భారత్‌లో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. హైదరాబాద్ హౌస్‌లో 23వ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు కూడా. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి, అధికారిక విందులో ఆయ ఇష్టంగా ఆస్వాదించే వంటకాలేవి, ముఖ్యంగా ఇలాంటి పర్యాటనలలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు తదితరాల గురించి సవివరంగా తెలుసకుందామా..!.
పుతిన్ భారత్ వంటకాలను రుచి చూస్తారేమోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కానీ పుతిన్ క్రమశిక్షణ, కఠినమైన భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే నాయకుడిగా పేరుగాంచిన వ్యక్తి. ఆయన ఆహారానికి సంబంధించి.. ఫుల్ సెక్యూరిటీ మధ్య సైనిక పర్యవేక్షణలో నిర్వహిస్తారు. సాధారణంగా హోటల్ లేదా ఇతర దేశాల ఆతిథ్యంలో తయారు చేసిన భోజనాన్ని చాలా అరుదుగా తీసుకుంటారట పుతిన్.
మాములుగా అయితే శిక్షణ పొందిన రష్యన్ చెఫ్‌లు, సహాయక సిబ్బంది పుతిన్ వెంట వస్తుంటారు. కాబట్టి వారే ఆయన భోజనం గురించి స్వయంగా చూసుకుంటారు. అందువల్ల ఆయన ఎలాంటి ఆహారం తీసుకుంటారనేది చాలా సీక్రెట్‌గా ఉంది. అంతరంగిక వర్గాల సమాచారం ప్రకారం..ఆయన ఆరోగ్యకరమైన ఆహారానికే ప్రాధ్యానత ఇస్తారట. ప్రతి ఉదయం తేనె లేదా గంజితో ట్వోరోగ్(రష్యన్ కాటేజ్ చీజ్)తో ప్రారంభమవుతుందట. తాజా జ్యూస్, కౌజు పిట్ట గుడ్లతో చేసిన ఆమ్లెట్, తక్కువ చక్కెర కలిగిన ఆహారాలు వంటి వాటినే తీసుకుంటారట.
ఆయన ఎర్ర మాంసం కంటే తాజా చేపలు అది కూడా కాల్చినవి ఇష్టంగా తింటారట. లేత గొర్రెపిల్ల మాంసం కూడా అప్పడప్పుడూ తీసుకుంటారట. ఇక ఆయన భోజనంలో ఎక్కువుగా టమోటాలు, దోసకాయలు, ఇతర ప్రాథమిక కూరగాయల సలాడ్‌లు తప్పనిసరిగా ఉంటుందట.
ఇక జ్యూస్‌లలో కూడా మూలికా పానీయాలు, కేఫీర్, బీట్‌రూట్-ముల్లంగి జ్యూస్ వంటివి తీసుకుంటారట. ఇక పుతిన్‌కు పిస్తా ఐస్ క్రీం మహా ఫేవరెట్ డిజర్ట్ అట. చివరగా ఆయన క్రమశిక్షణతో కూడిన సంప్రదాయ ఆహారానికే కట్టుబడి ఉంటారట. చాలామటుకు ప్రోటీన్ కంటెంట ఉన్నవి, పోషకాహారానికి ప్రాధాన్యత ఇస్తారని చెబుతున్నారు పుతిన్ సన్నిహితులు.
(చదవండి: అక్కడ మహిళల జనాభానే ఎక్కువ..! ఎందుకంటే..)


