రోడ్డు మీద రాయిని చూడగానే కాలితో తన్నడమో చూసిచూడనట్లు వదిలేయడమో చేస్తాం. కానీ ఈ యువకుడు రోడ్డుపై పడి ఉన్న రాయికి రూపం ఇచ్చాడనాలో లేక దానికి విలువనిచ్చాడనలో తెలియదు గానీ అద్భుతం చేశాడు. టాలెంట్‌కి కాదేది అనర్హం అన్నట్లుగా ఓ రాయిని అద్భతమైన వస్తువుగా తీర్చిదిద్ది ప్రశంసలందుకోవడమే కాదు వేలల్లో డబ్బుని కూడా ఆర్జించాడు.
ఢిల్లీకి చెందిన ఒక యువకుడు రాయిని ఇంటి అలంకరణకు ఉపకరంగా ఉండే వస్తువుగా మార్చాడు. అతడి నైపుణ్యానికి అంతా విస్తుపోయారు కూడా. రోడ్డుమీద పడి ఉన్న రాయిని అద్భుతమైన గడియారంగా మార్చాడు. రాయి చివరి అంచులను పాలిష్ చేసి అందంగా మార్చాడు. గడియారం సూదిని అటాచ్ చేసేందుకు, ఇతర పరికరాలను సెట్ చేసేందుకు రంధ్రాలు చేశాడు. అలాగే ఆకర్షణీయంగా కనిపించేలా పెయింట్ వేశాడు.
చివరగా సూది, బ్యాటరీ చొప్పించి.. రాతితో రూపుదిద్దుకున్న ఫంక్షనల్ గడియారాన్ని డిజైన్ చేశాడు. ఆ తర్వాత ఆ గడియారాన్ని పలువురికి చూపించినా..ఎవరూ ప్రశంసించలేదు, కొనేందుకు ఆసక్తి కూడా చూపించలేదు. దాంతో మరికొన్ని మార్పులు చేసి అమ్మకానికి పెట్టగా కూడా పరిస్థితి అలానే ఉంది.
దాంతో ఆ యువకుడి గడియారంతో రోడ్డుపై నిలబడి అమ్మేందుకు ప్రయత్నించగా..చాలామంది రూ. 460కి అడగారు. మరి అలా అడగటం నచ్చక..ఇది రాయితో తానే స్వయంగా చేతితో చేసిన గడియారం అని చెబుతుంటాడు. అది విని ఆసక్తిగా ఒక వ్యక్తి ఆ యువకుడి వద్దకు వచ్చి ధర ఎంత అని అడగగా రూ. 5 వేలు అని చెప్పగానే మారుమాట్లడకుండా డబ్బు చెల్లించి మరి ఆ గడియారాన్ని కొనుగోలు చేశాడు.
అంతేగాదు ఆ రాయిని సేకరించడం దగ్గర నుంచి గడియారంగా మార్చడం వరకు మొత్తం తతంగాన్ని రికార్డు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు ఆ యువకుడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
(చదవండి: వివాహంలో వరుడు సప్తపది తోపాటు మరొక ప్రమాణం..!)


