ఊపిరితిత్తుల కేన్సర్ ఎందువల్ల వస్తుదంటే...అందరూ చెప్పేది బీడి,చుట్ట సిగరెట్‌ల వల్ల అనే ఠక్కున చెప్పేస్తారు. కానీ అదొక్కటే కారణం కాదని శాస్త్రవేత్తలు నొక్కి చెబుతున్నారు. మనచుట్టూ ఉన్న పరిసరాలే ప్రధాన ముప్పుగా పరిణమిస్తునన్నాయిని హెచ్చరిస్తున్నారు. మరి అదెలాగో సవివరింగా తెలుసుకుందాం.
నిజానికి ఇటీవల కాలంలో పట్టణ ప్రాంతాల్లో ధూమపానం చేయని వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ చాలామంది ఈ మహమ్మారిని బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. కనీసం సిగరెట్ వాసన కూడా చూడని వారిలో కూడా పీఎం2.5గా పిలిచే కణాలు ఊపిరితిత్తుల్లోనూ, రక్తప్రవాహంలో ప్రవహించి కణాలను దెబ్బతీసి, ఊపిరితిత్తుల కేన్సర్‌కు దారితీసే ఉత్పరివర్తనాలను ప్రేరేపిస్తాయని చెబుతున్నారు.
ఇది కేవలం నగరాల్లోనూ కాదు గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితని చెబుతున్నారు. ఎందుకంటే..డీజిల్, పంట అవశేషాలను కాల్చడం వల్ల ఈ మహమ్మారి బారిన పడుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. అదీగాక గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిమీద వంట చేస్తారు. దాన్నుంచి వచ్చే పొగ, ఒకవేళ కిచెన్‌లో సరైన వెంటిలేషన్ లేకపోతే.. ఆ పొగాకు ఎక్కువసేపు గురవ్వాల్సి వస్తుంది. ఫలితంగా ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు నిపుణులు.
అలాగే రాడాన్ వాయువు, సహజంగా సంభవించే రేడియో ధార్మిక వాయువుకి ఎక్కువ ఎక్స్‌పోజ్ అయినా..ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. అలాగే మైనింగ్, సిలికా దుమ్మ లేదా డీజిల్‌తో నడిచే కర్మాగారాల్లో వర్క్‌చేసే వ్యక్తులు ఈ వ్యాధి బారిన పడుతుంటారని చెప్పుకొచ్చారు.
ధూమపానం చేయనివారు ఎందుకు సేఫ్‌గా లేరు...
ధూమపానం చేయనివారిలో, ముఖ్యంగా యువకులు, మహిళల్లో ఊపిరితిత్తుల కేన్సర్ ఉపరకం అయినా అడెనోకార్సినోమా పెరుగుదల ఉన్నట్లు గుర్తించారు. అలాగే పర్యావరణం తోపాటు జన్యుపరమైన కారకాలు కూడా పెద్దపాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా వాయకాలుష్యం, జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతాయని చెబుతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
రోజువారీ AQI (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) స్థాయిలను పర్యవేక్షించడం
కాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో, బహిరంగ కార్యకలాపాలను పరిమితం చేయడం
ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో కిటికీలు మూసి ఉంచడం.
ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, ఎయిర్ ప్యూరిఫైయర్లు లేదా సహజంగా గాలిని ఫిల్టర్ చేసే పీస్ లిల్లీస్, స్పైడర్ ప్లాంట్లు వంటి మొక్కలను ఉపయోగించండి.
పొగ రహిత గృహాలు, కార్యాలయాల ఉండేలా మెయింటైన్ చేయడం
వర్కింగ్‌లో దుమ్ము లేదా రసాయనాలకు గురికాకుండా ఉండటం.
చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వడం.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మెరుగైన ఫలితాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: బెడ్‌షీట్స్ మార్చి ఎంత కాలమైంది?)


