
ఫిల్టర్ లేకుండా ఫేస్ గ్లో, మేకప్ లేకుండా మెరిసిపోయే అందం కయాదు సొంతం! నిజమైన చర్మకాంతే అసలైన సౌందర్యం అని నమ్మే ఆమె, స్టయిలింగ్‌లోనూ మినిమలిస్ట్ టచ్‌తోనే ట్రెండ్‌ను తిరగరాస్తోంది. సింపుల్ బ్యూటీ, సోబర్ కలర్స్ ఇవే ఆమె ఫ్యాషన్ మంత్రాలు.
బ్రాండ్: దేవరాగ్ ధర: రూ. 5,500
జస్ట్ స్కిన్, నో సీక్రెట్స్’ అన్నదే నా బ్యూటీ సీక్రెట్. రోజూ ముఖానికి మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ , జుట్టుకు లైట్ హెయిర్ స్ప్రే అంతే. ఎంత తక్కువ ప్రొడక్ట్స్ వాడితే, అంత అందంగా, ఆరోగ్యంగా ఉంటాం. డ్రెస్‌ల విషయానికి వస్తే, సోబర్ కలర్స్, క్లీన్‌కట్ స్టయిల్ నాకు బాగా నచ్చుతాయని చెబుతోంది కయాదు లోహార్
జ్యూలరీ: స్టయిలింగ్: అరుణ్ దేవ్
ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
సింగిల్ లైన్ స్టయిల్
చీర కట్టుకున్నాక వడ్డాణం పెట్టుకోవాలి అనుకుంటున్నావా? ఆ ఆలోచనకు కాస్త బ్రేక్ ఇచ్చి, ఇదీ చూడండి! సాధారణ చీర, పాత మోడల్ బ్లౌజ్ వేసుకున్నా, ఈ రేకు వడ్డాణం పెడితే లుక్ వెంటనే బ్రైట్ అవుతుంది. ఈ రేకు వడ్డాణాలు రకరకాల లోహాలతో, ట్రెండీ లుక్స్‌తో దొరుకుతున్నాయి. చీరే కాదు, ఏ డ్రెస్ అయినా సరే, ఈ రేకు వడ్డాణాన్ని నడుముకు చుట్టుకుని, అద్దం ముందు నిల్చుంటే... ‘ఒక చిన్న మెటల్ లైన్ ఎంత మాయ చేస్తుందో!’ అనిపించకుండా ఉండదు.
కుచ్చిళ్లు జారిపోతాయనే టెన్షన్ లేకుండా, ఒక్క బెల్ట్‌తో అంతా కంట్రోల్‌లోకి వస్తుంది. అయితే, ఈ వడ్డాణం ధరించాక భారీ ఆభరణాలు వేసుకోవద్దు. ఇదొక్కటే ప్రధాన ఆకర్షణగా ఉండాలి. చేతికి చిన్న ఉంగరం, జుట్టు సైడ్ బన్ లేదా వేవీ హెయిర్‌లో వదిలేస్తే చాలు. ఇక, ఒక్క రేకు వడ్డాణం మీ ఆకర్షణను అమాంతం మార్చేస్తుంది.
(చదవండి: అతిపెద్ద ఏకకణ జీవి..!)