ఐటీ రిటర్న్‌ల గడువు నవంబర్‌ 30వరకుపొడిగింపు

IT Returns Filing Deadline For FY 2019 20 Extended - Sakshi

న్యూఢిల్లీ: 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్నులను దాఖలు చేసే గడువును నవంబర్‌ 30 దాకా పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆదాయపన్ను శాఖ శనివారం ప్రకటిం చింది. రెండురోజుల క్రితమే ఐటీ రిటర్న్‌ల గడువును ఈనెల 31కి పెంచిన కేంద్రం... తాజాగా మరో 4 నెలలు అవకాశం ఇచ్చింది.  టీడీఎస్, టీసీఎస్‌ సర్టిఫికెట్లను జారీ చేసేం దుకు ఆఖరు తేదీని కూడా ఐటీశాఖ ఆగస్ట్‌ 15 దాకా పెంచింది.  ‘ప్రస్తుత పరిస్థితు ల దృష్ట్యా నవంబర్‌ 30 దాకా రిటర్న్‌ల దాఖలుకు అవకాశం కల్పిస్తున్నాం’ అని ఐటీశాఖ వెల్లడిం చింది. ఐటీ కడుతున్నపుడు హౌసింగ్‌ లోన్లు, జీవిత బీమా, పీపీఎఫ్‌ ఇతరత్రా మినహాయిం పులను క్లెయిమ్‌ చేసుకొనే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. వీటి కింద ఈ నెల 31వ తేదీ దాకా చేసిన అన్ని రకాల మదుపులను 2019–20 రిటర్నులలో క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top