిక శాఖ పరిధిలోని వివిధ విభాగాల కార్యదర్శులు, ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు పాల్గొన్నారు. 2025 ఫిబ్రవరి 1న పార్లమెంట్లో 2025–26 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. సమావేశం అనంతరం సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ పురి మీడియాతో మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థ చక్కని పనితీరు చూపిస్తున్నప్పటికీ, అంతర్జాతీయంగా సవాళ్లు నెలకొన్నట్టు చెప్పారు.‘భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉత్పత్తులు చైనా ద్వారా దిగుమతి అవుతుండడం చూస్తున్నాం. వాతావరణానికి సంబంధించి సమస్యలు, ఇతర అంశాలు ఆహార భద్రత, ద్రవ్యోల్బణం(Inflation)పై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ దిశగా మేము పలు సూచనలు చేశాం. అధిక ఉపాధికి అవకాశం ఉన్న వ్రస్తాలు, పాదరక్షలు, పర్యాటకం, ఫర్నీచర్ తదితర రంగాలకు ప్రేరణ కల్పించే చర్యలు తీసుకోవాలని కోరాం. ఎంఎస్ఎంఈ(MSME)లకు సంబంధించి చర్యలతోపాటు, అంతర్జాతీయ వాల్యూ చైన్‌తో భారత్‌ను అనుసంధానించాలని కోరాం. పెట్రోల్‌పై కొంత ఎక్సైజ్ సుంకం తగ్గించడం ద్వారా ఖర్చు పెట్టే ఆదాయాన్ని పెంచొచ్చని సూచించాం’ అని పురి వివరించారు.ఇదీ చదవండి: కార్పొరేట్ వలంటీర్లు.. సేవా కార్యక్రమాలుచైనా దిగుమతులతో ఇబ్బందులు..చైనా సొంత ఆర్థిక వ్యవస్థ నిదానించడంతో చౌకగా ఉత్పత్తులను భారత్‌లోకి పంపిస్తోందంటూ, దీని కారణంగా ఆర్థిక వ్యవస్థ తాత్కాలిక మందగమనాన్ని ఎదుర్కొంటున్నట్టు తాము తెలియజేశామని ఫిక్కీ వైస్ ప్రెసిడెంట్ విజయ్ శంకర్ తెలిపారు. ఆదాయపన్ను తగ్గించడం వల్ల ప్రజల చేతుల్లో ఆదాయం మిగులుతుందని, వినియోగాన్ని పెంచుతుందని సూచించినట్టు పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ హేమంత్ జైన్ వెల్లడించారు. జీఎస్టీని సులభంగా మార్చాలని కూడా కోరినట్టు తెలిపారు. సరఫరా వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఎంఎస్ఎంఈలకు కావాల్సిన వాటిపై (రుణాల లభ్యత, టీడీఎస్ సులభతరం) దృష్టి పెట్టాలని కోరినట్టు అసోచామ్ ప్రెసిడెంట్ సంజయ్ నాయర్ పేర్కొన్నారు. -
ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు పెంపు
న్యూఢిల్లీ: 2023–24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు గడువును డిసెంబర్ 15 వరకు పొడిగిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఉత్తర్వులు వెలువరించింది.2024–25 అసెస్మెంట్ సంవత్సరానికిగాను నవంబర్ 30 వరకు ఉన్న గడువును 15 రోజులు పొడిగించింది. అంతర్జాతీయ లావాదేవీలు, సెక్షన్ 92ఈ కింద నివేదికలను సమర్పించాల్సిన పన్ను చెల్లింపుదారుల కోసం సీబీడీటీ ఈ వెసులుబాటు కల్పించింది.CBDT Extends Due Date for furnishing Return of Income for Assessment Year 2024-25.➡️The due date for the assessees referred to in clause (aa) of Explanation 2 to Sub Section (1) of Section 139 has been extended from 30th November, 2024, to 15th December, 2024.➡️ Circular No.… pic.twitter.com/4umO91ELAQ— Income Tax India (@IncomeTaxIndia) November 30, 2024 -
ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: 2024–25 అసెస్మెంట్ సంవత్సరానికి కార్పొరేట్లకు ఐటీఆర్ ఫైలింగ్ గడువును నవంబర్ 15 వరకు పొడిగిస్తూ ఆదాయపు పన్ను శాఖ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి అక్టోబర్ 31 గడువు తేది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ 15 రోజులు పొడిగిస్తూ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది.సీబీడీటీ ఇప్పటికే ఆడిట్ నివేదికల దాఖలు తేదీని సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 7 వరకు పొడిగించింది. అవసరమైన నివేదికలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమర్పించడంలో పన్ను చెల్లింపుదారులు, ఇతర వాటాదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిగణనలోకి తీసుకున్న సీబీడీటీ ఈ తాజా నిర్ణయం తీసుకుంది.గడువు తేదీ లోపు ఆడిట్ నివేదికలను దాఖలు చేయడానికి చాలా మంది ట్యాక్స్‌పేయర్స్, సంస్థలు సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో గడవు పొడిగింపు వారికి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇప్పుడు అదనపు సమయం లభించడంతో ఎలాంటి ఒత్తిడి, జరిమానాలు లేకుండా ఎలక్ట్రానిక్ ఫైలింగ్‌లను పూర్తి చేయవచ్చు. -
IT Return: పొరపాటు జరిగిందా? రిటర్న్‌ని రివైజ్ చేసుకోవచ్చు..
ఒరిజినల్ రిటర్ను వేశారు. వెరిఫై కూడా అయింది. కానీ మీరు ఆ రిటర్నుని చెక్ చేసుకుంటే, ఏవైనా పొరపాట్లు జరిగి ఉండొచ్చు. వాటిని సరిదిద్దుకుని రివైజ్డ్ రిటర్న్ దాఖలు చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. సాధారణంగా ఎటువంటి పొరపాట్లు జరుగుతాయంటే .. » కూడిక, తీసివేతల్లో తప్పులు » ఆదాయం మర్చిపోవడం.. పరిగణనలోకి తీసుకోకపోవడం » ఆదాయం లెక్కించడంలో పొరపాటు జరగడం » మినహాయింపులు, తగ్గింపులు మొదలైనవి మర్చిపోవడం » ట్యాక్స్ లెక్కింపులో తప్పులు » టీడీఎస్‌లో పొరపాట్లు » అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించినవి మర్చిపోవడం » మినహాయింపు మొదలైనవాటిని తప్పుగా, ఎక్కువగా క్లెయిమ్ చేయడం » బ్యాంకు అకౌంటు వివరాలు తప్పుగా ఇవ్వడం » ఒక ఫారంనకు బదులుగా మరొక ఫారం వేయడంసెక్షన్ 139(5) ప్రకారం మీరు మీ ఒరిజినల్ రిటర్నుని రివైజ్ చేసుకోవచ్చు. రివైజ్డ్ రిటర్న్ అంటేనే ఒరిజినల్ రిటర్న్‌కి బదులుగా అని .. మరొక రకంగా ‘రిప్లేస్మెంట్’ అని చెప్పవచ్చు. ఇలా వేయడంలో గతవారం చెప్పినట్లుగా రూ. 1,000/5,000 చెల్లించనవసరం లేదు. మీరు సకాలంలో వేసినట్లే. అయితే, పన్ను కట్టాల్సి ఉంటే పన్నుతో పాటు వడ్డీ చెల్లించాలి.ఎప్పటిలోగా ఈ రిటర్ను వేయొచ్చు.. మీరు వేసిన ఒరిజినల్ రిటర్నుకి సంబంధించి అసెస్మెంట్ ఆర్డర్లు వచ్చేలోగా లేదా 2024 డిసెంబర్ 12లోగా .. (ఈ రెండింటిలో ఏది ముందు అయితే అది). గడువుతేదీ తర్వాత రిటర్ను వేసిన వాళ్లు కూడా రివైజ్డ్ రిటర్ను వేయొచ్చు. ఇలా ఎన్నిసార్లు రివైజ్ చేయొచ్చు .. అంటే ఎన్నిసార్లయినా రివైజ్ చేయొచ్చు. ఎటువంటి ఆంక్షలు, పరిమితులు లేవు. అలా అని మాటిమాటికీ చేయకండి.రివైజ్ చేయాల్సిన అవసరం వస్తే ఈ కింది జాగ్రత్తలు తీసుకోండి సుమా.. » మళ్లీ పొరపాటు జరగకుండా జాగ్రత్త తీసుకోండి » సమగ్రంగా అన్ని వివరాలు సేకరించండి » రివైజ్ రిటర్న్ ఆప్షన్‌ను ఎంచుకోండి » సరైన ఐటీఆర్‌ను ఎంచుకోండి » ఒరిజినల్ రిటర్ను వివరాలన్నీ ఇవ్వాలి లేదా అప్లోడ్ చేయాలి » మిగతా పద్ధతంతా షరా మామూలేమనంతట మనమే రివైజ్ చేస్తున్నాం. మళ్లీ మళ్లీ చేయడం సబబు కాదు. సమంజసం కాదు. రివైజ్ చేయడానికి కారణాలు సాంకేతికపరమైనవి, చిన్న చిన్నవైతే ఫర్వాలేదు. కానీ పెద్దవి అయితే మాత్రం మీ రివైజ్డ్ రిటర్నుని స్క్రూటినీ కోసం సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
ఐటీ రికార్డ్.. భారీగా పెరిగిన ట్యాక్స్ పేయర్లు
దేశంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు భారీగా పెరిగారు. దాఖలైన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ను బట్టీ ఈ విషయం తెలుస్తోంది. జూలై 31న గడువు ముగిసే నాటికి 2024-25 అసెస్మెంట్ ఇయర్ (AY)కి రికార్డు స్థాయిలో 7.28 కోట్ల ఐటీ రిటర్న్స్ (ITR) దాఖలయ్యాయి. మునుపటి మదింపు సంవత్సరానికి (AY 2023-24) దాఖలైన 6.77 కోట్ల ఐటీఆర్‌లతో పోలిస్తే ఇది 7.5 శాతం అధికం.పన్ను చెల్లింపుదారుల ప్రాధాన్యతలలోనూ ఈ సారి గణనీయ మార్పు కనిపించింది. ఎక్కువ మంది కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారు. దాఖలు చేసిన మొత్తం 7.28 కోట్ల ఐటీఆర్‌లలో, 5.27 కోట్లు కొత్త పన్ను విధానంలో ఉన్నాయి. మొత్తం ఫైలింగ్‌లలో ఇవి దాదాపు 72 శాతం. ఆర్థిక శాఖ ప్రకటన ప్రకారం.. పాత పన్ను విధానంలో దాఖలైన ఐటీఆర్‌లు 2.01 కోట్లు. ఇది మొత్తంలో కేవలం 28% మాత్రమే.ఇక రికార్డ్-బ్రేకింగ్ సింగిల్-డే ఫైలింగ్‌లు ఒకే రోజులో 69.92 లక్షలు. ఆఖరి రోజైన జూలై 31న ఇవి దాఖలయ్యాయి. ఒక గంటలో దాఖలైన ఐటీఆర్‌లను పరిశీలిస్తే ఈ-ఫైలింగ్ పోర్టల్ రాత్రి 7:00 నుంచి 8:00 గంటల మధ్య అత్యధిక ఐటీఆర్ ఫైలింగ్స్‌ను చూసింది. ఈ సమయంలో సగటున 5.07 లక్షల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. ఇక జూలై 17న అత్యధికంగా సెకనుకు 917 ఫైలింగ్‌లు, జూలై 31న నిమిషానికి 9,367 ఫైలింగ్‌లను నమోదు చేసింది.మొదటిసారి ఐటీఆర్ దాఖలు చేసేవారి సంఖ్య ఈ సంవత్సరం కొత్త పన్ను చెల్లింపుదారులలో పెరుగుదల కనిపించింది. ఈసారి 58.57 లక్షల మంది మొదటిసారిగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేశారు. దాఖలైన మొత్తం 7.28 కోట్ల ఐటీఆర్‌లలో, ఐటీఆర్-1 కింద 45.77% (3.34 కోట్లు), ఐటీఆర్-2 కింద14.93% (1.09 కోట్లు), ఐటీఆర్-3 కింద 12.50% (91.10 లక్షలు), ఐటీఆర్-4 కింద 25.77% (1.88 కోట్లు)గా ఉన్నాయి. మిగిలిన 1.03% (7.48 లక్షలు) ఐటీఆర్-5 నుంచి ఐటీఆర్-7 కేటగిరీల కింద దాఖలయ్యాయి. The Income Tax Department appreciates taxpayers & tax professionals for timely compliance, resulting in a record surge in the filing of Income Tax Returns (ITRs).Here are the key highlights:👉More than 7.28 crore ITRs for AY 2024-25 filed till 31st July, 2024, a 7.5% increase… pic.twitter.com/CzbgZEMUWi— Income Tax India (@IncomeTaxIndia) August 2, 2024 -
ఐటీఆర్.. ఈరోజే చివరి తేదీ.. ప్రయోజనాలివే..
గడిచిన ఆర్థిక సంవత్సరానికి గానూ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు ఈరోజే(జులై 31) చివరి తేదీ. నిబంధనలకు అనుగుణంగా ఆదాయపన్ను రిటర్నులను ఇంకా ఎవరైనా దాఖలు చేయకపోతే వెంటనే నమోదు చేయాలని నిపుణులు కోరుతున్నారు. నిబంధనల ప్రకారం ఏటా సమకూరే ఆదాయానికి తగ్గట్టుగా పన్ను చెల్లించాలి. ఆదాయపు పన్ను పరిధిలోకి రానివారు కూడా రిటర్నులు దాఖలు చేయొచ్చు. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోపు రిటర్నులు ఫైల్ చేస్తే చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. వాటి గురించి తెలుసుకుందాం.ఇతర దేశాలకు వెళ్లాలనుకునే వారికి వీసా దరఖాస్తు కోసం పన్ను రిటర్నులు ఉపయోగపడతాయి. ఏదైనా బకాయిలుంటే వేరే దేశం వెళ్లేందుకు అవాంతరాలు ఏర్పడుతాయి.బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు రుణం మంజూరుకోసం ఆదాయ రుజువు సమర్పించాల్సి ఉంటుంది. అందుకు రిటర్నులు సాయపడతాయి.ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చే నష్టాలను తదుపరి సంవత్సరానికి జత చేయొచ్చు. అంటే పాత నష్టాలను భవిష్యత్తు ఆదాయానికి జతచేసి పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు.ముఖ్యంగా స్టాక్ మార్కెట్ లేదా ఇతర వెంచర్లలో పెట్టుబడులు పెట్టే వారికి ఇది ఎంతో ఉపయోగం.ఇదీ చదవండి: పెళ్లి కాకుండానే 100 మందికి తండ్రయ్యాడు..!ఐటీ రిటర్నులను కొన్నిసార్లు గుర్తింపు పత్రాలుగా కూడా ఉపయోగిస్తారు. ఏదైనా అధికారిక పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే వీటిని ఐడెంటిటీ ప్రూఫ్‌గా వాడుకోవచ్చు.నిర్దిష్ట సమయంలో ఐటీఆర్‌లను ఫైల్ చేసే వ్యక్తి క్రెడిట్ ప్రొఫైల్ మెరుగవుతుంది. క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ అంచనా వేసే సమయంలో దీన్ని పరిగణనలోకి తీసుకుంటాయి. దానివల్ల ఎప్పుడైనా రుణాలకోసం దరఖాస్తు చేసుకుంటే తక్కువ వడ్డీకే వాటిని పొందే వీలుంది.భవిష్యత్తులో వ్యాపారం ప్రారంభించాలన్నా, ప్రభుత్వ టెండర్ల కోసం బిడ్డింగ్ వేయాలన్నా ఐటీఆర్ ఫైల్ చేయడం ముఖ్యం.ఐటీఆర్‌లో పూర్తి ఆర్థిక లావాదేవీలుంటాయి. దానివల్ల భవిష్యత్తులో పెట్టుబడి, ఖర్చులు వంటి వాటిపై మరింత స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.నిత్యం మనం చేసే వస్తువులకు ప్రభుత్వం టీడీఎస్ వసూలు చేస్తుంది. వీటిని తిరిగి పొందాలంటే ఐటీఆర్ ఫైల్ చేయాలి. -
నూతన విధానమే ఎంపిక
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు 4 కోట్ల మందికి పైగా ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయగా, 66 శాతం మంది నూతన విధానాన్ని ఎంపిక చేసుకున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్ రవి అగర్వాల్ తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది నూతన విధానాన్నే ఎంపిక చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. పన్నుల ప్రక్రియను సులభతరం చేయడంపై ప్రభుత్వం, సీబీడీటీ దృష్టి సారించినట్టు చెప్పారు. ఎంత సులభంగా పన్ను విధానం మారితే, అంత ఎక్కువ మంది పన్ను నిబంధనలు పాటించేందుకు ముందుకు వస్తార న్నది ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. ఇందుకు నిదర్శనం గతేడాది ఇదే సమయానికి దాఖలైన రిటర్నులతో పోలిస్తే, ఈ ఏడాది మరింత పెరిగినట్టు చెప్పారు. గతేడాది జూలై 25 నాటికి 4 కోట్ల రిటర్నులు దాఖ లు కాగా, ఈ ఏడాది జూలై 22కే దీన్ని అధిగమించినట్టు తెలిపారు. గతేడాది జూలై 31 నాటికి మొత్తం 7.5 కోట్ల రిటర్నులు నమోదైనట్టు వెల్లడించారు. పాత పన్ను విధానం రద్దు ఎప్పుడు? మెజారిటీ పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్నే ఎంపిక చేసుకున్నందున పాత విధానాన్ని ఎప్పుడు రద్దు చేస్తారంటూ మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు రవి అగర్వాల్ స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం ఇది మార్పు దశలో ఉంది. పన్ను చెల్లింపుదారుల నుంచి ఏ విధానానికి మెరుగైన ఆమోదం లభిస్తుందో చూసిన తర్వాత దీనిపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటాం’’అని చెప్పారు. ఇండెక్సేషన్ తొలగింపు రియలీ్టకి మంచిదేరియల్ ఎస్టేట్ లావాదేవీలకు ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగించడమనేది మంచిదేనని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ రవి అగ్రవాల్ తెలిపారు. కేవలం లెక్కల కోణంలో చూడకుండా వాస్తవ మార్కెట్ పరిస్థితులను బట్టి చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. గత పదేళ్లుగా పెరిగిన రియల్టీ ధరలు, ఇండెక్సేషన్ సంబంధ ప్రయోజనాలను పరిశీలిస్తే సరళతరమైన కొత్త విధానంలో పన్నులపరమైన బాదరబందీ తక్కువగా ఉంటుందని అగ్రవాల్ చెప్పారు. తాజా బడ్జెట్లో రియల్టీ రంగంలో ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగిస్తూ దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్టీసీజీ) పన్నులను 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రాపర్టీ కొనుగోలు విలువను ఏటా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెంచుకుంటూ, అంతిమంగా విక్రయించినప్పుడు వచ్చే లాభాలపై పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు ఇండెక్సేషన్ ఉపయోగపడుతోంది. కొత్త మార్పులతో గృహాలను విక్రయించినప్పుడు వచ్చే రాబడిపై పన్ను భారం పెరిగిపోతుందనే ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రవి వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. అంతరాయాల్లేకుండా చర్యలుఇన్ఫోసిస్, ఐబీఎం, హిటాచీ సంస్థలతో కలసి ఐటీ పోర్టల్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్టు రవి అగర్వాల్ తెలిపారు. వెబ్సైట్ చక్కగా పనిచేస్తుందన్న భరోసా ఇచ్చారు. బడ్జెట్ రోజునే (23న) 22 లక్షల రిటర్నులు దాఖలైనట్టు తెలిపారు. పన్ను వివాదాల పరిష్కారానికి సంబంధించి బడ్జెట్లో ప్రకటించిన ‘వివాద్ సే విశ్వాస్’ పథకం డిసెంబర్ 31 నుంచి అమల్లోకి రావచ్చని రవి అగర్వాల్ ప్రకటించారు. త్వరలోనే ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. -
వాట్సాప్ ద్వారా ఐటీ రిటర్న్స్!! ఎలాగో చూడండి..
ITR Filing 2024: ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) ఫైలింగ్ గడువు సమీపిస్తోంది. దీంతో ట్యాక్స్ పేయర్లు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడంలో హడావుడిగా ఉన్నారు. అయితే ట్యాక్స్ ప్రిపరేషన్ సర్వీస్‌ను అందించే ‘క్లియర్ ట్యాక్స్’ (ClearTax) వాట్సాప్‌ని ఉపయోగించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి కొత్త మార్గాన్ని ప్రవేశపెట్టింది.ఈ కొత్త సర్వీస్ సరళమైన, చాట్-ఆధారిత అనుభవాన్ని అందించడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తుంది. తక్కువ-ఆదాయ పన్ను చెల్లింపుదారులకు సహాయం చేయడానికి దీన్ని రూపొందించారు. ఐటీఆర్1, ఐటీఆర్4 ఫారమ్‌లకు మద్దతు ఇస్తుంది. ఇది పన్ను దాఖలును సులభతరం చేస్తుంది. ఎక్కువ మందికి అందుబాటులో ఉంటుంది.ఈ సర్వీస్ ముఖ్యమైన ఫీచర్లు» ఇది ప్రస్తుతం ఐటీఆర్1, ఐటీఆర్4 ఫారమ్‌లకు మద్దతు ఇస్తోంది.» ఇంగ్లీష్, హిందీ, కన్నడతో సహా 10 భాషల్లో అందుబాటులో ఉంది.» ప్రతిదీ వాట్సాప్‌లోనే పూర్తి చేసేలా భద్రతతో కూడిన చెల్లింపు వ్యవస్థ.» అవసరమైన సమాచారాన్ని ఇమేజ్‌లు, ఆడియో, టెక్ట్స్ ద్వారా సమర్పించవచ్చు.» ఏఐ వ్యవస్థ ప్రతి యాజర్‌కు ఉత్తమమైన పన్ను విధానాన్ని ఎంపిక చేస్తుంది. వారికి మరింత ఆదా చేయడంలో సహాయపడుతుంది.ఉపయోగించండి ఇలా..» క్లియర్ ట్యాక్స్ వాట్సాప్ నంబర్‌ను సేవ్ చేసి, "హాయ్" అని టైప్ చేయడం ద్వారా సంభాషణను ప్రారంభించండి.» మీకు నచ్చిన భాషను ఎంచుకోండి.» అడిగినప్పుడు మీ పాన్, ఆధార్, బ్యాంక్ ఖాతా సమాచారాన్ని నమోదు చేయండి.» అవసరమైన పత్రాలను సులభంగా సమర్పించడానికి చిత్రాలను అప్లోడ్ చేయండి లేదా ఆడియో/టెక్స్ట్ సందేశాలను పంపండి.» ఐటీఆర్1 లేదా ఐటీఆర్4 ఫారమ్‌లను దశల వారీగా పూరించడానికి ఏఐ బాట్ సూచనలను అనుసరించండి.» ముందుగా నింపిన ఫారమ్‌ను సమీక్షించండి, ఏవైనా అవసరమైన మార్పులు చేయండి. మీ వివరాలను నిర్ధారించండి.» వాట్సాప్ ద్వారా నేరుగా సురక్షిత చెల్లింపుతో ప్రక్రియను పూర్తి చేయండి.» సబ్మిట్ తర్వాత, మీరు మీ రసీదు సంఖ్యతో నిర్ధారణ సందేశాన్ని అందుకుంటారు. -
ఐటీఆర్ ఫైలింగ్‌లో ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తున్నారా..?
ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు సమయం దగ్గర పడుతోంది. జులై 31 చివరి తేదీగా నిర్ణయించారు. రిటర్ను దరఖాస్తులు దాఖలు చేసేపుడు చాలామంది పన్ను భారాన్ని ఎలా తగ్గించుకోవాలో ఆలోచిస్తుంటారు. ఏటా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దానికి అనువుగా వచ్చే ఆదాయాన్ని సర్దుబాటు చేస్తే కొంతమేర పన్ను ఆదా చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం పన్ను చెల్లింపుల్లో ఇన్వెస్టర్లకు ఇండెక్సేషన్ చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.ఇండెక్సేషన్పన్నుదారుల్లో చాలామంది స్టాక్‌లు, బాండ్లు, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తుంటారు. ఏటా ద్రవ్యోల్బణం నమోదవుతోంది. దానికి అనువుగా ఆదాయాన్ని సర్దుబాటు చేసే పద్ధతినే ఇండెక్సేషన్ అంటారు. పన్ను రిటర్నులు దాఖలు చేసేపుడు చాలావరకు గతంలో చేసిన పెట్టుబడులను ప్రస్తుత విలువగానే పరిగణిస్తున్నారు. కానీ కాలక్రమేణా ద్రవ్యోల్బణం కారణంగా వాస్తవ పెట్టుబడి విలువ తరిగిపోతుంది. దాన్ని తాజా ధరలకు అనుగుణంగా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఇండెక్సేషన్ ఉపయోగపడుతుంది. ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే రిటైల్ ద్రవ్యోల్బణ (సీపీఐ) గణాంకాల ఆధారంగా ఇండెక్సేషన్‌ను అంచనా వేస్తారు. మూలధన లాభాలను కచ్చితంగా నిర్ణయించడంలో ఇది సహాయపడుతుంది.ఏదైనా ఒక వస్తువును రూ.10కు కొనుగోలు చేశారనుకుందాం. ద్రవ్యోల్బణం కారణంగా ఏడాదిలో దాని ధర రూ.12కు చేరినట్లు భావించండి. ఆ వస్తువుపై రూ.1 లాభం రావాలంటే మీరు దాన్ని ప్రస్తుత విలువ ప్రకారం రూ.13కు అమ్ముతారు. కానీ మీరు కొన్నది రూ.10కే. ద్రవ్యోల్బణం కారణంగా దాని విలువ మీరు అమ్మే సమయానికి రూ.2 పెరిగింది. కాబట్టి మీకు వచ్చిన లాభంలో ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేయాలి. దానికోసం ఇండెక్సేషన్ ఎంతో ఉపయోగపడుతుంది. -
ఐటీ రిటర్న్.. చలో ఆన్లైన్!
ఆదాయపన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. జూలై 31 తుది గడువు. చివరి రోజు వరకు ఆగకుండా ముందుగా రిటర్నులు దాఖలు చేయడం సూచనీయం. చాలా మందికి రిటర్నుల విషయంలో ఎన్నో సందేహాలు వస్తుంటాయి. వేరొకరి సాయం తీసుకుంటుంటారు. కానీ, ఎవరికివారే ఆదాయపన్ను శాఖ ఈ–ఫైలింగ్ పోర్టల్ ద్వారా రిటర్నులను ఎల్రక్టానిక్ రూపంలో సమరి్పంచొచ్చు. ఈ–ఫైలింగ్ పోర్టల్‌ను యూజర్లకు అనుకూలంగా మార్చేందుకు ఆదాయపన్ను శాఖ ఎన్నో చర్యలు చేపట్టినప్పటికీ, ఐటీఆర్ దాఖలు ప్రక్రియ అర్థం కాని వారు చాలా మందే ఉంటారు. ఇలాంటి వారికి ఉన్నమెరుగైన ప్రత్యామ్నాయ మార్గం.. మధ్యవర్తిత్వ సంస్థల సాయం తీసుకోవడం. వీటి ద్వారా చాలా సులభంగా రిటర్నులు దాఖలు చేయవచ్చు. ఈ విషయంలో ఇవి మెరుగైన సేవలను అందిస్తున్నాయి. వీటి గురించి తెలియజేసే ప్రయత్నమే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం.ఈఆర్ఐలుఈ–రిటర్న్ ఇంటర్మీడియరీలు (ఈఆర్ఐలు) ఎలక్గ్రానిక్ రూపంలో పన్ను రిటర్నులు వేసేవారికి కావాల్సిన అన్ని రకాల సేవలు అందిస్తున్నాయి. ఇవి అనుసంధానకర్తగా వ్యవహరిస్తాయి. సాఫ్ట్వేర్ ఆధారితంగా నడిచే ప్లాట్‌ఫామ్‌లు. వీటి ద్వారా ఎవరైనా రిటర్నులు సమరి్పంచొచ్చు. పన్ను చెల్లింపుదారుల తరఫున పన్ను రిటర్నుల దాఖలుకు ఐటీ శాఖ నుంచి వీటికి అనుమతి ఉంది. క్లియర్‌ట్యాక్స్, క్వికో, ట్యాక్స్‌బడ్డీ, మైఐటీ రిటర్న్, ఈజెడ్‌ట్యాక్స్, ట్యాక్స్2విన్ ఇవన్నీ ఈఆర్ఐలే. రిటర్నుల ఆటోఫిల్, రివ్యూ, ఈ–ఫైల్.. ఇలా మూడంచెల్లోనే రిటర్నులను సమరి్పంచొచ్చు. పన్ను రిటర్నులు వేయడం ఇంత సులువా? అనేలా ఇవి సేవలు అందిస్తున్నాయి.సౌకర్యం..ఇవి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు కావడంతో పన్ను చెల్లింపుదారులు తమ ఇంటి నుంచే ఖాళీ సమయంలో సులభంగా రిటర్నులు దాఖలు చేయవచ్చు. వీటి యూజర్ ఇంటర్ఫేస్ అర్థం చేసుకునేందుకు సులభంగా, సమకాలీనంగా ఉంటుంది. అందుకే ఇటీవలి కాలంలో ఈ ప్లాట్‌ఫామ్‌లను వినియోగించుకునే వారు పెరుగుతున్నారు. మొబైల్ యాప్‌ల నుంచి రిటర్నులు వేసే సౌకర్యాన్ని సైతం అందిస్తున్నాయి. క్వికో అయితే యూపీఐ ద్వారా పన్ను చెల్లించే సదుపాయాన్ని ఆఫర్ చేస్తోంది. పాన్, ఆధార్, బ్యాంక్ స్టేట్మెంట్, ఫామ్ 16 పత్రాల కాపీలను దగ్గర ఉంచుకుంటే, రిటర్నులు వేగంగా సమరి్పంచొచ్చు. ఈ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై మూలధన లాభాలు ఉన్న వారూ ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రిటర్నులు సులభంగానే దాఖలు చేసుకోవచ్చు. ప్రముఖ స్టాక్ బ్రోకర్లతో వీటికి ఒప్పందం ఉంది. కనుక పన్ను చెల్లింపుదారుల సమ్మతితో వారికి సంబంధించి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వివరాలను బ్రోకర్ల సర్వర్ల నుంచి సెకన్ల వ్యవధిలో తీసుకుని రిటర్నుల పత్రంలో నమోదు చేస్తాయి. కనుక వీటిని విడిగా నమోదు చేయాల్సిన ఇబ్బంది ఉండదు. అందుకే తమ స్టాక్ బ్రోకర్‌తో టైఅప్ ఉన్న ఈఆర్ఐని ఎంపిక చేసుకోవాలి. లేదంటే విడిగా ప్రతీ పెట్టుబడికి సంబంధించిన కొనుగోలు తేదీ, ధర, విక్రయం తేదీ, ధర తదితర వివరాలు నమోదు చేయాల్సి వస్తుంది.అన్ని విధాలా సహకారం పన్ను అంశాల్లో పూర్తి సహకారం అందించేందుకు ఇవి సిద్ధంగా ఉంటాయి. పాత, కొత్త పన్ను విధానాల్లో ఏది అనుకూలం? వ్యక్తి ఆదాయ వనరుల ఆధారంగా దాఖలు చేయాల్సిన ఐటీఆర్ పత్రాన్ని ఈఆర్ఐ సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఎంపిక చేస్తుంది. కేవలం వేతనమే కాదు, ఈక్విటీలు, ఎఫ్‌అండ్‌వో ఆదాయం, విదేశీ ఆస్తుల ద్వారా ఆదాయం ఇలా భిన్న రూపాల్లో ఆదాయ వనరులు ఉన్న వారికి ఐటీఆర్ పత్రం ఎంపికను ఇవి సులభతరం చేస్తాయి. రిటర్నులు దాఖలు చేయడమే కాదు, ఈ వెరిఫికేషన్‌ను కూడా అక్కడే పూర్తి చేయవచ్చు. ట్యాక్స్‌బడ్డీ ప్లాట్‌ఫామ్ ద్వారా రిటర్నులు వేసినట్టయితే.. ఒకవేళ ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు వస్తే, పన్ను చెల్లింపుదారులకు తెలియజేయడం, నోటీసుకు ఇవ్వాల్సిన సమాధానం విషయంలోనూ సహకారం లభిస్తుంది. ఈఆర్ఐ ప్లాట్‌ఫామ్‌లపై రిటర్నుల దాఖలుకు సంబంధించి రెండు స్కీమ్‌లు ఉంటాయి. ఒకటి సొంతంగా దాఖలు చేసుకోవడం. రెండోది నిపుణుల సహకారంతో దాఖలు చేసుకోవడం. కొంత చార్జీ చెల్లించి పన్ను నిపుణులు, చార్టర్డ్ అకౌంటెంట్ల సహకారాన్ని రిటర్నుల విషయంలో తీసుకోవచ్చు. వర్చువల్‌గా నిపుణులతో సమావేశమై సందేహాలు తీర్చుకోవచ్చు. అడ్వాన్స్డ్ ట్యాక్స్ విషయంలోనూ ఈ ప్లాట్‌ఫామ్‌లు సాయం అందిస్తున్నాయి.. అంతేకాదు ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పన్ను మినహాయింపులు, పన్ను తగ్గింపు ప్రయోజనాలు పొందడానికి వీలుగా పెట్టుబడుల విషయంలోనూ సలహాలు తీసుకోవచ్చు. జీవిత బీమా, ఆరోగ్య బీమా, ఎన్పీఎస్, ఈఎల్ఎస్ఎస్, పన్ను ఆదా డిపాజిట్లలో పెట్టుబడులపై సహకారం లభిస్తుంది. సేవలకు చార్జీలు... ఈ ప్లాట్‌ఫామ్‌లు రిటర్నుల దాఖలుకు కొంత చార్జీ వసూలు చేస్తున్నాయి. నిపుణుల సహకారం లేకుండా సొంతంగా రిటర్నుల ఫైలింగ్‌కు చార్జీ రూ.200 నుంచి రూ.1,600 వరకు ఉంది. ఆదాయస్థాయికి అనుగుణంగా ఈ చార్జీ మారుతుంది. కొన్ని ప్లాట్‌ఫామ్‌లు పన్ను చెల్లింపుదారులు సొంతంగా రిటర్నులు దాఖలు చేసుకుంటే ఎలాంటి చార్జీ తీసుకోవడం లేదు. నిపుణుల సాయం తీసుకుని, రిటర్నులు వేయాలనుకుంటే చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈఆర్ఐ సంస్థలకు యూట్యూబ్ చానళ్లు ఉన్నాయి. ప్లాట్‌ఫామ్ సేవలను ఎలా వినియోగించుకోవచ్చన్నదానిపై వీడియోలు చూసి తెలుసుకోవచ్చు. వ్యక్తిగత ఆరి్థక అంశాలపై సమాచారం అందించే వీడియోలు సైతం అక్కడ లభిస్తాయి. డేటా భద్రత సంగతి?ఈఆర్ఐలు అన్నీ కూడా పన్ను చెల్లింపుదారులకు సంబంధించి సున్నితమైన వ్యక్తిగత డేటాను పెద్ద మొత్తంలో కలిగి ఉంటాయి. కనుక ఆయా ప్లాట్‌ఫామ్‌ల భద్రత ఎంతన్నది ముందే విచారించుకోవాలి. పన్ను చెల్లింపుదారుల సమాచారాన్ని మరొకరితో పంచుకోవడం లేదా విక్రయించడం చేయబోమని ఈ వేదికలు హామీ ఇస్తున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌లు టెక్నాలజీ, భద్రత కోసం తగినంత ఖర్చు చేయాల్సి వస్తుంది. వీటి విషయంలో రాజీకి అవకాశం లేదు.రిటర్నులు ఎవరు వేయాలి? వార్షిక ఆదాయం రూ.2,50,000 వరకు ఉన్న వారు పన్ను పరిధిలోకి రారు. పాత పన్ను విధానంలో ప్రాథమిక మినహాయింపు ఆదాయ పరిమితి రూ.2,50,000. అదే కొత్త పన్ను విధానంలో అయితే వార్షికాదాయం రూ.3,00,000 మించని వారు పన్ను రిటర్నులు దాఖలు చేయనవసరం లేదు. ఇంతకు మించి ఆదాయం కలిగిన ప్రతి ఒక్కరూ రిటర్నులు విధిగా దాఖలు చేయాల్సిందే. అయితే పన్ను చెల్లించే ఆదాయం లేకపోయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో రిటర్నులు దాఖలు చేయాలని చట్టంలోని సెక్షన్ 139 స్పష్టం చేస్తోంది.ఏ సందర్భాల్లో రిటర్నులు వేయాలి..? (సెక్షన్ 139)→ విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు (షేర్లు) కలిగి ఉన్న వారు రిటర్నులు దాఖలు చేసి, అందులో ఆ వివరాలు పేర్కొనాలి. విదేశీ కంపెనీల్లోని వాటాల ద్వారా వచ్చే డివిడెండ్ వివరాలను సైతం వెల్లడించాలి. విదేశీ కంపెనీల బాండ్లు, విదేశాల్లో ఇల్లు, ఆ ఇంటి నుంచి అద్దె ఆదాయం వస్తున్న ప్రతి ఒక్కరూ రిటర్నులు దాఖలు చేయాలని సెక్షన్ 139(1) చెబుతోంది. భారత్‌కు వెలుపల ఏ దేశంలో అయినా అకౌంట్‌కు సంతకం చేసే అధికారం కలిగి ఉన్న వారు కూడా రిటర్నులు వేయాలి. తన పేరు మీద ఇన్వెస్ట్ చేసినా లేదా తల్లిదండ్రుల పేరు మీద విదేశాల్లో ఇన్వెస్ట్ చేసినా సరే.. రిటర్నుల దాఖలు తప్పదు. → ఒక వ్యక్తి తాను, తన జీవిత భాగస్వామి, లేదా ఇతరుల (తల్లిదండ్రులు తదితర) విదేశీ పర్యటనల కోసం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షలు, అంతకుమించి ఖర్చు చేసినట్టయితే రిటర్నులు వేయాల్సి ఉంటుంది. → ఒక ఆరి్థక సంవత్సరంలో విద్యుత్ బిల్లుల మొత్తం రూ.లక్ష దాటినా సరే రిటర్నుల దాఖలు తప్పనిసరి. → మూలధన లాభాలపై పన్ను మినహాయింపు కోరుకునే వారు రిటర్నులు దాఖలు చేయాలి. → మూలం వద్దే పన్ను కోత (టీడీఎస్), మూలం వద్దే పన్ను వసూళ్లు (టీసీఎస్) ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.25,000, అంతకుమించి ఉంటే రిటర్నులు వేయాలని ఆదాయపన్ను శాఖ 2022 ఏప్రిల్ నాటి నోఫికేషన్ స్పష్టం చేస్తోంది. ఇదే నోటిఫికేషన్ ప్రకారం.. ఒక ఆరి్థక సంవత్సరంలో బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో రూ.50లక్షలు అంతకుమించి డిపాజిట్ చేసిన సందర్భాల్లో, వ్యాపార టర్నోవర్ లేదా వ్యాపారం నుంచి రావాల్సిన మొత్తం రూ.60లక్షలు మించి ఉన్నా రిటర్నులు దాఖలు చేయాల్సిందే. → స్వయం ఉపాధిలోని వారు కరెంట్ ఖాతా కలిగి, అందులో ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.కోటి డిపాజిట్ చేసిన సందర్భంలోనూ రిటర్నులు వేయాలి. → వడ్డీ ఆదాయం, డివిడెండ్లపై టీడీఎస్ అమలు చేస్తుంటారు. పన్ను చెల్లించేంత ఆదాయం లేని వారు, ఇలా టీడీఎస్ రూపంలో మినహాయించినది తిరిగి పొందాలంటే (రిఫండ్), ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. గడువులోపు రిటర్నులు వేయకపోతే?జూలై 31 తర్వాత రిటర్నులు దాఖలు చేసే వారు సెక్షన్ 234ఎఫ్ కింద పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయం రూ.5 లక్షల్లోపు ఉన్న వారికి రూ.1,000, రూ.5 లక్షలు మించి ఆదాయం ఉంటే రూ.5,000 పెనాల్టీ కింద చెల్లించాలి. -
IT Returns Filing: ఉద్యోగులకు ఈ ఫారం తప్పనిసరి!
వేతన జీవులకు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ఫారం-16 అవసరం. ఇందులో ఉద్యోగుల స్థూల ఆదాయం, నికర ఆదాయం, టీడీఎస్ కు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగులకు ఫారం-16 అందింది.కంపెనీలు తమ ఉద్యోగులకు ఫారం-16 జారీ చేయడానికి చివరి తేదీ జూన్ 15. మరోవైపు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. ఆ తర్వాత ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తే పెనాల్టీ, పన్నుపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి వేతన జీవులు ఇప్పటి నుంచే రిటర్నులు దాఖలు చేసే ప్రక్రియను ప్రారంభించాలి.రిటర్న్ ఫైలింగ్‌కు ఈ డాక్యుమెంట్లు అవసరంఐటీఆర్ దాఖలుకు ఫారం-16తో పాటు వార్షిక సమాచార ప్రకటన(AIS), ఫారం 26ఏఎస్ అవసరం. ఈ మూడు డాక్యుమెంట్లను ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్ నుంచి ఏఐఎస్, ఫారం 26 డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్‌లోకి లాగిన్ కావాలి.ఫారం-16 పొందడం ఎలా?మీ కంపెనీ యాజమాన్యం మీకు ఈమెయిల్ ద్వారా ఫారం-16 పంపి ఉండవచ్చు లేదా ఆఫీస్ వెబ్సైట్లో అప్లోడ్ చేసి ఉండవచ్చు. ట్రేసెస్ (TRACES)పోర్టల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ పాన్‌ను యూజర్ ఐడీగా ఉపయోగించి సైస్‌లో రిజిస్టర్ చేసుకుని ఆ తర్వాత ఆధార్-ఓటీపీ ఆధారిత ఆథెంటికేషన్ ఎంచుకోవచ్చు.ఆదాయపు పన్ను శాఖ మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి వ్యక్తిగత వివరాలను సరిపోల్చుతుంది. ఇవన్నీ మీ ఆధార్, పాన్ సమాచారంతో సరిపోలాలి. ఈ వివరాలు సరిపోలకపోతే ధ్రువీకరణ ప్రక్రియ ముందుకు సాగదు. వివరాలను సరిపోల్చిన తర్వాత ధ్రువీకరణ విజయవంతమైతే, మీ మొబైల్ నంబర్, ఈమెయిల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత సంబంధిత ఆర్థిక సంవత్సరాన్ని ఎంచుకోవడం ద్వారా ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఫారం-16లో ఏముంటుంది?ఫారం-16లో ఎ, బి అనే రెండు భాగాలుంటాయి. పార్ట్-ఎ లో మీ పేరు, చిరునామా, పాన్, కంపెనీ వివరాలు, టీడీఎస్ వంటి వివరాలు ఉంటాయి. ఇందులో ప్రభుత్వానికి జమ చేసిన పన్నుకు సంబంధించిన సమాచారం కూడా ఉంటుంది. పార్ట్-బి లో మీ జీతం బ్రేకప్ ఉంటుంది. సెక్షన్ 10 కింద మినహాయింపులు ఉంటాయి. వీటిలో లీవ్ ట్రావెల్ అలవెన్స్, ఇంటి అద్దె అలవెన్స్ ఉన్నాయి. చాప్టర్ 6-ఏ కింద కూడా మినహాయింపులు ఉంటాయి.ఫారం-16లో ఇచ్చిన సమాచారాన్ని ఫారం-26ఏఎస్‌తో సరిపోల్చాలి. దీన్ని ఏఐఎస్ తో కూడా సరిపోల్చుకోవచ్చు. డేటాలో ఏదైనా వ్యత్యాసం కనిపిస్తే సరిదిద్దుకోవాలి. దీని కోసం, మీరు మీ కంపెనీ, ఇతర పన్ను మినహాయింపు సంస్థను సంప్రదించవచ్చు. ఫారం-16లో ఇచ్చిన సమాచారానికి, ఐటీఆర్‌లో ఇచ్చిన సమాచారానికి మధ్య ఏదైనా వ్యత్యాసం ఉంటే ఆదాయపు పన్ను శాఖ నుంచి మీకు నోటీసు రావచ్చు. -
ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా.. మారిన రూల్స్ తెలుసా?
ఐటీఆర్ రిటర్న్స్ ఫైలింగ్‌కు ఇంక కొన్ని రోజులే ఉంది. 2024 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. ఏటా ఐటీఆర్ దాఖలు చేస్తున్నవారైనా, ఈసారి కొత్తగా ఫైలింగ్ చేస్తున్నవారైనా పన్నుకు సంబంధించిన మార్పుల గురించి తప్పక తెలుసుకోవాలి.గత కొన్నేళ్లలో సీబీడీటీ అనేక పన్ను సంబంధిత నిబంధనలను మార్చింది. ఐటీఆర్ ఫైలింగ్‌కు సంబంధించి మారిన నిబంధనల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. ఈ విషయాల పట్ల జాగ్రత్త వహించకపోతే ట్యాక్స్ రీఫండ్ ఆగిపోయే అవకాశం ఉంది.కొత్త పన్ను విధానం2024 సంవత్సరంలో కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చింది. దీని కింద రూ .7 లక్షల వరకు ఆదాయంపై ఎటువంటి పన్నూ ఉండదు. అయితే మీరు కొత్త, పాత పన్ను విధానం ఏదోఒక దాని కింద ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. కొత్త పన్ను విధానం డిఫాల్ట్ గా ఉంటుంది. పాత పన్ను విధానం ఐచ్ఛికం. ఎలాంటి మినహాయింపు, డిడక్షన్ లేకుండా క్లెయిమ్ సమర్పిస్తే కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవాలి. ఒక వేళ పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే దాని కింద వివిధ పన్ను మినహాయింపులు, డిడక్షన్లను క్లెయిమ్ చేయవచ్చు.స్టాండర్డ్ డిడక్షన్వేతన జీవులకు రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను ఇటీవల ప్రవేశపెట్టారు. ఈ స్టాండర్డ్ డిడక్షన్ పెన్షనర్లకు మాత్రమే. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించుకునేందకు స్టాండర్డ్ డిడక్షన్ కింద రూ.50,000 తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు. దీంతో పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.సెక్షన్ 80సీసెక్షన్ 80సీ పరిమితిని రూ.1.5 లక్షలకు పెంచారు. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి, ఎల్ఐసీ, ఎన్ఎస్సీ, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో ఇన్వెస్ట్ చేస్తే 80సీ కింద రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు. ఇది కాకుండా, 80డీ కింద మీరు మీ కుటుంబం, సీనియర్ సిటిజన్లైన తల్లిదండ్రుల కోసం తీసుకున్న ఆరోగ్య బీమాపై పన్ను మినహాయింపు పొందవచ్చు. రెండింటి గరిష్ట ప్రీమియం రూ.75,000. 80సీలో హోమ్ లోన్, పిల్లల ఎడ్యుకేషన్ ఫీజుల అసలు మొత్తాన్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు.హోమ్ లోన్మీరు ఇల్లు కొనుగోలు చేసి, దాని కోసం హోమ్ లోన్ తీసుకున్నట్లయితే 80ఈఈఏ కింద దాని వడ్డీపై మినహాయింపు పొందుతారు. గృహ రుణ వడ్డీపై రూ .2 లక్షల వరకు అదనపు తగ్గింపును ప్రోత్సహించడమే దీని లక్ష్యం. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడం, అఫోర్డబుల్ హౌసింగ్‌ను ప్రోత్సహించడం ఈ మినహాయింపు ఉద్దేశం.అదనపు వివరాలుఐటీఆర్ ఫారాన్ని సవరించి అదనపు వివరాలను పొందుపరిచారు. ముఖ్యంగా విదేశీ ఆస్తులు, ఆదాయం, భారీ లావాదేవీలు వెల్లడించేలా నిబంధనలు మార్చారు. విదేశీ పెట్టుబడులు లేదా గణనీయమైన ఆర్థిక కార్యకలాపాలు ఉన్న పన్ను చెల్లింపుదారులు జరిమానాను నివారించడానికి వివరణాత్మక సమాచారాన్ని అందించాలి. 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు పెన్షన్, వడ్డీ ద్వారా మాత్రమే ఆదాయం ఉంటుంది. ఐటీఆర్ దాఖలు చేయాల్సిన బాధ్యత నుంచి వారికి మినహాయింపు ఉంది. అయితే దీని కోసం పెన్షన్, వడ్డీ డబ్బుల నుంచి బ్యాంకులు టీడీఎస్‌ను మినహాయించడం మాత్రం తప్పనిసరి. -
ఐటీఆర్ దాఖలు చేస్తున్నారా..? ఇవి తెలుసుకోండి
గత ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు (ఐటీఆర్) చేసే సమయం దగ్గర పడింది. జులై 31లోపు ఐటీఆర్ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే చివరి వరకు వేచిచూడకుండా ఆలోపే పూర్తి వివరాలతో రిటర్నులు దాఖలు చేయడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలనే సందేహంతో ఉన్నారు. కొన్ని అంశాలు పాటించడం ద్వారా ఏ పద్ధతి ఎవరికి అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవచ్చు.ఆదాయపు పన్ను విభాగం పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం ఎన్నో మార్పులు చేస్తోంది. ముందుగానే నింపిన ఐటీఆర్ ఫారం అందుబాటులోకి తీసుకువచ్చింది. 2020 నుంచి అందుబాటులోకి వచ్చిన కొత్త పన్ను విధానం పన్ను చెల్లింపుదారులకు మరింత వెసులుబాటును కల్పించింది. అయినప్పటికీ మొదటిసారి ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారికీ, పాతవారికీ కొంత ఆందోళన ఉండటం సహజమే. అయితే దీన్ని అధిగమించాలంటే కొన్ని అంశాలపై అవగాహన అవసరం.ఆదాయంఆర్థిక సంవత్సరం 2023-24లో రిటర్న్‌లు దాఖలు చేసేవారి మొత్తం ఆదాయం ఎంతనే విషయంలో స్పష్టత ఉండాలి. వేతనం ద్వారా ఆర్జిస్తున్న ఆదాయం, ప్రయోజనాలు, వడ్డీ, డివిడెండ్లు ఇతర ఆదాయాలన్నింటినీ లెక్కలోకి తీసుకోవాలి. అప్పుడు మొత్తం ఆదాయం తెలుస్తుంది. ఇందులో నుంచి ఆదాయపు పన్ను చట్టం కల్పించిన మినహాయింపులను తీసివేస్తే పన్ను వర్తించే ఆదాయంపై స్పష్టత వస్తుంది.కొత్తదా..? పాతదా..?రిటర్నుల దాఖలు సమయంలో కొత్త పన్ను విధానం ‘డిఫాల్ట్’గా మారింది. పన్ను చెల్లింపుదారులు పాత, కొత్త పన్ను విధానంలో తమకు అనువైన దానిని ఎంచుకోవచ్చు. ఈ విధానాల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి.పాత పన్ను విధానంలో చట్టం కల్పించిన కొన్ని మినహాయింపులను క్లెయిం చేసుకోవడం ద్వారా పన్ను ఆదా చేయొచ్చు. సెక్షన్ 80సీ, సెక్షన్ 80డీ, సెక్షన్ 80ఈ, గృహరుణ వడ్డీ, ఇంటి అద్దె భత్యం లాంటివి ఇందులో క్లెయిం చేసుకునే వీలుంటుంది. ఇవి గణనీయంగా ఉన్నవారు పాత పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు.కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి మినహాయింపులూ ఉండవు. రూ.7.50లక్షల లోపు ఆదాయం (ప్రామాణిక తగ్గింపు రూ.50వేలతో కలిసి) ఉన్న వారు ఈ పన్ను విధానాన్ని ఎంచుకున్నప్పుడు ఎలాంటి పన్ను వర్తించదు. పన్ను చెల్లింపుదారులు తమకు ఏ పన్ను విధానం ఉత్తమమో తెలుసుకునేందుకు ఆదాయపు పన్ను వెబ్సైట్లో ఉన్న కాలిక్యులేటర్‌ను ఉపయోగించుకోవచ్చు.సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలివే..పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ముందు కొన్ని పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. బ్యాంకు ఖాతాల వివరాలు, ఫారం-16, ఫారం 26ఏఎస్, వడ్డీ ఆదాయం, డివిడెండ్లకు సంబంధించిన వివరాలు, ఇంటి రుణం వడ్డీ, ఇతర పెట్టుబడుల ఆధారాలు దగ్గర ఉండాలి. ఫారం-16, రిటర్నులను దాఖలు చేసిన రశీదుతో పాటు పెట్టుబడులు, ఇతర పత్రాలన్నింటినీ కలిపి జాగ్రత్త చేసుకోవాలి. దీనివల్ల అవసరమైనప్పుడు వీటిని వెంటనే తీసుకునేందుకు వీలవుతుంది.ఫారం-16: మీ జీతభత్యాలు, మూలం వద్ద పన్ను తగ్గింపు (టీడీఎస్)కు సంబంధించిన వివరాలతో యాజమాన్యం అందించే పత్రం ఇది. దీని ఆధారంగానే ఉద్యోగులు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.ఫారం 26ఏఎస్: ఒక ఆర్థిక సంవత్సరంలో మీకు వచ్చిన అన్ని ఆదాయాలు, టీడీఎస్, మూలం వద్ద పన్ను చెల్లింపు (టీసీఎస్) వివరాలు ఇందులో తెలుస్తాయి. మీ ఫారం-16, ఫారం-26ఏఎస్‌లను పోల్చి చూసుకోవాలి.వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్): వేతనం, ఇతర మార్గాల్లో ఆర్జించిన ఆదాయాలతోపాటు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్, సెక్యూరిటీల లావాదేవీలు, విదేశీ చెల్లింపులు మొదలైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఏఐఎస్ ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న ఆదాయాల ఆధారంగానే ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోని ఫారం ముందుగానే కొంత మేర నింపి ఉంటుంది. -
Income tax: నెల రోజుల్లో 6 లక్షల ఐటీ రిటర్న్స్
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ స్వీకరణ ప్రారంభమైన నెల రోజుల్లో దాదాపు 6 లక్షల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి. వీటిని ఆదాయపన్ను శాఖ అంతే వేగంగా ప్రాసెస్ చేయడం విశేషం. వెరిఫై చేసిన రిటర్న్స్‌లో దాదాపు మూడింట రెండు వంతులు ఇప్పటికే ప్రాసెస్ అయినట్లు బిజినెస్ లైన్ నివేదించింది.2024-25 అసెస్మెంట్ ఇయర్ (FY25) మొదటి నెలలో ఏప్రిల్ 29 నాటికి 5.92 లక్షలకు పైగా రిటర్న్స్ దాఖలయ్యాయి. వీటిలో 5.38 లక్షలకు పైగా వెరిఫై కాగా 3.67 లక్షల వెరిఫైడ్ రిటర్న్స్‌ను ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజున అంటే ఏప్రిల్ 1న ఐటీ శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను ప్రారంభించింది.ముందస్తుగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులు త్వరగా రీఫండ్ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పెనాల్టీ లేకుండా రిటర్న్స్‌ను రివైజ్ చేయడానికి లేదా సరిచేయడానికి తగినంత సమయం లభిస్తుంది. అయితే, ఉద్యోగులు మాత్రం కొంత సమయం వేచి ఉంటే మంచిదని సూచిస్తున్నారు. కా 2024-25 అసెస్మెంట్ ఇయర్‌కు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ. -
పన్నుదారులకు అందుబాటులో ఐటీఆర్ ఫారాలు
ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో 2024, ఏప్రిల్ 1 నుంచే ఐటీఆర్ (ఆదాయపు పన్ను రిటర్న్‌లు) 1, 2, 4, 6 ఫారాలు అందుబాటులో ఉన్నాయని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే సుమారు 23,000 రిటర్న్‌లు దాఖలయ్యాయని తెలిపింది. 2024-25 మదింపు సంవత్సరానికి (2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి) ఐటీఆర్ దాఖలు అవకాశాన్ని 2024 ఏప్రిల్ 1 నుంచే పన్ను చెల్లింపుదార్లకు అందుబాటులోకి తెచ్చామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. ఎక్కువ మంది పన్ను చెల్లింపుదార్లు వాడే ఐటీఆర్-1, ఐటీఆర్-2, ఐటీఆర్-4 ఫారాలు 2024 ఏప్రిల్ 1 నుంచే ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయని చెప్పింది. కంపెనీలు కూడా ఐటీఆర్-6 ద్వారా ఏప్రిల్ 1 నుంచే రిటర్న్‌లు దాఖలు చేసుకోవచ్చని పేర్కొంది. ఇదీ చదవండి: ఐటీ చెల్లింపులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం పన్ను చెల్లింపుదార్లకు ఆర్థిక సంవత్సరం తొలి రోజు నుంచే ఐటీ రిటర్న్‌ల దాఖలుకు ఐటీ విభాగం అవకాశం కల్పించడం ఇటీవలి కొన్నేళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. నిబంధనల సరళీకరణ, పన్ను చెల్లింపు సేవల సులభతరం దిశగా ఇది ఓ కీలక అడుగుగా చెప్పొచ్చు. ఐటీఆర్ ఫారం 1 (సహజ్), ఐటీఆర్ ఫారం 4 (సుగమ్)లను చిన్న, మధ్య తరహా పన్ను చెల్లింపుదార్లు వాడుతారు. ఐటీఆర్-2 ఫారంను నివాస స్థిరాస్తుల నుంచి ఆదాయాలు ఆర్జించే వాళ్లు దాఖలు చేస్తారు. -
ఐటీ చెల్లింపులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
ఏప్రిల్ 1 నుంచి 2024-25 కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఆ సమాచారంపై చాలామందికి సరైన అవగాహనలేక తప్పుదారి పట్టిస్తుంటారు. తాజాగా ఆదాయ పన్ను కొత్త విధానానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం ప్రచారమవుతోంది. అందరూ తప్పకుండా కొత్త పన్ను స్లాబ్‌లనే పాటించాలని పోస్టులు పెడుతున్నారు. ఈ అంశం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది. దాంతో కొత్త పన్ను విధానంలో తలెత్తిన అనుమానాలపై క్లారిటీ ఇస్తూ మంత్రిత్వశాఖ తన ‘ఎక్స్’ ఖాతాలో కొన్ని కీలకాంశాలను పేర్కొంది. ఆర్థికశాఖ వివరాల ప్రకారం..పన్ను విధానంలో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్తగా మారేదీ ఏదీ లేదు. పాత పన్ను విధానం స్థానంలో సెక్షన్ 115BAC(1A) కింద కొత్త పన్ను విధానాన్ని గతంలోనే ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి కంపెనీలు, సంస్థలు కాకుండా వ్యక్తులందరికీ కొత్త పన్ను విధానం డీఫాల్ట్‌గా వర్తిస్తుంది. కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉన్నాయి. అయితే పాత పన్ను విధానంలో కల్పిస్తున్న మినహాయింపులు, డిడక్షన్స్ (స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000, ఫ్యామిలీ పెన్షన్ రూ.15,000 మినహా) కొత్త విధానంలో లేవు. ఇదీ చదవండి: పెరిగిన టోల్ ధర.. ఏమిటీ టోల్ ట్యాక్స్? ఎందుకు చెల్లించాలి? కొత్త పన్ను విధానం ఇక నుంచి డీఫాల్ట్‌గా వర్తించనుంది. అయితే పన్ను కట్టేవారు కొత్తది లేదా పాతదాంట్లో ఏది లాభదాయకంగా ఉంటే దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. 2024-25 ఆర్థిక సంత్సరానికి సంబంధించి రిటర్నులు ఫైల్ చేసే వరకు కొత్త పన్ను విధానం నుంచి వైదొలగడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి వ్యాపార ఆదాయం లేని అర్హులైన వ్యక్తులు ప్రతి ఆర్థిక సంవత్సరానికి తమకు నచ్చిన పన్ను విధానాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. వారు ఒక ఆర్థిక ఏడాదిలో కొత్త పన్ను విధానం, మరొక ఏడాదిలో పాత పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. It has come to notice that misleading information related to new tax regime is being spread on some social media platforms. It is therefore clarified that: 👉 There is no new change which is coming in from 01.04.2024. 👉 The new tax regime under section 115BAC(1A) was… pic.twitter.com/DtKGkK0D5H — Ministry of Finance (@FinMinIndia) March 31, 2024 -
ఆదాయంలో దూసుకుపోతున్న ఏపీ
-
భారీగా పెరిగిన ట్యాక్స్ పేయర్లు! రికార్డు స్థాయిలో ఐటీఆర్‌లు
దేశంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు భారీగా పెరిగారు. అసెస్మెంట్ ఇయర్ 2023-24 కు సంబంధించి 2023 డిసెంబరు 31 నాటికి రికార్డు స్థాయిలో 8.18 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) దాఖలయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో 7.51 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ డేటాను ఉటంకిస్తూ పేర్కొంది. అసెస్మెంట్ ఇయర్ 2022-23 కి దాఖలు చేసిన మొత్తం ఐటీఆర్‌ల కంటే ఇది 9 శాతం ఎక్కువని సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అసెస్మెంట్ ఇయర్ అనేది గత ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయాన్ని, ఖజానాకు వచ్చిన ఆదాయాన్ని ప్రతిబింబిస్తుంది. ఇదీ చదవండి: ఇంకా ఉన్నాయా..? రూ.2000 నోట్లపై ఆర్బీఐ ప్రకటన ఆర్థిక శాఖ ప్రకటన ప్రకారం.. ఇక ఇదే కాలంలో దాఖలు చేసిన మొత్తం ఆడిట్ రిపోర్టులు, ఇతర ఫారాల సంఖ్య 1.6 కోట్లుగా ఉంది, గత సంవత్సరం ఇదే కాలంలో 1.43 కోట్ల ఆడిట్ నివేదికలు, ఫారాలు దాఖలయ్యాయి. -
2022–23లో ఐటీఆర్ ఫైలింగ్ @ 7.40 కోట్లు: కేంద్రం
ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చతుర్వేది లోక్‌సభలో ఒక కీలక ప్రకటన చేస్తూ, మార్చితో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) 7.40 కోట్ల మంది ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేశారని, ఇందులో 5.16 కోట్ల మంది ‘జీ ట్యాక్స్ లయబిలిటీ’లో ఉన్నారని పేర్కొన్నారు. గడచిన ఐదేళ్లలో ఐటీఆర్‌లు ఫైల్ చేస్తున్న వ్యక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోందని తెలిపారు. 2018–19లో వీరి సంఖ్య 6.28 కోట్లయితే, 2019–20లో 6.47 కోట్లకు చేరిందన్నారు. 2020–21లో ఈ సంఖ్య 6.72 కోట్లకు చేరితే 2021–22లో ఇది 6.94 కోట్లకు పెరిగిందన్నారు. 2022–23లో 7.40 కోట్లకు రిటర్నులు ఫైల్ చేసిన వారి సంఖ్య పెరిగినట్లు వివరించారు. ‘జీరో ట్యాక్స్’ వ్యక్తుల సంఖ్య 2.90 కోట్ల నుంచి 5.16 కోట్లకు అప్ ఇక జీరో ట్యాక్స్ లయబిలిటీలో ఉన్న వారి సంఖ్య 2019–20లో 2.90 కోట్ల మంది ఉంటే, 2022–23లో ఈ సంఖ్య 5.16 కోట్లకు ఎగసినట్లు పేర్కొన్నారు. ‘ప్రత్యక్ష పన్ను వసూళ్లు– దాఖలైన ఆదాయపు పన్ను రిటర్న్‌ల సంఖ్యలో దామాషా పెరుగుదల ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. సంబంధిత మదింపు సంవత్సరానికి వర్తించే పన్ను రేటు, చట్టం ప్రకారం అనుమతించదగిన తగ్గింపులు/ మినహాయింపులు, ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలు ఆర్థిక వృద్ధి వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది’’ అని మంత్రి పేర్కొన్నారు. కాగా, 2017–18లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.11.38 లక్షల కోట్లయితే, 2022–23లో ఈ పరిమాణం 16.63 లక్షల కోట్లకు ఎగసిందని ఆయన తెలిపారు. -
ఆదాయపు పన్ను శాఖ పనితీరుపై స్పందించిన నటుడు మాధవన్
ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుచేసిన మూడు వారాల్లోనే తనకు నగదు రీఫండ్ అయిందని నటుడు మాధవన్ అన్నారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఆదాయపు పన్ను శాఖ పనితీరును ప్రశంసించారు. మాధవన్‌కు చెందిన ల్యూకోస్ ఫిల్మ్స్ కంపెనీ ఇటీవల ఆదాయపు పన్ను రిటర్న్న్ దాఖలు చేసింది. ఎలాంటి చిక్కులు లేకుండా మూడు వారాల్లోనే ఆదాయపు పన్ను శాఖ నుంచి రీఫండ్ పొందడంతో ఆయన స్పందించారు. అక్టోబర్ 31 వరకు రికార్డు స్థాయిలో 7.85 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ ఇటీవల తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసిన మొత్తం 7.78 కోట్ల ఐటీఆర్‌లతో పోలిస్తే ఇదే ఆల్ టైమ్ హై అని ఐటీ శాఖ చెప్పింది. The income tax refund for our company was received within 3 weeks after filing of return for AY 2023-24. The speed and promptness is simply unheard of ..The efficiency and transparency of the income tax department is unbelievable. Totally impressed and flabbergasted .… — Ranganathan Madhavan (@ActorMadhavan) November 13, 2023 -
ఆదాయపన్ను రిటర్నుల్లో గణనీయ పెరుగుదల
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేసే వారి సంఖ్య ఎనిమిదేళ్ల కాలంలో 90 శాతం పెరిగిందని, 2021–22 అసెస్మెంట్ సంవత్సరంలో (2020–21 ఆర్థిక సంవత్సరానికి) 6.37 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైనట్టు ఆదాయపన్ను శాఖ తెలిపింది. వ్యక్తులు జారీ చేసే రిటర్నులు 2013– 14 అసెస్మెంట్ సంవత్సరానికి 3.36 కోట్లుగా ఉంటే, అది 2021–22 నాటికి 6.37 కోట్లకు చేరినట్టు వెల్లడించింది. 2023–24 అసెస్మెంట్ సంవత్సరం (2022–23 ఆర్థిక సంవత్సరం)లోనూ 7.41 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైనట్టు తెలిపింది. ఇందులో మొదటిసారి ఐటీఆర్‌లు దాఖలు చేసిన వారు 53 లక్షల మంది ఉన్నట్టు పేర్కొంది. ముఖ్యంగా రూ.5–10 లక్షల ఆదాయం వర్గం వారి రిటర్నులు.. 2013–14 అసెస్మెంట్ సంవత్సరం నుంచి 2021–22 అసెస్మెంట్ సంవత్సరానికి 295 శాతం పెరిగాయి. రూ.10–25 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారి రిటర్నులు 291 శాతం పెరిగాయి. ఈ వివరాలను ఆదాయపన్ను శాఖ అత్యున్నత నిర్ణయ విభాగం సీబీడీటీ ప్రకటించింది. రూ.5 లక్షల్లోపు ఆదాయం కలిగి రిటర్నులు వేసే వారి సంఖ్య 2.62 కోట్ల నుంచి 3.47 కోట్లకు పెరిగింది. స్థూల ఆదాయం పరంగా టాప్ 1 శాతం పరిధిలోని పన్ను రిటర్నులు వేసే వారు 15.9 శాతం నుంచి 14.6 శాతానికి తగ్గారు. దిగువ నుంచి 25 శాతం ఆదాయం కలిగిన వారి రిటర్నులు 8.3 శాతం నుంచి 8.4 శాతానికి పెరిగాయి. ఇక మధ్యస్థ ఆదాయం కలిగిన 74 శాతం గ్రూప్ పరిధిలోని పన్ను చెల్లింపుదారుల రిటర్నులు 75.8 శాతం నుంచి 77 శాతానికి పెరిగాయి. మధ్య తరగతి వాసుల రిటర్నులు ప్రధానంగా పెరిగినట్టు తెలుస్తోంది. -
ఆదాయపుపన్ను శాఖ సంచలన నిర్ణయం..అపర కుబేరులకు ఝలక్
ఆదాయపుపన్ను కట్టనివారిపై సంబంధిత శాఖ కఠినంగా వ్యవహరిస్తుంది. అందులో భాగంగా నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని పన్ను ఎగవేతదారుల ఆట కట్టిస్తోంది. ‘360డిగ్రీ ప్రొఫైలింగ్’ ద్వారా అపరకుబేరులు కట్టే పన్ను ఎగవేతను అరికట్టేలా చర్యలు తీసుకుంటుంది. గడిచిన బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయంపై అత్యధిక పన్ను రేటును 42.74 నుంచి 39 శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. అయినప్పటికీ అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల(హై నెట్‌వర్త్ ఇండివిడ్యూవల్స్) పన్ను ఎగవేతను అరికట్టలేకపోవడంపై ఆదాయపు పన్ను శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగా తక్కువ మొత్తంలో ట్యాక్స్ చెల్లిస్తూ ఎగవేతకు పాల్పడుతున్న కోటీశ్వరులపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. రూ.1కోటి కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగి ఉన్న లేదా అందుకు అవకాశం ఉన్న వ్యక్తులను '360-డిగ్రీల ప్రొఫైలింగ్' చేయనున్నట్లు ఐటీ విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఆయా వ్యక్తుల పెట్టుబడి ప్రొఫైల్, ఖర్చులు, అసెస్మెంట్ కోసం ఆదాయ వనరులను ట్రాక్ చేస్తోందని వెల్లడించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల 61 వేల మంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌ల్లో రూ.ఒక కోటి కంటే ఎక్కువ ట్యాక్సబుల్ ఆదాయాన్ని చూపించారు. అయితే ఈ ఆదాయం మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా. ఐటీ స్క్రీనింగ్ పూర్తయిన తర్వాత తమ ఆదాయాన్ని తక్కువగా నివేదించిన వారికి నోటీసులు పంపనున్నట్లు సమాచారం. -
Income Tax: బకాయిలుంటే ట్యాక్స్ రీఫండ్‌లో కటింగ్!
ఆదాయపు పన్ను బకాయిలను వసూలు చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ (Income Tax Department) సరికొత్త ప్రణాళిక రచించింది. బకాయిలున్న పన్ను చెల్లింపుదారులు తమకు రావాల్సిన ట్యాక్స్ రీఫండ్ (Tax refund) తో బకాయిలను సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని ఆదాయపు పన్ను శాఖ కల్పించింది. ఆదాయపు పన్ను రిటర్న్‌ల (ITR) ప్రాసెసింగ్‌ను వేగవంతంగా పూర్తి చేసేందుకు, రీఫండ్ల జారీని త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఐటీ శాఖ తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. (New Rules: అక్టోబర్ 1 నుంచి అమలయ్యే కొత్త మార్పులు, నిబంధనలు ఇవే..) పన్ను బకాయిలు కూడా అధిక మొత్తంలో ఉన్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పెండింగ్‌లో ఉన్న బకాయిలను సర్దుబాటు చేసి ట్యాక్స్ రీఫండ్లను సకాలంలో జారీ చేయడానికి సహకరించాలని కోరింది. బకాయిల సర్దుబాటుపై తమ సమ్మతిని తెలియజేయడానికి ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 245(1) ట్యాక్స్ పేయర్లకు అవకాశం కల్పిస్తుంది. దీని ప్రకారం.. బకాయిల సర్దుబాటుపై తమ అంగీకరిస్తున్నారో.. లేదో అని తెలియజేయాల్సి ఉంటుంది. (RBI Rules: వారికి 6 నెలలే సమయం.. ఆర్బీఐ కీలక నిబంధనలు) 2023-24 అసెస్మెంట్ ఇయర్ కోసం 7.09 కోట్ల రిటర్న్‌లు దాఖలుకాగా 6.96 కోట్ల ఐటీఆర్‌లను ఆదాయపు పన్ను శాఖ వెరిఫై చేసింది. ఇక ఇప్పటివరకు వీటిలో 2.75 కోట్ల రిటర్న్స్‌కు ట్యాక్స్ రీఫండ్‌ను చెల్లించగా 6.46 కోట్ల రిటర్న్‌లను ప్రాసెస్ చేసినట్లు ఐటీ శాఖ పేర్కొంది. -
టాక్స్ రిఫండ్స్: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త!
Income tax refund: ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ITRలు) దాఖలు చేసిన తర్వాత టాక్స్ రిఫండ్స్ విషయంలో ఆదాయపన్ను కీలక నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించిన యావరేజ్ ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించాలని ఆదాయపు పన్ను శాఖ యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న 16 రోజుల నుంచి 10 రోజులకు తగ్గింపుపై పన్ను శాఖ ఆలోచిస్తోంది. అంతేకాదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కొత్త టైమ్‌లైన్‌ను అమలు చేయాలని భావిస్తున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. కాగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి పెనాల్టీ లేకుండా ఐటీఆర్ ఫైల్ చేసేందుకు గడువుజూలై 31, 2023తో ముగిసిన సంగతి తెలిసిందే. తాజా లెక్కల ప్రకారం చాలామంది ఇప్పటికే ఐటీఆర్ ఫైల్ చేసిన పన్ను చెల్లింపుదారులు టాక్స్ రిఫండ్స్ దాదాపు అందుకున్నారు. అయితే మరికొంతమంది మాత్రం టాక్స్ రిఫండ్ కోసం ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది.వార్షిక ITRను ఫైల్ చేసేటప్పుడు అసెస్సీ ఉపయోగించే ఎంపికపై ఆధారపడి, రీఫండ్ ఎలక్ట్రానిక్ మోడ్ అంటే ఖాతాకు నేరుగా క్రెడిట్ లేదా రీఫండ్ చెక్ ద్వారా గానీ చెల్లిస్తారు. ఈ రీఫండ్ ప్రాసెస్‌ను సంబంధిత పోర్టల్‌లో చెక్ చేసుకోవచ్చు. రీఫండ్ ఆలస్యం అయితే ఏమి చేయాలి? ప్రతిస్పందన కోరుతూ ఆదాయపు పన్ను శాఖ నుండి ఏదైనా కమ్యూనికేషన్ వచ్చిందా లేదా అని ఈమెయిల్లో చెక్ చేసుకోవాలి ఒక వేళా అలాంటి ఇమెయిల్ ఎదైనా వస్తే వీలైనంత త్వరగా ప్రతిస్పందించడం చాలా ముఖ్యం. ఒకవేళ ITR స్టేటస్ రీఫండ్ గడువు ముగిసినట్లు చూపితే, 90 రోజుల చెల్లుబాటు వ్యవధిలోపు చెల్లింపు కోసం వాపసు సమర్పించబడలేదని అర్థం.ఈ సందర్బంగా టాక్స్‌పేయర్ రీఫండ్ రీ-ఇష్యూ రిక్వెస్ట్ పంపవచ్చు. రీఫండ్ స్టేటస్‌పై చాలా క్వెరీలువస్తున్నాయని, ఇ-ఫైలింగ్ తర్వాత తిరిగి చెల్లించాల్సిన పన్ను చెల్లింపుదారులకు చెల్లింపును వేగవంతం లోకి ఇది మంచి చర్య అని క్లియర్ ఫౌండర్సీఈవో అర్చిత్ గుప్తా అన్నారు. ఈఏడాది పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు సకాలంలో దాఖలు చేశారని (31 జూలై 2023 వరకు 6.77 కోట్ల ఐటీఆర్‌లు) అందువల్ల వాపసులను త్వరగా ప్రాసెస్ చేస్తారనే అంచనా ఉందన్నారు. -
కోటీశ్వరులు పెరిగారు.. లక్షాధికారులు తగ్గారు!
I-T returns filed for income above Rs 1 crore: దేశంలో కోటీశ్వరుల సంఖ్య భారీగా పెరిగింది. ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ డేటా ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఆర్జించినట్లు 2.69 లక్షల మందికి పైగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. ఇది కోవిడ్ మహమ్మారి సంక్షోభం 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 49.4 శాతం పెరిగింది. మరోవైపు అదే కాలానికి రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ కేవలం 1.4 శాతం మాత్రమే పెరిగాయి. ఆర్థిక సంవత్సరాల వారీగా చూస్తే.. రూ.కోటి పైగా ఆదాయానికి దాఖలైన ట్యాక్స్ రిటర్న్స్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి 2.69 లక్షలు, 2021-22 ఏడాదికి 1.93 లక్షలు, 2018-19 ఆర్థిక సంవత్సరానికి 1.80 లక్షలు ఉన్నాయి. అల్పాదాయ వర్గాలపై కోవిడ్ దెబ్బ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న ట్యాక్స్ ఫైలర్లు దాఖలు చేసిన ఐటీ రిటర్న్‌ల సంఖ్య 2019-20తో పోల్చితే 41.5 శాతం పెరిగింది. కానీ రూ. 5 లక్షలు, ఆలోపు ఆదాయ విభాగంలో కేవలం 0.6 శాతం పెరిగింది. కోవిడ్ మహమ్మారి సంక్షోభం దెబ్బ వివిధ ఆదాయ వర్గాలపై ఎలా ఉందో ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 5 లక్షల వరకు ఆదాయ వర్గం మినహా, ఇతర అన్ని ఆదాయ వర్గాల ట్యాక్స్ రిటర్న్స్ సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 5 లక్షల వరకు ఆదాయానికి దాఖలు చేసిన ఐటీ రిటర్న్‌లు అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 4.94 కోట్ల నుంచి 5.68 కోట్లకు పెరిగాయి. అయితే, ఇతర ఆదాయ వర్గాల రిటర్న్‌లలో తగ్గుదల కనిపించింది. రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయానికి దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌ల సంఖ్య క్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న 1.90 లక్షల నుంచి 1.46 లక్షలకు పడిపోయింది. రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి మధ్య ఆదాయానికి ఐటీఆర్‌ల సంఖ్య 2.83 లక్షల నుంచి 2.25 లక్షలకు తగ్గాయి. రూ. 5 లక్షల-10 లక్షల మధ్య ఆదాయానికి ఫైల్ చేసిన ట్యాక్స్ రిటర్న్స్ 1.05 కోట్ల నుంచి 99.36 లక్షలకు తగ్గాయి. -
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదా ?..అయితే మీకు జరిమానా
-
పనిచేయని పాన్ కార్డులపై ఐటీ శాఖ క్లారిఫికేషన్
ఆధార్ కార్డ్‌తో లింక్ చేయని కారణంగా పనిచేయకుండా పోయిన (ఇనాపరేటివ్) పాన్ కార్డులు, ఇతర కారణాలతో ఇన్‌యాక్టివ్‌గా మారిన పాన్ కార్డులు రెండూ ఒకటి కావు. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైలింగ్ సందర్భంగా ఇనాపరేటివ్, ఇనాక్టివ్ పాన్ కార్డుల మధ్య తేడా తెలియక తికమక పడుతున్న ప్రజలకు ఆదాయపు పన్ను శాఖ క్లారిఫికేషన్ ఇచ్చింది. ‘పనిచేయని (ఇనాపరేటివ్) పాన్ కార్డు, ఇన్‌యాక్టివ్ పాన్ కార్డు రెండూ వేరు వేరు. పాన్ కార్డు పనిచేయక పోయినా ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయవచ్చు’ అని ఐటీ శాఖ ట్విటర్లో పోస్టు ద్వారా తెలియజేసింది. అయితే పనిచేయని పాన్లకు పెండింగ్‌లో ఉన్న రీఫండ్లు, వాటి మీద వడ్డీలు చెల్లింపులు సాధ్యం కావని స్పష్టం చేసింది. ఇదీ చదవండి ➤ Inoperative PAN: పాన్ కార్డ్ పనిచేయడం లేదా..? అయితే ఈ లావాదేవీలు చేయలేరు! అలాగే ఇనాపరేటివ్ పాన్ ఉన్నవారికి టీడీస్ (ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్), టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్) లను అధిక రేటుతో విధించనున్నట్లు పేర్కొంది. కాగా ఆధార్ కార్డుతో పాన్ కార్డ్ లింక్ చేయడానికి గడువు జూన్ 30తో ముగిసింది. ఎన్ఆర్ఐ పాన్లపై స్పష్టత ఎన్ఆర్ఐలు, విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయులు తమ పాన్ ఇన్ఆపరేటివ్గా (పనిచేయకపోతే) మారిపోతే, నివాస ధ్రువీకరణ పత్రాలతో అసెసింగ్ అధికారులను సంప్రదించాలని ఆదాయపన్ను శాఖ సూచించింది. తమ పాన్లు పనిచేయకుండా పోవడం పట్ల కొందరు ఎన్ఆర్ఐలు, విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయుల (ఓసీఐలు) నుంచి ఆందోళన వ్యక్తమైనట్టు తెలిపింది. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఐటీఆర్ దాఖలు చేసిన వారి స్టేటస్ వివరాలను తామే జురిస్డిక్షనల్ అసెసింగ్ ఆఫీసర్లకు పంపించినట్టు స్పష్టం చేసింది. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో రిటర్నులు దాఖలు చేయని లేదా తమ నివాస హోదాను అప్డేట్ చేయని వారి పాన్లు పనిచేయకుండా పోయినట్టు ఆదాయపన్ను శాఖ తెలిపింది. Dear Taxpayers, Concerns have been raised by certain NRIs/ OCIs regarding their PANs becoming inoperative, although they are exempted from linking their PAN with Aadhaar. Further, PAN holders, whose PANs have been rendered inoperative due to non-linking of PAN with Aadhaar,… — Income Tax India (@IncomeTaxIndia) July 18, 2023 -
ఐటీఆర్ గడువు పొడిగింపు పరిశీలనలో లేదు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను చెల్లింపుదారులు వీలైనంత ముందుగా పన్ను రిటర్నులను (ఐటీఆర్‌లు) దాఖలు చేసుకోవాలని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సంయజ్ మల్హోత్రా సూచించారు. జూలై 31గా ఉన్న ఐటీఆర్‌ల దాఖలు గడువు పొడిగింపును ప్రభుత్వం పరిశీలించడం లేదని స్పష్టం చేశారు. గతేడాది కంటే ఎక్కువ మంది రిటర్నులు దాఖలు చేస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. గతేడాది జూలై 31 నాటికి 5.83 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. ‘‘పన్ను రిటర్నులను దాఖలు చేసే వారికి మేము ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే గతేడాది కంటే చాలా వేగంగా రిటర్నులు దాఖలు అవుతున్నాయి. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా, గడువు పొడిగింపుపై ఆశలు పెట్టుకోకుండా రిటర్నులు దాఖలు చేసుకోవాలన్నది మా సూచన. జూలై 31కి ఇంకా ఎన్నో రోజులు లేనందున వెంటనే రిటర్నులు దాఖలు చేసుకోవాలి’’అని సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. పన్ను వసూళ్ల లక్ష్యంపై మాట్లాడుతూ.. 10.5 శాతం వృద్ధి రేటు స్థాయిలోనే ఆదాయం ఉంటుందన్నారు. జీఎస్టీ పరంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 12 శాతం ఆదాయం వృద్ధి చెందినట్టు చెప్పారు. 2023–24 బడ్జెట్ ఆధారంగా చూస్తే స్థూలంగా రూ.33.61 లక్షల కోట్ల పన్ను ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో రూ.18.23 లక్షల కోట్లను కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయపన్ను రూపంలో వసూలు చేయాలన్నది లక్ష్యం. గతేడాదితో పోలిస్తే 10.5 శాతం ఎక్కువ. -
పన్ను రీఫండ్‌ను పెంచుకునేందుకు పంచ సూత్రాలు ఇవే..
Income tax return filing, maximise tax refund: ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలుకు గడువు సమీపిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2023-24) ఐటీఆర్ ఫైల్ చేయడానికి జూలై 31తో గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో గుడువు తేదీని గుర్తు చేస్తూ ఆదాయపు పన్ను శాఖ తాజాగా ట్వీట్ చేసింది. తమ ఆదాయాలకు తగిన దాని కంటే ఎక్కువగా పన్నులు చెల్లించిన ట్యాక్స్ పేయర్లు రీఫండ్ పొందవచ్చు. ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో రీఫండ్ మొత్తాన్ని లెక్కించి ఐటీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ప్రాసెస్ చేస్తారు. ఆ తర్వాత రీఫండ్ మొత్తం సంబంధిత ట్యాక్స్ పేయర్ల అకౌంట్లలో జమవుతుంది. ఫారమ్ 16లో చూపిన దానికంటే ఎక్కువగా పన్ను ఆదా చేసుకునే అవకాశం లేదనే అపోహ చాలా మందిలో ఉందని నిపుణులు చెబుతున్నారు. పన్ను ఆదాకు ఫారమ్ 16 ఒక్కటే మార్గం కాదు. రిటర్న్‌లను దాఖలు చేయడానికి ముందు 26AS, వార్షిక సమాచార ప్రకటన (AIS), పన్ను చెల్లింపుదారుల సమాచార సారాంశం (TIS)తో ఆదాయ వివరాలను చెక్ చేయండి. 26ASలో టీడీఎస్ ప్రతిబింబిస్తే టీడీఎస్‌ని క్లెయిమ్ చేయవచ్చు లేదా చెల్లించాల్సిన పన్ను మొత్తానికి సర్దుబాటు చేసుకోవచ్చు. ఇదీ చదవండి ➤ ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్ వార్నింగ్ ఐటీఆర్ దాఖలు సమయంలో ఈ కింది ఐదు సూత్రలను పన్ను రీఫండ్‌ను పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. సకాలంలో ఐటీఆర్ ఫైలింగ్ పెనాల్టీల నుంచి తప్పించుకోవడానికి మీ రిటర్న్‌లను సకాలంలో ఫైల్ చేయడం చాలా ముఖ్యం. ఇది గరిష్ట రీఫండ్ పొందడానికి సులభమైన మార్గాలలో ఒకటి. ఐటీ చట్టంలోని సెక్షన్ 139(1) కింద నిర్దేశించిన తేదీలోగా పన్ను చెల్లింపుదారు రిటర్న్ ఫారమ్‌ను సమర్పించాలి. ఐటీఆర్ ఫైల్ చేయడం ఆలస్యమైతే జరిమానా చెల్లించవలసి ఉంటుంది. సరైన పన్ను విధానం ఎంపిక మీ నచ్చిన, మీ అవసరాలకు సరిపోయే పన్ను విధానాన్ని ఎంచుకుని ఐటీఆర్ ఫైల్ చేయండి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఇన్సూరెన్స్ పాలసీ లేదా ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్‌లు (ELSS), హోమ్ లోన్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్‌పై వడ్డీ వంటి దీర్ఘకాలిక పెట్టుబడులు లేనివారికి కొత్త పన్ను విధానం సరిపోతుంది. తగ్గింపులు, మినహాయింపులకు బదులుగా ఇందులో తక్కువ పన్ను రేట్లు ఉంటాయి. ఈ-రిటర్న్ ధ్రువీకరణ ఐటీఆర్ ఫైల్ చేసిన 30 రోజులలోపు పన్ను రిటర్న్‌ని ధ్రువీకరించాలి. రిటర్న్ ధృవీకరించని పక్షంలో దాన్ని చెల్లనిదిగా పరిగణిస్తారు. చివరి తేదీ దాటినట్లయితే మళ్లీ ఐటీఆర్ సమర్పించాలి. ఆధార్‌తో లింక్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ, నెట్ బ్యాంకింగ్, బ్యాంక్ అకౌంట్, ఏటీఎం ద్వారా ఎలక్ట్రానిక్ ధ్రువీకరణ కోడ్ వంటి మార్గాల్లో ఈ-రిటర్న్ ధ్రువీకరణ పూర్తి చేయవచ్చు. తగ్గింపులు, మినహాయింపుల క్లెయిమ్ క్లెయిమ్ చేయగల తగ్గింపులు, మినహాయింపులను గుర్తించాలి. ఇవి మొత్తం పన్ను విధించదగిన ఆదాయాన్ని తగ్గిస్తుంది. ట్యాక్స్ రీఫండ్‌ను పెంచుతుంది. పీపీఎఫ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, నేషనల్ పెన్షన్ స్కీమ్, లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, గృహ రుణంపై వడ్డీ వంటి వాటితో ప్రామాణిక తగ్గింపులు పొందవచ్చు. ఫారమ్ 16లో ప్రతిబింబించే తగ్గింపులను మాత్రమే లెక్కించకూడదు. అందులో ప్రతిబింబించని అనేక పన్ను పొదుపు ఖర్చులను కలిగి ఉండవచ్చు. ఉదాహరణకు పిల్లల పాఠశాల ట్యూషన్ ఫీజు. ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు పన్ను ఆదా ఖర్చులు, పెట్టుబడులను పునఃపరిశీలించడం మంచిది. బ్యాంక్ ఖాతా ధ్రువీకరణ మీ బ్యాంక్ ఖాతాను ప్రామాణీకరించడంతోపాటు ఆదాయపు పన్ను రిటర్న్ పోర్టల్‌లో సరిగ్గా ధ్రువీకరించినట్లుగా నిర్ధారించుకోండి. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ధ్రువీకరించిన ఖాతాలకు మాత్రమే ఐటీ అధికారులు క్రెడిట్ రీఫండ్లు చేస్తారు. కాబట్టి ధ్రువీకరణ ప్రక్రియ చాలా ముఖ్యం. రిటర్న్‌లు దాఖలు చేసే ముందే మీ అకౌంట్ ధ్రువీకరణ చేయాల్సి ఉంటుంది. Do finish this important task and unwind this weekend. The due date to file your #ITR for AY 2023-24 is 31st July, 2023.#FileNow and spend your weekend without any worry. Pl visit https://t.co/GYvO3mStKf#ITD pic.twitter.com/ngLwU8Hzbi — Income Tax India (@IncomeTaxIndia) July 15, 2023 -
IT Returns: అందుబాటులోకి ఐటీఆర్-ఫారమ్‌లు.. గడువు తేదీ గుర్తుందిగా!
న్యూఢిల్లీ: ఆన్లైన్లో ఈ ఫైలింగ్ పోర్టల్‌పై ఆదాయపన్ను రిటర్నుల పత్రాలు (ఐటీఆర్) 1, 4 లను ఆదాయపు పన్ను శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యక్తులు, చిన్న వ్యాపారులు, వృత్తి నిపుణులు వీటిని దాఖలు చేస్తుంటారు. ఇతర ఐటీఆర్ పత్రాలను సైతం త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్‌ల దాఖలు గడువు జూలై 31గా ఉంది. ఐటీఆర్ 1ను వ్యక్తులు, వేతన జీవులు, వృద్ధులు దాఖలు చేస్తుంటారు. ఐటీఆర్4ను వ్యాపారులు, వృత్తి నిపుణులు దాఖలు చేస్తుంటారు. (వార్నీ.. రేఖలా మారిపోయిన అమితాబ్, అందంగా సల్మాన్ ఖాన్) ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో ఐటీఆర్ ఫారమ్‌లతోపాటు ఫారమ్-16 జీతం వివరాలు, పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ ఆదాయాలకు సంబంధించిన సమాచారంతో కూడిన ఎక్సెల్ యుటిలిటీ షీట్ వస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకుని అవసరమైన సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత తిరిగి ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి! -
ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ఇవి ఖచ్చితంగా చెక్ చేసుకోండి
-
ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులకు ముఖ్య గమనిక!
మీ అందరికీ ముందుగా నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. ’శోభకృత్’ సంవత్సరంలో మీరింగా శోభాయమానంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ మధ్యే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక ప్రకటన జారీ చేసింది. గతంలో తెచ్చిన మార్పుల ప్రకారం మీరు రిటర్నుని అప్డేట్ చేసుకోవచ్చు. ఈ రిటర్ను పేరు ఐటీఆర్యూ ఒకప్పుడు రివైజ్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అది లేదు. దానికి బదులుగా వచ్చింది. ఇంద్రుడిని సహస్రాక్షుడు అని కూడా అంటారు. అంటే వేయి కన్నులవాడు అని అర్థం. ప్రస్తుతం డిపార్టుమెంటు వారు కూడా అదే అవతారం ఎత్తారు. వారి దగ్గరున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా అసెసీల గురించి ఎంతో ఎక్కువ సమాచారాన్ని సేకరించారు. ఇందులో రెండు రకాలుంటాయి. మనం అసలు రిపోర్ట్ చేయనివి ఒకటైతే.. రెండోది.. సగం, తక్కువగా, కొంత మాత్రమే రిపోర్ట్ చేసినవి. గతంలో 26 అ లో సమాచారం ఉండేది. ఇప్పుడు అఐ ద్వారా సరైనది, సమగ్రమైనది, సంపూర్ణంగా ఉండే సమాచారాన్ని సేకరించారు. 2019 ఏప్రిల్ 1 నుంచి మన లావాదేవీలకు సంబంధించిన లావు చిట్టా. ఇది ప్రస్తుతం మీ ఖాతాలో ప్రతిబింబిస్తుంది. మీరు చెక్ చేసుకోండి. గడిచిన చరిత్ర.. కుండలీకరణం. 2019–20 ఆర్థిక సంవత్సరానికిగాను 68,000 మంది ఆర్థిక జాతకం బయటపడింది. వీరందరికీ బొట్టుపెట్టి పిలిచి ‘ఇదిగో మీ జాతకం‘ అని చూపించారు. చిలక్కి చెప్పినట్లు చెప్పారు. కేవలం 35,000 మంది మాత్రమే బదులుగా తమ రిటర్నులను అప్డేట్ చేసుకున్నారు. అంటే గతంలో వేసిన దానికి, అఐ లో సమాచారంతో పోల్చి చూసుకుని తమ రిటర్నులను సవరించుకున్నారు. సవరణ.. అంటే ఆదాయాన్ని పెంచి చూపించి వేశారు. మిత్ర లాభంలో మూడు చేపల కథలో రెండో చేప ’కుశాగ్రబుద్ధి’ లాంటి వాళ్లు, మూడవ చేపలాగా మందబుద్ధులైన మిగతావారికి మరో అవకాశం ఇస్తూ డిపార్టుమెంటు తాజా ప్రకటన చేసింది. వారి మీద కఠిన చర్యలు తీసుకునే ముందు ఇది ఒక హెచ్చరిక. ఈ ప్రచారంలో భాగంగానే పేరు పేరున ‘2022 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31 వరకు మీ ఖాతాలో ముఖ్యమైనవి, పెద్దవి అయిన ఆర్థిక వ్యవహారాలు జరిగాయి. ఆ వివరాలను పదిలంగా మా దగ్గర భద్రపరిచాం. వెంటనే చూడండి. పరికించండి. పరీక్షించండి. మా పోర్టల్‌లో లాగిన్ అవ్వండి. ఇవిగో మీరు నడిపించిన వ్యవహారాలు. అవసరమైతే తగిన అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించండి‘ అంటూ ఎంతో మందికి వర్తమానం పంపించారు. అలా వచ్చిన వారు వెంటనే లాగిన్ అయి చెక్ చేసుకోండి. అవసరం అయితే వాటిని పరిగణనలోకి తీసుకోండి. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించండి. ఇప్పటికే వాటిని పరిగణించి, తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే.. మిత్రలాభంలో మొదటి చేప ‘దూరదర్శి‘లాగా ఊపిరి పీల్చుకోవచ్చు. -
ఆదాయపు పన్ను రిటర్న్ ఫారమ్‌లను విడుదల చేసిన ఐటీ శాఖ!
మార్చి 31తో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు కొత్త బడ్జెట్‌కు సంబంధించిన ఆలోచనలు, సమావేశాలు, సంప్రదింపులు, ప్లానింగ్ విషయాలు .. మొదలైన వాటిని పక్కన పెట్టండి. 2023 ఏప్రిల్ 1 నుంచి వాటి గురించి ఆలోచిద్దాం. ఈలోగా 2023 మార్చి 31లోపల మనం ఈ ఆర్థిక సంవత్సరానికి అవసరమైన ఆలోచనలు, సమాలోచనలు, ప్లానింగ్ ఆలోచిద్దాం. 2023 మార్చి 31తో పూర్తయ్యే ఆర్థిక సంవత్సరానికి కొంత మందికి గడువు తేదీ 31–07–2023; మరికొందరికి సెప్టెంబర్ నెలాఖరు. అందుకు గాను ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరి 10న కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లో మీరు మార్చి నెల తర్వాత డిపార్టుమెంటు వారికి దాఖలు చేయాల్సిన రిటర్నుల గురించి .. ఫారమ్‌లు, వాటిని దాఖలు చేసినప్పుడు మీకు వచ్చే అక్నాలెడ్జ్మెంట్ గురించి.. నోటిఫై చేశారు. ►ఈ ఫారాలు 01–04–2023 నుండి అమల్లోకి వస్తాయి. ►డిపార్టుమెంట్ వారి భాష ప్రకారం 2023–24 అసెస్మెంట్ సంవత్సరానికి వర్తించేవి అనాలి. ►ఈ ఫారాలు ఏమిటంటే..ఐటీఆర్ 1 సహజ్, ఐటీఆర్ 2, ఐటీఆర్ 4 సుగమ్, ఐటీఆర్ 5,ఐటీఆర్ 6 ►పైన పేర్కొన్న ఫారాలు దాఖలు చేస్తే మీకు వచ్చే ఐటీ అక్నాలెడ్జ్మెంటు ఐటీఆర్విని కూడా నోటిఫై చేశారు. ► అన్ని ఫారాల్లోనూ షెడ్యూళ్లు ఉన్నాయి. ►2022 అక్టోబర్‌లోనే రూల్స్ విడుదల చేశారు. ►ఉద్యోగస్తులకు సర్క్యులర్ డిసెంబర్లోనే విడుదల చేశారు. ►‘‘డౌన్లోడ్స్’’ కింద ఐటీఆర్ ఆఫ్‌లైన్ యుటిలిటీ ద్వారా ఆఫ్‌లైన్ సదుపాయం ఉంది. ►సాంకేతికంగా సులువుగా, త్వరగా వేసేలా తగిన చర్యలు తీసుకున్నారు. ►ప్రస్తుతం ఒకొక్కప్పుడు తప్పులు దొర్లుతున్నాయి. ‘డేటా’ .. అంటే సమాచారమనేది సిస్టంలోకి ప్రీ–ఫిల్ అవడం లేదు. పూర్తి సమాచారం లేదని చూపుతోంది. ►ఎక్సెల్ వెర్షన్లో ‘సబ్మిట్’కి ఎక్కువ వ్యవధి తీసుకుంటోంది. ►షెడ్యూల్స్ నింపేటప్పుడు కొన్ని తప్పులు దొర్లుతున్నాయి. షెడ్యూల్స్ ఎంపిక చేసేటప్పుడు గందరగోళం, గజిబిజి ఏర్పడుతోంది. స్పష్టత ఉండటం లేదు. ఒక్కొక్కప్పుడు మొరాయిస్తోంది. ► ఇలాంటివి ఉండవని ఆశిద్దాం. ► మీరు స్వయంగా వేసుకుంటే మీ స్వంత అనుభవాన్ని మించిన పాఠం లేదు. ► వృత్తి నిపుణులకి ఇస్తే సమగ్ర సమాచారాన్ని సకాలంలో ఇవ్వండి. -
ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్! ఏప్రిల్ 1 నుంచే ఐటీఆర్ ఫైలింగ్..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022–23) నూతన రిటర్నులు (ఐటీఆర్‌లు) ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి తెలిపింది. దీంతో అసెస్మెంట్ సంవత్సరం మొదటి రోజు నుంచే (2023 ఏప్రిల్ 1) రిటర్నులు దాఖలు చేసుకోవడం వీలవుతుంది. గతేడాదితో పోలిస్తే, ఐటీఆర్‌లలో పెద్దగా మార్పులు చేయలేదని తెలిపింది. ఆదాయపన్ను చట్టం 1961లో చేసిన సవరణల మేరకు స్వల్ప మార్పులను ప్రవేశపెట్టినట్టు స్పష్టం చేసింది. ఐటీఆర్ 1 నుంచి ఐటీఆర్ 7 వరకు పత్రాలను సీబీడీటీ నోటిఫై చేయడం తెలిసిందే. సాధారణంగా ఏటా మార్చి లేదా ఏప్రిల్‌లో ఐటీఆర్‌లను నోటిఫై చేస్తుంటారు. ఈ విడత ముందుగానే ఈ ప్రక్రియను సీబీడీటీ పూర్తి చేసింది. (ఇదీ చదవండి: ఎఫ్డీ కస్టమర్లకు ఎస్బీఐ గుడ్ న్యూస్! వడ్డీ రేట్లు పెంపు..) -
Budget 2023-24: కొత్త ఇన్‌కం టాక్స్‌పై చిక్కు ప్రశ్నలు, సమాధానాలు
2023-24 బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఇన్‌కంటాక్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రూ.7 లక్షల వరకు పన్ను లేదన్న ప్రకటన ఎంత వరకు మేలు చేస్తుందన్న దానిపై రకరకాల అంచనాలు వేస్తున్నారు నిపుణులు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినదాని ప్రకారం.. 7లక్షల ఆదాయం వరకు ఎలాంటి ట్యాక్స్ లేదు, ఆదాయం రూ.7లక్షలు దాటితే మాత్రం 5 శ్లాబుల్లో పన్ను ఉంటుంది. 0-3 లక్షల వరకు నిల్ 3 - 6 లక్షల వరకు 5% పన్ను 6 - 9 లక్షల వరకు 10% పన్ను 9 -12 లక్షల వరకు 15% పన్ను 12- 15 లక్షల వరకు 20% పన్ను రూ.15 లక్షల ఆదాయం దాటితే 30% పన్ను ఇన్‌కంటాక్స్‌లో పాత, కొత్త రెండు టారిఫ్/రెజిమే ఆప్షన్లు ఉంటాయా? ప్రస్తుతం ఆదాయపుపన్నులో రెండు ఆప్షన్లు ఉన్నాయి. పాత పద్ధతిలో టాక్స్ అసెస్మెంట్ చేసుకోవచ్చు లేదా కొత్త పద్ధతిని ఎంచుకోవచ్చు. ఎవరికి దేని వల్ల మేలు జరిగితే దాన్ని ఇప్పటివరకు ఎంచుకున్నారు. బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించిన కొత్త శ్లాబు విధానం వల్ల అందరికీ డిఫాల్ట్‌గా కొత్త విధానం అమల్లోకి వస్తుంది. అయితే కావాలనుకునే వాళ్లు పాత శ్లాబు సిస్టమ్‌ను కూడా ఎంచుకోవచ్చు. పాత శ్లాబు సిస్టమ్ ఎవరికి మంచిది? కొత్త పద్ధతిలో రూ.7 లక్షల వరకు టాక్స్ మినహాయింపు ఉన్నా.. ఇప్పటికీ కొందరికి పాత పద్ధతి మంచిదంటున్నారు నిపుణులు. సెక్షన్ 80సి కింద లక్షన్నర రుపాయలు ఇన్వెస్ట్ చేసేవారు, NPS కింద 50 వేల రుపాయలు పెట్టుబడి పెట్టిన వారు, హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చుల కింద రూ.25వేలతో బీమా తీసుకున్నవారు, సేవింగ్స్ కింద రూ.4.25 లక్షలు చూపించే వారికి ఇప్పటికీ పాత శ్లాబు సిస్టమే బెటరంటున్నారు. దీని వల్ల రూ.6.75 లక్షల ఆదాయం వరకు ఎలాంటి టాక్స్ కట్టనవసరం లేదంటున్నారు. 7 లక్షలు అన్న పరిమితిని ఎలా చూడవచ్చు? కొత్త శ్లాబు పద్ధతిలో 7 లక్షల పరిమితి ఓ ఛాలెంజింగ్ విషయమే. ఉదాహారణకు మీ ఆదాయం రూ.7లక్షల వరకు ఉంటే మీరు లాభపడ్డట్టే. అయితే మీ ఆదాయం అనుకోకుండా రూ.7లక్షల పది వేలు అయిందనుకోండి. మీరు పన్నుల కింద రూ.26వేలు, దాంతో పాటు సర్‌ఛార్జీ, సెస్ కట్టాల్సి ఉంటుంది. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే ఏది ఎంచుకోవాలి? ఇప్పటి నుంచి పాత శ్లాబు ఎంచుకుంటే ఏడాదికి 15 లక్షల ఆదాయం పొందుతున్న వారు రూ.82,500 పన్నుగా చెల్లించాలి. కొత్త శ్లాబు ఎంచుకుంటే అదే 15లక్షల ఆదాయానికి రూ.1,50,000 పన్నుగా చెల్లించాల్సి వస్తుంది. దీన్ని బట్టి మధ్యతరగతి వేతన జీవులకు మాత్రమే కొత్త బడ్జెట్లో మేలు జరిగినట్టుగా భావించాలంటున్నారు ఆర్థిక నిపుణులు. -
ట్యాక్స్ చెల్లిస్తున్నారా? పన్ను భారం ఇలా తగ్గించుకోండి!
ఫిబ్రవరి 1న పార్లమెంటులో కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఒక పక్క విశ్వవ్యాప్తంగా తరుముకొస్తున్న ఆర్థిక మాంద్యం, మరో పక్క అన్ని రంగాల్లో ధరల పెరుగుదల.. పది రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏవో తాయిలాలు ఇవ్వకపోతారా అని ఎదురు చూస్తున్న వేతన జీవులు .. ఏవేవో ఊహాగానాలు.. ఏమి అవుతుందో తెలీదు..ఏం వస్తుందో తెలీదు. కానీ, ఏ మార్పూ రాదనుకుని వేతన జీవులు పన్ను భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం మీద దృష్టి సారిస్తే.. అదే ఊరట.. ఉపశమనం.. ఉత్తమం! గవర్నమెంటు ఉద్యోగస్తుల విషయంలో జీతభత్యాలు, అలవెన్సులు, షరతులు, నిబంధనలు, రూల్సు, నియమాలు మారవు. మీ మాట చెల్లదు. కానీ ప్రైవేట్ సంస్థల్లో కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉంది. ఆ వెసులుబాటుతో ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవచ్చు. ►కరువు భత్యం, కరువు భత్య అలవెన్సు .. ఈ రెండింటిని బేసిక్ జీతంలో కలిసిపోయేలా ఒప్పందం చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇంటద్దె అలవెన్సు, గ్రాట్యుటీ, పెన్షన్ కమ్యుటెడ్ మీద పన్ను భారం తగ్గుతుంది. ►జీతం మీద నిర్ణయించిన కమీషన్ శాతం .. ఫిక్సిడ్‌గా ఉండాలి. కమీషన్ని జీతంలో భాగంగా పరిగణిస్తారు. ►యజమాని సహకరిస్తే కొన్ని చెల్లింపులను బిల్లులు సబ్మిట్ చేసి తీసుకోండి. అంటే.. రీయింబర్స్మెంటులాగా. ►పెర్క్స్ని తీసుకుని లబ్ధి పొందడం చాలా ఉపయోగం. అలవెన్సులు వద్దు. వాటి మీద పన్ను భారం ఉంటుంది. ►పెర్క్స్ అంటే .. ఇంట్లో టెలిఫోన్, ఇంట్లో కంప్యూటర్, పర్సనల్ ల్యాప్‌టాప్, కొన్ని చరాస్తులను ఇంట్లో వాడుకోవడం.. ఆఫీసులో పనివేళలో రిఫ్రెష్మెంట్లు.. మొదలైనవి. వీటి మీద పన్ను భారం ఉండదు. ►ఆఫీసు కారు మీ స్వంత పని మీద వాడుకున్నా పెద్ద ఇబ్బంది ఉండదు. అలా అని దుర్వినియోగం చేయవద్దు. ►మీ యజమాని మీ తరఫున చెల్లించే పీఎఫ్ చందా 12 శాతం వరకు ఇవ్వొచ్చు. ►80సీ సేవింగ్స్ మీ ఇష్టం.. మీ వీలును బట్టి చేయండి. ►హెచ్ఆర్ఏ మినహాయింపు కావాలంటే ఇల్లు మీ పేరు మీద కాకుండా, ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద క్లెయిమ్ చేయండి. వారు అసలు ట్యాక్స్ బ్రాకెట్లో లేకపోతే మీకు ఎంతో ప్రయోజనం. ►ఎరియర్స్ జీతాలు చేతికి వచ్చినప్పుడే పన్నుభారం లెక్కిస్తారు. ఫిబ్రవరి 1 నాడు బడ్జెట్ వస్తోంది. 01–04–2023 నుంటి శ్లాబులు మారతాయి అని అంటున్నారు. అలా మారడం వల్ల ఉపయోగం ఉంటే ఎరియర్స్‌ను వచ్చే ఏడాది ఇవ్వమనండి. ►కొన్ని కంపెనీల్లో వారికి మీ సేవలు కావాలి. మీ హోదా.. అంటే మీరు ఉద్యోగా? కన్సల్టెంటా అన్నది ముఖ్యం కాదు. అలాంటప్పుడు కన్సల్టెంటుగా ఉండండి. అప్పుడు 10 శాతం పన్ను డిడక్ట్ చేస్తారు. మీ ఖర్చుల్ని బట్టి మీ నికర ఆదాయాన్ని మీరే లెక్కించుకోవచ్చు. -
ఐటీ రిటర్న్స్ @ 6.85 కోట్లు
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్న్స్ 2021–22 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్) సంబంధించి ఇప్పటి వరకూ 6.85 కోట్లు దాఖలయినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. డిసెంబర్ 31 వరకూ తుది గడువు ఉండడంతో రిటర్న్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 2021–22కిగాను ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్‌లు) దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. ఖాతాలను ఆడిట్ చేయాల్సిన అవసరం ఉన్న కార్పొరేట్లు, ఇతరులకు తుది గడువు నవంబర్ 7. గడువు తప్పినట్లయితే, పన్ను చెల్లింపుదారులు జరిమానా చెల్లించడం ద్వారా ఆలస్యంగా కూడా రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. దీనికి చివరి తేదీ డిసెంబర్ 31. 2020–21 అసెస్మెంట్ ఇయర్‌కు సంబంధించి 2021–22లో ఇప్పటి వరకూ అత్యధికంగా 7.14 కోట్ల రిటర్న్స్ దాఖలయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2019–20 అసెస్ మెంట్ ఇయర్‌కు సంబంధించి 2020–21లో దాఖలైన) ఈ సంఖ్య 6.97 కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకూ రిఫండ్స్ విలువ (31 శాతం వృద్ధితో రూ. 2లక్షల కోట్లు. స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.10.54 లక్షల కోట్లుకాగా, రిఫండ్‌స పోను మిగిలిన మొత్తం రూ.8.54 లక్షల కోట్లు. వార్షిక బడ్జెట్ అంచనాల్లో ఈ విలువ 61.31 శాతానికి చేరింది. మార్చినాటికి నికర వసూళ్లు లక్ష్యం రూ.14.20 లక్షలకు మించి 30 శాతం మేర పెరగవచ్చని అంచనా. -
అద్దెల ద్వారా ఆదాయం వస్తోందా? ఈ విషయాలు తెలుసుకోకపోతే...!
గతంలో ఎన్నోసార్లు తెలియజేశాం. అడిగాం. ‘మీ ఆదాయాన్ని ఎలాగూ చూపిస్తున్నారు ఆదాయం కింద .. దానితో పాటు అదనంగా వచ్చే ఆదాయాన్ని కూడా చూపిస్తున్నారా?‘ ఈ మధ్య డిపార్ట్మెంట్ వారు సేకరించిన సమాచారం ప్రకారం పైన అడిగిన ప్రశ్నకు ‘నో‘ అని సమాధానం వచ్చింది. వారి దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఎంతో మంది తమకు అదనంగా వచ్చే ఆదాయాన్ని తమ తమ రిటర్నులలో ‘డిక్లేర్‘ చేయడం లేదని తెలిసింది. తేలింది. అలాంటి వారెవరో తెలుసుకోవాలనుందా? ఇంటి మీద అద్దె ఎంతెంతయ్యా? ‘నేను ఎప్పుడూ అద్దెను బ్యాంకులో డిపాజిట్ చేయను. నాకు అక్షరాలా నగదు చేతిలో పడాల్సిందే. రశీదు ఇవ్వను. ఎప్పుడూ వ్యాపారస్తులు .. అటువంటి వారికే ఇస్తాను. ఉద్యోగస్తులకు ఇవ్వను‘ అని సగర్వంగా చెప్తాడు మూడు అంతస్తులున్న ముత్యాల రావు. ‘ఇల్లు, ఫ్లాట్లు నా పేరు మీదే ఉన్నాయి. కాని అద్దె ప్రతి నెలా మా ఆవిడ బ్యాంకు అకౌంటులో జమ చేస్తారు. పాన్ నంబరు మా ఆవిడదే. రశీదు ఇస్తాను. కానీ ఆదాయం మొత్తం రూ. 5 లక్షలు దాటదు‘ అని తానెంతో తెలివిగా ప్లానింగ్ చేసుకుంటున్నానని సంబరపడతాడు నాలుగు ఫ్లాట్లున్న నాగభూషణ రావు గారు. ‘మనం ఎప్పుడూ 50:50నే. సగం బ్యాంకులో జమ.. మిగతా సగం నగదు. నగదు ఇస్తే కానీ రశీదు ఇవ్వను. ఇంటికి రిపేర్లు, పన్నులు, సున్నాలు అన్నింటికీ మనమే చెల్లించాలి కదా. అదెలా రాబట్టాలి?‘ ఇలా ఎదురు ప్రశ్న వేసి బేతాళుడి ప్రశ్నలాగా ఫీల్ అవుతాడు పిచ్చేశ్వర్రావు గారు. ‘వాళ్లిచ్చే 30% రిపేరుకు ఏం సరిపోతుంది. కరోనా తర్వాత రూ. 3 లక్షలు ఖర్చు పెట్టా. అందుకని సగం అద్దె చూపిస్తా‘ .. ఇదీ చాణక్య రావుగారి స్టేట్మెంటు. పేయింగ్ గెస్ట్ హౌస్ ఓనరు పేరాశ రావుగారిది కూడా ఇదే వరస! ఆయన సరసనే చేరారు ఎందరో ఓనర్లు. ‘ఐకమత్యమే మహాబలం‘ అని జ్ఞాపకం చేసుకుంటూ. ‘మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు. విల్లా వాడిదే. అక్కడ పన్ను ఎక్కువ. అందుకని రెంటు నా అకౌంటులో వేసుకుంటాను. వాడికి పాన్ లేదు. నేను ఇది ఆదాయంగా చూపించను‘ మితిమీరిన తెలివితేటలున్న మృత్యుంజయ రావు మనసులోని మాట ఇది. ‘నాకు రెండు అగ్రిమెంట్లు. ఒకటి అద్దెది .. సగం. మిగతా సగానికి ఫర్నిచర్, ఏసీ, వాషింగ్ మెషిన్, మంచాల నిమిత్తం అద్దె. ఈ అద్దె చూపించను‘ మందహాసంతో మధుసూదన రావుగారి ముక్తాయింపు. ఇలా అద్దె కింద వచ్చే ఆదాయాన్ని చూపించకుండా ఉండటానికి ఎన్నో అడ్డదార్లు .. ఎగవేతకు ఆలోచనలు. ఇవన్నీ తప్పుడు ఆలోచనలే.. చట్టం ఒప్పుకోదు. పన్ను కట్టడానికి పంగనామాలు .. చట్టానికి తూట్లు .. ఎగవేతకు అగచాట్లు.. దొరికిన తర్వాత తప్పని పాట్లు. ఇకనైనా కట్టిపెట్టాలి ఈ ముచ్చట్లు. నగదు అయినా, బ్యాంకు ద్వారా అయినా మీరు ఓనర్ అయితే మీకు చేతికొచ్చే అద్దె ఏమాత్రం తగ్గించకుండా చూపించండి. ఫ్లాట్ల విషయంలో నెలసరిగా మెయింటెనెన్సును అద్దెకు కలపకుండా, డైరెక్టుగా వెల్ఫేర్ అసోసియేషన్‌కి ఇప్పించండి. కొంత ఉపశమనం ఉంటుంది. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు 10.54 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: భారత్ స్థూల ప్రత్యక్ష పన్ను (వ్యక్తిగత, కార్పొరేట్) వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ 10వ తేదీ నాటికి రూ.10.54 లక్షల కోట్లుగా నమోదయినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఈ పరిమాణం 31 శాతం ఎగసినట్లు పేర్కొంది. ఇక ఇందులో రిఫండ్స్ విలువ రూ.1.83 లక్షల కోట్లు. వెరసి నికర వసూళ్లు రూ.8.71 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొత్తం బడ్టెట్ పన్ను వసూళ్ల లక్ష్యంలో ఇది 61.31 శాతం. స్థూల పన్నుల వసూళ్లలో కార్పొరేట్ పన్ను వసూళ్లు 22 శాతం పెరిగితే, వ్యక్తిగత పన్ను వసూళ్లు 40.64 శాతం పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం (2021–22) ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.10 లక్షల కోట్లు. 2022–23లో ఈ వసూళ్ల లక్ష్యం రూ.14.20 లక్షల కోట్లు. ఇందులో కార్పొరేట్ పన్ను వసూళ్ల అంచనా రూ.7.20 లక్షల కోట్లు కాగా, వ్యక్తిగత పన్ను వసూళ్ల అంచనా రూ.7 లక్షల కోట్లు. దేశంలో పలు రంగాలు మందగమనంలో ఉన్నప్పటికీ, ఎకానమీ పురోగతికి సంకేతమైన ప్రత్యక్ష పన్ను వసూళ్లు భారీగా పురోగమిస్తుండడం శుభ సూచికమని నిపుణులు పేర్కొంటున్నారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు వరుసగా ఎనిమిది నెలలుగా రూ.1.40 లక్షల కోట్లు పైబడ్డాయి. ఇందులో రెండు నెలలు రూ.1.50 లక్షల కోట్లు దాటాయి. కట్టడిలో ద్రవ్యలోటు: బీఓఏ సెక్యూరిటీస్ కాగా చక్కటి పన్ను వసూళ్ల వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) అంచనాలకు అనుగుణంగా 6.4 శాతానికి (జీడీపీ విలువలో) పరిమితం అవుతుందన్న అంచనాలను బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఓఏ) సెక్యూరిటీస్ వెలువరించింది. 2022–23లో ద్రవ్యలోటు రూ.16.61 లక్షల కోట్లుగా 2022 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. ఇదే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాల్లో ఇది 6.4 శాతం. -
ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా ? అయితే ఇది మీకోసమే.. ఇదొక రాచమార్గం
దసరా, దీపావళి పండగలు వెళ్లిపోయాయి. ఇక పెద్ద ఖర్చులు ఉండవు. అయితే, పన్ను కూడా ఒక ఖర్చులాంటిదే కాబట్టి ఇక నుంచి ట్యాక్స్ ప్లానింగ్ వైపు ఒక లుక్ వేద్దాం. పన్నుల భారాన్ని తగ్గించుకునేందుకు ఇదొక రాచమార్గం. చట్టబద్ధంగా, సగౌరవంగా, సక్రమంగా, సరైన దారిలో నడుస్తూ మనం మన పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. అవకాశం ఉంటే పన్ను భారమే లేకుండా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. తప్పనిసరి అయితే సకాలంలో చెల్లించి, సకాలంలో రిటర్ను వేసి సజ్జనులమని సంబరపడొచ్చు. ట్యాక్స్ ప్లానింగ్ అవసరమా? దైనందిన జీవితంలో ముందుచూపు ఎలా ఉండాలో ట్యాక్స్ విషయంలోనూ ముందు చూపు అవసరం. దీన్నే ప్లానింగ్ అంటారు. చట్టప్రకారం ఎటువంటి తప్పులు చేయకుండా, పొరపాట్లు దొర్లకుండా, ఎటువంటి అడ్డదార్లు తొక్కకుండా, గోల్మాల్ గోవిందం గారిలాగా కాకుండా .. రాముడు మంచి బాలుడిలాగా పన్ను భారాన్ని తగ్గించుకోవడం అవసరమే. ప్రయోజనాలు ఉన్నాయా? ఎందుకు లేవు మాస్టారూ! ట్యాక్స్ ప్లానింగ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ►పన్ను తగ్గుతుంది. ఆ మేరకు మిగిలినట్లే. ► సరైన మొత్తం సకాలంలో చెల్లించేస్తే .. అధిక మొత్తం చెల్లించి ఆ తర్వాత రిఫండు కోసం చకోర పక్షుల్లాగా ఎదురు చూడాల్సిన బాధ తప్పుతుంది. ► తక్కువ చెల్లించి, ఆ తర్వాత విషయం తెలిసి అనవసరంగా వడ్డీలు కట్టక్కర్లేదు. పన్ను భారమే తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు వడ్డీలు చెల్లించాల్సిన అవసరమే లేదు. ► ఆలోచించి ఆదాయాన్ని తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు ఇల్లు జాయింట్ ఓనర్షిప్ అయితే ఇంటద్దెను ఆదాయంగా భావించినప్పుడు అద్దెను ఇద్దరికి విడగొట్టి ఆదాయాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే జాయింటు బ్యాంకు అకౌంటులోని వడ్డీలు, జాయింటుగా ఉన్న ఫిక్సిడ్ డిపాజిట్ల మీద వడ్డీ విషయంలో కూడా ఇలా చేయొచ్చు. ► మీరు ఏ శ్లాబులో ఉన్నారో ఆ శ్లాబు దాటకుండా .. తక్కువ శ్లాబులోనే ఉండేలా ఆదాయాన్ని పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు లేదా సర్దుబాటు చేసుకోవచ్చు. ►సెక్షన్ 80సిలో ఎన్నో తగ్గింపులు ఉన్నాయి. ఇందులో 20 అంశాలు ఉన్నాయి. అన్నింటికీ కలిపి పరిమితి రూ. 1,50,000. వీటిలో ఏది కంపల్సరీనో అది చేసి మిగతాది ఇతర కుటుంబ సభ్యులకు చేయవచ్చు. ► పిల్లలకు చదువుల ఫీజు విషయంలో కేవలం ఇద్దరు పిల్లలకే ఇస్తారు. ఇద్దరి ఫీజు ఒకరి ఆదాయంలో నుంచి, మిగతావారివి వేరే కుటుంబ సభ్యుల ఆదాయంలో నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. ► ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ద్వారా వచ్చే వడ్డీని పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు. ► వ్యాపారస్తులు కొన్ని ఖర్చులను అదుపులో ఉంచుకుని ఏ ఖర్చు మీద మినహాయింపు ఉందో వాటి మీదే ఖర్చు పెట్టవచ్చు. ► అమ్మాయి పెళ్లి, అబ్బాయి చదువు, ఇల్లు కట్టడం లాంటి లాంగ్‌టర్మ్ ప్రాజెక్టులు, షార్ట్ టర్మ్‌లో మెడిక్లెయిమ్, డొనేషన్లు వంటివి పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇలా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. -
ఇన్‌కం ట్యాక్స్ చెల్లింపులు: మీకు ఫారం -16 అవసరం లేదు
ప్రశ్న: నేను 2022 మార్చి 31వరకూ పర్మనెంట్ ఉద్యోగం చేశాను. రిటైర్ అయ్యాక ఏప్రిల్–మేలో ఓ ఉద్యోగం తర్వాత మారి జూన్, జూలై, ఆగస్టులో మరో ఉద్యోగం చేశాను. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మానేశాను.ఆరోగ్యం కుదుటపడ్డాకా కొన్ని రోజులు కన్సల్టెంటుగా చేశాను. కలిసి రాలేదు. దాంతో అక్టోబర్ నుండి మళ్లీ ఉద్యోగం. ఎక్కడా ట్యాక్సబుల్ ఇన్‌కం దాటలేదు. అందుకని పన్ను రికవరీచేయలేదు. జవాబు: ఒక ఆర్థిక సంవత్సరంలో ఇలా మీరు ఎన్ని ఉద్యోగాలు మారినా, మధ్యలో కన్సల్టెన్సీ చేసి మళ్లీ ఉద్యోగం .. ఇలా ఎన్నో చేస్తున్నారు. మీకు నెలకు వచ్చిన జీతం వివరాలు ఇవ్వలేదు. ఎవరూ పన్ను రికవరీ చేయలేదు. కాబట్టి ఫారం 16 ఇవ్వాల్సిన అవసరమూ లేదు. మీ జీతం, వేతనం అలాగే కన్సల్టెంటుగా మిగిలిన లాభం ఇలా.. మొత్తం ఆదాయం లేదా నికర ఆదాయం 2022–23 ఆర్థిక సంవత్సరానికి రూ. 5,00,000 దాటకపోతే మీకు ఎటువంటి పన్ను భారం ఏర్పడదు. నికర ఆదాయం రూ. 5,00,000 లోపల ఉంటే రిబేటు అమల్లో ఉండటం వల్ల పన్ను భారం పడదు. పన్ను రికవరీ జరగలేదు. ఇక ముందు కూడా జరగకపోతే రిఫండు ప్రశ్న రాదు. కాబట్టి రిటర్ను వేయనవసరంలేదు. కానీ ఒక విషయం ఆలోచించాలి. ఈ ఆర్థిక సంవత్సరం రెండు నెలల్లో యజమాని జీతం ఇచ్చారు కానీ పన్ను రికవరీ చేయలేదంటున్నారు. ఆ తర్వాత మూడు నెలల పాటు మరో యజమాని కూడా అదేవిధంగా చేశారు. అంటే ఈ ఇద్దరూ ఎవరి మటుకు వాళ్లు ‘‘మీరు పన్ను భారం పరిధిలోకి రాలేదు’’ కాబట్టి వదిలేశారు. ఉదాహరణగా, మొదటి యజమాని నెలకు రూ. 1 లక్ష ఇచ్చారనుకోండి. మీ జీతం రూ. 2 లక్షలు, బేసిక్ లిమిట్ దాటలేదు. కాబట్టి రికవరీ చేయలేదు. రెండో యజమాని కూడా నెలకు రూ. 1 లక్ష చొప్పున మొత్తం రూ. 3 లక్షలకు ఇచ్చారు అనుకోండి. మొత్తం రూ. 3 లక్షలు.. స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50,000 .. మిగతాది బేసిక్ లిమిట్ దాటలేదు అందుకని రికవరీ చేయలేదు. ఇక కన్సల్టెంటు ఎందుకు రికవరీ చేయలేదో తెలియదు. నాలుగో వ్యక్తి మరో యజమాని. ఇక ఇప్పుడు మీరే స్వయంగా మీ కొత్త యజమానికి తెలియజేయండి. గతంలో మీరు పుచ్చుకున్న జీతభత్య వివరాలు, వాటితో బాటు .. చెల్లించి ఉంటే ఇంటద్దె, మీరు చేసిన సేవింగ్స్, మెడిక్లెయిం, డొనేషన్లు .. ఇవన్నీ రాతపూర్వకంగా తెలియజేయండి. అన్నీ కలిపితే ట్యాక్సబుల్ ఇన్‌కం పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త యజమానిని ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ఆదాయాన్ని లెక్కించమనండి. ఆ ప్రకారం పన్నును రికవరీచేసి .. అంటే టీడీఎస్ చేసి లెక్కించి, చెల్లించమనండి. ఇదే సరైన మార్గం. ఒకవ్యక్తి ఒక సంవత్సర కాలంలో వచ్చినది పూర్తిగా పరిగణనలోకి తీసుకుని పన్ను భారం లెక్కించాలి సుమా! -
ఐటీ రిఫండ్ చెక్ చేసుకున్నారా? ఈ విషయాలు మర్చిపోకండి!
ఆదాయపు పన్ను శాఖ ఈ మధ్య అంటే.. ఏప్రిల్ నుండి ఆగస్టు వరకూ రూ. 1.14 లక్షల కోట్ల ఆదాయ పన్ను రిఫండ్లు జారీ చేసింది. రిఫండ్ క్లెయిమ్ చేసిన వారు మీ మీ బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకోండి. రిఫండ్ క్రెడిట్ అయి ఉంటుంది. క్రెడిట్ కాకపోతే వెబ్సైట్లో లాగిన్ అయ్యి స్టేటస్ తెలుసుకోండి. అన్ని వివరాలు కరెక్టుగా ఉండి.. పన్నుకి సంబంధించిన వివరాలు ఫారం 26 అ ప్రకారం సరిగ్గా ఉంటే మీరు క్లెయిం చేసిన రిఫండు క్రెడిట్ అవుతుంది. ఎంత మొత్తం రిఫండు వస్తుంది.. మీరు దాఖలు చేసిన రిటర్నులోని అన్ని అంశాలు క్షుణ్నంగా చెక్ చేస్తారు. అన్నీ కరెక్టుగా ఉంటే మీరు క్లెయిం చేసినదంతా వస్తుంది. గడువు తేదీ లోపల దాఖలు చేసినట్లయితే, రిఫండుతో పాటు వడ్డీ కూడా ఇస్తారు. మీరు క్లెయిం చేసిన మొత్తం కన్నా ఎక్కువ వచ్చిందంటే ఆ ఎక్కువ మొత్తం వడ్డీ అనుకోండి. ఈ రెండింటి మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. అలాగే, ఫారం 26 అ లో ఈ మేరకు ఎంట్రీలు కనిపిస్తాయి. అప్పుడు పూర్తిగా స్పష్టత వస్తుంది. ఫారం 26 అ డౌన్లోడ్ చేసుకుని ఒక కాపీని మీ ఇన్‌కంట్యాక్స్ ఫైల్లో భద్రపర్చుకోండి. మీ సులువు కోసం .. సౌకర్యం కోసం ప్రతి సంవత్సరం ఒక ఫైల్ నిర్వహించుకోండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మీ రిఫండు.. మీ ఆదాయం కాదు. దాని మీద ఎటువంటి పన్ను భారం ఉండదు. మీకు వచ్చిన ఈ రిఫండుని ప్రస్తుత సంవత్సరం రిటర్ను వేసినప్పుడు ‘మినహాయింపు ఆదాయం‘ కింద చూపెట్టుకోవచ్చు. లేదా అధికారులు అడిగినప్పుడు ఈ జమ మొత్తం .. ఆదాయం కాదు అని, రిఫండు వచ్చిందని రుజువులతో పాటు విశదీకరించాలి. అదనంగా వచ్చిన మొత్తం వడ్డీని మాత్రం ప్రస్తుత సంవత్సరంలో ఆదాయంగా, ఇతర ఆదాయాల కింద చూపించాలి. దీని మీద ఎటువంటి మినహాయింపు లేదు. మొత్తం వడ్డీ.. పన్నుకి గురి అవుతుంది. ఈ వడ్డీ విషయంలో ఎటువంటి అశ్రద్ధ వహించకండి. రిఫండు తక్కువ రావచ్చు.. మీ రిఫండు క్లెయిం చేసినప్పటికీ పూర్తి మొత్తం రావచ్చు .. లేదా తగ్గవచ్చు. ఆదాయంలో హెచ్చుతగ్గుల వల్ల, అంకెల తప్పుల వల్ల, ట్యాక్స్ క్రెడిట్లు తప్పుగాా రావడం వల్ల మీ ఆదాయం పెరగవచ్చు .. మినహాయింపులు తగ్గనూ వచ్చు. ఆదాయంలో మార్పుల వల్ల, పన్నుల చెల్లింపులు తక్కువ కావడం వల్ల, రిఫండు తక్కువ రావచ్చు. ఇందులో తప్పులుంటే మీరు తెలియజేయవచ్చు. రాకపోనూ వచ్చు .. అవును. ఒక్కొక్కప్పుడు ఈ సంవత్సరం రిఫండును అసెస్ చేసి, ఆర్డర్ పాస్ చేసి.. గత సంవత్సరంలో మీరు చెల్లించాల్సిన బకాయిల నిమిత్తం సర్దుబాటు చేసుకుంటున్నాం అని కూడా అంటారు. ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు. ఆ మేరకు నిజమే అయితే ఊరుకోండి. కాకపోతే వివరణ ఇచ్చి, సవరించుకోండి. చివరిగా మీకు వచ్చిన రిఫండు అనేది ఆదాయం కాదని, అదనంగా వచ్చేది వడ్డీ అని, పన్నుకు గురవుతుందని గుర్తుపెట్టుకోండి. -
భారీగా పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు, ఎంతంటే?
న్యూఢిల్లీ: ఎకానమీ పురోగతికి అద్దం పడుతూ, ప్రత్యక్ష పన్ను వసూళ్లలో భారీ వృద్ధి నమోదయ్యింది. ఆదాయపు పన్ను శాఖ ఈ మేరకు విడుదల చేసిన గణాంకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం, ఏప్రిల్ నుంచి ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) సెప్టెంబర్ 8వ తేదీ వరకూ గత ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే ప్రత్యక్ష పన్ను వసూళ్లలో స్ధూలంగా 35 శాతం పురోగతి నమోదయ్యింది. విలువలో రూ.6.48 లక్షల కోట్ల పరోక్ష పన్ను వసూళ్లు జరిగాయి. ఇక రిఫండ్స్ విషయానికి వస్తే, సమీక్షా కాలంలో ఈ పరిమాణం రూ.1.19 లక్షల కోట్లు. వెరసి నికర వసూళ్లు 30.17 శాతం వృ ద్ధితో రూ.5.29 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో పోల్చితే రిఫండ్స్ 65.29 శాతం అధికం. సమీక్షా కాలంలో విభాగాల వారీగా చూస్తే, కార్పొరేట్ ఆదాయపు పన్ను (సీఐటీ) వసూళ్లలో స్థూలంగా 25.95 శాతం వృద్ధి నమోదయితే, వ్యక్తిగత పన్ను స్థూల వసూళ్లలో (ఎస్టీటీ సహా) 44.37 శాతం వృద్ధి చోటుచేసుకుంది. రిఫండ్స్ సర్దుబాటు చేస్తే ఈ వృద్ధి రేట్లు వరుసగా 32.73 శాతం, 28.32 శాతాలుగా ఉన్నాయి. గడచిన ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.10 లక్షల కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ పరిమాణాన్ని రూ.14.20 లక్షల కోట్లుగా కేంద్ర బడ్జెట్ అంచనా వేస్తోంది. -
ఇన్ కం ట్యాక్స్ చెల్లింపులు: ‘పే లేటర్’ జోలికి వెళ్లకండి, ఎందుకంటే!
ప్ర. నేను 31–07–2022న రిటర్న్ దాఖలు చేశాను. ఆ రోజు నాటికి రూ. 1,00,000 ట్యాక్స్ చెల్లించాలి. నగదు లేకపోవటం వల్ల ‘పే లేటర్‘ అని ఆప్షన్ పెట్టి ఫైల్ చేశాను. నిన్ననే ఆర్డర్లు వచ్చాయి. రూ. 5,000 పెనాల్టీ కట్టమని. ఏం చేయాలి? – విశ్వనాధ లక్ష్మీ, హైదరాబాద్ జ. చట్టప్రకారం ట్యాక్స్ కట్టలేని పరిస్థితుల్లో గడువు తేదీ లోపల రిటర్ను వేసుకోవడానికి అవకాశం ఇది. సాధారణంగా పూర్తిగా పన్నులు చెల్లించి, రిటర్నులు వేయాలి. విధిలేని పరిస్థితుల్లో ‘పే లేటర్‘ ఆప్షన్‌ను ఉపయోగించి కూడా రిటర్ను వేయవచ్చు. నిజానికి చాలామంది మీలాగే రిటర్నులు వేశారు. కానీ పెనాల్టీ రూ. 5,000 పడకుండా బయటపడవచ్చు. అయితే, జరుగుతున్నది ఏమిటంటే.. ► సాధారణంగా ఇలాంటి రిటర్నుని డిఫెక్టివ్ రిటర్నుగా భావిస్తారు. ►డిఫెక్టివ్ రిటర్నుగా భావించినప్పుడు నోటీసు ఇచ్చి 15 రోజుల లోపు సర్దుబాటు చేస్తారు. ►అలా చేయకపోతే రిటర్ను వేసినట్లు కాదు. 31–07–2022 లోపల రిటర్ను వేసి, ఆ తేదీలోపల ‘వెరిఫికేషన్‘ పూర్తయితే, ఇటువంటి కేసుల్లో రూ. 5,000 చెల్లించమని ఆర్డర్లు రావటం లేదు. కానీ ఏదో ఒక కారణం వల్ల .. ఉదాహరణకు, సైటు మొరాయించడమో, రిజక్ట్ అవ్వటమో, ఇతర సాంకేతికలోపం వల్లో 31–07–2022 లోగా రిటర్ను వెరిఫికేషన్ పూర్తి కాకపోతే, రూ. 5,000 చెల్లించమని నోటీసులు వస్తున్నాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే.. ►మీ రిటర్ను ..డిఫెక్టివ్ రిటర్ను అయినట్లు ►మీరు పెనాల్టీ రూ. 5,000 చెల్లించాలి. ఎందుకంటే, రిటర్ను లేటుగా వేశారు కాబట్టి. ►ఆలస్యంగా వేసినందుకు 234 అ ప్రకారం వడ్డీ కూడా చెల్లించాలి. ►పన్నుభారం లేకపోతే 234 అ వడ్డీ పడదు. ►రిఫండు మీద వడ్డీ రాదు. ►నష్టాలుంటే రాబోయే సంవత్సరానికి సర్దుబాటు చేయరు. ►చెల్లించాల్సిన పన్నులు చెల్లించాలి. ►రివైజ్డ్ రిటర్న్ వేయనవసరం లేదు. రిటర్న్‌ని రివైజ్ చేయనక్కర్లేదు. ►నోటీసుకి జవాబు ఇవ్వాలి. జవాబు ఇవ్వటం అంటే కట్టిన చలాన్ల వివరాలు ఇవ్వడమే. చివరిగా చెప్పాలంటే ఈ ‘పే లేటర్‘ ఆప్షన్ కంటికి ఆకర్షణీయంగా కనబడేది. ‘దూరపు కొండలు నునుపు‘ అన్న సామెతలాంటిది. ఇదొక ‘చిక్కు‘ లాంటిది. పెనాల్టీ తప్పదు. వడ్డీ తప్పదు. వివరణ తప్పదు. సవరణ తప్పదు. జవాబు తప్పదు. చెల్లింపూ తప్పదు. అందుకే ‘పే లేటర్‘ జోలికి పోకండి. ఎలాగూ ట్యాక్స్ చెల్లించక తప్పదు, రిటర్ను వేయకాతప్పదు. ’ఆలస్యం అమృతం విషం’ అని గుర్తెరిగి ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్‌కు పంపించగలరు. -
ఆన్లైన్లో రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేయాలా? చివరి తేదీ ఎపుడు?
సాక్షి, ముంబై: 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ ( ఐటీఆర్) ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31తో ముగిసింది. కేంద్రం ఈ సారి గడువు తేదీని పొడిగించకపోవడంతో, గడుపు పొడిగింపు లభిస్తుందిలే అని ఆశించిన పన్ను చెల్లింపుదారులుకునిరాశే ఎదురైంది. దీంతో చాలా మంది పన్ను చెల్లింపుదారులు కొన్ని హడావిడిగా ఫైల్ చేయడంతో అవాంఛిత తప్పులు దొర్లి ఉండవచ్చు. ఈ నేపథ్యంలో ఇటువంటి తప్పులను, పొరబాట్లను సరిదిద్దుకునేందుకు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 139(5) ప్రకారం రివైజ్డ్ ఐటీఆర్ దాఖలుకు పన్ను చెల్లింపుదారులకు అవకాశం ఉంది. ఇలా మళ్లీ ఐటీఆర్ దాఖలు చేయాలని భావిస్తున్నవారు ఆన్లైన్లోనే ఈ పని పూర్తి చేయొచ్చు. అయితే రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మీరు ఒరిజినల్ రిటర్న్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి. సవరించిన రిటర్న్‌ను ఫైల్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2022. రివైజ్డ్ ఐటీఆర్ ఎవరు దాఖలు చేయవచ్చు ఐటీఆర్ దాఖలు చేసిన ప్రతి మదింపుదారుడు సెక్షన్ 139(5) కింద దీన్ని సవరించుకోవడానికిఅర్హులు. ఆలస్యంగా ఐటిఆర్ ఫైల్ చేసిన వారు కూడా, అంటే, గడువు ముగిసిన తర్వాత ఐటిఆర్ ఫైల్ చేయబడితే, రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేయవచ్చు. రివైజ్డ్ రిటర్న్ ఎలా దాఖలు చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ డేటాను సరిచేసుకోవాలంటే ఇన్కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వాలి మీ అకౌంట్ డాష్‌బోర్డ్ ఓపెన్ అవుతుంది. 'రిటర్న్ ఫైల్ అండర్' కాలమ్‌లో రివైజ్డ్ u/s 139(5) అనే ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ అసెస్మెంట్ ఇయర్ ఎంచుకుని సీపీసీ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తరువాత పాన్ నెంబర్ కూడా ఎంటర్ చేసి వాలిడేట్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు రెక్టిఫికేషన్ రిక్వెస్ట్ టైప్ చేసుకోవాలి. రెక్టిఫికేషన్ చేయాల్సి వచ్చిందో కూడా కారణం తెలియజేయాలి. మొత్తం ఆప్షన్లలో గరిష్టంగా 4 కారణాలను మాత్రమే ఎంచుకోవాలి. తర్వాత ట్యాక్స్ క్రెడిట్ మిస్‌మ్యాచ్ డీటైల్స్‌పై క్లిక్ చేయాలి. తర్వాత చివరిగా సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఎన్ని సార్లు ఫైల్ చేయవచ్చు రివైజ్డ్ రిటర్న్‌ను ఎన్నిసార్లు ఫైల్ చేయవచ్చో పరిమితి లేదు. అయితే, ఈ సదుపాయాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఐటీ డిపార్ట్మెంట్ ఆగస్టు 1, 2022 నుండి, ఐటీఆర్‌ని ధృవీకరించడానికి 120 రోజుల ముందు ఉన్న కాల పరిమితిని 30 రోజులకు తగ్గించింది. కనుక ఒకసారి రిటర్నులు ధ్రువీకరించినదీ, లేనిదీ చూసుకోవాలి. వెరిఫికేషన్ చేయని రిటర్నులు చెల్లవు. రిటర్నులు సమర్పించిన తేదీ నుంచి 30 రోజుల్లోపు ధ్రువీకరించేందుకు సమయం ఉంటుంది. ధృవీకరణకు అందుబాటులో ఉన్న 6 పద్ధతుల్లో దేనినైనా ఉపయోగించవచ్చు. నెట్ బ్యాంకింగ్ నుంచి లేదంటే ఆధార్ ఓటీపీ ద్వారా, బ్యాంకు లేదా డీమ్యాట్ ఖాతా నంబర్ సాయంతోనూ వెరిఫై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. వీటిల్లో మీకు నచ్చిన ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అప్పుడు యూజర్ మొబైల్‌కు వన్‌టైమ్ పాస్వర్డ్ వస్తుంది. ఈ కోడ్ లేదా ఓటీపిని ఈఫైలింగ్ పోర్టల్‌పై ఎంటర్ చేసి, సబ్మిట్ కొట్టడంతో ఈ వెరిఫికేషన్ పూర్తవుతుంది. -
5.83 కోట్ల రిటర్నులు
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరానికి 5.83 కోట్ల ఆదాయపన్ను రిటర్నులు దాఖలయ్యాయి. జూలై 22 వరకు, గతేడాది ఇదే సమయానికి పోల్చి చూస్తే 40 శాతం రిటర్నులు (2.48 కోట్లు) దాఖలు కాగా.. చివరి 10 రోజుల్లో పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు ముందుకు వచ్చి రిటర్నులు వేశారు. గడువు పొడిగించే అవకాశం లేదని ఆదాయపన్ను శాఖ తేల్చి చెప్పడంతో పన్ను చెల్లింపుదారులు చివరి రోజుల్లో త్వరపడ్డారు. ముఖ్యంగా ఆఖరి రోజైన జూలై 31న 72.42 లక్షల రిటర్నులు వచ్చాయి. 2020–21 ఆర్థిక సంవత్సరానికి దాఖలైన పన్ను రిటర్నులు 5.87 కోట్లతో పోలిస్తే 4 లక్షల మేర తగ్గినట్టు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్ 31 వరకు గడువు ఇవ్వడం అనుకూలించింది. అంతకుముందు 2020లోనూ డిసెంబర్ 31 వరకు గడువు పొడిగింపు లభించింది. రికార్డులు.. చివరి రోజున ఒక దశలో సెకనుకు 570 చొప్పున, నిమిషానికి 9,573, గంటకు 5,17,030 చొప్పున రిటర్నులు ఫైల్ అయినట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. మొత్తం 5.83 కోట్ల రిటర్నుల్లో 50 శాతం ఐటీఆర్–1 కాగా, 11.5 శాతం ఐటీఆర్–2, 10.9 శాతం ఐటీఆర్–3, 26 శాతం ఐటీఆర్–4 ఉన్నాయి. -
ఐటీ రిటర్న్: గడువులోగా ఫైల్ చేయలేదా?.. ఫైన్ మాత్రమే కాదు.. ఇవన్ని కోల్పోతారు!
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ గుడువు ఆదివారంతో (జూలై 31) ముగిసింది. ఆఖరి రోజు పన్ను చెల్లింపుదారులు ఉరుకులు పరుగులు మీద ఐటీఆర్ దాఖలు చేశారు. చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఇటీవల వారాల్లో ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ మరో వైపు గడువు తేది పొడిగించే ఆలోచన లేదంటూ ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో చివరి రోజైన ఆదివారం రాత్రి 11గంటల వరకు మొత్తం 67,97,067 మంది ఐటీ రిటర్న్ ఫైల్ చేయగా.. చివరి గంటలో 4,50,013 ఐటీఆర్ దాఖలు చేశారని ఐటీ శాఖ ట్వీట్ చేసింది. దీంతో ఈ సంఖ్య మొత్తంగా ఐదున్నర కోట్లకు పైనే చేరుకుంది. ఒకవేళ మీరు జూలై 31 లోపు ఐటీఆర్ ఫైల్ చేయడంలో విఫలమైన పరిస్థితి ఏమిటని అనుకుంటున్నారా? ప్రస్తుతం ఫైల్ చేయడం కుదరని వాళ్లు డిసెంబర్ 31, 2022లోపు రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. అయితే అందుకు కొంత పెనాల్టీ చెల్లించక తప్పదు. దీంతో పాటు కొన్ని ఆర్ధిక ప్రయోజనాలకు కోల్పోతారని నిపుణులు చెపుతున్నారు. డెడ్‌లైన్‌లోపు ఫైల్ చేయకపోతే: ►డెడ్‌లైన్ తర్వాత ఐటీ రిటర్న్ దాఖలు చేసేవారు.. వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉన్నవారు రూ.5000, అంతకంటే తక్కువ ఆదాయం ఉన్నవారు రూ. 1000 జరిమానాగా చెల్లించాలి. ►పన్ను చెల్లింపుదారుల వైపు నుంచి ఏమైనా బకాయిలు ఉంటే ఐటీఆర్ ఫైలింగ్ చేయటానికి గడువు తేదీ నుంచి దానిపై 1 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ► ఐటీర్ ఆలస్యంగా పైల్ చేసిన పన్ను చెల్లింపుదారులు.. వారి మూలధనరాబడి వంటి వాటిని నష్టాలతో భర్తీ చేసుకునే అవకాశం ఉండదు. ఇంటి ఆస్తిని అమ్మినప్పుడు వచ్చిన నష్టాన్ని మాత్రమే సర్దుబాటు చేసుకోగలరు. ► ఐటీ రిటర్న్ సకాలంలో దాఖలు చేసి, ధృవీకరించుకున్న తర్వాతే రీఫండ్ అనేది వస్తుంది. కాకపోతే దాఖలు చేయడం అలస్యమయ్యే కొద్దీ రీఫండ్ కూడా అదే తరహాలో ఆలస్యం అవుతుంది. ►2022 డిసెంబర్ 31 తర్వాత కూడా ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఐటీశాఖ నుంచి నోటీసులు అందుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా భవిష్యత్తులో కొన్ని ఆర్థికపరమైన ప్రయోజనాలు విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. Statistics of Income Tax Returns filed today. 67,97,067 #ITRs have been filed upto 2300 hours today & 4,50,013 #ITRs filed in the last 1hr. For any assistance, pl connect on orm@cpc.incometax.gov.in or on our help desk nos 1800 103 0025 & 1800 419 0025. We will be glad to assist! — Income Tax India (@IncomeTaxIndia) July 31, 2022 చదవండి: LPG Cylinder Price: బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన కమర్షియల్ సిలిండర్ -
చివరి రోజు పెద్ద సంఖ్యలో రిటర్నులు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నులు చివరి రోజున కూడా పెద్ద సంఖ్యలో దాఖ లయ్యాయి. ఆదివారం రాత్రి 8 గంటల వరకు 53,98,348 రిటర్నులు నమోదైనట్టు ఆదాయపన్ను శాఖ ట్విట్టర్లో ప్రకటించింది. ఆడిటింగ్ అవసరం లేని పన్ను రిటర్నుల దాఖలుకు జూలై 31 చివరి తేదీగా ఉంది. దీన్ని పొడిగించాలంటూ పెద్ద ఎత్తున వినతులు వచ్చినా కానీ ప్రభుత్వం ఆమోదించలేదు. జూలై 30 నాటికి 5.10 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయి. దీంతో జూలై 31 నాటికి మొత్తం 5.64 కోట్ల రిటర్నులు వచ్చినట్టు తెలుస్తోంది. రాత్రి 8 తర్వాత కూడా కొన్ని దాఖలవుతాయి కనుక వీటి సంఖ్య పెరగొచ్చు. 2020–21 ఆర్థిక సంవత్సరానికి దాఖలైన రిటర్నులు 5.7 కోట్లుగా ఉండడం గమనార్హం. జూలై 31 తర్వాత కూడా ఆలస్యపు రుసుంతో డిసెంబర్ 31వరకు రిటర్నులు వేయవచ్చు. -
ఐటీఆర్ ఫైలింగ్ గడువు: మేమేమైనా మెషిన్లమా? మొత్తుకుంటున్న నెటిజన్లు
సాక్షి, ముంబై: ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి చివరి తేదీని పొడిగించే ఆలోచన ఏదీ లేదని కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే నెటిజన్లు మాత్రం గడువునే వెంటనే పొడిగించాలని డిమాండ్ చేశారు. జూలై 31వ తేదీ లోపు ఫైల్ చేయడం సాధ్యం కాదు. దయచేసి ఆగస్ట్ 31 వరకు పొడిగించండి అని ట్విటర్ ద్వారా కోరుతున్నారు. అలాగే ఇన్‌కంటాక్స్ పోర్టల్ పని తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. డెడ్‌లైన్ పొడిగింపులేదని ప్రకటించిన తరువాత పొడిగింపు కోసం ఎదురుచూస్తున్న పన్ను చెల్లింపు దారులు ట్విటర్లో గగ్గోలు పెడుతున్నారు. గడువుపెంచండి మహాప్రభో అని మొత్తుకుంటున్నారు. గడువు తేదీని పొడిగించాల్సిందిగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో #Extend_Due_Date ట్విటర్లో ట్రెండింగ్‌లో నిలిచింది. టాక్స్ అఫీషియల్స్ ఏమైనా మెషీన్లా.. కాదు కదా.. తీవ్రమైన ఒత్తిడి, టెన్షన్‌తో వారు పనిచేస్తున్నారు. ఆగస్టు 31 వరకు గడువు పెంచాల్సిందే అని కొంతమంది కమెంట్ చేస్తున్నారు. పోర్టల్ పనిచేయడం లేదని మరికొంతమంది, ఫన్నీ కమెంట్స్, రకరకాల మీమ్స్‌తో ట్విటర్లో హల్చల్ చేస్తున్నారు. #Extend_Due_Date_Immediately Tax professionals are not machines. They are working under a lot of stress and tension. Fix 31st August for non audit returns for ever. — K K Atal (@kkatal88) July 26, 2022 #Extend_Due_Date_Immediately #incometaxportal Sitting in office trying to download 26AS/AIS/TIS: pic.twitter.com/ciV0pjGLTg — Atish Paliwal (@atishpaliwal22) July 23, 2022 Clients with pending ITRs looking at their CAs : #Extend_Due_Date_Immediately #Extend_Due_Dates pic.twitter.com/N6yI9CSyyA — Yum (@upsehooon) July 24, 2022 Right now:-#Extend_Due_Date_Immediately#IncomeTaxReturn pic.twitter.com/JO5TJuEDwh — Bhavya (@iconic232001) July 26, 2022 -
ఐటీ రిటర్నులకు డెడ్‌లైన్ జూలై 31
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలుకు గడువు పెంచే యోచనేదీ లేదని కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్ బజాజ్ స్పష్టం చేశారు. జూలై 31 ఆఖరు తేదీగా ఉంటుందని, చాలా మటుకు రిటర్నులు తుది గడువులోగానే వస్తాయని అంచనా వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను జూలై 20 వరకూ 2.3 కోట్ల పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయని, ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోందని బజాజ్ వివరించారు. కోవిడ్ పరిణామాలు, ఐటీ పోర్టల్‌లో సమస్యలు తదితర అంశాల కారణంగా గతేడాది డిసెంబర్ 31 వరకూ గడువు పెంచిన సంగతి తెలిసిందే. ఈసారీ అలాగే జరుగుతుందనే ఉద్దేశంతో కొందరు నెమ్మదిగా ఐటీఆర్‌లు దాఖలు చేయొచ్చులే అని భావిస్తుండవచ్చని బజాజ్ పేర్కొన్నారు. కానీ ఈసారి డెడ్‌లైన్‌ను పొడిగించే యోచనేదీ లేదన్నారు. ప్రస్తుతం రోజువారీ 15–18 లక్షల రిటర్నులు వస్తుండగా .. రాబోయే రోజుల్లో 25 లక్షల నుంచి 30 లక్షల వరకూ పెరగవచ్చని వివరించారు. -
ఆదాయ పన్ను: ఇతర ఆదాయం ఉంటే
సాక్షి,హైదరాబాద్: ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక అసెస్సీకి ఐదు రకాల ఆదాయం ఉంటుంది. ఆదాయాన్ని ఈ కింద పేర్కొన్న శీర్షికల కింద విభజించారు. ⇒ జీతాలు ⇒ ఇంటిపై అద్దె ⇒ వృత్తిపై, వ్యాపారంపై లాభాలు ⇒ మూలధన ఆస్తులపై లాభాలు ⇒ ఇతర ఆదాయాలు ఏ వ్యక్తికైనా వచ్చే ఆదాయాన్ని పైవిధంగా వర్గీకరించి, పన్ను భారాన్ని లెక్కిస్తారు. పై జాబితాలో మొదటి నాలుగింటి విషయంలో నిర్దిష్టంగా, స్పష్టంగా చట్టం అన్ని అంశాలూ చెప్పింది. మనం గతంలో ఎన్నోసార్లు వాటిని ప్రస్తావిస్తూ వచ్చాం ఇక ఆఖరుదీ అయిదో అంశం ప్రత్యేకత ఏమిటంటే.. ఏదేని ఆదాయం, మొదటి నాలుగింటిలోనూ ఇమడ్చలేకపోతే/వర్గీకరించకపోతే/ విభజించలేక పోతే.. అటువంటి ఆదాయాన్ని ‘‘ఇతర ఆదాయం’’ కింద పరిగణిస్తారు. ఒక వ్యక్తి ఆదాయం.. జీతం కాదు, ఇంటి మీద అద్దె కాదు, వృత్తి .. వ్యాపారం వల్ల వచ్చిన లాభం కాదు, మూలధన లాభాలు కాదు .. ఇక మిగిలింది .. చివరిది ఇతర ఆదాయం. మిమ్మల్ని వదిలిపెట్టకుండా ఈ శీర్షిక కింద పన్ను వేస్తారు. ఎక్కడన్నా బావ కానీ వంగతోట కాడ కాదు అన్న సామెతలాగా ఎలాంటి మొహమాటం లేకుండా పట్టుకుంటారు. మీరు దొరక్క తప్పదు. పన్ను చెల్లించక తప్పదు. ఇది కాకుండా చట్టప్రకారం ఈ కింద పేర్కొన్న వాటిని ‘‘ఇతర ఆదాయం’’గా పరిగణిస్తారు. ⇒ భూమిపై అద్దె ⇒ సబ్-లెట్టింగ్పై ఆదాయం ⇒ బ్యాంకు డిపాజిట్లు (ఫిక్సిడ్, సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ) ⇒ డైరెక్టర్లకు వచ్చే సిట్టింగ్ ఫీజు ⇒ విదేశీ గడ్డ నుండి వచ్చే వ్యవసాయంపై ఆదాయం ⇒ డైరెక్టరుగా సంపాదించే గ్యారంటీ కమీషన్ ⇒ పరీక్షల నిర్వహణకు వచ్చే ఆదాయం, వేల్యుయేషన్ ఫీజు, ఇన్విజిలేషన్ ఫీజు ⇒ ఫ్యామిలీ పెన్షన్ (ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ పెన్షన్ మీద .. జీతంలాగానే రూ. 50,000 మినహాయింపు ఉంటుంది. 1/3వ వంతు లేదా రూ. 15,000. ఈ రెండింటిలో తక్కువ మినహాయింపు ఇస్తారు) ⇒ పార్లమెంటు, శాసన సభ సభ్యుల జీతాలు ⇒ బుక్స్ రాసినందుకు వచ్చే రాయల్టీలు ⇒ వారసులకొచ్చే రాయల్టీలు (బుక్స్‌పై) ⇒ హోటల్స్‌లో సర్వర్స్కి వచ్చే టిప్స్, డ్రైవర్లకు వచ్చే టిప్స్ ⇒ క్యాజువల్ ఆదాయం ⇒ యాన్యుటీలు ⇒ మధ్యవర్తిత్వం చేసినందుకు వచ్చే కమీషన్ ⇒ అండర్‌రైటింగ్ కమీషన్ ⇒ బహిర్గతం చేయలేని సోర్స్ నుండి ఆదాయం ⇒ ట్రస్ట్ ద్వారా వచ్చే ఆదాయం ⇒ కొన్ని సెక్షన్ల ప్రకారం ఇతరుల ఆదాయం, కొన్ని ఖర్చులు, లెక్క చెప్పని నగదు, లెక్క చెప్పని ఇన్వెస్ట్మెంట్ .. మొదలైన వాటి విలువ. ఈ జాబితా ఇక్కడితో పూర్తవలేదు. ఇవి అంతంకాదు ఆరంభం లాగా కేవలం మచ్చుతునకలే. -కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు -
ఐటీ పోర్టల్‌తో తప్పని తిప్పలు
న్యూఢిల్లీ: ఐటీ రిటర్నుల దాఖలుకు సంబంధించి ఆదాయపు పన్ను పోర్టల్‌లో సమస్యలతో ట్యాక్స్‌పేయర్ల కుస్తీ కొనసాగుతోంది. దీంతో లోపాల పరిష్కారానికి సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ క్రియాత్మక చర్యలు తీసుకుంటోందని ఐటీ విభాగం వెల్లడించింది. ‘ఐటీడీ ఈ–ఫైలింగ్ పోర్టల్‌ను ఉపయోగించుకోవడంలో ట్యాక్స్‌పేయర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి మా దృష్టికి వచ్చింది. ఇన్ఫోసిస్ కూడా దీన్ని గుర్తించి, పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది‘ అని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ట్వీట్ చేసింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ రూపొందించిన కొత్త ఈ–ఫైలింగ్ పోర్టల్ 2021 జూన్ 7న అందుబాటులోకి వచ్చినప్పట్నుంచీ లోపాలపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. -
రిటర్న్‌ల స్క్రూటినీకి మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్నులను స్క్రూటినీకి ఎంపిక చేసే విషయంలో పాటించాల్సిన మార్గదర్శకాలను ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసింది. వీటి ప్రకారం పన్ను ఎగవేతకు సంబంధించి ఏ అధికారిక ఏజెన్సీల దగ్గర సమాచారమున్నా స్క్రూటినీ చేపట్టవచ్చు. అయితే, పూర్తి స్థాయి పరీక్షకు నిర్దిష్ట కేసులను ఎంపిక చేసేందుకు ప్రిన్సిపల్ కమిషనర్ / ప్రిన్సిపల్ డైరెక్టర్ / కమిషనర్ / డైరెక్టర్ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు చెల్లుబాటయ్యే అనుమతులు లేకుండా చారిటబుల్ ట్రస్టులు మినహాయింపులను క్లెయిమ్ చేసిన కేసుల్లో.. సర్వే, సెర్చి, జప్తులకు సంబంధించిన కేసుల్లో.. నోటీసుల జారీ కోసం ముందస్తుగా అనుమతులు తీసుకోవాలి. పూర్తి స్థాయి స్క్రూటినీలో భాగంగా పన్ను చెల్లింపుదారులు నిజాయితీగానే మినహాయింపులు పొందారా అన్నది ఆదాయపు పన్ను శాఖ అధికారులు పరిశీలిస్తారు. ఆదాయం తక్కువగా, నష్టాలను ఎక్కువగా చూపడం లాంటివేవీ చేయలేదని ధృవీకరించుకునేందుకు స్క్రూటినీ నిర్వహిస్తారు. -
టాక్స్ పేయర్లకు అలర్ట్..! ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..!
మరికొద్ది రోజుల్లో కొత్త ఆర్థిక సంవత్సరం(2022-23) రాబోతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయపు పన్ను నిబంధనలలో అనేక మార్పులు రానున్నాయి. ఆదాయపు పన్నులపై కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1, 2022న ప్రవేశపెట్టిన బడ్జెట్లో పలు మార్పులు సూచించింది. డిజిటల్, క్రిప్టో ఆస్తులపై ఆదాయపు పన్ను, అప్డేట్ చేయబడిన రిటర్న్‌ల దాఖలు, ఈపీఎఫ్ వడ్డీపై కొత్త పన్ను నియమాలు, కోవిడ్-19 చికిత్సపై పన్ను ఉపశమనం వంటి వాటిపై ఏప్రిల్1 , 2022 నుంచి కొన్ని మార్పులు రానున్నాయి. 2022 ఏప్రిల్ 1 నుంచి రానున్న ప్రధాన ఏడు మార్పులు ఇవే..! 1) క్రిప్టో పన్ను ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో క్రిప్టోకరెన్సీలపై పన్ను విధానం క్రమంగా అమలులోకి రానుంది. క్రిప్టో ఆస్తులపై సుమారు 30 శాతం పన్ను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి రానుంది. అయితే 1 శాతం టీడీఎస్ మాత్రం జూలై 1 నుంచి అమలులోకి వస్తాయి. క్రిప్టో ఆస్తులపై ఆదాయపు పన్ను విధింపుకు సంబంధించి 2022-23 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 2) లాభాలు, నష్టాలతో సంబంధం లేదు..! క్రిప్టోకరెన్సీ, డిజిటల్ ఆస్తుల విషయలో కేంద్రం కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. క్రిప్టో హోల్డింగ్ మరొక వెర్షన్ నుంచి వచ్చే ఆదాయానికి వ్యతిరేకంగా నిర్దిష్ట డిజిటల్ ఆస్తిలో వచ్చే నష్టాలను అనుమతించకుండా చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. క్రిప్టో కరెన్సీపై కేంద్రం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. క్రిప్టో ఆస్తులను మైనింగ్ చేస్తున్నప్పుడు ఏర్పడే అవస్థాపన ఖర్చులపై ప్రభుత్వం పన్ను మినహాయింపులను అనుమతించదు. ఎందుకంటే వాటిని సముపార్జన ఖర్చుగా పరిగణించబడదు. సింపుల్‌గా చెప్పలాంటే ఒక వ్యక్తి బిట్‌కాయిన్‌పై రూ. 1000 లాభం, మరోక క్రిప్టోకరెన్సీ ఈథిరియం రూ. 700 నష్టాన్ని పొందినట్లయితే, సదరు వ్యక్తి రూ.1000పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ సదరు వ్యక్తి పొందిన నికర లాభం రూ. 300 పన్ను ఉండదు. అదేవిధంగా, స్టాక్‌లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా రియల్ ఎస్టేట్ వంటి ఇతర ఆస్తులలో లాభ, నష్టాలకు వ్యతిరేకంగా క్రిప్టోకరెన్సీపై లాభ, నష్టాలను సెట్ చేయలేరు. 3) ఐటీ రిటర్న్ ఫైలింగ్ ఆదాయపు పన్ను రిటర్న్‌లలో చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు గాను కొత్త నిబంధన అమలులోకి రానుంది. పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు సంబంధిత అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన రెండు సంవత్సరాలలోపు అప్డేటేడ్ రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. 4) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పీఎస్ మినహాయింపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు సెక్షన్ 80CCD(2) కింద తమ బేసిక్ జీతం, డియర్నెస్ అలవెన్స్‌లో 14 శాతం వరకు ఎన్పీఎస్ కంట్రిబ్యూషన్ కోసం ఎంప్లాయర్ ద్వారా డిడక్షన్‌ను క్లెయిమ్ చేసుకోగలరు. గతంలో ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉండేది. 5) పీఎఫ్ ఖాతాపై పన్ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను (25వ సవరణ) రూల్-2021 ను అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ రూ. 2.5 లక్షలు దాటితే పన్ను విధించబడుతోంది. దీనికి మించి కంట్రిబ్యూషన్ చేస్తే, వడ్డీ ఆదాయంపై పన్ను విధించబడుతుంది. 6) కోవిడ్-19 చికిత్స ఖర్చులపై పన్ను మినహాయింపు జూన్ 2021 కేంద్ర ప్రకటన ప్రకారం...కోవిడ్ వైద్య చికిత్స కోసం డబ్బు పొందిన వ్యక్తులకు పన్ను మినహాయింపు అందించబడింది. అదేవిధంగా, కోవిడ్ కారణంగా ఒక వ్యక్తి మరణించినప్పుడు కుటుంబ సభ్యులు స్వీకరించే రూ. 10 లక్షల డబ్బుపై టాక్స్ మినహాయింపు ఉంటుంది. సదరు వ్యక్తి మరణించిన తేదీ నుంచి 12 నెలలలోపు డబ్బు అందినట్లయితే ఎలాంటి టాక్స్ ఉండదు. 7) వైకల్యం ఉన్న వ్యక్తులకు పన్ను మినహాయింపు వికలాంగుల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వైకల్యం కల్గిన వ్యక్తికి బీమా పథకాన్ని తీసుకోవచ్చు. దీనిపై పన్ను మినహాయింపు ఉంటుంది. చదవండి: ఈపీఎఫ్ చందాదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్! -
మార్చి31 పన్ను చెల్లింపుదారులకు ఎంత ముఖ్యమో మీకు తెలుసా?
మరో 4రోజుల్లో ఫైనాన్షియల్ ఇయర్ 2021-22 ముగియనుంది. ముగుస్తున్న ఈ ఆర్ధిక సంవత్సరం ట్యాక్స్ పేయర్లకు చాలా కీలకం. అందుకే ఆర్ధిక నిపుణులు సైతం వారిని అప్రమత్తం చేస్తున్నారు. మార్చి31 లోపు ట్యాక్స్‌కు సంబంధించిన పనులన్నీ పూర్తి చేయాలని చెబుతున్నారు. అయితే ఇప్పుడు పన్ను చెల్లించే వారికి ముగియనున్న ఆర్ధిక సంవత్సరం ఎంత ముఖ్యమో తెలుసుకుందాం. ఆధార్ కార్డ్, పాన్ లింకింగ్: పాన్, ఆధార్ లింక్ చేయడానికి చివరి తేదీ మార్చి31 అలా చేయకపోతే పాన్ డియాక్టివేట్ అవుతుంది. అందుకు అదనంగా ట్యాక్స్ యాక్ట్ 1961కింద రూ.10వేల వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2020-2021 రిటర్న్ దాఖలు: ఈ ఆర్థిక సంవత్సరం అంటే మార్చి 31లోపు ఐటీ రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆలస్యం చేస్తే రూ.1000 నుంచి 5000 జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఈ-ధృవీకరణ : ఫైనాన్షియల్ ఇయర్ 2019-2020కి దాఖలు చేసిన ఐటీఆర్ ఈ-ధృవీకరణ మార్చి 31,2021 వరకు చేయబడుతుంది. అయితే ఆర్ధిక సంవత్సరం 2019కి సంబంధించి తమ ఐటీఆర్‌ను ఈ-వెరిఫై చేయని పన్ను చెల్లింపుదారులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సంస్థ 2021-2022 వరకు అంటే మార్చి 31వరకు గడువు ఇచ్చింది. ఈ తేదీల లోపు ఎప్పుడైన ఈ - ధృవీకరణ చేయాల్సి ఉంటుంది. ముందస్తు పన్ను చెల్లింపు: ముందస్తు పన్ను చెల్లింపు కోసం చివరి వాయిదా గడువు తేదీ మార్చి15, 2022. అయితే అసెస్సీ 2021-2022 ఆర్థిక సంవత్సరానికి ముందస్తు పన్నును ఎప్పుడైనా అంటే మార్చి 31,2022లో లోపు చెల్లించాల్సి ఉంటుంది. పన్ను ఆదా పథకాలలో పెట్టుబడి: ఆర్ధిక సంవత్సరం 2021-2022కి సంబంధించి పన్ను ఆదా పథకాలలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ మార్చి 31, 2022. -
మార్చి 31లోగా ఈ పనులు పూర్తి చేయండి… లేకపోతే మీకే నష్టం..!
ప్రతి ఏడాదిలో కొత్త నెల వచ్చింది అంటే చాలు దేశంలో కొత్త నిబనంధనలు అమలులోకి వస్తాయి. రాబోయే ఏప్రిల్ నెల నుంచి కూడా అనేక కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ముఖ్యంగా, మార్చి 31కి ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి అవుతుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభకానుంది. పాత నిబంధనలు స్థానంలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేస్తాయి. అందుకే, ప్రతిఒక్కరూ తమ ఆర్థిక ప్రణాళిక విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం కూడా ఇదే. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలో కొన్ని ఆర్థిక ప్రణాళికలకు సంబంధించిన ముఖ్యమైన పనులను తప్పక పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పన్ను మినహాయింపుల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు వర్తించే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, జాతీయ పింఛన్, జాతీయ ఫించను స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన, ఈఎల్ఎస్ఎస్ ఇలా అనేక స్కీమ్‌లలో మదుపు చేసేందుకు అవకాశం ఉంది. ఇంకా సెక్షన్ 80సీ పరిమితి రూ.1,50,000 పూర్తి కాకపోతే.. అనుకూలమైన పెట్టుబడి స్కీమ్‌ను ఎంచుకోవచ్చు. ఇప్పటికే తీసుకున్న పీపీఎఫ్, ఎన్పీఎస్, ఎస్ఎస్వై స్కీమ్‌లలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఒకసారైనా మదుపు చేయకపోతే మార్చి 31లోపు తప్పనిసరిగా కనీస మొత్తం అయినా పెట్టుబడి పెడితే మంచిది. ఆధార్-పాన్ లింక్ మీరు ఇంకా మీ పాన్ నెంబర్‌ను మీ ఆధార్ నెంబర్‌తో లింకు చేయకపోతే మీరు మార్చి 31, 2022 వరకు చేసుకోవచ్చు. ఈ తేదీలోగా లింక్ చేయకపోతే, మీ పాన్ నెంబర్ ఇన్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. మీరు రూ.1,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మీ పాన్ నెంబర్ పనిచేయకపోతే షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర సెక్యూరిటీలు వంటి ఆర్థిక లావాదేవీల్లో పెట్టుబడి పెట్టడానికి మీకు అవకాశం ఉండదు. అలాగే, మీకు ఎటువంటి రుణాలు కూడా రాకపోవచ్చు. ఐటీఆర్ ఫైలింగ్ ఐటీఆర్ ఫైలింగ్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీరు ఇంకా ఐటీ రిటర్న్ ఫైల్ చేయకపోతే మీకు మరో మంచి అవకాశం ఉంది. లేట్ రిటర్న్ దాఖలు చేయడానికి మీకు మార్చి 31, 2022 వరకు సమయం ఉంది. ఫైల్ చేయకపోతే తర్వాత లావాదేవీల విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొవచ్చు. 1961లోని సెక్షన్ 234ఎఫ్ ప్రకారం.. ఐటీ రిటర్న్ ఆలస్యంగా దాఖలు చేయరాదు. అలా చేస్తే.. రూ.10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. కేవైసీ అప్డేట్ మీ బ్యాంకులో మీ అకౌంట్‌కు కేవైసీ పూర్తి చేసుకోండి. పాన్, ఆధార్, చిరునామా ధృవీకరణతో పాటు బ్యాంకు అడిగిన ఇతర వివరాలను మార్చి 31లోపు పూర్తి చేసుకోండి. (చదవండి: ఇక తగ్గేదే లే.. ఈవీ రంగంలో సుజుకి మోటార్ భారీ పెట్టుబడులు!) -
రూ.1.83 లక్షల కోట్ల పన్ను రిఫండ్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 7 వరకు 2.14 కోట్ల పన్ను చెల్లింపుదారులకు రూ.1.86 లక్షల కోట్ల పన్ను రిఫండ్లు (తిరిగి చెల్లింపులు) పూర్తి చేసినట్టు ఆదాయపన్ను శాఖకు చెందిన ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) తెలిపింది. ఇందులో రూ.67,442 కోట్లు వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదారులకు సంబంధించి రిఫండ్లు కాగా, మిగిలిన మొత్తం కార్పొరేట్ పన్ను రిఫండ్‌గా పేర్కొంది. ఆదాయపన్ను శాఖకు సంబంధించి విధాన నిర్ణయాలను సీబీడీటీయే చూస్తుంటుంది. -
మార్చి నెల ముగిసేలోపు ఈ పనులు వెంటనే చేసేయండి.. లేకపోతే మీకే నష్టం!
ప్రతి ఏడాది కొత్త ఆర్ధిక సంవత్సరం నుంచి చాలా కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. అందులో భాగంగానే మార్చి చివరిలో, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో చాలా పాత నిబంధనలు మారుతాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ ఆర్థిక ప్రణాళిక కూడా తప్పనిసరి. ఏడాది పూర్తవుతున్నా కొన్ని పనులు పూర్తిచేయకపోతే మనం నష్టపోవాల్సి వస్తోంది. మార్చి 31లోపు పూర్తి చేయవలసిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆదాయపు పన్ను రిటర్న్ ఎవై 2021-22 కోసం ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి గడువు తేదీని మార్చి 31, 2022 వరకు పొడిగించబడింది. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 234ఎఫ్ ప్రకారం.. ఐటీ రిటర్న్ ఆలస్యంగా దాఖలు చేస్తే జరిమానా రూ.10,000 వరకు విధించే అవకాశం ఉంది. జరిమానా నుంచి తప్పించుకోవడానికి మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను చివరి తేదీకి ముందే ఫైల్ చేయండి. పాన్ నెంబర్‌తో - ఆధార్ లింకు ఆధార్ లింకింగ్ గడువు తేదీ మార్చి 31, 2022 వరకు ఉంది. ప్రభుత్వం సెప్టెంబర్ 30, 2021న గడువును పొడిగించిన తర్వాత మీ పాన్ నెంబర్‌ను- ఆధార్ నెంబర్‌తో చట్టాల ప్రకారం లింకు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గడువు తేదీలోగా రెండు డాక్యుమెంట్ లింక్ చేయడంలో విఫలమైనట్లయితే మీపై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 272బి కింద మీరు రూ.10,000 జరిమానా విధించవచ్చు. కేవైసీ అప్డేట్ బ్యాంక్ ఖాతాలలో కేవైసీని పూర్తి చేయడానికి గడువు మార్చి 31 వరకు ఉంది. పాన్ చిరునామా రుజువు, బ్యాంక్ సూచించిన ఇతర సమాచారంతో సహా కేవైసీ అప్డేట్'లో భాగంగా సమర్పించాలి. పన్ను ఆదా ఈ సంవత్సరానికి మీ ఆదాయాన్ని అంచనా వేయడానికి, సెక్షన్ 80C కింద పన్ను ఆదా కోసం మీరు ఎంత పెట్టుబడి పెట్టవలసి ఉంటుందో తెలుసుకోవడానికి ఇది సరైన సమయం. మీరు ఇప్పటికే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన మొదలైన పన్ను ఆదా పథకాలలో పెట్టుబడి పెట్టినట్లయితే, ఈ ఖాతాలను యాక్టివ్‌గా ఉంచడానికి మీరు మార్చి 31లోపు కనీస సహకారం అందించాలి. కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయకపోతే ఖాతా క్లోజ్ చేసే అవకాశం ఉంది. (చదవండి: హైదరాబాద్‌లో డేటాసెంటర్.. ప్రపంచంలోనే అతి పెద్దదిగా) -
ఐటీ రిఫండ్.. రూ.1.83 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2022 ఫిబ్రవరి 21 నాటికి 2.07 కోట్ల పన్ను చెల్లింపుదారులకు రూ.1.83 లక్షల కోట్ల రిఫండ్లు చెల్లించినట్టు వెల్లడించింది. వ్యక్తిగత ఆదాయపన్ను రిఫండ్లు రూ.65,498 కోట్లు, కార్పొరేట్ పన్ను రిఫండ్లు రూ.1.17 లక్షల కోట్ల చొప్పున ఉన్నట్టు తెలిపింది. ఇందులో 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1.67 కోట్ల పన్ను చెల్లింపుదారులకు చేసిన రూ.33,819 కోట్ల రిఫండ్లు కూడా ఉన్నట్టు ప్రకటించింది. -
ITR: పన్ను భారం.. చట్టంలో లొసుగులు.. అబద్దపు లెక్కలు..
సాధారణంగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో అందరూ ట్యాక్స్ ప్లానింగ్ గురించి ఆలోచిస్తారు. 31–03–22తో పూర్తయ్యే ఆర్థిక సంవత్సరం విషయంలో ఆలోచనలు చేసి, అమలుపర్చాల్సిన సమయం ఇదే. ఆలస్యం చేయకండి. ట్యాక్స్ ప్లానింగ్‌నే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అని కూడా అనవచ్చు. ఇలా ప్లానింగ్ చేయడం వల్ల రాజమార్గంలో పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. పన్నును ఎగవేయకూడదు కానీ.. ప్లానింగ్ ద్వారా పన్నుని తగ్గించుకోవచ్చు. ట్యాక్స్ ప్లానింగ్ గురించి కొన్ని ముఖ్యమైన సూచనలు.. 1. మీరు ఏ ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్ట్ చేస్తారో ఆ ఆర్థిక సంవత్సరానికి మాత్రమే మినహాయింపు లభిస్తుంది. 2. ఒక సంవత్సరంలో చేస్తే, ఆ తరువాత సంవత్సరంలో ఎటువంటి మినహాయింపు రాదు. 3. ట్యాక్స్ ప్లానింగ్ నూటికి నూరు పాళ్లు చట్టరీత్యా ఆమోదయోగ్యమైనది. 4. చట్టంలోని లొసుగులు ఆసరాగా తీసుకుని పన్ను భారం లేకుండా చేసుకోవడం.. తగ్గించుకోవటం తప్పు. ఉదాహరణకు దొంగ క్లెయిములు, నకిలీ పత్రాలు సృష్టించి క్లెయిమ్ చేయడం, అబద్ధపు లెక్కలు చూపించడం, లెక్కలు రాయకపోవడం, అబద్ధపు ఖర్చులు రాయడం, వ్యక్తిగత ఖర్చులు పరిగణనలోకి తీసుకోవడం.. ఇలా వంద దారులు ఉన్నాయి. కానీ, ట్యాక్స్ ప్లానింగ్‌కు ఒకే ఒక మార్గం .. రాజమార్గం ఉంది. 5. మీ ఆదాయాన్ని సక్రమ మార్గంలో సంపాదించటమే ట్యాక్స్ ప్లానింగ్‌కు నాంది. దానికి తగ్గట్లుగా పునాది పడితే సహజసిద్ధంగా మంచి ఆలోచనలే వస్తాయి. 6. మంచి ఆలోచన అంటే.. ఆ ఆలోచన/ప్లానింగ్ అందరికీ ఒకేలాగా ఉండదు. మార్గం ఒకటే అయినా విధివిధానాలు వేరుగా ఉంటాయి. ప్రాధాన్యతలు వేరు.. ఉదాహరణకు 80సిలో ఎన్నో అంశాలు ఉన్నాయి. ఎవరి ప్రాధాన్యత, అవసరాలను బట్టి వారు ఇన్వెస్ట్ చేస్తారు. 7. వ్యాపారం, వృత్తి, స్థాయి, రెసిడెన్స్ స్టేటస్, వయస్సు మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. 8. కేవలం ఒక వ్యక్తి పన్ను భారం తగ్గించే ధోరణి కాకుండా కుటుంబంలోని ఇతర సభ్యుల అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాహరణకు పిల్లల చదువులు, అమ్మాయి పెళ్లి, ఇల్లు కట్టుకోవడం మొదలైన వాటిని పేర్కొనవచ్చు. 9. పక్కింటి పరంధామయ్యతో మీకు పని లేదు. ఎదురింటి ఏకాంబరం గారితో ఏమీ మాట్లాడక్కర్లేదు. మీ ప్లానింగ్ మీదే. పోలిక వద్దు.. పోటీ వద్దు. 10. మీ కుటుంబ ఆర్థిక వ్యవహారాలను చట్టప్రకారం మలచుకోండి. ఆదాయం, ఖర్చులు, ఇన్వెస్ట్మెంట్లు, సేవింగ్స్, పన్నులు చెల్లించటం, రిటర్నులను గడువు తేదీ లోపల వేయటం, ట్యాక్స్ ప్లానింగ్, కుటుంబపు ఆర్థిక పరిస్థితి స్థిరంగా, సక్రమంగా సాగేలా ప్లానింగ్ చేసుకోవడం ముఖ్యం. ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో ట్యాక్స్ ప్లానింగ్ కూడా భాగమే. కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) చదవండి: పన్ను చెల్లింపు దారులకు శుభవార్త!! రూ.లక్షవరకు పన్ను ఆదా చేసుకోవడం ఎలానో మీకు తెలుసా? -
పన్ను చెల్లింపు దారులకు శుభవార్త!! రూ.లక్షవరకు పన్ను ఆదా చేసుకోండిలా?
మీరు 2021-22 ఆర్ధిక సంవత్సరంలో ట్యాక్స్ చెల్లిస్తున్నారా? ఈ సందర్భంగా మీరు ట్యాక్స్ సేవ్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. సెక్షన్ 80సీ కాకుండా సెక్షన్ 80డీ కింద అదనంగా మరో రూ.1లక్ష వరకు అదా చేసుకోవచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి పన్ను చెల్లించడానికి 2022 మార్చి,31చివరి తేదీ. అయితే ఈ ట్యాక్స్ చెల్లింపు సందర్భంగా సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల పరిమితి వరకు పన్నును ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు సెక్షన్ 80సీతో పాటు సెక్షన్ 80డీ కింద పన్ను ఆదా చేసుకోవచ్చు. సెక్షన్ 80డీలో వయస్సు ఆధారంగా నిర్దిష్ట పరిమితి వరకు మీరు తీసుకున్నహెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియంపై సెక్షన్ 80సీ పరిమితి కంటే ఎక్కువ మీకు అదనపు పన్ను ప్రయోజనాల్ని పొందవచ్చు. మీరు,మీ తల్లిదండ్రులు 60ఏళ్లు పైబడిన వారు అంటే సీనియర్ సిటిజన్లు అయితే హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్లాన్‌ను తీసుకోవడం ద్వారా మీరు రూ.1లక్ష వరకు ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకమైన సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు అనేకం ఉన్నాయి. మీరు ఎలాంటి ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకున్నా పన్ను ఆదా చేసుకునేందుకు ఆదాయపు పన్ను చట్టం 961లోని సెక్షన్ 80డీ కిందకు వస్తుంది. ఇందులో గరిష్ట పన్ను ప్రయోజనం రూ.25,000 లేదా రూ.50,000 మాత్రమే. అయితే వాస్తవ పన్ను ప్రయోజనం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇది మీ వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు నిర్దిష్ట వయస్సు కంటే ఎక్కువ ఉంటే మీరు పొందే మొత్తం మినహాయింపు సుమారు రూ.లక్షరూపాయలు. ఆరోగ్య బీమా ప్రీమియం 60 ఏళ్లలోపు వ్యక్తులకు రూ. 25,000 వరకు, 60 ఏళ్లు పైబడిన వారికి రూ. 50,000 వరకు పన్ను మినహాయింపుగా క్లెయిమ్ చేయవచ్చు. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు మీ కోసం, మీ తల్లిదండ్రుల కోసం (కనీసం 60 సంవత్సరాలు) ఆరోగ్య బీమా ప్లాన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, మొత్తం పన్ను ప్రయోజనాన్ని రూ.75,000 వరకు పొందవచ్చు. మీరు, మీ తల్లిదండ్రులు ఇద్దరూ 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గలవారైతే, గరిష్టంగా రూ.1,00,000 వరకు మినహాయింపు పొందవచ్చు” అని క్యూబీఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ,సీఈఓ పంకజ్ అరోరా చెప్పారు. చెల్లించిన ప్రీమియం మీ స్థూల మొత్తం ఆదాయాన్ని సమాన మొత్తానికి తీసుకువస్తుంది. తద్వారా మీ పన్ను బాధ్యత తగ్గుతుంది. -
ట్యాక్స్ పేయర్స్కి షాక్! బడ్జెట్లో అవకాశం అన్నారు.. వాడుకోబోతే మెలిపెడుతున్నారు
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారు ఒక అసెస్మెంట్ సంవత్సరానికి ఒక్క విడతే రిటర్నులను (ఐటీఆర్) సవరించేందుకు (అప్డేట్) అనుమతి ఉంటుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి చైర్మన్ జేబీ మహాపాత్ర తెలిపారు. పన్ను రిటర్నులకు సంబంధించి వెల్లడించాల్సినది ఏదైనా నిజాయితీగా మర్చిపోయిన వారికి ఇది అనుకూలంగా ఉంటుందన్నారు. సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐటీఆర్‌లను దాఖలు చేసిన తర్వాత రెండేళ్ల వరకు వాటిని సవరించుకోవచ్చంటూ 2022–23 బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించడం తెలిసిందే. ఇలా సవరించినప్పుడు పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉంటే.. 12 నెలల్లోపు సవరించినప్పుడు వాస్తవంగా చెల్లించాల్సిన పన్నుకు 25% అదనం, వడ్డీ కట్టాలి. 12 నెలల తర్వాత సవరణ రిటర్నులు వేస్తే అప్పుడు వాస్తవ పన్నుకు అదనంగా 50 శాతం, వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. చదవండి: ట్యాక్స్ పేయర్స్కి గుడ్‌న్యూస్! నిర్మలమ్మ వరాలు -
వేతన జీవులకు నిర్మలా సీతారామన్ భారీ షాక్!
అడగనిదే అమ్మయినా పెట్టదంటారు. అందుకని వేతన జీవులు తమ వేదనలను వెలిబుచ్చుతూ ఎన్నో విన్నపాలు వినవలె అంటూ విన్నవించుకున్నారు. కానీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిగి రాలేదు. చలించలేదు. పెడచెవిన పెట్టారో .. శీతకన్ను వేశారో .. మొత్తానికి చిన్న చూపే చూశారనే చెప్పాలి. కరోనా నేపథ్యంలో ఆర్థిక స్థితి బాగులేదని సరిపెట్టుకుందామనుకున్నా ముందు రోజు విడుదల చేసిన ‘ఆర్థిక సర్వే‘ ఎంతో ఆశాజనకంగా ఉంది. స్టాండర్డ్ డిడక్షన్ పెరుగుతుందని ఆశించారు. కానీ పెంచలేదు. సెక్షన్ 80సిలో సేవింగ్స్ లిమిట్ పెరుగుతుందనుకున్నారు. పిల్లల స్కూలు ఫీజుకు ఎక్కువ మినహాయింపు లభిస్తుందనుకున్నారు. ఇంటి లోన్ మీద వడ్డీకి మినహాయింపు పెరుగుతుందని అనుకున్నారు. కానీ.. భారతదేశాన్ని ’డిజిటల్’ భారతంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో నీతిగా, నిజాయితీగా క్రమం తప్పకుండా పన్నులు చెల్లించే వేతనజీవులకు ఎటువంటి వెసులుబాటు లభించలేదు. నిన్న, మొన్నటి వరకూ ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడి అందరూ రిటర్నులు వేశారు. వెబ్సైట్లో దురదృష్టవశాత్తూ ఏర్పడ్డ స్వాభావిక ఇబ్బందుల వల్ల తుది గడువును పలు మార్లు పొడిగించి చివరికి మమ అనిపించింది. ఇప్పుడు కొత్త ఫెసిలిటీ ఇస్తారట. అది అమల్లోకి వచ్చినప్పటి మాట. ఫెసిలిటీ ఇవ్వడమనేది ఎటువంటి ఉపశమనం కాదు. అది బాగా పనిచేస్తే త్వరితగతిన ఫైలింగ్ చేసుకోవచ్చు. శ్లాబ్రేట్లు యథాతథం.. బేసిక్ లిమిట్ పెంచలేదు. శ్లాబ్ రేట్లు యథాతథంగా ఉంచారు. రేట్లలో మార్పు లేదు. పైపెచ్చు పెంచకపోవడమే ఊరట అన్నారు మంత్రి. మిగతా రంగాల్లో గ్రామీణం, వ్యవసాయం, ఇళ్లు, ఇన్ఫ్రా, కరోనా నివారణ, క్యాపిటల్ ఖర్చులు .. వీటి ద్వారా పరోక్షంగా ప్రయోజనం ఉంటుందని ముందు ముందు ఎటువంటి ఆశలకు తావు ఇవ్వకుండా అడ్డుకట్ట వేశారు. ‘విభిన్న సామర్థ్యం‘ ఉన్నవారికి ఇచ్చిన .. లేదా పొందుపర్చిన ఉపశమనం నామమాత్రమే. చాలా కొద్ది మందికే ఇది లభిస్తుంది. ఇదొక మంచి అవకాశం అని చెబుతున్నారు. రిటర్నుల్లో సవరణలు చేసుకోవచ్చని అంటున్నారు. అయితే, రివైజ్ చేసినప్పుడు ఆదాయం పెరిగితే .. సహజంగానే పన్నుభారం పెరుగుతుంది. వడ్డీలు కూడా కట్టాలి. కొత్త మార్పుల ప్రకారం అయితే.. మొదటి సంవత్సరం లోపల మార్పులు చేసుకుంటే 25 శాతం అదనం .. రెండో సంవత్సరం మొదలై పూర్తయ్యేలోపల 50 శాతం అదనం కట్టాల్సి ఉంటుంది. దీనితో ఎటువంటి ప్రయోజనమూ లేదు. -
ట్యాక్స్ పేయర్స్కి గుడ్‌న్యూస్! నిర్మలమ్మ వరాలు
పన్ను చెల్లింపుదారులకు తొలి గుడ్‌న్యూస్ వెలువడింది. ట్యాక్స్ రిటర్న్ అప్డేట్ చేసుకునేందుకు రెండేళ్ల సమయం పెంచుతున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రకటించారు. ఐటీ రిటర్న్‌లో లోపాలను సవరించుకునేందుకు పన్ను చెల్లింపుదారులకు ఇది మంచి అవకాశమని మంత్రి అన్నారు. పన్నులు చెల్లింపులు మరింత సులభం చేసేందుకు ప్రభుత్వం ఈ ఫైలింగ్‌ను అమల్లోకి తేగా..టెక్నికల్ గ్లిచెస్తో అనేక మంది ఇబ్బందులు పడ్డారు. వర్క్‌ఫ్రం హోం అమలవుతున్నందున స్టాండర్డ్ డిడక్షన్‌లో పలు సవరణలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. మరి ఈ బడ్జెట్లో దానికి సంబంధించిన అంశం ఎప్పుడు ప్రస్తావనకు వస్తుందా అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఇన్‌ట్యాక్స్ శ్లాబుల్లో కూడా మార్పులు తేవాలనే డిమాండ్లు ఉన్నాయి. అయితే కేంద్ర బడ్జెట్లో వీటికి అవకాశం కల్పించలేదు. పన్నులకు సంబంధించిన అనుబంధ సెక్షన్లలో సైతం ప్రభుత్వం ఎటువంటి మార్పులు చేయలేదు. పన్ను గురించి బడ్జెట్లో పేర్కొన్న అంశాలు - కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 14 శాతం పన్ను ఆదా - సహకార సంస్థలకు సంబంధించి ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్ రేటుని 18.50 శాతం నుంచి 15 శాతానికి తగ్గింపు - సహకార సంస్థలు చెల్లించే సర్ ఛార్జీలు 7 శాతం తగ్గింపు - నేషనల్ పెన్షన్ స్కీంలో డిడక్షన్ 14 శాతం పెంచుకునే వెసులుబాటు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఐటీఆర్ దాఖలుతో పని పూర్తయినట్టు కాదు
ఆదాయపుపన్ను రిటర్నుల దాఖలు గడువు డిసెంబర్ 31 తో ముగిసింది. జూలైతోనే ముగిసిన గడువును.. కరోనా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ చివరి వరకు పొడిగించింది. దీంతో చాలా మంది డిసెంబర్లో రిటర్నులు దాఖలు చేశారు. రిటర్నులు దాఖలుతో బాధ్యత ముగిసిందని అనుకోవద్దు. ఆ తర్వాత తమ వైపు నుంచి దృష్టి పెట్టాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. చివరి నిమిషంలో వేయడం వల్ల అందులో తప్పులు దొర్లి ఉంటే వెంటనే రివైజ్డ్ రిటర్నులు వేసుకోవాలి. ఈ వెరిఫై చేస్తేనే వేసిన రిటర్నులు చెల్లుబాటు అవుతాయి. ఇలాంటి ముఖ్యమైన అంశాల గురించి వివరించే కథనమే ఇది.. ఈ ఫైలింగ్ పోర్టల్‌పై ఐటీఆర్ దాఖలు చేయడం ప్రాథమికంగా చేయాల్సిన పని. తర్వాత ఆ రిటర్నులను ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి మీరే దాఖలు చేశారనడానికి నిదర్శనం ఏమిటి? అందుకనే ధ్రువీకరణ ప్రక్రియ. దాంతో ఆ రిటర్నుల్లో పేర్కొన్న సమాచారానికి మీరు బాధ్యత వహిస్తున్నట్టు అవుతుంది. గతేడాది కొత్త ఈ ఫైలింగ్ పోర్టల్ తీసుకురావడం తెలిసిందే. ఎన్నో సాంకేతిక సమస్యలు వెక్కిరించడంతో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. డిసెంబర్ చివరి వారంలో హడావుడిగా రిటర్నులు వేసిన వారు కూడా ఉన్నారు. కనుక ఒకసారి రిటర్నులు ధ్రువీకరించినదీ, లేనిదీ చూసుకోవాలి. వెరిఫికేషన్ చేయని రిటర్నులు చెల్లవు. రిటర్నులు సమర్పించిన తేదీ నుంచి 120 రోజుల్లోపు ధ్రువీకరించేందుకు సమయం ఉంటుంది. అక్నాలెడ్జ్మెంట్ పత్రం లేదా ఫామ్–5 పత్రంపై (ఆదాయపన్ను శాఖ నుంచి డౌన్లోడ్ చేసుకుని) సంతకం చేసి ఆ కాపీని పోస్ట్ ద్వారా ఆదాయపన్ను శాఖ, బెంగళూరు కార్యాలయానికి పంపించాలి. కొరియర్ ద్వారా పంపకూడదు. భౌతికంగా చేసే ధ్రువీకరణ ఇది... ఇలా కాకుండా ఆన్లైన్లో ఈ వెరిఫై చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ నుంచి లేదంటే ఆధార్ ఓటీపీ ద్వారా, బ్యాంకు లేదా డీమ్యాట్ ఖాతా నంబర్ సాయంతోనూ వెరిఫై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. వీటిల్లో మీకు నచ్చిన ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అప్పుడు యూజర్ మొబైల్‌కు వన్‌టైమ్ పాస్వర్డ్ వస్తుంది. ఈ కోడ్ లేదా ఓటీపిని ఈఫైలింగ్ పోర్టల్‌పై ఎంటర్ చేసి, సబ్మిట్ కొట్టడంతో ఈ వెరిఫికేషన్ పూర్తవుతుంది. వెరిఫై చేసినట్టు సమాచారం కూడా వస్తుంది. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలను ఉపయోగించుకుని ఓటీపీ జనరేట్ చేసుకోవడం ద్వారా ఈవెరిఫై చేయవచ్చు. సదరు బ్యాంకులో ఖాతా ఉండి, ఖాతాకు పాన్ నంబర్ అనుసంధానించి ఉంటే సరిపోతుంది. సెక్షన్ 44ఏబీ కింద ఖాతాలను ఆడిట్ చేయాల్సి అవసరం ఉన్న వారు తప్పనిసరిగా రిటర్నులు దాఖలు చేసిన వెంటనే.. తమ డిజిటల్ సిగ్నేచర్‌ను ఉపయోగించి ధ్రువీకరించాల్సి ఉంటుంది. పన్ను రిటర్నులు వేసిన 120 రోజులకీ వెరిఫై చేయకపోతే ముందు ఈఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అయ్యి సరైన కారణాన్ని తెలియజేస్తూ జరిగిన ఆలస్యానికి క్షమాపణ తెలియజేయాలి. మీ అభ్యర్థనను ఆదాయపన్ను శాఖ మన్నిస్తే.. అప్పుడు రిటర్నులు ఈ వెరిఫై చేసుకునేందుకు అవకాశం తిరిగి లభిస్తుంది. లేదంటే మీ రిటర్నులను దాఖలు చేయనట్టుగా ఐటీ శాఖ భావిస్తుంది. అప్పుడు సకాలంలో రిటర్నులు వేయనందుకు చట్టప్రకారం అన్ని చర్యలకు బాధ్యత వహించాలి. ఆలస్యపు ఫీజు, చెల్లించాల్సిన పన్ను ఉంటే ఆ మొ త్తంపై నిర్ణీత గడువు తేదీ నుంచి వడ్డీ చెల్లించాలి. రిటర్నుల్లో తప్పులను గుర్తిస్తే..? ఐటీఆర్ దాఖలు చేశారు. ధ్రువీకరించడం కూడా ముగిసింది. కానీ ఆదాయం, మినహాయింపులను పేర్కొనడం మర్చిపోయారనుకోండి. అప్పుడు సవరించిన రిటర్నులు దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంది. అది కూడా రిటర్నులను ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేయక ముందే చేసుకోవాలి. ఇందుకు ప్రత్యేకంగా వేరొక ఫామ్ ఉండదు. ఈ ఫైలింగ్ పోర్టల్‌పై ఒరిజినల్, రివైజ్డ్ అనే ఆప్షన్లు ఉంటాయి. ‘రివైజ్డ్ రిటర్న్’ ఆప్షన్ ఎంపిక చేసుకుని, ముందు దాఖలు చేసిన మాదిరే మొదటి నుంచి ప్రక్రియ అనుసరించాలి. ఒరిజినల్ ఐటీఆర్ ఈ ఫైలింగ్ దాఖలు చేసిన తేదీ, అక్నాలెడ్జ్మెంట్ నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధిత అసెస్మెంట్ సంవత్సరం ముగియడానికి మూడు నెలల ముందుగానే రివైజ్డ్ రిటర్నుల ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. 2020–21 సంవత్సరానికి 2021–22 అసెస్మెంట్ సంవత్సరం అవుతుంది. కనుక 2021 డిసెంబర్ 31ని గడువుగా అర్థం చేసుకోవాలి. ఆలోపే ఐటీఆర్ అసెస్మెంట్ను ఆదాయపన్ను శాఖ పూర్తి చేస్తే గడువు ముగిసినట్టుగా అర్థం చేసుకోవాలి. ఈ రెండింటిలో ఏది ముందు అయితే అదే అమలవుతుంది. 2021–22 అసెస్మెంట్ సంవత్సరానికి సవరించిన రిటర్నుల దాఖలు గడువును ఆదాయపన్ను శాఖ 2022 మార్చి 31 వరకు పొడిగించిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఈ గడువులతో సంబంధం లేకుండా.. మీరు దాఖలు చేసిన రిటర్నులను ఐటీ శాఖ ప్రాసెస్ చేసి సెక్షన్ 143(1) కింద ఇంటిమేషన్ మెయిల్ పంపినట్టయితే గడువు ముగిసిపోయినట్టుగానే పరిగణించాలి. దాంతో రిటర్నులను సవరించుకోలేరు. సాధారణంగా రిటర్నులు దాఖలు చేసి, వెరిఫై చేసిన తర్వాత.. 10–30 రోజుల్లోపే ఆదాయపుపన్ను శాఖ ప్రాసెస్ చేసేస్తుంది. అందుకని రిటర్నులు దాఖలు చేసిన వారు ఆ తర్వాత వారం వ్యవధిలోపే మరొక్క సారి అన్నింటినీ క్షుణంగా సరిచూసుకోవడం మంచిది. రివైజ్డ్ రిటర్నులు వేసుకునేందుకు, ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేసుకునేందుకు సాధారణంగా డిసెంబర్ 31 గడువుగా ఉంటుంది. కనుక ఆలస్యంగా రిటర్నులు వేసే వారికి రివైజ్ చేసుకునేందుకు తగినంత వ్యవధి ఉండకపోవచ్చు. ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేయక ముందు ఎన్ని సార్లు అయినా రివైజ్డ్ రిటర్నులు ఫైల్ చేసుకోవచ్చు. తాజాగా దాఖలు చేసిన ఐటీఆర్‌ను ఐటీ శాఖ పరిగణనలోకి తీసుకుంటుంది. అవకాశం ఉంది కదా అని చాలా సార్లు రివైజ్డ్ రిటర్నులు వేశారనుకోండి.. అప్పుడు ఆదాయపన్ను శాఖ సందేహంతో మీ ఐటీఆర్‌ను స్క్రూటినీ చేయవచ్చు. రిఫండ్ సంగతిదీ.. ఆదాయపుపన్ను రిటర్నులను దాఖలు తర్వాత, ఐటీ శాఖ వాటిని ప్రాసెస్ చేసి 143 (1) ఇంటిమేషన్ ఇవ్వడం పూర్తయి, అందులో ఏ తప్పులూ లేకపోతే రిటర్నుల ప్రక్రియ సంపూర్ణంగా ముగిసినట్టే. చివరిగా ఒకవేళ చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ పన్ను చెల్లించి ఉంటే రిఫండ్‌కు అర్హత ఉంటుంది. రిఫండ్ స్టేటస్ ఏంటన్నది ఐటీ శాఖ ఈ ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డుపై కనిపిస్తుంది. అదనంగా ఎన్ఎస్డీఎల్ పోర్టల్లోనూ చెక్ చేసుకోవచ్చు. https://tin.tin. nsdl.com/oltas/refund-status.html. ఈ లింక్‌ను ఓపెన్ చేసి పాన్ వివరాలు ఇవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు. ఫేస్‌లెస్ ప్రాసెసింగ్ వచ్చిన తర్వాత రిఫండ్లు పన్ను చెల్లింపుదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. 143(1) ఇంటిమేషన్ వచ్చిన 15 రోజుల్లోపే రిఫండ్ కూడా వచ్చేస్తుంది. పలు కారణాల వల్ల ఆలస్యం అయితే, బ్యాంకు ఖాతా వివరాలు (అకౌంట్ నంబర్/ఐఎఫ్ఎస్ నంబర్ తదితర) సరిగా లేకపోవడం వల్ల పెండింగ్‌లో ఉంటే అప్పుడు నూతన ఈఫైలింగ్ పోర్టల్‌కు వెళ్లి సర్వీస్ రిక్వెస్ట్ ఆప్షన్ ద్వారా వివరాలను సరిచేసుకోవచ్చు. రిఫండ్లు ఆలస్యమైనా ఆందోళన చెందక్కర్లేదు. నిర్ణీత గడువు దాటిన తర్వాత నుంచి ఆ మొత్తంపై ప్రతీ నెలా 0.5 శాతం మేర వడ్డీని ఐటీ శాఖ చెల్లిస్తుంది. ఇలా అందుకునే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుందని మర్చిపోవద్దు. ఈ మొత్తాన్ని సంబంధిత ఆర్థిక సంవత్సరం ఆదాయం కింద రిటర్నుల్లో పేర్కొనాల్సి ఉంటుంది. పన్ను కోసం డిమాండ్ నోటీసు వస్తే? పన్ను రిటర్నుల్లో తప్పులు, పొరపాట్లు చేయవచ్చు. ఆదాయపన్ను శాఖ రిటర్నులను ప్రాసెస్ చేసే సమయంలో అందులోని సమాచారం మధ్య అంతరాలు, పోలికల్లేమిని గుర్తిస్తుంది. ఆ వివరాలను 143(1) ఇంటిమేషన్ నోటీసులో పేర్కొంటుంది. పన్ను చెల్లించాల్సి ఉంటే ఆ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. ఐటీ శాఖ పేర్కొన్న సమాచారంతో మీరు ఏకీభవిస్తే ఆ మేరకు పన్ను చెల్లించేస్తే సరిపోతుంది. అలా కాకుండా మీరు ఏదైనా మినహాయింపును పేర్కొనడం మర్చిపోయిన కారణంగా ఆ అంతరం తలెత్తి ఉంటే? అప్పుడు రెక్టిఫికేషన్ రిక్వెస్ట్ దాఖలు చేయాలి. ఆదాయపన్ను శాఖ లెక్కలతో ఏకీభవించడం లేదని లేదా రిటర్నుల్లో పొరపాటు చేశానంటూ అందులో పేర్కొనాలి. పన్ను అధికారులు ఆరు నెలల్లోగా స్పందిస్తారు. నాలుగు రకాల రెక్టిఫికేషన్ రిక్వెస్ట్‌లు ఉన్నాయి. రిటర్నుల్లో సరిపోలని సమాచారం అసలు ఏంటన్న దాని ఆధారంగా వీటిల్లో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. -
Corporate IT Returns : ఇన్‌కం ట్యాక్స్.. వన్మోర్ ఛాన్స్..
న్యూఢిల్లీ: కార్పొరేట్లు 2021 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి (2021–22 అసెస్మెంట్ ఇయర్) సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి గడువును మార్చి 15వ తేదీ వరకూ పొడిగిస్తూ, సీబీడీటీ (ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్) కీలక నిర్ణయం తీసుకుంది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి పన్ను ఆడిట్ నివేదిక, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఆడిట్ నివేదికను దాఖలు చేయడానికి గడువును కూడా ఫిబ్రవరి 15 వరకు పొడిగిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. కార్పొరేట్లకు ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌కు గడువు పొడిగింపు ఇది మూడవసారి. చదవండి:ఇక ఆర్థిక వ్యవహారాల గుట్టు రట్టు.. కొత్తగా అమల్లోకి ఏఐఎస్ -
ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కేంద్రం తీపికబురు..!
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను శాఖ తీపికబురు అందించింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు గడువును మార్చి 15 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. వాస్తవానికి ఈ గడువు డిసెంబర్ 31 వరకే ఉంది. ఈ రిటర్న్ ఫైలింగ్ గడువు పొడిగింపు గురించి ఆదాయపు పన్ను శాఖ కూడా ట్వీట్ చేసింది. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితి కారణంగా పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల కారణంగా మార్చి 15 వరకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు సీబీడీటీ తెలిపింది. ఆదాయపు పన్ను చట్టం 1961 నిబంధనల కింద వివిధ ఆడిట్ నివేదికలను ఈ-ఫైలింగ్ చేస్తున్నప్పుడు ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా గడువును కూడా పొడిగించినట్లు పేర్కొంది. 2021, ఏప్రిల్ 1 నుంచి 2022, జనవరి 3 వరకు 1.48 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రత్యక్ష్య పన్నుల శాఖ (సీబీడీటీ) రూ.1,50,407 కోట్లకు పైగా రీఫండ్స్ విడుదల చేసినట్లు ఆదాయపన్ను శాఖ జనవరి 5న తెలిపింది. ఇందులో 1.46 కోట్ల మందికి రూ.51,194 కోట్లు ఇన్‌కం టాక్స్ రీఫండ్స్ జారీ చేయగా 2.19 లక్షల మందికి కార్పొరేట్ టాక్స్ రీఫండ్ రూపంలో రూ.99,213 కోట్లు రీఫండ్ చేసింది. On consideration of difficulties reported by taxpayers/stakeholders due to Covid & in e-filing of Audit reports for AY 2021-22 under the IT Act, 1961, CBDT further extends due dates for filing of Audit reports & ITRs for AY 21-22. Circular No. 01/2022 dated 11.01.2022 issued. pic.twitter.com/2Ggata8Bq3 — Income Tax India (@IncomeTaxIndia) January 11, 2022 (చదవండి: ఎలక్ట్రిక్ వాహనాల దెబ్బకు ఆ కంపెనీలకు భారీ నష్టాలు..!) -
ఐటీ రిటర్న్స్: గుడ్ న్యూస్ చెప్పిన ఆదాయ పన్ను శాఖ!
IT Returns E Verification Date Extended: ఆదాయ పన్నుల చెల్లింపులు చేయడానికి 2021, డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలతో గడువు ముగిసింది. చాలామంది కోరుకున్నట్లుగా ఐటీ రిటర్న్స్ గడువును పొడిగించలేదు. పైగా పొడిగింపు ఉద్దేశమే లేదంటూ చివరిరోజు స్వయంగా ప్రభుత్వమే ప్రకటన చేసింది. కానీ, రిటర్న్ దాఖలుచేసినా.. ఈ-వెరిఫై పూర్తి కానివాళ్ల కోసం గుడ్ న్యూస్ చెప్పింది. ఐటీ రిటర్ను వెరిఫై ప్రాసెస్ పూర్తి కానివాళ్ల కోసం ఊరట ఇచ్చింది ఆదాయ శాఖ. ఆన్లైన్లో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన టైంలో చాలామందికి కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆన్లైన్లో దాఖలు చేసిన తర్వాత రిటర్ను వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేయటం అంటే.. పాన్‌తో ఆధార్ అనుసంధానమై, సంతకం అవసరం లేకుండా ఓటీపీ ద్వారా పంపటం. అయితే, ఓటీపీ వచ్చిన తర్వాత, పోర్టల్‌లో వేసినా ‘లోడింగ్’ కాకపోవడం వల్ల సబ్మిట్ అవ్వడం లేదు. దీనర్థం రిటర్నును దాఖలు చేసినప్పటికీ ఈ–వెరిఫై పూర్తి కాలేదని. ఇలా ఎంతో మంది .. గంటల తరబడి ప్రయత్నించినా వెరిఫై కాలేదు. ఈ కష్టాలను దృష్టిలో పెట్టుకుని గడువును 2022 ఫిబ్రవరి 28 వరకూ డిపార్ట్మెంటు పెంచింది. ఇది కేవలం వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉన్న వారికి మాత్రమే. రిటర్నులు వేయడానికి పొడిగించినట్లు కాదు. వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉంటే వారు వెంటనే వెరిఫై చేసుకోండి. ఇక పాన్‌తో ఆధార్ అనుసంధానం కాని వారు ‘‘వెరిఫై వయా ఫారం V’’ అని ఆప్షన్ పెట్టాలి. వారికి ఫారం V అంటే అక్నాలెడ్జ్మెంట్ జనరేట్ అవుతుంది. అటువంటి వారు ఫైల్ చేసిన రోజు నుంచి 120 రోజుల్లోగా ఫారంపై సంతకం చేసి బెంగళూరుకు పోస్ట్ ద్వారా పంపాలి. పైన చెప్పిన రెండు పద్ధతుల ద్వారా రిటర్న్ ఫైలింగ్ పూర్తి అయినట్లు చెప్పవచ్చు. గడువు తేది లోపల దాఖలు చేయకపోతే.. ఏ కారణం వల్లనైనా కానివ్వండి.. గడువు తేదీ లోపల రిటర్ను వేయలేకపోతే గాభరా పడక్కర్లేదు. ఈ ఆలస్యానికి, తప్పిదానికి, కాలయాపనకు ఒక వెయ్యి రూపాయలు లేదా రూ. 5,000 పెనాల్టీగా విధిస్తారు. ►1–1–2022 నుండి 31–3–2022 లోపల దాఖలు చేసినట్లయితే సెక్షన్ 234 ఎఫ్ ప్రకారం రూ. 1,000 పెనాల్టీ చెల్లించాలి. రీఫండు క్లెయిమ్ చేసే వారికి ఆ రూ. 1,000 తగ్గిస్తారు. ► నికర ఆదాయం/ ట్యాక్సబుల్ ఇన్‌కం రూ. 5,00,000 దాటి ఉంటే పెనాల్టీ రూ. 5,000 చెల్లించాలి. ఈ రెండూ పెనాల్టీలే. చిన్న మొత్తాలతో వదిలిపోతుంది. ► నికర ఆదాయం లేదా ట్యాక్సబుల్ ఇన్‌కం రూ. 5,00,000 లోపలే ఉంటే గడువు తేదీ లోపలే వేసి ఉంటే రూపాయి కూడా పన్ను కట్టనవసరం లేదు. ► కొంత మందికి వ్యాపారం లేదా వృత్తిలో నష్టం వస్తుంది. గడువు తేదీ లోపల దాఖలు చేసిన వారికి మాత్రమే ఆ నష్టాన్ని రాబోయే సంవత్సరానికి బదిలీ చేయడం సాధ్యపడుతుంది. ఇలా బదిలీ చేయడం వల్ల రాబోయే సంవత్సరాలలో లాభానికి సర్దుబాటు (తగ్గింపు) చేసుకోవచ్చు. ► నష్టం ఉంటే సకాలంలో రిటర్నులు వేయనివారికి చాలా పెద్ద ఇబ్బంది. నష్టం. వారు నష్టాన్ని బదిలీ చేసుకునే హక్కును శాశ్వతంగా కోల్పోతారు. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఏది ఏమైనా, రిటర్నులు సక్రమంగా సకాలంలో వేయడం అన్ని రకాలుగా మంచిది. - కేసీహెచ్ ఏవీఎస్‌ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిఫుణులు -
గడువులోపు ఐటీఆర్ దాఖలు చేయకపోతే.. ఎంత ఆలస్య రుసుము చెల్లించాలో తెలుసా?
2020-21 ఆర్థిక సంవత్సరానికి(మార్చి 2021తో ముగిసింది) సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్)లను ఆన్లైన్లో దాఖలు చేసే గడువు తేదీని కేంద్ర ప్రభుత్వం పొడిగించలేదు. డిసెంబర్ 31, 2021 గడువు ముగిసే నాటికి దాదాపు 5.89 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్)లు దాఖలు చేసినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాదితో పోల్చి చూస్తే జనవరి 10, 2021 నాటికి దాఖలు చేసిన మొత్తం ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్)లు 5.95 కోట్లు. అంటే, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐటీఆర్‌ల దాఖలు చేసిన వారి సంఖ్య తక్కువ. గడువు తేదీ తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయవచ్చా? చాలా వరకు సామాన్య జనం గుడువు తేదీని చివరి తేదీ అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఐటీఆర్ ఫైలింగ్ కు సంబంధించి రెండు తేదీలు ఉంటాయి. ఒకటి గడువు తేదీ, మరొకటి చివరి తేదీ. ఒకవేళ మీరు గడువు తేదీ నాటికి మీ ఐటీఆర్ ఫైల్ చేయకపోతే.. చివరి తేదీ నాటికి మీరు ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. చివరి తేదీ 2022 మార్చి 31 వరకు అన్నమాట. కానీ గడువు తేదీ నాటికి ఐటీఆర్ దాఖలు చేయకపోవడం వల్ల కొంత జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఎంత ఆలస్య రుసుము చెల్లించాలి? గడువు తేదీ తర్వాత ఐటీఆర్ దాఖలు చేసినందుకు ఆలస్య రుసుము కింద రూ.5,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.5 లక్షలకు లోపు ఉన్న పన్ను చెల్లింపుదారులు గడువు తేదీ తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే(మార్చి 31, 2022 చివరి తేదీ లోపు) ఆలస్య రుసుము గరిష్టంగా రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.5 లక్షలకు పైగా ఉన్నట్లయితే, ఆలస్య రుసుము అనేది రూ.5 వేల వరకు ఉంటుంది. (చదవండి: ల్యాప్‌టాప్, పీసీలలో ఇలా చేస్తున్నారా? ఇక మీ పని అయిపోయినట్టే..) -
గడువు(డిసెంబర్ 31)లోపు ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఏమవుతుంది?
2020-2021 ఆర్థిక సంవత్సరానికి లేదా 2021-22 మదింపు సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్) దాఖలు చేయాల్సిన గడువు తేదీ సాధారణంగా జులై 31 కాగా, కరోనా నేపథ్యంలో గడువును డిసెంబర్ 31 వరకు పొడగించిన సంగతి తెలిసిందే. ఇది పన్ను చెల్లింపుదారుల సాధారణ వర్గానికి, వేతనజీవులకు వర్తిస్తుంది. 2021-2022 మదింపు సంవత్సరానికి డిసెంబర్ 31, 2021 లోపు మీ ఐటీఆర్ దాఖలు చేయడంలో విఫలమైతే ఏమి జరుగుతుంది? తెలుసుకుందాం.. గడువు తేదీ ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీనా? చాలా వరకు సామాన్య జనం చివరి తేదీనే గుడువు తేదీ అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఐటీఆర్ ఫైలింగ్ కు సంబంధించి రెండు తేదీలు ఉంటాయి. ఒకటి గడువు తేదీ, మరొకటి చివరి తేదీ. ఒకవేళ మీరు గడువు తేదీ నాటికి మీ ఐటీఆర్‌ని సబ్మిట్ చేయడంలో విఫలమైనట్లయితే, చివరి తేదీ నాటికి మీరు ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. 2021-2022 అసెస్మెంట్ సంవత్సరానికి ఐటీఆర్ సమర్పించాల్సిన గడువు తేదీ జూలై 31, 2021 నుంచి డిసెంబర్ 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. చివరి తేదీ 2022 మార్చి 31 వరకు అన్నమాట. ఐటీఆర్ గడువు లోపు ఫైల్ చేయకపోతే ఏమి జరుగుతుంది? ఒకవేళ మీరు మీ ప్రస్తుత ఐటీఆర్‌ని గతంలో పొడగించిన గడువు తేదీ నాటికి సబ్మిట్ చేయడంలో విఫలమైనట్లయితే(31 డిసెంబర్ 2021 నాటికి) మీరు 31 మార్చి 2022 వరకు చేయవచ్చు. కాని, తర్వాతి సంవత్సరాలకు మీ నష్టాన్ని కొనసాగించే హక్కును మీరు కోల్పోతారు. ఉదాహరణకు ప్రస్తుత సంవత్సరంలో మీ వ్యాపార ఆదాయం, మూలధన లాభాలు లేదా గృహ ఆస్తి కింద రెండు లక్షల రూపాయలకు మించి నష్టం ఉన్నట్లయితే తర్వాతి సంవత్సరాల్లో ఆ నష్టాన్ని చూపించేందుకు వీలుంటుంది. కానీ, ఇప్పుడు డిసెంబర్ 31లోపు రిటర్నులు దాఖలు చేయకపోతే తర్వాత సంవత్సరాల్లో మీ నష్టాన్ని చూపడానికి వీలుండదు. (చదవండి: ఐటీ రిటర్న్ గడువు తేదీని పొడగించని కేంద్రం) ఒకవేళ మీరు లేదా మీ తరఫున చెల్లించే పన్నులు చెల్లించాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటే, చెల్లించిన అదనపు పన్నులకు రీఫండ్ పొందటానికి వీలుండదు. దీంతోపాటు మీరు చెల్లించిన అదనపు పన్నులకు సంబంధించి వడ్డీని పొందలేరు. మరోవైపు మీ మొత్తం పన్ను బాధ్యత కంటే తక్కువగా ఉంటే, ఆలస్యంగా చెల్లించిన కారణంగా దానిపై అదనపు వడ్డీ కూడా వర్తిస్తుంది. గడువు తేదీ తర్వాత ఐటిఆర్ ఫైల్ చేస్తే ఆలస్య రుసుము ఎంత? పై పరిణామాలకు అదనంగా, ఒకవేళ మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.5 లక్షలకు పైగా ఉన్నట్లయితే, గడువు తేదీ తర్వాత ఐటీఆర్ సబ్మిట్ చేసినట్లయితే తప్పని సరిగా ఆలస్య రుసుము చెల్లించాలి. మీ ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో మీరు తప్పనిసరిగా 5 వేల రూపాయల ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే, పన్ను పరిధిలోకి తీసుకునే ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉన్నట్లయితే, ఆలస్య రుసుము రూ.1,000/-కు ఉంటుంది. చివరి తేదీ నాటికి ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఏమి జరుగుతుంది? ఒకవేళ మీరు చివరి తేదీ నాటికి మార్చి 31, 2022లోగా కూడా మీరు ఐటీఆర్ దాఖలు చేయడంలో విఫలమైతే, ఆదాయపు పన్ను శాఖ కనీస జరిమానాను పన్నులో 50 శాతం వరకు విధించవచ్చు. ఆదాయ పన్ను శాఖ నుంచి వచ్చిన నోటీసులకు ప్రతిస్పందనగా మీరు చివరికి ఐటీఆర్ దాఖలు చేసే తేదీ వరకు అదనంగా వడ్డీ భారం మీద పడుతుంది. అయిన, మీరు ఐటీఆర్ దాఖలు చేయకపోతే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఐటీఆర్ దాఖలు చేయకపోతే ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం.. కనీసం మూడు సంవత్సరాల జైలు శిక్ష నుంచి గరిష్టంగా ఏడు సంవత్సరాల శిక్షను విధించవచ్చు. ఐటీఆర్ ఫైల్ చేయడంలో విఫలమైన ప్రతి సందర్భంలోనూ ఇలా జరగకపోవచ్చు. చెల్లించాల్సిన పన్ను మొత్తం రూ. 10,000/-కంటే ఎక్కువగా ఉన్నట్లయితే మాత్రమే ఆదాయపు శాఖ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. (చదవండి: Small Savings Schemes: చిన్న పొదుపు ఖాతాదారులకు శుభవార్త..!) -
Deadline Relief: కొత్త ఏడాదిలో ప్రజలకు ఊరట..!
న్యూఢిల్లీ: కోవిడ్-19 కొత్త వేరియంట్ ఓమిక్రాన్ దేశంలో వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ, ఆర్బీఐ, ఈపీఎఫ్ఓలు ముఖ్యమైన తేదీల గడువును పొడగిస్తూ ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కెవైసీ అప్డేట్ విషయంలో బ్యాంకులకు విధించిన గడువును మార్చి 31, 2022 వరకు పొడగిస్తున్నట్లు పేర్కొంది. ఆర్బీఐతో పాటు ఆదాయపు పన్ను శాఖ, ఈపీఎఫ్ఓ కూడా కొన్ని కీలక నిర్ణయం తీసుకున్నాయి. అవేంటి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈపీఎఎఫ్ఓ ఈ-నామినేషన్ ఈపీఎఎఫ్ఓ తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. డిసెంబరు 31 తరువాత కూడా ఈ-నామినేషన్ చేయవచ్చు అని ఈపీఎఫ్ఓ తన ట్విటర్ వేదికగా తెలిపింది. గత కొద్ది రోజుల నుంచి చందాదారుల తమ సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివరాలను జత చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికి, ఈపీఎఫ్ఓ పోర్టల్ సర్వర్ డౌన్ సమస్య కారణంగా చందాదారులు అసౌకర్యానికి గురి అయ్యారు. ఈ సమస్య గురించి ట్విటర్ వేదికగా ఖాతాదారులు ఇచ్చిన ఫిర్యాదును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ఓ తెలిపిన వివరాల ప్రకారం చందాదారులు డిసెంబరు 31 తర్వాత కూడా ఈ-నామినేషన్ దాఖలు చేయవచ్చు. (చదవండి: పన్ను చెల్లింపుదారులకు కేంద్రం షాక్..!) ఐటీఆర్ ఈ-వెరిఫై 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్లో తమ ఆదాయపు పన్ను రిటర్ను(ఐటీఆర్)లను ఈ-వెరిఫై చేయని పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ మరో అవకాశం కల్పించింది. ఐటీఆర్‌లను వెరిఫై చేయడానికి ఐటీ శాఖ ఈ ఏడాది డిసెంబర్ 21 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు గడువును పొడిగించింది. చట్టం ప్రకారం.. డిజిటల్ సంతకం లేకుండా దాఖలు చేసిన ఐటీఆర్‌లను ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్, డీమ్యాట్ ఖాతా ద్వారా పంపిన కోడ్, ప్రీ వాలిడేటెడ్ బ్యాంక్ ఖాతా, ఏటిఎమ్ ద్వారా రిటర్న్ దాఖలు చేసిన 120 రోజుల్లోగా ఈ-వెరిఫై చేయాల్సి ఉంటుంది. జీఎస్టీ వార్షిక రిటర్న్ 2020-21 సంవత్సరానికి సంబంధించి వ్యాపార జీఎస్టీ వార్షిక రిటర్న్‌లను దాఖలు చేసే తేదీని ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. జీఎస్టీఆర్-9ను వార్షిక రిటర్న్‌గా జీఎస్టీ కింద నమోదైన పన్ను చెల్లింపుదార్లు సమర్పిస్తారు. జీఎస్టీఆర్-9, ఆడిటెడ్ వార్షిక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మధ్య రీకాన్సిలేషన్ స్టేట్మెంట్ను జీఎస్టీఆర్-9సీగా సమర్పిస్తారు. రూ.2 కోట్లకు మించి టర్నోవరు ఉన్న వ్యాపారులు జీఎస్టీఆర్-9ను సమర్పించడం తప్పనిసరి. రూ.5 కోట్లకు మించి టర్నోవరు ఉంటే.. జీఎస్టీఆర్-9సీని సమర్పించాల్సి ఉంటుంది. కెవైసీ గడువు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) బ్యాంక్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్ తెలిపింది. కెవైసీ అప్డేట్ గడువును మార్చి 31, 2022 వరకు పొడగిస్తున్నట్లు పేర్కొంది. కోవిడ్-19 కొత్త రకం ఓమిక్రాన్ ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. గతంలో ఈ గడువు డిసెంబర్ 31, 2021 వరకు ఉండేది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం-2002, మనీ లాండరింగ్ నిరోధక(రికార్డుల నిర్వహణ) నియమాలు-2005 నిబంధనల పరంగా ఖాతాదారుల కెవైసీ అప్డేట్ ఆర్బీఐ 2016లో నియంత్రిత సంస్థలను ఆదేశించింది. కేవైసీ కేవలం బ్యాంకింగ్ లావాదేవీలకు మాత్రమే కాదు, నగదుతో ముడిపడి ఉన్న అన్ని లావాదేవీలకు కేవైసీ చేయాల్సి ఉంటుంది. (చదవండి: యూజర్లకు యూట్యూబ్ భారీ షాక్!) -
పన్ను చెల్లింపుదారులకు కేంద్రం షాక్..!
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. ఐటీ రిటర్న్‌ల గడువును పొడగించే ఉద్దేశం లేదని తేల్చి చెప్పేసింది. ఆదాయపు పన్ను రిటర్న్‌లు సజావుగా దాఖలు అవుతున్నాయని, ఈ రోజుతో ముగిసే ఐటీ రిటర్న్‌ల గడువును పొడిగించే ప్రతిపాదన ఏదీ లేదని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. టాక్స్ రిటర్న్ ఫైలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోందని, మధ్యాహ్నం 3 గంటల వరకు.. 5.62 కోట్ల రిటరర్న్స్ ఫైల్ అయ్యాయని, కేవలం ఇవాళ 20 లక్షల దాకా రిటర్న్స్ ఫైల్ అయ్యాయని తరుణ్ బజాజ్ తెలిపారు. There is no proposal to extend the date for income tax return filing: Revenue Secretary Tarun Bajaj, Govt of India — ANI (@ANI) December 31, 2021 ఇదిలా ఉంటే 2021-22 అసెస్మెంట్ ఇయార్‌కు సంబంధించిన పన్ను చెల్లించేందుకు ఈ ఏడాది జులై 31తో ముగిసింది. కానీ, కొవిడ్ వ్యాప్తి, ఐటీ పోర్టల్‌లో సాంకేతిక సమస్యల కారణంగా ప్రభుత్వం దానిని డిసెంబర్ 31 వరకు పొడిగించింది. అయితే, గత కొద్ది రోజుల నుంచి ఐటీ పోర్టల్‌లో సాంకేతిక సమస్యల గురించి తెలియజేస్తూ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు యూజర్లు ట్వీట్లు చేశారు. డిసెంబర్ 31 అనే తుదిగడువు పోర్టల్ డెవలపర్లకే గానీ.. పన్ను చెల్లింపుదార్లకు మాత్రం సరిపోదని పేర్కొన్నారు. మరికొందరు, ఆదాయపు పన్ను రిటర్న్ గడువు తేదీని పొడగించాలని కేంద్రాన్ని కోరడంతో పాటు ఈ ఐటీ పోర్టల్ సమస్యలను స్క్రీన్ షాట్లు తీసి ట్విటర్లో పోస్టు చేశారు. (చదవండి: టెస్లా కార్లలో ‘కలకలం..!’) -
వ్యాపారంపై జీఎస్టీ రిటర్న్! ఏ సందర్భాల్లో వేయాలంటే..
ప్రశ్న: నేను 2021 మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేశాను. రీఫండ్ వచ్చింది. 2022కి సంబంధించి ట్యాక్సబుల్ ఇన్‌కం లేదు. రిఫండ్ ఎంత వస్తుంది? – ఎం సౌదామిని, చిత్తూరు సమాధానం: మీరు ఆదాయం వివరాలు, చెల్లించిన పన్ను వివరాలు పూర్తిగా తెలియజేయాలి. ట్యాక్సబుల్ ఇన్‌కం లెక్కించిన తర్వాత కానీ పన్నుభారం లెక్కించలేము. 31–03–2021కి రిఫండు వచ్చిందంటే దాని అర్థం మీరు ఆ సంవత్సరంలో అవసరమైన మొత్తం కన్నా ఎక్కువ పన్ను చెల్లించారు. టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా చెల్లించిన పన్ను మొత్తం ఎక్కువగా ఉంటే, మదింపు చేసి అధికంగా కట్టిన మొత్తాన్ని రిఫండుగా ఇచ్చి ఉంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మీరు పన్ను చెల్లించారా? టీడీఎస్ ఉందా? ట్యాక్సబుల్ ఇన్‌కం రూ. 5,00,000 లోపు ఉంటే మీకు పన్ను ఉండదు. కానీ టీడీఎస్/అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించారా? అవి లేకపోతే ఎటువంటి రిఫండు రాదు. మీరు ముందుగా చెల్లించకపోతే మీకు రిఫండు ఎందుకు వస్తుంది. నగదు బదిలీ పథకం లాగా రిఫండు రాదు. ---------------------------------------------- ప్రశ్న: నేను వ్యాపారం చేస్తున్నాను. ప్రతి నెలా జీఎస్టీ రిటర్నులు వేస్తున్నాను. ఇంటి మీద అద్దె వస్తోంది. వ్యవసాయం మీద ఆదాయం వస్తోంది. పాన్ ఉంది. తలా ఒక మాట చెబుతున్నారు. రిటర్ను వేయాలా వద్దా? తికమకగా ఉంది? ఏం చేయాలి? – ఎన్.ఆర్. పంతులు, విశాఖపట్నం సమాధానం: జీఎస్టీ రిటర్నులు ప్రతి నెలా వేస్తున్నాం అంటున్నారు. అంటే ‘రెగ్యులర్‘ అన్న మాట. టర్నోవరు బాగా ఉన్నట్లు. అద్దెకు ఇళ్లు ఇచ్చారు. అద్దె వస్తోంది. వ్యవసాయం మీద ఆదాయం ఉంది. పాన్ ఉంది. లావాదేవీలు నగదు రూపంలో చేస్తున్నారా? అలా చేస్తుంటే తప్పు. బ్యాంకు అకౌంట్లు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? వాటిలో జమలు ఉన్నాయా .. లేవా? ఎవ్వరి మాటా వినొద్దు. తికమక పడాల్సిన అవసరం లేదు. ఏం చేయాలంటే .. బ్యాంకు అకౌంట్లలో ’డిపాజిట్ల’ నిమిత్తం ఎంత మొత్తం వచ్చిందో రాసుకోండి. అద్దె ఎంత? వ్యవసాయం మీద ఆదాయం ఎంత? నగదులో వస్తే బ్యాంకులో జమ చేయండి? జీఎస్టీ రిటర్నుల ప్రకారం టర్నోవరు వివరాలు సిద్ధంగా ఉంటాయి. దానికి సంబంధించిన కొనుగోళ్ల వివరాలూ ఉంటాయి. వ్యాపారానికి సంబంధించిన లెక్కలన్నీ ఒక పుస్తకంలో సక్రమంగా రాయండి. తెలుగులోనూ అకౌంట్లు రాయవచ్చు. ఇప్పుడు మార్కెట్లో ఎన్నో అకౌంటింగ్ ప్యాకేజీలు ఉన్నాయి. త్వరగా అకౌంట్లు రాయవచ్చు. వ్యాపారం లాభనష్టాలను లెక్కించండి. అన్ని ఆదాయాలను లెక్కించి ఒక స్టేట్మెంట్ తయారు చేసుకోండి. మీకే తెలిసిపోతుంది. గందరగోళం .. గజిబిజి ఉండదు. ఆదరాబాదరా అసలే ఉండదు. చట్టప్రకారం మీరు రిటర్ను వేయాలి. వేయకపోవటం తప్పే. కుంటి సాకులు వద్దు. మీనమేషాల లెక్కించకండి. త్వరగా తప్పనిసరిగా వేయండి. పన్నుకు సంబంధించిన సందేహాలు business@sakshi.com ఈ–మెయిల్ పంపించగలరు. - కేసీహెచ్ ఏవీఎస్‌ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య.. ట్యాక్సేషన్ నిఫుణులు -
Pension Tax: పెన్షన్‌పైనా పన్ను వసూలు తప్పదా?
ప్రశ్న: నా పెన్షన్ రూ. 3,60,000. సేవింగ్స్ లేవు. ఇతర ఆదాయాలు లేవు. పెన్షన్ మీద పన్ను పడుతుందా? : యం. మంగతాయారు, రాజమండ్రి సమాధానం: ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. పెన్షన్ కూడా జీతంలాగే పన్నుకు గురయ్యే ఆదాయం. ఎటువంటి మినహాయింపు లేదు. పన్ను భారం లెక్కించేటప్పుడు ఆదాయంలాగే పరిగణనలోకి తీసుకోవాలి. రెండో విషయం .. మీకు సంబంధించిన ఇతర ఆదాయాలు ఏవీ లేవని అంటున్నారు కాబట్టి, మీ కేసులో మీరు 60 సం.లు. దాటినట్లయితే బేసిక్ లిమిట్ రూ. 3,00,000 అవుతుంది. బేసిక్ లిమిట్ దాటినా నికర ఆదాయం రూ. 5,00,000 లోపల ఉంటే పన్ను భారం లెక్కించిన తర్వాత రిబేటు ఉండటం వల్ల ఎటువంటి పన్ను భారం ఉండదు. సెక్షన్ 87 అ ద్వారా రిబేటు లభిస్తుంది. పెన్షన్‌లో నుంచి రూ. 50,000 తగ్గిస్తారు. ఈ తగ్గింపును స్టాండర్డ్ డిడక్షన్ అంటారు. కానీ ఫ్యామిలీ పెన్షన్‌ని జీతంగానూ, పెన్షన్‌గానూ భావించరు. ఆ మొత్తాన్ని ‘ఇతర ఆదాయం’గా పరిగణించి, అందులో నుంచి 1/3వ భాగం లేదా రూ. 15,000 ..ఈ రెండింటిలో ఏది తక్కువైతే .. ఆ మొత్తాన్ని మినహాయింపుగా ఇస్తారు. ఏ పెన్షన్ అయినా పన్నుభారానికి గురి అవుతుంది. బేసిక్ లిమిట్ లోపల ఉన్నా .. రూ. 5,00,000 లోపల ఉన్నా రిబేటు పొందడం ద్వారా పన్ను పడకపోవచ్చు. ----------- ప్రశ్న: నేను గత వారం ఆదాయపు పన్ను రిటర్న్ వేసి రిఫండ్ క్లెయిమ్ చేశాను. ఈ రోజు రిఫండ్ .. నా బ్యాంకు అకౌంట్లో జమ అయింది. ఎటువంటి సమాచారం /ఆర్డర్లు / ఉత్తరాలు రాలేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? : యం. శంకరరావు, సికింద్రాబాద్ సమాధానం: అవును. ఇప్పుడు చాలా త్వరగా అసెస్మెంట్ చేస్తున్నారు. సెంట్రల్ ప్రాసెసింగ్ సెల్ ద్వారా జరుగుతోంది. అన్ని అంశాలు .. అంటే ఆదాయం, తగ్గింపులు, మినహాయింపులు, పన్ను చెల్లింపులు, బ్యాంకు అకౌంట్ వివరాలు మొదలైనవి సరిగ్గా ఉంటే సత్వరం రిఫండ్ ఇస్తున్నారు. ముందుగా 143 (1) ప్రకారం ఆర్డరు మీకు ఈమెయిల్ ద్వారా వస్తుంది. చెక్ చేసుకోండి. 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను మీ అసెస్మెంట్ అయినట్లు. ఏమీ గాభరా పడక్కర్లేదు. అయితే, కొన్ని మార్గదర్శకాలను అనుసరించి ‘‘స్క్రూటినీ’’ ఎంపిక చేస్తే మాత్రం మళ్లీ అసెస్మెంట్ చేస్తారు. ---------------- ప్రశ్న:2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను కాస్ట్ అప్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఎంత ఉంది. దీన్ని ఎలా నిర్ణయిస్తారు? : జె.వి.యస్. యన్. మూర్తి, హైదరాబాద్ సమాధానం: 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ ఇండెక్స్‌ను 317గా నిర్ణయించి, ఆ మేరకు నోటిఫికేషన్ ఎప్పుడో జారీ చేశారు. ప్రతి సంవత్సరం ఇది మారుతుంటుంది. దేశంలో ఉన్న ద్రవ్యోల్బణం .. అంటే ధరల పెరుగుదల సూచికను బట్టి కేంద్ర ప్రభుత్వంలోని నిపుణులు ఈ ఇండెక్స్ లెక్కిస్తారు. ఆదాయపు పన్ను విభాగం ఒక నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది. ఈ సంవత్సరంలో జరిగే స్థిరాస్తి క్రయ విక్రయాలు, ఇతర క్యాపిటల్ ఆస్తులు, షేర్లు మొదలైన వాటికి దీన్ని వర్తింపచేస్తారు. పన్నుకు సంబంధించిన సందేహాలు business@sakshi.com ఈ–మెయిల్ పంపించగలరు. - కేసీహెచ్ ఏవీఎస్‌ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య.. ట్యాక్సేషన్ నిఫుణులు -
పన్ను చెల్లింపుదారులకు తీపికబురు
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను శాఖ తీపికబురు అందించింది. పన్ను చెల్లింపుదారులకు అదనపు వడ్డీ, ఆలస్య రుసుమును తిరిగి చెల్లించింది. ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 15 మధ్య కాలంలో 1.02 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులకు 1.19 లక్షల కోట్ల రూపాయలను పైగా ఆదాయపు పన్ను రీఫండ్ చేసినట్లుచేసినట్లు ఐటీ విభాగం తెలిపింది. ఇందులో 2021-22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి 67.99 లక్షల రీఫండ్స్ ఉన్నాయి. 2021-22 అసెస్మెంట్ సంవత్సరానికి ఇప్పటి వరకు మొత్తం రూ.13వేల 141 కోట్ల రీఫండ్ జారీ చేసినట్లు పేర్కొంది. "సీబీడీటీ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) 2021 ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 15 వరకు 1.02 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులకు రూ.1,19,093 కోట్లకు పైగా రీఫండ్ జారీ చేస్తుంది. 1,00,42,619 కేసుల్లో రూ.38,034 కోట్ల ఆదాయపు పన్ను కేసులలో రీఫండ్లు జారీ చేసింది. 1,80,407 కేసుల్లో రూ.81,059 కోట్ల కార్పొరేట్ పన్ను రీఫండ్లు జారీ చేసినట్లు" అని ఆదాయపు పన్ను విభాగం ట్వీట్ చేసింది. CBDT issues refunds of over Rs. 1,19,093 crore to more than 1.02crore taxpayers from 1st April,2021 to 15th November,2021. Income tax refunds of Rs. 38,034 crore have been issued in 1,00,42,619cases &corporate tax refunds of Rs. 81,059 crore have been issued in 1,80,407cases(1/2) — Income Tax India (@IncomeTaxIndia) November 18, 2021 (చదవండి: క్రిప్టోకరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ..!) -
విదేశాల్లో ఉన్నారు.. ఇన్‌కంట్యాక్స్ ఫైల్ చేయడం ఎలా?
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయా. రిటర్న్ వేయకుండా ఉంటే పెన్షన్ ఉండదంటున్నారు చాలా మంది. – కే.యస్. చైతన్య, హైదరాబాద్ రిటర్నులు వేయకపోతే ఎటువంటి నోటీసులు రావు అని, ఎవరికీ తెలియదు అని.. ఏమీ అడగరు అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. అపోహ మాత్రమే. ఈ వాదనలో ఎటువంటి పసలేదు. చట్టరీత్యా మీకు ట్యాక్సబుల్ ఇన్‌కం దాటి ఆదాయం ఉంటే, మీరే స్వంతంగా రిటర్న్ దాఖలు చేయాలి. అది మీ విధి. కర్తవ్యం. పరోక్షంగా మీరు దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నారన్న మాట. మనం కట్టే పన్నుల్లో నుంచే దేశాభివృద్ధికి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇక మరో విషయం ఏమిటంటే ఇది మీ స్టేటస్ సింబల్ .. గౌరవం కూడా. అటు పైన మీరు రుణం తీసుకోవాలన్నా బ్యాంకర్లు, ఇతరులు.. అందరూ అడిగే మొట్టమొదటి డాక్యుమెంట్ మీ ఇన్‌కం ట్యాక్స్ రిటర్నే. పెద్ద పెద్ద ఆర్థిక వ్యవహారాలు చేయాలంటే పాన్ ఉండాల్సిందే. బ్యాంకు అకౌంట్ తెరవాలంటే పాన్ ఉండాలి. విదేశీయానానికి కావాల్సిన వీసా తీసుకోవడానికి వెళ్లాలన్నా ఈ డాక్యుమెంట్లు ఉపయోగకరంగా ఉంటాయి. వ్యాపారం, వృత్తి చేయాలంటే, స్థిరాస్థుల క్రయవిక్రయాల్లో, ఇన్సూరెన్స్‌లో, ఇన్వెస్ట్మెంట్లలో .. ఇలా ఎన్నో రోజువారీ కార్యకలాపాలకు పాన్ తప్పనిసరి. కాబట్టి రిటర్ను వేయడం మానేయడం కన్నా వేస్తే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. మా అత్తగారు, మావగారు ప్రస్తుతం మాతో అమెరికాలో ఉన్నారు. వచ్చే జనవరి వరకు భారత్‌కి రారు. గడవు తేదిలోగా రిటర్ను వేయలేకపోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి – పాలగుమ్మి అరుణ, వర్జీనియా (ఈమెయిల్ ద్వారా) మీ అత్తగారు, మావగారి దగ్గర ఆదాయానికి సంబంధించి పూర్తి సమాచారం సిద్ధంగా ఉంటే మీరు అక్కడి నుంచే ఆన్లైన్లో రిటర్నులు దాఖలు చేయవచ్చు. దీనినే ఈ–ఫైలింగ్ అంటారు. ఇది సులువు. త్వరగా అవుతుంది. కష్టపడక్కర్లేదు. డిపార్ట్మెంట్ వీటిని త్వరితగతిన ప్రాసెసింగ్ చేస్తారు. సెప్టెంబర్ 2021లో వేసినవారికి అక్టోబర్‌లో రిఫండ్లు వచ్చాయి. ప్రస్తుతం గడువు తేది 31–12–2021. వారు భారత్ వచ్చే దాకా ఆగకండి. ఇక్కడికి వచ్చి, ఇక్కడే వేయనవసరం లేదు. వేచి ఉండక్కర్లేదు. ఈ లోగా సమగ్ర సమాచారం సేకరించలేకపోతే డిసెంబర్ తర్వాత వేయండి. వడ్డీ, పెనాల్టీలు పడతాయి. నేను ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాను. నా సేవింగ్స్‌ను పరిగణనలోకి తీసుకోకుండా ఫారం 16 జారీ చేశారు. అలాగే ఫారం 26 అ లో తప్పులున్నాయి. రివైజ్ చేయడానికి సంస్థ ముందుకు రావడం లేదు. – సామవేదం లావణ్య, సికింద్రాబాద్ ఈ విషయం గతంలో ఎన్నో సార్లు ప్రస్తావించాం. ఎన్నో సంస్థలు ఫారం 16, ఫారం 16 అల జారీలో తప్పులు చేస్తున్నాయి. ఫారం 26 అ లో కూడా తప్పులు దొర్లుతున్నాయి. మీ దగ్గరున్న సమాచారం సరైనది, సమగ్రమైనది అయితే, తగిన కాగితాలు ఉంటే, ఆ మేరకు రిటర్నులు వేసినప్పుడు సరిదిద్దండి. సరిగ్గా వేయండి. ఎటువంటి సమస్యా ఉండదు. అవసరం అయినప్పుడు సమీక్షించుకోవాలి - కేసీహెచ్ ఏవీఎస్‌ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య -
ఇక వారి ఖాతాలో మాత్రమే జీఎస్టీ రిఫండ్ జమ
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులను జీఎస్టీ రిఫండ్లను క్లెయిమ్ చేసుకునేందుకు ఆధార్ ధ్రువీకరణను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నెల సెప్టెంబరు 17న లక్నోలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 45వ సమావేశంలో జీఎస్టీ రీఫండ్ క్లెయిం చేసుకోవడానికి ఆధార్ ప్రమాణీకరణను తప్పనిసరి చేయాలని సభ్యులు నిర్ణయించారు. అందులో భాగంగానే కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్(సీబీఐసీ) సెప్టెంబర్ 26న జీఎస్టీ నిబంధనలను సవరించినట్లు ప్రకటించింది. వివిధ పన్ను ఎగవేత వ్యతిరేక చర్యలను అరికట్టడానికి ఈ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) రిజిస్ట్రేషన్ పొందిన అదే పాన్ కార్డుతో లింక్ చేసిన బ్యాంకు ఖాతాలో మాత్రమే జీఎస్టీ రిఫండ్లను చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే వ్యాపారులు జీఎస్టీ వివరాలు సమర్పించే జీఎస్టీఆర్-3బీ రిటర్న్ దాఖలు చేయడాన్ని ఒక్క నెల ఆపేసినా.. ఆ తదుపరి నెలకు జీఎస్టీఆర్-1 విక్రయాల రిటర్న్‌ను దాఖలు చేసే వీలుండదని నోటిఫికేషన్ లో పేర్కొంది. ఈ నియమం జనవరి 1, 2022 నుండి అమల్లోకి వస్తుంది. (చదవండి: చిన్న సిటీలకు చిట్టి విమానం, రివ్వున ఎగిరేందుకు రెడీ) -
కథ..మళ్లీ మొదటికే..ఫిర్యాదుల వెల్లువ, ఐటీ పోర్టల్‌ను వీడని సమస్యలు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ నూతన ఈ ఫైలింగ్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలకు తెరపడలేదు. సెప్టెంబర్ 15 నాటికి సమస్యలన్నింటినీ పరిష్కరించాలంటూ కేంద్రం ఇన్ఫోసిస్‌కు గడువు ఇచ్చింది. ఈ గడువు బుధవారంతో ముగిసింది. అయినా ఈ వెబ్సైట్లో ఇప్పటికీ పలు సాంకేతిక అవాంతరాలు దర్శమనిస్తున్నట్టు పన్ను నిపుణులు చెబుతున్నారు. దాఖలు చైసిన రిటర్నులను సరిదిద్దుకోలేకపోవడం (రెక్టిఫికేషన్).. రిఫండ్ ఏ దశలో ఉందో తెలుకోలేకపోవడం, 2013–14 అసెస్మెంట్ సంవత్సరానికి ముందు నాటి రిటర్నులను చూసే అవకాశం లేకపోవడం వీటిల్లో కొన్ని. ఈ ఏడాది జూన్ 7న కొత్త పోర్టల్ ప్రారంభమైంది. ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం తొలుత ఇన్ఫోసిస్ ఉన్నతాధికారులను కోరింది. అయినా అవి పరిష్కారం కాలేదు. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ ఆగస్ట్ 23న ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరీఖ్‌కు సమన్లు ఇచ్చింది. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆదాయపన్ను శాఖ ఉన్నతాధికారులతో ఇన్ఫోసిస్ సీఈవో ఆధ్వర్యంలోని బృందం సమావేశమైంది. అందులో సమస్యల పట్ల మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా.. సెప్టెంబర్ 15 నాటికి అన్నింటినీ పరిష్కరించాలని కోరారు. ఈ సమస్యల కారణంగా ఆదాయపన్ను రిటర్నుల దాఖలు గడువును ఈ ఏడాది డిసెంబర్ ఆఖరుకు కేంద్రం పొడిగించింది. -
ఐటీ రిటర్నుల దాఖలుకు మరింత వ్యవధి
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నుల దాఖలు గడువును (వ్యక్తులు) డిసెంబర్ 31వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ గడువు సెప్టెంబర్ 30 వరకే ఉంది. వాస్తవానికి పన్ను రిటర్నుల దాఖలుకు జూలై 31 చివరి తేదీ. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర సర్కారు గత ఏడాదికి మాదిరే.. ఈ ఏడాదీ అదనపు వ్యవధిని ఇస్తూ నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఆదాయపన్ను నూతన ఈ ఫైలింగ్ పోర్టల్‌లో ఎన్నో సాంకేతిక సమస్యలు నెలకొనడం కూడా ఈ ఏడాది గడువు పెంచేందుకు గల కారణాల్లో ఒకటి. ‘అసెస్మెంట్ సంవత్సరం 2021–22 సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలు విషయంలో ఎన్నో ఇబ్బందులను పన్ను చెల్లింపుదారులు, భాగస్వాములు మా దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) గడువు తేదీలను పొడిగిస్తూ నిర్ణయించింది’ అని ఆర్థిక శాఖ తన ప్రకటనలో వివరించింది. కంపెనీలు ఐటీఆర్‌లు దాఖలు చేసే గడువును నవంబర్ 30 నుంచి 2022 ఫిబ్రవరి 15కు సీబీడీటీ పొడిగించింది. ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ సరి్టఫికెట్లకు జనవరి 15, జనవరి 31 వరకు గడువు ఇచి్చంది. ఆలస్యపు రిటర్నుల దాఖలుకు గడువును వచ్చే మార్చి వరకు ఇచి్చంది. -
75 ఏళ్లు దాటినవారికి ఐటీ రిటర్నుల మినహాయింపు
న్యూఢిల్లీ: వచ్చే ఆరి్థక సంవత్సరం నుంచి 75 ఏళ్లు నిండిన వృద్ధులు ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన పనిలేదు. ఇందుకు సంబంధించి ఐటీ రిటర్నుల మినహాయింపు డిక్లరేషన్ ఫారమ్ ‘12బీబీఏ’ (వెల్లడి పత్రాలు)ను ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) నోటిఫై చేసింది. 2021–22 ఆరి్థక సంవత్సరానికి (అసెస్మెంట్ సంవత్సరం 2022–23) సంబంధించి ఐటీ రిటర్నుల మినహాయింపులను పొందే వృద్ధులు ఈ డిక్లరేషన్ పత్రాన్ని బ్యాంకులకు సమరి్పంచాలి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021–22 బడ్జెట్లో చేసిన ప్రకటనకు అనుగుణంగా తాజా నిర్ణయం వెలువడింది. -
ఆన్లైన్లో ఐటీ రీఫండ్ స్టేటస్ తెలుసుకోవడం ఎలా..?
ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్) దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులకు ఒక ముఖ్యమైన గమనిక. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) శనివారం ఏప్రిల్ 1, 2021 - ఆగస్టు 30, 2021 మధ్య 23.99 లక్షలకు పైగా పన్ను చెల్లింపుదారులకు రూ.67,401 కోట్ల విలువైన నగదును తిరిగి చెల్లిస్తున్నట్లు తెలిపింది. ఆదాయపు పన్ను శాఖ సెప్టెంబర్ 3న ఐటీఆర్ దాఖలు చేసిన 22,61,918 మందికి రూ.16,373 కోట్ల ఆదాయపు పన్ను రీఫండ్ చేసినట్లు, అలాగే, 1,37,327 కేసుల్లో రూ.51,029 కోట్ల కార్పొరేట్ పన్ను రీఫండ్ చేసినట్లు పేర్కొంది.(చదవండి: ఇక రెండుగా ఈపీఎఫ్ ఖాతాల విభజన) ఆదాయపు పన్ను శాఖ కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ సంబంధించి పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందుల మధ్య ఐటీఆర్ రీఫండ్ చేసింది. అయితే, ఈ సమస్య కారణంగా చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఇంకా తమ ఆదాయపు పన్ను రిటర్న్స్(ఐటీఆర్) దాఖలు చేయలేదు. సాధారణంగా, ఐటీఆర్ రీఫండ్ దాఖలు చేసిన 10 రోజుల్లోగా జారీ చేస్తారు. అయితే వివిధ కారణాల వల్ల ఇంకా ఆలస్యం కావొచ్చు. అయితే, ఒకవేళ మీరు ఇంకా మీ రీఫండ్ అందుకోనట్లయితే, ఐ-టీ డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ మీరు ఐటీఆర్ స్టేటస్ ఆన్ లైన్ లో చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఐటీఆర్ రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి: వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్ డీఎల్) వెబ్ సైట్ లేదా ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ వెబ్ సైట్ లో రీఫండ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఎన్ఎస్ డిఎల్ వెబ్ సైట్ లో, మీరు పాన్, అసెస్ మెంట్ ఇయర్(ఎవై) వివరాలు నమోదు చేసి 'ప్రొసీడ్' మీద క్లిక్ చేయాలి. ఆదాయపు పన్ను రీఫండ్ స్టేటస్ మీకు డిస్ప్లే మీద చూపిస్తుంది.(చదవండి: నకిలీ కోవిడ్-19 వ్యాక్సిన్లను గుర్తించడం ఎలా..?) మొదట మీరు ఐ-టీ డిపార్ట్ మెంట్ ఈ-ఫైలింగ్ పోర్టల్ లో లాగిన్ కావాలి. ఇప్పుడు రిటర్న్స్/ఫారమ్స్ ఎంచుకోండి. ఆ తర్వాత 'మై అకౌంట్' ట్యాబ్ కు వెళ్లి 'ఐ-టీ రిటర్న్స్' ఎంచుకోండి. ఇప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అలాగే, అక్నాలెడ్జ్ మెంట్ నెంబరుపై క్లిక్ చేయండి. ఆదాయపు పన్ను రీఫండ్ స్టేటస్ తో పాటు మీ రిటర్న్ వివరాలను పేజీ మీద కనిపిస్తాయి. పన్ను చెల్లింపుదారులు రీఫండ్ డబ్బు నేరుగా వారి ఖాతాకు క్రెడిట్ చేస్తారు. చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చిరునామాకు పంపిస్తారు. అందువల్ల, ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు బ్యాంకుకు సంబంధించిన వివరాలు సరిగ్గా నింపబడ్డాయని వారు ధృవీకరించుకోవాలి. -
Income Tax Refund: పన్ను ఎక్కువ కట్టారు.. తీసుకోండి
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ శాఖ రూ. 47,318 కోట్లను ఇన్‌కం ట్యాక్స్ రీఫండ్ కింద చెల్లించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 9 వరకు కాల వ్యవధిని పరిగణలోకి తీసుకుని ఈ రీఫండ్ చేసింది. ఇన్‌కం ట్యాక్స్ రీఫండ్ కింద రూ. 47,318 కోట్లను కింద 22.61 లక్షల మంది ఐటీ పన్ను చెల్లింపుదారుల ఖాతాల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ శాఖ జమ చేసింది. ఇందులో రూ.14,241 కోట్ల రూపాయలు 21,38,375 మంది ఐటీ పన్ను చెల్లింపుదారుల ఖాతాల్లో జమ అవగా రూ.33,078 కోట్లు కార్పోరేట్ రీఫండ్ కింద 1,22,511 ఖాతాల్లో జమ అయ్యింది. ఆదాయ పన్నుకు సంబంధించి చెల్లించాల్సిన మొత్తం కంటే అధికంగా చెల్లించినప్పుడు ఆ మొత్తాన్ని తిరిగి పొందే వీలుంది. దీనికి సంబంధించి అధికంగా పన్ను చెల్లించిన వారు ఈ మేరకు ఆదాయపన్ను శాఖకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీ శాఖ పన్ను వివరాలను పరిశీలించి అధికంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తుంది. CBDT issues refunds of over Rs. 47,318 crore to more than 22.61 lakh taxpayers between 1st April, 2021 to 09th August, 2021. Income tax refunds of Rs. 14,241 crore have been issued in 21,38,375 cases & corporate tax refunds of Rs. 33,078 crore have been issued in 1,22,511 cases. — Income Tax India (@IncomeTaxIndia) August 14, 2021 -
ఐటీ రిఫండ్స్ రూ.43,991 కోట్లు
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను (ఐటీ) రిఫండ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) జూలై 26 వరకూ రూ.43,991 కోట్లని ఆ శాఖ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో వ్యక్తిగత ఆదాయపు పన్ను రిఫండ్స్ రూ.13,341 కోట్లని , కార్పొరేట్ పన్ను రిఫండ్స్ రూ.30,650 కోట్లని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి జూలై 26 మధ్య 21.03 లక్షల మందికి ఈ రిఫండ్స్ జరిగినట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) ఒక ప్రకటనలో పేర్కొంది. వీరిలో వ్యక్తిగత ఆదాయపు పన్ను విభాగంలో 19,89,912 మంది ఉండగా, కార్పొరేట్ కేసులు 1,12,567 ఉన్నాయని తెలిపింది. -
ఇన్‌కంట్యాక్స్ నుంచి మినహాయింపు కావాలా? ఇవిగో మార్గాలు
వ్యాపారం ఎంతో రిస్క్‌తో కూడిన పని. అనేక కష్టనష్టాలకు ఓర్చితేనే ఏదైనా కంపెనీ లాభాల బాట పడుతుంది. అయితే ఈ లాభాల నుంచి ఆదాయపన్ను కట్టాల్సి వస్తుంది. బడా కంపెనీలకు ఇది పెద్ద సమస్య కాకపోయినా ఎదుగుతున్న కంపెనీలు పన్ను మినహాయింపు ఆశిస్తాయి. ప్రతీనెల జీతం తీసుకునే ఉద్యోగులు ఆదాయం పన్ను మినహాయింపును కోరుకుంటారు. ఇలాంటి వారి కోసం చట్ట పరంగా పన్ను మినహాయింపులు ఇస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చే వాటిలో కొన్ని.. టర్మ్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీ అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మనకు, మన కుటుంబానికి ఇన్సురెన్స్ భద్రత అందిస్తుంది. ఆదాయపన్ను కడుతున్నవారు ఇన్వెస్ట్ చేయాల్సిన వాటిలో ఇన్సురెన్స్ ప్రధానమైంది. ఇన్సురెన్స్ పాలసీ ప్రీమియంగా చెల్లించిన మొత్తానికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. ఏ ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం కడితే ఆ ఏడాదికి సంబంధించి పన్ను మినహాయింపు పొందవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ చట్టపరంగా ఇన్‌కంట్యాక్స్‌ను తగ్గించుకునేందుకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం చక్కనగా ఉపకరిస్తుంది. ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను ప్రారంభించి, అందులో జమ చేసిన సొమ్ముకు పన్ను నుంచి మినహయింపు ఉంటుంది. అయితే ఇందులో జమ చేసే మొత్తాన్ని 15 ఏళ్ల వరకు విత్‌డ్రా చేయడానికి వీలులేదు. ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు పొందేందుకు ఎక్కువ మంది ఎంచుకునే మార్గాల్లో ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఒకటి. ఈక్విటీ మార్కెట్లతో పోల్చితే రిస్క్ తక్కువ, గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు అయితే డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ లభిస్తుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ పథకం ద్వారా పన్ను రాయితీ పొందవచ్చు. తక్కువ ఆదాయం పొందే వారికి ఈ పథకం అనుకూలంగా ఉంటుంది. రిటర్న్స్ కూడా ఎక్కువగా అందిస్తుంది. ఈ పథకం ద్వారా రూ. 1.50 లక్షల వరకు రాయితీ పొందే అవకాశం ఉంది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం అరవై ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు పన్ను రాయితీ కల్పించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. కనీసం వెయ్యి రూపాయలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఐదేళ్లు మెచ్యూరిటీ పీరియడ్‌గా ఉంటుంది. గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. -
మీరు వ్యాపారస్తులా..ఐతే ఇది మీకోసమే...!
ఈ వారం ఐటీఆర్ ఫారం 3 గురించి తెలుసుకుందాం. ఈ ఫారం వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబాలు దాఖలు చేయవచ్చు. వ్యాపారం మీద కానీ, వృత్తిపరంగా గానీ ఆదాయం ఉన్నవారు మాత్రమే దీన్ని దాఖలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు మాత్రమే వేయడానికి ఈ ఫారం పనికొస్తుంది. అన్ని ఆదాయాలు .. అంటే.. జీతం, ఇంటిపై ఆదాయం, వ్యాపారం, వృత్తి, మూలధన లాభాలు, ఇతర ఆదాయాలు.. ఈ ఐదు ఉన్న వారు ఈ ఫారం వేయాల్సి ఉంటుంది. వ్యాపారం/వృత్తుల మీద కొంత టర్నోవరు/వసూళ్లు దాటిన వారు అకౌంట్స్ ఆడిట్ చేయించాలి. మిగతా వారికి ఆడిట్ వర్తించదు. ఆడిట్ ఉన్నా లేకపోయినా ఈ ఫారం దాఖలు చేయవచ్చు. ఫారం 1, ఫారం 2 కన్నా దీని నిడివి ఎక్కువగా ఉంటుంది. మరిన్ని అంశాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఫారం నింపే ముందు సూచనలు/మార్గదర్శకాలను క్షుణ్నంగా చదవండి. దీని దాఖలుకు గడువుతేది 2021 సెప్టెంబర్ 30. డిజిటల్ సంతకం.. డిజిటల్ సంతకం నమోదు చేయించుకుని, ఈ ఫారంను ఆన్లైన్లో దాఖలు చేయవచ్చు. అప్పుడు సంతకం అవసరం ఉండదు. ఆన్లైన్లో వేసి పాన్‌తో ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవచ్చు. అలా కుదరని వాళ్లు అక్నాలెడ్జ్మెంట్ (దీన్నే ఫారం V అని అంటారు) మీద సంతకం పెట్టి, సకాలంలో బెంగళూరు పంపాల్సి ఉంటుంది. ఇందులో ఆదాయపు వివరాలు సమగ్రంగా ఇవ్వాలి. వ్యాపారం వివరాలు, ఆస్తి.. అప్పుల పట్టీ, ఉత్పత్తి ఖాతా, లాభనష్టాల ఖాతా .. ఇలా సమస్త వివరాలూ ఇవ్వాలి. ఆడిట్ అవసరం లేకపోయినా పలు వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. ఆడిట్ వర్తించే పక్షంలో మరిన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో వందకు పైగా అంశాలు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఆచితూచి సమాధానం ఇవ్వాలి. యస్/నో అన్న జవాబులు ఆలోచించి ఇవ్వాలి. అంకెలు అటూ, ఇటూ అయితే పెద్ద తలనొప్పి తప్పదు. అందుకే జాగ్రత్త వహించాలి. అవసరమైతే అసెస్మెంటు ఆన్లైన్లో మెషీన్ ద్వారా జరుగుతుంది. ఎదురుగా రాసినదాన్ని మెషీను పరిగణనలోకి తీసుకుంటుంది. తప్పొప్పుల వలన ఎంతో మందికి నోటీసులు వస్తాయి. ఈ అసెసీలకు కొన్ని STANDARDS (10) వర్తిస్తాయి. విదేశాల్లో ఆస్తి వివరాలు, ఆదాయాల వివరాలు ఇవ్వాలి. స్థిరాస్తులు, చరాస్తుల గురించి తెలియజేయాలి. జీఎస్టీలో డిక్లేర్ చేసిన టర్నోవరు వివరాలు ఇవ్వాలి. ఈ టర్నోవరుని ఆదాయపు పన్ను టర్నోవరుతో పోల్చి చూసినప్పుడు తేడాలు వస్తే ఆరా తీస్తారు. అంతే గాకుండా ఒక సంవత్సర కాలంలో వ్యాపా రానికి సంబంధించిన అన్ని కరెంటు ఖాతాల నుంచి రూ. కోటి దాటిన విత్‌డ్రాయల్ వివరాలు, సంవత్సర కాలంలో విదేశీయానం చేసినట్లయితే .. ఆ ఖర్చు రూ. 2,00,000 దాటితే ఆ వివరాలు, సంవత్సర కాలంలో విద్యుత్ బిల్లులు రూ. 1,00,000 దాటితే ఆ సమాచారం.. ఇవన్నీ తెలియజేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎంతో జాగ్రత్త వహించి, ఈ ఫారం వేయాలి. సమాచారాన్ని సేకరించుకుని, సమీక్షించుకుని, సమగ్రంగా దాఖలు చేయండి. ట్యాక్సేషన్ నిపుణులు కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి , ట్యాక్సేషన్ నిపుణులు కె.వి.ఎన్ లావణ్య -
వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు పొందండి ఇలా..?
ఒకవేళ మీరు ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నట్లయితే, మీరు పొదుపు ఖాతాలలో జమ చేసే నగదుపై లేదా చిన్న పొదుపు పథకాల ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంపై ఆదాయ పన్నును ఆదా చేయడం కొరకు పన్ను మినహాయింపుల కోసం క్లెయిం చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80టీఎ కింద సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై సంపాదించిన వడ్డీపై ₹10,000 వరకు మినహాయింపును మీరు క్లెయిం చేసుకోవచ్చు? అని మీలో ఎంత మందికి తెలుసు. ఇది వాణిజ్య బ్యాంకు లేదా కో ఆపరేటివ్ బ్యాంకు లేదా పోస్టాఫీసుతో పొదుపు ఖాతాల ద్వారా సంపాదించిన వడ్డీకి వర్తిస్తుంది. అయితే, ఒక ఆర్థిక సంవత్సరంలో ₹3,500 వరకు పోస్టాఫీసు పొదుపు ఖాతాపై సంపాదించిన వడ్డీపై అదనపు మినహాయింపును మీరు క్లెయిం చేయగలరని మీకు తెలుసా? ఉమ్మడి ఖాతా విషయంలో ₹7,000 వరకు వడ్డీ ఆదాయం పన్ను మినహాయింపు పొందవచ్చు. కాబట్టి, మీరు తపాలా కార్యాలయంలో మీ భార్యతో ఉమ్మడి పొదుపు ఖాతాను తెరిచినట్లయితే, మీరిద్దరూ విడిగా ₹3,500 పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. కాబట్టి, అలాగే పొదుపు బ్యాంకు ఖాతా నుంచి ₹10,000 వరకు, పోస్టాఫీసు పొదుపు జాయింట్ ఖాతా నుండి ₹7,000 వరకు వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇది ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10(15) కిందకు వస్తుంది. సెక్షన్ 10(15) ఒక వ్యక్తి మొత్తం ఆదాయంలో భాగం కాకూడని మినహాయింపు ఆదాయాల గురించి వివరిస్తుంది. "పోస్టాఫీసు పొదుపు ఖాతాల, బ్యాంకు పొదుపు ఖాతాల నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై సెక్షన్ 80టీఎ కింద ₹10,000 వరకు మినహాయింపును క్లెయిం చేసుకోవచ్చు. అదే సమయంలో ₹3,500 వరకు వడ్డీ సెక్షన్ 10 (15) కింద పన్ను మినహాయింపు అయితే, అంతే మొత్తాన్ని ఒకే సమయంలో రెండుసార్లు క్లెయిమ్ చేసుకోలేము" అని బెంగళూరుకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ ప్రకాష్ హెగ్డే అన్నారు. కానీ, మీకు పోస్టాఫీసు పొదుపు ఖాతా నుంచి ₹10,000 వడ్డీ ఆదాయం వస్తే, మీరు వడ్డీ మినహాయింపు కోసం ₹3,500 క్లెయిం చేసుకోవచ్చు, మిగిలిన ₹6,500లను సెక్షన్ 80టీఎ కింద మినహాయింపుగా క్లెయిమ్ చేయవచ్చు. అలాగే, ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్)లో వడ్డీ ఆదాయాన్ని మీరు ఎలా చూపుతారు అనేది మీరు కోసం క్లెయిమ్ చేస్తున్నారా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. "ఒకవేళ మీరు సెక్షన్ 80టీఎ కింద పన్ను మినహాయింపు కోసం క్లెయిం చేస్తున్నట్లయితే, ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం కింద వడ్డీ ఆదాయాన్ని మీరు చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పన్ను మినహాయింపును క్లెయిం చేస్తున్నట్లయితే, మినహాయింపు ఆదాయం అనే హెడ్ కింద మీరు దీనిని చూపించవచ్చు"అని ఢిల్లీకి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ తరుణ్ కుమార్ అన్నారు. అయితే, ఈ సంవత్సరం నుంచి, బ్యాంకులు, పోస్టాఫీసులు మొదలైన సంస్థలు వ్యక్తులు సంపాదించిన వడ్డీ వివరాలను పన్ను శాఖకు పంపాల్సి ఉంటుంది కనుక, మీ పన్ను ఫారాల్లో ముందస్తుగా నింపిన ఈ మొత్తం సమాచారాన్ని మీరు పొందే అవకాశం ఉంది. -
Income Tax : జులై 1 నుంచి కొత్త టీడీఎస్ రూల్స్
గత రెండేళ్లుగా టీడీఎస్ ద్వారా పన్ను మినహాయింపు పొందిన వారికి గమనిక. ఆదాయపు పన్ను శాఖ కొత్తగా అమల్లోకి తెచ్చిన నిబంధనలతో మీరు మీరు డబుల్ టీడీఎస్ కట్టాల్సి రావొచ్చు. రెండేళ్లుగా ఇన్‌కం ట్యాక్స్ కట్టకున్నా, టీడీఎస్ ద్వారా రూ. 50,000లకు మించి పన్ను మినహాయింపు పొందినా... కొత్త చట్టాల ప్రకారం మీరు ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి రావొచ్చు. జులై 1 నుంచి ఇటీవల కేంద్రం అమల్లోకి తెచ్చిన ఫైనాన్స్ యాక్ట్ 2021 ప్రకారం గత రెండేళ్లలో టీడీఎస్ చెల్లించని వారు, ప్రతీ ఏడు టీడీఎస్ ద్వారా రూ.50వేలకు మించి మినహాయింపు దాటిన వారి నుంచి పన్ను వసూలు చేసేలా నిబంధనలు మారాయి. జులై 1 నుంచి వీరు ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో ఎక్కువ ఛార్జీలు ఆదాయపు పన్ను శాఖకు చెల్లించే పరిస్థితి ఎదురు కావొచ్చు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఇన్‌కం ట్యాక్స్‌కి సంబంధించిన ఈ ఫైలింగ్ పోర్టల్‌లో గత రెండేళ్ళుగా ఆదాయపు పన్ను దాఖలు అయిందా ? లేదా అని తెలుసుకోవడం మంచింది. ఇలా ఉండొచ్చు కొత్త సెక్షన్ 206 ఏబి కింద నిర్దుష్ట పన్ను చెల్లింపుదారులు గత రెండేళ్లుగా ఐటీఆర్ దాఖలు చేయకపోతే అధికమొత్తంలో టీడీఎస్ చెల్లించాల్సి వస్తుంది. ఈ అధిక టీడీఎస్ రేటు సంబంధిత విభాగం కంటే రెండు రెట్లు లేదా అమలులో ఉన్న రేటుకు రెండింతలు ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొత్త సెక్షన్లు ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసే వారి సంఖ్య పెంచడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకువచ్చింది. ఈ మేరకు 2021 బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కొత్త టీడీఎస్ రేట్లు ప్రతిపాదించింది. వీటి ప్రకారం ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయని వారికి టీడీఎస్ అధికరేట్లు విధించేందుకు 206 ఏబి, 206 సీసీఏ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. చదవండి : పెట్రోల్, డీజిల్‌లతోకాదు.. ..ఇథనాల్‌తో నడిచేలా .. -
ఆదాయపు పన్ను కట్టని అమెజాన్ సీఈవో.. మరికొందరు?
వాషింగ్టన్: ఆదాయపు పన్ను కట్టడంలో ప్రపంచ కుబేరులు కక్కుర్తి పడ్డారు. బిలియన్ల కొద్ది ఆదాయం సమకూరుతున్నా పన్ను ఎగ్గొట్టేందుకు వెనుకాడలేదు. ఆదాయ పన్ను అవకతవకలపై ప్రోపబ్లికా రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. దీంతో ఒక్కసారిగా అమెరికాలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. పన్ను కట్టలేదు ప్రపంచ కుబేరుల్లో ప్రథమ స్థానంలో అమెజాన్ సంస్థ సీఈవో జెఫ్ బేజోస్ ఉన్నారు. ఆదాయ పన్నుకి సంబంధించి 2007, 2011లలో ఆయన ఎటువంటి పన్ను చెల్లించలేదనే ఆరోపణలు ఆయన్ని చుట్టుముట్టాయి. జెఫ్‌తో పాటు టెస్లా కంపెనీ ఫౌండర్ ఎలన్మాస్క్ 2018లో ఇదే తీరుగా వ్యవహరించారని తాజా రిపోర్టులు గగ్గోలు పెడుతున్నాయి. మరోవైపు బ్లూంబర్గ్ ఫౌండర్ మైఖేల్ బ్లూంబర్గ్, ఇన్వెస్టర్లు కార్ల్, జార్జ్ సోరోస్లు సైతం పన్ను తక్కువగా చెల్లించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరో ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ 2014 నుంచి 2018 వరకు రికార్డు స్థాయిలో 24.3 బిలియన్ల ఆదాయం సంపాదిస్తే ఆదాయపు పన్నుగా కేవలం 23.7 మిలియన్ డాలర్లు చెల్లించారు. డేటా లీక్ ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) రికార్డుల నుంచి సేకరించిన సమాచారంతో ఓ కథనాన్ని ప్రోపబ్లికా సంస్థ రిపోర్టు చేసింది. ఆ వెంటనే అమెరికాలో ఈ వార్తలు పెను దుమారం రేపాయి. దీంతో సంస్థకు సంబంధించిన రహస్య సమాచారం బయటకు ఎలా పొక్కిందనే అంశంపై విచారణ చేపడతున్నట్టు ఐఆర్ఎస్ కమిషనర్ ఛార్లెస్ రెట్టింగ్ ప్రకటించారు. టాక్స్ పేయర్స్ డాటాను కాపాడటం ఐఆర్ఎస్ బాధ్యతని సెనేట్ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ రోన్వైడేన్ అన్నారు. అదే సమయంలో దేశంలోనే అత్యంత సంపన్నులు తమ వంతు పన్ను చెల్లించలేదంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. చదవండి: టెక్ బిలియనీర్ చిలిపితనం.. ‘అడల్ట్’ అదృష్టం -
కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను సోమవారం(ఈ నెల 7న) ప్రారంభించనున్నట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. పన్ను చెల్లింపుదారులకు అంతరాయాలు లేని, సౌకర్యవంతమైన అనుభవం నూతన పోర్టల్ ద్వారా అందించనున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) తెలిపింది. ముందస్తు పన్ను చెల్లింపుల గడువు ముగిసిన తర్వాత జూన్ 18న నూతన పన్ను చెల్లింపుల వ్యవస్థను అమల్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. గత వారం రోజులుగా ఆదాయ పన్ను విభాగం పోర్టల్ పనిచేయలేదు. పోర్టల్‌ని అప్డేట్ చేయడమే ఇందుకు కారణం. నేటి నుంచి ఈ పోర్టల్ అందరికీ అందుబాటులోకి వస్తుంది. పన్ను చెల్లించేవారికి, సంబంధిత వర్గాలందరికి ఇది ఎంతో ఉపయోగకరం. ఆధునీకరించిన ఈ పోర్టల్.. ఉపయోగించడానికి సులభతరంగా ఉంటుంది. రిటర్నులు వేయడం, అసెస్మెంట్లు చేయడం, రిఫండ్ జారీ చేయడానికి అనుసంధానించడం వల్ల రిఫండులు త్వరగా రాగలవు. డ్యాష్‌బోర్డు మీద మీకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు, పెండింగ్‌లో ఉన్న పనులు అన్నీ కనిపిస్తాయి. ఐటీఆర్ వేయడానికి అనువైన సాఫ్ట్వేర్ ఉచితం. ఫోన్ ద్వారా మీ ప్రశ్నలకు జవాబులు ఇస్తారు. సందేహాలకు జవాబులుంటాయి. వీడియో ద్వారా మీకు పాఠాలు చెబుతారు. ఆన్లైన్ పాఠాలు ఉంటాయి. మొబైల్ అప్లికేషన్ కూడా అందుబాటులోకి వస్తోంది. పెద్ద ఉపశమనం ఏమిటంటే పన్నుని ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చు. నెట్ బ్యాంకింగ్, యూపీఐ, క్రెడిట్ కార్డు, ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ ద్వారా పన్నులు చెల్లించవచ్చు. జూన్ 1 నుంచి 6వ తారీఖు వరకు ఈ పోర్టల్‌ని తయారు చేశారు. ఈ రోజుల్లో ఎటువంటి కార్యకలాపాలూ జరగలేదు. ఎటువంటి కేసులు వినలేదు. అసెస్మెంట్లు చేయలేదు. ఒకవేళ ఎవరికైనా నోటీసులు వచ్చినా ఆ గడువు తేదీలను సవరిస్తారు. జూన్ 10 నుంచి కేసుల పరిష్కరణ, అసెస్మెంట్ మొదలవుతాయి. కొత్త పోర్టల్ పూర్తిగా వాడుకలోకి వచ్చే వరకూ కాస్త సంయమనం పాటించడం శ్రేయస్కరం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్ని గడువు తేదీలను సవరించారు. పొడిగించారు. ఫారం 16 జారీ చేయడానికి గడువు తేదీ జులై 15. ఇది అయిన తర్వాత ఫారం 16ఎ, అటుపైన ఫారం 26ఎ అప్డేట్ అవుతుంది. అంతవరకూ ఓపిక పట్టాలి. ఫారం 26ఎలో సమస్త వివరాలు ఉంటాయి. సదరు ఆర్థిక సంవత్సరంలో మీ ఆర్థిక వ్యవహారాలన్నీ ఇది ప్రతిబింబిస్తుంది. సంవత్సరం పంచాంగం..జాతకం.. కుండలీ చక్రం అన్నీ ఇదే. అన్ని వ్యవహారాలను అర్థం చేసుకోండి. విశదీకరించండి. ఇక విశ్లేషణ వారి వంతు. ట్యాక్సేషన్ నిపుణులు కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య -
Income Tax Return: ఐటీ రిటర్నుల చివరి గడువు తేదీ తెలుసా?
పన్ను చెల్లింపు దారులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్(సీబీడీటీ) 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు గడువును పొడిగించింది. సర్క్యులర్ ప్రకారం.. 2020-21 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికం టీడీఎస్ పన్ను దాఖలు చివరి తేదీని జూన్ 30 వరకు పొడగించినట్లు పేర్కొంది. అంతకుముందు టీడీఎస్ ను దాఖలు చేయడానికి గడువు మే 31 వరకు ఉండేది. ఈ కొత్త సర్క్యులర్ ప్రకారం.. ఫారం 16 జారీ చేయవలసిన తేదీని జూన్ 15 నుంచి జూలై 15 వరకు పొడగించారు. తాజా టీడీఎస్ రిటర్న్ ఫైలింగ్ ఫారమ్ లలో ఉద్యోగుల కోసం మరో కాలమ్ జోడించబడింది. దీని ప్రకారం, టీడీఎస్ రిటర్న్ దాఖలు చేసే సమయంలో కొత్తగా పన్ను చెల్లించే వారు ఈ ఎంపికను ఎంచుకోవాల్సి ఉంటుందని టాక్స్ 2 విన్ సహ వ్యవస్థాపకుడు & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అభిషేక్ సోని అన్నారు. అలాగే గత రెండేళ్లలో వ్యక్తి టీడీఎస్ దాఖలు చేయకపోతే, రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ప్రభుత్వం ఎక్కువ పన్ను వసూలు చేస్తుంది అని అన్నారు. ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు నగదు రూపంలో చెల్లించాల్సిన పన్ను మొత్తం లక్ష రూపాయల కన్నా ఎక్కువ ఉంటే, సెక్షన్ 234ఎ కింద జరిమానా, వడ్డీ ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత తేదీ నుంచి వర్తిస్తుంది. చదవండి: కేవలం వారంలో భారీగా ముకేశ్ అంబానీ సంపద -
Income Tax Return: ఐటీ రిటర్నులకు మరింత గడువు
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2020 –21) సంబంధించి ఆదాయపన్ను రిటర్నుల దాఖలుకు అదనంగా రెండు నెలల గడువు ఇస్తున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. అదే విధంగా కంపెనీలకు సైతం అదనంగా ఒక నెల గడువు ఇస్తూ నవంబర్ 30 వరకు రిటర్నులు దాఖలు చేయవచ్చని పేర్కొంది. ఆదాయపన్ను చట్టం ప్రకారం.. వ్యక్తులు (ఖాతా లకు ఆడిటింగ్ అవసరం లేని వారు) తమ రిటర్నులను జూలై 31 వరకు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఖాతాలకు ఆడిటింగ్ అవసరమైన వ్యక్తులు, కంపెనీలకు రిటర్నుల దాఖలు గడువు అక్టోబర్ 31. ఇవి సాధారణ గడువులు. అంతక్రితం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా అదనపు సమయాన్ని ఆదాయపన్ను శాఖ ఇచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. కరోనా మహమ్మారి కారణం గా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని సీబీడీటీ ఈ నిర్ణయాలు తీసుకుంది. గడువు పొడిగిం చడం వల్ల నిబంధనల అమలు విషయంలో పన్ను చెల్లింపుదారులకు ఊరట దక్కినట్టేనని నాంజియా అండ్ కో పార్ట్నర్ శైలేష్ కుమార్ పేర్కొన్నారు. ► సంస్థలు తమ ఉద్యోగులకు ఫామ్ 16 మంజూరుకు సైతం గడువును జూలై 15కు సీబీడీటీ పొడిగించింది. ► ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ దాఖలుకు అక్టోబర్ 31 వరకు, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ సర్టిఫికెట్ దాఖలుకు నవంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. ► ఆలస్యపు, సవరించిన రిటర్నుల దాఖలుకు నూతన గడువు 2022 జనవరి 31. ► ఆర్థిక సంస్థలు ‘ఆర్థిక లావాదేవీల నివేదిక’ (ఎస్ఎఫ్టీ) సమర్పించేందుకు మే 31వరకు ఉన్న గడువు జూన్ 30కు పెరిగింది. ► 2020–21 ఏడాదికి సంబంధించి నూతన పన్ను విధానాన్ని (తక్కువ రేట్లతో, పెద్దగా మినహాయింపుల్లేని) ఎంపిక చేసుకునే స్వేచ్ఛను కేంద్రం కల్పించిన విషయం విదితమే. ఈ మేరకు ఐటీ రిట ర్నుల పత్రాల్లో సీబీడీటీ మార్పులు కూడా చేసింది. 7 నుంచి ఆదాయపన్ను కొత్త పోర్టల్ పన్ను చెల్లింపుదారులకు స్నేహపూర్వకమైన నూతన పోర్టల్‌ను జూన్ 7 నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు సీబీడీటీ ప్రకటించింది. www. incometaxindiaefiling.gov.in ప్రస్తుత ఈ పోర్టల్ స్థానంలో జూన్ 7 నుంచి www. incometaxgov.in పోర్టల్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. పన్ను చెల్లింపుదారులు ఏవైనా సమర్పించాల్సినవి ఉంటే, అప్లోడ్, డౌన్లోడ్ పనులను జూన్ 1లోపు పూర్తి చేసుకోవాలని సూచించింది. జూన్ 1–6 మధ్య ప్రస్తుత పోర్టల్ అందుబాటులో ఉండదని స్పష్టం చేసింది. పన్ను చెల్లింపుదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదన్న ఉద్దేశంతో ఆ రోజుల్లో ఎటువంటి గడువులు నిర్దేశించలేదని పేర్కొంది. వేగంతోపాటు కొత్త సదుపాయాలు కొత్త పోర్టల్ ఎన్నో సదుపాయాలతో ఉంటుందని, వేగంగా రిటర్నుల దాఖలు, పన్ను రిఫండ్లకు అనుకూలంగా ఉంటుందని సీబీడీటీ తెలిపింది. పన్ను చెల్లింపుదారులకు సంబంధించి అన్ని రకాల స్పందనలు, అప్లోడ్లు, అపరిష్కృత అంశాలన్నీ ఒకే డాష్‌బోర్డులో దర్శనమిస్తాయని వివరించింది. వెబ్సైట్లో ఉండే అన్ని ముఖ్య సదుపాయాలు మొబైల్ యాప్‌పైనా లభిస్తాయని పేర్కొంది. -
పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. ప్రీ-ఫిల్డ్ ఫారంలు వచ్చేశాయి
ఆదాయపు పన్ను శాఖ వారు సంస్కరణల పేరిట తీసుకొచ్చిన పెనుమార్పుల్లో కొత్త ఫారంలు కూడా ఉన్నాయి. వీటినే ప్రీ ఫిల్డ్ ఫారంలని కూడా అంటారు. కొత్త మార్పుల కారణంగా మనం సైటులోకి వెళ్లి ఫారంలోని ఒక్కొక్క అంశం టైప్ చేసి నింపాల్సిన అవసరం లేకుండా.. డౌన్లోడ్ చేసేసరికే ఫారంలో అంశాలు నింపేసి ఉంటాయి. అంటే డిపార్ట్మెంట్ సిబ్బందే మనకు సంబంధించిన వివరాలను ఫారంలో పొందుపర్చి ఉంచుతారు. మీరు వాటిని సరిచూసుకుని, సరిగ్గానే ఉన్నట్లయితే ఒక్క క్లిక్‌తో ఫారంను ఫైల్ చేయొచ్చు. ఒకవేళ సరిపోలకపోయిన పక్షంలో సదరు అంశాలను మీ లెక్కల ప్రకారం సవరించి, రిటర్నులు దాఖలు చేయొచ్చు. ఈ విధానాన్ని 2019 నుంచి పాక్షికంగా ప్రవేశపెట్టగా.. ఈ సంవత్సరం నుంచి సమగ్రమైన వివరాలతో పూర్తి స్థాయిలో అమలు కాగలదని విశ్లేషకుల అంచనా. డిపార్ట్మెంట్ దగ్గర మన ఆదాయాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది అనటంలో అతిశయోక్తి లేదు. డిపార్ట్మెంట్ ఏం చెబుతోందంటే.. ఈ ఫారంలు నింపటం చాలా సులువు. చాలా త్వరగా నింపవచ్చు. పారదర్శకత మెరుగుపడుతుంది. ఎక్కువ మందిని ఆకట్టుకుంటుంది. సమగ్రమైన సమాచారం కలిగి ఉంటుంది. చట్టాలకు అనుగుణంగా పని త్వరగా పూర్తవుతుంది. తప్పులకు ఆస్కారం ఉండదు. పన్నుల ఎగవేత తగ్గుతుంది. పైన పేర్కొన్న ప్రయోజనాలతో అంతా ఏకీభవించక తప్పదు. ఆదాయపు పన్ను శాఖ ఆలోచన అలాగే ఉంటుంది. ఎందుకంటే, ఎన్నో ఆర్థిక వ్యవహరాలు జరుగుతున్నా .. అసెసీలు వాటిని తమ తమ వార్షిక రిటర్నులలో చూపించడం లేదు. నిజాయితీగా ఆదాయం, ఆర్థిక వ్యవహారాలను చూపించని బడాబాబులు ఎందరో ఉంటారు. ఈ విషయం అలా ఉంచితే.. మీరు చేయవలసిందేమిటంటే.. మీ పేరు మీదనున్న అన్ని బ్యాంకు అకౌంట్లలో లావాదేవీలను పరిగణనలోకి తీసుకోండి. అన్ని ఆదాయాలు .. జీతం, ఇంటద్దె, లాభాలు, క్యాపిటల్ గెయిన్స్, వడ్డీ, డివిడెండ్లు మొదలైనవన్నీ లెక్కలోకి తీసుకోండి. ప్రతి లావాదేవీకి వివరణ, కాగితాలను సమకూర్చుకోండి. ఫారం నింపే ముందు ఫారం 16, 16ఎ, 26ఏఎస్ మొదలైనవన్నీ పరిశీలించి చూసుకోండి. అంశాల్లో అంకెలు సరిపోలకపోతే... అంటే మిస్ మ్యాచ్ అయితే.. సరిచేసుకోండి. ప్రతీ మార్పు, చేర్పునకు వివరణ ఉంచుకోండి. అవసరం అయితే వృత్తి నిపుణులను సంప్రదించండి. ఇక, ఈ ప్రీ-ఫిల్డ్ ఫారంలలో కొన్ని సమస్యలు కూడా ఉంటున్నాయి. అవేంటంటే.. అంకెలు సరిపోలకపోవడం.. మిస్ మ్యాచ్ కేవలం టీడీఎస్ వివరాలు ఉంటున్నాయి. ఆదాయ వివరాలు ఉండటం లేదు. క్లోజ్ చేసిన బ్యాంకు అకౌంట్ల వివరాలు కూడా పొందుపర్చి ఉంటున్నాయి. కాబట్టి .. ఇలాంటివన్నీ చూసుకుని, తగు జాగ్రత్తలు తీసుకుని రిటర్నులు దాఖలు చేయాలి. ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య -
ఐటీ రిటర్నుల్లో మార్పులు గమనించారా?
సాక్షి, ముంబై: ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) 2021–22 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నుల పత్రాలను (ఐటీఆర్) నోటిఫై చేసింది. సాధారణంగా గడిచిన ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అసెస్మెంట్ సంవత్సరం అవుతుంది. సీబీడీటీ నోటిఫై చేసిన ఐటీఆర్‌లను పన్ను చెల్లింపుదారులు దాఖలు చేయాల్సి ఉంటుంది. దీనిని ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. పన్ను చెల్లింపుదారులకు ఈ ఏడాది ఐటీఆర్‌లలో పరిమిత మార్పులనే చేశారు. 2020 బడ్జెట్లో ప్రతిపాదించిన ఆదాయపన్ను చట్టంలోని సవరణల మేరకు మార్పులను పొందుపరిచారు. అదే సమయంలో..గతేడాది కరోనా మహమ్మారి కారణంగా పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేకంగా కల్పించిన వెసులుబాట్లను ఐటీఆర్‌ల నుంచి తొలగించారు. డీఐ షెడ్యూల్ కూడా ఇలా తొలగించిన వాటిల్లో ఒకటి. డీఐ అంటే పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకునేందుకు పెట్టుబడులు/డిపాజిట్లు/చెల్లింపుల వివరాలు. 2021-22 అసెస్మెంట్ ఐటీఆర్‌లలో డీఐ కాలమ్ కనిపించదు. వీటితోపాటు ఐటీఆర్‌లలో ఏఏ మార్పులు చోటు చేసుకున్నదీ వివరంగా తెలుసుకుంటే.. రిటర్నుల దాఖలు మరింత సులభమవుతుంది. ఐటీఆర్-1కు సంబంధించి చోటు చేసుకున్న మార్పులను గమనిస్తే.. సెక్షన్ 194ఎన్ కింద పన్ను చెల్లింపుదారులు ఎవరికైతే మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్)అమలవుతుందో.. వారు ఐటీఆర్–1 రూపంలో రిటర్నులు దాఖలు చేయరాదు. సెక్షన్ 194 కింద బ్యాంకులు టీడీఎస్‌ను అమలు చేయాల్సి ఉంటుంది. కోఆపరేటివ్ సొసైటీలు,పోస్టాఫీసులకూ ఇది వర్తిస్తుంది. మొత్తం మీద ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాదారు నగదు ఉపసంహరణలు రూ.కోటి దాటితే అప్పుడు 2 శాతం టీడీఎస్‌ను మినహాయిస్తాయి. ఒకవేళ సదరుఖాతాదారు అంతక్రితం మూడు ఆర్థిక సంవత్సరాల్లోనూ ఐటీఆర్‌లను దాఖలు చేయనట్టయితే.. అప్పుడు ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు ఉపసంహరణలు రూ. 20లక్షలు మించినా 2 శాతంటీడీఎస్ను అమలు చేయాలి. లేదా రూ.కోటి దాటిన నగదు ఉపసంహరణలపై 5 శాతాన్ని అమలు చేయాలి. ఇటీవల పన్ను చట్టంలో చేసిన సవరణల ప్రకారం.. ఉద్యోగులు తమకు సంస్థజారీ చేసిన ఈసాప్‌లపై (ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్) పన్నును వాయిదా వేయదలుచుకుంటే అప్పుడు ఐటీఆర్1 లేదా ఐటీఆర్2 బదులు.. ఐటీఆర్ 2, 3 దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈసాప్‌లపై పన్ను వాయిదా ఈసాప్‌లపై పన్నును వెంటనే చెల్లించాల్సిన పని లేకుండా, వీలునుబట్టి వాయిదా వేసుకునే సౌకర్యాన్ని బడ్జెట్ 2020లో ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈసాప్‌లపై రెండు సార్లు పన్నుపడుతుంది. పనిచేసే సంస్థ నుంచి ఉద్యోగి ఈ సాప్లు అందుకున్నప్పుడు ఒక పర్యాయం, ఉద్యోగి తిరిగి స్టాక్ ఆప్షన్లను విక్రయించినప్పుడు వచ్చిన మూలధన లాభాలపై మరో పర్యాయంపన్ను చెల్లించాల్సి ఉంటుంది. చట్టంలో చేసిన సవరణ ప్రకారం.. అర్హత కలిగిన స్టార్టప్‌ల ఉద్యోగులు తాము అందుకున్న ఈసాప్‌లపై పన్నును వాయిదా వేసుకోవచ్చు. స్టాక్ ఆప్షన్లుకేటాయించిన ఆర్థిక సంవత్సరం ముగింపు నుంచి 48 నెలల పాటు అంటే నాలుగేళ్ల వరకు ఇలా పన్నును వాయిదా వేసుకునే సౌకర్యం ఉంది. ఈసాప్‌లపై ప్రస్తుతం చెల్లిస్తున్న పన్ను,వాయిదా వేసుకుంటున్న పన్నును వివరంగా షెడ్యూల్ టీటీఐ (కంప్యుటేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ ఆన్ టోటల్ ఇన్కమ్)లో పేర్కొనాలి. డివిడెండ్ ఆదాయం.. డివిడెండ్ పంపిణీ పన్ను (డీడీటీ)ను ఎత్తేసి.. డివిడెండ్ అందుకున్న వ్యక్తి పన్ను చెల్లించాలన్న సవరణను గతంలో తీసుకొచ్చారు. దీంతో ఐటీఆర్‌లలో డీడీటీ సెక్షన్‌ను ఎత్తేసి షెడ్యూల్ ఓఎస్ (ఇతర వనరుల ద్వారా ఆదాయం)ను తాజా సవరణలకు అనుగుణంగా మార్పు చేశారు. అంటే ఇతర వనరుల ద్వారా ఆదాయం కాలమ్‌లోనే డివిడెండ్ ఆదాయాన్ని చూపించాల్సి ఉంటుంది. డివిడెండ్ ఆదాయానికి సంబంధించి వడ్డీ వ్యయాలు ఏవైనా చేసి ఉంటే (రుణాలు తీసుకుని చెల్లింపులు).. వాటిని సెక్షన్ 57(1) కింద తగ్గించి చూపించుకునేందుకు కొత్తగా ఒక వరుసను ప్రవేశపెట్టారు. భారత్‌లో కాకుండా ఇతర దేశాల్లో నివసించే భారతీయుల పన్ను చెల్లింపుదారులు అందుకునే డివిడెండ్‌కు సంబంధించి కొత్త వరుసలను చేర్చారు. సెక్షన్ 115ఏ కింద ప్రవాస భారతీయులు అందుకునే డివిడెండ్‌పై ప్రత్యేక పన్ను రేటును వసూలు చేయనున్నారు. ఐటీఆర్ 2, 3, 4ను దాఖలు చేసే వారు డివిడెండ్ ఆదాయాన్ని త్రైమాసికాల వారీగా వేరు చేసి చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఐటీఆర్–1 దాఖలు చేసే వారు సైతం డివిడెండ్ ఆదాయాన్ని నాలుగు త్రైమాసికాలుగా వేరు చేసి చూపించాలి. దీంతో అడ్వాన్స్ ట్యాక్స్ (ముందస్తు పన్ను చెల్లింపులు) బాధ్యతను లెక్కించేందుకు పన్ను అధికారులకు సులభంగా ఉంటుంది. రాయితీ పన్ను రేట్లు 2021-22 అసెస్మెంట్ సంవత్సరం నుంచి పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 115బీఏసీ కింద తక్కువ పన్ను రేట్ల విధానాన్ని ఎంచుకోవచ్చు. దీన్ని ఎంపిక చేసుకుంటే కొన్నిమినహాయింపులు, తగ్గింపులను కోల్పోవాల్సి వస్తుంది. అన్ని ఐటీఆర్లలోనూ పార్ట్–ఏలో పన్ను చెల్లింపుదారులు తాము 11బీఏసీ కింద నూతన పన్ను విధానాన్ని ఎంపికచేసుకుంటున్నట్టు అయితే తెలియజేయాల్సి ఉంటుంది. వ్యాపారం లేదా వృత్తి పరమైన ఆదాయం కలిగిన వారు నూతన విధానాన్ని గడువులోపు 10-ఐఈ దాఖలు చేయడం ద్వారాఎంచుకోవాలి. ఫామ్ 10–ఐఈ దాఖలు చేసిన తేదీ, అక్నాలెడ్జ్మెంట్ నంబర్‌ను ఐటీఆర్-3లో పొందుపరచాలి. ఐటీఆర్-3లో షెడ్యూల్ డీపీఎం (ప్లాంట్, మెషినరీ విలు వ తరుగుదల), షెడ్యూల్ యూడీ (సర్దుబాటు చే యని తరుగుదల)లకు సంబంధించి మినహాయిం పులను ఇప్పుడు వదులు కోవాల్సి ఉంటుంది. ఎవరు ఏ రిటర్నులు దాఖలు చేయాలి ♦ ఐటీఆర్–1 వేతనం ద్వారా ఆదాయం పొందే వ్యక్తులు (దేశంలో నివసించే వారు) లేదా, మరియు ఒక ఇల్లు కలిగి ఉండి.. వ్యవసాయ ఆదాయం రూ.5,000లోపు కలిగినా, ఇతర ఆదాయం (వడ్డీ ఆదాయం) ఉన్నా.. అంతా కలుపుకుని సంవత్సరాదాయం రూ.50లక్షల్లోపు ఉన్న వారు ఐటీఆర్–1 దాఖలు చేయాల్సి ఉంటుంది. మినహాయింపులు: పైన చెప్పుకున్న వారికి కొన్ని మినహాయింపులు వర్తిస్తాయి. ఎలా అంటే.. రూ.50లక్షల్లోపు ఆదాయం ఉన్న వ్యక్తి ఒకవేళ ఏదైనా కంపెనీ బోర్డ్‌లో డైరెక్టర్‌గా ఉన్నా లేదా ఏదేనీ అన్‌లిస్టెడ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా ఐటీఆర్-1 దాఖలు చేయకూడదు. అదే విధంగా సెక్షన్ 194 ఎన్ కింద టీడీఎస్ మినహయించినా లేదా ఈసాప్పై పన్నును వాయిదా వేసుకున్న వారు కూడా ఐటీఆర్–1 దాఖలు చేయడానికి లేదు. ఇంటిపై నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకునే వారు.. ఇతర వనరుల రూపంలో నష్టాన్ని కూడా క్యారీ ఫార్వార్డ్ చేసుకునే వారు సైతం ఐటీఆర్-1 దాఖలు చేయరాదు ♦ ఐటీఆర్-2: ఐటీఆర్-1 దాఖలు చేసే అర్హత లేని వ్యక్తులు (ఎన్ఆర్ఐలు సైతం), హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్).. వ్యాపారం లేదా వృత్తి రూపంలో ఆదాయం, లాభాలు లేనట్టయితే ఐటీఆర్-2 దాఖలుకు అర్హులు. ♦ ఐటీఆర్-3 :వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు వ్యాపారం లేదా వృత్తి నుంచి ఆదాయం, లాభాలు కలిగి.. ఇతర రూపాల్లో ఆదాయం లేనట్టయితే అప్పుడు ఐటీఆర్–3 దాఖలు చేయాల్సి ఉంటుంది. ♦ ఐటీఆర్-4 : వృత్తి, వ్యాపార ఆదాయం కలిగిన వ్యక్తులు, సంస్థలు ఐటీఆర్–4ను దాఖలు చేయాలి. సెక్షన్ 44ఏడీ కింద వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయంపై ప్రిసంప్టివ్ ట్యాక్స్‌ను ఎంపిక చేసుకున్న వ్యక్తులు (స్థానిక నివాసులు), హెచ్‌యూఎఫ్‌లు, సంస్థలు (ఎల్ఎల్పీ కానివి) రూ.50లక్షల వరకు వార్షికాదాయం కలిగి ఉంటే ఐటీఆర్-4ను దాఖలు చేయాలి. ♦ఐటీఆర్-5/6/7: ప్రత్యేక విభాగం కిందకు వచ్చే వ్యక్తులు (పై విభాగాల్లోకి రాని వారు), ఎల్ఎల్పీలు, సంస్థలు, కంపెనీలకు ఐటీఆర్-5, 6, 7 వర్తిస్తాయి. ♦ ప్రిసంప్టివ్ ట్యాక్స్: వృత్తి నిపుణులు లేదా సంస్థలు వార్షిక టర్నోవర్ రూ.50లక్షల వరకు ఉంటే ప్రిసంప్టివ్ ట్యాక్స్ స్కీమ్‌ను ఎంచుకుని.. తన టర్నోవర్‌లో 50% పన్ను వర్తించే ఆదాయం కింద చూపించి పన్ను చెల్లించే సౌలభ్యత ఉంది) -
రిటర్నుల దాఖలు; మరోసారి పొడిగింపు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నుల దాఖలు గడువును మూడో విడత పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో 2019–20 ఆర్థిక సంవత్సరానికి వ్యక్తులు తమ ఆదాయపన్ను రిటర్నులను (ఆడిట్ అవసరం లేనివారు) జనవరి 10 వరకు ఎటువంటి ఆలస్యపు రుసుము లేకుండా దాఖలు చేసుకోవచ్చు. తమ ఖాతాలను ఆడిట్ చేసుకోవాల్సిన వ్యక్తులకు, అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీల వివరాలను రిపోర్ట్ చేయాల్సిన వారు.. అలాగే, ఆడిట్ అవసరమున్న వ్యాపార సంస్థలు, కంపెనీలకు జనవరి 31 వరకు ఉన్న రిటర్నుల గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగించింది. ట్యాక్స్ ఆడిట్ నివేదికల సమర్పణకు జనవరి 15 వరకు తాజాగా అవకాశం కల్పించింది.(చదవండి: న్యూవిస్టాడోమ్ కోచ్‌తో మరుపురాని ప్రయాణం!) ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ప్రకటన విడుదల చేసింది. గతేడాదితో పోలిస్తే ఇప్పటి వరకు ఐటీఆర్‌ల దాఖలులో తగ్గుదల కనిపిస్తోంది. దీంతో మరికొంత గడువు ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక వివాద్ సే విశ్వాస్ పథకం కింద డిక్లరేషన్ గడువును కూడా ప్రభుత్వం జనవరి 31 వరకు పొడిగించింది. అలాగే, 2019–20 ఆర్థిక సంవత్సరపు వార్షిక జీఎస్టీ రిటర్నుల గడువును రెండు నెలలు అంటే ఫిబ్రవరి 28 వరకు ప్రభుత్వం పొడిగించింది. కరోనా కారణంగా ఏర్పడిన సవాళ్ల కారణంగా నిబంధనలను పాటించేందుకు ఉన్న ఇబ్బందులను దృష్టిలోకి తీసుకుని గడువును పొడిగించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది -
రిటర్నుల దాఖలుకు మార్గాలివే..
ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలుకు మరో రెండు వారాల వ్యవధే మిగిలి ఉంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలు గడువు వాస్తవానికి జూలైతోనే ముగియాలి. కానీ, కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ప్రతికూతలతల నేపథ్యంలో గడువు కాస్తా డిసెంబర్ ఆఖరు వరకు పెరిగింది. దీంతో రిటర్నులను ఇప్పటి వరకు చేయని వారు.. డిసెంబర్ 31 నాటికి సమర్పించాల్సి ఉంటుంది. రిటర్నుల దాఖలుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆన్లైన్ వేదికలతోపాటు, ఆఫ్లైన్లోనూ రిటర్నుల దాఖలులో సాయపడేవారు ఉన్నారు. పన్ను అంశాల పట్ల మీకు అవగాహన ఉంటే స్వయంగా ఈ పనిని చేసుకోవచ్చు. లేదా అందుబాటులో ఉన్న ఇతర మార్గాలను ఆశ్రయించొచ్చు. ఆ వివరాలను ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనంలో తెలుసుకుందాం. ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన ఉండి, పన్ను విషయాలు కూడా తెలిసిన వారు అయితే నేరుగా ఆదాయపన్ను శాఖ ఈ ఫైలింగ్ వెబ్సైట్ (incometaxindiaefiling. gov. in) కు వెళ్లి రిటర్నులు ఫైల్ చేయవచ్చు. ఈ పోర్టల్‌లో ముందుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మీ పాన్ నంబరే యూజర్ ఐడీ అవుతుంది. పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకుని నమోదు ప్రక్రియ పూర్తి చేసుకున్న అనంతరం.. తిరిగి లాగిన్ అయి రిటర్నులను దాఖలు చేసుకోవచ్చు. ఈ సేవ కోసం ఆదాయపన్ను శాఖ ఎటువంటి చార్జీలు వసూలు చేయదు. మీ ఆదాయ వివరాలు సమగ్రంగా సిద్ధం చేసుకుంటే రిటర్నుల దాఖలు పెద్ద కష్టమేమీ కాదు. ఐటీ పోర్టల్‌లో ఎంతో సమాచారం అందుబాటులో ఉంది. ఫామ్ 26ఏఎస్, ఈపే సెల్ఫ్ అసెస్మెంట్, ఈ వెరిఫై లింక్‌లు కూడా అక్కడే ఉంటాయి. ఫామ్ 26ఏఎస్‌లో టీడీఎస్, టీసీఎస్ వివరాలు ఉంటాయి. గతంలో దాఖలు చేసిన రిటర్నులను, వాటి పురోగతి తీరును, అవుట్‌స్టాండింగ్ ట్యాక్స్ డిమాండ్ (కట్టాల్సిన పన్ను బకాయిలు ఉంటే), రిఫండ్ అభ్యర్థన దాఖలు పురోగతి, ఐటీఆర్ 5 రసీదు వివరాలు కూడా అక్కడే లభిస్తాయి. దాఖలు సమయాన్ని తగ్గించేందుకు వీలుగా పన్ను లెక్కలను కూడా కొన్నింటిని ఆటోమేటెడ్ చేశారు. పాన్ డేటాబేస్ ఆధారంగా గతంలోని ఐటీఆర్‌లు, ఫామ్ 26ఏఎస్ ఆధారంగా ముందుగానే కొన్ని వివరాలు నింపిన రిటర్నులు కూడా అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా గత కొన్నేళ్ల కాలంలో కొన్ని అదనపు సౌకర్యాలను ఆదాయపన్ను శాఖ తీసుకొచ్చింది. భద్రతా కోణంలో లాగిన్‌కు రెండో దశ అథెంటికేషన్‌ను ‘ఈ ఫైలింగ్ వాల్ట్’ రూపంలో ప్రవేశపెట్టింది. యూజర్ ఐడీ, పాస్వర్డ్ సాయంతో కాకుండా.. మరింత భద్రత కోసం నెట్ బ్యాంకింగ్, ఆధార్ ఆధారిత ఓటీపీ రూపంలోనూ లాగిన్ కావొచ్చు. మధ్యవర్తుల సాయం.. స్వయంగా రిటర్నులు దాఖలు చేసుకునేంత అవగాహన లేని వారు లేదా అంత తీరిక లేని వారు మధ్యవర్తుల సాయం తీసుకోవచ్చు. ఇందు కోసం ఎన్నో వెబ్ పోర్టళ్లు (వెబ్‌సైట్స్) అందుబాటులో ఉన్నాయి. ఈ పోర్టళ్లు మీ నుంచి అవసరమైన సమాచారం అంతా తీసుకుని, పన్ను చెల్లింపు బాధ్యతలను మదింపు చేసిన అనంతరం మీ తరఫున రిటర్నులను ఆదాయపన్ను పోర్టల్ వేదికపై దాఖలు చేస్తాయి. కొన్ని పోర్టళ్లు ఉచితంగానూ ఈ సేవలను ఆఫర్ చేస్తున్నాయి. రూ.5లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి ‘ట్యాక్స్‌స్మైల్’ పోర్టల్ ఉచితంగా రిటర్నుల ఫైలింగ్ సేవను అందిస్తోంది. అదే విధంగా క్లియర్‌ట్యాక్స్ పోర్టల్ కూడా కొందరికి ఇటువంటి సేవను ఆఫర్ చేస్తోంది. ఒకటికి మించిన మార్గాల్లో ఆదాయం కలిగి ఉండి లేదా విదేశీ ఆదాయం ఉండుంటే నిపుణుల సేవలను రిటర్నుల ఫైలింగ్ కోసం తీసుకోక తప్పదు. ఈ విషయంలో చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) సేవలను వినియోగించుకోవచ్చు. ఒక వ్యక్తికి ఉన్న ఆదాయ వనరుల ఆధారంగా రిటర్నుల దాఖలుకు వెబ్ పోర్టళ్లు ఫీజులను నిర్ణయిస్తున్నాయి. అందించే సేవల ఆధారంగా రూ.699 నుంచి రూ.7,999 వరకు ఫీజుల కింద ట్యాక్స్‌స్పానర్ అనే సంస్థ తీసుకుంటోంది. రిటర్నుల దాఖలే కాకుండా పలు పోర్టళ్లు విలువ ఆధారిత సేవలను కూడా అందిస్తున్నాయి. ఐటీఆర్ దాఖలు తర్వాత వాటిల్లోని తప్పొప్పులను సరిచేసుకోవడం, డిమాండ్ నోటీసులకు స్పందించడం తదితర అంశాల్లో నిపుణుల సేవలను కూడా వీటి నుంచి పొందొచ్చు. పన్ను నిపుణులు లేదా సీఏలతో తమ సందేహాలను తీర్చుకునే సదుపాయాన్ని అందిస్తున్నాయి. మీ డాక్యుమెంట్లను భద్రంగా ఉంచుకునేందుకు వాల్ట్ సేవను కూడా అందుబాటులో ఉంచుతున్నాయి. రిటర్నుల దాఖలుతోపాటు ఈ సేవలను కూడా పొందే విధంగా ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. టీఆర్పీలు ప్రభుత్వం నియమించిన పన్ను దాఖలు సన్నాహకుల (టీఆర్పీలు) సేవలను కూడా వినియోగించుకోవచ్చు. మీకు సమీపంలో ఉన్న టీఆర్పీల వివరాలను ఇన్కమ్ట్యాక్స్ఇండియా డాట్ జీవోవీ డాట్ ఇన్ పోర్టల్‌లో ‘ట్యాక్స్‌పేయర్ సర్వీసెస్’ ట్యాబ్ నుంచి పొందొచ్చు. టీఆర్పీలు మొదటి ఏడాది రిటర్నుల దాఖలు, పన్ను చెల్లింపులపై 3% సర్వీసు చార్జీ కింద తీసుకుంటారు. అదే వ్యక్తి రెండో ఏడాది రిటర్నుల దాఖలు సేవను కోరుకుంటే 2%, తర్వాతి ఏడాది ఒక శాతం చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. గరిష్ట చార్జీ రూ.1,000. ఒకవేళ ఏదేనీ సంవత్సరం ఈ చార్జీ రూ.250 కూడా మించకపోతే అప్పుడు టీఆర్పీలు కనీస చార్జీ తీసుకునేందుకు అర్హులు. కాకపోతే వీరి సేవలు పన్ను రిటర్నుల దాఖలు వరకే అని గుర్తుంచుకోవాలి. ఆన్లైన్ పోర్టళ్ల మాదిరి ఏడాది పొడవునా సేవలు, విలువ ఆధారిత సేవలు వీరి నుంచి లభించవు. గడువు దాటొద్దు.. కరోనా కారణంగా 2019–20 ఆర్థిక సంవత్సరం రిటర్నుల దాఖలు గడువును జూలై నుంచి తొలుత నవంబర్ ఆఖరుకు, ఆ తర్వాత డిసెంబర్ 31కు కేంద్రం పొడిగించింది. ఈ గడువులోపు రిటర్నులను దాఖలు చేయకపోతే.. ఆ తర్వాత వడ్డీ చార్జీలు, పెనాల్టీలను చెల్లించుకోవాలి. రిఫండ్లు కూడా ఆలస్యమవుతాయి. గతంలో పెనాల్టీలు విధించడం అన్నది పన్ను అధికారుల విచక్షణపైనే ఆధారపడగా, ఇప్పుడైతే అది చట్ట ప్రకారం అమలవుతోంది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 234 ఎఫ్ కింద.. పన్ను వర్తించే ఆదాయం రూ.5లక్షలు, ఆలోపు ఉంటే డిసెంబర్ 31 తర్వాత రిటర్నుల దాఖలుకు రూ.1,000 పెనాల్టీ చార్జీగా చెల్లించాలి. పన్ను వర్తించే ఆదాయం రూ.5లక్షలు మించి ఉంటే ఈ పెనాల్టీ రూ.10,000. గడువు లోపు రిటర్నులు దాఖలు చేయకుండా, ఆలస్యంగా రిటర్నులు వేసి పన్ను చెల్లించినట్టయితే ఆ మొత్తంపై వడ్డీ కూడా వసూలు చేయాలని సెక్షన్ 234ఏ చెబుతోంది. ఆలస్యమైన ప్రతీ నెలకు ఒక శాతం చొప్పున వడ్డీ చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇది కూడా పన్ను బాధ్యత రూ.లక్ష వరకు ఉన్న వారికే. ఒకవేళ రూ.లక్షకు మించి పన్ను చెల్లించాల్సి ఉండి, డిసెంబర్ 31 తర్వాత రిటర్నులు వేసినట్టయితే.. అప్పుడు 2020 జూలై 31 తర్వాతి నుంచి రిటర్నులు వేసే నాటి వరకు ఈ మేరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మీరు రిటర్నులు వేయాల్సిందే..! కనీస మినహాయింపు పరిధిలో ఆదాయం ఉన్న వారు (60ఏళ్లలోపు వ్యక్తులకు రూ.2.5 లక్షలు) రిటర్నులు దాఖలు చేయక్కర్లేదు. కానీ, ఏదేనీ ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను వర్తించే స్థాయిలో ఆదా యం లభిస్తే ఆ ఏడాదికి రిటర్నులు వేస్తే సరిపోయేది. అయితే, ఇక మీదట పన్ను వర్తించే ఆదాయ పరిధిలో లేకపోయినా కానీ.. నిర్దేశిత లావాదేవీలలో ఏవైనా నిర్వహించినట్టయితే తప్పకుండా రిటర్నులు వేయాలి. డిపాజిట్లు రూ.కోటికి మించి చేసినా (ఒకటి లేదా అంతకుమించిన కరెంటు ఖాతాలలో), విదేశీ పర్యటన కోసం రూ.2లక్షలపైన ఖర్చు పెట్టినా, ఒక ఏడాదిలో విద్యుత్తు బిల్లు రూ.లక్ష దాటినా తమ ఆదాయంతో సంబంధం లేకుండా ఐటీఆర్ దాఖలు చేయాలి. ఎవరు ఏ రిటర్నులు వేయాలి? ఐటీఆర్–1: రూ.20 లక్షల ఆదాయం మించని వ్యక్తులు ఐటీఆర్–1 దాఖలు చేయాల్సి ఉంటుంది. అది కూడా ఒక్క వేతనం లేదా ఇంటిపై ఆదాయం లేదా వడ్డీ ఆదాయం, లేదా వ్యవసాయంపై ఆదాయం రూ.5,000 వరకు ఉన్న వారు, లేదా ఇవన్నీ కలిగిన వారు ఐటీఆర్–1 ఫైల్ చేయాలి. ఐటీఆర్–2: ఐటీఆర్–1 పరిధిలోని వారు కాకుండా.. ఒక వ్యక్తి కంపెనీలో డైరెక్టర్‌గా ఉంటే లేదా స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో నమోదు కాని కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఐటీఆర్–2 దాఖలు చేయాలి. అలాగే, క్రితం ఆర్థిక సంవత్సరాల్లోని మూలధన లాభాలను చూపించుకునేట్టు అయితే లేదా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని నష్టాలను తర్వాతి సంవత్సరాలకు కొనసాగించుకోవాలనుకుంటే, ఇతర వనరుల ద్వారా ఆదాయం వచ్చిన వారు కూడా ఇదే రిటర్న్ వేయాల్సి ఉంటుంది. ఐటీఆర్–3: వ్యక్తులు, హిందు అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్) వ్యాపారం లేదా వృత్తి రూపంలో ఆర్జించి ఉంటే ఐటీఆర్–3ను ఫైల్ చేయాలి. ఐటీఆర్–4: భారతీయ నివాసితులు, హెచ్‌యూఎఫ్‌లు, సంస్థలు (ఎల్ఎల్పీ కాకుండా) వ్యాపారం, వృత్తి రూపంలో రూ.50 లక్షల వరకు ఆదాయం ఉంటే ఐటీఆర్–4 వేయాల్సి ఉంటుంది. ఐటీఆర్–5/6/7: నిర్దేశిత వ్యక్తులు, ఎల్ఎల్పీలు, సంస్థలు, కంపెనీలకు ఇవి వర్తిస్తాయి. -
ఐటీ రిటర్న్‌ల గడువు పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కేంద్రం మరోసారి ఊరటనిచ్చింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గానూ వ్యక్తిగత ఆదాయ పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేందుకు డిసెంబర్ 31 వరకు గడువు పొడిగించింది. అలాగే ఖాతాలను ఆడిట్ చేయాల్సిన అవసరం ఉన్న పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయపన్ను రిటర్న్‌ల దాఖలు గడువును జనవరి 31 వరకు పొడిగించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీసీ) విడుదల చేసిన ఒక ప్రకటన ఈ విషయాన్ని స్పష్టంచేసింది. అంతర్జాతీయ లావాదేవీలు, కొన్ని ప్రత్యేక స్వదేశీ లావాదేవీలు నిర్వహించే పన్ను చెల్లింపుదార్లు తమ ఆదాయం పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ఇదివరకు నిర్దేశించిన గడువును జనవరి 31 వరకు పొడిగించారు. ఇతర పన్ను చెల్లింపుదారులకూ గడువును జనవరి 31వరకు పొడిగించారు. దిగువ తరగతి, మధ్యతరగతి పన్ను చెల్లింపుదార్లు తాము స్వయంగా మదింపు చేసిన ఆదాయ పన్ను వివరాలు దాఖలు చేయడానికి మరోసారి వెసులుబాటు కల్పించారు. పన్ను విధింపునకు ఆస్కారం ఉన్న రూ.లక్ష వరకూ ఆదాయం ఉన్న వారు స్వయంగా మదింపు ప్రక్రియ వివరాలు సమర్పించేందుకు జనవరి 31 వరకు అవకాశం కల్పించారు. -
ఐటీఆర్ ఫైలింగ్ : గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపు పన్నుకు సంబంధించి 2018-19 రిటర్న్స్ దాఖలుకు తుది గడువును ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) మరో రెండు నెలలు పొడిగించింది. ఈ మేరకు బుధవారం ఒక ట్వీట్ చేసింది. నిజానికి ఈ గడువు సెప్టెంబర్‌తో ముగిసిపోయింది. కోవిడ్-19 నేపథ్యంలో రిటర్న్స్ దాఖలు విషయంలో కొన్ని అవరోధాలు ఏర్పడుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీడీటీ తెలిపింది. గడువు పొడిగింపు ఇది నాల్గవసారి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి అసెస్మెంట్ ఇయర్ 2019–20 అవుతుంది. అంటే 2020 మార్చినాటికి 2018–19 ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే దీనిని తొలుత జూన్ 30 వరకూ సీబీడీటీ పొడిగించింది. మళ్లీ జూలై 31 వరకూ పెంచింది. జూలై నుంచి సెప్టెంబర్ 30 వరకూ పొడిగించింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో కొన్ని అధిక విలువలు కలిగిన లావాదేవీలు జరిగాయని పేర్కొంటూ, కొందరికి ఆదాయపు పన్ను శాఖ ఇటీవల ఎస్ఎంఎస్, ఈ-మెయిల్‌ను పంపుతోంది. జీఎస్టీ రిటర్న్స్ గడువు అక్టోబర్ 31 వరకూ... మరోవైపు 2018-19 వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వార్షిక రిటర్న్స్, ఆడిట్ రిపోర్ట్ దాఖలుకు (జీఎస్టీఆర్-9, జీఎస్టీఆర్ 9సీ) గడువును మరోనెల అంటే అక్టోబర్ 31వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు సీబీఐసీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్డ్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్) మరో ట్వీట్లో ప్రకటించింది. మేలో ఈ గడువును సీబీఐసీ మూడు నెలల పాటు అంటే సెప్టెంబర్ వరకూ పొడిగించింది. కరోనా ప్రేరిత అంశాలు దీనికి నేపథ్యం. -
పన్నులు ఎగవేస్తున్న డొనాల్డ్ ట్రంప్!
సాక్షి, న్యూఢిల్లీ : సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత పదేళ్ల కాలంలో కేవలం రెండే రెండు ఏళ్లకు ఆదాయం పన్ను చెల్లించారని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. తనకు ఆదాయం కన్నా నష్టాలే ఎక్కువ వచ్చినందున ఆదాయం పన్ను చెల్లించాల్సిన అవసరం లేదంటూ ఆయన ఆ శాఖకు వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఈ విషయాలను న్యూయార్క్ టైమ్స్ ఆదివారం నాటి సంచికలో వెల్లడించింది. (టిక్‌టాక్ బ్యాన్ : ట్రంప్‌నకు ఎదురుదెబ్బ) డొనాల్డ్ ట్రంప్ గత 15 ఏళ్ల కాలంలో పదేళ్లపాటు ఆదాయం పన్ను చెల్లించకుండా తప్పించుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన 2016 సంవత్సరంలో కేవలం 750 డాలర్లు, ఆ మరుసటి సంవత్సరం, అంటే 2017 సంవత్సరానికి మరో 750 డాలర్లు ఆదాయం పన్ను చెల్లించారు. తనకు ఆదాయానికి మించిన నష్టాలు వచ్చినందున తాను ఆదాయం పన్ను చెల్లించాల్సిన అవసరం లేదంటూ అమెరికా ప్రభుత్వ రెవెన్యూ శాఖకు ట్రంప్ వివరణ ఇచ్చారు. అయితే ఆయన తన ఆస్తుల వివరాలనుగానీ, నష్టాల వివరాలనుగానీ వెల్లడించలేదు. ఆయన ఆస్తులపై అమెరికా రెవెన్యూ శాఖ ఎలాంటి దర్యాప్తునకు ఆదేశించలేదు. (ట్రంప్ వైపు ఇండియన్ అమెరికన్లు మొగ్గు) అమెరికా చట్టాల ప్రకారం అమెరికా అధ్యక్షులు తమ వ్యక్తిగత ఆదాయం వివరాలను ప్రజాముఖంగా వెల్లడించాల్సిన అవసరం లేదు. అయితే 1970 రిచర్డ్ నిక్సన్, ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రమే ఆస్తుల వివరాలను వెల్లడించలేదు. మిగతా అధ్యక్షులందరు వెల్లిడిస్తూ వచ్చారు. తాను కిమిషనర్ ఆధ్వర్యంలో ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ఆడిట్ పరిధిలో ఉన్నందున తాను ఆదాయం పన్ను రిటర్న్స్‌ను ప్రజలకు వెల్లడించలేనని కూడా ట్రంప్ చెప్పుకున్నారు. కోట్ల డాలర్ల ఆస్తి కలిగిన డొనాల్డ్ ట్రంప్ నష్టాల పేరిట ఆదాయ పన్నును తప్పించుకోవడమే కాకుండా గతంలో కట్టిన పన్ను నుంచి కొంత మొత్తాలను వెనక్కి తీసుకుంటున్నారంటూ న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన వార్తను ట్రంప్ ఖండించారు. తాను కేంద్ర ప్రభుత్వానికే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా పన్నులు చెల్లిస్తున్నానని, పన్ను భారం తగ్గించుకునేందుకు సిబ్బందిని ఎక్కువగా నియమించుకుంటున్నానని ఆయన వివరించారు. (ట్రంప్‌కు షాకిచ్చిన రిపబ్లికన్లు) -
20 నుంచి ఐటీ శాఖ ఈ–క్యాంపెయిన్
న్యూఢిల్లీ: 2018–19 ఆర్థిక సంవత్సరంలో అధిక మొత్తంలో లావాదేవీలు నిర్వహించినప్పటికీ ఐటీ రిటర్నులు దాఖలు చేయని వారిని, ఒకవేళ రిటర్నులు దాఖలు చేసినా అందులో ఆయా వివరాలను పొందుపర్చని వారిని గుర్తించామని ఆదాయపు పన్ను శాఖ శనివారం తెలియజేసింది. 2019–20లో రిటర్నుల దాఖలుకు, అందులో మార్పులు చేర్పులకు చివరి తేదీ జూలై 31. కాగా, 2018–19లో రిటర్నులు దాఖలు చేయని వారు, లావాదేవీల వివరాలు ఇవ్వని వారు స్వచ్ఛందంగా వెల్లడింవచ్చు. ఇందుకోసం జూలై 20వ తేదీ నుంచి 11 రోజులపాటు ఈ–క్యాంపెయిన్‌ను ఐటీ శాఖ నిర్వహించనుంది. -
ఐటీ రిటర్న్‌ల గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్నులను దాఖలు చేసే గడువును నవంబర్ 30 దాకా పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆదాయపన్ను శాఖ శనివారం ప్రకటిం చింది. రెండురోజుల క్రితమే ఐటీ రిటర్న్‌ల గడువును ఈనెల 31కి పెంచిన కేంద్రం... తాజాగా మరో 4 నెలలు అవకాశం ఇచ్చింది. టీడీఎస్, టీసీఎస్ సర్టిఫికెట్లను జారీ చేసేం దుకు ఆఖరు తేదీని కూడా ఐటీశాఖ ఆగస్ట్ 15 దాకా పెంచింది. ‘ప్రస్తుత పరిస్థితు ల దృష్ట్యా నవంబర్ 30 దాకా రిటర్న్‌ల దాఖలుకు అవకాశం కల్పిస్తున్నాం’ అని ఐటీశాఖ వెల్లడిం చింది. ఐటీ కడుతున్నపుడు హౌసింగ్ లోన్లు, జీవిత బీమా, పీపీఎఫ్ ఇతరత్రా మినహాయిం పులను క్లెయిమ్ చేసుకొనే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. వీటి కింద ఈ నెల 31వ తేదీ దాకా చేసిన అన్ని రకాల మదుపులను 2019–20 రిటర్నులలో క్లెయిమ్ చేసుకోవచ్చు. -
గడువు సమీపిస్తోంది.. సిద్ధ్దమేనా?
కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితులను అర్థం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం ఆదాయపన్ను రిటర్నుల దాఖలు దగ్గర నుంచి పలు నిబంధనల అమలు విషయంలో ఎంతో ఊరట కల్పించింది. దీంతో వేతన జీవులకు, ఆదాయపన్ను చెల్లింపుదారులకు ఎంతో ఉపశమనం లభించింది. మరి కొన్ని నిబంధనల అమలుకు ఇచ్చిన అదనపు గడువు ఈ నెలాఖరుతో ముగిసిపోతోంది. ఈ లోపు అమలు చేయాల్సిన వాటిపై ఇప్పుడే దృష్టి సారిస్తే చివరి నిమిషంలో కంగారు పడాల్సిన అవస్థ తప్పుతుంది. 2018–19 సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నులను దాఖలు చేయని వారికి కరోనా కారణంగా మరో అవకాశం లభించినట్టయింది. జూన్ 30 వరకు ఆలస్యపు రిటర్నులను దాఖలు చేసుకోవచ్చు. అదే విధంగా గతంలో దాఖలు చేసిన రిటర్నుల్లో మార్పులు చేయాలనుకుంటే, దానికి సంబంధించి సవరణ రిటర్నులు వేసుకోవచ్చు. పాన్, ఆధార్ లింక్ చేయలేదా? పాన్ కార్డు కలిగిన ప్రతీ వ్యక్తి విధిగా తమ ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేసుకోవాలని ఆదాయపన్ను శాఖ ఎప్పటి నుంచో కోరుతోంది. ఇందుకు సంబంధించిన గడువును ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తోంది. ఇలా పొడిగింపు ఇచ్చిన గడువు కూడా జూన్ 30తో ముగిసిపోనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మరో విడత గడువు పొడిగించే అవకాశాలు లేకపోలేదు. అలా అని ఎంత కాలం పాటు దీన్ని వాయిదా వేయగలం? కనుక పాన్–ఆధార్ అనుసంధానాన్ని పూర్తి చేసుకోవడం మంచిది. గడువులోపు ఈ పని చేయకపోతే, ఒకవేళ గడువు పొడిగింపు ఇవ్వని పక్షంలో జూలై 1 నుంచి పాన్ పనిచేయకుండా పోతుంది. దాంతో పాన్ ఇవ్వలేని పరిస్థితి. దీనివల్ల ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 272బి కింద రూ.10,000 జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు పన్ను రిటర్నులు దాఖలు చేయలేరు. అలాగే బ్యాంకు ఖాతాల ప్రారంభం, బ్యాంకుల్లో డిపాజిట్లు, డీమ్యాట్ ఖాతాల ప్రారంభం, స్థిరాస్తుల లావాదేవీలు, సెక్యూరిటీల లావాదేవీలు, కారు కొనుగోలు వంటివి కష్టంగా మారతాయి. ఫామ్ 15జీ, ఫామ్ 15హెచ్ వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలు దాటని వారు ప్రతీ ఆర్థిక సంవత్సరం ఆరంభంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఫామ్ హెచ్15జీ (60 ఏళ్లు దాటిన వారు ఫామ్ 15హెచ్) సమర్పించొచ్చు. తమ ఆదాయం పన్ను వర్తించని కనీస పరిమితి (రూ.2.50 లక్షలు) లోపే ఉంటుందని స్వీయ ధ్రువీకరణ ఇవ్వడమే ఈ పత్రాలను సమర్పించడం. ఇలా ఇవ్వడం వల్ల బ్యాంకులు మీకు సంబంధించి డిపాజిట్ల వడ్డీపై టీడీఎస్ అమలు చేయకుండా ఉంటాయి. ఒకవేళ బ్యాంకులు టీడీఎస్ అమలు చేస్తే రిటర్నులు దాఖలు చేసి కానీ రిఫండ్ కోరేందుకు అవకాశం ఉండదు. 2019–20 సంవత్సరానికి ఫామ్ 15జీ, ఫామ్ 15హెచ్ సమర్పించేందుకు కేంద్రం జూన్ ఆఖరు వరకు గడువును పొడిగించింది. ఇక 2020–21 సంవత్సరానికి సంబంధించి ఈ పత్రాలను జూన్ 30 నాటికి సమర్పించాలి. దాంతో ఎటువంటి కోతల్లేకుండా చూసుకోవచ్చు. పన్ను ఆదాకు ఇప్పటికీ అవకాశం గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2019–20) సంబంధించి పన్ను ఆదా పెట్టుబడులకు ఇప్పటికీ అవకాశం మిగిలే ఉంది. వాస్తవానికి మార్చి ఆఖరుతోనే గడువు ముగిసిపోవాల్సి ఉంది. కానీ, ఈ ఏడాది కరోనా కారణంగా లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు గరిష్టంగా పన్ను ఆదా కోసం ఉద్దేశించిన పెట్టుబడులకు జూన్ 30 వరకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ), ఐదేళ్ల పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్, నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్), ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. అదే విధంగా గృహ రుణం (మొదటి ఇంటికి) తీసుకుని దానికి చెల్లింపులు చేస్తుంటే, అసలు, వడ్డీ చెల్లింపులను కూడా రిటర్నుల్లో చూపించుకోవడం ద్వారా పన్ను రాయితీలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే వైద్య, జీవిత బీమా ప్రీమియం చెల్లింపులు, విద్యా రుణంపై చేసే వడ్డీ చెల్లింపులతోపాటు చట్ట పరిధిలో విరాళాలపైనా 2019–20 ఆర్థిక సంవత్సరానికి పన్ను ప్రయోజనాలను పొందేందుకు ఈ నెలాఖరు నాటికి ఇచ్చిన అవకాశాన్ని కోల్పోవద్దు. ఇక కేంద్రం నోటిఫై చేసిన ఎన్హెచ్ఏఐ, పీఎఫ్సీ, ఐఆర్ఎఫ్సీ లేదా ఆర్ఈసీ బాండ్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు చట్టపరంగా అవకాశం ఉంది. ఇతర పెట్టుబడులు పీపీఎఫ్ ఖాతాలో కనీసం రూ.500, సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో కనీసం రూ.250 చొప్పున ఒక ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ చేయడం తప్పనిసరి. కనుక 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఒక్క డిపాజిట్ కూడా చేయలేని వారికి గడువు ముగిసిపోయినా ప్రభుత్వం జూన్ 30 వరకు మరో అవకాశం ఇచ్చింది. దీనివల్ల రుసుములు పడవు. అదే విధంగా పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకంలోనూ ప్రతి నెలా కనీస మొత్తాన్ని తప్పకుండా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే పెనాల్టీ పడుతుంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలకు సంబంధించి జమలు చేయలేకపోయినప్పటికీ.. జూన్ 30 నాటికి చేయడం ద్వారా పెనాల్టీ లేకుండా చూసుకోవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)లో 60 ఏళ్లు దాటిన వారు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ 55–60 ఏళ్ల మధ్య రిటైర్ అయిన వారు తమ రిటైర్మెంట్ నగదు ప్రయోజనాలను అందుకున్న నెలరోజుల్లోపు ఎస్సీఎస్ఎస్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో ఇలా ఇన్వెస్ట్ చేయాల్సి ఉండి, చేయలేకపోయిన వారు జూన్ 30 వరకు ఆ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అడ్వాన్స్ ట్యాక్స్ ఈ ఏడాది మార్చి 20 నుంచి జూన్ 29వ తేదీ మధ్య కాలంలో చేయాల్సిన ముందస్తు పన్ను చెల్లింపులు, టీడీఎస్ వంటి వాటికి గడువు జూన్ 30 వరకు ఉంది. తగ్గించిన పెనాల్టీ చెల్లించడం ద్వారా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్లు 234బి, 234సి ప్రకారం ఆలస్యపు చెల్లింపులపై ప్రతి నెలా 1 శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉండగా.. దీనికి బదులు 0.75 శాతం చెల్లిస్తే చాలు. 2020–21 అసెస్మెంట్ (మదింపు) సంవత్సరానికి సంబంధించి మొదటి విడత ముందస్తు పన్ను చెల్లించేందుకు గడువు జూన్ 15వ తేదీ. జూన్ 30 తర్వాత చేసే ఆలస్యపు చెల్లింపులపై 1 శాతం పెనాల్టీ చెల్లించాల్సిందే. -
పాత విధానమా? కొత్త విధానమా? మీ ఇష్టం!
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపన్ను చెల్లింపు కోసం ఇకపై రెండు విధానాలు అమల్లోకి ఉంటాయని, పాతవిధానంలో కొనసాగితే ఇప్పటివరకు ఉన్న మినహాయింపులు యథాతథంగా అమల్లో ఉంటాయని, కొత్త విధానంలోకి మారితే మినహాయింపులు ఏవీ ఉండవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు. ఆదాయపన్నుకు సంబంధించి పాత విధానమా? కొత్త విధానమా? అనేది పన్ను చెల్లింపుదారుడే నిర్ణయం తీసుకోవాలని ఆమె సూచించారు. కొత్త విధానంలో రూ. 5 లక్షల నుంచి 7 లక్షల ఆదాయానికి 10శాతం పన్ను, రూ. 7.5 లక్షల నుంచి రూ. 10 లక్షల ఆదాయానికి 15శాతం పన్ను, రూ. 10 లక్షల నుంచి రూ. 12.5 లక్షల ఆదాయానికి 20 శాతం పన్ను, రూ. 12.5 లక్షల నుంచి రూ. 15 లక్షల ఆదాయానికి 25శాతం పన్ను, రూ. 15 లక్షలకుపైగా ఆదాయానికి 30 శాతం పన్ను ఉంటుందని తెలిపారు. పన్నురేట్లు తగ్గించేందుకే తాము ప్రయత్నం చేస్తున్నామని ఆమె వివరించారు. ఆదాయపన్ను విధానాన్ని సరళీకరించాలనే ఉద్దేశంతో ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. కొత్త విధానంలో 80సీ, 80డీ, ఎల్టీసీ, హెచ్చార్ఏ మినహాయింపులు ఉండవని తెలిపారు. ఇక, దీర్ఘకాలంలో ఆదాయపన్ను మినహాయింపులన్నీ తొలగిస్తామని, వాటి స్థానంలో తక్కువ పన్నురేటు ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్పొరేట్ పన్నుల విధానంలో మార్పులు తీసుకొచ్చినవిధంగానే ఆదాయపన్నుల్లోనూ మార్పులు తెస్తామని అన్నారు. ఆదాయపన్ను చెల్లింపు సరళీకృతంగా ఉండాలని కోరుకునేవారు కొత్త విధానంలోకి మారొచ్చునని, కొత్త విధానంలో ఆదాయపన్ను చెల్లింపు ఎంతో సులువుగా ఉంటుందని తెలిపారు. -
కార్పొరేట్ వర్గాలకు ఊరట!
-
నూతన వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లు ఇవే...
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పులు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తద్వారా మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతికి ఊరటనిచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. శనివారం లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా.. ఈ మేరకు... 0 నుంచి 2.50 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారికి ఎలాంటి ఆదాయపన్ను లేదని, 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు 5 శాతం అలాగే ఉంటుందని తెలిపారు. అదే విధంగా.. రూ. 5-7.5 లక్షల వార్షిక ఆదాయంపై ఇప్పటి వరకు ఉన్న పన్నును 20 శాతం నుంచి 10 శాతానికి, రూ. 7.5 లక్షల నుంచి రూ 10 లక్షల వరకూ పన్నును 20 నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు.. అదే విధంగా రూ. 10 నుంచి రూ 12.5 లక్షల వార్షికాదాయంపై 20 శాతం పన్ను, రూ. 12.5 లక్షల నుంచి రూ 15 లక్షల వార్షికాదాయంపై 25 శాతం పన్ను, రూ. 15 లక్షల పైబడి ఆదాయంపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు తెలిపారు.(బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్) అయితే, ఆదాయం పన్నును సరళీకరించడంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి ఏడు స్లాబుల విధానాన్ని ప్రతిపాదించారు. గతంలో ఐదు స్లాబులు మాత్రమే ఉన్న విషయం తెల్సిందే. ఆదాయం పన్ను చెల్లింపుదారులు పాత, కొత్త స్లాబుల్లో ఏదోఒక స్లాబును ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఏడాదికి ఐదు లక్షల రూపాయల ఆదాయం వరకు వచ్చేవారు ఏ స్లాబును ఎంపిక చేసుకున్నా ఫర్వాలేదు. ఎందుకంటే రెండింటిలోను వారికి తేడా లేదు. ఏడు స్లాబులు గల కొత్త విధానాన్ని ఎంపిక చేసుకునేవారు 80 సీ, 80 డీ కింద వచ్చే మినహాయింపులను వదులు కోవాల్సి ఉంటుంది. వాటిని వదులుకున్నప్పుడే కొత్త విధానం వర్తిస్తుంది. పన్ను మినహాయింపులు వదులుకోదల్చుకోలేని వారు పాత స్లాబులోనే కొనసాగవచ్చు. ఏది ఏమైనా అది వారి ఐచ్ఛికం. అదే విధంగా... కార్పొరేట్ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఈ మేరకు కార్పొరేట్ ట్యాక్స్‌లను 15 శాతం తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కార్పొరేట్ ట్యాక్సులను తగ్గించడం చారిత్రక నిర్ణయం అని పేర్కొన్నారు. ప్రపంచంలో అతి తక్కువ కార్పొరేట్ పన్నులు ఉన్న దేశం భారత్ అని పేర్కొన్నారు. కొత్తగా అంతర్జాతీయ బులియన్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. డివిడెండ్ డిస్ర్టిబ్యూషన్ ట్యాక్స్ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఫైనాన్షియల్ కాంట్రాక్ట్‌ల ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం దీర్ఘకాలిక రుణాల మంజూరు చేస్తామని తెలిపారు. -
ట్రేడింగ్ ఆదాయంపై పన్ను చెల్లించాలా..?
ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వారు... స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఆదాయాన్ని చూపించడం, పన్ను చెల్లించడం తప్పనిసరి. అయితే, ఈ విషయమై స్పష్టమైన అవగాహన తక్కువ మందిలోనే ఉంటుందని చెప్పుకోవాలి. నేటి తరం యువతలో చాలా మంది ట్రేడింగ్ వైపు ఆకర్షితులవుతున్నారు. అత్యాధునిక ఆల్గో ట్రేడింగ్ సాఫ్ట్వేర్లు అందుబాటు, మొబైల్ నుంచే అన్ని రకాల సేవలు, విస్తృతమైన సమాచారం ఇవన్నీ ఇందుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. మరి ట్రేడింగ్‌ను ఓ ప్రొఫెషన్‌గా ఎంచుకున్నవారు ఇందుకు సంబంధించిన పన్ను బాధ్యతలను తెలుసుకోవడం ఎంతో అవసరం. ఆ వివరాలే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ కథనం. ఇంట్రాడే ట్రేడింగ్ (ఒకే రోజు కొని, విక్రయించడం) ద్వారా వచ్చే లాభ/నష్టాలను వ్యాపార ఆదాయంగా చట్టం పరిగణిస్తుంది. బిజినెస్ లేదా ప్రొఫెషన్ ద్వారా వచ్చిన లాభాలుగా (పీజీబీపీ) వీటిని చూపించాల్సి ఉంటుంది. ఇక ట్రేడింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని స్పెక్యులేటివ్, నాన్ స్పెక్యులేటివ్‌గా వేరు చేయాల్సి ఉంటుంది. ఈక్విటీలో ఇంట్రాడే ట్రేడింగ్‌పై వచ్చే లాభ, నష్టాలను స్పెక్యులేటివ్‌గా పరిగణించాలి. అదే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) ద్వారా వచ్చే లాభ, నష్టాలు నాన్ స్పెక్యులేటివ్ అవుతాయి. పీజీబీపీ కింద స్పెక్యులేటివ్, నాన్ స్పెక్యులేటివ్ లాభాలన్నవి మీ పన్ను వర్తించే ఆదాయానికే కలుస్తాయి. మీ ఆదాయం ఏ శ్లాబు పరిధిలో ఉంటే ఆ మేరకు పన్ను చెల్లించడం తప్పనిసరి. మినహాయింపులు అయితే, వ్యాపార ఆదాయం కింద చూపించే స్పెక్యులేటివ్, నాన్ స్పెక్యులేటివ్ లాభాల నుంచి, మీకు అయిన ఖర్చులను మినహాయించుకునే అవకాశం ఉంటుంది. అంటే బ్రోకర్ల కమీషన్, డీమ్యాట్ చార్జీలు, ఇంటర్నెట్ ఖర్చులు ఇవన్నీ కూడా ట్రేడింగ్ కోసం చేసిన ఖర్చులే అవుతాయి. కనుక మొత్తం లాభాల్లో ఈ ఖర్చులను మినహాయించుకున్న తర్వాతే మిగిలిన ట్రేడింగ్ ఆదాయాన్ని పేర్కొంటే సరిపోతుంది. అయితే, నష్టాలు వస్తే మాత్రం స్పెక్యులేటివ్, నాన్ స్పెక్యులేటివ్ ఆదాయంపై పన్ను వేర్వేరుగా ఉంటుంది. ఎఫ్‌అండ్‌వో నుంచి నాన్ స్పెక్యులేటివ్ రూపంలో నష్టం వచ్చిందనుకుంటే... ఈ నష్టాన్ని సంబంధిత వ్యక్తి వేతనం మినహా ఇతర ప్రధాన ఆదాయం నుంచి సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ అప్పటికీ నష్టం మిగిలిపోతే దాన్ని తదుపరి ఎనిమిది ఆర్థిక సంవత్సరాల కోసం బదలాయించుకోవచ్చు. తద్వారా తర్వాతి ఎనిమిది ఆర్థిక సంవత్సరాల్లో ఎప్పుడైనా చూపించుకుని పన్ను భారం తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు వార్షికాదాయం రూ.6 లక్షలు అనుకోండి, అలాగే, అద్దె రూపంలో మరో రూ.2 లక్షలు వచ్చిందనుకోండి.. వీటికి అదనంగా ఎఫ్అండ్వోలోనూ వేలుపెట్టి రూ.3 లక్షలు నష్టపోయారనుకుందాం. అప్పుడు మీ ఆదాయం రూ.6 లక్షలే. వాస్తవంగా వేతనం రూపంలో రూ.6 లక్షలు, అద్దె రూపంలో రూ.2 లక్షలు కలిపితే ఆదాయం రూ.8 లక్షలు. కానీ అద్దె ఆదాయం రూ.2 లక్షల్లో, నష్టం రూ.2 లక్షలను సర్దుబాటు చేసుకోవచ్చు. ఇక్కడ ఇతర ఆదాయం రూ.2 లక్షలే ఉండడంతో రూ.3 లక్షల నష్టం వచ్చినా కానీ, కేవలం రూ.2 లక్షలు మినహాయించుకోవడం జరిగింది. మిగిలిన రూ.లక్ష నష్టాన్ని తదుపరి ఏడాదికి బదిలీ చేసుకోవచ్చు. ఇక ఈక్విటీ ఇంట్రాడే ట్రేడింగ్ స్పెక్యులేటివ్ కిందకు వస్తుంది కనుక.. ఇంట్రాడే ట్రేడింగ్‌లో నష్టం వస్తే దాన్ని కేవలం స్పెక్యులేటివ్ ఆదాయం నుంచే మినహాయించుకునేందుకు వీలుంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చిన స్పెక్యులేటివ్ నష్టాన్ని, అదే సంవత్సరం స్పెక్యులేటివ్ ఆదాయం కింద సర్దుబాటుకు వీలు పడకపోతే, తదుపరి 4 ఆర్థిక సంవత్సరాల్లో ఎప్పుడైనా దాన్ని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే స్పెక్యులేటివ్ నష్టాలను, స్పెక్యులేటివ్ ఆదాయం నుంచే సర్దుబాటు చేసుకోవడానికి ఉంటుంది. నాన్ స్పెక్యులేటివ్(ఎఫ్‌అండ్‌వో) ఆదాయం నుంచి స్పెక్యులేటి వ్ నష్టాలను మినహాయించుకోవడానికి కుదరదు. ఆడిటింగ్ అవసరమే... స్టాక్ ట్రేడింగ్ ఆదాయం వ్యాపార ఆదాయం అవుతుంది కనుక ఆదాయపన్ను చట్టం ప్రకారం ఆడిట్ తప్పనిసరి. ఆదాయపన్ను చట్టం ప్రకారం వ్యాపార ఆదాయం రూ.కోటి దాటితే ఆడిట్ తప్పనిసరి అవుతుంది. ట్రేడింగ్ రూపంలో వచ్చిన నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకోవాలంటే, ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ తీసుకోవాలా? అని చాలా మంది పన్ను రిటర్నులు దాఖలు చేసే వారు ఎదుర్కొనే సందేహం. ఈ విషయమై క్లియర్‌ట్యాక్స్ సీఈవో అర్చిత్ గుప్తా స్పందిస్తూ... ఒక వ్యక్తి వార్షిక టర్నోవర్ రూ.కోటి దాటకపోతే కనుక నష్టాలను మినహాయించి చూపించుకునేందుకు, తదుపరి సంవత్సరాలకు క్యారీ ఫార్వార్డ్ చేసుకునేందుకు ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ అవసరం లేదని తెలిపారు. అయితే, తమకు ఇంత ఆదాయం వస్తుందంటూ స్వచ్ఛందంగా పన్ను చెల్లించే ‘ప్రిజంప్టివ్ ట్యాక్స్ స్కీమ్’ కింద రిటర్నులు దాఖలు చేసే వారికి ట్యాక్స్ ఆడిట్ నిబంధనలు వేరుగా ఉన్నాయి. ఈ స్కీమ్ కింద టర్నోవర్‌లో 6/8 శాతం కంటే తక్కువ లాభం (ట్రేడింగ్ రూపంలో) ఉందని చూపిస్తే మాత్రం ట్యాక్స్ ఆడిట్ తప్పనిసరి అవుతుంది. అదే సమయంలో ఇతర మార్గాలు అయిన.. వేతనం, అద్దె ఆదాయం, వ్యాపార రూపంలో ఆదాయం కనీస పన్ను మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలు మించి ఉన్నా కానీ ఆడిటింగ్ అవసరం అవుతుంది. ఉదాహరణకు.. ఓ వ్యక్తి ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ పథకం కింద తనకు ట్రేడింగ్‌పై నష్టం వచ్చినట్టు చూపించారనుకోండి... అదే సమయంలో ఆ వ్యక్తి మొత్తం ఆదాయం (వేతనం సహా) రూ.2.5 లక్షలు మించి ఉంటే ట్యాక్స్ ఆడిట్ అవసరం అవుతుంది. టర్నోవర్ అంటే... టర్నోవర్ అంటే ఏమిటీ..? అన్న సందేహం వస్తే... ఉదాహరణకు ఈక్విటీ ఇంట్రాడే ట్రేడింగ్ సెటిల్మెంట్లో పేయింగ్ అవుట్/పేయింగ్ ఇన్ తేడాయే టర్నోవర్ అవుతుంది. అంటే రూ.5 లక్షలు కొనుగోలు చేసి, రూ.4 లక్షలకు అమ్మితే, మిగిలిన రూ.లక్ష టర్నోవర్ అవుతుంది. అదే ఎఫ్‌అండ్‌వోలో ట్రేడింగ్ అయితే, నికర లాభం, నష్టం, ఆప్షన్లపై ప్రీమియం టర్నోవర్ కిందకు వస్తాయి. ఉదాహరణకు ఓ కాంట్రాక్టును రూ.5,00,000కు కొనుగోలు చేసి, దాన్ని రూ.5,50,000కు విక్రయించారని అనుకుంటే... అప్పుడు లాభం రూ.50,000 వచ్చినట్టు అవుతుంది. ఇదే టర్నోవర్ అవుతుంది. అదే ఆప్షన్ కాంట్రాక్టులో ఫలానా కంపెనీ లాట్ (1,000 షేర్లు)ను రూ.200కు కొనుగోలు చేసి రూ.180కు అమ్మారనుకోండి. ఈ కేసులో రూ.20,000 నష్టంతోపాటు, ట్రేడర్‌కు నికరంగా లభించే ప్రీమియం రూ.1,80,000 కూడా టర్నోవర్ కిందకు వస్తుంది. ఈ రెండు కేసులను కలిపి చూస్తే, ఫ్యూచర్ కాంట్రాక్టులో నికర లాభం రూ.50,000తోపాటు, ఆప్షన్ కాంట్రాక్టులో మొత్తం రూ.2 లక్షలు కలిపి టర్నోవర్ రూ.2,50,000 అవుతుంది. -
పాన్–ఆధార్ లింక్ చేశారా?
సాక్షి, ప్రకాశం: నేడు ఆర్థికపరమైన లావాదేవీలకు పాన్‌కార్డు అనేది ప్రతి ఒక్కరికీ అవసరంగా మారింది. ఏ లావాదేవీలకైనా పాన్‌కార్డు నంబర్‌ను తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ ప్రకారం పాన్‌కార్డు, ఆధార్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా రెండింటిని అనుసంధానం చేసుకోవాలి. అలాగే ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్‌ల ఫైలింగ్‌కు ఆధార్ నంబర్ కూడా అవసరం. పాన్‌కార్డు లేనివారు ఆధార్‌తో ఐటీ రిటరŠన్స్ దాఖలు చేయొచ్చు. ఈ నేపథ్యంలో ఆధార్ సంఖ్యను పాన్‌కార్డుతో అనుసంధానం ఆన్‌లైన్‌లోనూ, ఎస్ఎంఎస్ ద్వారా చేసుకోవచ్చు.\ లాగిన్ అయ్యేది ఇలా.. పన్ను చెల్లింపుదారులు ఇన్‌కం ట్యాక్స్ ఇ–ఫైలింగ్ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి. ఇదివరకే యూజర్ ఖాతా కలిగి ఉన్నవారు నేరుగా ఇ–ఫైలింగ్ పోర్టర్లో లాగిన్ కావచ్చు. లాగిన్ అయ్యేందుకు గతంలో క్రియేట్ చేసుకున్న యూజర్ ఐడీ, పాస్వర్డ్, కోడ్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. దీంతో ఆధార్, పాన్ సంఖ్యల లింక్ వివరాలు తెలుసుకోవచ్చు. కొత్తగా లింక్ ఇలా.. ఆదాయపన్ను శాఖ ఇ–ఫైలింగ్ వెబ్సైట్ www.incometaxindiaefiling.gov.in లో లాగిన్ అయి ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అక్కడ కనిపించే ముఖచిత్రంలో ఎడమ భాగంలో లింక్ ఆధార్ న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఒక విండో ఓపెన్ అవుతుంది. అక్కడ పాన్‌కార్డు సంఖ్య, ఆధార్‌కార్డు సంఖ్య, పేరు వివరాలను పూర్తి చేయాలి. ఆదాయపన్ను శాఖ ఈ వివరాలను సరిచూస్తుంది. క్రాస్ చెక్ పూర్తి అయిన తర్వాత మీ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. వ్యాలిడేషన్ పూర్తయిన తర్వాత పాన్‌కార్డుతో ఆధార్ అనుసంధానం జరుగుతుంది. వివరాలన్నీ సరిపోతేనే ఈ అనుసంధాన ప్రక్రియ సజావుగా జరుగుతుంది. అనుసంధానం పూర్తయితే మీకు సమాచారం అందుతుంది. ఎస్ఎంఎస్ ద్వారా.. యూఐడీపీఏఎస్ అని ఆంగ్ల అక్షరాల్లో టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి పాన్ నంబర్ ఎంటర్ చేసి 567678కు ఎస్ఎంఎస్ పంపాలి. ఆధార్‌కార్డుతో లింక్ అయిన మొబైల్ నంబర్‌తోనే ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. అనుసంధానం ఎందుకు.. ఆదాయపన్ను శాఖ రిటర్న్స్ దాఖలు చేసినప్పుడు మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీ మీ ఆధార్ అనుసంధానం అయిన సెల్ నంబర్‌కు ఇక నుంచి వస్తుంది. అలాగే ఆ శాఖ ఇ–వెరిఫికేషన్ మరింత సులువవుతుంది. పాన్‌తో పాటు ఆధార్ అనుసంధానం చేయని పక్షంలో సెప్టంబర్ 30 తర్వాత పాన్‌కార్డు నిరుపయోగంగా మారుతుందని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఆదాయపన్ను రిటర్నులు చేసేవారు ఆధార్‌ను పాన్‌కు అనుసంధానించడం మంచిది. ఇన్‌కం ట్యాక్స్ వెబ్సైట్లో ఆధార్ అనుసంధానం జరిగి ఉంటే వీరు ఐటీఆర్–5ను ప్రింట్ తీసి పంపాల్సిన అవసరం ఉండదు. దీంతో పన్ను రిటర్నుల ప్రక్రియ త్వరితగతిన జరుగుతుంది. -
రిటర్నుల ఈ–అసెస్మెంట్ను నోటిఫై చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: దసరా (అక్టోబర్ 8) నుంచి ఎల్రక్టానిక్ రూపంలోనే రిటర్నుల పరిశీలన (ఈ–అసెస్మెంట్)ను ప్రారంభించేందుకు వీలుగా కేంద్ర ఆరి్థక శాఖ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో జాతీయ స్థాయిలో ఈ–అసెస్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు వీలు పడుతుంది. ఈ అసెస్మెంట్కు సంబంధించి వ్యక్తులు వ్యక్తిగతంగా లేదా అధికార ప్రతినిధి ద్వారా ఆదాయపన్ను శాఖ అధికారుల ముందు హాజరవ్వాల్సిన అవసరం లేదని నోటిఫికేషన్ స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా హాజరై ఏవైనా తెలియజేయదలిస్తే, అందుకు అనుమతిస్తామని పేర్కొంది. పన్ను రిటర్నుల మదింపునకు సంబంధించి ఈ అసెస్మెంట్ కేంద్రం నోటీసులు జారీ చేస్తే, దీనికి సంబంధించి 15 రోజుల్లోపు స్పందన తెలియజేసిన కేసులను అసెసింగ్ అధికారికి ఆటోమేటిగ్గా బదిలీ చేయడం జరుగుతుందని తెలిపింది. -
59 నిమిషాల్లోనే బ్యాంక్ రుణాలు
న్యూఢిల్లీ: ‘59 నిమిషాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) రుణాలు’ పోర్టల్ సేవలు రిటైల్ రుణాలకూ విస్తరించడం జరిగింది. రిటైల్ రుణ లభ్యతకూ ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. గృహ, వ్యక్తిగత రుణ ప్రతిపాదనలకు ఈ పోర్టల్ ఇకపై అందుబాటులో ఉండనుంది. త్వరలో ఆటో రుణాలకు సంబంధించి కూడా అందుబాటులోకి వస్తుందని అధికార వర్గాలు తెలపాయి. ఇప్పటి వరకూ ఈ సేవలు లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) మాత్రమే అందుబాటులో ఉంది. 2018 నవంబర్‌లో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఎంఎస్ఎంఈలకు కోటి రూపాయల వరకూ ఈ పోర్టల్ ద్వారా రుణం పొందే సౌలభ్యం ఉంది. ఆదాయపు పన్ను రిటర్న్స్ నుంచి బ్యాంక్ అకౌంట్ల వరకూ అందుబాటులోఉన్న పలు ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లను పరిశీలనలోకి తీసుకుని వచ్చే డేటా పాయింట్లను అత్యుధునిక ఆల్గోరిథమ్స్ ద్వారా విశ్లేషించి తక్షణ రుణ లభ్యత కల్పించడం ఈ పోర్టల్ ముఖ్య ఉద్దేశం. 2019 మార్చి 31వ తేదీ వరకూ అందిన గణాంకాల ప్రకారం- ఈ రుణాల కోసం 50,706 ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 27,893 ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడింది. -
ఐటీ రిటర్నుల దాఖలు గడువుపై తప్పుడు ప్రచారం
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక తప్పుడు వార్త హల్చల్ చేస్తోంది. దీనిపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ), ఐటీ శాఖ స్పందించాయి. 2018-19 సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2019–20) సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు గడువులో ఎలాంటి పొడిగింపు లేదని సీబీడీటీ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఆర్డర్ ఫేక్ ఆర్డర్ అనీ, ఆగస్టు 31వ తేదీ అంటే రేపటితో ఐటీఆర్ ఫైలింగ్ గడువు ముగియనుందని ఐటీ విభాగం ట్వీట్ చేసింది. ఐటి రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువును పొడిగిస్తూ సీబీడీటీ ఆర్డర్ పేరుతో చలామణి అవుతున్న వార్త నిజమైంది కాదని సీబీడీటీ స్పష్టం చేసింది. గడువులోపు పన్ను చెల్లింపుదారులు తమ ఐటీ రిటర్న్‌లను దాఖలు చేయాలని సూచించింది. కాగా ఐటీఆర్‌లు దాఖలు చేయడానికి ఐదు వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఆదాయపు పన్ను విభాగం పోర్టల్... ఐటీఆర్ దాఖలు చేయడానికి అధికారిక వెబ్‌సైట్‌గా అందుబాటులో ఉంది. క్లియర్ ట్యాక్స్, మైఐటీ రిటర్న్, ట్యాక్స్‌స్పానర్, పైసాబజార్ ఈ వెబ్సైట్ల ద్వారా కూడా ఐటీఆర్‌లు దాఖలు చేయవచ్చు. ఇవే కాకుండా చాలా బ్యాంక్‌లు ఈ–ఫైలింగ్ ఆప్షన్‌ను అందిస్తున్నాయి. ఐటీఆర్‌లు దాఖలు చేయాలనుకుంటున్న వాళ్లు సంబంధిత బ్యాంక్‌ల ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఐటీఆర్‌లను దాఖలు చేయవచ్చు. ఈ నెల 31లోపు ఐటీఆర్ దాఖలు చేయలేకపోతే, ఈ ఏడాది డిసెంబర్ వరకూ రూ. 5,000 జరిమానాతో, ఆ తర్వాత రూ.10,000 ఫైన్‌తో దాఖలు చేయవచ్చు. It has come to the notice of CBDT that an order is being circulated on social media pertaining to extension of due dt for filing of IT Returns. It is categorically stated that the said order is not genuine.Taxpayers are advised to file Returns within extended due dt of 31.08.2019 pic.twitter.com/m7bhrD8wMy — Income Tax India (@IncomeTaxIndia) August 30, 2019 -
ఐటీ రిటర్న్‌ల దాఖలుకు మూడు రోజులే గడువు
ముంబై: ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి మరో మూడు రోజులే గడువుంది. గత ఆర్థిక సంవత్సరానికి(అసెస్మెంట్ ఇయర్ 2019–20) సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఎలక్ట్రానిక్ పద్దతిలో దాఖలు చేయడానికి గడవు తేదీ ఈ నెల 31వ తేదీ. కాగా ఐటీఆర్‌లు దాఖలు చేయడానికి ఐదు వెబ్సైట్లు అందుబాటులో ఉన్నా యి. ఆదాయపు పన్ను విభాగం పోర్టల్... ఐటీఆర్ దాఖలు చేయడానికి అధికారిక వెబ్‌సైట్‌గా అందుబాటులో ఉంది. క్లియర్ ట్యాక్స్, మైఐటీ రిటర్న్, ట్యాక్స్‌స్పానర్, పైసాబజార్ ఈ వెబ్సైట్ల ద్వారా కూడా ఐటీఆర్‌లు దాఖలు చేయవచ్చు. ఇవే కాకుండా చాలా బ్యాంక్‌లు ఈ–ఫైలింగ్ ఆప్షన్‌ను అందిస్తున్నాయి. ఐటీఆర్‌లు దాఖలు చేయాలనుకుంటున్న వాళ్లు సంబంధిత బ్యాంక్‌ల ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఐటీఆర్‌లను దాఖలు చేయవచ్చు. ఈ నెల 31లోపు ఐటీఆర్ దాఖలు చేయలేకపోతే, ఈ ఏడాది డిసెంబర్ వరకూ రూ. 5,000 జరిమానాతో, ఆ తర్వాత రూ.10,000 ఫైన్‌తో దాఖలు చేయవచ్చు. -
‘పన్ను’కు టైమైంది..
గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేసేందుకు పెద్దగా సమయం లేదు. వాస్తవానికి జూలై చివరి నాటికే ఆదాయపన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేయాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ చివరి వరకు గడువును పొడిగించింది. దీంతో ఈ నెల చివరి వరకు అవకాశం లభించినట్టు అయింది. కనుక వెంటనే ఐటీఆర్ దాఖలును ప్రారంభించడం మంచిది. బేసిక్ పన్ను మినహాయింపు అయిన రూ.2.5 లక్షలు (60 ఏళ్లు దాటిన వారికి రూ.3 లక్షలు) దాటి ఆదాయం ఉన్న ప్రతీ ఒక్కరూ నిబంధనల మేరకు ఐటీఆర్ తప్పనిసరిగా దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్ దాఖలు చేయాలంటే, అందులో ఉండే పన్ను అంశాలు, వాటికి సంబంధించి ఇవ్వాల్సిన వివరాలు అన్నింటినీ సిద్ధం చేసుకోవాలి. అంతేకాదు అందరికీ ఒకటే ఐటీఆర్ వర్తించదు. వేతన జీవులు, వ్యాపారులు, ఉమ్మడి కుటుంబాల వారు... ఇలా వారి ఆదాయ మార్గాలను బట్టి ఐటీఆర్ కూడా మారిపోతుంది. కనుక ఐటీఆర్ ప్రక్రియ గురించి అవగాహన కలిగి ఉంటే, సులభంగా దాఖలు చేయవచ్చు. ఆ వివరాలే ఈవారం ప్రాఫిట్ ప్లస్ కథనం... గడువులోపు ఐటీఆర్ దాఖలు అన్నది మంచి చర్య అవుతుంది. లేదంటే పెనాల్టీలు, ఇతర వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఐటీఆర్ దాఖలు కోసం ముందుగా మీరు మీ ఆదాయ వనరులు అన్నింటిపై అవగాహన కలిగి ఉండాలి. వేతనం, ఇంటి అద్దె, ఏవైనా రాయల్టీలు (ప్రతిఫలాలు) ఇలా అన్ని ఆదాయ వనరుల సమాచారం సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఆదాయంలో దేనిపై పన్ను వర్తిస్తుందన్నది తెలుసుకోవాలి. ఆదాయపన్ను అన్నది బేసిక్ శాలరీ, కరువుభత్యం (డీఏ), బోనస్‌లపై అమలవుతుంది. సొంతిల్లు ఉండి, అందులో మీరు నివసిస్తుంటే తప్ప ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పన్ను పరిధిలోకి రాదు. ఇక ఆదాయంలో పన్ను మినహాయింపులు వేటికన్నది గుర్తించాల్సి ఉంటుంది. సేవింగ్స్ పథకాలు, బీమా పాలసీలు, ఈపీఎఫ్, పీపీఎఫ్ వంటివన్నీ సెక్షన్ 80సీ కింద మినహాయింపులోకి వస్తాయి. పన్ను వర్తించే ఆదాయం అన్నది స్థూల ఆదాయంలో ఒక భాగం కాగా, మిగిలినది మినహాయింపులకు అర్హమైనది. పన్ను వర్తించే ఆదాయంపై పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఇలా పన్ను ఆదాయం ఉన్న వారి వేతనం నుంచి టీడీఎస్‌ను సంస్థలు మినహాయిస్తుంటాయి. ఈ వివరాలను ఫామ్–16 రూపంలో సంస్థ నుంచి పొందొచ్చు. ఐటీ చట్టం ప్రకారం పలు రకాల పన్ను శ్లాబులు ఉన్నాయి. మీకు పన్ను వర్తించే ఆదాయం ఏ శ్లాబు పరిధిలోకి వస్తే, అందులో వర్తించే రేటు మేరకు పన్ను చెల్లించాలి. ఐటీఆర్‌లో అన్ని వివరాలు పొందుపరిచి మినహాయింపుల ఆదాయం పోను మిగిలిన ఆదాయంపై పన్ను చెల్లించిన తర్వాత... ఏవైనా వ్యత్యాసం ఉంటే.. ఆ మేరకు పన్ను చెల్లింపుదారుడు రిఫండ్ కోరొచ్చు. తనే అదనంగా చెల్లించాల్సి ఉంటే పన్ను కట్టాల్సి ఉంటుంది. ఆదాయ వనరులు... మీరు ఉద్యోగి అయితే, నెలవారీ ఆదాయం లేదా వార్షికాదాయంతోపాటు.. ఇతర మార్గాల నుంచి వచ్చే ఆదాయం (అంటే ఇంటిపై అద్దె, ఉన్న ఆస్తిని విక్రయించగా వచ్చిన ఆదాయం వంటివి). పన్ను పరంగా అన్ని రకాల ఆదాయం సంబంధిత ఆర్థిక సంవత్సరంలో మీ మొత్తం ఆదాయం కిందకు వస్తుంది. బేసిక్ సాలరీ, బోనస్‌లు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఇతర అలవెన్స్‌ను వేతనంలో భాగంగా పొందుతుంటే అది పన్ను వర్తించే ఆదాయమే. అలాగే, ఇంటిపై వచ్చే ఆదాయంపైనా పన్ను ఉంటుంది. ఏదైనా ఆస్తిని విక్రయించగా వచ్చిన మూలధన లాభం లేదా నష్టం. వ్యాపారంపై వచ్చే ఆదాయం. ఫిక్స్డ్ డిపాజిట్, సేవింగ్స్ బ్యాంకు ఖాతాపై వడ్డీ ఆదాయం, గిఫ్ట్, కుటుంబ పెన్షన్‌ను సైతం ఐటీఆర్‌లో చూపించాల్సి ఉంటుంది. మినహాయింపులు... ఆదాయపన్ను చట్టంలోని పలు సెక్షన్లు ఆదాయంలో కొంత వరకు పన్ను మినహాయింపులు పొందేందుకు వీలు కల్పిస్తున్నాయి. సెక్షన్ 80సీ, 80సీసీసీ, 80సీసీడీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంటుంది. పెన్షన్ ప్లాన్లు, బీమా పాలసీలు, ఈపీఎఫ్, పీపీఎఫ్, ఎన్ఎస్సీ, ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్, ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో పెట్టుబడులు, పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజు చెల్లింపులు ఈ సెక్షన్ల కింద పన్ను మినహాయింపునకు అర్హమైనవి. అందుబాటులో ఉన్న సాధనాల్లో మీకు అనుకూలమైన వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ మేరకు ఆదాయంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. కాకపోతే ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవడం సౌకర్యవంతం. ఇవి కాకుండా ఇతర పన్ను మినహాయింపులు కూడా ఉన్నాయి. ఇంటి కొనుగోలు కోసం తీసుకున్న రుణానికి చేసే అసలు (ప్రిన్సిపల్) మొత్తంపై సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల పరిమితి మేరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. రుణంపై సమకూర్చుకున్న ఇంటిని సొంత వినియోగానికి ఉంచుకుంటే గరిష్టంగా సెక్షన్ 24 కింద ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల వడ్డీ చెల్లింపులకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ ఇంటిని అద్దెకు ఇచ్చినట్టయితే, ఆ ఇంటి రుణంపై చేసే వడ్డీ చెల్లింపులు మొత్తంపైనా పరిమితి లేకుండా పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇక మొదటి సారి ఇంటిని కొనుగోలు చేసిన వారు సెక్షన్ 80ఈఈ కింద రూ.2 లక్షలకు అదనంగా మరో రూ.50,000 వరకు వడ్డీ చెల్లింపులపై మినహాయింపు చూపించుకోవచ్చు. బ్యాంకు సేవింగ్స్ ఖాతాపై వార్షికంగా వడ్డీ ఆదాయం రూ.10,000 వరకు వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలకు (హెచ్‌యూఎఫ్) సెక్షన్ 80టీటీఏ కింద పన్ను మినహాయింపు ఉంది. సెక్షన్ 80సీసీజీ ఈక్విటీ సేవింగ్ స్కీమ్‌లో పెట్టుబడులపై 50 శాతం, గరిష్టంగా 25,000కు... దీర్ఘకాలిక ఇన్ఫ్రా బాండ్లలో రూ.20,000 పెట్టుబడులకు సెక్షన్ 80సీసీఎఫ్ కింద పన్ను మినహాయింపులు ఉన్నాయి. సెక్షన్ 80డీ కింద వ్యక్తులు అయితే రూ.25,000 వరకు హెల్త్ ప్రీమియంపై, వృద్ధులకు రూ.30,000 ప్రీమియంకు పన్ను మినహాయింపు ఉంది. సెక్షన్ 80ఈ కింద విద్యా రుణంపై చేసే వడ్డీ చెల్లింపులు పరిమితి లేకుండా ప్రయోజనం పొందొచ్చు. ఐటీఆర్ దాఖలు ఇలా... అన్ని వివరాలపై అవగాహన తెచ్చుకున్న తర్వాత ఐటీఆర్ దాఖలు చేయడం ద్వారా సమగ్రంగా ఉండేలా చూసుకోవచ్చు. ఆన్లైన్లో స్వయంగా ఐటీఆర్ దాఖలు చేయడం లేదంటే నిపుణుల సాయం తీసుకోవచ్చు. మీ సమక్షంలో వారు ఐటీఆర్ దాఖలు చేస్తారు. ఆదాయపన్ను శాఖ వెబ్సైట్ నుంచి ఆదాయపన్ను రిటర్నుల దాఖలు పత్రం సహజ్‌ను పొందొచ్చు. ఆదాయపన్ను ఈఫైలింగ్ వెబ్‌పోర్టల్‌లో తమ పేరిట అకౌంట్ క్రియేట్ చేసుకుంటే, ఆన్లైన్లోనే ఈ ఫామ్‌ను పూర్తి చేసి దాఖలు చేయవచ్చు. ఇలా రిటర్నులు దాఖలు చేసే ముందు ఆదాయం, పెట్టుబడుల వివరాలను, సంబంధిత డాక్యుమెంట్లను, ఫామ్ 16ను రెడీగా ఉంచుకోవాలి. రిటర్నుల సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఐటీఆర్ దాఖలును సులభంగా పూర్తి చేయవచ్చు. ఆన్లైన్ టూల్‌ను గతంలో వినియోగించినట్టయితే, లాగిన్ అయి ప్రీఫిల్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. వీటికి అదనంగా ఇతర వివరాలను నమోదు చేసి దాఖలు ప్రక్రియను పూర్తి చేయడం సులభం. అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత మీపై పన్ను చెల్లింపు బాధ్యత ఎంతన్నది లెక్కించుకోవాలి. అంతిమంగా చెల్లించాల్సిన పన్ను, అప్పటికే టీడీఎస్ రూపంలో చెల్లించినది పోను మిగిలిన మేర చెల్లించాలి. ఐటీఆర్‌ను దాఖలు చేసిన తర్వాత ఐటీఆర్–వీ ఫామ్ అన్నది జనరేట్ అవుతుంది. దీనిపై డిజిటల్‌గా సంతకం చేసుకునే ఆప్షన్‌ను ఎంచుకుని ఐటీఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయవచ్చు. లేదంటే ఐటీఆర్–వీ పత్రాన్ని ప్రింట్ తీసుకుని, సంతకం చేసి, ఐటీ కార్యాలయానికి పోస్ట్ ద్వారా పంపుకోవచ్చు. ఎవరు.. ఏ ఫారం దాఖలు చేయాలి.. ఒక వ్యక్తి ఏయే ఫారంల ద్వారా రిటర్నులు దాఖలు చెయ్యాలో ఈ వారం తెలుసుకుందాం. గతంలో వేతన జీవులకొక ఫారం, ఇతరులకొక ఫారం అంటూ రెండే ఉండేవి. కాలక్రమంలో ఎన్నో మార్పు.. ఎన్నో ఫారాలు.. మొత్తం వాడుకలో ఉన్న ఏడు ఫారాలలో నాలుగు ఫారాలు వ్యక్తులకు వర్తిస్తాయి. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ప్రీఫిల్డ్ ఫారాలు అమల్లో ఉన్నాయి. ఐటీ సైట్లోకి వెళ్లి my account ఆప్షన్‌లోకి వెడితే.. Prefilled XML ఉంటుంది. ఫారం 26 A లోని వివరాలు కనిపిస్తాయి. జీతం, పెన్షన్, వడ్డీ.. తదితరసమాచారం ఇందులో ఉంటుంది. ఐటీ ట్యాక్స్ వివరాలు ఉంటాయి. ఐటీఆర్1 వ్యక్తులు.. రెసిడెంట్ అయి ఉండి, నికర ఆదాయం రూ. 50 లక్షలు దాటని వారు ఈ ఫారం వేయాల్సి ఉంటుంది. విదేశీ ఆదాయం ఉండకూడదు. ఏదేని సంస్థలో డైరెక్టర్ అయి ఉండకూడదు. వ్యాపారం, క్యాపిటల్ గెయిన్స్ ఉండకూడదు. ఏ వనరు ద్వారా కూడా నష్టం ఉండకూడదు. ఒక ఇంటి నుంచే ఆదాయం ఉండాలి. మరో విధంగా చెప్పాలంటే.. కేవలం జీతం, వడ్డీ, ఒక ఇంటి మీద ఆదాయం (నష్టం కాదు) ఉన్న వారు ఈ ఫారం దాఖలు చేయాలి. వ్యవసాయం మీద ఆదాయం, డివిడెండ్లు రూ. 5,000 దాటకపోతే కూడా వేయొచ్చు. ఐటీఆర్ 2 వ్యక్తులు మరియు ఉమ్మడి కుటుంబాలు ఈ ఫారం దాఖలు చేయొచ్చు. జీతం, ఇంటి మీద ఆదాయం (నష్టం ఉన్నా ఫర్వాలేదు), ఇతర ఆదాయాలు, క్యాపిటల్ గెయిన్స్ ఉన్న వారు మాత్రమే దీన్ని ఉపయోగించవచ్చు. నాన్ రెసిడెంట్లు కూడా ఈ ఫారం వేయొచ్చు. అయితే, వారు తమ ట్యాక్స్ ఐడెంటిటీ నంబరు ఇవ్వాలి. నికర ఆదాయం రూ. 50 లక్షలు దాటిన వారు దీన్ని దాఖలు చేయాల్సి ఉంటుంది. స్థిరాస్తుల వివరాలు, షేర్లు, బంగారం, ఆభరణాలు, వాహనాలు, పెయింటింగ్, కళాత్మక వస్తువులు, బ్యాంకు డిపాజిట్లు, ఇన్సూరెన్స్ పాలసీలు, రావల్సిన అప్పులు, నగదు మొదలైన వివరాలు ఇందులో పొందుపర్చాలి. ఆస్తులను కొన్న ధర చూపాలే తప్ప ప్రస్తుత మార్కెట్ విలువ కాదు. నష్టం, సర్దుబాటు చూపొచ్చు. ఐటీఆర్ 3 ట్యాక్స్ క్రెడిట్ పరిధిలోకి రానివారు, పలు వనరుల నుంచి ఆదాయం ఉన్నవారు.. అంటే జీతం, ఇంటద్దె, క్యాపిటల్ గెయిన్స్, ఇతరత్రా వ్యాపారం.. వృత్తిగత ఆదాయాలు ఉన్నవారు దీన్ని దాఖలు చేయొచ్చు. ఇది పెద్ద ఫారం. చాలా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. నాన్ రెసిడెంట్లు, వ్యక్తులు, ఉమ్మడి కుటుంబాలు దీన్ని వేయొచ్చు. ఆస్తులు.. అప్పుల పట్టీ, స్థూల ఆదాయం, ఖర్చుల వివరాలు, నగదు, బ్యాంకు నిల్వల వివరాలు ఇందులో పొందుపర్చాలి. ఐటీఆర్ 4 ఇది రెసిడెంట్లు మాత్రమే ఉపయోగించగలిగే ఫారం. వ్యక్తులు, హిందు ఉమ్మడి కుటుంబాలు దీన్ని దాఖలు చేయొచ్చు. వ్యాపారం మీద స్థూల ఆదాయం/టర్నోవరు రూ. 2 కోట్లు దాటకూడదు. వృత్తి నిపుణుల స్థూల ఆదాయం రూ. 50,00,000 దాటకూడదు. ఒక ఇంటి మీద మాత్రమే ఆదాయం ఉండాలి. నికర ఆదాయం రూ. 50 లక్షలు దాటకూడదు. ఊహాజనిత ఆదాయాలున్న వారు దీన్ని వేయొచ్చు. ఈ ఫారాన్ని ఒకసారి వేస్తే.. వరుసగా అయిదేళ్ల పాటు ఇదే ఫారం దాఖలు చేయడం కొనసాగించాల్సి ఉంటుంది. ఏదైనా కారణం వల్ల ఫారం 3 వేస్తే రాబోయే అయిదు సంవత్సరాలు కూడా ఫారం 3 మాత్రమే వేయాల్సి ఉంటుంది. ఇంకా సందేహాలు ఉంటే వృత్తి నిపుణులను సంప్రతించండి. ఐటీ రిటర్నులను మీరే స్వయంగా దాఖలు చేసుకోవచ్చు. అయితే, ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. తప్పులు చేయొద్దు. ఆదాయాన్ని చూపించడం మానొద్దు. లేకపోతే 50–200% దాకా జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ట్యాక్సేషన్ నిపుణులు కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య -
‘రిటర్న్‌లపై’ ప్రచార రథాలు
హైదరాబాద్: ఆదాయపు పన్ను రిటర్న్‌ల చెల్లింపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సమాచార ప్రచార రథాలను హైదరాబాద్ ఆదాయపు పన్ను విభాగం ప్రారంభించింది. శుక్రవారం ఏసీ గార్డ్స్‌లోని ఇన్‌కం ట్యాక్స్ భవన సముదాయంలో జరిగిన ‘కర్దాతా ఇ–సహయోగ్’కార్యక్రమంలో ఇన్‌కం ట్యాక్స్ (ఏపీ అండ్ తెలంగాణ) ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఎన్.శంకరన్ ఈ ప్రచార రథాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రచార రథాల ద్వారా ప్రజలను జాగృతం చేయడంతోపాటు సందేహాలను నివృత్తి చేస్తామని తెలిపారు. జంట నగరాల్లో ఈ రథాలు ఆగస్ట్ 24 వరకు సంచరిస్తాయని పేర్కొన్నారు. ఇక ఆదాయపు పన్ను రిటర్న్‌ల ఇ–ఫైలింగ్ గడువును పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. ఇ–ఫైలింగ్‌ను ఈ నెల 31లోగా ఇంటర్నెట్ ద్వారా చేయాల్సి ఉంటుందన్నారు. గడువులోగా చేయకుంటే 234 ఎఫ్ యాక్ట్ ప్రకారం వడ్డీతో సహా మరో రూ.5 వేలు అదనంగా చెల్లించాలని తెలిపారు. ఇన్‌కం ట్యాక్స్ హైదరాబాద్ విభాగం డైరెక్టర్ జనరల్ ఆర్కే ఫలివాల్ మాట్లాడుతూ.. డిజిటలైజేషన్లో భాగంగా ఇ–ఫైలింగ్ తప్పనిసరి చేశామన్నారు. సీనియర్ సిటిజన్లకు మాత్రం ఎలక్ట్రానిక్ పద్ధతిలో మినహాయింపు ఉంటుందని చెప్పారు. ఇన్‌కం ట్యాక్స్ హైదరాబాద్ విభాగం చీఫ్ కమిషనర్ అతుల్ ప్రణయ్ మాట్లాడుతూ.. జూలై 31వరకు ఉన్న రిటర్న్‌ల గడువును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) పొడిగించిందని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్ సెంట్రల్ కె.కామాక్షి పాల్గొన్నారు. -
ఆదాయ పన్ను రిటర్న్స్ : ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: నిజాయితీగా పన్నులు చెల్లిస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అత్యంత కీలకమైన ఆదాయం, పన్నులపై బడ్జెట్ ప్రసంగ భాగాన్ని ప్రారంభించారు. ఆదాయ పన్ను సమర్పణ సమయంలో పాన్ కార్డు లేనివారికి ఊరట కల్పించే వార్త అందించారు. పాన్ కార్టు లేకపోయినా.. కేవలం ఆధార్ కార్డు ద్వారా ఆదాయ రిటర్న్స్‌ను ఫైల్ చేయవచ్చని సీతారామన్ తెలిపారు. తద్వారా రిటర్న్స్ దాఖలు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని భావిస్తున్నట్టు ప్రకటించారు. 120 కోట్లకు పైగా భారతీయులు ఇప్పుడు ఆధార్ కార్డును కలిగి ఉన్నారు, అందువల్ల పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం ఈ ప్రతిపాదన చేసినట్టు చెప్పారు. వ్యాపార లావాదేవీల్లో నగదు చెల్లింపులను అరికట్టడమే లక్ష్యంగా డిజిటల్ చెల్లింపులపై ఎలాంటి పన్నులు విధించడం లేదన్నారు. అలాగే గృహ రుణం తీసుకున్న వారికి అదనంగా మరో లక్షన్నర వడ్డీ రాయితీ ఇస్తామనంటూ నూతన గృహ కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చారు నిర్మలా సీతారామన్. బ్యాంక్ అకౌంట్ నుంచి ఏడాదిలో రూ. కోటి విత్‌డ్రా చేస్తే 2 శాతం పన్ను వసూలు చేస్తామని చెప్పారు. ఎంజెల్ టాక్స్ విధానంలో సరళీకరణను ఆర్థికమంత్రి ప్రతిపాదించారు. ప్రధానంగా స్టార్ట్అప్ కంపెనీలకు భారీ ప్రోత్సాహాన్నిస్తామని చెప్పారు స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెటేటవారికి పన్ను నుంచి మినహాయింపునిస్తామని చెప్పారు. ఐటీ స్క్రూట్నీ నుంచికూడా మినహాయింపునిస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది. చదవండి : బడ్జెట్ షాక్: భారీగా ఎగిసిన పుత్తడి -
ఖజానా గలగల
జడ్చర్ల: పట్టణంలో రియల్ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. దాని ఫలితంగా స్థానిక సబ్‌రిజిస్ట్రేషన్ శాఖకు భారీగా ఆదాయం సమకూరింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏకంగా రూ.42.76 కోట్లు ఆదాయం వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ప్రస్తు త ఆర్థిక సంవత్సరం కూడా ఇదే స్థాయిలో ఆదాయం సమకూర్చుకునే దిశగా ముందుకు సాగుతుంది. ఏప్రి ల్, మే నెలల్లోనే దాదాపు రూ.కోటి వరకు ఆదాయం వచ్చిందంటే ఇక్కడ నిత్యం వందకుపైగా రిజిస్ట్రేషన్లు నమోదవుతున్నాయి. జోరుగా రియల్ వ్యాపారం జడ్చర్ల సబ్‌రిజిస్ట్రేషన్ పరిధిలోని బాలానగర్, రాజాపూర్, మిడ్జిల్, భూత్పూర్ మండలాల్లో రియల్ బూమ్ కొనసాగుతుండడంతో రిజిస్ట్రేషన్ ఆదాయం గణనీయంగా పెరు గుతూ వస్తోంది. వందల ఎకరాల్లో వెంచర్లు వెలుస్తుండడం, ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ఎప్పటికప్పుడు చేస్తుండటం, మళ్లీ అవే ప్లాట్లు చేతులు మారుతుండడంతో రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయం లభిస్తోంది. అదేవిదంగా వ్యవసాయ భూములు కూడా భారీగా చేతులు మారుతుండడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగిందనే చెప్పాలి. ప్రధానంగా జడ్చర్ల, బాలానగర్, రాజాపూర్, భూత్పూర్ మండలాల పరిధిలో 44వ నంబర్ జాతీయరహదారి ఉండడంతో ఈ రహదారిని అనుసరించిన భూములు, ప్లాట్ల ధరలకు రెక్కలు వచ్చాయి. అదేవిధంగా 167 నంబర్ జాతీయరహదారిని అనుసరించి ఉన్న జడ్చర్ల, మిడ్జిల్ మండలాల పరిధిలో సైతం భూములు, ప్లాట్ల క్రయవిక్రయాలు జోరందుకోవడంతో రిజిస్ట్రేషన్ శాఖకు భారీగా ఆదాయం తెచ్చిపెడుతుంది. జడ్చర్లలో మరింత డిమాండ్ జడ్చర్ల పరిధిలో భూములు, ప్లాట్లకు మంచి డిమాండ్ ఉంది. అటు ఇటుగా జాతీÆయ రహదారులననుసరించి ఎకరం భూమి ధర రూ.3 కోట్ల నుంచి రూ.5కోట్ల దాక పలుకుతుందంటే డిమాండ్ ఎలా ఉందో అంచనా వేయవచ్చు. ఇక జడ్చర్ల చుట్టుపక్కల చదరపు గజం ధర రూ.10వేలు మొదలు రూ.40వేల దాక కొనసాగుతోంది. హైదరాబాద్‌కు దగ్గరగా ఉండడం, పోలేపల్లి సెజ్‌లో పరిశ్రమల కొనసాగింపుతో ఈ ప్రాంత భూములకు రెక్కలొచ్చాయి. -
కోట్లున్నా.. పాన్‌కార్డు లేదు!
మధ్యప్రదేశ్‌కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు కోట్ల ఆదాయం ఉన్నా కొందరికి పాన్ కార్డు కూడా లేదని, మరికొందరు అసలు ఐటీ రిటర్నులు దాఖలు చేయలేదని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) వెల్లడించింది. 16 మంది ఎమ్మెల్యేలకు కోట్ల ఆస్తులున్నాయని, అయితే వారెవరూ ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయలేదని ఏడిఆర్ నివేదిక పేర్కొంది. ఎన్నికల అఫిడవిట్లో కనీసం పాన్ కార్డు వివరాలు కూడా పేర్కొనని ఎమ్మెల్యేల్లో గదర్వార ఎమ్మెల్యే సునీతా పటేల్, సిరోంజి ఎమ్మెల్యే ఉమాకాంత్ శర్మ ఉన్నారు. సునీతకు ఆరు కోట్లకు పైగానే ఆస్తులున్నాయి. పాన్‌కార్డు వివరాలిచ్చి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయని వారిలో బాలఘాట్ బీజేపీ ఎంపీ బోధ్‌సింగ్ భగత్ ఉన్నారు. ఈయన ఆస్తి రూ.2 కోట్లకు పై మాటే. షహదాల్ ఎంపీ జ్జాన్‌సింగ్, రేవా ఎంపీ జనార్దన్ మిశ్రా కూడా కోటీశ్వరులైనా ఐటీ రిటర్నులు దాఖలు చేయలేదు. వీరిద్దరూ బీజేపీ ఎంపీలేనని ఏడీఆర్ నివేదిక తెలిపింది. రూ.5 కోట్ల ఆస్తి ఉన్న బర్వానీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్, రూ.3 కోట్లకు పైగా ఆస్తి ఉన్న గుణ ఎమ్మెల్యే గోపీలాల్ జాతవ్, రెండు కోట్ల ఆస్తి ఉన్న కోటమ ఎమ్మెల్యే సునీల్ కుమార్, మంగోలి ఎమ్మెల్యే బ్రజేంద్ర సింగ్‌కు పాన్‌కార్డులు కూడా లేవు. వీరందరి వివరాలను ఏడీఆర్ మధ్యప్రదేశ్ ప్రధాన ఆదాయం పన్ను శాఖ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా తెలిపింది. ఈ ఎమ్మెల్యేలు, ఎం పీల్లో కొందరు 2–3 సార్లు ఎన్నికైన వారూ ఉన్నారని, వారి ఆస్తులు ఎన్నో రెట్లు పెరిగాయని అయినా వారు పాన్, ఐటీ రిటర్నుల వివరాలను అఫిడవిట్లో పేర్కొనడం లేదని ఏడీఆర్ ఐటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఎన్నికల అఫిడవిట్లో ఆర్థిక లావాదేవీల గురించి పూర్తిగా చెప్పకపోయినా, తప్పుగా చెప్పినా వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టు 2013, సెప్టెంబర్ 13న తీర్పు ఇచ్చిందని, దాని ప్రకారం వీరిపై చర్య తీసుకోవాలని ఏడీఆర్ కోరింది. -
వేతన జీవులకు నిజంగా ఊరటేనా.. అసలు నిజం ఇదీ!
న్యూఢిల్లీ : ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రజలను ఆకర్షించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించిందంటూ విపక్షాలు మండిపడుతున్న నేపథ్యంలో ఆర్థిక నిపుణులు మరో ఆసక్తికర అంశాన్ని బయటపెట్టారు. ‘ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్’ లో వేతన జీవులకు భారీ ఊరటగా పరిగణిస్తున్న ‘ఆదాయపన్ను మినహాయింపు పరిమితి పెరుగుదల’ లో ఉన్న అసలు నిజాన్ని గమనించాలన్న వాదన వినిపిస్తున్నారు. శుక్రవారం నాడు ఆర్థిక మంత్రి గోయల్ చేసిన పన్ను మినహాయింపు ప్రకటన ప్రకారం రూ. 5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నపుడు మాత్రమే పూర్తిగా పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ ఈ పరిమితి రూ. 5 లక్షలను దాటిన పక్షంలో పన్నుకు అర్హమైన ఆదాయాన్ని.. ప్రస్తుత స్లాబ్ రేట్లను అనుసరించి టాక్స్ వసూలు చేస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి వార్షికాదాయం రూ. 6 లక్షలు అనుకుందాం. అలాంటి తరుణంలో పై లక్ష రూపాయలు మాత్రమే పన్నుకు అర్హమైన ఆదాయం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న స్లాబ్ రేట్ల ప్రకారం... రూ. 2.5 లక్షలు- రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్నట్లయితే దానిపై 5 శాతం పన్ను విధిస్తారు. అంటే 12,500 రూపాయలు అన్నమాట. ఒకవేళ రూ. 5 లక్షలకు పైబడి ఒక్కరూపాయి ఉన్నాసరే మిగిలిన లక్ష రూపాయల మొత్తానికి 20 శాతం అంటే రూ. 20 వేలు కట్టాల్సి ఉంటుంది. అంటే 12,500 రూపాయలకు అదనంగా మరో 20 వేలు మొత్తంగా 32,500 రూపాయలు పన్ను రూపంలో సమర్పించుకోవాల్సి ఉంటుంది. దీన్ని బట్టి పన్నుకు అర్హమైన ఆదాయపు పరిమితి ఇప్పటికీ రెండున్నర లక్షలుగానే ఉన్నట్లు కదా. ఇందులో వేతన జీవులు అంతగా సంతోషించదగ్గ విషయం ఏమీ లేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆదాయ పన్ను చట్టంలోని ఎనిమిదవ క్లాజ్ సెక్షన్ 87ఏకు చేసిన సవరణ ద్వారా మూడు లక్షలకు రూ. 2500లుగా ఉన్న టాక్స్ రిబేటును సవరించి ఆదాయ పరిమితిని 5 లక్షల రూపాయలకు పెంచారు. కాగా ప్రస్తుతం ఉన్న స్లాబ్ రేట్ల ప్రకారం.. ఆదాయం రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలలోపు ఉన్నట్లయితే 12,500 రూపాయల పన్ను విధిస్తారన్న సంగతి తెలిసిందే. -
ఎన్నికల వేళ సంచలనాత్మక బడ్జెట్!
సాక్షి, న్యూఢిల్లీ: ఊహించినట్టుగానే ఎన్నికల వేళ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో నరేంద్రమోదీ సర్కారు పలు ప్రజాకార్షక పథకాలకు పెద్దపీట వేసింది. అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునేవిధంగా సంచలనాత్మకరీతిలో మధ్యంతర బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది. తాత్కాలికంగా ఆర్థికమంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్న పీయూష్ గోయల్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక చిట్టాలో ఆద్యంతం ఓటర్ల మనోభావాలను సంతృప్తి పరిచేలా ప్రతిపాదనలు చేశారు. ఎన్నికల వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఓటర్లపై వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా మధ్యతరగతి వేతనజీవులు, రైతులు, అసంఘటిత రంగ కార్మికులు, అంగన్వాడీ టీచర్లు.. ఇలా అన్ని వర్గాలను ఆకర్షించేవిధంగా.. గోయల్ తన బడ్జెట్లో తాయిలాలు కురిపించారు. నూటికి నూరుశాతం ఎన్నికల బడ్జెట్‌ను తలపించేలా గోయల్ చిట్టాపద్దులు సాగాయి. ఎన్నికల ముందు వేతన జీవులకు మోదీ సర్కారు భారీ ఊరటనిచ్చింది. ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని ఏకంగా రెట్టింపు చేస్తూ.. మధ్యతరగతి ఉద్యోగులపై వరాల జల్లు కురిపించింది. ఇప్పటివరకు వార్షికాదాయం రూ. 2.50 లక్షలు దాటితే ఉద్యోగులు పన్ను కట్టాల్సి ఉండగా.. ఇప్పుడు ఆ పరిమితిని ఏకంగా రూ. 5 లక్షలకు పెంచుతూ మోదీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక, అదేవిధంగా గృహరుణాలు, ఇంటి అద్దెలు, ఇన్సురెన్స్‌లు కలిపి 6.50 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను ఉండబోదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న మూడు కోట్ల మంది మధ్యతరగతి ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఇక, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేలకు పెంచినట్టు ప్రకటించిన గోయల్.. పొదుపు ఖాతాలపై వచ్చే వడ్డీ 10 వేల నుంచి 40 వేలకు పెంచుతున్నట్టు తెలిపారు. నెలకు 50 వేల జీతం వరకు టీడీఎస్ వర్తించబోదని, సొంతిల్లు అద్దెకు ఇస్తే వచ్చే ఆదాయంపై రూ. 2.50 లక్షల వరకు పన్ను ఉండదని స్పష్టం చేశారు. ఇవన్నీ మధ్యతరగతి ఓటర్లను సంతృప్తిపరిచే నిర్ణయాలే కావడం గమనార్హం. రైతులకు ఆర్థిక చేయూత వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు మోదీ సర్కారు ముందుకొచ్చింది. ఎన్నికల నేపథ్యంలో అన్నదాతలను తమవైపు తిప్పుకునేందుకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరిట ఒక కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ద్వారా చిన్నసన్నకారు రైతులకు ఏడాదికి రూ. 6వేల నగద సాయం నేరుగా అందజేస్తామని, ఐదెకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాలకు ఈ నగదును మళ్లిస్తామని గోయల్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఈ పథకం కోసం రూ. 75 వేల కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తెలిపారు. మూడు విడతల్లో నగదు అందజేస్తామని, 2018 డిసెంబర్ నుంచి ఈ పథకం అమల్లో ఉంటుందని, తొలి విడతగా రూ.2వేల సాయం తక్షణమే రైతులకు అందజేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఈ నగదు నేరుగా రైతుల ఖాతాలోకి మళ్లిస్తామని చెప్పారు. ఈ పథకంతో దేశవ్యాప్తంగా ఉన్న 12 కోట్ల రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇక, కిసాన్ క్రెడిట్ కార్డుల కింద రుణాలు అందిస్తామని, రుణాలు సకాలంలో చెల్లించినవారికి రాయితీలు చెల్లిస్తామని పేర్కొంది. ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన రైతుల రుణాల రీషెడ్యూల్ చేస్తామని హామీ ఇచ్చింది. పాడి పరిశ్రమ రుణాలు సకాలంలో చెల్లించే వారికి అదనంగా మూడు శాతం వడ్డీ రాయితీ ఇస్తామని చెప్పారు. అసంఘటిత రంగ కార్మికులకూ భారీ ఊరట.. దేశంలోని అసంఘటితరంగ కార్మికులకూ మోదీ సర్కారు తన మధ్యంతర బడ్జెట్లో భారీ ఊరటనిచ్చింది. ప్రధానమంత్రి శ్రమయోగి బంధన్ పేరుతో అసంఘటిత కార్మికులకు పింఛన్ పథకాన్ని కేంద్రం ప్రకటించింది. 60 ఏళ్లు నిండిన వారందరికీ ప్రతి నెలా రూ.3వేలు పింఛన్ వచ్చే విధంగా ఈ పథకం రూపొందించారు. ఈ పథకంలో భాగంగా నెలకు రూ.100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60 ఏళ్ల దాటిన తర్వాత రూ.3వేల పింఛన్ పొందవచ్చు. అసంఘటిత రంగంలోని 10 కోట్లమంది కార్మికులకు ఈ పథకం వర్తించనుంది. ఇక ఉపాధి అవకాశాలు మెరుగుపరడటంతో ఈపీఎఫ్‌వో సభ్యులు పెరిగారని, ఈపీఎఫ్‌వో బోనస్ పరిమితిని 21వేలకు పెంచుతున్నట్టు గోయల్ తెలిపారు. గ్రాట్యూటీ పరిధిని 10 లక్షల నుంచి 30 లక్షల పెంచారు. ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు కార్మికులు, ఉద్యోగులకు అందాలని ఈ సందర్భంగా గోయల్ పేర్కొన్నారు. ఎన్పీఎస్ విధానంలో ప్రభుత్వ వాటాను 14 శాతానికి పెంచుతున్నట్టు తెలిపారు. అదేవిధంగా 2022 నాటికి ప్రతి ఒక్కరికి ఇళ్లు, దేశవ్యాప్తంగా అత్యంత వెనుకబడిన 150 జిల్లాలపై ప్రత్యేక దృష్టి, దేశంలో ప్రస్తుతం 21 ఎయిమ్స్, త్వరలోనే హరియాణలో 22వ ఎయిమ్స్ ఏర్పాటు, అంగన్వాడీ టీచర్ల జీతం 50 శాతం పెంపు, ఈఎస్ఐ పరిధి 15 వేల నుంచి 21 వేలకు పెంపు తదితర ప్రతిపాదనల ద్వారా మధ్యంతర బడ్జెట్లో మోదీ సర్కారు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసినట్టు కనిపిస్తోంది. అయితే, ఇది నూటికి నూరుపాళ్లు ఎన్నికల బడ్జెట్ అని, నాలుగేళ్లు ప్రజాసంక్షేమ పథకాలు అమలు చేయని మోదీ సర్కారు.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే.. ఈ విధంగా అన్నివర్గాల వారికీ తాయిలాలు ప్రకటించిందని, ఇది ఎన్నికల గిమ్మిక్కు అని విపక్షాలు కొట్టిపారేస్తున్నాయి. -
రిటర్న్‌ల ప్రాసెసింగ్ ఒక్క రోజులో..!
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్న్‌లను ప్రాసెస్ చేయటంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి కేంద్రం ముందడుగు వేసింది. ఇందుకు సంబంధించి రూ.4,242 కోట్ల ఆదాయపు పన్ను (ఐటీ) ఫైలింగ్ ప్రాజెక్ట్‌కు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టు డెవలపర్‌గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజం (ఐటీ) ఇన్ఫోసిస్‌ను ఎంపికచేసింది. ప్రాజెక్టు 18 నెలల్లో ప్రాజెక్టు పూర్తవుతుంది. మూడు నెలలు ప్రాజెక్టు పరీక్షా సమయం. అటు తర్వాత పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ చెప్పారు. అంతకు ముందు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. అనంతరం విలేకరులకు పియూష్ గోయెల్ తెలిపిన వివరాల్లో ముఖ్యాంశాలు చూస్తే... ► ప్రస్తుతం రిటర్న్‌లు ఫైల్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ సమయం 63 రోజులు పడుతోంది. తాజా వ్యవస్థ అమలోకి వచ్చిన తర్వాత ఈ సమయం కేవలం 24 గంటలకు తగ్గిపోతుంది. దీనితో రిఫండ్ ప్రక్రియ కూడా వేగవంతం అవుతుంది. ► కేబినెట్ ఆమోదముద్ర వేసిన ఆదాయపు పన్ను శాఖ ఇంటిగ్రేటెడ్ ఈ ఫైలింగ్ అండ్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ 2.0 ప్రాజెక్టు రూపకల్పనకు బిడ్డింగ్ ప్రాసెస్‌లో ఇన్ఫోసిస్‌ను ఎంపిక చేశారు. ► ప్రస్తుతం ఉన్న వ్యవస్థ విజయవంతమైనదే అయినప్పటికీ, తాజా వ్యవస్థ మరింత ట్యాక్స్ ఫ్రెండ్లీ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆయా అంశాలకు సంబంధించి పారదర్శకతనూ పెంపొందిస్తుంది. అన్ని స్థాయిల్లోనూ ఆటోమేషన్ సౌలభ్యం ఏర్పడుతుంది. ► ఆదాయపు పన్ను శాఖ ప్రమేయం ఏమాత్రం లేకుండా పన్ను చెల్లింపుదారుల అకౌంట్లోకి డైరెక్ట్‌గా రిఫండ్స్ జారీ అవుతాయి. ► ప్రస్తుత సీపీసీ–ఐటీఆర్ 1.0 ప్రాజెక్టు అమలుకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరానికిక్యాబినెట్ మరో రూ.1,482 కోట్లను మంజూరు చేసింది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ రూ.1.83 లక్షల కోట్ల రిఫండ్స్ జరిగాయి. నుమాలిగఢ్ రిఫైనరీ విస్తరణకు రూ.22,594 కోట్లు అస్సోంలోని నుమాలిగఢ్ రిఫైనరీ విస్తరణకు కేంద్ర క్యాబినెట్ రూ.22,594 కోట్ల కేటాయించింది. ఈశాన్య భారత ఇంధన అవసరాలను తీర్చడానికి వీలుగా కేంద్ర క్యాబినెట్ తాజా నిర్ణయం తీసుకుంది. 1999లో నెలకొల్పిన ఈ రిఫైనరీలో భారత్ పెట్రోలియం(బీపీసీఎల్)కు 61.65 శాతం వాటా ఉంది. ఏడాదికి ప్రస్తుతం 3 మి. టన్నుల క్రూడ్ రిఫైన్ చేస్తోంది. ఈ సామర్థాన్ని 6 మి. టన్నులకు పెంచడం క్యాబినెట్ ప్రస్తుత నిర్ణయ ఉద్దేశమని పియూష్ గోయెల్ తెలిపారు. 48 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు కింద పారాదీప్(ఒడిస్సా) నుంచి నుమాలిగఢ్కు క్రూడ్ ఆయిల్ పైప్‌లైన్‌ను నిర్మిస్తారు. నుమాలిగఢ్ నుంచి సిలిగురి (పశ్చిమ బెంగాల్) వరకూ ప్రొడక్ట్ పైప్‌లైన్ ఏర్పాటవుతుంది. ఎగ్జిమ్ బ్యాంకుకు రూ.6,000 కోట్లు ప్రభుత్వరంగంలోని ఎగ్జిమ్ బ్యాంక్ (ఎక్స్పోర్ట్– ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కార్యకలాపాల విస్తరణకు మార్గం సుగమం అయ్యింది. ఈ బ్యాంకుకు తాజా మూలధనంగా రూ.6,000 కోట్లు కేటాయించడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి రీక్యాపిటలైజేషన్ బాండ్లను ప్రభుత్వం జారీ చేస్తుంది. ప్రభుత్వ బ్యాంకులకు జారీ అయ్యే తరహాలోనే ఈ రీక్యాపిటలైజేషన్ బాండ్లు జారీ అవుతాయి. ప్రస్తుత (రూ.4,500 కోట్లు), వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో (రూ.1,500 కోట్లు) బ్యాంకుకు రెండు విడతల్లో బ్యాంకుకు తాజా మూలధనం అందుతుంది. బ్యాంక్ అధీకృత మూలధనాన్ని రూ.10,000 కోట్ల నుంచి రూ.20,000 కోట్లకు పెంచడానికి కూడా క్యాబినెట్ సమావేశం ఆమోదముద్ర వేసినట్లు రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయెల్ తెలిపారు. -
ఆరోపణలు చేస్తున్న వారికి.. రేవంత్ బహిరంగ సవాల్
సాక్షి, హైదరాబాద్ : ఐటీ దాడుల తర్వాత తొలిసారి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి శనివారం మీడియా ముందుకు వచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలో భాగంగానే ఐటీ అధికారులు దాడులు జరిపారని మండిపడ్డారు. మార్కెట్ విలువలు పెరగడంతోనే తన ఆస్తుల విలువ పెరిగిందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రెండు అఫిడవిట్లలో పేర్కొన్న వివరాలను పక్కన పెట్టుకొని, తన ఆస్తులేమైనా పెరిగాయోలేదే చూస్తే అర్థం అవుతుందన్నారు. హైదరాబాద్‌లోని తన నాలుగు అంతస్తుల బిల్డింగ్‌ని 22 ఏళ్లుగా కిరాయిలకు ఇస్తున్నామని తెలిపారు. కిరాయికి వచ్చిన వారి పేర్ల మీద ఉన్న కంపెనీలు కూడా తనవే అని విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తనకు పిల్లను ఇచ్చిన మామ పద్మనాభ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు బినామీలు అంటున్నారని నిప్పులు చెరిగారు. చాలా ఏళ్ల క్రితమే మాడ్గుల గ్రామానికి చెందిన తన మామ పద్మనాభరెడ్డి ఆయన తండ్రి దుర్గా రెడ్డి కోటీశ్వరులని, కావాలంటే ఆ ఊరు వెళ్లి విచారించమన్నారు. తాను పుట్టక ముందే, తన మామ పుట్టక ముందే వారి కుటుంబం 1940 కాలం నాటికే కోటీశ్వరులా కాదా విచారణ చేయండి అని తెలిపారు. అలాంటి వారిని తీసుకొచ్చి తన బినామీలుగా చిత్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. విదేశాల్లో ఖాతాలపై అవగాహన లేకుండా కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ఒక రౌడీషీటర్ పీడీ యాక్ట్ తప్పించడానికి కేటీఆర్ చెప్పితే తనపై ఆరోపణలు చేస్తున్నాడని తెలిపారు. హాంకాంగ్, మలేషియాకు నేను వెళ్లానా? చిల్లర ఆరోపణలు చేస్తున్న వారికి బహిరంగ సవాల్ విసురుతున్నానన్నారు. తన ఖాతాలు నిజమని నిరూపించకపోతే, మీరు మీ తల్లిదండ్రులకు పుట్టారో లేదో డీఎన్ఏ పరీక్షలు చేయించుకోవాలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనను తనకుటుంబాన్ని మానసిక క్షోబకు గురిచేస్తున్నారని తెలిపారు. అదే పరిస్థితి మీకొస్తే పరిస్థితి ఆలోచించుకోవాలన్నారు. తనకు విదేశాల్లో ఖాతా తెరవడానికే అర్హతలేదన్నారు. తనపోరాటాన్ని, చిత్తశుద్ధిని చూసే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాఇచ్చారన్నారు. తనపై ఎన్ని కుట్రలు పన్నినా వెనక్కి తగ్గేదే లేదన్నారు. రేవంత్ తెలంగాణలో ప్రచారం చేస్తే ఓడిపోతారని సర్వేలలో తేలిందని, అందుకే ఎలాగైన మూడు, నాలుగు నెలలు తనను జైల్లో పెట్టాలని కుట్ర పన్నారని తెలిపారు. అందులో భాగంగానే మొదట ఐటి, ఈడీ, సీబీఐతో వరుస దాడులకు కుట్ర పన్నారన్నారు. సీఎం కేసీఆర్ అభద్రతాభావంతో భయాందోళనకు లోనవుతున్నట్లు మూడు రోజులు నుండి పరిణామాలు చూస్తూ తెలుస్తుందన్నారు. పారదర్శకంగా జవాబు దారిగా ఉండాలనే ఇప్పుడు ప్రజలకు అన్ని విషయాలు చెబుతున్నానని తెలిపారు. రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టడానికి మూడు రోజులుగా తనకు అండగా నిలబడిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులకి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. -
రేవంత్ : డాక్యుమెంట్ల లీక్ వెనుక కథేంటి?
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిపై ఐటీ సోదాలు జరుగుతున్న సందర్భంలో ఓ అజ్ఞాతవ్యక్తి నుంచి కొన్ని ఆరోపణలతో కూడిన డాక్యుమెంట్లు బయటకు రావడం సర్వత్రా చర్చకు దారితీసింది. ఎన్నికల అఫిడవిట్, ఐటీ రిటర్నులు, విదేశాల నుంచి నిధులు వచ్చినట్లు చూపిస్తున్న అకౌంట్ నంబర్లు, రియల్ ఎస్టేట్ ద్వారా భూములు పొందిన వివరాలు తదితరాలన్నీ ఈ డాక్యుమెంట్లలో ఉన్నాయి. అయితే ఇవి అధికారికం కాదు... పైగా అందులో ఉన్న అంశాలు, వాటిని పొందుపరిచిన విధానం పూర్తిగా దర్యాప్తు విభాగాలకు ఫిర్యాదు చేసేలా కనిపించాయి. దీంతో అసలు డాక్యుమెంట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు బయటకు వదిలారన్న దానిపై రేవంత్ వర్గంలో తీవ్ర చర్చ జరుగుతోంది. కావాలనే సృష్టించారు... హాంకాంగ్, కౌలాలంపూర్‌లో ఆర్‌హెచ్‌బీ పేరుతో అకౌంట్లున్నట్లు, వాటి ద్వారా కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు డాక్యుమెంట్లలో ఉండటంపై రేవంత్ వర్గం తీవ్రంగా స్పందించింది. అసలు అవి నిజమా.. కాదా.. అనేది తేల్చాల్సింది దర్యాప్తు విభాగాలు అంతేకానీ అంతలోనే మీడియాకు పంపించి కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేత వేం నరేందర్‌రెడ్డి ఆరోపించారు. సోదాలు నిర్వహిస్తున్న ఐటీ చేతిలో ఆరోపణలకు సంబంధించి ఈ డాక్యుమెంట్లు ఉండాలి గానీ బయటకు ఎలా వచ్చాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ద్వారానే ఇవి బయటకొచ్చి ఉంటాయని, ఆయనకు చెందిన వ్యక్తులే ఇలా నకిలీ అకౌంట్ నంబర్లు తదితరాలను సృష్టించి నిందమోపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఆ ఐటీ రిటర్నులు నకిలీవే... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఐటీ రిటర్నులు, అఫిడవిట్ పత్రాలన్నీ నకిలీవే అని ఐటీ అధికారులతో రేవంత్‌రెడ్డి స్పష్టం చేసినట్టు తెలిసింది. తన వద్ద ఉన్న ఐటీ రిటర్నులు, సోషల్ మీడియాలో వైరలవుతున్న వాటిని పోల్చి చూడాలని ఆయన అధికారులను కోరినట్లు తెలుస్తోంది. అటు ఐటీ అధికారులు సైతం అసలు ఈ డాక్యుమెంట్లు ఎక్కడివి? ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై విచారణ జరుపుతున్నారు. అలాగే వాటిపై తమకు కూడా అనుమానాలున్నాయని, అవి నిజమో.. కాదో.. తేలుస్తామని అధికారులు చెప్పినట్లు రేవంత్‌రెడ్డి సన్నిహితులు స్పష్టంచేస్తున్నారు. -
ఐటీఆర్ ఫైలింగ్ తుది గడువు పొడిగింపు
న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే తుది గడువును ప్రభుత్వం పొడిగించింది. 2017-18 సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ ఫైలింగ్‌కు ఉన్న తుది గడువును సెప్టెంబర్ 30 నుంచి కొన్ని కేటగిరీల పన్ను చెల్లింపుదారులకు అక్టోబర్ 15కు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఆడిట్ రిపోర్టు తుది గడువు కూడా అక్టోబర్ 15గానే నిర్ణయించింది. ఈ కొత్త మార్గదర్శకాలు, రూ.2 కోట్లకు పైన ఆదాయం ఆర్జించే వారికి, ఛార్టెడ్ అకౌంట్లు ఇంకా తమ అకౌంట్లను ఆడిట్ చేసే అవసరం ఉన్న పన్ను చెల్లింపుదారులకు వర్తించనున్నాయి. అయితే పన్ను చెల్లించడానికి మాత్రం సెప్టెంబర్ 30నే తుది గడువుగా నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘పలువురు స్టేక్‌హోల్డర్ ప్రతినిధుల అభ్యర్థన మేరకు, ఐటీఆర్‌లు, ఆడిట్ రిపోర్టుల తుది గడువును పెంచాం. కొన్ని కేటగిరీల పన్ను చెల్లింపుదారులకు ఈ తుది గడువు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 15కు పెరిగింది’ అని సీబీడీటీ తెలిపింది. సీబీడీటీ తుది గడువును పెంచడం స్వాగతించాల్సిన విషయమని ట్యాక్స్ పార్టనర్ సమీర్ కనబార్ తెలిపారు. అంతకముందు 2017-18లో పన్ను చెల్లింపులు రికార్డు స్థాయిలో రూ.10.03 లక్షల కోట్లకు పెరిగినట్టు సీబీడీటీ తెలిపింది. -
ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ఈ నెల ఆఖరి తేదీనే తుది గడువు. ఒకవేళ ఇప్పటికీ పాన్ కార్డు లేకపోతే.. ఆదాయపు పన్ను రిటర్నులను(ఐటీఆర్) దాఖలు చేయడానికి వీలులేదు. ఐటీఆర్ ఫైల్ చేయడానికి కచ్చితంగా పాన్ కార్డు కావాల్సిందేనని ఆదాయపు పన్ను అథారిటీ చెప్పింది. ఈ నేపథ్యంలో పాన్ కార్డు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం... పాన్ కార్డు అంటే.. పాన్ కార్డు అనేది పది అంకెల ఆల్ఫాన్యూమరిక్ సంఖ్య. దీన్ని ఆదాయపు పన్ను శాఖ ల్యామినేటెడ్ రూపంలో జారీ చేస్తుంది. పాన్ కార్డు కలిగి ఉన్న వ్యక్తి అన్ని లావాదేవాలు డిపార్ట్మెంట్తో లింక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ లావాదేవీల్లో పన్ను చెల్లింపులు, ఆదాయం/సంపద/బహుమతుల రిటర్నులు వంటివన్నీ ఉంటాయి. పాన్ కార్డు వాలిడిటీ... ఒక్కసారి పాన్ కార్డు పొందితే, అది జీవితకాలం వాలిడిటీలో ఉంటుంది. దేశవ్యాప్తంగా వాలిడ్‌లో ఉంటుంది. ఒకవేళ అడ్రస్ మారినా.. లేదా ఆఫీసు మారినా దీనిపై ఎలాంటి ప్రభావం ఉండదు. పాన్ డేటాబేస్‌లో ఏమైనా మార్పులు చేసుకోవాల్సి ఉంటే అంటే పాన్ దరఖాస్తు చేసుకునే సమయంలో అందించిన వివరాల్లో ఏమైనా మార్చాల్సి ఉంటే ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్లో తెలపాలి. ఒక్క పాన్ కార్డు కంటే ఎక్కువ ఉండొచ్చా..? ఒక వ్యక్తి ఒక్క పాన్ కార్డు కంటే ఎక్కువ కలిగి ఉండకూడదు. మరో పాన్ కోసం దరఖాస్తు కూడా చేసుకోకూడదు. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉంటే, ఆదాయపు పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 272బీ కింద 10వేల రూపాయల జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు జారీ చేస్తే.. వాటిని వెంటనే ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఒక్క శాశ్వత ఖాతా సంఖ్యనే వారి వద్ద ఉంచుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఎందుకుంటాయి..? వివిధ సందర్భాల్లో ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉండే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో సరైన అవగాహన లేక ఇలా జరుగుతూ ఉంటుంది. పాన్ కార్డులో మార్పులు చేసుకోవాలనుకునేవారు, అలా మార్పులు చేసుకోకుండా.. కొత్త దాని కోసం దరఖాస్తు చేస్తారు. ఇలా ఒక వ్యక్తి దగ్గర ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉండే అవకాశాలుంటాయి. పెళ్లయిన యువతలు ఇంటి పేరు మార్పుతో కొత్త పాన్‌కు దరఖాస్తు చేస్తారు. ఇలా కూడా రెండు ఉండొచ్చు. లేని వ్యక్తుల పేరుతోనో, నకిలీ పేర్లతోనే ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు పొందిన వారు లేకపోలేదు. ఇలా ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు పొందే వారిపై కొరడా ఝుళిపించేందుకు ప్రభుత్వం జరిమానా విధిస్తుంది. -
15 రోజుల్లోనే ట్యాక్స్ రీఫండ్?
న్యూఢిల్లీ : ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులు(ఐటీఆర్) దాఖలు చేసి, రీఫండ్ కోసం ఎదురు చూస్తున్న ఆదాయ పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. ఐటీఆర్ దరఖాస్తులను వేగంగా పరిశీలించి త్వరగా తిరిగి డబ్బు ఇచ్చేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ), ఆదాయ పన్ను శాఖను ఆదేశించింది. మీడియా రిపోర్టుల ప్రకారం ఇప్పటికే కొంతమంది పన్ను చెల్లింపుదారులకు, రిటర్నులు దాఖలు చేసి, ఈ-వైరిఫై చేపట్టిన అనంతరం 10 నుంచి 15 రోజుల్లో ట్యాక్స్ రీఫండ్స్ వచ్చేశాయని తెలిసింది. ఒకవేళ అంతా బాగుంటే.. పన్ను చెల్లింపుదారులందరికీ.. ఆదాయపన్ను రిటర్న్‌ల రీఫండ్స్ కేవలం 15 రోజుల్లోనే తిరిగి ఇవ్వాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆదాయపన్ను రిటర్నుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు ఇస్తే, దరఖాస్తు పరిశీలనలో ఎలాంటి ఇబ్బందులు లేకుంటే పదిహేను రోజుల్లో ట్యాక్స్ రీఫండ్ ఇచ్చే విధానం త్వరలో రావొచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. రిటర్నుల ఈ-వెరిఫికేషన్ పూర్తికాకుంటే పన్ను చెల్లింపుదారులకు రీఫండ్ ఆలస్యం అవుతుందని తెలిపాయి. అయితే ప్రస్తుతం ఐటీ రిటర్నుల రీఫండ్‌కు నిర్దిష్ట గడువంటూ ఏమీలేదు. దాంతో ట్యాక్స్ రీఫండ్‌కు రెండు వారాల నుంచి రెండు నెలల వరకు సమయం పడుతుంది. ఇది కూడా పన్ను రిటర్నుల దాఖలు బట్టి ఉంటుంది. 15 రోజుల్లో పన్ను రీఫండ్స్ చేయడం సాధ్యమనే తెలుస్తోంది. పన్ను చెల్లింపుదారుల ట్యాక్స్ రీఫండ్‌ను ట్యాక్స్ డిపార్మెంటే ఆమోదించాల్సి ఉంటుంది. ఐటీ డిపార్ట్మెంట్ ఆమోదం తర్వాత చివరికి పన్ను చెల్లింపుదారు బ్యాంకు ఖాతాలోకి చెల్లించిన మొత్తంతో పాటు వడ్డీ కూడా వాపసు అవుతుంది. రీఫరెన్స్ నెంబర్‌తో పన్ను చెల్లింపుదారులు, తమ ట్యాక్స్ రీఫండ్‌ను మానిటర్ చేసుకోవచ్చు. -
రికార్డు స్థాయికి ఆదాయపన్ను వసూళ్లు
గౌహతి: గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయపన్ను వసూళ్లు రికార్డు స్థాయికి చేరుకున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (సీబీడీటీ) వెల్లడించింది. రూ.10.03 లక్షల కోట్ల పన్ను వసూలు జరిగినట్లు తెలిపింది. ఆదాయ పన్ను నిర్వాహకుల రెండు రోజుల సమావేశంలో ఈ విషయాలను సీబీడీటీ అధికారులు వెల్లడించగా.. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 5.61 కోట్ల రిటర్నులు దాఖలు కాగా, గతేడాదిలో 1.31 కోట్లు పెరిగి 6.92 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు తూర్పు జోన్ సభ్యులు షబ్రి భట్టాశాలి తెలిపారు. ఈశాన్య ప్రాంతం నుంచి గతేడాదిలో 1.06 కోట్ల నూతన రిటర్నులు జత కాగా, పన్ను వసూళ్లు రూ.7,097 కోట్లుగా ఉన్నట్లు ప్రిన్సిపాల్ చీఫ్ కమిషనర్ ఎల్ సీ జోషి వెల్లడించారు. -
మూడు కోట్ల మంది ముందుకొచ్చారు..
సాక్షి, న్యూఢిల్లీ : గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను (ఐటీ) రిటన్స్ దాఖలు చేసిన వారి సంఖ్య రెట్టింపై దాదాపు 3 కోట్లకు పెరిగింది. పరిష్కరించిన రిఫండ్ కేసుల సంఖ్య కూడా 81 శాతం పెరిగి 65 లక్షలకు చేరుకున్నట్టు సమాచారం. ఈ ఏడాది 60 శాతం వరకూ ఆన్లైన్లో రిటన్స్ దాఖలు కాగా వాటి ప్రాసెసింగ్ కూడా ఇప్పటికే చేపట్టినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. మరోవైపు సామాన్య ప్రజలకు ఊరటగా ఆదాయ పన్ను శాఖ పన్ను రిటన్స్ దాఖలు చేసే తుది గడువును నెల రోజులు పొడిగించింది. ఆగస్టు 31 వరకూ ఐటీ రిటన్స్ దాఖలు చేసేందుకు డెడ్‌లైన్‌గా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. ఐటీ రిటన్స్ దాఖలు చేసేందుకు తుది గడువును జులై 31 నుంచి ఆగస్ట్ 31 వరకూ పొడిగించిన నేపథ్యంలో పన్ను చెల్లింపులో జాప్యం చేయకుండా చట్టాన్ని గౌరవించే పౌరులుగా సకాలంలో పన్నులు చెల్లించి దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. -
పన్ను రిటర్నులు : వేతన జీవులకు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ : వేతన జీవులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే తుది గడువును పొడిగించింది. ఆగస్టు 31 వరకు ఈ తుది గడువును పొడిగిస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ‘ఈ విషయాన్ని పరిశీలించిన మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే తుది గడువును 2018 జూలై 31 నుంచి 2018 ఆగస్టు 31కు పొడిగించడం జరిగింది’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. కాగ, గత అసెస్మెంట్ ఇయర్ చివరి వరకు ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడంలో జాప్యం చేస్తే ఎలాంటి జరిమానా ఉండేది కాదు. కానీ 2018-19 అసెస్మెంట్ ఇయర్లో జరిమానాలు విధించడం ప్రారంభించారు. ఆదాయపు పన్ను చట్టంలో కొత్త సెక్షన్ 234ఎఫ్ ను జత చేర్చారు. దీంతో సెక్షన్ 139(1)లో నిర్దేశించిన తుది గడువుల అనంతరం ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేస్తే రూ.10వేల జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటోంది. అయితే 2017-18 ఆర్థిక సంవత్సరపు పన్ను రిటర్నులను 2018 జూలై 31 తర్వాత, 2018 డిసెంబర్ 31కు ముందు దాఖలు చేస్తే పన్ను చెల్లింపుదారులు కేవలం 5000 రూపాయల జరిమానా మాత్రమే ఎదుర్కోవాల్సి వస్తుందని, ఒకవేళ 2019 జనవరి 1 తర్వాత దాఖలు చేస్తే, ఈ జరిమానా రూ.10వేలకు పెరుగుతుందని పన్ను నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పన్ను చెల్లింపుదారుల మొత్తం ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉండే, ఈ జరిమానా మొత్తం వెయ్యి రూపాయలను మించదని చెబుతున్నారు. -
ఏ ఫారం వేయాలో తెలుసా..?
సెక్షన్ 139(1) ప్రకారం ప్రతి వ్యక్తీ గడువు తేదీ లోపల ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాలి. ఇక్కడ వ్యక్తి అన్న పదానికి నిర్వచనం చాలా పెద్దది. దాన్నొకసారిచూస్తే... ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ ఏడాది ఏప్రిల్‌లో జారీ చేసిన నోటిఫికేషన్లో ఎవరు ఏ ఫారం దాఖలు చేయాలో తెలిపింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాఖలు చేయాల్సిన అంశాలు ఐటీ విభాగం వెబ్సైట్లో దొరుకుతాయి. దీనిప్రకారం మొత్తం ఏడు ఫారాలుండగా... అందులో వ్యక్తులకు (ఇండివిడ్యుయల్స్) వర్తించే ఫారాలు నాలుగు. ఐటీఆర్–1, 2, 3, 4. ఐటీఆర్–1 ఎవరు దాఖలు చేయాలంటే... ♦ రెసిడెంట్ ఇండియన్ వ్యక్తి... జీతం/పెన్షన్ ఉన్నవారు మాత్రమే దాఖలు చేయగలరు. ఇదికాక ఒక ఇంటిపై ఆదాయం (నష్టం లేకపోతేనే) ఉన్నవారు, వడ్డీ ఆదాయం ఉన్నవారు వేయొచ్చు. ♦మొత్తం ఆదాయం రూ.5 లక్షలు దాటకూడదు. ఈ–ఫైలింగ్ మాత్రమే చేయాలి. అయితే సూపర్ సీనియర్ సిటిజన్లకు, ఆదాయం రూ.5 లక్షల లోపుండి, రిఫండ్ క్లెయిమ్ చేయని వారికి ఈ–ఫైలింగ్ అక్కర్లేదు. ♦ ఇంటిమీద రూ.2 లక్షలలోపు నష్టం ఉండి... అది సర్దుబాటు అయిపోతే సరి. లేకుంటే ఈ ఫారం వేయకూడదు. వ్యయసాయంపై ఆదాయం ఉన్నవారు కూడా ఈ ఫారం వేయకూడదు. ఐటీఆర్–2, 3 ఫారాలకు సంబంధించి... ♦ ఇది రెసిడెంట్లు, నాన్ రెసిడెంట్లు... జీతం/పింఛన్, ఇంటిపై ఆదాయం/మూలధన లాభాలు/ ఇతర ఆదాయాలు ఉన్నవారు వేయొచ్చు. ♦వ్యాపారంపై ఆదాయం ఉన్న వారు వేయకూడదు. రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఇళ్లున్నవారు ఈ ఫారం వేయొచ్చు. ♦ నష్టాన్ని సర్దుబాటు చేసిన తరవాత సర్దుబాటు కాని నష్టాన్ని వచ్చే సంవత్సరం బదిలీ చేసుకునే వారు ఈ ఫారం వేయొచ్చు. ♦ ఆదాయం విషయంలో ఎటువంటి ఆంక్షలు లేవు. ఈ–ఫైలింగ్ తప్పనిసరి. ♦ వ్యక్తి/హిందూ ఉమ్మడి కుటుంబం, వ్యవసాయ ఆదాయం ఉన్నవారు ఈ ఫారం వేయొచ్చు. ♦ ఇతర ఆదాయం ఎంత ఉన్నా.. లాటరీలు, గుర్రపు పందాలపై ఆదాయం ఉన్నా వేయొచ్చు. ♦ మూలధన లాభాలు/నష్టాలున్న వారు వేయొ చ్చుకానీ.. భాగస్వామ్యాలు, స్పెక్యులేషన్ ఆదా యం ఉన్నవారు, ఏజెన్సీ, ఇతరులు వేయరాదు. ♦ డివిడెండు ఆదాయం ఉన్నవారు వేయాలి. విదేశీ ఆస్తులు, ఆదాయం ఉంటే డిక్లేర్ చేయాలి. ఈ రెండు ఫారాలూ దాఖలు చేశాక ♦మాన్యువల్‌గా వేసిన వాళ్లు ముందే సంతకం పెట్టి అధికారుల దగ్గర ఫైల్ చేయాలి. ఈ–ఫైలింగ్ వాళ్లు... ఫైలింగ్ తరవాత ఈ–వెరిఫై చేయాలి. ♦ ఈ– వెరిఫైకి రెండు ఫారాలుంటాయి. మొదటిది డిజిటల్ సంతకం ద్వారా చేయొచ్చు. ఈవీసీ ద్వారా ఓటీపీ పొంది వెరిఫై చేయటం రెండవ పద్ధతి. ♦ఏదైనా మరణం వల్ల ఈ –వెరిఫై కాకపోతే ఎకనాలెడ్జిమెంటు మీద స్వయంగా సంతకం చేసి బెంగళూరుకు పంపాలి. -
నటి త్రిషకు ఊరట
చెన్నై: జరిమానా చెల్లించాలన్న ఆదాయ పన్ను(ఐటీ) నోటీసుల నుంచి సినీ నటి త్రిషకు ఊరట లభించింది. 2010–11 కాలంలో వెల్లడించని ఆదాయంపై రూ.1.11 కోట్లు అపరాధ రుసుము చెల్లించాలంటూ ఐటీ శాఖ ఆమెకు నోటీసులు జారీ చేసింది. దీనిపై ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. చీఫ్ జస్టిస్ ఇందిరా బెనర్జీ నేతృత్వంలోని బెంచ్ ఆమె పిటిషన్‌పై శుక్రవారం విచారించింది. ఈ సందర్భంగా బెంచ్... ఆదాయం వివరాలను త్రిష ఉద్దేశపూర్వకంగా దాచి పెట్టలేదని, ఐటీ చట్టం ప్రకారం ఆమెకు జరిమానా విధించనవసరం లేదని పేర్కొంది. త్రిష జరిమానా చెల్లించాలన్న ఐటీ వినతిని తోసిపుచ్చింది. -
ఐటీ దాడులపై వివరణ ఇచ్చిన జ్యోతుల నవీన్
-
ఐటీ దాడులపై జ్యోతుల తనయుడి వివరణ
సాక్షి, కాకినాడ : ఐటీ దాడులపై జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు తనయుడు జ్యోతుల నవీన్ కుమార్ వివరణ ఇచ్చారు. బుధవారం ఉదయం ఆయన కాకినాడలోని ఆదాయపన్ను శాఖ అదనపు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ... గతంలో తమ ఉమ్మడి ఆస్తి అయిన గోదాముల విక్రయానికి సంబంధించి తక్కువగా చూపించిన సేల్ డీడ్ రిజిస్ట్రేషన్‌పై అధికారులు వివరణ అడిగారే తప్ప, ఎలాంటి దాడులు జరపలేదన్నారు. తమది వ్యవసాయ ఆధారిత కుటుంబం కావడం వల్ల గత కొంతకాలంగా ఐటీ రిటన్స్ పట్టించుకోలేదన్నారు. వాటిని కూడా చెల్లిస్తామని ఐటీ అధికారులకు సమాధానం ఇచ్చినట్లు నవీన్ పేర్కొన్నారు. కాగా జ్యోతుల నెహ్రు ఇంటిపై మంగళవారం మధ్యాహ్నం విశాఖకు చెందిన ఐటీ అధికారులు దాడి చేశారు. ఆయన స్వగ్రామం ఇర్రిపాక నివాసంలో ఐటీ శాఖాధికారులు సోదాలు నిర్వహించారు. -
ఆదాయ పన్ను రద్దు చేయండి!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ వివాదాస్పద ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరోసారి తనదైన శైలిలోవ్యాఖ్యలు చేశారు. ఆదాయపు పన్నును రద్దు చేయాలని పిలుపునిచ్చారు. దీని వలన ఎక్కువ మంది పొదుపు చేయడానికి వీలవుతుందని, తద్వారా పెట్టుబడుల పెరుగుదలకు దారితీస్తుందన్నారు. హైదరాబాద్ హైటెక్స్ లో ఇండియన్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఫ్యూచర్ అఫ్ ఇండియా ఇన్ ఎమర్జింగ్ వరల్డ్ 8వ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగం, పేదరికం సమస్యల పరిష్కారానికి దేశం 10 ఏళ్లలో 10 శాతం వృద్ధిరేటు సాధించాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు, స్టార్టప్ కంపెనీలు అధిక పన్ను భారాన్ని మోస్తున్నారన్నారు. చాలా తక్కువమంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారు. ఇది కూడా వేధింపులతో సమానమన్నారు. మధ్య తరగతిపై భారాన్ని తగ్గించేందుకు, వ్యక్తిగత ఆదాయపన్నును రద్దు చేయాలని సూచించారు. అందువల్ల ప్రజల్లో పొదుపు సామర్ధ్యం పెరుగుతుందని, పెట్టుబడులు పుంజుకుంటాయన్నారు. -
వారికి ఐటీ శాఖ సీరియస్ వార్నింగ్
న్యూఢిల్లీ : శాలరీ క్లాస్ పన్నుచెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఐటీ రిటర్నుల్లో ఆదాయాన్ని తక్కువ చేసి చూపించినా.. తీసివేత/మినహాయింపులను అక్రమంగా పెంచినా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని హెచ్చరించింది. ఎవరైనా ఈ ఉల్లంఘనలకు పాల్పడినట్టు తెలిస్తే వారిపై విచారణ చేపట్టనున్నామని, ఆ ఉద్యోగస్తులపై వారి ఎంప్లాయర్స్(సంస్థలు) కూడా కఠిన చర్యలు తీసుకోనున్నారని తెలిపింది. ప్రముఖ కంపెనీలకు చెందిన పలువురు ఉద్యోగులు మోసపూరితంగా ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్స్ ను క్లయిమ్ చేసుకుంటున్నారని ఇటీవల పలు రిపోర్టులు వచ్చాయి. పన్ను మధ్యవర్తుల ద్వారా తప్పుడు ఆదాయాలు చూపుతున్నట్టు తెలిపాయి. దీంతో ఆదాయపు పన్ను శాఖ ఈ అడ్వయిజరీ జారీచేసింది. ఆదాయాన్ని తక్కువ చేసి చూపించడం, తీసివేత/మినహాయింపులను అక్రమంగా పెంచడం వంటి మోసాలకు పాల్పడితే, ఆదాయపు పన్ను చట్టంలోని పలు పీనల్, ప్రాసిక్యూషన్ నిబంధనల కింద చర్యలు తీసుకుంటామని ఈ అడ్వయిజరీలో తెలిపింది. బెంగళూరుకు చెందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలోని పలువురు ఉద్యోగులు తప్పుడు మార్గాల ద్వారా పన్ను రీఫండ్స్‌ను పొందారని డిపార్ట్మెంట్కు చెందిన విచారణ విభాగం తేల్చిన సంగతి తెలిసిందే. ట్యాక్స్ అడ్వయిజరీలతో ఈ మోసాలకు పాల్పడినట్టు తెలిసింది. దీంతో శాలరీ క్లాస్ పన్ను చెల్లింపుదారులకు, ఐటీ శాఖ గట్టి వార్నింగ్ ఇచ్చింది. కాగ, శాలరీ క్లాస్ పన్ను చెల్లింపుదారుల ట్యాక్స్ ఫైలింగ్ సీజన్‌ను సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సస్ ప్రారంభించింది. కొత్త ఐటీఆర్ నిబంధనలను కూడా తీసుకొచ్చింది. -
వేతన జీవులకు షాక్: కొత్త ఐటీఆర్..ఎన్నో మార్పులు
ఐటీఆర్–1 వేతనజీవుల కోసం. దీన్లో ఇదివరకు జీతభత్యాల గురించి వివరాలు ఇవ్వాల్సిన అవసరం వచ్చేది కాదు. ఇప్పుడు ఇవ్వాలి. ►ఉద్యోగస్తులకు యాజమాన్యం వారిచ్చే స్టాక్ ఆప్షన్ ప్లాన్ విషయంలో మార్పుల వలన, లిస్ట్ కాని కంపెనీ షేర్లుంటే వాటి ‘ప్రైమరీ మార్కెట్’ విలువను సీఏ, మర్చంట్ బ్యాంకర్‌తో ధ్రువీకరించాలి. ►అద్దెకిచ్చిన ఇంటి మీద అద్దె వివరాలివ్వాలి. ►మూలధన లాభాలకు సంబంధించి అదనపు వివరాలివ్వాలి. మినహాయింపులు పొందిన వారు వాటిని ఎంతో వివరంగా తెలియజేయాలి. ►కొన్ని ఫారాలలో అసెస్సీకి సంబంధించిన కాలమ్ ‘జెండర్’ తొలగించారు.ఈ సమాచారం ఇవ్వక్కర్లేదు. ►భాగస్వామ్య సంస్థలు భాగస్వాముల ఆధార్ వివరాలను తెలియజేయాలి. ►భాగస్వామి గత సంవత్సరం వరకూ ఫారం–2ను దాఖలు చేయవచ్చు. ఈ సారి ఫారం–3లో రిటర్నులు దాఖలు చేయాలి. ► అలాగే నాన్ రెసిడెంట్లు ఫారం–1కి బదులుగా ఫారం–2 దాఖలు చేయాలి. ఇందులో అదనంగా సమాచారం ఇవ్వాలి. వారు రిఫండ్ క్లెయిమ్ చేసినప్పుడు విదేశీ బ్యాంక్ వివరాలిస్తే.. ఆబ్యాంక్ ఖాతాకు రిఫండ్ ఇస్తారు. ► కొంతమంది నిర్దేశించిన శాతాన్ని లాభంగా చూపించడం ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ అంటారు. వారు ఈసారి అదనంగా సమాచారం ఇవ్వరు. (ఇది వ్యాపారస్తులు, వృత్తి నిపుణులకు మాత్రమే). ►వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు జీఎస్టీ రిటర్నులలో పేర్కొన్న టర్నోవర్‌ను చూపించాలి. దీనివలన పుస్తకాల టర్నోవర్‌తో, జీఎస్టీ టర్నోవర్‌ను పోల్చి చూస్తారు. వ్యత్యాసం ఉంటే వివరణ ఇవ్వాలి. ►అలాగే కంపెనీల విషయంలో ఎన్నెన్నో వివరాలు ఇవ్వాలి. ►వేతనజీవుల విషయంలో గడువుతేది 31/07/2018. ఆన్లైన్లో దాఖలు చేయాలి. అన్ని కాగితాలు సంపాదించి, సరిచూసుకొని, ఖచ్చితంగా ఫైల్ చేయండి. 31/07/2018 దాటితే రూ.5,000, 31/12/2018 దాటితే రూ.10,000 పెనాల్టీ పడుతుంది. -
ఆధార్ : లాయర్లకు దానికి అనుమతివ్వండి
న్యూఢిల్లీ : ఆధార్ కార్డు లేనప్పటికీ రిటర్నులు దాఖలు చేసే అనుమతి న్యాయవాదులకు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆధార్ కార్డు వివరాలు ఇవ్వన్నప్పటికీ అనుమతి ఇవ్వాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. న్యాయవాదులు ముకుల్ తల్వార్, వ్రిండా గ్రోవర్లు దాఖలు చేసిన ఫిర్యాదును విచారించిన ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. దీనిపై స్పందించాలని రెవెన్యూ డిపార్ట్మెంట్కు డివిజిన్ బెంచ్ నోటీసులు కూడా పంపింది. తదుపరి విచారణ మే 14న చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆధార్‌తో పాన్ కార్డు లింక్ చేసుకునే తుది గడువు జూన్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఆధార్ చట్టాన్ని కేంద్రం సుప్రీంకోర్టులో సమర్థించుకుంటూ వస్తోంది. ఇది ఒక సరసమైన, సహేతుకమైన చట్టంగా కేంద్రం అభివర్ణిస్తోంది. గోప్యతా హక్కు విషయంలో చారిత్రక తీర్పుకు ఇది కట్టుబడి ఉందని తెలిపింది. కాగ, గతేడాది ఆగస్టులో గోప్యత హక్కు, ప్రజల ప్రాథమిక హక్కు అని తొమ్మిది సభ్యుల రాజ్యాంగ బెంచ్ చారిత్రక తీర్పు వెలువరించింది. మరోవైపు ఆధార్ స్కీమ్ వాలిడిటీపై సుప్రీంకోర్టు ప్రస్తుతం ఐదుగురు సభ్యుల రాజ్యాంగ బెంచ్‌తో విచారిస్తోన్న సంగతి తెలిసిందే. -
రెండేళ్లకు రిటర్నులు వేయొచ్చు
ఆర్థిక సంవత్సరం 2015–16కి, అలాగే 2016–17కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులు ఇంకా దాఖలు చేయలేదా? అయితే ఇదొక్కసారి చదవాల్సిందే... ముందుగా 2015–16 విషయానికొస్తే... ఈ ఆర్థిక సంవత్సరం గడువు తేదీలు 2016 జూలై, సెప్టెంబర్‌తో ముగిశాయి. అప్పుడే గడువు తేదీని పొడిగించారు. అప్పుడు వేయలేనివారు 31.3.2018 లోపల వేయొచ్చు. 31.3.2018 దాటిపోతే వేయడానికి అవకాశం ఉండదు. అయితే ఆ సంవత్సరం ఏదైనా నష్టాన్ని కానీ వడ్డీని కానీ రాబోయే సంవత్సరం ఆదాయంలోంచి తగ్గించే సర్దుబాటు మాత్రం ఉండదు. ఆ సర్దుబాటు హక్కు కేవలం గడువు తేదీ లోపల వేసిన వారికే ఉంటుంది. రిటర్నులు వేయకపోతే వడ్డీలు, పెనాల్టీలు, జైలు శిక్షలు వంటివి ఉంటాయి. అందుకే రిటర్నులు తప్పక వేయాలి. ఇక 2016–17 ఆర్థిక సంవత్సరం 2016–17 ఆర్థిక సంవత్సరం రెండు గడువు తేదీలు.. జూలై, సెప్టెంబర్. వీటిని కూడా కొన్ని రోజులు పొడిగించారు. మొదటి గడువు ట్యాక్స్ ఆడిట్ లేనివారికి, రెండో గడువు ట్యాక్స్ ఆడిట్ ఉన్నవారికి. ఈ గడువు తేదీలు ముగిసిపోయాయి. 2018 మార్చిలోకి ప్రవేశించాం. ఈ ఏడాది రిటర్నులు దాఖలు చేయడానికి ఆలస్యంగా 31.3.2018 వరకు అవకాశం ఉంది. ఆలస్యం కారణంగా నష్టాన్ని కానీ, వడ్డీని కానీ సద్దుబాటు చేయరు. కానీ మిగతా ప్రయోజనాలు ఉంటాయి. అవి ఏమిటంటే.. ♦ మిమ్మల్ని డిఫాల్టర్‌గా పరిగణించరు. ♦ రుణాల మంజూరీకి ఉపయోగపడుతుంది. ♦ మీ క్రెడిట్ విశ్వసనీయత పెరుగుతుంది. ♦ వడ్డీలు తప్పించుకున్నా.. పెనాల్టీలు పడతాయి. ఇక 2017–18 సంవత్సరం నుంచి ఆలస్యంగా దాఖలు చేసినట్లయితే వేలల్లో ఆలస్య రుసుము చెల్లించాలి. జీవితంలో మాదిరే ఆర్థిక అంశాల్లోనూ అత్యంత శ్రద్ధ, క్రమశిక్షణ అవసరం. -
ఆదాయపన్నులో.. స్టాండర్డ్ డిడక్షన్ అంటే..
పశ్చిమగోదావరి, నిడమర్రు : ఇటీవల ప్రవేశపెట్టిన 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో ఆదాయపన్ను రిటర్న్ దాఖలు విషయంలో పన్ను శ్లాబుల్లో మార్పులేమీ చేయలేదు. కేవలం ప్రామాణిక మినహాయింపు(స్టాండర్డ్ డిడక్షన్)తో సరిపెట్టారు. 12 ఏళ్ల తర్వాత ఉద్యోగస్తులు, పెన్షనర్ల కోసం సాండర్డ్ డిడక్షన్‌ను తిరిగి ప్రవేశపెట్టడం ఉద్యోగస్తుల్లో కాస్త ఊరట లభించే అంశం. నూతన బడ్జెట్లో స్టాండర్డ్ డిడక్షన్ రూ.40 వేలుగా ప్రకటించారు. అసలు ఆదాయ పన్ను లెక్కల్లో స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఏమిటి..? మినహాయింపు పొందే మార్గాలు తదితర సమాచారం తెలుసుకుందాం. 12 ఏళ్ల తర్వాత స్టాండర్డ్ డిడక్షన్ ఒక ఉద్యోగి ఆఫీసుకు వెళ్లి రావడానికి అయ్యే వ్యయాలను దృష్టిలో పెట్టుకొని గతంలో స్టాండర్డ్ డిడక్షన్ కింద ఆదాయంలోంచి కొంత మొత్తాన్ని తగ్గించి మిగిలిన దానిపై పన్ను లెక్కించేవారు. కానీ దీన్ని 2006–07 అసెస్మెంట్ ఇయర్లో తొలగించారు. అప్పట్లో స్టాండర్డ్ డిడక్షన్ రూ.30 వేలుగా ఉండేది. 12 ఏళ్ల తర్వాత తిరిగి రూ.40 వేలు స్టాండర్డ్ డిడక్షన్‌గా ప్రకటించారు. స్టాండర్డ్ డిడక్షన్ అంటే.. స్టాండర్డ్ డిడక్షన్ అంటే మినహాయించబడిన ఆదాయ పన్ను ప్రకారం దాని నుంచి మినహాయించడం, లేదా వ్యక్తి పెట్టిన పెట్టుబడి. ఈ ప్రయోజనం కోసం ఒక వ్యక్తి ఏదైనా పెట్టుబడి రుజువులు లేదా వ్యయం బిల్లులను బహిర్గతం చేయకూడదు. స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఒక స్టాండర్డ్ రేటులో అనుమతించబడుతుంది. స్టాండర్డ్ డిడక్షన్ అర్థం.. స్టాండర్డ్ డిడక్షన్ అనేది స్థిర మినహాయింపు. సంస్థలో ఉన్న స్థానంతో నిమిత్తం లేకుండా జీతం నుండి తీయడం జరుగుతుంది. స్థిర డబ్బు వార్షిక జీతం నుంచి తీసివేయబడుతుంది. కాబట్టి ఇది పన్ను విధించదగిన ఆదాయాన్ని తగ్గిస్తుంది. అలాగే పన్ను చెల్లించిన మొత్తం కూడా తగ్గిపోతుంది. ఉద్యోగి, పింఛనుదారుడు స్టాండర్డ్ డిడక్షన్ పొందవచ్చు. ఈ ప్రయోజనం కోసం, జీతం వేతనం, వార్షికం, ఎసెస్మెంట్, పెన్షన్, ఫీజు, గ్రాట్యుటీ, కమిషన్, ముందు జీతం వంటి వాటికీ, ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10 కింద తక్కువ అద్దెలు, గృహ అద్దె భత్యం, రవాణా భత్యం వంటివి ఉన్నాయి. అద్దె ఆదాయం నుంచి ప్రామాణిక మినహాయింపు భారతదేశంలో గృహ ఆస్తి నుంచి తలసరి ఆదాయం కింద వర్గీకరించబడిన అద్దె నుంచి వచ్చే ఆదాయం కోసం ప్రామాణిక మినహాయింపు అనుమతించబడుతుంది. 30 శాతం ప్రామాణిక మినహాయింపు అద్దె నుంచి ఆదాయం కోసం అనుమతించబడుతుంది. అద్దె నుంచి వచ్చే ఆదాయం సంపాదించిన వ్యక్తికి వార్షిక విలువ లేదా స్థానిక అధికారులకు చెల్లించిన పురపాలక మరియు ఇతర పన్నులను తగ్గించుకోవచ్చు ఉద్యోగులకు అందుబాటులో ఉన్న మినహాయింపులు స్టాండర్డ్ డిడక్షన్ నేపథ్యంలో ప్రస్తుతం పన్ను పరిధిలో ఉన్న రవాణా, వైద్య చికిత్స అలవెన్సుల్ని పన్ను పరిధిలోకి రూ.40 వేల వరకూ తెచ్చారు. జీతం నుంచి ఉద్యోగి ఆదాయం కింద ప్రామాణిక తగ్గింపు భాగంగా వినోదభత్యం, వృత్తి పన్ను పొందవచ్చు. ఇవే కాకుండా అనేక అంశాల్లో మినహాయింపు పొందేందుకు వీరు అర్హులు. మినహాయింపు పొందే వర్గాలు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్‌లో పెట్టుబడులు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్, ఐదేళ్ల టాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్, పెన్షన్ ప్లాన్స్, ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్స్, జీవిత బీమా పాలసీ, జాతీయ సేవింగ్స్ సర్టిఫికేట్స్, విద్యా రుణాన్ని తిరిగి చెల్లించడం, ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులు ఆదాయం పన్ను చట్టం కింద ఉద్యోగి ఆదాయంలో పొదుపును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆదాయం పన్ను చట్టం వ్యక్తిగత విభాగాల కింద తగ్గింపులకు అనుమతి ఇచ్చింది. విభాగం 80సీ, సెక్షన్ 80సీసీసీ, సెక్షన్ 80 సీసీడీలో పేర్కొన్న ప్రకారం ఏదైనా పెట్టుబడి పెట్టి ఉంటే, అప్పుడు మొత్తం పెట్టుబడి సంవత్సరానికి రూ.1.5 లక్షలు తగ్గించుటకు అర్హులు. దీంతో పాటు నేషనల్ పెన్షన్ పథకంలో (ఎన్పీఎస్) పెట్టుబడి పెట్టడానికి 80సీసీడీ కింద రూ.50 వేల ఆదనపు మినహాయింపు అందుబాటులో ఉంది. -
మార్పునకు నాంది... ఈ–అసెస్మెంట్లు
2006 నుంచి ఆదాయపు పన్ను రిటర్నులను ఈ–ఫైలింగ్ ద్వారా చేయాలి. జనాలు అలవాటు పడ్డారు. అది సజావుగానే సాగుతోంది. 10 సంవత్సరాల తర్వాత అంటే 2016లో ఈ–అసెస్మెంట్లకు నాంది పలికారు. మామూలు అసెస్మెంట్లో అధికారులు నోటిసులిస్తారు. బదులుగా మనం అధికారులను కలిసి వారు అడిగిన అన్ని కాగితాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలి. అంతేకాక అకౌంట్స్ బుక్స్, పాస్‌బుక్‌లు, రుజువులు, ధ్రువీకరణ పత్రాలు, అగ్రిమెంట్లు ఇలా సవాలక్ష కాగితాలు అందివ్వాలి. వారు రమ్మన్నప్పుడు వెళ్లాలి. చాలా సార్లు కలవాలి. వివరణలివ్వాలి. ఎంతో కాలం, ప్రయాస, వెళ్లి రావడానికి రవాణా ఖర్చులు, నిరీక్షణ, వాదోపవాదాలు, అధికారులు అదిరింపు, అసెసీ భయపడటం, ఒక్కొక్క కేసుకు సంబంధించి డిపార్ట్మెంట్లో ఉన్న కాగితాల కట్టల గుట్టలు.. ఇలా ఎన్నో. సవ్యంగా సాగితే సవరణ, వివరణ ఉంటాయి. లేదంటే రణమే. వీటన్నింటికీ మించి వ్యక్తిగత అభిప్రాయం, అభిమానం, అనుమానం ఎక్కువ పాత్ర పోషిస్తాయి. వీటి ప్రభావం ఆదాయపు పన్ను భారంపై పడుతుంది. మంచి లేకపోలేదు. అధికారులు ఓపికగా ఉంటారు. ఇబ్బందులు వింటారు. సకాలంలో కాగితాలు ఇవ్వకపోతే తగిన కారణం ఉంటే సహకరిస్తారు. మానవతా దృక్పథం ఉంటుంది. అర్థం చేసుకుంటారు. సర్దుబాటు, దిద్దుబాటు, వెసులుబాటు ఉంటాయి. ఇలా గత 50 సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియలో... ఈ–గవర్నెన్స్‌లో భాగంగా వస్తున్నాయి ఈ–అసెస్మెంట్లు. ఈ–ప్రోసీడింగ్స్‌లో నోటీసులు, ప్రశ్నలు ఉంటాయి. మొబైల్ ఫోన్‌కి సంక్షిప్త సమాచారం ఇస్తారు. స్క్రూటినీ పాక్షికమా, సమగ్రమా తెలియజేస్తారు. అయితే అసెసీకి ఒక అవకాశమిస్తారు. ఇక్కడ మాన్యువల్ లేదా ఈ–అసెస్మెంట్ అనేది మన ఇష్టం. మీరు ఇవ్వాల్సిన సమాచారం ఈ–మెయిల్ ద్వారా ఇవ్వాలి. అది 10 మెగాబైట్స్ దాటకూడదు. ఎప్పటికప్పుడు మై అకౌంట్లోకి వెళ్లి చెక్ చేసుకోవాలి. మెయిల్స్ ఓపెన్ చేసి సమాధానమివ్వాలి. అధికారులకు తగిన సమాచారం లభించిన తర్వాత క్లోజ్ చేస్తారు. తర్వాత ఆర్డర్లు ఈ–మెయిల్ ద్వారా వస్తాయి. ఇది పూర్తిగా టెక్నాలజీ మీద ఆధారపడి జరిగే ప్రక్రియ. మీ కాగితాల్లో ఉన్న దాని ప్రకారం జరుగుతుంది. మీ కాగితాలే మాట్లాడతాయి. మీ మాట ఎవ్వరూ విన్నరు. మిమల్ని ఎవ్వరూ చూడరు. వయోవృద్ధులకు ఇది శరఘాతం. కాగితాల్లో తప్పు చోటుచేసుకుంటే అసెస్మెంట్ తప్పవుతుంది. సర్దుబాటుకు అవకాశం లేదు. వ్యక్తిగత విచారణ ఉండదు. డిజిటలైజేషన్ జిందాబాద్ అక్షరాస్యతలో వెనకున్నాం. ఈ టెక్నాలజీతో పరిగెత్తగలమా? అధికారులకిది కొత్తే. అసెసీలకు వింత. కొత్తపొంతలు తొక్కేటప్పుడు వెసులుబాటు, సర్దుబాటు ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ కేవలం రికార్డుల ప్రకారం జరిగే ప్రక్రియ కాదు. ప్రతి దాన్నీ కాగితాలతో, రుజువులతో బేరీజు వేయకూడదు. కాగితం అంటే చట్టం. కానీ న్యాయం, ఔచిత్యం చూడాలి. ఎందుకంటే కాగితాలకందని ఎన్నో విషయాలుంటాయి. ఖర్చు స్వభావం, ప్రయోజనం, వాస్తవికత, నిజాయితీ, వర్తింపు, న్యాయం, విశ్వసనీయత, ఉద్దేశం వీటన్నింటిలో అధికారులు సంతృప్తి చెందాలి. విటన్నింటికీ మానవ దృక్పథం వెన్నెముకలాగా ఉంటుంది. మొదట్లో ఇబ్బందులు ఉన్నా ఇరువురి సహకారంతో ముందుకు వెళ్లొచ్చు. విద్యతో నిమిత్తం లేకుండా కొన్ని కోట్ల మంది మొబైల్స్ వాడుతున్నారు. ఈ పేమెంట్లు చేస్తున్నారు. మార్పుకి ఓటేస్తున్నారు. మంచి ఫలితానిచ్చే ఏ మార్పునైనా ప్రజలు మన్నించక తప్పదు. -
రూ 100 కోట్లు ఆర్జించింది ఒక్కడేనట
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ వెల్లడించిన భారతీయులు దాఖలు చేసిన 2014-15 ఐటీ రిటన్‌ల వివరాల్లో పలు ఆశ్చర్యకర అంశాలు వెలుగుచూశాయి. రూ వంద కోట్ల పైగా పన్ను చెల్లించే రాబడి ఆర్జించినట్టు కేవలం ఒకే ఒక భారతీయుడు వెల్లడించినట్టు సమాచారం. మొత్తం 4.1 కోట్ల మంది ఐటీ రిటన్లు దాఖలు చేయగా వారిలో రెండు కోట్ల మంది తమకు పన్ను వేసే రాబడి అసలేమీ లేదని వెల్లడించారు. మిగిలిన రెండు కోట్ల మంది సగటున రూ 42,456 మేర ఆదాయ పన్ను చెల్లించారు. కేవలం కోటి మంది పన్ను చెల్లింపుదారులు రూ లక్షకు మించి ఆదాయ పన్ను చెల్లించారు.రూ కోటి పైన పన్ను చెల్లించదగిన రాబడిని వెల్లడించిన వారు పదివేల మందికి లోపే ఉన్నారు.