సాంకేతిక అందుబాటులోకి రావడంతో నగరంలో చాట్‌బాట్ వినియోగం భారీగా పెరుగుతోంది.. ఐటీ, రీసెర్చ్ స్కాలర్స్, జెన్ జీ యువత ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో.. ఏదో ఒక అవసరానికి ఏఐని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ, పర్‌ప్లెక్సిటీ వంటి వివిధ రకాల సాధనాలు అందుబాటులకి రావడంతో సమాచారం కోసం కొందరు.. టైంపాస్ కోసం మరి కొందరు వీటిని భారీ స్థాయిలో వినియోగిస్తున్నారు. అయితే ప్రాంప్టింగ్ సరిగా లేకపోతే.. తిప్పలు తప్పవని, సరైన సమాచారం రాబట్టాలంటే.. సరైన ఇన్‌పుట్ కూడా అవసరమని, ఒకవేళ ప్రాంప్టింగ్ ద్వారా సమాధానం పొందినా.. దీనికి ఫ్యాక్ట్ చెక్ కూడా అవసరం అని చెబుతున్నారు టెక్ నిపుణులు.. దీనిని గుర్తెరిగి సరైన రీతిలో వినియోగించాలని సూచిస్తున్నారు. కాగా నగర జీవనశైలిపై ఈ చాట్‌బాట్ వినియోగం ప్రభావం చూపుతోందని తెలుస్తోంది. ప్రతి చిన్నవిషయానికీ వీటిపై ఆధారపడుతున్నారని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
సాంస్కృతిక నగరి హైదరాబాద్‌లో సాంకేతిక వినియోగం పెరుగుతోంది. ఓ వైపు రాయదుర్గ్–ఫైనాన్షియల్–డ్రిస్టిక్ట్‌లోని ఐటీ కార్యాలయాల్లోని ఉద్యోగులు.. రీసెర్చ్ చేయడానికి నగరానికి వచ్చే విద్యార్థులు, ప్రముఖులు, పనుల్ని వేగంగా పూర్తి చేసుకోవడానికి ఏఐ చాట్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడుతున్నారు. గ్లోబల్ స్థాయిలో కొన్ని పెద్ద కన్సూ్యమర్–ఫ్రెండ్లీ చాట్ బోట్స్ (చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ, క్లౌడ్, పర్‌ప్లెక్సిటీ)తో పాటు ఉత్సాహభరితమైన స్థానిక–ఇండియన్ సంస్థలతో పాటు ఎన్నో సొల్యూషన్స్ మెరుగైన ఇంటిగ్రేషన్లు అందుబాటులోకి తేవడంతో ఈ తరహా ఎకోసిస్టమ్ వేగంగా పెరుగుతోంది.
ఇండియన్ చాట్‌బాట్ బూమ్..
ప్రధానంగా నగరంలో వినియోగించే వేదికలు రెండో తరానికి చెందినవి. ప్రపంచ స్థాయి జనరల్–పర్పస్ చాట్ ఏజెంట్లు (చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ, క్లౌడ్, పర్‌ప్లెక్సిటీ, బింగ్ కాపీలాట్ మొదలైనవి) కాగా.. స్థానిక/ఎంటర్‌ప్రైజ్ ఆధారిత కన్వర్జేషనల్ ఏఐ ప్లాట్‌ఫామ్స్ (హాప్టిక్, యెల్లో.ఏఐ, యూనిపోర్) వంటివి.. అలాగే చిన్న స్టార్టప్స్, బాట్స్, వెర్బల్ ఇన్ఫో–సర్వీసులు హైదరాబాద్ వ్యాపారాల్లో కనిపిస్తుంటాయి. ఇటీవల ఇండియన్ మార్కెట్‌లోనే వందలకొద్దీ ప్లేయర్లు, బిజినెస్–సొల్యూషన్లు అందుబాటులో ఉన్నట్లు అంచనాలు. ఇది భారతీయ చాట్‌బాట్‌కి బూమ్ అని పిలుస్తున్నారు.
లైఫ్ స్టైల్‌లో సౌలభ్యాలు..
దీనికి సంబంధించి నగర సౌలభ్యాల్లో భాగంగా పనితీరు పెరుగుతుంది. కోడింగ్–హెల్ప్, డాక్యుమెంట్ డ్రాఫ్టింగ్, ఈ మెయిల్ టెంప్లెట్లు, ఐడియాస్.. అధికారికంగా ఇతరుల సహాయం పొందాల్సిన పనులు, ఇండిపెండెంట్‌గా వేగంగా చేయొచ్చు.
విద్యార్థులు, పరిశోధకుల కోసం 24/7 తక్షణ సమాధానాలు, ట్యుటోరింగ్, అల్గారిథమ్ వివరణలు, పాఠ్యాంశాల ఇతివృత్తాలు సమగ్రంగా అందిస్తుంది..
స్థానిక భాషలకు మద్దతు ఇచ్చేలా కొన్ని ఇండియన్ వేదికలు తెలుగు/హిందీ/తమిళ్/కన్నడ వంటి స్థానిక భాషలను అందజేస్తున్నాయి. షార్ట్–ఫార్మాట్ కస్టమర్–సపోర్ట్ కోసం ఉత్తమమైన మార్గం.
నష్టాలు, కొత్త సవాళ్లు..
నగర స్థాయిలో వినియోగం పెరగడంతో మిస్–ఇన్ఫర్మేషన్, ప్రైవసీ సమస్యలు, స్కామ్స్, ఉద్యోగ మార్పులు వంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయని ఇటీవల బహుళ–ఆధారాల పరిశోధనలు చెబుతున్నట్లు తెలుస్తోంది. చాట్‌మోడల్స్ ప్రజానీక అభిప్రాయాలపై ప్రభావం చూపగలవు కానీ, వాస్తవికత (అక్యూరసీ)లో పొరపాట్లు ఉండవచ్చు.
దీంతో నగరంలోని డిజిటల్–సోఫిస్టికేషన్‌లో కొన్ని వర్గాలు జాగ్రత్తగా ఉండాలి. మరొక ప్రధాన సమస్య..ఆటోమెషన్. దీని కారణంగా రిటైల్, కాల్–సెంటర్, మొదలైన జాబ్స్‌లో మార్పులు, ఫ్రోజన్‌లు (డీప్ ఫెక్), వాయిస్ స్కామ్‌లు వంటివి సరిగా గుర్తించలేకపోవడం వంటి ఇబ్బందులు కూడా ఉన్నాయని తెలుస్తోంది.
ప్రాంప్టింగ్ ఎందుకు ముఖ్యం?
ప్రాంప్ట్ అనగా మన ప్రశ్నకు–రూపం. కాంటెక్ట్స్ ఇవ్వడంలో మెళకువులు తెలిసి ఉండాలి.. ఇది ఏఐతో అనుసంధానం చేసేటప్పుడు ‘కేమికల్ మిక్స్’ లాగా పనిచేస్తుంది. సరైన ప్రాంప్ట్ ఉంటేనే సమాచారం షార్ప్, యాప్ట్‌గా వస్తుంది. అదే సమయంలో సరైన మార్గదర్శకాలు లేకపోతే పొరపాట్లు దొర్లే ప్రమాదం కూడా ఉంది. దీంతో పాటు తప్పుడు కంటెంట్ వచ్చే అవకాశాలే ఎక్కువని గుర్తించాలి. వీటిని గమనంలో ఉంచుకోవాలి..
హైదరాబాద్ తరహా నగరాల్లో ఈ ఏఐ చాట్ వేదికలు మన దైనందిన జీవనశైలిని, పని సదుపాయాలను, విద్యా సాధనాల్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. సరైన జ్ఞానం, నైతికత, ఫ్యాక్ట్–చెకింగ్‌తోనే ఈ టెక్ సదుపాయాన్ని సమర్థవంతంగా మార్చుకోగలం. ఇందులో భాగంగా పనిలో ఎటువంటి ఏఐ టూల్ ఉపయోగించిందో గమనించాలి. ప్రైవసీ సెట్టింగ్స్, డేటా షేరింగ్ స్క్రీన్‌లు చూస్తూ ఉండాలి.
ప్రధాన సమాచారానికి రెండు వేర్వేరు సోర్సుల నుంచి నిర్ధారణ చేసుకోవాలి. ప్రాంప్ట్–స్కిల్స్ వల్ల సరైన మార్కెట్ లాభాలు పొందగలం. ‘తెలుగులో స్కోర్–పాస్స్ కోసం 250 పదాల్లో వ్యాసం’ లాంటిది. ఫార్మాట్ గుర్తించడంలో భాగంగా బుల్లెట్ పాయింట్స్, సమ్మరీ, కోడ్ శాంపిల్స్ వినియోగించడం అవసరం. ఇది ఏ స్లాట్స్‌పై ఆధారపడింది అనే వాలిడేషన్ అడగడం మంచి అలవాటు. సున్నితమైన నిర్ణయాలు (న్యాయ, వైద్య) కోసం నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: ప్లేట్లు కడిగే స్థాయి నుంచి రూ 50 కోట్ల వ్యాపారం నిర్మించే రేంజ్‌కు..!)


