చివరి రోజు పెద్ద సంఖ్యలో రిటర్నులు | Over 5. 10 crore returns filed, 57. 5 lakh returns filed | Sakshi
Sakshi News home page

చివరి రోజు పెద్ద సంఖ్యలో రిటర్నులు

Aug 1 2022 5:28 AM | Updated on Aug 1 2022 5:28 AM

 Over 5. 10 crore returns filed, 57. 5 lakh returns filed  - Sakshi

న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నులు చివరి రోజున కూడా పెద్ద సంఖ్యలో దాఖ లయ్యాయి. ఆదివారం  రాత్రి 8 గంటల వరకు 53,98,348 రిటర్నులు నమోదైనట్టు ఆదాయపన్ను శాఖ ట్విట్టర్‌లో ప్రకటించింది. ఆడిటింగ్‌ అవసరం లేని పన్ను రిటర్నుల దాఖలుకు జూలై 31 చివరి తేదీగా ఉంది. దీన్ని పొడిగించాలంటూ పెద్ద ఎత్తున వినతులు వచ్చినా కానీ ప్రభుత్వం ఆమోదించలేదు.

జూలై 30 నాటికి 5.10 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయి. దీంతో జూలై 31 నాటికి మొత్తం 5.64 కోట్ల రిటర్నులు వచ్చినట్టు తెలుస్తోంది. రాత్రి 8 తర్వాత కూడా కొన్ని దాఖలవుతాయి కనుక వీటి సంఖ్య పెరగొచ్చు. 2020–21 ఆర్థిక సంవత్సరానికి దాఖలైన రిటర్నులు 5.7 కోట్లుగా ఉండడం గమనార్హం. జూలై 31 తర్వాత కూడా ఆలస్యపు రుసుంతో డిసెంబర్‌ 31వరకు రిటర్నులు వేయవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement