breaking news
Vladimir Putin
-
పుతిన్ చర్చలకు రావాలి: ఈయూ చీఫ్
బ్రస్సెల్స్: ఉక్రెయిన్‌పై దాడులను రష్యా తక్షణమే నిలిపేయాలని, శాంతి చర్చలకు ముందుకు రావాలని యురోపియన్ యూనియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్‌డెర్ లేయన్ కోరారు. ఉక్రెయిన్ రక్షణ, భద్రత, శాశ్వత స్థిరత్వానికి యూరప్ నుంచి మద్దతను ఆమె పునరుద్ఘాటించారు. కీవ్‌పై రష్యా వైమానిక దాడుల్లో 21 మంది మరణించడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పుతిన్ చర్చలకు రావాలి, సామాన్య పౌరులు, మౌలిక సదుపాయాలపై రష్యా నిరంతర దాడులను యూరప్ సహించబోదన్నారు. ఉక్రెయిన్‌కు విశ్వసనీయ భద్రతా హామీలతో పాటు న్యాయమైన, శాశ్వత శాంతి నెలకొల్పేందుకు తమ మద్దతు ఉంటుందని నొక్కి చెప్పారు. అందుకోసం ధైర్యవంతులైన ఉక్రేనియన్ సాయుధ దళాలను బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తామన్నారు. దాడిని అంతకుముందు ఎక్స్‌లోనూ ఆమె ఖండించారు.‘రష్యా కనికరంలేని బాంబు దాడుల్లో మరో రాత్రి పీడకలలా మిగిలింది. అమాయకుల ప్రాణాలను బలిగొంది. ఇది కీవ్‌లోని మా ప్రతినిధి బృందాన్ని కూడా తాకింది. మా ప్రతినిధి బృందం సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. పౌర మౌలిక సదుపాయాలపై రష్యా తన విచక్షణారహిత దాడులను వెంటనే ఆపాలి. న్యాయమైన, శాశ్వత శాంతి కోసం చర్చలలో చేరాలి’ అని ఆమె ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ఈ దాడులను బ్రిటన్ సైతం ఖండించింది. శాంతి చర్చలకు ఎదురుదెబ్బగా అభివర్ణించింది. -
జిన్‌పింగ్ మాస్టర్ ప్లాన్.. చైనా సైనిక కవాతుకు పుతిన్, కిమ్
బీజింగ్: సెప్టెంబర్ 3న బీజింగ్‌లో జరగనున్న చైనా సైనిక కవాతుకు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హాజరవుతారని చైనా తెలిపింది. ఇదొక చారిత్రక పర్యటన అవుతుందని చైనా విదేశాంగ శాఖ గురువారం విలేకరుల సమావేశంలో ప్రకటించింది. ఇది కిమ్ మొట్టమొదటి పాక్షిక అంతర్జాతీయ సమావేశం కాగా, కొత్త ప్రపంచ క్రమం కోసం ప్రయత్నిస్తున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఇది దౌత్య విజయంగా మారింది. ఉత్తరకొరియా– చైనాలది దశాబ్దాల స్నేహమని, ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటూనే ఉంటాయని తెలిపింది. కవాతుకు 26 మంది దేశాధినేతలు.. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయి 80 ఏళ్లవుతుండగా.. ఆ సంఘర్షణ ముగిసిన సందర్భంగా చైనా ‘విక్టరీ డే’కవాతును నిర్వహిస్తోంది. వందలాది యుద్ధ విమానాలు, ట్యాంకులు, యాంటీ–డ్రోన్ వ్యవస్థలతో సహా తన తాజా ఆయుధాలను చైనా ప్రదర్శించే అవకాశం ఉంది. దాని సైన్యం కొత్త దళ నిర్మాణాన్ని పూర్తిగా కవాతులో ప్రదర్శించడం ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమంలో పదివేల మంది సైనిక సిబ్బంది చారిత్రాత్మక టియానన్మెన్ స్క్వేర్ గుండా కవాతు చేస్తారు. చైనా సైన్యంలోని 45 స్థాయిల సైనికులు, యుద్ధ అనుభవజు్ఞలు కూడా ఇందులో పాల్గొంటారు. ఈ కవాతుకు హాజరు కానున్న 26 మంది దేశాధినేతల్లో పుతిన్, కిమ్ కూడా ఉంటారు.జిన్‌పింగ్ ఆహ్వానాన్ని దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే–మ్యుంగ్ తిరస్కరించారు. ఆయన స్థానంలో జాతీయ అసెంబ్లీ స్పీకర్ కిమ్ జిన్–ప్యోను హాజరు కానున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని వ్యతిరేకిస్తున్న చాలా పాశ్చాత్య దేశాలు నాయకులు కవాతుకు హాజరు కావడం లేదు. ఇండోనేషియా అధ్యక్షుడు, మలేషియా ప్రధాన మంత్రి, మయన్మార్ సైనిక పాలకుడు, యురోపియన్ యూనియన్ నాయకుడు, స్లోవాక్ ప్రధాన మంత్రి రాబర్ట్ ఫికో, బల్గేరియా, హంగేరీ ప్రతినిధులు కూడా హాజరుకున్నారు. 1959 తర్వాత ఉత్తర కొరియా నాయకుడు చైనా సైనిక కవాతుకు హాజరు కావడం ఇదే తొలిసారి. 2015లో చివరిసారిగా విక్టరీ డే పరేడ్ నిర్వహించినప్పుడు ఉన్నతాధికారులలో ఒకరైన చో ర్యాంగ్–హేను పంపింది. కవాతులో పాల్గొనొద్దు: తైవాన్ చైనా సైనిక కవాతులో పాల్గొనవద్దని ప్రజాస్వామ్య దేశాలకు తైవాన్ విజ్ఞప్తి చేసింది. చైనా ఈ సమయాన్ని ఉపయోగించుకుని సారూప్యత కలిగిన ప్రభుత్వాల మధ్య చీలికను తీసుకురావచ్చని హెచ్చరించింది. స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య దేశాలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని లేదా బహిరంగంగా ఖండించాలని ఆ దేశ విదేశాంగ శాఖ కోరింది. చైనా సైనిక, ఆర్థిక వృద్ధి ఇండో–పసిఫిక్‌లో ఉద్రిక్తతలకు దారి తీస్తుందని, ఒకప్పుడు రక్షణ రంగంలో చైనా కంటే అమెరికా ఎక్కువ ఖర్చు చేసినప్పటికీ, ఇప్పుడు చైనా దాన్ని దాటేసిందని ప్రకటించింది. చైనా రక్షణ వ్యయంలో దాదాపు 90 శాతం ఇండో–పసిఫిక్‌లో, ముఖ్యంగా భారత్–చైనా సరిహద్దులో కేంద్రీకృతమై ఉందని, ఈ సమయంలో అమెరికాతోపాటు మిత్రదేశాలు అప్రమత్తంగా ఉండాలని నొక్కి చెప్పింది. -
వారిద్దరినీ కలపడం చాలా కష్టమైన పని: ట్రంప్
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య శాంతి ప్రయత్నాలపై రెండు వారాల్లో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటానని ట్రంప్ వెల్లడించారు. ఇదే సమయంలో పుతిన్-జెలెన్స్కీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం చాలా కష్టమైన పని అంటూ చెప్పుకొచ్చారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..‘రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ముందుగా కలుస్తారో లేదో చూడాలనుకుంటున్నాను. పుతిన్-జెలెన్స్కీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం.. నూనె వెనిగర్‌ను కలపడం లాంటి కష్టమైన ప్రక్రియ. వారిద్దరూ ఏం చేయబోతున్నారో చూడాల్సి ఉంది. ఒకవేళ సమావేశం జరగకపోతే, ఎందుకు సమావేశం కాలేదో అందుకు గల కారణాలను తెలుసుకుంటానని అన్నారు. శాంతి చర్చలకు రష్యా ఒప్పుకోని క్రమంలో మాస్కో మరోసారి భారీ ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రెండు దేశాల మధ్య శాంతి ప్రయత్నాలపై రెండు వారాల్లో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటాను’ అని చెప్పుకొచ్చారు.Q: “How long will you give Putin?”Trump: “A couple of weeks. We’re going to figure this out. It takes two to tango… In the meantime, people continue to die.”Trump is NEVER going to hold Putin accountable. Ever.pic.twitter.com/TusMVxEIXk— Republicans against Trump (@RpsAgainstTrump) August 22, 2025అయితే ఇరు దేశాలూ యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నాయి. ప్రజలను చంపుకుంటూనే ఉన్నారు. ఇది చాలా మూర్ఖత్వం. యుద్ధం వల్ల వారానికి 7,000 మంది చనిపోతున్నారు. నేను ముందు 5,000 అన్నాను కానీ ఇప్పుడు 7,000 మంది వారానికి చనిపోతున్నారు. అందులో ఎక్కువ మంది సైనికులే ఉన్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. తాజాగా రష్యా క్షిపణి దాడుల్లో ఉక్రెయిన్‌లో ఒక అమెరికన్ కర్మాగారం దెబ్బతిన్నట్టు వచ్చిన వార్తపై స్పందిస్తూ ట్రంప్ స్పందించారు. రష్యా దాడుల విషయంలో తాను సంతోషంగా లేనని చెప్పారు. తాను ఏడు యుద్ధాలను పరిష్కరించానని చెప్పారు. మొత్తం 10 యుద్ధాలు ఆపిన తాను ఉక్రెయిన్- రష్యా యుద్ధం విషయంలో అస్సలు సంతోషంగా లేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్- పాక్ యుద్ధం గురించి ప్రస్తావించారు. ఇండియా–పాకిస్థాన్ మధ్య అణు యుద్ధాన్ని తాను నివారించానని ట్రంప్ పేర్కొన్నారు. -
కాస్త తగ్గిన పుతిన్? ట్రంప్, జెలెన్స్కీ ‘నో’ కామెంట్స్
నాలుగేళ్ల తర్వాత అలస్కా వేదికగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు భేటీ అయ్యారు. ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగానే ఈ సమావేశం జరిగిందన్నది తెలిసిందే. అయితే ఆ మీటింగ్ సారాంశమేమీ ఇప్పటిదాకా బయటకు రాలేదు.ఆగస్టు 15వ తేదీన మూడు గంటలపాటు రహస్య మంతనాలు చేసిన ఈ ఇరుదేశాల నేతలు.. సంయుక్త మీడియా సమావేశంలో తాము చెప్పాలనున్నది చెప్పి తలోదారి వెళ్లిపోయారు. దీంతో భేటీ సంతృప్తికరంగా జరగలేదనే విశ్లేషణలు నడిచాయి. అయితే తాజాగా ఆ భేటీలో ఉక్రెయిన్‌కు పుతిన్ చేస్తున్న(అలస్కాలో చేసిన) డిమాండ్లు ఏంటో ప్రస్తావిస్తూ రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది. రష్యా అధ్యక్ష కార్యాలయం ‘క్రెమ్లిన్’ వర్గాలు వెల్లడించిన ఆ డిమాండ్లను పరిశీలిస్తే..డోన్బాస్ ప్రాంతాన్ని పూర్తిగా అప్పగించడంనాటోలో చేరాలనే ఆలోచనను పక్కనపెట్టేయడంపశ్చిమ బలగాల మోహరింపు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదుఉక్రెయిన్పై ఒత్తిడి తగ్గించిన పుతిన్?వాస్తవానికి ఈ మూడు పాత డిమాండ్లే! మరి కొత్తగా పుతిన్ ఏం చెబుతున్నారంటే.. 2024 జూన్‌లో ఉక్రెయిన్‌కు పెట్టిన కఠినమైన భూభాగాల డిమాండ్లను కొంత మేర తగ్గించినట్టు రష్యా వర్గాలు అంటున్నాయి. పాత డిమాండ్లను పరిశీలిస్తే.. డోనెత్స్క్(Donetsk), లుహాన్స్క్, ఖెర్సన్, జపోరిజ్జియా ప్రాంతాలను పూర్తిగా రష్యాకు అప్పగించాలి. నాటో సభ్యత్వాన్ని త్యజించాలి. పశ్చిమ దేశాల బలగాలు ఉక్రెయిన్‌లో మోహరించకూడదు.కొత్త ప్రతిపాదనల్లో.. ఉక్రెయిన్ డోన్బాస్లో తన నియంత్రణలో ఉన్న భాగాల నుంచి పూర్తిగా వెనక్కి తగ్గాలి. రష్యా జపోరిజ్జియా, ఖెర్సన్ ప్రాంతాల్లో ప్రస్తుత యుద్ధ రేఖలను నిలిపివేస్తుంది. ఖార్కివ్, సుమీ, డ్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతాల్లో రష్యా ఆక్రమించిన చిన్న భాగాలను తిరిగి అప్పగించేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం.. డోన్బాస్లో 88%, జపోరిజ్జియా, ఖెర్సన్‌లో 73% రష్యా నియంత్రణలో ఉంది.అయితే.. నాటో విస్తరణపై నిషేధం, ఉక్రెయిన్ సైన్యంపై పరిమితులు, పశ్చిమ శాంతి బలగాల మోహరింపు నిషేధం వంటి పాత డిమాండ్లు మాత్రం కొనసాగుతున్నాయి. అదే సమయంలో.. 2022 ఇస్తాంబుల్ ఒప్పందాలను పునరుద్ధరించే అవకాశం కూడా పరిశీలనలో ఉంది. ఇందులో ఐరాస భద్రతా మండలి నుంచి ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు పొందే ప్రతిపాదన ఉంది.ఈ ప్రతిపాదనపై ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ఇంకా స్పందించలేదు. గతంలో ఈ డిమాండ్లను "సరెండర్" (లొంగిపోవడం)గా అభివర్ణించిన తెలిసిందే. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ, రష్యా ప్రతిపాదించిన శాంతి ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉక్రెయిన్ భూభాగాల నుంచి వెనక్కి తగ్గే ఆలోచనను పూర్తిగా తిరస్కరించారు.డోనెత్స్క్, లుహాన్స్క్(Donetsk) కలిపిన డోన్బాస్ ప్రాంతం ఉక్రెయిన్‌కు రక్షణ కోటగా పనిచేస్తుందని జెలెన్స్కీ మొదటి నుంచి చెబుతున్నారు. ‘‘తూర్పు ప్రాంతాల నుంచి వెనక్కి తగ్గడం అంటే దేశం ఉనికి కోల్పోవడం’’ అని అంటున్నారాయాన. ‘‘ఇది మా శక్తివంతమైన రక్షణ రేఖల అంశం’’ అని కుండబద్దలు కొట్టారు. ఇక.. నాటో సభ్యత్వం.. రాజ్యాంగబద్ధ లక్ష్యమని చెప్పారు. పైగా దీనిని ఉక్రెయిన్‌కు భద్రతా హామీగా భావిస్తున్నారు. నాటో సభ్యత్వంపై నిర్ణయం తీసుకునే హక్కు రష్యాకు లేదు అని జెలెన్స్కీ స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే.. వైట్ హౌస్, నాటో రష్యా కొత్త ప్రతిపాదనలపై ఇప్పటివరకైతే స్పందించలేదు.అలాస్కాలోని అంకరేజ్ నగరంలో జరిగిన అమెరికా-రష్యా అధ్యక్షులు భేటీ తర్వాత శాంతికి ఉత్తమ అవకాశాలు ఏర్పడినట్టు క్రెమ్లిన్ వర్గాలు అంటున్నాయి. అయితే.. డోన్బాస్ నుంచి ఉక్రెయిన్ వెనక్కి తగ్గడం రాజకీయంగా, వ్యూహపరంగా అసాధ్యమైన విషయని పరిశీలకులు అంటున్నారు. రెండు పక్షాలకు అంగీకారయోగ్యంగా లేని షరతులతో శాంతి ప్రతిపాదనలు చేయడం.. ట్రంప్‌కు షో మాత్రమే కావొచ్చని అభిప్రాయపడుతున్నారు.అస్పష్టతలు & అడ్డంకులుఉక్రెయిన్ డోన్బాస్ను అప్పగించేందుకు సిద్ధంగా ఉందా? అనే అంశంపై రష్యాకు స్పష్టత లేదు.అమెరికా రష్యా ఆక్రమించిన భూభాగాలను గుర్తిస్తుందా? అనే ప్రశ్న కూడా ఇంకా పరిష్కారమవ్వలేదు.జెలెన్స్కీ అధికార బాధ్యతపై పుతిన్ సందేహాలు వ్యక్తం చేశారు, కానీ కీవ్ ఆయనను చట్టబద్ధమైన అధ్యక్షుడిగా పేర్కొంటోంది.ట్రంప్ పాత్రఉక్రెయిన్ యుద్ధం ముగించి.. తానొక శాంతి కాముకుడిననే విషయం ప్రపంచానికి చాటి చెప్పాలని ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే పుతిన్, జెలెన్స్కీలతో విడిగా భేటీ అయిన ఆయన.. రష్యా-ఉక్రెయిన్-అమెరికా త్రైపాక్షిక సమావేశం ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు. -
పుతిన్‌తో జైశంకర్ భేటీ
మాస్కో: భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గురువారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమయ్యారు. రాజధాని మాస్కోలో జరిగిన ఈ సమావేశంలో భారత్–రష్యా సంబంధాలపై వారు చర్చించుకున్నట్లు సమాచారం. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ప్రతీకారంగా భారత ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో పుతిన్‌తో జైశంకర్ సమావేశమై చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పుతిన్‌తో భేటీ అనంతరం జైశంకర్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఉక్రెయిన్ విషయంలో తాజా పరిణామాలను తనతో పంచుకున్నందుకు పుతిన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలిపానని చెప్పారు. రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెనిస్ మంతురోవ్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో తన భేటీ వివరాలను పుతిన్‌కు వివరించానని స్పష్టంచేశారు. -
ట్రంప్ ఓవరాక్షన్.. భారత్‌కు రష్యా బంపరాఫర్
మాస్కో: భారత్–రష్యా సంబంధాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా నానాటికీ బలపడుతున్నాయని రష్యా సీనియర్ దౌత్యవేత్త, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రొమన్ బాబుష్కిన్ చెప్పారు. భారత ఉత్పత్తులకు తమ మార్కెట్ ద్వారాలు తెరిచి ఉన్నట్లు స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో అమెరికాకు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.రొమన్ బాబుష్కిన్ బుధవారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తొలుత హిందీలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. ‘ఇక ప్రారంభిద్దాం.. శ్రీగణేషుడే ప్రారంభిస్తున్నాడు’ అని విలేకరులను ఉద్దేశించి చెప్పారు. భారత్–రష్యా సంబంధాలకు పరస్పర విశ్వాసమే మూలస్తంభమని పరోక్షంగా స్పష్టంచేశారు. అమెరికాతోపాటు పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి రష్యా–ఇండియా–చైనా(ఆర్ఐసీ) మధ్య చర్చలు, పరస్పర సహకారాన్ని పునరుద్ధరించుకొనే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు.‘మిత్రులను’ అవమానించేందుకు కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుకాడటం లేదని మండిపడ్డారు. ‘రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తే తప్పేమిటి? దీనిపై పశ్చిమ దేశాలే సమాధానం చెప్పాలి. భారత్ మాకు చాలా ముఖ్యమైన దేశం. భారత్‌కు చమురు సరఫరాను తగ్గించే ప్రతిపాదన ఏదీ లేదు’ అని బాబుష్కిన్ తేల్చి చెప్పారు. దీంతో, అమెరికాకు రష్యా గట్టి సమాధానం చెప్పినట్టు అయ్యింది.భారత్‌కు 5 శాతం రహస్య తగ్గింపుమరోవైపు.. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి భారత్ పరోక్షంగా అండగా నిలుస్తోందని ట్రంప్ కన్నెర్ర చేస్తున్న వేళ ముడి చమురు కొనుగోలుపై భారత్‌కు ఐదు శాతం రహస్య తగ్గింపు(డిస్కౌంట్) ఆఫర్ చేస్తున్నట్లు భారత్‌లోని రష్యా డిప్యూటీ వాణిజ్య ప్రతినిధి ఎవ్‌గెనీ గ్రీవా బుధవారం వెల్లడించారు. ఇది వాణిజ్య సీక్రెట్ అని చెప్పడం గమనార్హం. ఈ ఐదు శాతం డిస్కౌంట్లో అప్పుడప్పుడు స్వల్ప మార్పులు ఉంటాయన్నారు. రష్యా నుంచి చమురు కొనే భారత వ్యాపారవేత్తలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని పేర్కొన్నారు. చమురు విషయంలో షిప్పింగ్, బీమా సంబంధిత అంశాలను పరిష్కరించడానికి ఒక యంత్రాంగం ఉన్నట్లు తెలిపారు. ఇండియా చమురు అవసరాల్లో ఏకంగా 40 శాతం రష్యానే తీరుస్తోందని ఎవ్‌గెనీ గ్రీవా వివరించారు. బ్యారెల్‌కు 5 శాతం చొప్పున డిస్కౌంట్ ఇస్తున్నామని చెప్పారు. ఇండియా ప్రతిఏటా 250 మిలియన్ టన్నుల ఆయిల్ దిగుమతి చేసుకుంటోందని, ఇందులో 40 శాతం రష్యా చమురే ఉంటోందని స్పష్టంచేశారు. -
జెలెన్స్కీతో మాట్లాడతా
వాషింగ్టన్: ఉక్రెయిన్ యుద్ధానికి ఆఖరి గడియలు దగ్గర పడిన సంకేతాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై ఆక్రమణాగ్రహంతో రగిలిపోతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు కాస్తంత మెత్తబడినట్లు తెలుస్తోంది. ఈ వాదనకు బలం చేకూరుస్తూ పుతిన్ స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరిపేందుకు అంగీకరించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మంగళవారం ప్రకటించారు. మంగళవారం అమెరికాలో ఫాక్స్ న్యూస్ వార్తాసంస్థకు ఇచి్చన ప్రత్యేక ఇంటర్వ్యూలో రూబియో ఈ విషయం వెల్లడించారు.‘‘జెలెన్స్కీతో భేటీకి తాను ఇప్పుడు ఆసక్తి కనబరుస్తున్నట్లు స్వయంగా పుతిన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఫోన్లో చెప్పారు. ఖచి్చతంగా జెలెన్స్కీని కలుస్తానని ట్రంప్‌కు పుతిన్ మాటిచ్చారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత జెలెన్స్కీతో పుతిన్ భేటీకి సమ్మతి తెలపడం శాంతిస్థాపన బాటలో కీలక ముందడుగు. అయితే జెలెన్స్కీ, పుతిన్ భేటీ అయ్యాక వెంటనే ఇద్దరు మంచి మిత్రులుగా మారతారని నేను అనుకోవట్లేదు. భేటీ జరిగిందంటే ఏకంగా శాంతి ఒప్పందం కుదిరిందని ఇప్పుడే భావించడం తొందరపాటే అవుతుంది. ఎన్నో అంశాలపై స్పష్టతరావాల్సి ఉంది.మరెన్నో అంశాలపై విస్తృతస్థాయి చర్చ జరగాల్సి ఉంది. గత మూడున్నరేళ్ల యుద్దకాలంలో రష్యా, ఉక్రెయిన్ ఉన్నతాధికారులు సంయమనంతో మాట్లాడుకున్నదే లేదు. ఈ ధోరణే ఇన్నాళ్లూ రణరంగంలో మరింత రక్తంచిందేలా చేసింది. మరణాలు, మారణహోమాలకు యుద్ధం చిరునామాగా మారింది. కానీ ఇప్పుడు కాస్తంత సుహృద్భావ వాతావరణంలో ఇరు దేశాల ఉన్నతాధికారులు మాటలు కలిపారు. తొలుత పుతిన్, జెలెన్స్కీ ముఖాముఖి భేటీ ఉంటుంది. ఇది సత్ఫలితాలనిస్తే ఆ తర్వాత ఇరునేతలకు ట్రంప్ జతకూడుతారు. అప్పుడు త్రైపాక్షిక సమావేశం సాకారమవుతుంది’’అని రూబియో అన్నారు. ఇరుపక్షాలకు అనువైన చోటే భేటీ: ట్రంప్ జెలెన్స్కీ, పుతిన్‌లకు అనువైన ప్రదేశంలోనే త్రైపాక్షిక సమావేశం నిర్వహిస్తామని ట్రంప్ చెప్పారు. ఈ మేరకు ఆయన తన సొంత సోషల్ మీడియా మాధ్యమం ట్రూత్‌సోషల్‌లో ఒక పోస్ట్ పెట్టారు.‘‘సోమవారం మధ్యాహ్నం శ్వేతసౌధానికి విచ్చేసిన విశిష్ట అతిథులతో చక్కని సమావేశం జరిగింది. ఐరోపా సమాఖ్య సభ్యదేశాల అగ్రనేతలతో సంయుక్త భేటీలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నాం. త్రైపాక్షిక సమావేశం నిర్వహించాలన్న మా ఉమ్మడి నిర్ణయాన్ని వెంటనే పుతిన్‌కు ఫోన్‌చేసి చెప్పా. ఆయన అందుకు సమ్మతించారు.త్వరలోనే ఈ భేటీ ఉంటుంది. జెలెన్స్కీ, పుతిన్‌కు అనువైన నగరంలోనే తొలుత వాళ్లిద్దరూ సమావేశమవుతారు. ఇది చక్కటి ఫలితాన్నిచ్చాకే నేను వాళ్లతో కలిసి త్రైపాక్షి సమావేశాన్ని నిర్వహిస్తా. ఈ భేటీకి సాకారం చేసేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి రూబియో, నా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ చెమటోడుస్తున్నారు’’అని ట్రంప్ అన్నారు. -
సంధి సాధ్యమేనా?!
పరస్పరం కలహించుకుంటున్న రష్యా, ఉక్రెయిన్ల మధ్య సంధి కుదర్చటానికీ, సామరస్యం సాధించటానికీ అలాస్కా శిఖరాగ్ర సమావేశానికి వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చివరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అనధికార అధికార ప్రతినిధిగా మారి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. కాల్పుల విరమణకు రష్యా అంగీకరించకపోతే కఠినాతికఠినంగా వ్యవహరిస్తామని అలాస్కా సమావేశానికి ముందు హెచ్చరించిన ఆయన... కాల్పుల విరమణ వల్ల ప్రయోజనం లేదని, శాంతి ఒప్పందం కోసం చర్చలు జరగాలని చెబుతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోమవారం వైట్‌హౌస్‌లో తనను కలిసినప్పుడు సైతం ఇలాంటి సలహాయే ఇచ్చారు. దీన్ని ఏదో మేరకు సరిదిద్ది, ఉక్రెయిన్‌కు కనీస భద్రత గ్యారెంటీనైనా సాధించాలన్న ధ్యేయంతో ఆరుగురు యూరొప్ దేశాల నేతలు ట్రంప్‌తో భేటీ అయ్యారు. అమెరికాతో పాటు రష్యా, ఉక్రెయిన్లు పాల్గొనే త్రైపాక్షిక చర్చలకు సుముఖంగా ఉన్నామని ట్రంప్ చెప్పటం ఉన్నంతలో ఊరటనిచ్చే అంశం. కానీ ట్రంప్ దానికైనా కట్టుబడతారా లేదా... పుతిన్‌ను ఒప్పించగలరా లేదా అన్నది చెప్పలేం. జెలెన్స్కీకి మొన్న ఫిబ్రవరిలో వైట్‌హౌస్‌లో ఎదురైన చేదు అనుభవాలను నివారించి, ఆయన వెనక యూరప్ దేశాలన్నీ ఉన్నాయని చెప్పటానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మెక్రాన్, జర్మనీ ఛాన్స్లర్ ఫ్రెడెరిక్ షుల్జ్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తదితరులు కలిశారు. కానీ అందువల్ల ప్రయోజనం ఏమిటన్నది ప్రశ్నార్థకం. ఉక్రెయిన్‌కు ‘నాటో తరహా’ భద్రత కల్పించటానికి ట్రంప్ అనుకూలమే గానీ అదంతా యూరప్ దేశాలే చూసుకోవాలట. తమ వంతుగా గగనతల రక్షణ విషయంలో సాయంగా నిలుస్తారట! అసలు యూరప్ దేశాలకు ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ ఏం చేస్తారనే ఆదుర్దా కన్నా ఆయన నాటో పక్షాన ఉంటారా ఉండరా అనే బెంగ ఎక్కువైంది. జెలెన్స్కీతో మళ్లీ ఆయన లడాయికి దిగితే అటుతర్వాత తాము సైతం మాట్లాడే స్థితి ఉండకపోవచ్చన్న భయంతోనే యూరప్ అధినేతలు వైట్‌హౌస్‌కు వెళ్ళినట్టు కనిపిస్తోంది. కోల్పోయిన భూభాగాల గురించీ, నాటో సభ్యత్వం గురించీ మరిచిపోవాలని తొలుత తనను కలిసిన జెలెన్స్కీకి చెప్పటంతో పాటు యూరప్ దేశాధినేతల ముందు కూడా ట్రంప్ ఆ మాటే అనటం గమనించదగ్గది. ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన నాటి నుంచీ పుతిన్ చెప్పిన మాటల్నే ట్రంప్ ఇప్పుడు వల్లిస్తున్నారు. చాలా అంశాల్లో పుతిన్‌కూ, తనకూ ఏకాభిప్రాయం కుదిరిందని ఆ శిఖరాగ్ర సమావేశం అనంతరం ఆయన ఇప్పటికే ప్రకటించారు. పుతిన్ దాదాపు పన్నెండేళ్ల క్రితం ఆక్రమించిన క్రిమియాలో పలు పట్టణాలు, నదులూ, పర్వతశ్రేణులూ ఉన్నాయి. విలువైన పంటభూములున్నాయి. ఇవిగాక మూడున్నరేళ్లకు పైగా సాగుతున్న దురాక్రమణ యుద్ధంలో ఆక్రమించుకున్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలున్నాయి. వీటిని వదులుకోవటమంటే జెలెన్స్కీకి ఆత్మహత్యా సదృశం. అయినా తమ కోసం ట్రంప్ ఎంతో చేస్తున్నారని ప్రశంసించి, ఆయనకు కృతజ్ఞతలు చెప్పాల్సి వచ్చింది. జెలెన్స్కీకి అంతకన్నా గత్యంతరం లేదు. ఉక్రెయిన్‌కి ప్రస్తుతం అందుతున్న సాయంలో 47 శాతం వాటా అమెరికాదే. జర్మనీ 9, బ్రిటన్ 8, జపాన్ 6 శాతాలతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కెనడా, నెదర్లాండ్స్, స్వీడన్, ఫ్రాన్స్ వంటివి ఒకటి, రెండు శాతాలకు మించి ఇవ్వడం లేదు. అందుకే జెలెన్స్కీ నోరెత్తలేకపోతున్నారు.అమెరికా గత పాలకుల ప్రాపకంతో ఉక్రెయిన్ను రెచ్చగొట్టి, రష్యాతో గిల్లికజ్జాలకు దిగేలా చేసిన యూరప్ దేశాలకు ఇప్పుడు ఏం చేయాలో పాలుబోని దుఃస్థితి. నెలక్రితం ట్రంప్‌తో మాట్లాడాక అంతా సామరస్యంగా పరిష్కారమైందని, ఉక్రెయిన్ విషయంలో తమను సంప్రదించకుండా ఆయన ఏ నిర్ణయమూ తీసుకోబోరని యూరప్ దేశాధినేతలు నమ్మారు. అలాస్కా శిఖరాగ్రానికి వారం రోజుల ముందు కూడా వారంతా ట్రంప్‌ను కలిశారు. ఆ భేటీకి జెలెన్స్కీని కూడా తీసుకెళ్లారు. ముందు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావాలనీ, ఆ తర్వాతే ద్వైపాక్షికమో, త్రైపాక్షికమో చర్చలుండాలనీ ఆ భేటీలో అందరూ అభిప్రాయపడ్డారు. తాజాగా ట్రంప్ త్రైపాక్షిక చర్చల గురించి మాట్లాడుతున్నా పుతిన్ అందుకు సుముఖంగా ఉంటారా అన్న సంశయం అందరినీ పీడిస్తోంది. ఆ మాటెలా ఉన్నా అలాస్కా శిఖరాగ్రం భారత్‌కు ఎంతో కొంత మేలు చేసిందని చెప్పాలి. రష్యాపై ఆగ్రహంతో మనపై 50 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించిన ట్రంప్ ఆ విషయంలో వెనక్కు తగ్గే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు చెబుతున్న మాటకు కట్టుబడి సాధ్యమైనంత త్వరలో త్రైపాక్షిక చర్చలకు ట్రంప్ చొరవ తీసుకుంటే... పుతిన్‌ను ఒప్పిస్తే అది శాంతికి దోహదపడుతుంది. -
శాంతి సాధనలో మూడు ముక్కలాట
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ నెల 15న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో, 18 నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు యూరోపియన్ నాయ కులతో జరిపిన చర్చలు ఆశాభావాన్ని కలిగిస్తున్నాయి. అందుకు సంబంధించి ఉండిన చివరి అనుమానాలు 18 నాటి వైట్ హౌస్ సమావేశంతో తీరిపోయాయి. అంతకుముందు 15న అలాస్కాలో ట్రంప్, పుతిన్‌ల మధ్య జరిగిన చర్చలలో కనిపించిన సానుకూలతను జెలెన్స్కీతో పాటు యూరోపియన్ నాయకులు వైట్‌హౌస్ సమావేశంలో భంగపరచవచ్చుననే సందేహా లుండేవి. శాంతి ప్రయత్నాలకు ముందు కాల్పుల విరమణ జరిగి తీరాలనే పట్టుదలతో ఉండిన ఆ బృందం, ట్రంప్ ఆలోచనను తిరిగి మార్చవచ్చుననే భావన చాలా మందికి కలిగింది. కానీ, అది గ్రహించి కావచ్చు 18 నాటి చర్చలకు ముందు రాత్రే ట్రంప్, కేవలం కాల్పుల విరమణ వల్ల ఉపయోగం లేదనీ, పూర్తి స్థాయిలో శాంతి కోసం ప్రయత్నం జరగాలనీ స్పష్టం చేశారు.పుతిన్ వాదనను అంగీకరించిన ట్రంప్అంతిమంగా అలాస్కా, వైట్ హౌస్ భేటీల సారాంశం ఏమిటి? మూడేళ్లుగా సాగుతున్న యుద్ధంపై అమెరికా, రష్యా అధ్యక్షులు మొదటిసారి సమావేశమయ్యారు. వెంటనే కాల్పుల విరమణకు పుతిన్‌ను ఒత్తిడి చేయగలనని, అందుకు సమ్మతించని పక్షంలో తీవ్ర మైన చర్యలు తీసుకోగలనంటూ వెళ్లారు ట్రంప్. అక్కడ మూడు గంటల చర్చలలో పుతిన్ ఇచ్చిన సుదీర్ఘమైన వివరణలతో పూర్తిగా సంతృప్తి చెంది, కాల్పుల విరమణ వల్ల ప్రయోజనం లేదని,సంపూర్ణ స్థాయిలో శాంతి సాధనే సరైన మార్గమనే వాదనతో అంగీ కరించారు. చంచల స్వభావిగా పేరున్న ఆయన అటువంటి అభిప్రా యంపై స్థిరపడటం ఈ కథాక్రమంలోని కీలకమైన మలుపు. పుతిన్ వాదన నచ్చినప్పటికీ అట్లా స్థిరపడక పోయి ఉంటే, యూరోపియన్ల సమావేశంలో తన ఆలోచనను తిరిగి మార్చుకునే వారేమో! అపుడు విషయం మళ్లీ మొదటికి వచ్చేది. జర్మనీ ఛాన్స్లర్ ఫ్రెడరిక్ షుల్జ్, యూరోపియన్ నాయకుల తరఫున మాట్లాడుతూ, శాంతి చర్చల కన్నా ముందు కాల్పుల విరమణ తప్పనిసరియని వాదించారు. కానీ ట్రంప్ జర్మనీ ఛాన్స్లర్ మాటను తోసిపుచ్చారు.ఈ ఒక్క విషయమే ఇంతగా చెప్పుకోవటం ఎందుకంటే, ఈ దశలో మొత్తం విషయమంతా అమెరికా అధ్యక్షుడు ఎవరి వాదనను అంగీకరించి ముందుకు పోగలరన్న దానిపైనే ఆధారపడి ఉంది. ఇపుడు రెండు చర్చల అనంతరం అందుకు స్పష్టత వచ్చినందున ఇతర విషయాలను చూద్దాము. అవి ప్రధానంగా మూడు. ఒకటి– రష్యా కోరుతున్న భూభాగాలను ఉక్రెయిన్ వదలుకోవటం; రెండు– ఉక్రెయిన్ ‘నాటో’లో చేరకపోవటం; మూడు– ఉక్రెయిన్‌కు భవిష్యత్తులో భద్రత కోసం రక్షణ హామీలు లభించటం. ఈ మూడు అంశాలు కూడా అలాస్కాలో, వైట్ హౌస్‌లో ప్రస్తావనకు వచ్చాయి. రష్యా తాను ఇప్పటికే పూర్తిగానో, పాక్షికంగానో ఆక్రమించిన క్రిమియా, డొనెటెస్క్, జపోరిజిజియా, ఖేర్సాన్, లుహాన్స్క్, ఖార్కివ్ ప్రాంతాలను తమకు అప్పగించటం, ఆ యా నియంత్రణ రేఖలను అదే స్థాయిలో స్తంభింపజేయటం జరగాలని కోరుతున్నది. అవి అన్నీ కాకపోయినా ఏదో ఒక మేరకు వదులుకోవాలని ట్రంప్ మొదటినుంచి అంటున్నారు. యూరోపియన్ నాయకుల వైఖరి ఇంచుమించు అదే! వైట్ హౌస్ చర్చల సందర్భంలో అవుననక, కాదనక... అది జెలెన్స్కీ తేల్చుకోవలసిన విషయమని వదలి వేశారు. భూభాగాలను వదలుకొనే ప్రసక్తి లేదని జెలెన్స్కీ అంటూనే, అది తనకు, పుతిన్‌కు, ట్రంప్‌కు మధ్య త్రైపాక్షిక చర్చ లలో తేలుతుందని మరొకవైపు సూచిస్తున్నారు. ఈ పరిణామాల న్నింటినీ పరిగణనలోకి తీసుకున్నపుడు, రష్యా డిమాండ్లలో ఒకటి కొలిక్కి రాగల అవకాశాలు సూత్రరీత్యా కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ ‘నాటో’లో చేరకూడదు...‘నాటో’లో ఉక్రెయిన్ సభ్యత్వం విషయానికి వస్తే, రష్యా డిమాండ్‌కు అమెరికా అధ్యక్షుడు మొదటి నుంచీ సానుకూలంగా ఉన్నారు. అసలు ఉక్రెయిన్ ఆ సంస్థలో చేరాలనుకోవటమే రష్యా అభద్రతా భావానికి, ఈ దాడికి మూల కారణమని కూడా అన్నారు. అటువంటి వైఖరి తీసుకున్న తర్వాత ఇక ఉక్రెయిన్ ఆ సైనిక కూట మిలో చేరగల అవకాశం ఉండదు. వాస్తవానికి అందులో చేరాలనే మాట ఉక్రెయిన్ రాజ్యాంగంలో లాంఛనంగా ఉన్నప్పటికీ, ఆ పట్టుదల యూరోపియన్ దేశాలదే! రష్యాను క్రమంగా చుట్టుముట్టి, ఛిన్నాభిన్నం చేయాలన్నది వారికి గతం నుంచి గల దీర్ఘకాలిక ప్రణాళిక. అయితే, ఈ ఒప్పందాల క్రమంలో ఉక్రెయిన్ తామిక ‘నాటో’లో చేరబోమంటూ రాజ్యాంగపరంగా ప్రకటించవలసి ఉంటుందన్నది రష్యా డిమాండ్. అది జరగాలని ట్రంప్ కూడా ఒత్తిడి చేయవచ్చు. అదే జరిగితే యూరోపియన్ నాయకులు చేయ గలిగింది ఉండదు. ఆ విధంగా శాంతి సాధనకు మరొక అడ్డంకి తొలగిపోతుంది. ఉక్రెయిన్‌లోని రష్యన్ జాతీయుల హక్కుల పరి రక్షణ వంటి మరికొన్ని అంశాలు ఉన్నాయి గానీ, ఇతరత్రా గల ప్రధాన సమస్యలు పరిష్కారమైనపుడు అవీ కావచ్చు.ఉక్రెయిన్‌కు ఆందోళనకరంగా ఉన్న ప్రధానాంశం తమ రక్షణ. చర్చలలో రష్యా అధ్యక్షుడు మొట్టమొదటిసారిగా అందుకు కొన్ని సడలింపులు చూపటం శాంతి సాధనకు మార్గాన్ని సుగమం చేసింది. అక్కడ ట్రంప్‌తో పుతిన్ మాట్లాడుతూ, ఉక్రెయిన్‌కు భద్రత ఏర్పడటం తప్పనిసరి అవసరమని, అక్కడి ప్రజల మూలాలూ తమ ప్రజల మూలాలూ ఒకటేనని, కనుక వారికి రక్షణ ఏర్పాట్లకు ఎటు వంటి అభ్యంతరమూ లేదని అన్నారు. ఆ భద్రత ఏ రూపంలోన న్నది ప్రశ్న. ‘నాటో’లో చేరేందుకు వీలు లేదన్న పుతిన్ డిమాండ్‌ను ట్రంప్ అంగీకరించారు. అట్లా చేరకపోయినా 5వ ఆర్టికల్‌ను పోలిన రక్షణలు కల్పించగలమని ట్రంప్ సూచించగా అందుకు పుతిన్ సమ్మతించారు. ఆర్టికల్ 5 అనే మాట ప్రచారంలోకి వచ్చినట్లు అందులోని వివరాలు ప్రచారంలోకి రాలేదు గానీ, అవి గమనించ దగ్గవి. నాటోలోని ఏ దేశంపై అయినా బయటి దేశం దాడి జరిపితే అది మొత్తం నాటో కూటమిపై జరిగిన దాడిగా పరిగణించి అందరూ ఆ దేశానికి మద్దతుగా కదలివస్తారు. కానీ దాని అర్థం అందరూ యుద్ధంలో ప్రవేశిస్తారని కాదు. ఎవరు ఏ రూపంలో పాల్గొంటారన్నది వారి నిర్ణయం. ఉక్రెయిన్ నాటోలో లేకపోయినా అమెరికా సహా అందరూ తమ తమ సహాయాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో గుర్తించవలసింది మరొకటి ఏమంటే, ఉక్రెయిన్‌కు అంద జేసే ఆయుధాలన్నీ ఖరీదుకేగానీ ఉచితంగా కాదు. వైట్‌హౌస్ చర్చలు సానుకూలంగా ఉన్నట్లు భావించిన ట్రంప్ ఆ వెంటనే పుతిన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఇక ఇరుపక్షాలూ సన్నద్ధమైతే మొదట రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య ద్వైపాక్షికంగా, తర్వాత అమెరికా అధ్యక్షుని చేరికతో త్రైపాక్షికంగా చర్చలు జరుగు తాయి. శాంతి దిశగా అడుగులైతే పడుతున్నాయి. ఇందుకు తిరిగి ఏ భంగమూ కలగదని ఆశించాలి.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీతో భేటీ అనంతరం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్, జెలెన్స్కీ ఇరువురు సమావేశమయ్యేందుకు అమెరికా ఏర్పాట్లు చేస్తోందంటూ పేర్కొన్నారు. సుమారు నాలుగేళ్ల యుద్ధాన్ని ముగించేందుకు ఇది కీలక అడుగుగా అభివర్ణించిన ఆయన.. దీర్ఘకాలికశాంతి కోసం ప్రయత్నిస్తామన్నారు.‘‘ వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, జర్మనీ ఛాన్స్లర్ ఫ్రెడిరిక్ మెర్జ్, యూరోపియన్ కమిషన్ ఉర్సులా వాండెర్లెయన్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టెతో జరిగిన చర్చలు అద్భుతంగా ముగిశాయి. వాషింగ్టన్ సమన్వయంతో యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు అందించాలనే దానిపైనే చర్చలు ప్రధానంగా సాగాయి. రష్యా, ఉక్రెయిన్లతో శాంతి నెలకొనబోతుందనే విషయంపై నేతలందరూ సంతోషం వ్యక్తం చేశారు. చర్చల ముగింపులో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో నేను ఫోన్ కాల్లో మాట్లాడాను. జెలెన్స్కీ, పుతిన్ మధ్య భేటీ నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. వీరి భేటీ ఎక్కడ జరగాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వీరి సమావేశం ముగిసిన తర్వాత వారితో కలిసి నేను భేటీ అవుతాను. సుమారు నాలుగేళ్ల యుద్ధం ముగించేందుకు ఇదొక మంచి ముందడుగు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ సమన్వయంతో రష్యా, ఉక్రెయిన్ల మధ్య సమావేశం జరగనుంది’’ అని ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే భేటీ ఎప్పుడు.. ఎక్కడ నిర్వహిస్తారనేదానిపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు.. వైట్‌హౌజ్‌లో ట్రంప్-జెలెన్స్కీ, ఈయూ నేతల భేటీపై రష్యా ఇంకా స్పందించాల్సి ఉంది.అంతకు ముందు.. భేటీ ముగిశాక ట్రంప్‌తో జరిగిన చర్చలపై జెలెన్స్కీ సంతోషం వ్యక్తం చేశారు. చాలా నిర్మాణాత్మకంగా భేటీ జరిగిందని.. భద్రతా హామీలతో సహా పలు సున్నిత విషయాలపై మాట్లాడినట్లు తెలిపారు. త్రైపాక్షిక భేటీకి తాము సిద్ధమేనంటూ పేర్కొన్నారాయన. అదే సమయంలో జెలెన్స్కీతో పాటు వచ్చిన యూరోపియన్ నేతలు ట్రంప్‌తో చాలా కీలక విషయాలపై చర్చించారు. ఎవరేమన్నారంటే.. రష్యా, ఉక్రెయిన్, అమెరికా మధ్య త్రైపాక్షిక సమావేశం, సెక్యూరిటీ గ్యారంటీలు చర్రితలో నిలిచిపోయే కీలక ముందడుగుగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అభివర్ణించారు. రష్యాతో సమావేశానికి ముందే కాల్పుల విరమణ జరగాలని జర్మన్ ఛాన్స్లర్ ఫ్రెడరిక్ మెర్జ్ పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పునేందుకు రష్యాపై ఒత్తిడి తేవాలని పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ మాట్లాడుతూ.. ట్రంప్ త్రైపాక్షిక సమావేశంపై చర్చించారని, అయితే దీన్ని విస్తృతం చేసి యురోపియన్ నేతను ఆ భేటీకి అనుమతించాలని ప్రతిపాదించారు. ఇది యూరప్ మొత్తానికి సంబంధించిన విస్తృత భద్రతా హామీలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుందన్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మాట్లాడుతూ ఈ వివాదం మళ్లీ తలెత్తకుండా ఎలా నిర్ధారించుకోవాలని ప్రశ్నించారు. శాంతి ఒప్పందానికి ఇది ముందస్తు షరతు అని పేర్కొన్నారు. ఉక్రెయిన్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసే దాడులను అడ్డుకోవాలని అందుకు మిత్రపక్షాలు కలిసిరావాలని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టె పేర్కొన్నారు.ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇదివరకే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఇరు దేశాల నేతల ప్రకటనలతో.. ఆ చర్చల్లో అంతగా పురోగతి కనిపించలేదన్న విమర్శ వినిపించింది. పైగా అలస్కా భేటీలో పుతిన్ పెట్టిన భూభాగాల మార్పిడి షరతును జెలెన్స్కీ వ్యతిరేకించడంతో.. వైట్‌హౌజ్ చర్చలూ విఫలం కావొచ్చని అంతా భావించారు. అదే సమయంలో.. ఈ ఏడాదిలోనే వైట్‌హౌజ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి చేదు అనుభవం ఎదురైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌లు జెలెన్స్కీ విరుచుకుపడ్డారు. ఈ తరుణంలో అంచనాలకు భిన్నంగా తాజా భేటీ ప్రశాంత వాతావరణంలో.. అదీ యూరోపియన్ నేతల సమక్షంలో జరగడం గమనార్హం. -
కొన్ని మారవు! యుద్ధం ఆపడం ఇక..: ట్రంప్
పుతిన్ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీతో ఉక్రెయిన్ శాంతి చర్చలు జరపబోతున్నారు. అయితే దానికంటే కొన్ని గంటల ముందు ఆయనో కీలక ప్రకటన చేశారు. జెలన్స్కీ కాస్త తగ్గి.. కాంప్రమైజ్ కావాలన్న రీతిలోనే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారాయన. రష్యా నుంచి క్రిమియాను తిరిగి పొందడం, ఉక్రెయిన్ నాటోలో చేరడం ఈ రెండూ అసాధ్యమేనని ట్రంప్ ఆ పోస్టులో స్పష్టం చేశారు. ‘‘తలుచుకుంటే జెలెన్స్కీ వెంటనే రష్యాతో యుద్ధాన్ని ముగించవచ్చు. లేదంటే యుద్ధాన్ని కొనసాగించవచ్చు. 12 ఏళ్ల కిందట ఒక్క తూటా పేలకుండానే ఒబామా క్రిమియా భూభాగాన్ని రష్యాకు అప్పజెప్పారు. అలాగే నాటోలోనూ ఉక్రెయిన్ చేరడం వీలుకాదు. కొన్ని ఎన్నటికీ మారవు అనే విషయాన్ని గుర్తించాలి’’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలస్కా వేదికగా ట్రంప్ మూడు రోజుల కిందట అలస్కాలో భేటీ అయ్యారు. అయితే కాల్పుల విరమణ విషయంలో పుతిన్ అస్సలు తగ్గలేదని తెలుస్తోంది. యుద్ధవిరామం గురించి కాకుండా.. భూభాగాల మార్పిడిపైనే ప్రధానంగా చర్చలు జరిగాయి. పుతిన్ ప్రతిపాదన ప్రకారం.. క్రిమియాపై సర్వాధికారాలు రష్యావే. అలాగే ఉక్రెయిన్ నాటోలో చేరకూడదు అనే షరతులు ఉన్నాయి. అయితే జెలెన్స్కీ మాత్రం రక్షణపరంగా కీలక ప్రాంతాలైన తూర్పు భూభాగాల ఉపసంహరణను తిరస్కరిస్తూనే శాంతి చర్చలకు సిద్ధమయ్యారు. అలస్కా సమావేశం తర్వాత.. ట్రంప్ జెలెన్స్కీతో పాటు యూరోపియన్ నేతలతోనూ ఫోన్లలో మాట్లాడారు. పుతిన్‌తో జరిగిన చర్చల సారాంశాన్ని వాళ్లను చేరవేశారాయన. అంతేకాదు.. శాంతి చర్చల్లో పురోగతి కనిపించిందని కూడా ప్రకటించారు. వైట్‌హౌజ్‌లోని తన ఓవెల్ ఆఫీస్‌లోనే జెలెన్స్కీతో ట్రంప్ సోమవారం భేటీ కాబోతున్నారు. జెలెన్స్కీ గతంలో అమెరికాకు ఒంటరిగా వెళ్లి.. ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేత లైవ్‌లో తిట్లు తిన్నారు. ఈ క్రమంలో.. ఈసారి జెలెన్స్కీతో పాటు బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్, జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే తదితరులు వాషింగ్లన్ వెళ్తారని సమాచారం. ఉక్రెయిన్ భద్రతా హామీలతో పాటు రష్యాపై ఆంక్షలు కొనసాగించాలని వీళ్లంతా ట్రంప్‌ను ఒత్తిడి చేయనున్నట్లు తెలుస్తోంది. బెదిరింపుల నుంచి బతిమాలేదాకా.. రష్యాపై ఆంక్షలు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై నేరుగా విమర్శలు.. ఉక్రెయిన్ యుద్ధం ఆపే క్రమంలో ట్రంప్ మొదటి నుంచి చేసుకొస్తోంది ఇదే. బెదిరింపులతోనే ఇరు దేశాధినేతలను దారికి తేవాలని ట్రంప్ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే అవేవీ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ట్రంప్ సహనం కట్టలు తెంచుకున్నా.. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేకపోయింది. ఈ క్రమంలో అలస్కా భేటీ తర్వాత ట్రంప్ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. పుతిన్ టఫ్గాయ్.. ఇక అంతా జెలెన్స్కీ చేతుల్లోనే ఉందంటూ వ్యాఖ్యానించారాయన. అయితే యూరోపియన్ దేశాల ప్రొత్సహంతో జెలెన్స్కీ కూడా ఈ విషయంలో అస్సలు తగ్గడం లేదు. దీంతో ట్రంప్ బతిమాలింపు దిశగా ప్రయత్నాలు చేయబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తర్వాత.. త్రైపాక్షికం?పుతిన్, జెలెన్స్కీలతో కలిసి ట్రంప్ త్రైపాక్షిక సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. గ్జిన్హువా మీడియా సంస్థతో జర్మన్ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ మాట్లాడుతూ.. ఆగస్టు 22వ తేదీన ఈ భేటీ ఉండనుందని, జెలెన్స్కీ-ట్రంప్ భేటీ తర్వాత దీనిపై ఓ స్పష్టత వస్తుందని చెప్పారు. అయితే రష్యా, ఉక్రెయిన్ ఈ ప్రకటనపై ఎలాంటి స్పందన తెలియజేయలేదు. ట్రంప్ ప్రతిపాదన ప్రకారం.. డోన్బాస్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలి. బదులుగా యుద్ధ విరామంతో పాటు ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు దక్కుతాయి. -
ఉక్రెయిన్ను ఇరుకున పెట్టిన పుతిన్.. జెలెన్స్కీతో ట్రంప్ కీలక భేటీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం(అమెరికా కాలమానం ప్రకారం) జెలెన్స్కీతో వైట్‌హౌస్‌లో భేటీ కానున్నారు. పుతిన్‌తో భేటీ వివరాలు, ప్రతిపాదనలను ఆయన ముందుంచనున్నారు. భేటీ విజయవంతమైతే ఈయూ దేశాల అగ్ర నేతలతోనూ ట్రంప్, జెలెన్స్కీ సమావేశం అవుతారు. ఈ నేపథ్యంలో యుద్ధం ఎలా మొదలైందో ఓసారి గుర్తు తెచ్చుకోవాలని జెలెన్స్కీకి ట్రంప్ సూచించినట్టు సమాచారం. ఇక, శాంతి ఒప్పందానికి పుతిన్.. ట్విస్ట్ ఇస్తూ కీలక ప్రతిపాదన చేసినట్టు తెలిసింది.డోన్బాస్ ఇచ్చేయండి..డోన్బాస్ తూర్పు ప్రాంతాలైన డొనెట్స్క్, లుహాన్స్క్పై పుతిన్ అజమాయిషీ కోరుతున్నట్టు జెలెన్స్కీకి ట్రంప్ చెప్పారని సమాచారం. అవిచ్చేస్తే యుద్ధం ఆపేస్తానని పుతిన్ ప్రతిపాదించినట్టు వివరించారు. అందుకు జెలెన్స్కీ ఒప్పుకోలేదని తెలుస్తోంది. సోమవారం ముఖాముఖిలో ఇందుకు జెలెన్స్కీని ఒప్పించాలని ట్రంప్ భావిస్తున్నారు. తూర్పు డోన్బాస్ అంశమే శాంతి ఒప్పందానికి కీలకమని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. తూర్పు డోన్బాస్ను ఇచ్చేశాక పుతిన్ తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపేసినా, తమపై రష్యా భావి దండయాత్రకు అదే కారణంగా మారవచ్చ అనేది జెలెన్స్కీ ఆందోళనగా కనిపిస్తోంది.మరోవైపు.. డొనాల్డ్ ట్రంప్‌తో భేటీకి ఒంటరిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని పంపేందుకు ఐరోపా నేతలు భయపడుతున్నారు. ఫిబ్రవరిలో ట్రంప్‌ను కలిసేందుకు అమెరికా వెళ్లిన జెలెన్స్కీకి వైట్‌హౌస్‌లో చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. మూడో ప్రపంచయుద్ధం వచ్చేలా చేయొద్దంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ట్రంప్ ఆ భేటీలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఈసారి జెలెన్స్కీకి తోడుగా బ్రిటన్ ప్రధాని స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ తదితరులు పాల్గొంటారు. ఇక, ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరకున్నా అదే తరహాలో రక్షణ హామీ ఇచ్చేందుకు ట్రంప్ ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నట్టు ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డీర్ లేయిన్ చెప్పారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు అలాస్కా వేదికగా ట్రంప్, పుతిన్ మధ్య రెండున్నర గంటలకు పైగా జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. -
ఇవే ప్రశ్నలు వీళ్లిద్దరినీ కాకుండా.. ఆయన్ని అడిగే దమ్ముందా?
ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగింది. శాంతి చర్చల్లో ముందడుగు పడకపోతే కఠినంగా వ్యవహరిస్తానంటూ రష్యాపై రంకెలు వేసిన ట్రంప్.. అలస్కా చర్చల తర్వాత కాస్త మెత్తబడ్డాడు. ఉక్రెయిన్ శాంతి చర్చలు అర్ధరహితంగా ముగిసినట్లు వాళ్ల ప్రకటనలను బట్టి స్పష్టమవుతోంది. ఈ క్రమంలో.. ట్రంప్ ఇంకా అలస్కాలో ఉండగానే పుతిన్ అక్కడి నుంచి నిష్క్రమించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే..అలస్కాలో జర్నలిస్టులు సంధించిన ప్రశ్నలను ఇరు దేశాల అధినేతలు స్వీకరించలేదు. తాము చెప్పాలనుకున్నది చెప్పి.. తలోదారి వెళ్లిపోయారు. యాంకరేజ్ విమానాశ్రయంలో, అలాగే చర్చలు ప్రారంభం కావడానికి ముందు పీస్ రూమ్‌లోనూ ఇరు దేశాధినేతలు మీడియా ముందు ఆసీనులయ్యారు. ఆ సమయంలో ఉక్రెయిన్ కాల్పుల విరమణ, యుద్ధంలో సాధారణ పౌరులు మరణించడం లాంటి ప్రశ్నలు పుతిన్‌కు ఎదురయ్యాయి. ‘‘సాధారణ పౌరుల్ని చంపడం ఇంకెప్పుడు ఆపుతారు?’’ అంటూ ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా.. దానికి పుతిన్ తనకేమీ వినబడడం లేదన్నట్లు సైగ చేసి చూపించారు. అదే సమయంలో ‘‘ట్రంప్ మిమ్మల్ని మాత్రమే ఎందుకు నమ్ముతున్నారు?’’ అని మరో విలేఖరి ప్రశ్నించగా.. జర్నలిస్టుల గోలతో పుతిన్ ఇచ్చిన వివరణ వినిపించనట్లే కనిపించింది. పుతిన్‌పై అంతర్జాతీయ నేరస్థుల కోర్టు కేసు ఉన్నప్పటికీ.. అమెరికా భూభాగంలోకి ఎందుకు ఆహ్వానించారు?. ఉక్రెయిన్ను నేరుగా భాగం కానీయకుండా కాల్పులవిరమణ డీల్ కుదర్చాలని ట్రంప్ భావిస్తున్నారా?. పుతిన్ ఎలాంటి రాయితీలు ఇవ్వవచ్చు? ట్రంప్ ఏమి అంగీకరించవచ్చు? ఇది యుద్ధ విరామానికి దారి తీస్తుందా? లేదంటే రాజకీయ నాటకం మాత్రమేనా? అని ప్రశ్నలు గుప్పించారు. అయితే వీటిలో వేటికి సమాధానాలు రాలేదు. దీంతో.. సోషల్ మీడియా సదరు జర్నలిస్టుల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది. ఇవే ప్రశ్నలను గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహును అడిగే దమ్ముందా? అని నిలదీస్తోంది. ‘‘2023 అక్టోబర్ 7వ తేదీన గాజా యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటిదాకా 60 వేలమందికిపైనే మరణించారు. అందులో 70 శాతం మహిళలు, చిన్నారులే ఉన్నారని నివేదికలు గణాంకాలతో సహా చెబుతున్నాయి. అయితే ఈ మరణాలపై నెతన్యాహు ఏనాడూ స్పందించగా పోగా.. కనీసం విచారం కూడా వ్యక్తం చేసింది లేదు. పైగా ఎంతసేపు హమాస్ అంతమే శాంతికి మార్గం అంటూ చెబుతూ వస్తున్నారు. దీనికి తోడు మానవతా సాయం అందకుండా చేశారనే ఆరోపణలు ఆయపై ఉన్నాయి. ఈ క్రమంలో యుద్ధ నేరాల కింద అంతర్జాతీయ న్యాయస్థానం నెతన్యాహుపై వారెంట్ సైతం జారీ చేసింది.ఈ పరిణామాలపై ఇటు ఇజ్రాయెల్.. అటు అమెరికా జర్నలిస్టులెవరూ ఆయన్ని ప్రశ్నించే సాహసం చేయలేకపోయారు. మరోవైపు.. రెండుసార్లు నెతన్యాహు అమెరికా పర్యటనకు వచ్చారు. ఆ సమయంలోనూ జర్నలిస్టులెవరూ.. గాజా పౌరుల మరణాల గురించి ఎందుకు నిలదీయలేదు?’’ అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇదిలా ఉంటే.. 2022 ఫిబ్రవరిలో మొదలైన ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో లక్షల మంది మరణించారు. మూడున్నరేళ్ల యుద్ధానికి పుల్‌స్టాప్ పెట్టే ఉద్దేశంలో పర్సూయింగ్ పీస్ పేరిట అలస్కా చర్చల్లో పాల్గొన్నారు. ట్రంప్-పుతిన్‌లు ఐదారుగంటలు అలస్కాలోనే గడపగా.. రెండున్నర గంటలపాటు చర్చలు జరిగాయి. అయితే.. ఉక్రెయిన్ కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు పట్టుబట్టగా.. అందుకు రష్యా అధినేత ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. Vladimir Putin’s reaction was nothing short of remarkable—reporters shouted, but his expression told its own story. pic.twitter.com/07vkASuJIc— Tarique Hussain (@Tarique18386095) August 15, 2025భేటీకి ముందు జర్నలిస్టుల ప్రశ్నలకు స్పందించని ఇరువురు నేతలు.. సంయుక్తంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లోనూ మీడియా ప్రతినిధులను ప్రశ్నలకు అనుమతించలేదు. మరోవైపు.. అలస్కా చర్చల సారాంశం కోసం రష్యా అధికారుల బృందాన్ని పలువురు జర్నలిస్టులు కలిసే ప్రయత్నమూ విఫలమైంది. అదే సమయంలో.. ట్రంప్ తన అనుకూల రిపోర్టర్లతో పుతిన్‌పై ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేశారని, దాని నుంచి పుతిన్ భలేగా తప్పించుకున్నారనే వాదన నెట్టింట నడుస్తోంది... అలస్కాలో ట్రంప్ దౌత్యం విఫలమేనని కొన్ని అమెరికన్ మీడియా చానెల్స్ ప్రముఖంగా చర్చిస్తున్నాయి. కానీ, ట్రంప్ మాత్రం ఎంతో కొంత పురోగతి సాధించాం అని చెబుతుండడం గమనార్హం. ‘‘పుతిన్ చాలా టఫ్, స్ట్రాంగ్ ఫెల్లో. ఇక దారికి రావాల్సింది జెలెన్స్కీనే’ అన్నట్లు ఫ్యాక్స్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. ఇంకోవైపు.. అలస్కాలో ట్రంప్-పుతిన్ భేటీలో రష్యా అనుకూల ఏకపక్ష డీల్ కుదరనందుకు సంతోషమంటూ ఉక్రెయిన్ ఎద్దేవా ప్రకటన విడుదల చేసింది. -
వీడియో: ట్రంప్ ఓవరాక్షన్ ప్లాన్.. పుతిన్‌నే భయపెట్టే ప్రయత్నం!
అలాస్కా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ కలిసిన వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ఎంత బలమైన దేశమో.. చెప్పేందుకు పుతిన్‌కు చూపించాలనే ఉద్దేశ్యంతో ట్రంప్ పెద్ద ప్లానే చేశారు. పుతిన్‌ను ట్రంప్ ఆహ్వానిస్తున్న సమయంలో స్టెల్త్ బాంబర్లు, ఫైటర్ జెట్స్ విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు వెళ్లారు. ఈ సందర్భంగా విమానం దిగిన పుతిన్‌కు ట్రంప్ ఘన స్వాగతం పలికారు. అయితే, వారిద్దరూ ముందుకు సాగుతున్న సమయంలో అనూహ్యంగా స్టెల్త్ బాంబర్లు, F-22, F-35 ఫైటర్ జెట్లువిమానాలు గాల్లో దర్శనమిచ్చాయి. ఆకాశంలో ఎగురుతూ కనిపించాయి. దీంతో, ట్రంప్ చప్పట్లు కొడుతూ.. పుతిన్‌తో ఏదో మాట్లాడారు. మరోవైపు.. పుతిన్ మాత్రం వాటిని చూస్తూ ముందుకు కదిలారు.Trump flies a B-2 over Putin’s head in a show of strength, look at the Trump’s body language, it’s all about dominance pic.twitter.com/cleGOmuedF— Prayag (@theprayagtiwari) August 15, 2025ఇక, ట్రంప్-పుతిన్ సమావేశం జరుగుతున్నంత సేపూ కూడా అవి గాల్లోనే చక్కర్లు కొడుతూ కనిపించాయి. దీని ద్వారా పుతిన్ అమెరికా సైనిక శక్తిని గ్రహించాలని ట్రంప్ భావించారు. గత నెలలో ఇరాన్ అణు కర్మాగారాలను ట్రంప్ సైన్యం ఇదే బీ-2 స్టెల్త్ బాంబర్లను ఉపయోగించి నాశనం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. అందరి కంటే తానే బలవంతుడు, తన దేశమే బలమైన దేశం అని నిరూపించాలని ట్రంప్ ఇలా చేశారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. పుతిన్‌ను హెచ్చరించేందుకే ట్రంప్ ఇలా చేశారని మరి కొందరు అంటున్నారు. 🔥 THIS is how you negotiate.Trump forced Putin and his motorcade to drive past a HUGE lineup of F-22s and attack helicopters on his way to the meeting…… Immediately after buzzing Putin’s head with a B-2 Stealth BomberIt’s pretty obvious who’s in the power position 🇺🇸 pic.twitter.com/0SF8sqDXQr— Nick Sortor (@nicksortor) August 15, 2025Trump made B-2 bombers fly over Putin in Alaska.What an insecure guy! Flexing military muscle for a guest he himself invited after failing to make any impact in Ukraine, like a scared kid trying to look tough with gimmicks. pic.twitter.com/29aFCTEvJD— THE SKIN DOCTOR (@theskindoctor13) August 15, 2025 -
పుతిన్ ఆలోచన అదే.. రష్యాపై విరుచుకుపడిన జెలెన్ స్కీ
కీవ్: అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన భేటీ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్, పుతిన్ జరిపే చర్చల సఫలం కావు అంటూ వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని ముగించే ఉద్దేశ్యం పుతిన్‌కు లేదంటూ విమర్శలు చేశారు. అందువల్లే ఈ భేటీని పుతిన్ వ్యక్తిగత విజయంగా జెలెన్ స్కీ అభివర్ణిస్తున్నారు.అలాస్కా వేదికగా ట్రంప్, పుతిన్ మధ్య భేటీ జరుగుతున్న నేపథ్యంలో జెలెన్ స్కీ స్పందించారు. ఈ సందర్బంగా జెలెన్ స్కీ ట్విట్టర్ వేదికగా వీడియోలో మాట్లాడుతూ.. ఉక్రెయిన్ లేకుండా ట్రంప్, పుతిన్ చర్చలేంటి?. ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్న రోజున కూడా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తున్నాయి. యుద్ధాన్ని ముగించే ఉద్దేశ్యం మాస్కోకు లేదని మరోసారి నిరూపితం అయ్యింది. యుద్ధానికి సరైన ముగింపు ఎలా సాధించాలనే దానిపై ఉక్రెయిన్.. వాషింగ్టన్, యూరోపియన్ మిత్రదేశాలతో చర్చలు జరుపుతోంది. ఆయా దేశాలతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోంది. యుద్ధాన్ని ముగించడానికి ఉక్రెయిన్ సాధ్యమైనంత పనిచేయడానికి సిద్ధంగా ఉంది. మేము అమెరికా నుండి బలమైన స్థానాన్ని ఆశిస్తున్నాము’ అని చెప్పుకొచ్చారు.On the day of negotiations, the Russians are killing as well. And that speaks volumes. Recently, weʼve discussed with the U.S. and Europeans what can truly work. Everyone needs a just end to the war. Ukraine is ready to work as productively as possible to bring the war to an end,… pic.twitter.com/tmN8F4jDzl— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) August 15, 2025ఉక్రెయిన్ డిమాండ్స్ ఇవే?రష్యాతో ఘర్షణలో బాధిత దేశమైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ స్కీ భాగస్వామి చేయకుండా ట్రంప్, పుతిన్ జరిపే చర్చలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఈ కారణంగానే వీరి భేటీని పుతిన్ వ్యక్తిగత విజయంగా జెలెన్స్కీ అభివర్ణిస్తున్నారు.శాంతి చర్చలు జరపాలంటే రష్యా బేషరతుగా కాల్పుల విరమణను ప్రకటించాలన్నది ఉక్రెయిన్ డిమాండ్. రష్యాకు తమ భూభాగాల అప్పగింత ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది.యుద్ధ ఖైదీలను విడుదల చేయాలని, రష్యా అపహరించుకుపోయిన తమ దేశ చిన్నారులను తిరిగి అప్పగించాలని కోరుతోంది.భవిష్యత్తులో తమ దేశంపై రష్యా దాడి చేయకుండా రక్షణలు కల్పించాలని పట్టుబడుతోంది.రష్యాపై విధించిన అంతర్జాతీయ ఆంక్షలను ఒక్కసారిగా కాకుండా క్రమంగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తోంది.అవసరమైతే వాటిని మళ్లీ విధించేందుకు అవకాశం ఉండాలి. మరోవైపు.. అలాస్కా వేదికగా ట్రంప్, పుతిన్ మధ్య జరిగిన కీలక భేటీ ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీ ఎలాంటి ఫలితం తేల్చకుండానే ముగిసిపోయింది. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించినట్టు తెలిపారు. గతంలో ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్‌తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని పుతిన్ మరో మారు పేర్కొన్నారు. ట్రంప్ స్పందిస్తూ.. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించాం. అయితే, కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యురోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు. -
ట్రంప్, పుతిన్ మధ్య ముగిసిన భేటీ.. యుద్ధంపై ట్విస్ట్!
అలాస్కా: అమెరికాలోని అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన కీలక భేటీ ముగిసింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీ.. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసింది. వీరి భేటీపై ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూసినప్పటికీ అనుకున్న ఫలితం మాత్రం దక్కలేదు. అయితే, వీరి మధ్య మరో సమావేశం రష్యాలో జరగనుందని పుతిన్ చివరలో ట్విస్ట్ ఇచ్చారు. కీలక సమావేశం అనంతరం ఇద్దరు నేతలు భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. సమావేశంలో అనేక విషయాలు చర్చకు వచ్చాయి. కానీ, యుద్ధానికి సంబంధించిన తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించాం. అయితే, కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్‌పై సంతకం చేసే వరకు ఒప్పందం కుదరనట్టే అవుతుంది. త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యురోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు. తాను మళ్లీ పుతిన్‌ను కలుస్తానని చెప్పుకొచ్చారు.#WATCH | Alaska, USA | US President Donald Trump says, "We had a very productive meeting, there were many points that we agreed on. Couple of big ones that we haven't quite gotten there but we made some headway. There's no deal until there's a deal so I will call up NATO in a… pic.twitter.com/mY5t9zkoCT— ANI (@ANI) August 15, 2025ఇదే సమయంలో డీల్ పూర్తికావడంపై నిర్ణయం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేతుల్లోనే ఉంది. ఒప్పందం చేసుకోవాలని జెలెన్స్కీకి సూచిస్తా. కానీ, వాళ్లు అందుకు నిరాకరించే అవకాశం ఉంది. రష్యా చాలా శక్తిమంతమైన దేశం. పుతిన్-జెలెన్స్కీల సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నా. అందులో నేను కూడా చేరే అవకాశం ఉందన్నారు. పుతిన్‌తో ఏయే విషయాలు చర్చించారు..? ఇంకా మిగిలి ఉన్న అంశాలు ఏంటనే విషయంపై వివరించేందుకు ట్రంప్ నిరాకరించారు. #WATCH | Alaska, USA | Russian President Vladimir Putin says, "... We see the strive of the administration and President Trump personally to help facilitate the resolution of the Ukrainian conflict and his strive to get to the crux of the matter to understand this history is… pic.twitter.com/kiOKgw2JBf— ANI (@ANI) August 15, 2025అనంతరం, పుతిన్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్‌నకు ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయితీగా ఉన్నట్లు తెలిపారు. గతంలో ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్‌తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని పుతిన్ మరో మారు పేర్కొన్నారు. ఈ సమావేశం వివాదానికి ముగింపు పలకడానికి ప్రారంభ స్థానంగా అభివర్ణించారు. ట్రంప్‌తో తనకున్న సంబంధం వ్యాపారం లాంటిదని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాల విషయాలలో క్లిష్టకాలంలో అధ్యక్షుడు ట్రంప్‌తో మాస్కో మంత్రి సంబంధాలు ఏర్పరచుకుందని పుతిన్ వెల్లడించారు. కాగా, తదుపరి సమావేశం మాస్కోలో అని పుతిన్ పేర్కొన్నారు.#WATCH | Alaska, USA | "Next time in Moscow," says Russian President Vladimir Putin as US President Trump thanks his counterpart for today's meeting."... I could see it happening," replies President Trump.Source: The White House/ YouTube pic.twitter.com/N3U6Rygllj— ANI (@ANI) August 15, 2025 పుతిన్‌కు ఘన స్వాగతం..ఇదిలా ఉండగా.. అమెరికాలోని అలస్కా ఈ సమావేశానికి వేదికైంది. అమెరికా తరఫున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ శాఖ మంత్రి మైక్రో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, రష్యా తరఫున విదేశాంగ శాఖ మంత్రి సర్గెయ్ లావ్రోవ్, విదేశాంగ విధాన సలహాదారు యురి యుషకోవ్ పాల్గొన్నారు. ఇరు దేశాల నుంచి ముగ్గురు చొప్పున పాల్గొన్నారు. తొలుత ట్రంప్, పుతిన్ మధ్యే చర్చలు జరుగుతాయని వార్తలు వచ్చినప్పటికీ ఇరుదేశాల ప్రతినిధుల బృందం ఈ భేటీలో పాల్గొంది. వీరి భేటీ ముగిసినట్లు వైట్‌హౌస్, క్రెమ్లిన్లు ప్రకటించాయి.#WATCH | Alaska, USA | US President Donald Trump and Russian President Vladimir Putin exchange greetings in Anchorage, ahead of their talks.Source: Reuters pic.twitter.com/mdGoQe6qqx— ANI (@ANI) August 15, 2025 అంతకు ముందు తొలుత ఇద్దరు నేతలు అలాస్కాలోని యాంకరేజ్‌కు చేరుకున్నారు. అక్కడ పుతిన్‌కు ట్రంప్ స్వాగతం పలికారు. ఇరువురు నేతలు ట్రంప్‌కు చెందిన వాహనంలో సమావేశాని భవనానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఇరువురు నేతలను మీడియా పలు ప్రశ్నలు అడిగినప్పటికీ సమాధానం చెప్పకుండానే వెళ్లారు. ప్రపంచ దేశాలన్నీ ఈ భేటీని అత్యంత ఆసక్తిగా గమనించాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో కథ మళ్లీ ముందుకే వచ్చింది. #WATCH | Alaska, USA | US President Donald Trump and Russian President Vladimir Putin share the same car to reach the venue for their talks. Source: Reuters pic.twitter.com/X9YkJvqb6g— ANI (@ANI) August 15, 2025 -
చర్చలు విఫలమైతే మరిన్ని టారిఫ్‌లు
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్, పుతిన్ మధ్య అలస్కాలో శుక్రవారం జరిగే చర్చలు విఫలమైతే భారత్‌పై అదనపు టారిఫ్‌లు విధించే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెసెంట్ తేల్చిచెప్పారు. ట్రంప్, పుతిన్ చర్చల ద్వారా ఫలితంపైనే టారిఫ్‌లపై తుది నిర్ణయం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఒకవేళ సానుకూల ఫలితాలు రాకపోతే భారత్‌పై సుంకాల మోత తప్పదని వెల్లడించారు. రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు ఇండియాపై సెకండరీ టారిఫ్‌లు విధిస్తామన్నారు. అప్పటికీ రష్యా దారికి రాకపోతే సెకెంటరీ టారిఫ్‌లు మరింత పెరుగు తాయని స్పష్టంచేశారు. భారత్ గనుక ముడి చమురు కొనడం ఆపేస్తే రష్యాపై ఒత్తిడి పెరుగు తుందని అమెరికా అంచనా వేస్తోంది. భారత్ ఉత్పత్తులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే 50 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. -
ఎవరి పంతం నెగ్గుతుందో!
ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలికి, శాంతి దూతగా పేరు సంపాదించాలన్నదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంతం. యుద్ధంలో ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాలను తమదేశంలో సంపూర్ణంగా విలీనం చేసుకొని, చట్టబద్ధత కల్పించుకోవాలన్నదే రష్యా అధినేత పుతిన్ ఆశయం. రెండు భిన్నమైన లక్ష్యాల సాధన కోసం ట్రంప్, పుతిన్ శుక్రవారం అలస్కాలో సమావేశం కాబోతున్నారు. ఇరువురు నేతల భేటీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధానంగా ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ముగించడంపైనే చర్చలు జరుగుతాయని పైకి చెబుతున్నా.. తెరవెనుక ఇతర అంశాలూ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమ అధీనంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాల విషయంలో పుతిన్ పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. అలస్కా భేటీతో ఇరువురు నేతలు ఆశిస్తున్నదేమిటో చూద్దాం.. అందుకే అలస్కా వేదిక ఉక్రెయిన్‌పై దండయాత్ర కొనసాగిస్తున్న పుతిన్‌ను ప్రపంచంలో ఏకాకిగా మార్చేందుకు పశ్చిమ దేశాలు చేసిన ప్రయత్నాలు చాలావరకు విఫలమయ్యాయి. అమెరికా నుంచి రష్యాను దూరం చేసేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. అమెరికా వద్ద తన ప్రతిష్ట స్థిరంగా చెక్కుచెదరకుండా ఉందని నిరూపించుకోవాలని పుతిన్ భావిస్తున్నారు. ఇందుకోసం అలస్కా సమావేశాన్ని అవకాశంగా వాడుకోవాలని నిర్ణయించారు. అంతర్జాతీయ రాజకీయాల్లో తన పట్టు ఏమాత్రం సడలలేదని ట్రంప్‌తో భేటీ ద్వారా పుతిన్ సంకేతం ఇవ్వబోతున్నారు. సమావేశానికి వేదికగా అలస్కాను ఎంచుకోవడం వెనుక ఒక వ్యూహం ఉంది. అలస్కాకు చేరుకోవాలంటే ఇతర దేశాల గగనతలం గుండా ప్రయాణించాల్సిన అసవరం లేదు. ఎవరినో అనుమతి కోరాల్సిన పనిలేదు. రష్యా నుంచి నేరుగా అలస్కాకు చేరుకోగలరు. అలస్కాను 19వ శతాబ్దంలో రష్యా పాలకులు అమెరికాకు విక్రయించారు. 21వ శతాబ్దంలో కొన్ని సరిహద్దుల్లో బలవంతంగా చేసిన మార్పులను సమర్థించుకోవడానికి అలస్కాను వేదికగా పుతిన్ ఎంచుకున్నారు. దేశాల సరిహద్దులు మార్చడం, భూభాగాల యజమానులు మారడం సాధారణ విషయమేనని ఆయన చెప్పదలిచారు. అలాగైతేనే కాల్పుల విరమణ ఉక్రెయిన్తోపాటు యూరోపియన్ దేశాల అధినేతలను పుతిన్ పక్కనపెట్టారు. ప్రత్యక్షంగా అమెరికాతోనే చర్చలకు సిద్ధమయ్యారు. ఇతర దేశాల పరిగణనలోకి తీసుకోవడం లేదు. చర్చలైనా, ఒప్పందమైనా అమెరికాతోనే అంటున్నారు. ఈ విషయంలో ఉక్రెయిన్ అభ్యంతరాలు వ్యక్తం చేసినా పుతిన్ పట్టించుకోలేదు. తాము ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాలను రష్యాలో అంతర్భాగంగా అంతర్జాతీయ సమాజం గుర్తించాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు. అలాగైతేనే ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణకు సిద్ధమని చెబుతున్నారు. అయితే, పుతిన్ డిమాండ్‌ను ఉక్రెయిన్ వ్యతిరేకిస్తోంది. కబ్జాదారులకు తమ భూమి ఇవ్వబోమని ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ తెగేసి చెప్పారు. ఆక్రమిత ప్రాంతాలను రష్యాలో భాగంగా అధికారికంగా గుర్తించేలా ట్రంప్‌పై ఒత్తిడి పెంచాలన్నదే పుతిన్ వ్యూహంగా కనిపిస్తోంది. మొదట అమెరికా గుర్తిస్తే తర్వాత ఇతర దేశాలపైనా ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. ఆక్రమిత ప్రాంతాలను వదులుకోకుంటే ఆర్థిక సాయం నిలిపివేస్తామంటూ అమెరికా బెదిరిస్తే ఉక్రెయిన్ దారికి రావడం ఖాయమని పుతిన్ వాదిస్తున్నారు. ఆర్థిక బంధం బలపడుతుందా? అమెరికా–రష్యా మధ్య ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలపైనా ట్రంప్, పుతిన్ చర్చించబోతున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన రష్యాపై అమెరికా కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ ఆంక్షలను సడలించి, ఆర్థిక బంధాన్ని బలోపేతం చేసుకొనే దిశగా ఇరువురు నేతలు ఏదైనా ఒప్పందానికి వచ్చే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం రష్యా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటోంది. అమెరికా సాయంతో గట్టెక్కాలన్న ఆలోచనలో పుతిన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపడానికి పుతిన్ అంగీకరిస్తే రష్యాకు ఆర్థికంగా అండగా ఉండడానికి ట్రంప్ ముందుకు రావొచ్చు. యుద్ధానికి ఫుల్స్టాప్ పెట్టకపోతే తీవ్ర పరిణామాల ఉంటాయని ట్రంప్ తాజాగా రష్యాను హెచ్చరించడం గమనార్హం. అంటే ఈ విషయంలో ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. శుక్రవారం జరిగే భేటీలో పుతిన్‌ను ఆయన ఒప్పించడం ఖాయమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. యుద్ధాన్ని ఆపేసి శాంతి దూతగా నోబెల్ శాంతి బహుమతి స్వీకరించాలని ట్రంప్ ఆరాపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యుద్ధం ఆపనంటే తీవ్ర పరిణామాలు
వాషింగ్టన్/బెర్లిన్: ఉక్రెయిన్‌పై పుతిన్ దండయాత్రను ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. శుక్రవారం అమెరికా పరిధిలోని అలస్కాలో పుతిన్‌తో భేటీకి మరికొద్ది గంటలే ముగిలి ఉండగా ఆలోపే పుతిన్‌ను హెచ్చరిస్తూ ట్రంప్ వ్యాఖ్యానాలు చేయడం గమనార్హం. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జర్మనీ చాన్స్‌లర్ ఫ్రెడరిక్ మెర్జ్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంయుక్తంగా యురోపియన్ యూనియన్ సభ్యదేశాల అగ్రనేతలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో ట్రంప్ సైతం వర్చువల్‌గా భేటీ అయి రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించారు. ‘‘ శుక్రవారం అలస్కాలో పుతిన్‌తో భేటీ సవ్యంగా సాగుతుందని భావిస్తున్నా. యుద్ధాన్ని ఆపబోనని పుతిన్ గనక చెబితే రష్యా తీవ్ర పర్యావసానాలను ఎదుర్కోక తప్పదు. రెండో దఫా ఆంక్షలను విధంచాల్సి ఉంటుంది. ఒకవేళ భేటీ సత్ఫలితాలనిస్తే వెంటనే పుతిన్, జెలెన్స్కీల మధ్య భేటీని నిర్వహించేందుకు సిద్ధపడతా. ఇరువురి భేటీలో నన్ను అనుమతిస్తే నేనూ భాగస్వామినవుతా’’ అని ట్రంప్ అన్నారు. వర్చువల్ భేటీలో జెలెన్‌స్కీసహా యురోపియన్ యూనియన్ సభ్యుదేశాల అగ్రనేతలతోనూ ట్రంప్ మాట్లాడారు. జెలెన్స్కీతో వర్చువల్ భేటీ అద్భుతంగా సాగిందని ట్రంప్ అన్నారు. -
ట్రంప్, పుతిన్ ఏకాంత చర్చలే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ ఈ నెల 15న అలస్కాలో భేటీ కాబోతున్నారు. ఈ భేటీ అత్యంత గోప్యంగా జరుగబోతోందని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. సమావేశం జరిగే గదిలో ట్రంప్, పుతిన్‌తోపాటు ఇద్దరు అనువాదకులు మాత్రమే ఉంటారని తెలిపాయి. ఇంకెవరికీ ప్రవేశం ఉండదని పేర్కొన్నాయి. ఇరువురు నేతలు దాదాపు నాలుగేళ్ల తర్వాత ముఖాముఖి చర్చలు జరుపబోతున్నారు. ఈ చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 2018 జూలై 16న ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీలో ట్రంప్, పుతిన్ మధ్య రెండు గంటలపాటు గోప్యమైన భేటీ జరిగింది. అప్పటి చర్చల్లో పెద్దగా ఏదీ సాధించలేకపోయారు. ఫల వంతం కాలేదు. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. భేటీ తర్వాత ఇరువురు నేతలు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు కూడా అదే తరహాలో గోప్యంగా మాట్లాడుకోవాలని నిర్ణయించుకోవడం పట్ల భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అప్పటిలాగే విఫలమయ్యే అవకాశం లేకపోలేదని విమర్శకులు అంటున్నారు. ట్రంప్, పుతిన్ తోపాటు ఇరుపక్షాల నుంచి ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొంటే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని సూచిస్తున్నారు. కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం పుతిన్‌తో ఏకాంత చర్చలకే ట్రంప్ మొగ్గు చూపడం వెనుక స్పష్టమైన కారణం ఉన్న ట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేలా పుతిన్‌తో గట్టిగా వాదించి, ఒప్పించడానికి ఏకాంత భేటీ దోహదపడు తుందని ఆయన భావిస్తున్నట్లు సమా చారం. ఎందుకంటే చర్చల గదిలో ఇతరు లు కూడా ఉంటే వారు అప్పటికప్పుడు పుతిన్ మనసు మార్చేసి, వెనక్కి లాగే ప్రమాదం లేకపోలేదు. అలాంటి పరిస్థితి లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ట్రంప్ ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. మధ్యవర్తులతో పని కాదన్న అంచనాతో స్వయంగా తానే రంగంలోకి దిగాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. ఉక్రెయిన్‌తో మొదట కాల్పుల విరమణకు, ఆ తర్వాత శాంతి ఒప్పందానికి రష్యా అధినేతను ఎలాగైనా ఒప్పించాలన్నదే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. పుతిన్ విజయమే: బోల్టన్ అలస్కాలో జరిగే భేటీని పుతిన్ విజయంగా డొనాల్డ్ ట్రంప్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ అభివర్ణించారు. సమావేశానికి ట్రంప్‌ను స్వయంగా రప్పిస్తుండడం ద్వారా పుతిన్ ఇప్పటికే పైచేయి సాధించారని అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆపేస్తుందన్న నమ్మకం తనకు లేదని తేల్చిచెప్పారు. అయితే, జాన్ బోల్టన్ వ్యాఖ్యలను ట్రంప్ కొట్టిపారేశారు. అమెరికాకు అపజయం ఉండదని పేర్కొన్నారు. -
భారత్‌పై అమెరికా సుంకాలు.. ఆగమవుతున్న రష్యా ఆర్థిక వ్యవస్థ: ట్రంప్
ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యే వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా-భారత్ వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో.. ఇరు దేశాలవి డెడ్ ఎకానమీ అంటూ గతంలో వ్యాఖ్యానించింది తెలిసిందే. తాజాగా.. భారత్‌పై అమెరికా విధించిన భారీ సుంకాలు రష్యా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బలాంటిదని అభిప్రాయపడ్డారు.వైట్‌హౌజ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘రష్యా ఆర్థిక పరిస్థితి ఏమంత బాగోలేదు. అమెరికా విధిస్తున్న వాణిజ్య ఆంక్షలు, అదే సమయంలో అంతర్జాతీయ ఒత్తిళ్లలతో ఆగమాగమవుతోంది. అదొక విశాలమైన దేశం. అపారమైన సామర్థ్యమూ ఉంది. కాబట్టి తిరిగి తమ దేశ నిర్మాణంపై దృష్టి పెట్టాలి’’ అని సూచించారు. ఈ సమయంలో భారత్ ప్రస్తావన తీసుకొచ్చారాయన..‘‘రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే అతిపెద్ద, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశానికి.. 'మీరు రష్యా నుంచి చమురు కొంటే 50% టారిఫ్ వేస్తాం' అని హెచ్చరించాం. చెప్పినట్లే చేశాం కూడా. ఇది ముమ్మాటికీ రష్యాకు పెద్ద దెబ్బనే’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ చేసిన ఈ ఎకానమీ వ్యాఖ్యలపై రష్యా ఎలా స్పందిస్తుందో చూడాలి.. ఇదిలా ఉంటే.. భారత్ అమెరికాకు మిత్రదేశమేనని, వాణిజ్యం మాత్రం సక్రమంగా లేదని చెబుతూ ట్రంప్ 25 శాతం ప్రతీకార సుంకాలను విధించారు. ఆ సమయంలో రష్యా నుంచి భారత్ చమురు కోనుగోళ్ల నేపథ్యంపైనా ఆయన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ భారత్ వెనకడుగు వేయలేదు. ఆ సమయంలో ఇరు దేశాల తమ డెడ్ ఎకానమీలను మరింత దిగజారచుకుంటున్నాయని.. ఆ అంశాన్ని అమెరికా పట్టించుకునే స్థితిలో లేవని అన్నారు. అటుపై భారత్‌పై మరో 25 శాతం పెనాల్టీ టారిఫ్ విధించడంతో ఆ సుంకాలు 50 శాతానికి చేరాయి. అయితే భారత్ ఈ సుంకాలను అన్యాయంగా పేర్కొంది. అదే సమయంలో.. జాతీయ ప్రయోజనాల దృష్ట్యానే తాము ముందుకు సాగుతామని స్పష్టం చేసింది.మరో పక్క.. తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఐదు యుద్ధాలను ఆపినట్లు ట్రంప్ ప్రకటించుకున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని తానే ఆపుతానంటూ చెబుతూ వస్తున్నారు కూడా. ఈ క్రమంలో.. ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగా ఈ నెల 15వ తేదీన అలస్కాలో ట్రంప్-పుతిన్ భేటీ కానున్నారు. అయితే తమను చర్చల్లో భాగం చేయకుంటే ఆ చర్చలకు అర్థం ఉండదంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ మొదటి నుంచి వాదిస్తున్నారు. ఈ క్రమంలో అలస్కా భేటీలో జెలెన్స్కీకి చోటు ఉంటుందా? లేదంటే ట్రంప్‌తో విడిగా భేటీ అవుతారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. #WATCH | Washington, DC | On Russia-Ukraine war and meeting with Russian President Vladimir Putin, US President Donald Trump says, "This could have been a third world war... I thought it was very respectful that the president of Russia is coming to our country, as opposed to us… pic.twitter.com/rrOyuRkFTG— ANI (@ANI) August 11, 2025 -
పుతిన్, ట్రంప్ భేటీ 15న
వాషింగ్టన్: ప్రపంచ దేశాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ భేటీకి వేదిక, తేదీ ఖరారయ్యాయి. ఈ నెల 15వ తేదీన అలస్కాలో ఇరువురు నేతలు సమావేశం కాబోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఈ విషయం స్వయంగా వెల్లడించారు. పుతిన్‌తో తన భేటీ గురించి శనివారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వచ్చే శుక్రవారం రష్యా అధ్యక్షుడిని కలుసుకోబోతున్నట్లు తెలిపారు. ఇద్దరు నేతలు ముఖాముఖి సమావేశం అవుతుండడం నాలుగేళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం. ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ముగించే దిశగా పుతిన్‌ను ట్రంప్ ఒప్పిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై ట్రంప్ టారిఫ్‌ల మోత మోగించారు. భారత ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం సుంకాలు విధించారు. అంతేకాకుండా రష్యా ప్రత్యర్థి దేశమైన ఉక్రెయిన్‌పై సైనిక సాయం భారీగా పెంచబోతున్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలో ట్రంప్, పుతిన్ భేటీ విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అతిపెద్ద యుద్ధం ఉక్రెయిన్–రష్యా సమరమే. దీనికి సాధ్యమైనంత త్వరగా తెరదించాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. పుతిన్‌ను కలుసుకోబోతున్నట్లు ఇటీవల హఠాత్తుగా ప్రకటించి, అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఒకప్పటి రష్యా భూభాగమే అలస్కా పుతిన్, ట్రంప్ సమావేశానికి అలస్కా వేదిక అవుతుండడం మరో విశేష పరిణామం. అలస్కా 1867 దాకా రష్యా సామ్రాజ్యంలో అంతర్భాగమే. అప్పటి జార్ చక్రవర్తి అలెగ్జాండర్–2 ఈ ప్రాంతాన్ని అమెరికాకు విక్రయించారు. బ్రిటిష్ సైన్యం దీన్ని ఆక్రమిస్తుందన్న భయంతో అప్పటికప్పుడు అమ్మకానికి పెట్టారు. ఎకరాకు ఒక డాలర్ చొప్పున అమ్మేసినట్లు చెబుతుంటారు. 19వ శతాబ్దంలో ప్రపంచంలో ఇది అతిపెద్ద రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం అలస్కా భూభాగం విలువ 10 బిలియన్ డాలర్లు(రూ.8.75 లక్షల కోట్లు) ఉంటుందని అంచనా. బంగారం సహా సహజ వనరులకు లోటులేని ప్రాంతం అలస్కా. అమెరికా విస్తీర్ణంలో ఐదింట ఒక వంతు అలాస్కా ఉంటుంది. అలస్కాతో రష్యాకు విడదీయరాని అనుబంధం ఉంది. ఆగస్టు 15న సమావేశం ఎందుకు? ఇక ఇద్దరు కీలక నాయకుల భేటీ కోసం నిర్ణయించిన తేదీకి కూడా చెప్పుకోదగ్గ ప్రాధాన్యం ఉంది. ఆగస్టు 15వ తేదీ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తేదీ అని మనకు తెలుసు. కానీ, ఎక్కువ మందికి తెలియని సంగతి ఏమిటంటే.. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తేదీ ఆగస్టు 15. జపాన్ చక్రవర్తి హిరోహితో లొంగుబాటు ప్రకటనతో ఈ యుద్ధం ముగిసింది. ఈ ఏడాది ఆగస్టు 15న రెండో ప్రపంచ యుద్ధానికి 80 ఏళ్లు పూర్తికాబోతున్నాయి. 1945 ఆగస్టు 15న రెండో ప్రపంచ యుద్ధానికి తెరపడగా సరిగ్గా రెండేళ్లకు ఇండియాకు స్వాతంత్య్రం లభించింది. జపాన్‌లో మిత్రదేశాల సైన్యాన్ని లార్డ్ లూయిస్ మౌంట్‌బాటెన్ ముందుండి నడిపించారు. విజయం చేకూర్చి పెట్టారు. అదే మౌంట్‌బాటెన్ ఇండియా గవర్నర్ జనరల్ హోదాలో 1947లో స్వాతంత్య్ర దినాన్ని ఆగస్టు 15గా నిర్ణయించారు. అది ఆయనకు ఇష్టమైన తేదీ కావడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఆగస్టు 15వ తేదీన పుతిన్, ట్రంప్ కలుసుకోబోతున్నారు. -
ఇక రంగంలోకి ట్రంప్.. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాడా?
ఉక్రెయిన్ శాంతి చర్చల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల భేటీ తేదీ, వేదిక ఖరారు అయ్యింది. ఆగస్టు 15వ తేదీన అలస్కాలో తాను పుతిన్‌తో భేటీ కాబోతున్నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు.నాకు, పుతిన్‌కు మధ్య భేటీ కోసం అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆ సమావేశం వచ్చే శుక్రవారం ఆగస్టు 15వ తేదీన గ్రేట్ అలస్కా స్టేట్‌లో జరగోబోతోంది అని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారాయన. మరోవైపు.. క్రెమ్లిన్ వర్గాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. అయితే ఈ చర్చలతో ట్రంప్ ఏం సాధించబోతున్నారనే విశ్లేషణ ఇప్పటికే మొదలైంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి శాంతి చర్చలు పలు దఫాలుగా జరిగాయి. ఇస్తాంబుల్(టర్కీ)లో చర్చలు జరిగినా, తన రాయబారితో ట్రంప్ స్వయంగా ఇరు దేశాల మధ్య ట్రంప్ సంప్రదింపులు ఇప్పటివరకు శాంతి ఒప్పందం కుదరలేదు. అయితే ఈ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం కనుగొనడం కోసం స్వయంగా ట్రంపే ఇప్పుడు రంగంలోకి దిగబోతున్నారని వైట్‌హౌజ్ అంటోంది. తద్వారా యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడనున్నాయని అంటోంది. భౌగోళికంగా తటస్థ ప్రాంతం కావడం వల్ల ఉక్రెయిన్ చర్చలకు అలస్కా ఎంపిక చేసినట్లు చెబుతోంది. కొసమెరుపు ఏంటంటే.. యుద్ధ రుణభారంతో కుంగిపోయిన పూర్వపు రష్యా సామ్రాజ్యపు అధినేత జార్ అలెగ్జాండర్-2 1867లో అలస్కాను అమెరికాకు 7.2 మిలియన్ డాలర్లకు అమ్మేశాడు. రష్యా డిమాండ్లు• క్రిమియా, డోనెత్స్క్, లుహాన్స్క్ వంటి ప్రాంతాలను ఉక్రెయిన్ వదులుకోవాలని రష్యా కోరుతోంది.• నాటోలో చేరే ఉక్రెయిన్ ఆలోచనను విరమించుకోవాలని రష్యా పట్టుబడుతోంది.ఉక్రెయిన్ వైఖరి• భూభాగాలపై రాజీకి ఉక్రెయిన్ నిరాకరణ• అంతర్జాతీయ మద్దతుతో శాంతి చర్చలు కొనసాగించాలన్న పట్టుదలఇప్పటివరకు రష్యా కాల్పుల విరమణకు అంగీకరించింది లేదు. అమెరికా ప్రతినిధులు జెలెన్స్కీతో కూడిన త్రైపాక్షిక సమావేశాన్ని ప్రతిపాదించినా, రష్యా ఇంకా స్పందించలేదు. మరోవైపు.. పుతిన్ శాంతి చర్చలు నాటకీయంగా మార్చేశారని జెలెన్స్కీ విమర్శిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో.. తమ భాగస్వామ్యం లేకుండా శాంతి చర్చలు జరగడం సరికాదని అంటున్నారాయన. ఈ తరుణంలో.. మొన్నటిదాకా నియంతగా జెలెన్స్కీపై మండిపడ్డ ట్రంప్, ఇప్పుడు భేటీ కావడానికి సుముఖత వ్యక్తం చేయడం గమనార్హం. తాను ఈ ఏడాది జనవరిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలకాలని ట్రంప్ తీవ్రంగా భావిస్తున్నారు. జెలెన్స్కీని తన దగ్గరకు రప్పించుకున్నప్పటికీ.. విమర్శించి పంపించారే తప్ప చర్చల్లో పురోగతి సాధించలేకపోయారు. ఆపై అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ను ఇరు దేశాలకు పంపించి దౌత్యం నడిపించారు కూడా. ఈ క్రమంలో ఇటు రష్యా డిమాండ్లకు తలొగ్గాలని ఉక్రెయిన్‌కు సూచించడంతో పాటు చర్చల్లో ఉక్రెయిన్ను భాగం చేయాలని ట్రంప్ భావిస్తున్నారు.పుతిన్ స్పందనట్రంప్ ఉంటే అసలు ఈ యుద్ధం జరిగేదే కాదు ట్రంప్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నానుఅమెరికా, రష్యా ప్రశాంతంగా మాట్లాడుకోవాలిజెలెన్స్కీ అభిప్రాయంఅమెరికా నాయకత్వంపై ఆశ ఉంది రష్యా దాడులు ఆగకపోతే శాంతి సాధ్యం కాదుట్రంప్–పుతిన్ చర్చల్లో ఉక్రెయిన్ ఉండాల్సిందేపుతిన్, ట్రంప్ చివరిసారిగా 2018 ఫిన్లాండ్ రాజధాని హెల్సెంకీలో భేటీ అయ్యారు. అలాగే దాదాపు పదేళ్ల తర్వాత పుతిన్ అమెరికాకు రానున్నారు. శాంతి చర్చల్లో ఈ ఇద్దరి భేటీ కీలకం కానుంది. అలాగే ఈ సమావేశం ప్రపంచ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.తనను తాను శాంతికాముకుడిగా ప్రకటించుకున్న ట్రంప్.. ఇప్పటిదాకా పలు దేశాల మధ్య యుద్ధాలను ఆపానంటూ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఈ యుద్ధాన్ని కూడా ఆపేస్తాడా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. అలాగే ఉక్రెయిన్ యుద్ధాన్ని తానే ఆపేస్తానంటూ మొదటి నుంచి ట్రంప్ చెబుతూ వస్తున్నారు. అయితే.. ట్రంప్ ఉక్రెయిన్ శాంతి చర్చల విషయంలో దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. ఆర్థిక ఒత్తిడి, రాయబార చర్చలు, వ్యక్తిగత సంబంధాలు ద్వారా యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. మూడు దేశాల మధ్య సహకారం, నమ్మకం, ప్రామాణిక చర్చలపైనే ఈ సంక్షోభం ముగియడం అనేది ఆధారపడి ఉంటుందన్నది విశ్లేషకుల మాట. -
ఎట్టకేలకు అమెరికా–రష్యా భేటీ
ఎటుచూసినా యుద్ధాలూ, ఊచకోతలూ, దురాక్రమణలూ కనబడుతున్న వర్తమానంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య శిఖరాగ్ర చర్చలు జరగబోతున్నాయన్న కబురు కాస్తంత ఉపశమనం కలిగిస్తుంది. అయితే అలవికాని డిమాండ్లు పెట్టడంలో, మొండి పట్టుదలకు పోవటంలో ఇద్దరికిద్దరే గనుక ఈ చర్చల వల్ల ఒరిగేదేమైనా ఉంటుందా అన్నది సందేహమే. చర్చల ఫలితం మాట అటుంచి, వాటి కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ట్రంప్ ‘త్యాగం’ చేశారా అనే అనుమానాలు అందరిలో తలెత్తాయి. చర్చల తేదీలు ఖరారు కాకపోయినా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో వచ్చేవారం అధినేతలిద్దరూ సమావేశమవుతారని రెండు దేశాల అధికార వర్గాలూ ప్రకటించాయి. ఉక్రె యిన్‌తో కాల్పుల విరమణ పాటించాలంటూ రష్యాకు ట్రంప్ పెట్టిన గడువు శుక్రవారంతో ముగిసింది. చర్చలపై స్పష్టత వచ్చింది గనుక ఈ గడువు విషయంలో ట్రంప్ ఏం చేస్తారన్నది చూడాలి. మూడున్నరేళ్లుగా సాగిస్తున్న యుద్ధాన్ని విరమించమని అధికారంలోకొచ్చింది మొదలు తన సొంత సామాజిక మాధ్యమం ద్వారా రష్యాను బెదిరించటం తప్ప, ట్రంప్ నిర్దిష్టమైన ప్రతిపాదనలు పెట్టింది లేదు. ఆయన దూత స్టీవ్ విట్కాఫ్ రష్యా ఉన్నతాధికార బృందంతో నాలుగు దఫాలు చర్చించిన మాట వాస్తవమే అయినా ఒరిగిందేమీ లేదు. ట్వీట్ల ద్వారా ప్రపంచ సమస్యలు పరిష్కారం కావని ఆర్నెల్ల తర్వాత ట్రంప్‌కు అర్థమైనట్టుంది. అమెరికా విజ్ఞప్తి మేరకు చర్చలు జరుగుతున్నాయని రష్యా ప్రతినిధి చెప్పటం గమనించదగింది. మొన్న ఫిబ్రవరిలో వైట్‌హౌస్‌లో మీడియా సాక్షిగా ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఇష్టానుసారం మాట్లాడారు. అటు తర్వాత జెలెన్స్కీ ఉక్రెయిన్‌లోని విలువైన ఖనిజాలను అమెరికాకు దఖలుపరచటానికి అంగీకరించారు. ఆ తర్వాత నుంచి పుతిన్‌పై అమెరికా ఒత్తిళ్లు తీసుకురావటం మొదలెట్టింది. ట్రంప్‌లో అసహనం పెరుగుతున్నదని తెలిసినా రష్యా వెనక్కి తగ్గలేదు. పుతిన్ లక్ష్యాలు వేరు. ఉక్రెయిన్ను నాటో కూటమికి దూరంగా ఉంచటం, భవిష్యత్తులో నాటో విస్తరణ ఉండబోదన్న హామీ తీసుకోవటం వాటిల్లో ప్రధానమైనవి. రష్యా ఆగ్నేయభాగంలో పాక్షికంగా ఉక్రెయిన్ ఆక్రమించుకున్న ప్రాంతాల నుంచి వైదొలగాలని, దాంతోపాటు ఉక్రెయిన్ నుంచి తమ దళాలు చేజిక్కించుకున్న డొనెట్స్క్తో పాటు మరో నాలుగు ప్రాంతాలూ, 2014లో తాము ఆక్రమించిన దక్షిణ క్రిమియా ద్వీపకల్పం రష్యాకే చెందుతాయని గుర్తించాలని పుతిన్ కోరుకుంటున్నారు. మొత్తంగా ఉక్రెయిన్‌కి చెందిన 1,719 చదరపు కిలోమీటర్ల భూభాగం రష్యా ఆక్రమణలో ఉంది. పుతిన్‌తో సమావేశానికి ట్రంప్ ఎంత తహతహలాడుతున్నారో తాజా పరిణామాలు తెలియజెబుతున్నాయి. అమెరికా, రష్యాల మధ్య ద్వైపాక్షిక చర్చలు కాకుండా, జెలెన్స్కీని కూడా కలుపుకొని త్రైపాక్షిక చర్చలైతేనే సమస్య పరిష్కారం తేలికవుతుందని అమెరికా ప్రతిపాదిస్తూ వచ్చింది. అయితే ఇందుకు రష్యా సుముఖంగా లేదు. ముందు అమెరికా, రష్యాల మధ్య చర్చలు జరిగి, అవి సత్ఫలితాన్నిచ్చాకే త్రైపాక్షిక సమావేశం సంగతి చూడొచ్చని అది చెబుతోంది. కానీ ఇందుకు జెలెన్స్కీ మొదటి నుంచీ వ్యతిరేకం. రష్యా దాడుల పర్యవసానంగా నష్టపోయేది తామైతే... చర్చల్లో తమ ప్రమేయం లేకపోవడమేమిటన్నది ఆయన ప్రశ్న. కానీ నెలలు గడిచాక ఆయన వైఖరి మారింది. శిఖరాగ్ర సమావేశాన్ని స్వాగతిస్తూ తాజాగా జెలెన్స్కీ ట్వీట్ చేశారు. ఆయనకు అంతకన్నా గత్యంతరం లేదు.అమెరికా, రష్యాల మధ్య చివరిగా జో బైడెన్ హయాంలో 2021లో శిఖరాగ్రం జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్లకే పుతిన్ దండయాత్ర మొదలైంది. ఆర్నెల్లుగా చర్చలకు ప్రయత్నాలు చేస్తున్నా ఫలించని నేపథ్యంలో ఇప్పుడెలా సాధ్యమైందన్న ప్రశ్నకు రెండు పక్షాల నుంచీ జవాబు లేదు.ఈ శిఖరాగ్ర సమావేశం తర్వాత ఉక్రెయిన్ను కూడా కలుపుకొని త్రైపాక్షిక చర్చలు సాగిస్తామనిఅంటున్నా అందువల్ల పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. ఘర్షణలకు మూలకారణం నాటో కూటమి, దాన్ని ప్రోత్సహించిన అమెరికా. ఉక్రెయిన్‌లో 2014లో ప్రజామద్దతుతో ఎన్నికైన అధ్యక్షుడు విక్టర్ యెనుకోవిచ్ రష్యాతో సన్నిహితంగా ఉండటాన్ని సహించలేని అమెరికా, నాటోలు... అక్కడ అల్లర్లు రెచ్చగొట్టి ప్రజావిప్లవం సాకుతో ఆయన దేశం విడిచిపోయేలా చేశాయి. అటు తర్వాత జెలెన్స్కీ దేశాధ్యక్షుడయ్యారు. నాటో ప్రాపకంతో రష్యాతో గిల్లికజ్జాలకు దిగింది జెలెన్స్కీయే. కనుక నాటో కూటమి, దాని ద్వారా కథ నడిపించిన అమెరికా తమ వైఖరులు మార్చుకోక తప్పదు. అధినేతగా దేశ ప్రయోజనాల కోసం పాటుబడాలి తప్ప అగ్రరాజ్యాల చేతుల్లో పావుగా మారకూడదని తాజా పరిణామాల తర్వాతైనా జెలెన్స్కీ గ్రహించాల్సి ఉంది. -
ట్రంప్‌కు మరోషాక్.. పుతిన్‌కు మోదీ ఆహ్వానం
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాకిచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. అమెరికా-భారత్‌ల మధ్య నెలకొన్న టారిఫ్‌ల వివాదంతో రష్యాతో వాణిజ్య సంబంధాలకే మోదీ జై కొట్టారు. ఈరోజ(శుక్రవారం, ఆగస్టు 8వ తేదీ) రష్యా అధ్యక్షడు పుతిన్క స్వయంగా ఫోన్ చేసిన మోదీ.. ఆయనతో సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే భారత్‌కు రావాలని మోదీ ఆహ్వానించారు. 23వ భారత-రష్యా వార్షిక సదస్సుకు హాజరుకావాలని మోదీ ఆహ్వానం పలికారు. మరొకవైపు ఉక్రెయిన్‌లో తాజా పరిస్థితులను మోదీకి వివరించారు పుతిన్. ఉక్రెయిన్‌తో సంబంధాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పుతిన్‌కు విన్నవించారు మోదీ. అమెరికా ఆయుధాల కొనుగోలుకు భారత్ విముఖతఅగ్రరాజ్యం నుంచి కొత్త ఆయుధాలను, వైమానిక విమానాలను కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ క్రమంలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారు. ట్రంప్ భారత్‌పై విధించిన భారీ సుంకాలతో డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా పాలనలో అమెరికా, భారత్ మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయిభారత్ మిత్రదేశమే అయినా అమెరికాతో వాణిజ్యం అనుకున్నంత సంతృప్తిగా జరగడం లేదని.. పైగా రష్యాతో చమురు కొనుగోళ్లు జరుపుతోందంటూ ట్రంప్ గతంలో 25 శాతం టారిఫ్ విధించారు. ఆపై అగష్టు 6వ తేదీన.. తాను చెప్పినా వినలేదంటూ మరో 25 శాతం సుంకాలు ప్రకటించారు.అమెరికాతో వాణిజ్యం జరిపే దేశాల్లో భారత్‌పై విధించిన సుంకమే హయ్యెస్ట్. దీంతో.. ట్రంప్ నిర్ణయాన్ని భారత్ అన్యాయంగా పేర్కొంది. అమెరికా, ఐరోపా దేశాలు తమ దేశాలకు అనుగుణంగా రష్యాతో వాణిజ్యం చేస్తుండడాన్ని ప్రముఖంగా లేవనెత్తింది కూడా. అయితే భారత్‌తో వాణిజ్య చర్చలు ఉండబోవని ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ట్రంప్ టారిఫ్ వార్‌పై తాము కూడా తగ్గేదే లేదని భారత్ సంకేతాలిచ్చింది.రష్యాతో చమురు ఒప్పందాలు ఆగేది లేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. అదే సమయంలో.. రాజీ పడేది లేదని, సుంకాలతో భారీ మూల్యం చెల్లించేందుకైనా సిద్ధమని భారత ప్రధాని మోదీ ప్రకటించారు. అమెరికా సుంకాలపై అటు రష్యా, ఇటు అనూహ్యంగా చైనా భారత్‌కు మద్ధతుగా నిలిచాయి. ఈ క్రమంలో.. భారత ప్రధాని మోదీ త్వరలో చైనాలో పర్యటిస్తుండగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు వస్తుండడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ప్రత్యేకంగా పుతిన్‌కు ఫోన్ చేసి మోదీ ఆహ్వానించి ట్రంప్‌కు ఊహించని షాకిచ్చారు మోదీ. అమెరికా సుంకాలకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్! -
వచ్చే వారంలో ట్రంప్‌తో పుతిన్ భేటీ.. వేదిక అక్కడే?
మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వచ్చే వారం సమావేశమవ్వాలని భావిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. బహుశా యూఏఈలో శిఖరాగ్రం జరిగే అవకాశముందన్నారు. మూడేళ్లుగా కొనసాగిస్తున్న యుద్ధానికి ముగింపు పలకాలంటూ అమెరికా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఒత్తిళ్లు తెస్తున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. యూఏఈ అధ్యక్షుడు జాయెద్ అల్ నహ్యాన్తో క్రెమ్లిన్‌లో జరిగిన భేటీ అనంతరం పుతిన్ ఈ ప్రకటన చేశారు. ప్రతిపాదన తమదే అయినా, ఇరు దేశాలు ఈ భేటీపై ఆసక్తితో ఉన్నాయన్నారు. చర్చల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పాల్గొంటారా అన్న ప్రశ్నకు పుతిన్.. ఇందుకు తాను వ్యతిరేకం కాదని గతంలోనూ అనేక పర్యాయాలు చెప్పానన్నారు. అయితే, ఇందుకు కొన్ని పరిస్థితులు అనుకూలించాల్సి ఉందన్నారు. అంతకుముందు, రష్యా విదేశాంగ శాఖ సలహాదారు యూరి ఉషకోవ్ మాట్లాడుతూ.. శిఖరాగ్రం వచ్చే వారం జరిగే అవకాశాలున్నాయని తెలిపారు. ఇందుకు వేదికపై సూత్రప్రాయ అంగీకారం కుదిరినట్లు వెల్లడించారు. తేదీలింకా ఖరారు కాలేదన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఈ భేటీలో పాల్గొనే ఛాన్సుందన్న వార్తలను ఉషకోవ్ కొట్టిపారేశారు. పుతిన్, ట్రంప్ భేటీ విజయవంతం, ఫలవంతం కావాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. యుద్ధానికి ముగింపు పలికేందుకు గతంలో జెలెన్స్కీ భేటీ ప్రతిపాదన తెచ్చినా పుతిన్ పట్టించుకోలేదు. తాజాగా, పుతిన్ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్ష భవనం స్పందించలేదు. యుద్ధం ఆపకుంటే ఆర్థికపరమైన కఠిన ఆంక్షలను విధిస్తామని ట్రంప్ చేసిన హెచ్చరికల గడువు శుక్రవారంతో ముగియనుంది. ట్రంప్–పుతిన్ శిఖరాగ్రం తమ వైఖరిని స్పష్టంగా తెలియజేసేందుకు ఒక అవకాశమని రష్యా బుధవారం వ్యాఖ్యానించింది. అరుదైన ఖనిజాల వెలికితీత వంటి అంశాల్లో ఉమ్మడి పెట్టుబడులకు ఆర్థిక అవకాశాలపైనా చర్చలు జరపవచ్చని తెలిపింది.యుద్ధానికి వ్యతిరేకంగా ఉక్రేనియన్లు2022తో పోలిస్తే రష్యాతో జరిగే యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలని ఎక్కువమంది ఉక్రెయిన్ ప్రజలు కోరుకుంటున్నారు. యుద్ధం మొదలైన కొత్తలో చేపట్టిన ఓ సర్వేలో విజయం సాధించేదాకా పోరాడాల్సిందేనంటూ మూడొంతుల మంది గట్టిగా కోరుకున్నారు. తాజాగా ఇటీవల చేపట్టిన సర్వేలో మాత్రం ఇందుకు విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి. యుద్ధానికి కొనసాగించాలనుకునే వారి సంఖ్యలో గణనీయంగా తగ్గుదల కనిపించింది. త్వరగా యుద్ధానికి ముగింపు పలికి, రష్యాతో ఒప్పందానికి రావాలని మూడొంతుల మంది కోరుకుంటున్నారని వెల్లడైంది. రష్యా ఆధీనంలోని భాగాలు మినహా మిగతా ప్రాంతాల్లోని 15 ఏళ్లు పైబడిన వెయ్యి మంది నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నామని సర్వే నిర్వాహకులు తెలిపారు. -
వచ్చే వారంలో ట్రంప్‌తో భేటీ
మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వచ్చే వారం సమావేశమవ్వాలని భావిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. బహుశా యూఏఈలో శిఖరాగ్రం జరిగే అవకాశముందన్నారు. మూడేళ్లుగా కొనసాగిస్తున్న యుద్ధానికి ముగింపు పలకాలంటూ అమెరికా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఒత్తిళ్లు తెస్తున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. యూఏఈ అధ్యక్షుడు జాయెద్ అల్ నహ్యాన్తో క్రెమ్లిన్‌లో జరిగిన భేటీ అనంతరం పుతిన్ ఈ ప్రకటన చేశారు. ప్రతిపాదన తమదే అయినా, ఇరు దేశాలు ఈ భేటీపై ఆసక్తితో ఉన్నాయన్నారు. చర్చల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పాల్గొంటారా అన్న ప్రశ్నకు పుతిన్..ఇందుకు తాను వ్యతిరేకం కాదని గతంలోనూ అనేక పర్యాయాలు చెప్పానన్నారు. అయితే, ఇందుకు కొన్ని పరిస్థితులు అనుకూలించాల్సి ఉందన్నారు. అంతకుముందు, రష్యా విదేశాంగ శాఖ సలహాదారు యూరి ఉషకోవ్ మాట్లాడుతూ.. శిఖరాగ్రం వచ్చే వారం జరిగే అవకాశాలున్నాయని తెలిపారు. ఇందుకు వేదికపై సూత్రప్రాయ అంగీకారం కుదిరినట్లు వెల్లడించారు. తేదీలింకా ఖరారు కాలేదన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఈ భేటీలో పాల్గొనే ఛాన్సుందన్న వార్తలను ఉషకోవ్ కొట్టిపారేశారు. పుతిన్, ట్రంప్ భేటీ విజయవంతం, ఫలవంతం కావాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. యుద్ధానికి ముగింపు పలికేందుకు గతంలో జెలెన్స్కీ భేటీ ప్రతిపాదన తెచ్చినా పుతిన్ పట్టించుకోలేదు. తాజాగా, పుతిన్ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్ష భవనం స్పందించలేదు. యుద్ధం ఆపకుంటే ఆర్థికపరమైన కఠిన ఆంక్షలను విధిస్తామని ట్రంప్ చేసిన హెచ్చరికల గడువు శుక్రవారంతో ముగియనుంది. ట్రంప్–పుతిన్ శిఖరాగ్రం తమ వైఖరిని స్పష్టంగా తెలియజేసేందుకు ఒక అవకాశమని రష్యా బుధవారం వ్యాఖ్యానించింది. అరుదైన ఖనిజాల వెలికితీత వంటి అంశాల్లో ఉమ్మడి పెట్టుబడులకు ఆర్థిక అవకాశాలపైనా చర్చలు జరపవచ్చని తెలిపింది.యుద్ధానికి వ్యతిరేకంగా ఉక్రేనియన్లు2022తో పోలిస్తే రష్యాతో జరిగే యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలని ఎక్కువమంది ఉక్రెయిన్ ప్రజలు కోరుకుంటున్నారు. యుద్ధం మొదలైన కొత్తలో చేపట్టిన ఓ సర్వేలో విజయం సాధించేదాకా పోరాడాల్సిందేనంటూ మూడొంతుల మంది గట్టిగా కోరుకున్నారు. తాజాగా ఇటీవల చేపట్టిన సర్వేలో మాత్రం ఇందుకు విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి. యుద్ధానికి కొనసాగించాలనుకునే వారి సంఖ్యలో గణనీయంగా తగ్గుదల కనిపించింది. త్వరగా యుద్ధానికి ముగింపు పలికి, రష్యాతో ఒప్పందానికి రావాలని మూడొంతుల మంది కోరుకుంటున్నారని వెల్లడైంది. రష్యా ఆధీనంలోని భాగాలు మినహా మిగతా ప్రాంతాల్లోని 15 ఏళ్లు పైబడిన వెయ్యి మంది నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నామని సర్వే నిర్వాహకులు తెలిపారు. -
త్వరలో భారత్‌కు పుతిన్ రాక
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. పర్యటన తేదీలను ఖరారు చేసేందుకు జరుగుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయని జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ ధోవల్ గురువారం తెలిపారు. పుతిన్ ఆగస్ట్ ఆఖర్లో పర్యటించే అవకాశముందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన వెల్లడించారు. పర్యటన తేదీలు, సమయంపై మరింత స్పష్టత రావాల్సి ఉందన్నారు. పర్యటన ఈ ఏడాది చివర్లో ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికాతో వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పుతిన్ పర్యటన అంశం తెరపైకి రావడం గమనార్హం. పుతిన్ పర్యటన భారత్ ప్రపంచ దేశాలతో నెరుపుతున్న రాజకీయ వ్యూహంలో కీలక పరిణామం కానుంది. సరిగ్గా, ట్రంప్ బెదిరింపుల వేళ పుతిన్ పర్యటన వార్త భారత్–రష్యాల మైత్రీ బంధం ఎంత బలమైందో చెప్పకనే చెబుతోంది. రష్యా నుంచి చమురును పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్‌పై యుద్ధానికి భారత్ ఆజ్యం పోస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా నిందించడం, టారిఫ్ పెంచుతూ బుధవారం హెచ్చరికలు చేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే ఎన్ఎస్ఏ ధోవల్ మాస్కో వెళ్లడం గమనార్హం. క్రెమ్లిన్‌లో గురువారం ఆయన అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమయ్యారు. అనంతరం మాస్కోలో ధోవల్ స్పుతి్నక్ న్యూస్‌తో మాట్లాడారు. భారత్–రష్యా బంధం ఎంతో ప్రత్యేకమైందని పేర్కొన్నారు. ‘భారత్–రష్యాలది చాలా ప్రత్యేకమైన, సుదీర్ఘ సంబంధం. రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మేం ఎంతో విలువైందిగా భావిస్తున్నాం. మా మధ్య కొనసాగుతున్న ఉన్నత స్థాయి సంబంధాలు, బంధాన్ని బలీయంగా మార్చడంలో ఎంతో సాయపడ్డాయి’అని ధోవల్ పేర్కొన్నారు. ‘రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌లో చేపట్టే పర్యటనపై మేం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. పర్యటన తేదీలు దాదాపుగా ఖరారయ్యాయి. ఇరు దేశాల నేతల మధ్య జరిగే శిఖరాగ్రం ఎంతో కీలకం కానుంది’ అని ధోవల్ వివరించారు. ‘ఈ శిఖరాగ్రం ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కొత్త దిశానిర్దేశం చేయనుంది. వీరి మధ్య జరిగే చర్చలు స్పష్టమైన, గణనీయమైన ఫలితాలను అందివ్వనున్నాయి’ అని దోవల్ ఆశాభావం వ్యక్తం చేసినట్లు టాస్ వార్తా సంస్థ పేర్కొంది. ఇలా ఉండగా, ముడి చమురు దిగుమతులపై పశి్చమ దేశాలు విధించిన ఆంక్షల ప్రభావంపైనా ధోవల్ రష్యా ఉన్నతాధికారులతో చర్చించారు. ఒప్పందం ప్రకారం మిగతా రెండు ఎస్–400 క్షిపణి రక్షణ వ్యవస్థలను సాధ్యమైనంత త్వరగా అందజేయాలని కోరారు. -
ఈ అణు దూకుడుతో మళ్లీ అనర్థం
హిరోషిమా, నాగసాకీలపై అణ్వస్త్ర ప్రయోగాలు జరిగిన 80 సంవత్సరాలకు తిరిగి అణ్వస్త్రాల ప్రస్తావనలు వస్తుండటం ప్రపంచాన్ని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నది. కాకతాళీయంగా ఈసారి కూడా ఆ ప్రస్తావనలు చేస్తున్న అమెరికా... రష్యా సమీపంలోని పసిఫిక్ మహాసముద్ర జలా లలోకి రెండు అణ్వస్త్ర జలాంతర్గాములను తరలించింది. ఈ విషయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొద్ది రోజుల క్రితం స్వయంగా ప్రకటించారు. అక్కడి నుంచి దక్షిణాన అవే సముద్ర జలాలలో జపాన్ ఎంతో దూరంలో లేదు. ట్రంప్ చర్యలకు ప్రతిగా రష్యన్లు తమవద్ద గల ‘డెడ్ హ్యాండ్’ అణ్వస్త్ర వ్యవస్థ గురించి గుర్తు చేశారు. 1987 నుంచి గల అణ్వాయుధ క్షిపణుల నిరోధక ఒప్పందం నుంచి ఉపసంహరించుకున్నారు. ఇది ఈ 5వ తేదీ నాటి పరిణామం. ఇవన్నీ వెంటవెంటనే వారం రోజులలోపే జరిగిపోయాయి.ఏమిటీ ‘డెడ్ హ్యాండ్’ వ్యవస్థ?అమెరికా, రష్యాల మధ్య అణు యుద్ధం రాగల అవకాశం సాధారణ దృష్టికైతే కనిపించటం లేదు. ట్రంప్ ఒకవైపు అణు జలాంతర్గాముల మోహరింపునకు ఆదేశాలిస్తూనే, ‘డెడ్ హ్యాండ్’ ప్రస్తావ నలు చేస్తున్న రష్యా అటువంటి చర్యలకు పాల్పడగలదని భావించటం లేదనీ, అయినా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామనీ అన్నారు. మరొకవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఈ తరహాలో అణు ప్రస్తావనలు ఎవరికీ మంచిది కాదన్నారు. ఆ విధంగా చూసినపుడు ఎవరికి వారు ఎంతో కొంత జాగ్రత్తలలోనే ఉన్నట్లు భావించాలి. అసలు విషయం ఇంత దూరం ఎందుకు వచ్చింది?చర్చను ఒక తక్షణ విషయంతో ఆరంభిద్దాము. రష్యా తన ఉక్రెయిన్ యుద్ధాన్ని 10 రోజులలో ఆపివేసి శాంతి ఒప్పందంపై సంతకాలు చేసి తీరాలని అమెరికా అధ్యక్షుడు తనంతట తానే ఒక గడువు విధించారు. ఆ గడువు ఈనెల 9వ తేదీతో ముగుస్తుంది. కొన్ని రోజుల క్రితం ఇలాగే 50 రోజుల గడువు ప్రకటించారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా అన్నట్లు ప్రపంచానికి అన్ని విధాలా ఒక చక్రవర్తి వలె వ్యవహరిస్తున్న ట్రంప్, అందరికీ ఆదేశాలు, హెచ్చరికలను ఎడాపెడా జారీ చేస్తున్న తీరును చూస్తూనే ఉన్నాము. ట్రంప్ నుంచి ఇటువంటి ధోరణిని సహించలేని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు, మాజీ దేశాధ్యక్షుడు అయిన మెద్వెదేవ్ ఆయనకు తమ అణ్వస్త్ర శక్తిని, ‘డెడ్ హ్యాండ్’ పేరుతో గల అణు వ్యవస్థను గుర్తు చేశారు. సాధారణ ప్రచారంలో లేని ‘డెడ్ హ్యాండ్’ వ్యవస్థ ఏమంటే, ఒకవేళ అమెరికా మొదటగా అణ్వస్త్రాలు ప్రయో గించి రష్యా రాజకీయ నాయకత్వాన్ని, సైనిక నాయకత్వాన్ని పూర్తిగా తుడిచి పెట్టినట్లయితే, తదనంతర చర్యలకు వారి నుంచి ఆదేశాలు అందని స్థితిలో, మొదటినుంచే మోహరించి ఉన్న అణ్వ స్త్రాలు అన్నీ వెంటనే తమంతట తాము అమెరికా, యూరప్‌లలోని తమ లక్ష్యాల వైపు క్షణాలలో దూసుకుపోతాయి. నాయకత్వాల నుంచి ఆదేశాలు ఆగిపోయాయనే సంగతి అల్ట్రా లో ఫ్రీకెన్సీ రేడియో తరంగాల ద్వారా తెలుస్తుంది. ఆ తరంగాలను అమెరికా సహా ఎవరూ పసిగట్టలేరు, విశ్లేషించలేరు, హైజాక్ చేయలేరు, నిరోధించ లేరు. ట్రంప్‌కు మెద్వెదేవ్ ఇచ్చిన సందేశమది. అంతిమార్థం ఏమంటే, ట్రంప్ చర్యలు వినాశనానికి దారితీయవచ్చునని.ప్రపంచం మొత్తానికీ యుద్ధమే!అణుయుద్ధం అమెరికా, రష్యాల మధ్య అయితే తక్కిన ప్రపంచానికి సమస్య ఏమిటనే సందేహం కలగవచ్చు. 1945కూ, ఇప్పటికీ తేడాలున్నాయి. అపుడు అమెరికా ఏకైక అణుశక్తి. తర్వాత నాలు గేళ్లకు 1949లో రష్యా అణుశక్తి పరీక్షతో పరిస్థితులు మారసాగాయి. అమెరికా, రష్యాలు పరస్పరం పోటీపడి అణ్వస్త్రాల సంఖ్యను వేలకు వేలుగా పెంచటంతో పాటు అందులో కొత్త రకాలపై పరిశోధనలు నేటికీ జరుపుతున్నాయి. అందులో, మొదటి విడత విధ్వంసం, దానిని తట్టుకుని రెండవ విడత విధ్వంసం, పరస్పర విధ్వంస శక్తి, యుద్ధ విమానాలు, సముద్ర జలాల నుంచి ప్రయోగాలు (ట్రయాడ్ వ్యవస్థ) అంటూ రెచ్చి పోయారు. ఈమధ్యలో మరొక అర డజన్ అణ్వస్త్ర దేశాలు తయారయ్యాయి. అటువంటి ఆయుధాలు అర డజను ఉన్నా చాలు విధ్వంసానికి అనే వివేకం కలగటంతో అణ్వస్త్ర పరిమితి ఒప్పందాలు, వాటి మోహరింపుల పరిమితిపై ఒప్పందాలు దశలు దశలుగా జరిగాయి.వాటిలోని లోపాలను అట్లుంచితే, ప్రపంచం కొన్ని దశాబ్దా లుగా ఇతర యుద్ధాలు ఎట్లున్నా అణ్వస్త్ర ప్రయోగాలు లేక ప్రశాంతంగా ఉంది. అందుకు కారణం పరస్పర విధ్వంస శక్తి (మ్యూచు వల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్, లేదా మ్యాడ్) అని, ఆ విధంగా ‘బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్’ అనే స్థితి ఏర్పడిందని అంతా భావించారు. ఆ పరిస్థితు లలోనూ గమనించదగ్గవి కొన్ని జరిగాయి. ఎవరిపైనా అణ్వస్త్ర ప్రయోగపు ఆలోచనలు రష్యా చేయలేదు గానీ, వియత్నాం, ఉత్తర కొరియా, అఫ్గానిస్తాన్‌లు కొరకరాని కొయ్యలుగా మారటంతో అమె రికా అందుకు ఏర్పాట్లు కూడా సిద్ధం చేసి మళ్లీ వెనుకకు తగ్గింది.అప్రమత్తత కలిగేనా?ఇటువంటి చరిత్ర ఉన్నందువల్లనే ఇపుడు తిరిగి అమెరికా,అందులోనూ ట్రంప్ వంటి అనాలోచితుడు, చంచలచిత్తుడు, విపరీ తమైన అహంభావి ఆదేశాలతో అణుజలాంతర్గాములను ఇప్పటికే రష్యా సమీపానికి తరలించిందంటే, ప్రపంచవ్యాప్తంగా భయాందో ళనలు కలగటం సహజం. అణుయుద్ధం జరిగితే అది అమెరికా, రష్యాలకు పరిమితం కాదు. అమెరికా మిత్ర దేశాలను, రష్యా మిత్ర దేశాలను అనివార్యంగా అందులోకి లాగుతాయి. భయంకరమైన స్థాయిలో వెలువడే అణుధార్మిక శక్తి ఇండియా సహా అన్ని దేశాలకూ వ్యాపిస్తుంది. దాని ప్రభావం అన్ని సముద్ర జలాలతో పాటు మొత్తం వాతావరణాన్ని ఎంతకాలంపాటు కలుషితం చేస్తుందో బహుశా నిపుణులు కూడా అంచనా వేయలేరు. 80 ఏళ్ల క్రితం నాటి హిరో షిమా ప్రభావాలు జపాన్‌లో నేటికీ ఉన్నాయి.ఈ ప్రమాదకర పరిస్థితికి మూల కారణం, అమెరికా నాయ కత్వాన ‘నాటో’ దేశాలు ప్రత్యక్షంగా రష్యాను, పరోక్షంగా చైనాను లొంగదీసుకోవాలని భావించటంలో ఉంది. అందుకోసం చేస్తున్న రకరకాల ప్రయత్నాలలో భాగంగా ఉక్రెయిన్ను ఒక పావుగా ఉప యోగించుకుంటున్నారు. అది ఒక తప్పు కాగా, ఆ యుద్ధ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించలేకపోవటం ఒక వైఫల్యం. రష్యాను ఎన్ని ఆంక్షలు విధించినా బలహీనపరచలేకపోవటం ఇంకొక వైఫల్యం అవుతుండగా, ట్యారిఫ్ల పేరిట రష్యా, ఇండియా, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వగైరాలను బెదిరించజూడటం అసమర్థ దుర్జనత్వమవుతున్నది. చివరకు అంతిమ ఆయుధంగా 50 రోజులు, 10 రోజుల గడువులు, అణు జలాంతర్గాముల స్థాయికి పతన మవుతూ యావత్ ప్రపంచాన్నే ప్రమాదంలోకి నెడుతున్నారు.విచారకరం ఏమంటే, మన దేశంలో ఒకప్పుడు ఉన్నత స్థాయిలో ఉండిన ఈ అప్రమత్తత ఇటీవలి కాలంలో క్రమంగా తగ్గుతున్నది. వారు మళ్లీ అప్రమత్తులు కావటం 80 ఏళ్ల హిరోషిమా విషాదానికి తగిన నివాళి అవుతుంది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
రష్యా–అమెరికా నిర్మాణాత్మక చర్చలు
మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధం ముగించే దిశగా రష్యాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి పెంచుతున్నారు. ఇందులో భాగంగా రష్యా అధినేత పుతిన్‌తో చర్చల కోసం తన ప్రత్యేక ప్రతినిధిగా స్టీవ్ విట్కాఫ్ను పంపించారు. విట్కాఫ్ బుధవారం ఉదయం మాస్కోలో పుతిన్‌తో దాదాపు మూడు గంటలపాటు సమావేశమయ్యారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధంతోపాటు తాజా పరిణామాలపై చర్చించారు. ట్రంప్ సందేశాన్ని విట్కాఫ్ ఈ సందర్భంగా పుతిన్‌కు చేరవేశారు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సన్నద్ధం కావాలని, కాల్పుల విరమణ పాటించాలని చెప్పారు. పుతిన్, విట్కాఫ్ మధ్య సుహృద్భావ వాతావరణంలో నిర్మాణాత్మక చర్చలు జరిగాయని రష్యా విదేశాంగ ప్రతినిధి యూరి ఉషకోవ్ తెలిపారు. ఇరుపక్షాలు సానుకూల సంకేతాలు పంపించుకున్నాయని వివరించారు. వ్యూహాత్మక సహకారంపై చర్చించుకున్నాయని స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా, పుతిన్‌తో చర్చల అనంతరం విట్కాఫ్ బుధవారం మధ్యాహ్నం స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారని రష్యన్ మీడియా తెలియజేసింది. అయితే, పుతిన్, విట్కాఫ్ తాజా చర్చలపై అమెరికా, ఉక్రెయిన్ ప్రభుత్వాలు ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి ఇకనైనా ఫుల్స్టాప్ పెట్టకపోతే కఠినమైన ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యాను ట్రంప్ తీవ్రంగ హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
‘నన్ను నాశనం చేసి.. లక్షలమందిని చంపి..’:పుతిన్ రహస్య కుమార్తె సంచలన వ్యాఖ్యలు
మాస్కో: రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అతని రహస్య కుమార్తె ఎలిజవేటా క్రివోనోగిఖ్(22) పలు సంచలన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అతను తన జీవితాన్ని నాశనం చేయడంతో పాటు లక్షలాదిమందిని పొట్టన పెట్టుకున్నాడని ఎవరిపేరు చెప్పకుండానే వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆరోపణలు క్రెమ్లిన్(రష్యాన్ ప్రభుత్వ అధికార నివాసం) అధినేతపైనే అని మీడియా చెబుతోంది.జర్మన్ వార్తాపత్రిక బిల్డ్ టెలిగ్రామ్ చానల్లో ఎలిజవేటా క్రివోనోగిఖ్ వరుస పోస్ట్‌లను ఉంచారు. వాటిలో ఆమె ‘నా ముఖాన్ని మళ్లీ ప్రపంచానికి చూపించడం అనేది నాకు విముక్తినిస్తుంది. నేను ఎవరో.. నా జీవితాన్ని ఎవరు నాశనం చేశారనేది నాకు గుర్తు చేస్తుంది’ అని పేర్కొంది. 2022లో రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో ఆమె ఖాతా మాయమయ్యింది. 2003లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జన్మించిన క్రివోనోగిఖ్, పుతిన్, అతని మాజీ ఉద్యోగి స్వెత్లానా క్రివోనోగిఖ్ కుమార్తె అనే వాదన వినిపిస్తుంటుంది.2020లో రష్యన్ మిలియనీర్ స్వెత్లానా క్రివోనోగిఖ్ ఆస్తులపై దర్యాప్తు చేసిన సమయంలో ఎలిజవేటా క్రివోనోగిఖ్ రష్యన్ అధ్యక్షుడి రహస్య కుమార్తె అని కనుగొన్నట్లు స్వతంత్ర మీడియా సంస్థ ప్రోక్ట్ పేర్కొంది. స్వెత్లానా క్రివోనోగిఖ్ ఈ సంపదను రష్యన్ నాయకుని ద్వారా పొందారనే ఆరోపణలున్నాయి. స్వెత్లానా కుమార్తెకు పుతిన్ పోలికలున్నాయని ప్రోక్ట్ పేర్కొంది. అయితే, క్రెమ్లిన్ ఈ వాదనను తోసిపుచ్చింది. అవి నిరాధారమైనవని పేర్కొంది. ఎలిజవేటా క్రివోనోగిఖ్ జనన ధృవీకరణ పత్రంలో ఆమె తండ్రి పేరు లేదు. 2021లో జరిగిన ఒక ఆడియో ఇంటర్వ్యూలో, ఎలిజవేటా క్రివోనోగిఖ్.. పుతిన్‌తో తనకున్న పోలికలను ధృవీకరించలేదు. తిరస్కరించనూలేదు. -
ఉక్రెయిన్‌పై దాడి.. రష్యాకు మద్దతుగా పాక్, చైనా సైనికులు: జెలెన్స్కీ
కీవ్: రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా తరఫున చైనా, పాకిస్తాన్ దళాలు పాల్గొంటున్నాయని వ్యాఖ్యానించారు. వీరందరిపై తమ సైన్యం పోరాటం చేస్తోందని జెలెన్స్కీ చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. ఈ సందర్బంగా జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌పై యుద్ధంతో రష్యాకు పలు దేశాలు సహకరిస్తున్నాయి. ఆయా దేశాల నుంచి సైనికులు వస్తున్నారు. చైనా, తజికిస్థాన్, ఉజ్బెకిస్తాన్, పాకిస్తాన్‌తో సహా ఆఫ్రికన్ దేశాల నుంచి వస్తున్న కిరాయి సైనికులు యుద్ధంలో పాల్గొంటున్నట్లు మా దేశ దళాలు గుర్తించాయి. ఇందుకు ఉక్రెయిన్ సైన్యం నుంచి ప్రతిస్పందన గట్టిగా ఉంటుందని హెచ్చరిస్తున్నామన్నారు. ఇదే సమయంలో యుద్ధంలో పాల్గొని దేశానికి సేవ చేస్తున్న దళాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.అలాగే, వోవ్‌చాన్స్క్ ప్రాంతంలోని సైనిక దళాలతో భేటీ అయినట్లు జెలెన్స్కీ తెలిపారు. ఫ్రంట్‌లైన్‌లోని కమాండర్ల గురించి, ఆ ప్రాంతంలోని రక్షణ వ్యవస్థల గురించి వారితో మాట్లాడినట్లు తెలిపారు. డ్రోన్ సరఫరాలు పెంచడం, దళాల నియామకం, బ్రిగేడ్లకు ప్రత్యక్ష నిధులపై కూడా చర్చించినట్లు వెల్లడించారు.Today, I was with those defending our country in the Vovchansk direction – the warriors of the 17th Separate Motorized Infantry Battalion of the 57th Brigade named after Kish Otaman Kost Hordiienko.We spoke with commanders about the frontline situation, the defense of… pic.twitter.com/40XsGHZU0T— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) August 4, 2025మరోవైపు.. అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపణలను పాక్ ఖండించింది. ఆయన ఆరోపణలు నిరాధారమైనవి అంటూ పాక్ ఓ ప్రకటనలో వెల్లడించింది. జెలెన్స్కీ ఆరోపణలపై తగిన ఆధారాలు చూపించాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో వీటిపై తగిన ఆధారాలు చూపించేందుకు ఉక్రెయిన్ అధికారులు ఎవరూ తమను సంప్రదించలేదని తెలిపింది. ఇక, ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా తరఫున చైనా పౌరులు పాల్గొంటున్నారని గతంలో జెలెన్స్కీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, వీటిని బీజింగ్ అప్పుడే ఖండించింది. మరోవైపు.. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు ఉత్తరకొరియా పూర్తి మద్దతు ప్రకటించింది. రష్యాకు ఆయుధాలను, సైనికులను పంపిస్తోంది. -
అంత సీన్ లేదు.. ఎక్కడున్నారో మరచిపోయారా?: ట్రంప్‌కు రష్యా కౌంటర్
మాస్కో: అగ్ర రాజ్యాలు అమెరికా, రష్యా మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. అమెరికాకు చెందిన రెండు అణు జలాంతర్గాములను రష్యా సమీపంలో మోహరించడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. అమెరికా చర్యలకు రష్యా కౌంటరిచ్చింది. అమెరికాను ఎదుర్కొనేందుకు తమవద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయని రష్యా హెచ్చరించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు రష్యాకు చేరువలోని సముద్ర జలాల్లో రెండు అణు జలాంతర్గాములను అమెరికా మోహరించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా రష్యా పార్లమెంటు సభ్యుడు విక్టర్ వోడోలాట్స్కీ స్పందిస్తూ.. అమెరికాను ఎదుర్కొనేందుకు రష్యా వద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మహాసముద్రాల్లో అమెరికా జలాంతర్గాముల సంఖ్య కంటే రష్యావి చాలా ఎక్కువే ఉన్నాయి. అమెరికా మోహరించినవి జలాంతర్గాములు సైతం రష్యా జలాంతర్గాముల నియంత్రణలో ఉన్నాయనే విషయం గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలకు ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు అంటూ కౌంటర్ ఇచ్చారు.🚨 BREAKING: Russian lawmaker Viktor Vodolatsky says Russia has enough nuclear submarines to counter the 2 U.S. subs recently repositioned by President Trump. The move follows provocative remarks from former Russian President Medvedev. #Defense #NuclearSubmarines #USRussia pic.twitter.com/QnsGLdx4Q5— India Defence Daily (@IndiaDefDaily) August 2, 2025మరోవైపు.. గ్లోబల్ అఫైర్స్ మ్యాగజైన్ రష్యా ఎడిటర్ ఇన్‌చీఫ్ ఫ్యోడర్ లుక్యానోవ్ మాట్లాడుతూ.. ట్రంప్ హెచ్చరికలను ప్రస్తుతానికి తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు. అంతకుముందు మాస్కో, వాషింగ్టన్ల మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణలు జరగకూడదని యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో వాదనతో తాను ఏకీభవిస్తానని రష్యా విదేశాంగ మంత్రి సెర్గా లావ్రోవ్ పేర్కొన్నారు.మెద్వెదెవ్ కామెంట్స్..ఇదిలా ఉండగా.. శుక్రవారం అమెరికా రెండు అణు జలాంతర్గాములను రష్యా సమీపంలో మోహరించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్ సోషల్‌లో ప్రకటించారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహాయకుడు, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రీ మెద్వెదెవ్ చేసిన ‘డెడ్ హ్యాండ్’ హెచ్చరికలకు ప్రతిస్పందనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్..‘అవి మతిలేని, రెచ్చగొట్టే ప్రకటనలు. నిజంగానే అలాంటి పరిస్థితి తలెత్తే ఆస్కారముంటే దీటుగా స్పందించేందుకే ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. రెండు సబ్మెరైన్లను సరైన ప్రదేశాల్లో మోహరించాల్సిందిగా ఆదేశించాను’ అని వివరించారు.ఏమిటీ డెడ్ హ్యాండ్? ఇది రష్యా (నాటి సోవియట్ యూనియన్) అభివృద్ధి చేసిన ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి వ్యవస్థ. ఆ దేశంపై ఎవరన్నా అణు దాడి చేస్తే అందుకు ప్రతిగా ఆటోమేటిక్‌గా అణు దాడులు జరుపుతుంది. దేశ నాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకు పోయినా తనంత తానుగా స్పందించి దాడులకు దిగటం దీని ప్రత్యేకత. -
భారత్ కారణంగా పుతిన్ రెచ్చిపోతున్నారు.. రుబియో సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: భారత్, రష్యా చమురు కొనుగోలు విషయమై అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా దగ్గర భారత్ కొంటున్న చమురుతోనే పుతిన్.. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇదే భారత్‌తో చర్చల్లో తమను ఇబ్బందిపెట్టే అంశమని వ్యాఖ్యలు చేశారు.అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియో గురువారం ఫాక్స్ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘అన్ని దేశాల్లాగే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు చమురు, బొగ్గు, గ్యాస్ కొనగలిగే శక్తి భారత్‌కు ఉంది. అయితే, భారత్.. తమ అవసరాల దృష్ట్యా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. భారత్‌కు భారీగా ఇంధన అవసరాలున్నాయి. రష్యాపై పలు దేశాల ఆంక్షల వల్ల అక్కడ భారత్‌కు చమురు చౌకగా లభిస్తోంది. దురదృష్టవశాత్తూ భారత్ చమురు కొనుగోలు చేస్తున్న కారణంగానే రష్యాలను నిధులు సమకూరుతున్నాయి. వాటిని రష్యా.. ఉక్రెయిన్‌తో యుద్ధం చేయడంలో వాడుకుంటోంది. అదే యుద్ధంలో మనగలగడానికి రష్యాకు ఉపయోగపడుతోందన్నారు. అలాగే, ఇదే భారత్‌తో చర్చల్లో అమెరికాను ఇబ్బందిపెట్టే అంశం. ప్రపంచ వాణిజ్యంలో భారత్ వాటాదారు. వ్యూహాత్మక భాగస్వామి. అయితే అన్ని అంశాల్లో మాదిరిగా విదేశాంగ విధానంలోని ప్రతి విషయంలో 100 శాతం సమయం కేటాయించడం సాధ్యం కాదు’ అని పేర్కొన్నారు.ఇక, అంతకుముందు.. భారత్, రష్యా బంధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. తనకేం సంబంధం లేదంటూనే శాపనార్థాలు పెట్టారు. ఇద్దరూ వారి మృత ఆర్థిక వ్యవస్థలను దిగజార్చుకోనీయండని, కలిసి మునగనీయండని వ్యాఖ్యానించారు. బుధవారం భారత్‌పై 25 శాతం సుంకాలతోపాటు పెనాల్టీ విధిస్తూ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాతో భారత్ ఏం చేస్తుందన్న విషయాన్ని అసలు పట్టించుకోబోమని, వారిద్దరూ మునిగిపోతుంటే మాకెందుకని, మిగిలిన అందరి గురించి పట్టించుకుంటామని స్పష్టం చేశారు. ‘మనకు భారత్ స్నేహితురాలే అయినా ఆ దేశంతో స్వల్ప లావాదేవీలే ఉన్నాయి. ఆ దేశం సుంకాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌లో దాడులు ఆపాలని ప్రపంచమంతా గొంతెత్తి అరుస్తుంటే.. భారత్ మాత్రం రష్యా నుంచి ఆయుధాలను, ఇంధనాన్ని కొనుగోలు చేస్తోంది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.#BREAKING | US Secretary of State Marco Rubio calls India a "strategic partner" while also expressing concern over its continued energy imports from Russia. "Look, global trade – India is an ally. It’s a strategic partner. Like anything in foreign policy, you’re not going to… pic.twitter.com/m8OfCpHUXQ— NewsMobile (@NewsMobileIndia) July 31, 2025 -
‘మీ ఎకానమీని కూల్చేస్తాం’.. భారత్, చైనాలకు అమెరికా వార్నింగ్
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాను ఆర్ధికంగా దెబ్బకొట్టేందుకు అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) సభ్యుడు లిండ్సే గ్రాహం భారత్, చైనాతో పాటు ఇతర దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ధర తక్కువగా ఉందని రష్యా వద్ద క్రూడాయిల్‌ను కొనుగోలు చేయాలని చూస్తే మీ ఆర్ధిక వ్యవస్థను నిట్ట నిలువునా కూల్చేస్తామని ఆయా దేశాలకు వార్నింగ్ ఇచ్చారు.ఇంతకు ముందు గ్రాహం రష్యా నుంచి ఆయా ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తున్న దేశాలపై 500 శాతం టారిఫ్ విధించాలనే ప్రతిపాదనలు తెచ్చారు. ఈ క్రమంలో మరోసారి టారిఫ్ ధరల్ని ప్రస్తావిస్తూ ఆయా దేశాలపై విమర్శలు గుప్పించారు. ఫాక్స్ మీడియాతో మాట్లాడుతూ.. ‘రష్యా వద్ద తక్కువ ధరకే ఆయిల్ దొరుకుతుందని కొనుగోలు చేస్తున్న బ్రెజిల్,చైనాతో పాటు భారత్‌కు నేను చెప్తున్నది ఒకటే. కీవ్ వద్ద ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలతో ఈ యుద్ధం(టారిఫ్) కొనసాగుతుంది. ఈ యుద్ధంలో సంబంధిత దేశాల్ని చీల్చి చెండాడుతాం. ఆర్ధిక వ్యవస్థను కూల్చేస్తామని పునరుద్ఘాటించారు. మీరు (భారత్,చైనా, బ్రెజిల్) చేస్తున్నది రక్తపాతం. ఎవరైనా అతన్ని ఆపే వరకు అతను (పుతిన్) ఆగడు అంటూనే.. రష్యాపై ప్రత్యక్షంగా బెదిరింపులకు దిగారు. ట్రంప్‌తో ఆటలాడుకోవాలని చూస్తే ప్రమాదాన్ని ఏరికోరి తెచ్చుకున్నట్లే. మీ చేష్టల ఫలితంగా మీ దేశ ఆర్ధిక వ్యవస్థకే నష్టం వాటిల్లుతుందని ధ్వజమెత్తారు. కాగా, ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా తీరును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుబడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో యుద్ధాన్ని ఆపేలా చర్చలకు రావాలని ట్రంప్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఆదేశించారు. ఈ బెదిరింపుల్ని రష్యా ఖండించింది. అమెరికా మాపై ఎలాంటి ఆంక్షలు విధించినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. Lindsey Graham: Here’s what I would tell China, India and Brazil. If you keep buying cheap Russian oil… we will tariff the hell out of you and we’re going to crush your economy pic.twitter.com/x05J3G8oOk— Acyn (@Acyn) July 21, 2025 -
ట్రంప్ కొత్త రాగం!
చాలా తరచుగా మాటలు మార్చే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై కత్తిగట్టారు. 50 రోజుల్లోగా ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి రాకపోతే ‘కఠినాతి కఠినమైన’ సుంకాలు విధించటంతోపాటు, తీవ్రమైన ఆంక్షలు మొదలుపెడతానని హెచ్చరించారు. అంతేకాదు... ఉక్రెయిన్ కోసం నాటో దేశాలకు పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థనూ, ఇతరేతర ఆయుధాలనూ విక్రయిస్తారట. మూడేళ్ల క్రితం ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగినప్పుడు రిపబ్లికన్ పార్టీ వైఖరికీ, ట్రంప్ అప్పట్లో చేసిన ప్రకటనలకూ తాజా హెచ్చరికలు పూర్తి విరుద్ధం. ఉక్రెయిన్ విషయంలో బైడెన్ ప్రభుత్వానికి మద్దతునిచ్చారంటూ తమ పార్టీకి చెందిన అప్పటి స్పీకర్ కెవిన్ మెకార్తీకి ఉద్వాసన పలికింది రిపబ్లికన్లే. అటు తర్వాత వచ్చిన మైక్ జాన్సన్‌ను సైతం ఇబ్బంది పెట్టారు. చిత్రమేమంటే అప్పట్లో ఉక్రెయిన్‌కు సాయం అందించటాన్ని గట్టిగా వ్యతిరేకించినవారంతా ఇప్పుడు ట్రంప్ మాదిరే అభిప్రాయాలు మార్చుకుని ఆయనకు మద్దతునిస్తున్నారు. ట్రంప్ విధానం అద్భుతమైనదంటూ పొగుడుతున్నారు. ఉక్రె యిన్‌కు అందించదల్చుకున్న ఆయుధాలను ట్రంప్ నాటోకు విక్రయిస్తున్నారని, అందువల్ల అమె రికా నష్టపోయేదేమీ వుండదని వీరి వాదన. యూరప్ దేశాలు ఇటీవల రక్షణ బడ్జెట్లను విపరీతంగా పెంచాయి. ఆ డబ్బంతా అమెరికా ఖజానాకు చేరుతుందన్నది రిపబ్లికన్ల అంచనా. ట్రంప్ అన్నంత పనీ చేస్తారని నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఇప్పుడున్న వైఖరి సెప్టెంబర్ నాటికి వుంటుందనటానికి లేదు. తాను అధ్యక్షుడయ్యాక కలవటానికొచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని వైట్‌హౌస్‌లో తీవ్రంగా అవమానించి, యుద్ధోన్మాదిగా చిత్రించిన ట్రంప్ ఆర్నెల్లయ్యేసరికి ఆ పాత్ర తానే పోషించటానికి సిద్ధపడ్డారు. ట్రంప్ చెబుతున్న ప్రకారం రష్యా దారికి రాకపోతే ఆ దేశంతో వాణిజ్యం నెరపే దేశాలపై కూడా వంద శాతం సుంకాలు విధించాలి. అంటే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న మన దేశంతోపాటు ఏటా 25,000 కోట్ల డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటున్న చైనాపై కూడా చర్యలుండాలి. మన మాటెలావున్నా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో రెండో స్థానంలో వున్న చైనాతో నేరుగా యుద్ధానికి దిగటంతో సమానం. పిపీలక ప్రాయమైన ఉక్రెయిన్ కోసం ట్రంప్ ఇంత వివాదానికి దిగుతారా అన్నది ప్రశ్నార్థకం. పైగా అమెరికా మిత్ర దేశాలైన ఈయూ, జపాన్ సైతం రష్యాతో ఇప్పటికీ గణనీయంగా వాణిజ్య లావాదేవీలు సాగిస్తున్నాయి. లక్ష్మణ రేఖల్ని గీయటంలో ట్రంప్‌ను మించినవారు లేరు. అధికసుంకాల విధింపు హెచ్చరిక ఏమైందో కనబడుతూనే వుంది. దాన్ని వరసగా పొడిగించుకుంటూ పోతున్నారు. ప్రస్తుతానికి వచ్చే నెల 1వ తేదీ తాజా డెడ్‌లైన్. అసలు పదవిలోకి వచ్చేముందే ‘నేను అధ్యక్షుడినైన రెండు వారాలకల్లా రష్యా–ఉక్రెయిన్ లడాయి ఆగితీరాలి’ అని హెచ్చరించిన విషయం ఎవరూ మరిచిపోరు. ఉక్రెయిన్ను అడ్డుపెట్టుకుని ఏదోవిధంగా రష్యాను అదుపు చేయటానికి శ్రమిస్తున్న నాటో కూటమి ఎలాగైతేనేం ట్రంప్ అంతరంగాన్ని పట్టుకుని, ఆయన అభిప్రాయాన్ని మార్చగలిగింది. మొన్నటివరకూ తిట్టిన నోరే మెచ్చుకునేలా చేసింది. కానీ ఇదెంత కాలం? నిజానికి ‘వేల కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు నాటోకు అందిస్తాం. మొండికేస్తున్న రష్యాను దారికి తెస్తాం’ అంటూ ట్రంప్ సోమవారం చేసిన ప్రకటన నాటోను లోలోన వణికిస్తోంది. కొత్తగా తాము పెంచుకున్న రక్షణ కేటాయింపులన్నీ అమెరికా ఆవిరి చేస్తుందన్న భయం వాటిని వేధిస్తోంది. పైగా అవసరమైన ఆయుధాలు అందించటం రోజుల్లో, నెలల్లో పూర్తయ్యేది కాదు. అమెరికా, యూరప్ దేశాల దగ్గ రున్న ఆయుధాలన్నిటినీ వినియోగించినా రష్యాపై తక్షణ ఆధిక్యత అసాధ్యం. కొత్తగా ఆయుధాల ఉత్పత్తి మొదలై నాటో కూటమికి చేరటానికి సంవత్సరాలు పట్టొచ్చు. యూరప్ దేశాల్లో వున్న ఆయుధ పరిశ్రమ పరిమాణం చిన్నది. అమెరికా ఒక్కటే లక్ష్యాన్ని పూర్తి చేయటం అంత సులభం కాదు. వాణిజ్యం వరకూ చూస్తే రష్యా నుంచి అమెరికా దిగుమతులు ఎక్కువేమీ కాదు. అవి 300 కోట్ల డాలర్లు మించవని నిపుణులు చెబుతున్నారు. వాటిలో అమెరికాకు ఎంతో అవసరమైన ఎరు వులు, ఇనుము, ఉక్కు, యురేనియంలున్నాయి. ఇప్పటికే మూడేళ్లుగా ఆర్థిక ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా కొత్తగా నష్టపోయేది కూడా వుండదు. కానీ రష్యాతో వాణిజ్య లావాదేవీలున్న దేశాలను గణనీయంగా దెబ్బతీసేందుకు అవకాశం వుంటుంది. కానీ అది ఆచరణ సాధ్యమేనా? ఈ చర్యలన్నీ అమలైతే రష్యా స్పందన గురించి ట్రంప్ ఆలోచించినట్టు లేరు. ఆ పర్యవసానా లను ఎదుర్కొనగలిగే శక్తిసామర్థ్యాలు అమెరికాకు లేవు. ఇప్పటికే పీకల్లోతు రుణ భారంతో కుంగు తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ యుద్ధంలో వేలుపెడితే మరింత దిగజారుతుంది. ఏరికోరి ఈ విపత్తు తెచ్చుకోవటానికి ట్రంప్ సిద్ధపడకపోవచ్చు. అయితే రష్యాకు ఆయన విధించిన గడువులో ఒక మతలబుంది. మరో యాభై రోజులకల్లా వేసవి ముగిసి, హిమ పాతం మొదలై రష్యాకు ఇబ్బందులెదురవుతాయి. ఇప్పటికే స్వాధీనమైన తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలు నిలబెట్టుకోవటం మినహా అది చేయగలిగేది వుండదు. ఎటూ యుద్ధం జోరు తగ్గుతుంది గనుక దాన్ని తన ఘనతగా చెప్పు కోవటమే ట్రంప్ ఆంతర్యమని నిపుణులంటున్న మాట కొట్టివేయదగ్గది కాదు. యుద్ధాన్ని అంతం చేయటానికి దాన్ని మరింత తీవ్రతరం చేస్తామనటం తెలివితక్కువైనా కావాలి... మూర్ఖత్వమైనా కావాలి. ట్రంప్ వ్యవహార శైలి దేనికి దగ్గరగా వున్నదో త్వరలో తేలిపోతుంది. -
ట్రంప్ వేస్తారు.. మేము భరిస్తాం: రష్యా
బీజింగ్: వచ్చే 50 రోజుల్లోపు ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని రష్యా ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని, వంద శాతం సుంకాలను ఆ దేశం ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై రష్యా స్పందించింది. ఈరోజు(మంగళవారం, జూలై 15) షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సమ్మిట్‌కు హాజరైన రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ ప్రెస్ కాన్పరెన్స్‌లో మాట్లాడారు. దీనిపై అమెరికా అధ్యక్షడు ట్రంప్ విధిస్తామన్న సుంకాలపై కాస్త వ్యంగ్యంగా బదులిచ్చారు లావ్రోవ్. ‘ ట్రంప్ సుంకాలు వేస్తానన్నారు కదా.. అది కూడా వంద శాతం దాటి సుంకాలన్నారు. వేయనీయండి.. మేము భరిస్తాం. ఈ రకమైన బెదిరింపులు మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి’ అంటూ బదులిచ్చారు. పుతిన్.. నీకు 50 రోజుల సమయమేకాగా, ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వారి మధ్య యుద్ధాన్ని ఆపేందుకు మరో అడుగు ముందుకేశారు. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సోమవారం( జూలై 14) నాడు హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు 50 రోజుల సమయం ఇస్తున్నా, ఆ లోపు యుద్ధాన్ని ఆపకపోతే మాత్రం సుంకాల పరంగా రష్యా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. ‘ పుతిన్ చర్యలు చాలా నిరాశను కల్గిస్తున్నాయి. యుద్ధంపై 50 రోజుల్లో డీల్‌కు రాకపోతే రష్యా ఊహించని టారిఫ్‌లు చవిచూస్తుంది. ఆ టారిఫ్‌లు కూడా వంద శాతం దాటే ఉంటాయి. రష్యా యొక్క మిగిలిన వాణిజ్య భాగస్వాములను లక్ష్యంగా చేసుకునే ద్వితీయ సుంకాలు అవుతాయి.- ఇప్పటికే పాశ్చాత్య ఆంక్షలను తట్టుకుని కొట్టుమిట్టాడుతున్న మాస్కో సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తాం’ అని ట్రంప్ స్పష్టం చేశారు. వైట్ హౌస్‌లో నాటో చీఫ్ మార్క్ రూట్‌ను కలిసిన నేపథ్యంలో ట్రంప్ కాస్త ఘాటుగా స్పందించారు. ఇదీ చదవండి:ట్రంప్-పుతిన్ బ్రొమాన్స్ ముగిసిందా? -
పుతిన్.. నీకు 50 రోజుల సమయం ఇస్తున్నా: ట్రంప్
ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వారి మధ్య యుద్ధాన్ని ఆపేందుకు మరో అడుగు ముందుకేశారు. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు 50 రోజుల సమయం ఇస్తున్నా, ఆ లోపు యుద్ధాన్ని ఆపకపోతే మాత్రం సుంకాల పరంగా రష్యా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. ‘ పుతిన్ చర్యలు చాలా నిరాశను కల్గిస్తున్నాయి. యుద్ధంపై 50 రోజుల్లో డీల్‌కు రాకపోతే రష్యా ఊహించని టారిఫ్‌లు చవిచూస్తుంది. ఆ టారిఫ్‌లు కూడా వంద శాతం దాటే ఉంటాయి. రష్యా యొక్క మిగిలిన వాణిజ్య భాగస్వాములను లక్ష్యంగా చేసుకునే ద్వితీయ సుంకాలు అవుతాయి.- ఇప్పటికే పాశ్చాత్య ఆంక్షలను తట్టుకుని కొట్టుమిట్టాడుతున్న మాస్కో సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తాం’ అని ట్రంప్ స్పష్టం చేశారు. వైట్ హౌస్‌లో నాటో చీఫ్ మార్క్ రూట్‌ను కలిసిన నేపథ్యంలో ట్రంప్ కాస్త ఘాటుగా స్పందించారు ఇదీ చదవండి:ట్రంప్- పుతిన్ బ్రొమాన్స్ ముగిసిందా? -
ట్రంప్-పుతిన్ బ్రొమాన్స్ ముగిసిందా?
డొనాల్డ్ ట్రంప్.. రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తన ఆధిపత్యాన్ని ప్రతీ చోట చూపించాలనే అనుకుంటున్నారు. ప్రపంచ దేశాల ముందు తాము అగ్రరాజ్యాధినేతలమనే ‘కటింగ్’ కాస్త ఎక్కువగానే ఉంది. తమది అగ్రరాజ్యం.. తాను అగ్రజున్ని అనే ఫీలింగ్ ఆయనలో ఎక్కువగా ఉంది.తాను ఏది చెబితే అది శాసనం అన్న చందంగా తయారైంది ట్రంప్ పరిస్థితి. ఈ క్రమంలోనే తనకు ఆప్తులు, అత్యంత సన్నిహితులు అనే వారిని కూడా వదులుకుంటున్నారు. ఇటీవల తనకు అత్యంత సన్నిహితంగా ఉండే ఎలాన్ మస్క్‌తో వైరం తెచ్చుకున్నారు. ‘బిగ్ బ్యూటీఫుల్’ బిల్ విషయంలో మస్క్ నో చెప్పారని ట్రంప్ విరుచుకుపడ్డారు. మస్క్‌ను బహిరంగంగానే చెడామడా తిట్టిపోశారు. మస్క్ దక్షిణాఫ్రికా( మస్క్ జన్మస్థలం) వెళ్లిపోవాలనుకుంటున్నారా? అనే వార్నింగ్ కూడా ఇచ్చేశారు. దానిలో భాగంగానే మస్క్ నుంచి ‘కొత్త పార్టీ’ అంటూ ఓ ప్రకటన కూడా వెలువడింది. ఫలితంగా మస్క్‌తో ట్రంప్ సంబంధాలు దాదాపు తెగిపోయాయనే చెప్పొచ్చు.ఆ తర్వాత పుతిన్‌తో కూడా ట్రంప్‌కు మంచి సాన్నిహిత్యమే ఉంది. దీనిలో భాగంగానే ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని క్షణాల్లో ఆపేస్తానని ప్రకటించేశారు ట్రంప్. తాను ఆఫీస్‌లో కూర్చొనే 24 గంటల్లో ఇరుదేశాల యుద్ధాన్ని ముగిస్తానని చెప్పిన ట్రంప్.. ఆపై ఉక్రెయిన్ అధ్యక్షుడి జెలెన్ స్కీతో చర్చలు కూడా జరిపారు. స్వయంగా జెలెన్ స్కీని వైట్‌హౌస్‌కు పిలిపించి మరీ చర్చించారు ట్రంప్. ఇక్కడ ట్రంప్ వ్యవహారాలి శైలిపై వైట్‌హౌస్ వేదికగానే మీడియా ముందే జెలెన్ స్కీ రెచ్చిపోయి మాట్లాడారు. ఇక్కడే ట్రంప్ పరువు సగం పోయింది. ‘యుద్ధం ఆపాలనుకుంటే రష్యాకు ముందు చెప్పండి.. వార్ ప్రారంభించిది పుతిన్’ అంటూ జెలెన్ స్కీ ఘాటుగా స్పందించారు. ఇలా అమెరికా అధ్యక్షుడి ముందు మరొక దేశాధినేత ఇంత ఘాటుగా మాట్లాడటంతో జెలెన్ స్కీ హీరో అయిపోయాడు. ఇక్కడ ట్రంప్ పాత్రకు అసలు అర్థం లేకుండా పోయింది. పుతిన్‌తో కటీఫ్..?ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ చేస్తున్న ప్రయత్నాన్ని పుతిన్ సీరియస్‌గా పట్టించుకోవడం లేదు. ట్రంప్ ఫోన్ చేసి చెప్పినప్పుడు ఓకే అంటున్న పుతిన్.. అపై గంటల వ్యవధిలోనే ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నాడు. ట్రంప్ మధ్యవర్తిత్వం తర్వాత ఉక్రెయిన్-రష్యాల యుద్ధం మరింత ఉగ్రరూపం దాచ్చిందనే చెప్పాలి. దాంతో పుతిన్‌తో ట్రంప్ బ్రొమాన్స్ ముగిసిపోయినట్లే కనబడుతోంది. వందల కొద్దీ డ్రోన్స్, మిసెల్స్తో ఉక్రెయిన్‌పై దాడికి దిగుతున్నారు పుతిన్. దాంతో ట్రంప్‌లో అసహనం ఎక్కువైపోతోంది. ‘పుతిన్ అంతే.. మారడు.. చంపుతూనే ఉంటాడు’ అనే వ్యాఖ్య కూడా చేశారు ట్రంప్. ఈ క్రమంలోనే పుతిన్‌పై నోరు పారేసకున్నారు. వాషింగ్టన్ మీడియా వేదికగా పుతిన్‌పై రెచ్చిపోయి మాట్లాడారు. పుతిన్ మంచి వ్యక్తి అనుకున్నా.. కానీ ఇప్పుడు అర్థం పర్థం లేకుండా వ్యవహరిస్తున్నారు అంటూ ట్రంప్ ధ్వజమెత్తారు. ఉక్రెయిన్‌కు ‘యుద్ధ సాయం’ హామీరష్యాతో సాగిస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని కొన్ని రోజుల క్రితం ట్రంప్ పేర్కొన్నారు. తమ రక్షణ వ్యవస్థలోని ప్రధాన వనరులను అవసరమైతే కీవ్‌కు పంపిస్తామనే హామీ కూడా ఇచ్చారు. ఇదంతా పుతిన్‌పై తీవ్ర కోపం లోలోలన రగిలిపోతున్న ట్రంప్ చెప్పిన మాటలు. అంటే పరోక్షంగా రష్యాపై తాము యుద్ధానికి దిగుతామనే హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్. ఇది పుతిన్‌తో ట్రంప్‌కు చెడిపోయిందనడానికి మరింత బలం చేకూర్చింది.ట్రంప్ యూ టర్న్..ఉక్రెయిన్‌కు యుద్ధం విషయంలో అండగా ఉంటామని ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ట్రంప్ యూ టర్న్ తీసుకున్నారు. ఉక్రెయిన్‌కు నూతన ఆయుధాలు సమకూర్చేందుకు అమెరికా ‘జీరో డాలర్లు’ ఖర్చు చేస్తుందని, అందుకు అయ్యే ఆర్థిక భారాన్ని యూరోపియన్ యూనియన్(ఈయూ) మోయాల్సి ఉంటుందన్నారు. ఉక్రెయిన్‌కు రాబోయే కాలంలో పంపించే ఆయుధాల బిల్లును అమెరికా భరించబోదని, ఆ ఆర్థిక బాధ్యత ఇప్పుడు యూరోపియన్ యూనియన్‌పైనే ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇది ఉక్రెయిన్‌కు పిడుగులాంటి భారం. రష్యాతో యుద్ధంలో అమెరికాపైనే ఎక్కువ ఆధారపడుతున్న ఉక్రెయిన్.. ట్రంప్ యూ టర్న్‌తో ఒక్కసారిగా కంగుతింది. ఇక్కడ ఆయుధాల్ని అమ్ముకోవడమే తమ పని అనే విషయం ట్రంప్ వైఖరితో మరోసారి వెల్లడైంది. ఇక్కడ ఉక్రెయిన్‌కు యుద్ధం విషయంలో ట్రంప్ యూ టర్న్ తీసుకోకుండా ఆర్థిక భారాన్ని యూరోపియన్ యూనియన్ దేశాలపైకి నెట్టారు. అంటే యూరోపియన్ యూనియన్ దేశాలు ఉక్రెయిన్ యుద్ధానికి అవసరమయ్యే ఆర్థిక భారాన్ని మోస్తే తాను ఆయుధాల్ని అమ్మడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ట్రంప్ వైఖరిపై ఇప్పటివరకూ ఎటువంటి ప్రకటనా చేయని పుతిన్.. ఏం జరుగుతుందో చూద్దాం అనే ధోరణితోనే ఉన్నారు. -
పగలంతా తేనె పలుకులు, రాత్రైతే..
ఉక్రెయిన్ సంక్షోభంలో.. పుతిన్ వైఖరి పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పుతిన్ విధానాలు తనకేమాత్రం నచ్చడం లేదంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారాయన. ఈ ఇద్దరు దేశాధినేతలు తరచూ ఫోన్లో మాట్లాడుకుంటుండడం తెలిసిందే.రష్యా అధ్యక్షుడు పుతిన్ వైఖరి పట్ల నేను తీవ్ర నిరాశ చెందారు. పుతిన్ శాంతి కోసం మాట్లాడతారని అనుకున్నాను. కానీ రాత్రికి రాత్రి ఉక్రెయిన్‌పై దాడులు చేయిస్తున్నారు. ఇది నాకు ఏమాత్రం నచ్చలేదు అని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ సంక్షోభానికి పుల్‌స్టాప్ పెట్టే దిశగా ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు పడితే.. పుతిన్-జెలెన్స్కీ వైఖరి వల్ల నాలుగు అడుగులు వెనక్కి పడుతున్నాయి. దీంతో ట్రంప్ తీవ్ర అసహనంతో ఉన్నారు. పైగా ట్రంప్-పుతిన్‌లు తరచూ ఈ అంశంపై ఫోన్లో మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే. రష్యాపై ఆంక్షలు?రష్యాపై కొత్త ఆంక్షలు విధించే అవకాశాన్ని ట్రంప్ సూచన ప్రాయంగా తెలియజేశారు. మేము రేపు ఏం చేస్తామో చూడండి అంటూ మీడియాతో వ్యాఖ్యానించారాయన. అమెరికా సెనేటర్లు ఇప్పటికే రష్యాపై ‘స్లెడ్జ్‌హామర్’(కఠినమైన) ఆంక్షల బిల్లును ప్రతిపాదించిన సమాచారం. పైగా ఈ బిల్లు రష్యా విషయంలో ఆంక్షలు విధించేందుకు ట్రంప్‌కు విస్తృత అధికారాలను కల్పించనుందని తెలుస్తోంది.తాజా వ్యవహారంతో ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మరీముఖ్యంగా అమెరికా-రష్యా సంబంధాల్లో కీలక మలుపుగా భావించబడుతున్నాయి. ట్రంప్ మాటలు, చర్యలు.. ఉక్రెయిన్ ఉద్రిక్తతల్లో రష్యాపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణులను అందించనున్నట్లు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌కు ఇది ఎంతో అవసరమని అని ఆయన.. ఈ ఆయుధాల ఖర్చును అమెరికా భరించదని, యూరోపియన్ యూనియన్ 100% చెల్లించనుందని తెలిపారు.ఈ క్రమంలో ఇది జస్ట్ బిజినెస్ అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. -
అమెరికా.. మమ్మల్ని ఆదుకోండి: జెలెన్ స్కీ వేడుకోలు
రష్యా-ఉక్రెయిన్ యద్దాన్ని ఆపేశానని ఇది వరకే బడాయి కబుర్లు చెప్పిన అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా చేసిన అతిపెద్ద దాడిపై ఏం చెబుతారు?, ఇదే మాటను ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆవేదనతో కూడిన స్వరంతో ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం రష్యా డాడులకు తట్టుకోలేని స్థితిలో ఉన్నామని, ఈ సమయంలో అమెరికా తమకు తక్షణ రక్షణ సాయం చేయాలని వేడుకుంటున్నారు. అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు కూడా తమ అండగా నిలబడి, రష్యాను ఎదుర్కోనేందుకు సాయం చేయాలని జెలెన్ స్కీ సుదీర్ఘమైన ఉద్వేగభరిత పోస్ట్ పెట్టారు. ‘మాకు రక్షణ కావాలి. అది కూడా తక్షణమే కావాలి. రష్యా మా దేశంలోని ప్రతీదాన్ని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది. ప్రస్తుతం మేము జీవన పోరాటం చేస్తున్నాం. స్మిలాలోని నివాసిత ప్రాంతంలో కూడా రష్యా భీకరమైన దాడులు చేసింది. మా ఎఫ్-16 పైలట్ రష్యా దాడుల్లో చనిపోయాడు. సుదీర్ఘకాలంగా రష్యా చేస్తున్న యుద్ధం ఆపేలా కనిపించడం లేదు. వారికి భీకర దాడులు చేసే శక్తి సామర్థ్యాలు ఉండటంతో మాపై వరుస పెట్టి దాడుల చేస్తూ వస్తోంది. ఈ వారంలోనే 114 మిస్సెళ్లను, 1270 డ్రోన్లతో దాడి చేయడంతో పాటు 1,100 పైగా బాంబులు విసిరింది. ప్రపంచం శాంతి కోసం పిలుపునిచ్చినప్పటికీ, చాలా కాలం క్రితమే యుద్ధం చేస్తూనే ఉండాలని పుతిన్ నిర్ణయించుకున్నాడు. ఇది పుతిన్ వైఖరిని స్పష్టం చేస్తంది. ఈ యుద్ధాన్ని ముగించాలి. దురాక్రమణదారుడిపై ఒత్తిడి అవసరం, అలాగే మాకు రక్షణ కూడా అవసరం. అమెరికాతో పాటు యూరప్ దేశాలు, మిగతా భాగస్వాముల మాకు అండంగా ఉండండి. ఇప్పటివరకూ మాకు సాయంగా ఉన్నవారందరికీ ధన్యవాదాలు’ అని జెలెన్ స్కీ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఇక తాము అమెరికా డిఫెన్స్ సిస్టమ్‌ను కూడా కొనుగోలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తమ పరిస్థితిని చెప్పుకొచ్చారు జెలెన్ స్కీ.Almost all night long, air raid alerts sounded across Ukraine — 477 drones were in our skies, most of them Russian-Iranian Shaheds, along with 60 missiles of various types. The Russians were targeting everything that sustains life. A residential building in Smila was also hit,… pic.twitter.com/1ExZhYAMBg— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) June 29, 2025 రష్యా-ఉక్రెయిన్ వార్ చరిత్రలోనే.. అతి పెద్ద దాడి ఇదే -
రష్యాలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి
మాస్కో: రష్యా ఆందోళనను పట్టించుకోకుండా పశ్చిమదేశాలు విస్తరణ వాదాన్ని అనుసరిస్తున్నాయని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మండిపడ్డారు. తమ దేశంలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. శుక్రవారం పుతిన్ బెలారస్ రాజధాని మిన్స్క్లో జరిగిన యురేసియన్ ఎకనామిక్ సమిట్(ఈఏఈయూ)కు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రష్యాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులు, కాల్పులకు తెగబడుతున్నా ఎవరూ పట్టించుకోరు. ఇప్పటికీ దారుణాలు కొనసాగుతున్నా వాటి గురించి మాట్లాడరు. అంతా బాగుందని చెప్పుకుంటుంటారు’అంటూ పశ్చిమదేశాలపై పుతిన్ ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని సైతం రష్యాలో వేర్పాటువాదానికి ఒక సాధనంగా పశ్చిమ దేశాలు భావించాయని ఆరోపించారు. ‘నాటో విస్తరణకు సంబంధించి రష్యాకు ఇచ్చిన హామీలను పశ్చిమదేశాలు విస్మరించాయి. ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో సైతం విఫలమయ్యాయి. ఉక్రెయిన్‌లో మేం చేపట్టిన స్పెషల్ ఆపరేషన్ మూలాలేమిటనే అంశంపై పశ్చిమ దేశాలు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఉక్రెయిన్ సంక్షోభానికి దశాబ్దాల క్రితమే బీజాలు పడ్డాయి. నాటో విస్తరణ విషయంలో చెప్పిన పచ్చి అబద్ధాలే తాజా సమస్యకు కారణం. ఒకదాని తర్వాత మరో దేశాన్ని నాటోలోకి కలుపుకుంటూ విస్తరించుకుంటూ వస్తున్నాయి. మా ఆందోళనలను పట్టించుకోకుండా నాటో కార్యకలాపాలు యథా ప్రకారం కొనసాగిస్తోంది. ఇది కాదా దుందుడుకు వైఖరి? ఇది కచ్చితంగా దుందుడుకు విధానమే. పశ్చిమ దేశాలు దీనిపై దృష్టి పెట్టడానికి ఇష్టపడవు’అని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్‌తో మూడేళ్లుగా సాగిస్తున్న యుద్ధంపై పశ్చిమ దేశాలతో రష్యాకు విభేదాలు తీవ్రతరమైన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రష్యా దూకుడును నిలువరించేందుకు సభ్య దేశాలు తమ జీడీపీలో 5 శాతం రక్షణకు కేటాయించాలంటూ నాటో ఇటీవల నిర్ణయించడం తెల్సిందే. -
అమెరికా దాడులు.. ఇరాన్‌కు అండగా రష్యా..!
టెహ్రాన్: ఇరాన్‌పై యుద్ధం వద్దూ అంటూ ఇది వరకే అమెరికాను హెచ్చరించిన రష్యా... ఈ మేరకు దిద్దబాటు చర్యలు చేపట్టడానికి నడుంబిగించింది. ఇరాన్‌కు అణ్వాయుధాలు సరఫరా చేయడానికి చాలా దేశాలే సిద్ధంగా ఉన్నాయని రష్యా మరోసారి హెచ్చరికలు పంపింది.రష్యాకు ఇరాన్ రక్షణమంత్రిఇజ్రాయిల్, అమెరికాలు.. ఇరాన్‌ను అతలాకుతులం చేసే దిశగా యుద్ధాన్ని తీవ్రతరం చేయడంతో ఇరాన్ ఏం చేయాలనే దానిపై ఆలోచనలో పడింది. దీనిలో భాగంగా తమకు అండగా ఉన్న రష్యా సహకారం కోసం ఇరాన్ ప్రయత్నాలు ఆరంభించింది. ఈ మేరకు ఇరాన్ రక్షణమంత్రి అబ్బాస్ అరాగ్చీ.. అగమేఘాల మీద రష్యాకు బయల్దేరారు. రేపు(సోమవారం) రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని ఇరాన్ రక్షణశాఖ అధికారికంగా వెల్లడించింది. రక్షణమంత్రి అరాగ్చీ.. రష్యాకు వెళ్లే విషయాన్ని వెల్లడించారు. మూడు ఇరాన్ కీలక అణుస్థావరాలపై అమెరికా బాంబుల దాడితో విరుచుకుపడిన తరుణంలో.. రష్యా ఆదేశాలతో ఇరాన్ ముందుకెళ్లే అవకాశం ఉంది.‘ఇరాన్‌కు రష్యా మిత్రదేశం. మేము ఎప్పుడూ రష్యాను ఆశ్రయిస్తూనే ఉంటాం. నేను మాస్కోకు అత్యవసరంగా బయల్దేరి వెళుతున్నా. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కీలక సమావేశం ఉండనుంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం మాపై అమెరికా చేసే దాడి కచ్చితంగా అతిక్రమణ కిందకే వస్తుంది. మా అణుస్థావరాలపై దాడులకు దిగిన అమెరికా రెడ్ లైన్ క్రాస్ చేసింది. ఐక్యరాజ్యసమితిలో మాకున్న హక్కులను కాపాడుకోవడమే మా తదుపరి కర్తవ్యం. మేము కచ్చితంగా వారికి బుద్ధి చెబుతాం’ అని అరాగ్చీ స్పష్టం చేశారు. ట్రంప్ మరో యుద్ధాన్ని మొదలుపెట్టారు..ఇరాన్‌పై అమెరికా దాడులకు దిగడాన్ని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ ఖండించారు. ఇరాన్‌పై దాడులతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో యుద్ధానికి తెరలేపారని విమర్శించారు. ఈ యుద్దంతో అమెరికా సాధించింది ఏమీ లేదనే విషయం తెలుసుకుంటే మంచిదన్నారు. ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎటువంటి గణనీయమైన సైనిక లక్ష్యాలను ఛేదించడంలో విఫలమైందన్నారు. ఇక్కడ ఇరాన్ స్వల్ప నష్టాన్ని మాత్రమే చవిచూసిందన్నారు.ఆ దుస్సాహసం వద్దు.. రష్యా వార్నింగ్ఇరాన్పై అమెరికా సైనిక చర్యకు దిగడం సరైన చర్య కాదంటూ హెచ్చరించింది. ఇరాన్‌పై అమెరికా దాడులు చేయడానికి దిగడానికి ముందుగానే రష్యా క్లియర్ మెస్సేజ్ ఇచ్చింది. ఇజ్రాయిల్-ఇరాన్‌ల యుద్ధంలో అమెరికా సైనిక చర్యకు దిగితే అది ఎంతమాత్రం సమర్థనీయంగా కాదని రష్యా విదేశాంగా ప్రతినిధి మారియా జకారోవా ఇదివరకే స్పష్టం చేశారు. ‘అమెరికాను ముందుగా హెచ్చరించే విషయం ఏంటంటే.. ‘ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇజ్రాయిల్-ఇరాన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధానికి అమెరికా దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ అమెరికా సైనిక చర్యకు దిగితే అది దుస్సాహసమే అవుతుంది. ఈ యుద్ధంలో ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా సైనిక చర్యకు దిగడం అనేది చాలా ప్రమాదకరం. ఊహించని పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది. ఆ యోచనను పక్కన పెడితేనే మంచిది’ అని ఆమె స్పష్టం చేశారు.మరొకవైపు ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్‌పై ఇజ్రాయెల్ దాడి చెర్నోబిల్(1986లో ఉక్రెయిన్‌లో సంభవించిన ఒక పెద్ద అణు విపత్తే చెర్నోబిల్. అణు విద్యుత్ కేంద్రంలోని రియాక్టర్ పేలిపోయి, రేడియోధార్మిక పదార్థాలు గాలిలోకి విడుదలయ్యాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన అణు ప్రమాదాలలో ఒకటిగా లెక్కించబడింది) తరహా విపత్తుకు దారితీయవచ్చని రష్యా అణుశక్తి కార్పొరేషన్ సైతం హెచ్చరించింది. ఏదైనా జరగొచ్చు..ఇరాన్‌కు అణ్వాయుధాలు సరఫరా చేయడానికి చాలా దేశాలే సిద్ధంగా ఉన్నాయని అమెరికాను పరోక్షంగా హెచ్చరించిన రష్యా.. నేరుగా రంగంలోకి దిగితే యుద్ధం మరింత ముదరడం ఖాయం. ఇరాన్‌కు ఆది నుంచి మద్దతు ఇస్తూ వస్తున్న రష్యా.. ఇప్పుడు ఏం చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తోంది. ఇరాన్ రక్షణమంత్రితో భేటీ అనంతరం రష్యా తదుపరి కర్తవ్యం ఏమటనేది తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ రష్యా యుద్ధంలోకి దిగి ఇరాన్‌కు మద్దతిస్తే మాత్రం భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ శాంతి చర్చలు అనేది చాలా కీలకమని వారు భావిస్తున్నారు. ఇరాన్ రక్షణమంత్రితో జూన్ 23వ తేదీన పుతిన్ భేటీలో ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. యుద్ధాన్ని ఇక్కడితో ముగిస్తే మంచిదని ఇరాన్‌కు పుతిన్ ఆదేశాలు ఇస్తే ఫర్వాలేదు కానీ, నేరుగా రష్యా కూడా యుద్ధంలోకి వస్తే మాత్రం సైనిక పరంగా రెండు అగ్రదేశాల మధ్య వార్ మరింత హీట్ పుట్టించే అవకాశాలు కూడా లేకపోలేదు. -
ఉక్రెయిన్ మొత్తం మాదే.. పుతిన్ సంచలన ప్రకటన
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. రష్యన్లు, ఉక్రెయిన్లు ఒక్కటేనని.. ఉక్రెయిన్ మొత్తం రష్యాదే అంటూ వ్యాఖ్యలు చేశారు. దీని ప్రకారం ఉక్రెయిన్ మొత్తం తమదేనని అన్నారు. దీంతో, పుతిన్ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు తెర లేపాయి.రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ..‘ఉక్రెయిన్ను నాశనం చేయాలనే ఉద్దేశం మాకు లేదు. ఇదే విషయం నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ఉక్రెయిన్ తమకు తాముగా సమస్యలను సృష్టించుకుంటోంది. రష్యన్లు, ఉక్రెయిన్లు ఒక్కటే. దీని ప్రకారం ఉక్రెయిన్ మొత్తం మాదే. ఉక్రెయిన్ నగరం సుమీని స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యం మాకు లేదు. ఉక్రెయిన్‌లో శాంతి సాధించాలనుకుంటే మాతో కలిసి రావాలి. మేము ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని ఎప్పుడూ ప్రశ్నించలేదు. అలాగే, ఉక్రెయిన్ లొంగిపోవాలని కూడా మేము కోరుకోవడం లేదు. రష్యా శాంతికి కట్టుబడే ఉంది. ఉక్రెయిన్ నాటోలో చేరాలనే ఆకాంక్షలను వదులుకోవాలి. ఉక్రెయిన్ ఆక్రమిత ప్రాంతాలపై మాస్కో నియంత్రణను అంగీకరించాలి. ఉక్రెయిన్ స్వతంత్రంగా మారిన 1991 ఒప్పందాలను గుర్తుచేసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.Russians and Ukrainians are one people, and in that sense, the whole of Ukraine is ours — Putin 😳 pic.twitter.com/krghibrx0m— Frontalforce 🇮🇳 (@FrontalForce) June 20, 2025ఖండించిన పుతిన్అయితే, ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని నివాస ప్రాంతాలపై తాము దాడి చేశామన్న వ్యాఖ్యలను పుతిన్ ఖండించారు. తమ సైన్యం అటువంటి లక్ష్యాలను ఢీకొట్టలేదని వెల్లడించారు. తాము నివాస గృహాలపై దాడులు చేయలేదని, సైనిక స్థావరాలపైనే చేశామన్నారు. జెలెన్ స్కీతో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కానీ గతేడాది తన పదవీకాలం ముగియడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తన చట్టబద్ధతను కోల్పోయారని ఆరోపించారు.ఈ సందర్భంగా పుతిన్..‘జెలెన్ స్కీతో సహా ఎవరినైనా కలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది సమస్య కాదు. ఉక్రెయిన్ ఆయనకు చర్చలు జరిపే బాధ్యత అప్పగిస్తే, జెలెన్ స్కీనే అనుమతించండి. అసలు ప్రశ్న ఏమిటంటే ఫలితంగా వచ్చే పత్రాలపై ఎవరు సంతకం చేస్తారు? సంతకం చట్టబద్ధమైన అధికారుల నుంచి రావాలి. జెలెన్ స్కీ అధ్యక్ష పదవీకాలం గతేడాది అధికారికంగా ముగిసింది. మార్షల్ లా విధించడం వల్ల అతడి వారసుడిని ఎన్నుకోలేదు. ఉక్రెయిన్ రాజ్యాంగం ప్రకారం పదవీ కాలం ముగిస్తే అధ్యక్ష అధికారాలను పార్లమెంటు స్పీకర్‌కు బదిలీ చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో తాను పదవిలో కొనసాగవచ్చని జెలెన్ స్కీ వాదిస్తున్నారు. అయితే తీవ్రమైన సమస్యలను పరిష్కరించేటప్పుడు మేము చట్టపరమైన అంశాల గురించి శ్రద్ధ వహిస్తాం. సంతకం చట్టబద్ధమైన అధికారుల నుంచి రావాలి. లేకపోతే జెలెన్ స్కీ తర్వాత ఎవరు వచ్చినా దానిని చెత్తబుట్టలో వేస్తారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
మధ్యవర్తిత్వానికి సిద్ధం: పుతిన్
మాస్కో: ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఘర్షణకు తెరదించడానికి వీలుగా మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రష్యా అధినేత పుతిన్ చెప్పారు. ఇజ్రాయెల్ భద్రతకు హామీ ఇస్తూ శాంతియుత ప్రయోజనాల కోసం ఇరాన్ అణు కార్యక్రమం కొనసాగించేలా ఒక స్పష్టమైన ఒప్పందానికి రావడానికి అవసరమైన చర్చలకు సహకరిస్తానని తెలిపారు. ఆయన గురువారం అంతర్జాతీయ వార్తా సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. ఇజ్రాయెల్–ఇరాన్ ఘర్షణ నిజంగా చాలా సంక్లిష్టమైన అంశమని పేర్కొన్నారు. అయినప్పటికీ దీనికి పరిష్కార మార్గం కనిపెట్టవచ్చని స్పష్టంచేశారు. ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీని ఇజ్రాయెల్ హత్య చేస్తే రష్యా ఎలా స్పందిస్తుందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, దానిపై మాట్లాడడం తనకు ఇష్టం లేదన్నారు. ఖమేనీ హత్య జరుగుతుందని అనుకోవడం లేదని పుతిన్ ఉద్ఘాటించారు. మరోవైపు పుతిన్ ప్రతిపాదన పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. ‘‘ముందు మీ సంగతి చూసుకోండి. ఉక్రెయిన్‌తో యుద్ధం ఎలా ఆపాలో ఆలోచించుకోండి. మీకు మీరే మధ్యవర్తిత్వం వహించుకోండి. నా కోసం ఈ సాయం చేయండి. మీ సొంత సమస్య గురించి ఆలోచించుకున్న తర్వాత ఇజ్రాయెల్–ఇరాన్ గురించి ఆలోచిస్తే బాగుంటుంది’’ అని పుతిన్‌కు చురక అంటించారు.ఆధునిక హిట్లర్ అంతం కావాల్సిందే ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ వ్యాఖ్య ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీని ఆధునిక హిట్లర్‌గా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ అభివర్ణించారు. ఇరాన్ క్షిపణి దాడుల్లో ధ్వంసమైన ఇజ్రాయెల్‌లోని హోలోన్ సిటీలో మీడియాతో మంత్రి ‘ఇజ్రాయెల్ కట్జ్’మాట్లాడారు. ‘‘మాకు పైనుంచి ఆదేశాలు అందాయి. పూర్తి లక్ష్యాలను సాధించేందుకు సిద్ధంగా ఉన్నాం. అసలు ఈపాటికే మేం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్)ను పంపి ఆయనను అంతంచేయా ల్సింది. ప్రస్తుతం ఇరాన్లో పరిస్థితులను చూస్తుంటే ఖమేనీ ఒక ఆధునిక హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రులు, జనావాసాలపై క్షిపణులు వేయాలని ఆదేశిస్తున్నారు. అణుబాంబు ఉపద్రవాన్ని అడ్డుకోవడమే మా లక్ష్యం’ అని కట్జ్ అన్నారు. -
వ్లాదిమిర్ పుతిన్ (రష్యా అధ్యక్షుడు) రాయని డైరీ
‘‘... ఆమె ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో నాకు తెలియదు/ నేను చేసిన తప్పేమిటో ఆమె చెప్పదు/ ఇప్పుడు నేను నిన్నటి కోసం ఆరాట పడుతున్నాను...’’బీటిల్స్‌లో నాకిష్టమైన ‘ఎస్టర్డే’ సాంగ్!‘‘... ప్రేమ చాలా సులభంగా తనలో దాచేసుకుంటుంది/ ఇప్పుడు నా ప్రేమను దాచటానికి ఒక స్థలం కావాలి/ నాకు నిన్నటి రోజే బాగుంది...’’ఓహ్... పాల్ మెక్కార్ట్నీ!! ప్రాణం తీస్తున్నాడు. అతడింకా ఎందుకు బతికే ఉన్నట్లు? ఇంత గొప్ప పాటను రాశాక కూడా అతడికి ఇక్కడేం పని, ఈ భూమ్మీద?!‘‘మిస్టర్ ప్రెసిడెంట్... మిస్టర్ ప్రెసిడెంట్... మీ కాల్‌తో కనెక్ట్ అవటం కోసం మిస్టర్ ట్రంప్ వేచి ఉన్నారు...’’ – నికోలాయ్ పాత్రుషేవ్! నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్.‘‘మే బీ, లిటిల్ లేటర్... కనీసం ఈ పాట అయ్యేంతవరకు...’’ అన్నట్లు సైగ చేశాను.‘‘... అకస్మాత్తుగా నేను గతంలో ఉన్న మనిషిలో సగం అయ్యాను/ నా పైన ఒక నీడ వేలాడుతోంది/ నాకు నిన్నటి రోజే బాగుంది.’’ఏం రాశావురా నాయనా మెక్కార్ట్నీ?!మళ్లీ ట్రంప్ ఫోన్ ! కొద్దిసేపైనా ఆగలేరా ఈయన?! ‘ఎస్టర్డే’ని పాజ్‌లో పెట్టి ఫోన్ అందుకున్నాను.‘‘హో హో... ట్రయింగ్ సిన్ ్స ఎస్టర్ డే మిస్టర్ పుతిన్ ’’ అన్నారు ట్రంప్.పెద్దగా నవ్వాను. ‘‘నేను కూడా నిన్నట్నుంచీ ‘ఎస్టర్డే’ లోనే ఉన్నాను మిస్టర్ ట్రంప్’’ అన్నాను.‘‘గాట్ ఇట్. బీటిల్సే కదా? పాల్ మెక్కార్ట్నీ సాంగ్! అంత బుద్ధిహీనునుడిని నేను ఇంత వరకూ చూళ్లేదు. ‘విడిపోయిన తర్వాత ఏమిటి? ఎలా?’ అని పెళ్లికి ముందే కాబోయే భార్యతో అగ్రిమెంట్ రాసుకోవాలన్న కనీస జ్ఞానం కూడా లేదు అతడికి’’ అన్నారు ట్రంప్.‘‘ప్రేమ రాహిత్యపు పరితపనను సృష్టించ టానికి కావలసింది బుద్ధిహీనతే అయితే అలాంటి బుద్ధిహీనతకు నా మనసును పదే పదే పారేసుకుంటాను మిస్టర్ ట్రంప్’’ అన్నాను నవ్వుతూ.‘‘బీటిల్స్ నాకు బోరింగ్. మళ్లీ ‘రోలింగ్ స్టోన్ ్స’ బ్యాండ్ నచ్చుతుంది. వాళ్లదొక సాంగ్ ఉంది. ఏమిటదీ... ఆ – యూ కాంట్ ఆల్వేస్... ‘నువ్వు కోరుకుంటున్న దానిని నువ్వు ఎల్లవేళలా పొందలేవు’...’’ అన్నారు ట్రంప్.‘‘లోతుల నుంచి ‘ఎస్టర్డే’, ‘యూ కాంట్ ఆల్వేస్...’ రెండూ ఒకటే మిస్టర్ ట్రంప్! పోగొట్టుకున్నది తిరిగి పొందలేం, కోరుకున్న ప్రతిసారీ దక్కించుకోలేం...’’ అన్నాన్నేను.హఠాత్తుగా క్రెమ్లిన్ ప్యాలెస్ కదిలిపోయేంత టెరిఫిక్‌గా నవ్వారు ట్రంప్!‘‘ఏమైంది మిస్టర్ ట్రంప్?’’ అని అడిగాను.‘‘ఏం లేదు మిస్టర్ పుతిన్! మీరు ఉక్రెయిన్ను పక్కన పెట్టేసి... బీటిల్స్అంటున్నారు, నేను ఎలాన్ మస్క్‌ను తప్పించు కుని వచ్చి... రోలింగ్ స్టోన్ ్స అంటున్నాను’’ అన్నారు ట్రంప్, నవ్వు ఆపకుండానే!‘‘అవును కదా!!’’ అని నేనూ నవ్వాను.‘‘సరే, ఇది చెప్పండి. ‘నిన్నటి కోసం’మీరెందుకు అంతగా ఆరాటపడుతున్నారు? ఎవరా స్వీట్హార్ట్?’’ అని అడిగారు ట్రంప్!ట్రంప్ అలా అడగటం నాకు నచ్చింది. నిజానికి కూడా, ఎవరైనా అలా తమ పరిధిని దాటి లోపలికి చొరబడినప్పుడే మన మనసుకు దగ్గరగా అనిపిస్తారు.‘‘ఎవరా స్వీట్హార్ట్ మిస్టర్ పుతిన్ ?’’ – మళ్లీ అడిగారు ట్రంప్.‘‘ఎవరూ లేరు. ఆ పాట ఇష్టం. అంతే...’’ అన్నాను నవ్వుతూ.ట్రంప్ ఫోన్ పెట్టేశాక, ‘ఎస్టర్డే’ పాజ్ తీసి, తిరిగి ప్లే చేశాను.మరియా ఇవనోవ్నా నా స్వీట్హార్ట్! నా ఆకలి తీర్చే కొన్ని రొట్టె ముక్కల కోసం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో చెమటోడ్చి వీధులు ఊడ్చిన ఇవనోవ్నా! నేను చేసిన తప్పేమిటో చెప్పకుండా చిన్న ముద్దును నాకు శిక్షగా విధించి నన్ను చేతుల్లోకి ఎత్తుకున్న మా అమ్మ ఇవనోవ్నా! -
తక్కువ ఖర్చుతో రష్యాలో ఉక్రెయిన్ బీభత్సం.. ప్రపంచ నేతల్లో ఇదే చర్చ!
కీవ్: ఆపరేషన్ స్పైడర్స్ వెబ్. వీడియోగేమ్ ఆడుతున్నంత అలవోకగా రష్యా భూభాగం 4 వేల కిలోమీటర్లు లోపలికి చొచ్చుకుని వెళ్లి దాడులు చేసేందుకు ఉక్రెయిన్ చేపట్టిన కోవర్ట్ మిలటరీ ఆపరేషన్. ఇప్పుడిదే ప్రపంచ నేతల్లో హాట్ టాపిక్. ఎందుకంటే?.2022 నుంచి ప్రారంభమైన ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో ఓ వైపు శాంతి చర్చలు జరిపేందుకు తాము సిద్ధమంటూ ఉక్రెయిన్ భీకర దాడికి తెగబడింది. ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ పేరుతో రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ ఊహించని పరిణామంలో 40 రష్యా యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. ఫలితంగా మాస్కో 60వేల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా.అయితే, నాటో దేశాలు నిరంతరం ఆయుధాలతో సహా సర్వ సామగ్రీ సమకూరుస్తుంటే తప్ప యుద్ధరంగంలో పూట గడవని పరిస్థితి ఉక్రెయిన్‌ది. అవతలున్నదేమో అపార సైనిక పాటవానికి మారుపేరైన రష్యా. అలాంటి అగ్రరాజ్యంలో ఉక్రెయిన్ బీభత్సం ఎలా సృష్టించిందనేదే ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న.🇺🇦 #Ukraine - 🇷🇺 #Russia: Ukraine struck four Russian airbases in a coordinated long-range drone attack, destroying over 40 aircraft, including Tu-95 and Tu-22M3 bombers, as well as an A-50 surveillance jet. The drones were smuggled deep into Russia, hidden inside wooden sheds… pic.twitter.com/y7L0wVTMS6— POPULAR FRONT (@PopularFront_) June 1, 2025 రహస్యంగా రష్యాలోకి డ్రోన్ల తరలింపుఈక్రమంలో రష్యాపై ఉక్రెయిన్ దాడి జరిపిన తీరుపై జాతీయ,అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగా.. మూడు టైమ్ జోన్లు. 6,000 కి.మీ. పరిధిలో ఉన్న ఐదు రష్యా వైమానిక స్థావరాలు. ఏకకాలంలో విజయవంతంగా దాడులు జరిపేందుకు ఉక్రెయిన్ మార్కెట్లో అతి తక్కువ ధరకే ఒక్కో డ్రోన్ ఖరీదు 1200 డాలర్లు ఖర్చుతో మొత్తం 117 డ్రోన్లను సెమీ ట్రైలర్ ట్రక్కుల్లో నింపింది. ఇందుకోసం ట్రక్కును ప్రత్యేకంగా చెక్కతో డిజైన్ చేయించింది. Today, a brilliant operation was carried out. The preparation took over a year and a half. What’s most interesting, is that the “office” of our operation on Russian territory was located directly next to FSB headquarters in one of their regions.In total, 117 drones were used in… pic.twitter.com/tU0SMN9jdB— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) June 1, 2025మనుషుల అవసరం లేకుండానేమనుషుల సహాయం లేకుండా ఉక్రెయిన్‌లో ఉండి.. రష్యాలోకి చొరబడ్డ ట్రక్ డోర్లును ఓపెన్ చేయడం, ట్రక్కు లోపల ఉన్న డ్రోన్లు లోపలి నుంచి ఎగురుకుంటూ బయటకు రావడం, రష్యా బాంబర్ విమానాలపై మెరుపు దాడి చేయడం ఇదంతా ఉక్రెయిన్ రిమోట్ కంట్రోల్‌తో చేసింది. ఫలితంగా కొన్ని గంటల వ్యవధిలో రష్యా 40 యుద్ధ విమానాలు సర్వనాశనం చేసింది. ఈ హాని విలువ సుమారుగా 7 బిలియన్ (దాదాపు రూ.60వేల కోట్లకు)పైగా ఉన్నట్లు అంచనా.రష్యన్ భద్రతా సంస్థకు సమీపం నుంచి ఈ దాడిలో అత్యంత కీలకమైనది సైబీరియాలోని ఇర్కుట్స్క్ ప్రాంతంలోని బిలాయా ఎయిర్ బేస్. ఇది ఉక్రెయిన్ నుండి దాదాపు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది సాధారణంగా ఉక్రెయిన్ డ్రోన్లు చేరుకోలేని దూరం. అందుకే ప్రత్యేక వ్యూహంతో డ్రోన్లను దగ్గరకు తీసుకెళ్లి దాడి చేశారు. ఈ ఆపరేషన్‌ను రష్యన్ భద్రతా సంస్థ (FSB) కార్యాలయానికి సమీపంలో కోఆర్డినేషన్ సెంటర్ నుంచి చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. స్పైడర్స్ వెబ్ అనే కోడ్ పేరుతో జరిగిన అతిపెద్ద దాడిని చరిత్ర పుటల్లో నిలిచిపోయే ఆపరేషన్‌గా అభివర్ణించారు. “The ‘office’ of our operation on Russian territory was located directly next to an FSB headquarters in one of their regions,” — Zelenskyy. pic.twitter.com/RC10fBPUrG— Special Kherson Cat 🐈🇺🇦 (@bayraktar_1love) June 1, 2025ఈ దాడిలో మూడున్నరేళ్లుగా ఉక్రెయిన్‌పై క్షిపణి, బాంబు దాడులకు రష్యా ప్రధానంగా ఉపయోగిస్తున్న సైనిక విమానాల్లో టు-95, టు-22ఎం, టు-160 వంటి వ్యూహాత్మక బాంబర్లతో పాటు ఏ-50 విమానం కూడా ఉంది. ఈ దాడి ద్వారా రష్యా క్రూయిజ్ మిసైల్ వాహక బాంబర్లలో సుమారు 34శాతం నష్టం జరిగింది.జెలెన్స్కీ ఈ ఆపరేషన్‌ను స్వయంగా పర్యవేక్షించారు. ఈ దాడి కోసం 18 నెలలపాటు ప్రణాళికలు రూపొందించారు. దాడికి ముందు, ఆపరేషన్‌లో పాల్గొన్న అన్ని గూఢచారులను రష్యా భూభాగం నుండి ఉక్రెయిన్ సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దాడిని ధ్రువీకరించింది. కానీ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. ఈ విమానాల నష్టం వల్ల ఉక్రెయిన్‌పై విధ్వంసకర క్షిపణి దాడులను అందించగల సామర్ధ్యం రష్యాకు తగ్గే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
మూడో ప్రపంచ యుద్ధమే.. ట్రంప్ వ్యాఖ్యలకు రష్యా వార్నింగ్
మాస్కో: అమెరికా, రష్యా మధ్య మాటల మంటలు పరాకాష్టకు చేరుతున్నాయి. ఉక్రెయిన్‌తో శాంతి చర్చల్లో పాల్గొనకపోవడం ద్వారా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిప్పుతో చెలగాటం ఆడుతున్నారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించడం తెలిసిందే. ‘నేనే లేకుంటే రష్యా లెక్కలేనన్ని దుస్సంఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చేది’ అంటూ పుతిన్ తీరును ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలపై రష్యా మాజీ అధ్యక్షుడు, పుతిన్ సన్నిహితుడు దిమిత్రి మెద్వెదేవ్ ఘాటుగా స్పందించారు. ‘‘నాకు తెలిసిన అతి పెద్ద దుస్సంఘటన ఒక్కటే. మూడో ప్రపంచ యుద్ధం! నా మాటల ఆంతర్యాన్ని ట్రంప్ అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నా’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రపంచం మొత్తాన్నీ యుద్ధంలోకి లాగుతామన్నదే మెద్వెదేవ్ ఆంతర్యమని విశ్లేషకులు అంటున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవి నిజంగా నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలని ట్రంప్ సీనియర్ సలహాదారు, ఉక్రెయిన్ ప్రత్యేక రాయబారి కీత్ కెల్లాగ్ విమర్శించారు. -
దూసుకొచ్చిన డ్రోన్లు.. పుతిన్‌పై హత్యాయత్నం?
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin)పై హత్యాయత్నం జరిగిందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది!. పుతిన్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ల దాడి జరిగిందని.. అయితే ఆ ప్రయత్నాన్ని సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందని ఆ దేశ సైన్యాధికారి ఒకరు తాజాగా వెల్లడించారు.రష్యా న్యూస్ ఏజెన్సీ ఆర్బీసీ కథనం ప్రకారం రష్యా ఎయిర్ డిఫెన్స్ యూనిట్ కమాండర్ యూరీ డాష్కిన్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘మే 20-22 తేదీల మధ్య ఉక్రెయిన్ భారీ సంఖ్యలో డ్రోన్లతో(Ukraine Drone Attacks) రష్యాపై దాడికి తెగబడింది. అయితే రష్యా వైమానిక దళం ఆ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో 1,170 డ్రోన్లను నాశనం చేసింది... మే 20వ తేదీన కురుస్క్(Kursk)లో దాడి జరగ్గా.. 46 డ్రోన్లను రష్యా సైన్యం నాశనం చేసింది. అయితే అదే తేదీన పుతిన్ ఆ ప్రాంతంలో పర్యటించారు. ఆయన హెలికాఫ్టర్ ప్రయాణిస్తున్న మార్గంలోకి హఠాత్తుగా డ్రోన్లు దూసుకొచ్చాయి. అయితే సకాలంలో వాటిని వైమానిక బలగాలు నేలకూల్చాయి. ఆపై అధ్యక్షుడి ప్రయాణం కొనసాగింది. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరుగుతోంది’’ అని యూరీ డాష్కిన్ వెల్లడించారు. అయితే ఈ ప్రకటనపై ఉక్రెయిన్ నుంచి ఎలాంటి స్పందన లేదు.మరోవైపు.. ఈ పరిణామం ఉక్రెయిన్ డ్రోన్ల సామర్థ్యంపై రష్యాకు ఆందోళన కలిగిస్తోందన్న చర్చ నడుస్తోంది. అయితే అసలు ఇది పుతిన్‌పై జరిపిన హత్యాయత్నమేనా? లేక ఉక్రెయిన్ ఆడుతున్న మైండ్ గేమా? అనే దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు.. కౌంటర్‌గా రష్యా ఉక్రెయిన్‌పై ప్రతిదాడికి దిగింది. శనివారం రాత్రి రాజధాని కీవ్ నగరంతో పాటు పలు చోట్ల డ్రోన్లు, మిస్సైల్స్‌తో విరుచుకుపడింది. అయితే రష్యా దాడులపై అమెరికా సహా అంతర్జాతీయ సమాజం మౌనంగా ఉండడం ఏమాత్రం సరికాదని, ఇది పుతిన్‌ను మరింత రెచ్చిపోయేలా చేస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ అన్నారు. ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ ప్రత్యేక రాయబారి కీత్ కెల్లోగ్ రష్యా దాడులను తీవ్రంగా ఖండించారు. ఇదీ చదవండి: పుతిన్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు, ఏమన్నారంటే.. -
పుతిన్‌కు పిచ్చి పట్టింది.. రష్యాకు ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్, రష్యా మధ్య కాల్పుల విరమణకు సంబంధించి మంతనాలు జరుగుతున్న వేళ పుతిన్ సైన్యం దాడులు చేయడంతో మండిపడ్డారు. పుతిన్ పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు అంటూ అసహనం వ్యక్తపరిచారు.ట్రంప్ తాజాగా ట్విట్టర్‌లోని ట్రుత్ వేదికగా స్పందిస్తూ..‘రష్యా అధ్యక్షుడు పుతిన్ నాకు చాలా కాలంగా తెలుసు, మా మధ్య మంచి సంబంధం ఉంది. కానీ, ఇప్పుడు పుతిన్ వ్యవహారం సరిగా లేదు. ఆయన పూర్తిగా పిచ్చివాడైపోయాడు. ఈ వ్యక్తికి ఏమైందో నాకు తెలియదు. ఉక్రెయిన్‌పై ఆయన బాంబుల వర్షం కురిపిస్తున్నాడు. ఎటువంటి కారణం లేకుండా ఉక్రెయిన్ నగరాలపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తున్నారు. నగరాలపై దాడి చేస్తున్నాడు. అన్యాయంగా ప్రజలను చంపుతున్నాడు. నాకు ఇది అస్సలు ఇష్టం లేదు.Donald Trump Truth Social 05.25.25 08:46 PM ESTI’ve always had a very good relationship with Vladimir Putin of Russia, but something has happened to him. He has gone absolutely CRAZY! He is needlessly killing a lot of people, and I’m not just talking about soldiers. Missiles…— Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) May 26, 2025పుతిన్.. ఉక్రెయిన్‌లోని ఒక భాగాన్ని మాత్రమే కాకుండా, మొత్తం ఉక్రెయిన్ను కోరుకుంటున్నారని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను. బహుశా అది నిజమే కావచ్చు.. కానీ అలా చేస్తే, అది రష్యా పతనానికి దారి తీస్తుంది. అధ్యక్షుడు జెలెన్స్కీ తను మాట్లాడే విధానం ద్వారా తన దేశానికి ఎటువంటి మేలు చేయడం లేదు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట సమస్యలను సృష్టిస్తుంది. అతడు తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి చేసింది. ఉక్రెయిన్‌లోని వివిధ ప్రాంతాల్లో రష్యా 367 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. ఉక్రేనియన్ వైమానిక దళం ప్రకారం, వారు 45 క్షిపణులను కూల్చివేసి 266 డ్రోన్లను ధ్వంసం చేశారు. అనేక నగరాల్లో భారీ విధ్వంసం జరిగింది. కీవ్‌తో సహా 30 కి పైగా నగరాలు, గ్రామాలు దెబ్బతిన్నాయి. ఈ దాడిలో కనీసం 12 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు. -
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. యువతితో మస్క్‌పై పుతిన్ కుట్ర?
వాషింగ్టన్: సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంపై పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యుద్ధం ప్రారంభంలో రహస్యాల్ని తెలుసుకునేందుకు అపర కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon musk)పై రష్యా యువతితో వలపు వల విసిరినట్లు మాజీ ఎఫ్‌బీఐ కౌంటర్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఏజెంట్ జోనాథన్ బౌమా సంచలన వ్యాఖ్యలు చేశారు.జర్మన్ బ్రాడ్‌కాస్టర్ జెడ్‌డీఎఫ్ తీసిన డాక్యుమెంటరీలో జోనాథ్ బౌమా మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ యుద్ధానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా రష్యా ఇంటెలిజెన్స్ సాయంతో ఎలాన్ మస్క్, పేపాల్ సహ వ్యవస్థాపకుడు పీటర్ థీల్‌పై ఓ యువతి ప్రయోగించారు. మస్క్‌కు ఉన్న జూదం,మత్తు పదార్ధాల వినియోగంలాంటి వీక్నెస్ను అడ్డం పెట్టుకుని యుద్ధం సమాచారం సేకరించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. పుతిన్‌కు ఆపరేషన్ గురించి తెలుసా?ఇక మస్క్, పీటర్ థీల్‌పై జరిగిన ఈ సీక్రెట్ ఆపరేషన్ పుతిన్ కనుసన్నల్లోనే జరిగింది. పుతిన్ అనుమతి లేకుండా స్పై చేయరు కదా? అని జోనాథన్ బౌమా అన్నారు. అయితే, రష్యా జరిపిన సీక్రెట్ ఆపరేషన్‌లో మస్క్, పీటర్ థీల్ చిక్కుకున్నారా? లేదా? అనే విషయాల్ని వెల్లడించేందుకు జోనాథన్ బౌమా విముఖత వ్యక్తం చేశారు.కాగా, ఎఫ్‌బీఐలో 16 ఏళ్లు పని చేసిన జోనాథ్ బౌమా ఓ మీడియా సంస్థకు రహస్య సమాచారాన్ని అందించారు. దీంతో అమెరికా ప్రభుత్వం జోనాథ్ బౌమాను అరెస్ట్ చేసింది. చివరకు లక్షడాలర్ల పూచికత్తుతో బెయిల్‌పై విడుదలయ్యారు. -
పుతిన్ లేకుండానే ఉక్రెయిన్–రష్యా చర్చలు
ఇస్తాంబుల్: తుర్కియే వేదికగా ఉక్రెయిన్‌తో జరిగే మొట్టమొదటిసారిగా జరిగే ప్రత్యక్ష శాంతి చర్చలకు అధ్యక్షుడు పుతిన్ హాజరుకావడం లేదని రష్యా తెలిపింది. అధ్యక్షుడు పుతిన్ సహాయకుడు వ్లాదిమిర్ మెడిన్స్కీ సారథ్యంలోని బృందం గురువారం తుర్కియే రాజధాని అంకారా చేరుకుందని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా వెల్లడించారు. ముగ్గురు సభ్యులతో కూడిన సీనియర్ అధికారుల బృందానికి సాయంగా నలుగురితో కూడిన నిపుణుల బృందం కూడా ఉందన్నారు. ఉక్రెయిన్‌తో జరిగే చర్చలకు అధ్యక్షుడు పుతిన్ వెళ్లడం లేదన్నారు. మూడేళ్లుగా జరిగే యుద్ధానికి ముగింపు పలికేందుకు తుర్కియేలో జరిగే శాంతి చర్చలకు రావాలని పుతిన్‌కు జెలెన్స్కీ సవాల్ విసిరారు. తాజా పరిణామంపై తుర్కియేలోని అంటాల్యాలో జరుగుతున్న నాటో సమావేశానికి హాజరైన జెలెన్స్కీ మీడియాతో మాట్లాడుతూ.. కీలకమైన విధాన నిర్ణయాలను తీసుకునే అధికారం ఆ బృందంలోని వారెవరికీ లేదని వ్యాఖ్యానించారు. అందుకే చర్చలకు తాను సైతం వెళ్లనని, రక్షణ మంత్రి రుస్తెం ఉమెరోవ్ సారథ్యంలో ప్రతినిధి బృందాన్ని పంపుతానని ప్రకటించారు. తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్‌తో మాట్లాడాక చర్చల తేదీ, ప్రాంతం వెల్లడిస్తామన్నారు. రష్యాపై ఆంక్షలను మరింత కఠినతరం చేస్తామన్న యూరప్ నేతల హెచ్చరికలు, ట్రంప్ ఒత్తిడితో పుతిన్ ఈ చర్చలకు హాజరయ్యే అవకాశముందని సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. చివరికి ఇరుదేశాల అధ్యక్షులకు బదులుగా ప్రతినిధి బృందాలను పంపడం నిరాశ కలిగించిందని పరిశీలకులు అంటున్నారు. నేను వెళ్లనిదే పుతిన్ రారు తుర్కియేలో జరిగే చర్చలకు పుతిన్ హాజ రు కాకపోవడంపై ఖతార్‌లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. ఈ విషయం తనకు ఆశ్చ ర్యం కలిగించలేదన్నారు. ‘నేను వెళ్లనిదే ఆ యన అక్కడికి రావడం అసాధ్యం’అంటూ పుతిన్ నిర్ణయాన్ని సమరి్ధస్తూ మాట్లాడారు. -
భారత్‌కు అండగా ఉంటాం: రష్యా
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేసి మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్తాన్ ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. భారత్ కు అండగా ఉంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం మోదీకి ప్రత్యేకంగా ఫోన్ చేసిన పుతిన్.. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో భారత్ కు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు మృతిచెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు పుతిన్,. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రన్ ధీర్ జైశ్వాల్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరుకు రష్యా అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దారుణమైన దాడికి పాల్పడిన వారిని, వారి మద్దతుదారులను చట్టం ముందుకు తీసుకురావాలని పుతిన్ నొక్కి చెప్పినట్లు స్సష్టం చేశారుఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణ తలపిస్తోంది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ భూ భాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్.. ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి చేసే యత్నాలను ఇప్పటికే భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ పౌరులు భారత్ ను విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాల దగ్గర్నుంచి పలు నిషేధాజ్ఞల్ని భారత్ అమలు చేస్తూ వస్తోంది. సింధూ జలాలను పాక్‌కు వెళ్లకుండా నిలిపివేయడం, భారత్‌లో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖుల యూట్యూబ్ చానెళ్ల నిలిపివేత, భారత్ జలాల్లోకి పాక్ ఓడలు రాకుండా నిషేధం, పాక్ దిగుమతులపై నిషేధం ఇలా పలు రకాలైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తాం..ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తామని రెండురోజుల క్రితం మరోసారి హెచ్చరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. మానవాళికి ఉగ్రవాదం అనేది అతి పెద్ద వినాశనకారి అని పేర్కొన్న మోదీ.. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఉగ్రదాడి తర్వాత మోదీ మాట్లాడుతూ.. పహల్గామ్ పై ఘటనకు బాధ్యులైన వారిని ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రస్తక్తే లేదన్నారు. వారిని మట్టిలో కలిపేస్తామంటూ మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మరోసారి ఉగ్రచర్యలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు. -
ఉక్రెయిన్‌లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ
మాస్కో: ఉక్రెయిన్‌లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ (Ceasefire)ను ప్రకటించింది. విక్టరీ డే నేపథ్యంలో వచ్చే నెల 8 నుంచి 10వ తేదీవరకు పూర్తిస్థాయి కాల్పుల విరమణ పాటిస్తామని క్రెమ్లిన్ వెల్లడించింది.మానవతా దృక్పథంతో దేశాధ్యక్షుడు పుతిన్ ఈమేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ ఈ ప్రకటన వెలువడింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా రష్యా ప్రభుత్వం ఏటా మే 9న విక్టరీ డే వేడుకలు నిర్వహిస్తుంది.అమెరికా నుంచి శాశ్వత కాల్పుల విరమణ, శాంతి చర్చల ఒప్పందంపై ఒత్తిడి పెరుగుతున్న వేళ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నిర్ణయం ప్రకటించారు. ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ మీద దాడులు ఆపాలంటూ రష్యాను కోరిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు జరుపుతున్న భీకరదాడులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారాయన. అదే సమయంలో.. శాంతి ఒప్పందంలో భాగంగా క్రిమియాను వదులుకోవాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీకి సూచించారు కూడా. -
శాంతి చర్చల్లో పురోగతి?.. ట్రంప్ కీలక ప్రకటన
రోమ్: ఉక్రెయిన్ సంక్షోభం ముగింపు దిశగా కీలక అడుగు పడిందా?. ఆ దేశ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీతో నేరుగా చర్చలు జరిపేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమ్మతి తెలిపారా?. శుక్రవారం అమెరికా దౌత్యవేత్తతో జరిగిన చర్చల సారాంశం ఇదేనని తెలుస్తుండగా.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఈ విషయంపై నేరుగా ప్రకటన చేయడం గమనార్హం.పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో(Pope Francis Funeral) పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోమ్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒప్పందానికి చాలా దగ్గరగా పరిస్థితులు వచ్చాయని వ్యాఖ్యానించారు. ‘‘చర్చల్లో ఒక మంచి రోజు. రష్యా ఉక్రెయిన్లు నేరుగా సమావేశం అయ్యేందుకు అంగీకరించాయి. చాలావరకు అంశాలపై సానుకూలంగా రెండు దేశాలు స్పందించాయా’’ అని మీడియాతో ప్రకటించారాయన. ఆ తర్వాత ఇదే విషయాన్ని ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేశారు.మరోవైపు.. క్రెమ్లిన్(Kremlin) వర్గాలు తమ అధ్యక్షుడు పుతిన్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో అమెరికా దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్తో జరిగిన చర్చ సానుకూలంగా జరిగిందని ప్రకటించింది. ఇదిలా ఉంటే.. శాంతి ఒప్పందానికి తాము సిద్ధమేనని, అయినప్పటికీ ఎట్టిపరిస్థితుల్లో క్రిమియాను వదులుకునేందుకు ఉక్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లో సిద్ధంగా లేదని ఆ దేశ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. కానీ, శుక్రవారం టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ట్రంప్ ఇంటర్వ్యూలో.. క్రిమియా రష్యాతోనే ఉంటుందని, జెలెన్స్కీ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించడం గమనార్హం.అమెరికన్ బిలియనీర్ అయిన స్టీవ్ విట్కాఫ్(Steve Witkoff).. ట్రంప్‌కు అత్యంత నమ్మకస్తుడు కూడా. అందుకే ఆయన్ని ఈ శాంతి చర్చల్లో మధ్యవర్తిత్వం కోసం ట్రంప్ ప్రయోగించారు. అయితే ఉక్రెయిన్ను రెచ్చగొట్టేలా ఆయన తరచూ వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం.ఇదిలా ఉంటే.. చర్చల్లో పురోగతి గనుక చోటు చేసుకుంటే తాను మధ్యవర్తిత్వం నుంచి తప్పుకుంటానంటూ ట్రంప్ గత కొంతకాలంగా చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఆయనకు చాలా బాధ్యతలు ఉన్నాయని.. ఈ సాగదీత వ్యవహారం ఇలాగే కొనసాగితే పెద్దన్న పాత్ర నుంచి ఆయన తప్పుకుంటారని వైట్‌హౌజ్ వర్గాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. ఈలోపే.. చర్చల్లో పురోగతి చోటు చేసుకుందన్న ప్రకటన వెలువడడం గమనార్హం. 2022 ఫిబ్రవరిలో రష్యా బలగాలు ఉక్రెయిన్ ఆక్రమణతో మొదలు పెట్టిన యుద్ధం.. నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఇరువైపుల నుంచి వేల మంది మరణించగా.. ఆస్తి నష్టం ఊహించని స్థాయిలోనే జరిగింది. తాజాగా.. రష్యా కీవ్‌పై జరిపిన దాడుల్లో 12 మంది మరణించారు. ఈ కారణంగా పోప్ అంత్యక్రియలకు జెలెన్స్కీ హాజరు కాకపోవచ్చనే చర్చ నడుస్తోంది. మరోవైపు.. విట్కాఫ్తో పుతిన్ చర్చ జరగడానికి కొన్నిగంటల ముందే.. మాస్కో శివారులో కారు బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో రష్యా జనరల్ యరోస్లావ్ మోస్కాలిక్ కన్నుమూయడం విశేషం. అయితే ఇది ఉక్రెయిన్ పనేనని రష్యా ఆరోపిస్తుండగా.. కీవ్ వర్గాలు ఇంతదాకా ఎలాంటి స్పందన చేయలేదు.తాను అగ్రరాజ్య అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఈ సంక్షోభానికి ముగింపు పలకాలని ట్రంప్ ప్రయత్నిస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో ఇటు పుతిన్‌పై, అటు జెలెన్స్కీ తీరుపై(దాడులు కొనసాగిస్తుండడం.. చర్చలకు అడుగులు ముందుకు పడకుండా చేస్తుండడం) ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. -
పుతిన్‌పై వ్యూహాత్మక దాడి.. ప్లాన్ బీ అమలులో ట్రంప్, జెలెన్స్కీ!
కీవ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఉక్రెయిన్ జెలెన్స్కీ సంచలన ఆరోపణలు చేశారు. పుతిన్ చెప్పుదొకటి.. చేసేదొకటి అని మండిపడ్డారు. ఈస్టర్ సందర్భంగా కాల్పులు విరమణ పాటిస్తున్నామంటూనే.. రష్యా సైన్యం కాల్పులు జరిపిందని చెప్పుకొచ్చారు. మరోవైపు.. కాల్పులు విరమణ విషయంలో రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. దీంతో, క్రెమ్లిన్ కీలక ప్రకటన చేసింది.ఈస్టర్ కాల్పులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తాజాగా స్పందిస్తూ..‘కాల్పులు విరమణ పాటిస్తామన్న రష్యా తమ మాట నిలబెట్టుకోలేదు. ఈస్టర్ సందర్భంగా కూడా దాడులు చేసింది. రష్యా సరిహద్దు ప్రాంతాలైన కుర్స్క్, బెల్గోరోడ్లలో రష్యా సైన్యం కాల్పులు జరిపింది. శనివారం సాయంత్రం నుండి 30 గంటల ఈస్టర్ కాల్పుల విరమణను ప్రకటించిన తర్వాత రష్యా దాడులు చేయడమేంటి?. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన కొన్ని గంటల్లోనే కీవ్, ఇతర ప్రాంతాలలో వైమానిక దాడి సైరన్లు వినిపించాయి. ఇది రష్యా చర్యలకు అద్దం పడుతుంది. నిశ్శబ్దానికి ప్రతిస్పందనగా నిశ్శబ్దం, దాడులకు ప్రతిస్పందనగా రక్షణాత్మక దాడులు ఉంటాయి’ అని హెచ్చరించారు.ఇదిలా ఉండగా.. 30 రోజుల పూర్తి కాల్పుల విరమణ కోసం అమెరికా మద్దతుతో కూడిన ప్రతిపాదనకు ఉక్రెయిన్ ముందుగా అంగీకరించింది, దానిని రష్యా తిరస్కరించిన విషయం తెలిసిందే. కాగా, యుద్ధం విషయంలో చర్చలు ఓ కొలిక్కి రాకపోవడం పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధ విరమణ చేయించాలన్న తన ప్రయత్నాలకు ఆ రెండు దేశాలు సహకరించడంలేదని తెలిపారు.A report by the Commander-in-Chief. We are documenting the actual situation on all directions. The Kursk and Belgorod regions — Easter statements by Putin did not extend to this territory. Hostilities continue, and Russian strikes persist. Russian artillery can still be heard…— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) April 19, 2025ఇదే సమయంలో.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో పురోగతి ఏమీ కనిపించకుంటే.. ఆ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చే ప్రయత్నాల నుంచి తాము విరమించుకుంటామని అమెరికా ప్రకటన వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ స్పందించింది. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు చర్యలు తీసుకుంటామని.. ఈ దిశగా త్వరలో ముందుకు సాగే అవకాశం ఉందని పేర్కొంది. తమ స్వంత ప్రయోజనాలను కాపాడుకోవడానికి.. కీవ్, అమెరికాతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నారు. ఈ చర్చలు చాలా క్లిష్టమని అంగీకరించినప్పటికీ.. వాటిని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ అధినేత పుతిన్‌కు మధ్య ప్రస్తుతం ముందస్తు సమావేశాలు లేవని.. కానీ అవసరం అయితే వెంటనే సమావేశమవుతామని తెలిపారు. అలాగే, ఈ ఘర్షణ విషయంలో ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌పై ఎలాంటి ఒత్తిడి తీసుకురావట్లేవని విమర్శించారు. -
పుతిన్‌తో ట్రంప్ ప్రతినిధి విట్కాఫ్ భేటీ
మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమా వేశమయ్యారు. ఉక్రెయిన్‌తో కాల్పుల విర మణ ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు రావాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్‌పై ఒక అంగీకారానికి వచ్చే విష యమై సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో అధ్యక్షుడు పుతిన్‌తో విట్కాఫ్ నాలుగు గంటలకుపైగా చర్చలు జరిపారని, ఇవి ఫలవంతమయ్యా యని ప్రత్యేక ప్రతినిధి కిరిల్ దిమిత్రియేవ్ చెప్పారు. అమెరికా, రష్యాల మధ్య సంబంధాలను సాధారణ స్థాయికి తెచ్చే ప్రక్రియ సాగుతున్నందున చర్చల్లో కీలక పురోగతి సాధించొచ్చన్న ఊహాగానాలు చేయవద్దని అంతకుముందు దిమిత్రియేవ్ వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, ఈ ఏడాదిలో పుతి న్, విట్కాఫ్ల మధ్య జరిగిన మూడో భేటీ ఇది. రష్యా అధ్యక్షుడు పుతిన్ వైఖరిని శుక్ర వారం ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ‘ఇది మతిలేని యుద్ధం, వేలాదిగా జనం చ నిపోతున్నారు. కాల్పుల విరమణకు రష్యా ముందుకు రావాలి’అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం జర్మనీని విడదీసినట్లుగానే ఉక్రెయిన్ ను రెండుగా చీల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వస్తున్న వార్తలను ఉక్రెయిన్ దూత కీత్ కెల్లాగ్ ఖండించిన నేపథ్యంలో ట్రంప్ ఈ మేరకు స్పందించడం గమనార్హం. పశ్చిమ ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాల నియంత్రణను బ్రిటన్, ఫ్రాన్సు బలగాలకు అప్పగించే ప్రతిపాదన ఉన్నట్లు కెల్లాగ్ తెలిపారని టైమ్స్‌లో ఓ కథనం వెలువడింది. అనంతరం దీనిని కెల్లాగ్ ఖండించారు. తన వ్యాఖ్యలను వక్రీ కరించారని చెప్పారు. కాల్పుల విరమణ అనంతరం ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు వీలుగా సైనిక మద్దతి వ్వాలని చెప్పానే తప్ప, విభజన గురించి మాట్లాడలేదన్నారు. -
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు.. ట్రంప్ రియాక్షన్ ఇదే..
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దాడులు చేయకుండా తాము రష్యాను ఆపాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. యుద్ధం కారణంగా ప్రతీ వారం వేలాది మంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించారు. ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..‘ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తోంది. మేము రష్యాతో మాట్లాడుతున్నాం. దాడులను ఆపాలని మేము కోరుకుంటున్నాం. నిరంతరం రష్యా బాంబు దాడులు చేయడం సరికాదు. దాడుల కారణంగా ప్రతీ వారం వేలాది పౌరులు చనిపోతున్నారు. ఇలా జరగడం నాకు ఇష్టం లేదు. కాల్పులు విరమణపై చర్చలు జరుగుతున్నాయి. రష్యాను ఒప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాము’ అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. ఇటీవల పుతిన్‌తో ట్రంప్ ఫోన్లో మాట్లాడిన అనంతరం.. కాల్పుల విరమణ ఒప్పందానికి మాస్కో కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే, రష్యాపై పశ్చిమదేశాల ఆంక్షలు ఎత్తివేస్తేనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలుచేస్తామని పుతిన్ షరతు పెట్టినట్లు తెలుస్తోంది. అంతేగాక.. జపోరిజియా అణు విద్యుత్ ప్లాంట్‌ను ఉక్రెయిన్‌కు తిరిగిచ్చేందుకు కూడా రష్యా నిరాకరిస్తున్నట్లు సమాచారం. కీవ్‌తో కాల్పుల విరమణ అంశాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ కావాలనే సాగదీస్తున్నారని ట్రంప్ చెప్పుకొచ్చారు. వాషింగ్టన్ మధ్యవర్తిత్వాన్ని మాస్కో తారుమారు చేస్తోందని ఆరోపించారు.#WATCH | On the ongoing Russia-Ukraine war, and if any peace deal is expected, US President Donald Trump says, "We are talking to Russia, we would like them to stop. I don't like them bombing on and on, and every week thousands of young people being killed."(Source - US Network… pic.twitter.com/L15l0oECdw— ANI (@ANI) April 7, 2025ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత నగరం క్రైవీరిపై శుక్రవారం రష్యా క్షిపణి దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో తొమ్మిది మంది చిన్నారులు సహా మొత్తం 18 మంది మరణించారు. ఈ ఘటనపై ఉక్రెయిన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం స్పందించిన తీరుపై జెలెన్స్కీ అసహనం వ్యక్తం చేశారు. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ భావోద్వేగ పోస్టు పెట్టారు. జెలెన్స్కీ మాట్లాడుతూ..‘క్రైవీరిపై జరిగిన దాడి విషయంలో అమెరికన్ ఎంబసీ స్పందన పేలవంగా ఉంది. అంత పెద్ద దేశం ఇలాంటి బలహీన ప్రకటన చేయడం ఆశ్చర్యంగా ఉంది. చిన్నారులను చంపిన క్షిపణి గురించి మాట్లాడేటప్పుడు వారు ‘రష్యన్’ అనే పదాన్ని చెప్పడానికి కూడా భయపడుతున్నారు. యుద్ధం ముగియాలి. అయితే ఈ ఉద్రిక్తతలను ముగించాలనే ఉద్దేశం రష్యాకు లేదు. కాల్పుల విరమణను కాకుండా చిన్నారుల ప్రాణాలు తీయడాన్ని మాస్కో ఎంచుకుంటోంది. అందుకే ఆ దేశంపై పూర్తిస్థాయి ఒత్తిడి తీసుకురావాలి’ అని కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో రష్యా దాడిపై జపాన్, స్విట్జర్లాండ్ దేశాల రాయబార కార్యాలయాలు స్పందించిన తీరును జెలెన్స్కీ ప్రశంసించారు. -
చెప్పుకోవడానికే బలమైన దేశం.. చేతల్లో ఏమీ లేదు: జెలెన్ స్కీ
రష్యా ఉక్రెయిన్ ల శాంతి ఒప్పందం(కాల్పుల విరమణ ఒప్పంద) ఇక కార్యరూపం దాల్చేలా లేదు. ఇందుకు అమెరికా చేసిన మధ్యవర్తిత్వం ఇప్పటికే గాడి తప్పింది. ఉక్రెయిన్ తో శాంతి ఒప్పందానికి ససేమేరా అంటున్న రష్యా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినా దానిని పెడ చెవినే పెట్టింది. ఈ విషయంలో అమెరికా ఇప్పటికే చేతులెత్తేసినట్లే కనబడుతోంది.తాజాగా అమెరికాను ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చేసిన వ్యాఖ్యలు ఉదాహరణగా చెప్పొచ్చు. అమెరికా చెప్పుకోవడానికే బలమైన.. కానీ చేతల్లో ఏమీ ఉండదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.తమ దేశంపై మళ్లీ రష్యా విరుచుకుపడిన విషయాన్ని ఆమెరికాకు తెలియజేస్తే వారి నుంచి ఎటువంటి స్పందనా రాలేదన్నారు. రష్యా జరిపిన మిసైళ్ల దాడిలో 20 మంది తమ దేశ పౌరులు చనిపోయిన విషయాన్ని యూఎస్ ఎంబాసీకి తెలిపానని, అయితే వారు రష్యా పేరు పలకడానికి కూడా భయపడుతునం్నారని ఎద్దేవా చేశారు. రష్యా చేసిన దాడిలో చాలా వరకూ చిన్న పిల్లలు ఉన్నారని, ఈ విషయాల్ని పలు దేశాల ఎంబాసీలకు తెలిపినట్లు జెలెన్ స్కీ పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే అమెరికాకు కూడా తెలిపితే. రష్యా పదాన్ని వారు పలకడానికి వణుకు పోతున్నారంటూ సెటైర్లు వేశాడు. మనం చెప్పుకోవడానికే బలమైన దేశం.. బలమైన ప్రజలు.. కానీ వారి యాక్షన్ లో మాత్రం ఏమీ పస ఉండదు’ అంటూ దెప్పిపొడిచారు జెలెన్ స్కీ.జపాన్, యూకే, స్విట్జర్లాండ్, జర్మనీ తదితర దేశాల ఎంబాసీలకు తమ దేశంపై మళ్లీ జరిగిన దాడిని చెబితే.. వారి నుంచి సానుకూలమైన స్పందన వచ్చిందని, అదే అమెరికాకు చెబితే చాలా నిరూత్సాహమైన సమాధానం చెప్పారన్నారు. తమ దేశంపై శుక్రవారం రష్యా జరిపిన మిసైళ్ల దాడిలో 11 మంది పెద్దవాళ్లు, 9 మంది చిన్నపిల్లలు ఉన్నారరన్నారు. ఈ ఘటనలో 62 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారని జెలెన్ స్కీ తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ ద్వారా తెలియజేశారు. -
పుతిన్ దాడులు ఆపాలంటే.. ఇదే కరెక్ట్ ప్లాన్: జెలెన్స్కీ
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా రష్యా సైన్యం దాడిలో మరో 16 మంది చనిపోయినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అంశంపై జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాపై అమెరికా ఇప్పటికైనా ఒత్తిడి పెంచాలి అని డిమాండ్ చేశారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా వీడియాలో మాట్లాడుతూ.. రష్యా క్షిపణి దాడి తర్వాత ప్రస్తుతం క్రివీ రిహ్‌లో రెస్క్యూ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి, ఆరుగురు పిల్లలు సహా 16 మంది మరణించారు. ఖార్కివ్ లక్ష్యంగా చేసుకున్న రష్యన్ డ్రోన్ దాడి తర్వాత రోజంతా సహాయక చర్యలు కొనసాగాయి. ఆరు "షాహెద్" డ్రోన్లతో రష్యా సైన్యం ఉద్దేశపూర్వకంగా దాడి చేసింది. ఈ దాడులు ప్రమాదవశాత్తు జరగలేదు. రష్యా స్వయంగా అమెరికాతో కాల్పులు విరమణ గురించి చర్చించినప్పటికీ దాడులను కొనసాగిస్తోంది. కాల్పుల విరమణను రష్యా అధ్యక్షుడు పుతిన్ పదేపదే ఉల్లంఘిస్తున్నారు.అందుకే రష్యాపై ఒత్తిడి చాలా అవసరం. రష్యాపై ఇంకా ఆంక్షలు విధించాలి. కాల్పుల విరమణకు సంబంధించి పుతిన్‌పై అన్ని విధాలుగా ఒత్తిడి తెస్తేనే రష్యా దాడులు చేయకుండా ఉండగలదు. మార్చి 11వ తేదీ నుంచి పుతిన్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. చర్చల ద్వారా రష్యాపై ఒత్తిడి పెంచాలి. అప్పుడే పుతిన్ దారిలోకి వస్తారు అంటూ చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా, అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇరు దేశాల అధ్యక్షులతో ట్రంప్ చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కోసం ప్రయత్నించారు. Rescue operations are currently underway in Kryvyi Rih following a Russian missile strike. As of now, 16 people are confirmed dead, including six children. In Kharkiv, rescue efforts continued all day after a targeted Russian drone strike. A deliberate attack by six “Shahed”… pic.twitter.com/7TbgHQYfEI— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) April 4, 2025 -
పుతిన్ మరో సంచలన నిర్ణయం.. 1.6 లక్షల మంది సైనికులు..
మాస్కో: ఉక్రెయిన్‌తో యుద్ధం వేళ రష్యా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా తన సైనిక బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నంలో పడింది. మరో 1,60,000 మంది సైనికుల నియామకానికి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా పిలుపునిచ్చారు. జూలై నాటికి ఈ రిక్రూట్మెంట్ పూర్తి కానుంది.వివరాల ప్రకారం.. రష్యా సైనిక బలం పెంచే యోచనలో ఉన్నారు అధ్యక్షుడు పుతిన్. ఇందులో భాగంగానే 1,60,000 మంది సైనికుల నియామకానికి రంగం సిద్ధం చేశారు. 18–30 ఏళ్ల మధ్య వయసున్న పురుషులను సైన్యంలోకి తీసుకోనున్నారు. 2011 నుంచి ఇప్పటిదాకా రష్యా నిర్బంధ సైనిక రిక్రూట్మెంట్లలో ఇదే అతి పెద్దది. వచ్చే మూడేళ్లలో ఇది 1.8 లక్షలకు పెరగనుంది.ఇక, సైన్యం పరిమాణాన్ని 24 లక్షలకు, క్రియాశీల సైనికుల సంఖ్యను 15 లక్షలకు పెంచుకుంటామని పుతిన్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. కొత్త సైనికులను యుద్ధానికి పంపబోమని, ఈ నియామకాలకు ఉక్రెయిన్ యుద్ధంతో సంబంధం లేదని రక్షణ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్‌లో ప్రత్యేక సైనిక చర్యకు వారిని పంపబోమని వెల్లడించింది. Putin’s War Machine Expands: 160,000 More Drafted as Ceasefire Stalls! —largest conscription since war began. pic.twitter.com/AoTrzrzdCB— Kristin Sokoloff (@KSOKUNCENSORED) April 1, 2025 -
రష్యాను టెన్షన్ పెడుతున్న కొత్త వైరస్.. భయాందోళనలో రష్యన్లు!
మాస్కో: రష్యాలో మరో కొత్త వైరస్ విజృంభిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. అంతుచిక్కని వైరస్ కారణంగా రష్యా ప్రజలకు విపరీతమైన దగ్గుతో నోటిలో నుంచి రక్తం పడుతుందనే కథనాల్లో పేర్కొన్నాయి. వీరికి కోవిడ్ టెస్టులు చేయగా.. నెగిటివ్ వచ్చిందని.. ఇది మరో కొత్త వైరస్ అయి ఉంటుందని అభిప్రాయం వ్యక్తంచేశాయి. మరోవైపు.. ఈ కథనాలను రష్యా అధికారులు ఖండించారు. వైరస్ అంటూ వస్తున్న వార్తలు నిజం కాదన్నారు.వివరాల ప్రకారం.. రష్యాలో మిస్టరీ వైరస్ విజృంభిస్తోందని మార్చి 29న పలు నివేదికలు వెలువడ్డాయి. అలెగ్జాండ్రా అనే మహిళ ఐదు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుందని.. కొన్ని రోజులకు దగ్గుతున్న సమయంలో రక్తం పడుతున్నట్లు తెలిపిందని నివేదికలు వెల్లడించాయి. అక్కడి ప్రజలు తీవ్రమైన శ్వాసకోస సంబంధిత వ్యాధులతో.. దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారని తెలిపాయి. పలు నగరాల్లో ప్రజలు వారాలతరబడి జ్వరం, ఒళ్లు నొప్పులు, తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారని పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఎన్ని మందులు వాడినప్పటికీ తగ్గుదల కనిపించట్లేదని ఆందోళన వ్యక్తంచేశాయి. ఇదే సమయంలో మరికొందరు నెటిజన్లు తాము తీవ్రమైన రక్తంతో కూడిన దగ్గుతో బాధ పడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అలాగే, తాము కోవిడ్ టెస్టులు చేపించుకున్నప్పటికీ పాజిటివ్ రాలేదని చెప్పుకొచ్చారు. ఈ వైరస్ కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు తెలిపారు.🦠 Unknown virus emerges in Russia: people suffer from high fever and bloody cough for weeksAccording to media reports, the symptoms of those infected are identical: it begins with typical aches and weakness, but after a few days, the virus drains the person, making it… pic.twitter.com/0tsDsCfLv8— NEXTA (@nexta_tv) March 29, 2025దీంతో, కొత్త వైరస్‌పై తీవ్ర చర్చ మొదలైంది. ఈ వార్తలపై తాజాగా రష్యా అధికారులు స్పందించారు. ఈ క్రమంలో సదరు అధికారులు స్పందిస్తూ.. ఈ నివేదికలను ఖండించారు. తాము జరుపుతున్న పరీక్షల్లో దేశంలో ఎలాంటి నూతన వ్యాధి కారకాలు బయటపడలేదని.. కొత్త వైరస్ వ్యాపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని వెల్లడించారు. నివేదికల్లో పేర్కొన్న మహిళకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు మైకోప్లాస్మా న్యుమోనియా ఉన్నట్లు నిర్ధరించారని తెలిపారు. ఒకవేళ కోవిడ్ తరహా వైరస్ వస్తే దానిని ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఇక, కొత్త వైరస్‌కు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.🇷🇺 A mystery outbreak causing patients to cough up blood and suffer from a prolonged high fever has been reported in Russia, sparking fears of a new pandemic. However, Russian authorities have denied claims of an unidentified virus and have not disclosed the number of infections… pic.twitter.com/B03IPo3kPG— 🔴 Press review and more 🛰️ (@EUFreeCitizen) April 1, 2025 -
పుతిన్, జెలెన్స్కీ మధ్య అంతులేని విద్వేషం
వాషింగ్టన్: రష్యా, ఉక్రెయిన్ అధినేతలు పుతిన్, జెలెన్స్కీలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రుసరుసలాడారు. రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని నివారించి, శాంతిని నెలకొల్పడానికి తాను చేస్తున్న ప్రయత్నాలను వారు ముందుకు సాగనివ్వడం లేదని మండిపడ్డారు. ఆ ఇద్దరు నాయకుల మధ్య అంతులేని విద్వేషం కనిపిస్తోందని చెప్పారు. అయినప్పటికీ యుద్ధాన్ని ముగించే విషయంలో ఇప్పటికే ఎంతో పురోగతి సాధించానని అన్నారు. ఆదివారం ఫ్లోరిడాలోని తన ప్రైవేట్ క్లబ్ ‘మర్–అ–లాగో’లో ‘ఎన్బీసీ న్యూస్’వార్తా సంస్థకు ట్రంప్ ఇంటర్వ్యూ ఇచ్చారు. జెలెన్స్కీ విశ్వసనీయతను పుతిన్ ప్రశ్నించడం తనకు నచ్చలేదని చెప్పారు. శాంతి ఒప్పందంపై సంతకం చేసే హక్కు జెలెన్స్కీకి లేదని, ఉక్రెయిన్‌కు బాహ్య పరిపాలన అవసరమని పుతిన్ చేసిన వ్యాఖ్యల పట్ల ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని పరోక్షంగా సంకేతాలిచ్చారు. రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పుతిన్ పట్ల సానుకూల ధోరణితో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు హఠాత్తుగా స్వరం మార్చేయడం చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం విషయంలో తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోవడం పట్ల ఆయన ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. క్రిటికల్ మినరల్స్ మైనింగ్‌పై మాట తప్పితే.. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని నిలిపివేస్తానంటూ పుతిన్ తనకు హామీ ఇచ్చారని, ఈ విషయంలో ఆయన వెనక్కి తగ్గబోరని భావిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. పుతిన్ తనకు ఎన్నో ఏళ్లుగా తెలుసని, తాము కలిసి పనిచేస్తామని అన్నారు. కాల్పుల విరమణకు పుతిన్ ఎప్పుడు అంగీకరిస్తారో చెప్పలేనని, దానిపై సైకలాజికల్ డెడ్‌లైన్ ఉందని వెల్లడించారు. ఉక్రెయిన్‌కు ఇన్నాళ్లూ అందించిన ఆర్థిక, సైనిక సాయానికి బదులుగా అరుదైన ఖనిజాల తవ్వకానికి అమెరికాకు అనుమతి ఇవ్వడానికి జెలెన్స్కీ అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే, విషయంలో జెలెన్స్కీ మోసం చేసే అవకాశం ఉన్నట్లు తమకు సమాచారం అందని ట్రంప్ చెప్పారు. క్రిటికల్ మినరల్స్ మైనింగ్ విషయంలో మాట తప్పితే చాలాచాలా పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జెలెన్స్కీని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. ఉక్రెయిన్ భద్రతకు స్పష్టమై హామీని ఇవ్వాలంటూ మిత్రదేశాలతో ఒప్పందం కుదుర్చుకోవాలన్న ఆలోచనలో జెలెన్స్కీ ఉన్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌కు ‘నాటో’సభ్యత్వం లభించే అవకాశమే లేదని, ఆ విషయం జెలెన్స్కీకి కూడా తెలుసని తే ల్చిచెప్పారు. సాధ్యమైనంత త్వరగా కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ ప్రభుత్వం చెబుతుండగా పుతిన్ ప్రభుత్వం అంగీకరించడంలేదు. కనీసం 30 రోజులపాటు దాడులు ఆపేయాలని కోరినా లెక్కచేయడం లేదు. పైగా ఉక్రెయిన్‌పై వైమానిక, క్షిపణి దాడులను మరింత ఉధృతం చేస్తుండడం గమనార్హం. -
ఇప్పుడు పుతిన్ వంతు.. త్వరలో భారత్‌కు
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) భారతదేశ ఆహ్వానాన్ని మన్నించారు. త్వరలో ఆయన భారత్‌కు రానున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ధృవీకరించారు. ఉక్రెయిన్ సంక్షోభం మొదలయ్యాక ఆయన భారత్‌కు వస్తుండడం ఇదే.నరేంద్ర మోదీ(Narendra Modi) మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టాక రష్యాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే పుతిన్‌ను ప్రధాని మోదీ భారత్‌కు ఆహ్వానించారు. అయితే ఆ ఆహ్వానంపై ఇప్పుడు క్రెమ్లిన్ వర్గాలు ఒక ప్రకటన చేశాయి. మోదీ మూడోసారి గెలిచాక మా దేశానికే మొదట వచ్చారు. ఇక ఇప్పుడు మా వంతు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి అని సెర్గీ ప్రకటించారు. అయితే ఆ పర్యటన ఎప్పుడు ఉంటుందనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.భారత్-రష్యా మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉంటాయన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉక్రెయిన్ యుద్ధం సైతం దీనిపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. పైగా రష్యా-ఉక్రెయిన్(Russia-Ukraine) మధ్య చర్చలు.. శాంతి ఒప్పందం ద్వారానే యుద్ధం ముగుస్తుందని భారత్ మొదటి నుంచి చెబుతూ వస్తోంది.పుతిన్ గతంలో చాలాసార్లు భారత పర్యటనకు వచ్చారు. 2000 సంవత్సరంలో అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా ఆయన భారత భూభాగంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు సదస్సులు, ద్వైపాక్షి ఒప్పందాల కోసం 2004, 2010, 2012, 2014, 2018, 2021లో పర్యటించారు. ఇక భారత ప్రధాని హోదాలోనూ నరేంద్ర మోదీ నాలుగుసార్లు రష్యాకు వెళ్లారు. 2015లో బ్రిక్స్ సదస్సు కోసం తొలిసారి అక్కడికి వెళ్లిన ఆయన.. 2017, 2019, కాస్త గ్యాప్ తర్వాత 2024లో రష్యాలో పర్యటించారు. -
ఉక్రెయిన్-రష్యా మధ్య ‘మూడు ముక్కలాట’.. మరో కొత్త ట్విస్ట్
వాషింగ్టన్: ఉక్రెయిన్-రష్యా మధ్య కాల్పులు విరమణ ఒప్పందంలో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా పుతిన్ తన ఇష్టానుసారం ఉక్రెయిన్‌పై మరోసారి దాడులకు పాల్పడ్డారు. దీంతో, అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌కు మరిన్ని వైమానిక రక్షణ పరికరాలను అందంచనున్నట్టు వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది.తాజాగా ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి రష్యా అంగీకరించడం లేదు. అందుకే ఉక్రెయిన్ సాయం అందించడానికి అమెరికా సిద్ధంగా ఉంది. ఉక్రెయిన్‌కు వైమానిక రక్షణ పరికరాలను యూరప్ నుంచి పంపించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. శాంతిని కోరుకుంటున్నామని, 30 రోజులపాటు ఉక్రెయిన్ ఇంధన, మౌలిక వసతులపై దాడులు చేయబోమని సూత్రప్రాయ అంగీకారానికి సిద్ధపడిన రష్యా వెనువెంటనే దాడులకు దిగింది. రష్యా డ్రోన్లు జనావాసాలపై దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్ బుధవారం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో దాదాపు గంటకుపైగా ఫోన్లో మాట్లాడిన కొద్దిగంటలకే రష్యా మళ్లీ తన భీకర దాడులను మొదలుపెట్టడం గమనార్హం. దాడులు ఆపబోమని తాజా ఘటనతో రష్యా చెప్పేసిందని, సమీ పట్టణంలోని ఒక ఆస్పత్రిపై, ప్రజల ఇళ్లపై డ్రోన్ల దాడులు జరిగాయి. మరోవైపు.. మాస్కోనే కాల్పుల విరమణ ఉల్లంఘించిందని కీవ్ ఆరోపిస్తే, ఉక్రెయినే దాడులు చేసిందని రష్యా పేర్కొంది. ఈ దాడులు, ప్రతిదాడులు జరుగుతున్న సమయంలోనే రెండు దేశాలు 175 మంది యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకోవడం గమనార్హం. -
Zelensky: ట్రంప్‌తోనే తేల్చుకుంటా.. ఏం సమాధానం వస్తుందో?
కీవ్: రష్యా, ఉక్రెయిన్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి ఇంకా పాజిటివ్ స్టెప్ పడలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్ఢ్ ట్రంప్ ప్రత్యేక ఇంట్రెస్ట్ తో డీల్ చేస్తున్న ఇరు దేశాల 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా కొలిక్కి రాలేదు. దానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి సరైన సమాధానం రాలేదు. కేవలం తాత్కాలికంగా ఆపడానికి మాత్రమే మంగళవారం నాడు ఒప్పుకున్న పుతిన్.. 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి మాత్రం ముందడుగు వేయడం లేదు. దీనికి శాశ్వత పరిష్కారం కావాలనే రష్యా అంటొంది. అదే పంతంతో కూర్చోని ఉంది. ఆ క్రమంలోనే తమ యుద్ధాన్ని కొనసాగించడానికే మొగ్గుచూపుతోంది.‘మీరు కోరుకునే మా ఇరుదేశాల 30 రోజుల శాంతి ఒప్పందం(కాల్పుల విరమణ ఒప్పందం)తో ఎటువంటి ఉపయోగం లేదు. అది కేవలం ఉక్రెయిన్ ఆర్మీ కి కాస్త రిలాక్స్ కావడానికి మాత్రమే పనికొస్తుంది. మేము కోరుకునేది శాశ్వత శాంతి ఒప్పందం. రష్యా చట్టబద్ధమైన ప్రయోజనాలను" కాపాడే దీర్ఘకాలిక శాంతియుత పరిష్కారం కోసం రష్యా లక్ష్యంగా పెట్టుకుంది. మా తాపత్రయం అంతా దానిపైనే ఉంది. అంతే కానీ 30 రోజుల శాంతి ఒప్పందం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు’ అని అమెరికాకు ఇప్పటికే తేల్చిచెప్పింది రష్యా,గంటల వ్యవధిలోనే ఎయిర్ స్ట్రైక్స్గత రెండు రోజుల నుంచి చూస్తున్న పరిణామాల్ని బట్టి అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తున్న 30 రోజుల శాంతి ఒప్పందంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దాన్ని రష్యా పెద్దగా పట్టించుకోవడం లేదు. మరి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ శాంతి చర్చలకు తాము రెడీ అంటున్నా రష్యా కవ్వింపు చర్యలతో బదులివ్వక తప్పడం లేదు. ఇరు దేశాల అధ్యక్షులు స్వల్ప కాలిక కాల్పుల విరమణకు ఒప్పుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే ఇరు దేశాలు ఎయిర్ స్ట్రైక్స్ ను ప్రారంభించాయి. కేవలం మంగళవారం నాడు దాడులను ఆపడానికి ఏదో సూత్రప్రాయంగా ఒప్పుకున్న పుతిన్.. దానికి కట్టుబడలేదు. ఉక్రెయిన్ ఇంధన వనరులను దెబ్బ తీసే దిశగా ఎయిర్ స్ట్రైక్ జరిపింది రష్యా, పుతిన్ తాత్కాలికంగా దాడులు ఆపుతానని ఫోన్ లో తనకు మాటిచ్చినట్లు ట్రంప్ ప్రకటించిన కాసేపటికే రష్యా దాడులకు దిగింది. అందుకు ఉక్రెయిన్ కూడా ధీటుగానే బదులిచ్చింది. ట్రంప్ తో మాట్లాడతా.. చూద్దాం ఏం సమాధానం వస్తుందో?నేను నియంత్రణగా ఉండాలిని కోరుకుంటున్నాను. నా నియంత్రణకు ప్రధాన కారణం మాకు మధ్యవర్తిత్వం వహిస్తున్న అమెరికా అని నేను నమ్ముతున్నాను. మేము కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నాం. కానీ మా వనరులను దెబ్బ తీసే ప్రయత్నం జరిగితే.. మేము అదే చేస్తాం.. మీరు కూల్ గా ఉంటే మేము కచ్చితంగా కూల్ గా ఉంటాం. ఏదో కాల్పులు విరమణ అని చెప్పి మాపై దాడి జరిగితే మేము చూస్తూ ఊరుకోం. మాకు ఇంధన వనరుల విషయంలో సాయం చేయడానికి అమెరికాతో పాటు మా మిత్రదేశాలు సహకరిస్తాయని ఆశిస్తున్నాను. నేను ట్రంప్ తోనే తేల్చుకుంటా.. కాల్పుల విరమణ అంటూ ప్రకటించిన గంటల వ్యవధిలోనే దాడి చేస్తే.. ఈ విషయాన్ని ట్రంప్ ప్రకటించిన కాసేటికే రష్యా ఉల్లంఘిస్తే ఏం చేయాలి. ట్రంప్‌తోనే మాట్లాడుతా.. ఏం సమాధానం వస్తుందో చూద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం?। అని జెలెన్ స్కీ స్పష్టం చేశారు. -
Putin: ఎవరి మాటా వినని సీతయ్య!
మాస్కో: ప్రపంచ అధినేతల్లో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin)కు ఓ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకు ఆయన జీవన.. వ్యవహార శైలులు, నడవడికలు కారణాలని చెప్పొచ్చు. అదే సమయంలో ఇతర అధినేతలతో ఆయన వ్యవహరించే తీరు కూడా చాలా ప్రత్యేకంగా ఉండి.. తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంటుంది కూడా.తాజాగా.. ఉక్రెయిన్ సంక్షోభంలో శాంతి నెలకొల్పే ప్రయత్నాలకు అడుగులు ముందుకు పడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగి మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఇరు దేశాలతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో.. ట్రంప్ పుతిన్‌తో ఫోన్లో మాట్లాడగా(Putin Phone call With Trump) ఆ సంభాషణకు ముందు జరిగిన ఓ ఆసక్తికర సన్నివేశం ఇప్పుడు బయటకు వచ్చింది.మన టైమింగ్స్ ప్రకారం.. మార్చి 18వ తేదీన సాయంత్రం 4గం. నుంచి 6గం. మధ్య ఇద్దరూ మాట్లాడుకోవాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ముందస్తు సమాచారం మాస్కోకు కూడా వెళ్లింది. షెడ్యూల్ ప్రకారం వైట్‌హౌజ్ నుంచి క్రెమ్లిన్‌కు టైంకి ఫోన్ వచ్చింది. కానీ ఆ టైంలో పుతిన్ అధ్యక్ష భవనంలో లేరు!. ట్రంప్‌తో మాట్లాడిన విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా.. తీరికగా మాస్కో ఇంటర్నేషనల్ హాల్లో జరిగిన రష్యా ప్రముఖ వ్యాపారవేత్తల భేటీకి హాజరయ్యారు. అయితే.. అక్కడ జరిగిన పరిణామాన్ని కింది వీడియోలో చూసేయండి. Putin is meant to be speaking to Trump around now, but he is talking to a room full of oligarchs instead. Asked if he's going to be late, Putin waves off the question and says not to listen to his spokesman pic.twitter.com/LDTU8BNQAr— max seddon (@maxseddon) March 18, 2025 ట్రంప్‌తో ఫోన్‌కాల్‌కు టైం దగ్గర పడుతుండడంతో క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్.. ఆ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవరించిన మాజీ ప్రధాని అలెగ్జాండర్ షోకిన్(Alexander Shokhin) ద్వారా పుతిన్‌కు సమాచారం చేరవేశారు. అయితే.. పుతిన్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. సరికదా నవ్వుతూ ‘‘అతని మాటలేం పట్టించకోవద్దు.. అతనికి ఇదే పని’’ అని అనడంతో అక్కడంతా నవ్వులు పూశాయి. దీనికి కొనసాగింపుగా.. ‘ట్రంప్‌కి ఈ విషయం తెలిస్తే ఎలా స్పందిస్తారో?’’ అని షోకిన్ అనడంతో మళ్లీ నవ్వులు పూశాయి. అయితే తాను ట్రంప్ గురించి అనలేదని.. పెస్కోవ్‌ను ఉద్దేశించి అన్నానని పుతిన్ చెప్పడంతో ఆ హాల్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. ఇదంతా జరిగాక కూడా.. పుతిన్ ఆ మీటింగ్‌లోనే ఉండిపోయారు. ఆ తర్వాత నిదానంగా క్రెమ్లిన్ వెళ్లి ట్రంప్‌తో ఫోన్ మాట్లాడారు. ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తతల వేళ.. ట్రంప్‌తో కాల్ చాలా ముఖ్యమైందే. అయినా కూడా పుతిన్ అలా వ్యవహరించారు. అలాగని పుతిన్‌కు ఇలా తన కోసం ఎదురు చూసేలా చేయడం కొత్తేం కాదు. గతంలో.. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్, మత గురువు పోప్ ప్రాన్సిస్.. ఆఖరికి క్వీన్ ఎలిజబెత్‌ను కూడా తన కోసం వెయిట్ చేయించారు.ఫోన్ కాల్ సారాంశం ఇదే..ట్రంప్ ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అంగీకరించారు. అయితే రష్యా మాత్రం ట్రంప్ ప్రతిపాదనలను వ్యతిరేకించకుండా.. కొన్ని షరతులు పెడుతోంది. అలాగే పూర్తి స్థాయి కాల్పుల విరమణకు దిగిరావాలంటే.. ఉక్రెయిన్‌కు విదేశీ సాయం నిలిపివేయాలని పుతిన్, ట్రంప్‌ను కోరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ ఫోన్ సంభాషణ ద్వారా పుతిన్‌తో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని ట్రంప్ అంటున్నారు. ఈ క్రమంలో ఇతర అంశాలపై రష్యాతో తమ ప్రతినిధి బృందం చర్చలు జరుపుతుందని ఆయన ప్రకటించారు. -
యుద్ధానికి పాక్షిక విరామం
వాషింగ్టన్/మాస్కో: రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి తెర దించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా, అమెరికా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, డొనాల్డ్ ట్రంప్ మంగళవారం జరిపిన ఫోన్ చర్చలు ఇందుకు వేదికయ్యాయి. ఉక్రెయిన్‌పై దాడులకు పాక్షికంగా విరామమిచ్చేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సుముఖత వ్యక్తం చేశారు. అందులో భాగంగా మౌలిక వనరులు, విద్యుదుత్పత్తి, ఇంధన వ్యవస్థలు తదితరాలపై దాడులు జరపబోమని ప్రతిపాదించారు.అయితే అందుకు ప్రతిగా అమెరికా, దాని మిత్ర దేశాలు ఉక్రెయిన్‌కు సైనిక, నిఘా సాయాలను పూర్తిగా నిలిపేయాలని షరతు విధించారు! వాటితో పాటు పలు ఇతర డిమాండ్లతో కూడిన భారీ జాబితాను ట్రంప్ ముందుంచారు. వాటన్నింటికీ ఉక్రెయిన్ అంగీకరించాల్సిందేనని కుండబద్దలు కొట్టారు. గంటకు పైగా జరిగిన సంభాషణలో యుద్ధంతో పాటు అమెరికా, రష్యా ద్వైపాక్షిక సంబంధాలు కూడా ప్రధానంగా చర్చకు వచ్చాయి. పాక్షిక యుద్ధ విరమణకు పుతిన్‌ను ఒప్పించడంలో ట్రంప్ సఫలమైనట్టు చర్చల అనంతరం వైట్‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది.యుద్ధం ఆగి శాశ్వత శాంతి నెలకొనాలని అధ్యక్షులిద్దరూ ఏకాభిప్రాయం వెలిబుచ్చనట్టు తెలిపింది. ‘‘తర్వాతి దశలో నల్లసముద్రంలో కాల్పుల విరమణ, చివరగా పూర్తిస్థాయి కాల్పుల విరమణపై సాంకేతిక చర్చలు జరిపేలా అంగీకారం కుదిరింది. అవి పశ్చిమాసియా వేదికగా తక్షణం మొదలవుతాయి’’ అని వివరించింది. అమెరికా, రష్యా మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని కూడా నేతలిద్దరూ నిర్ణయించినట్టు పేర్కొంది. ఈ దిశగా త్వరలో కీలక ఆర్థిక ఒప్పందాలు తదితరాలు కుదరనున్నట్టు వెల్లడించింది.అమెరికా ఇటీవల ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్ వెంటనే అంగీకరించడం, దానిపై సంతకం కూడా చేయడం తెలిసిందే. ఈ ప్రతిపాదనకు పుతిన్ కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు. పలు అంశాలపై స్పష్టత కోసం ట్రంప్‌తో మాట్లాడతానని చెప్పారు. ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమించిన భూములు, జపోరిజియా అణు విద్యుత్కేంద్రం తదితరాలు కూడా తమ మధ్య చర్చకు వస్తాయని సంభాషణకు ముందు ట్రంప్ మీడియాకు తెలిపారు.ఇరు దేశాల మధ్య పంపకాలకు సంబంధించి రష్యాతో ఇప్పటికే చర్చలు మొదలు పెట్టినట్టు కూడా చెప్పారు! ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగినందుకు మూడేళ్లుగా రష్యాపై అమెరికా కఠిన ఆంక్షలను అమలు చేస్తుండటం తెలిసిందే. పుతిన్, ట్రంప్ తాజా చర్చలను చరిత్రాత్మకంగా రష్యా అభివర్ణించింది. వాటి ఫలితంగా ప్రపంచం మరింత సురక్షితంగా మారిందని అభిప్రాయపడింది. యుద్ధానికి ముగింపుపై ఇటీవల సౌదీ అరేబియాలో అమెరికా పలుమార్లు చర్చలు జరపడం తెలిసిందే. పాక్షిక, దశలవారీ కాల్పుల విరమణ ప్రతిపాదనలు, పుతిన్ తాజా షరతులపై ఉక్రెయిన్ స్పందన ఏమిటన్నది తెలియాల్సి ఉంది. -
త్వరలో ట్రంప్-పుతిన్ చర్చలు.. కాల్పుల విరమణపై నిర్ణయం?
వాషింగ్టన్ డీసీ: రష్యా- ఉక్రెయిన్(Russia-Ukraine) మధ్య జరుగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ వారంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది.తాజాగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రాయబారి స్టీవ్ విట్కాఫ్ మీడియాతో మాట్లాడుతూ రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో కాల్పుల విరమణ, శాంతి నిబంధనల దిశగా అమెరికా అధక్షుడు ట్రంప్ యోచిస్తున్నారన్నారు. గత వారం పుతిన్‌తో చర్చలు సానుకూలంగా జరిగాయని, యుద్ద నియంత్రణకు పరిష్కారాలు లభించాయని అన్నారు. కాగా పుతిన్ డిమాండ్లలో కుర్స్క్లో ఉక్రేనియన్ దళాల లొంగిపోవడం కూడా ఉందా అని ఆయనను మీడియా అడిగినప్పుడు..దానిని ధృవీకరించేందుకు ఆయన నిరాకరించారు.వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణకు మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు. అయితే శాంతి ఒప్పందం కుదిరే ముందు పలు అంశాలపై చర్చలు జరపాల్సి ఉందన్నారు. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణకు తాను సిద్ధంగా ఉన్నానని రష్యా అధ్యక్షుడు ఇటీవల ప్రకటించారు. మరోవైపు ఉక్రెయిన్.. అమెరికా నుండి ఎటువంటి భద్రతా హామీని పొందబోదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: అమెరికన్ గ్రీన్ కార్డ్ హోల్డర్‌కు ఘోర అవమానం -
ఉక్రెయిన్ సేనలకు పుతిన్ హెచ్చరిక.. మీ ప్రాణాలకు గ్యారంటీ లేదంటూ..
మాస్కో: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న వేళ అధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు. కర్క్స్ ప్రాంతంలో ఉన్న ఉక్రెయిన్ సైనికులు లొంగిపోవడం మంచిది. లేకపోతే వారు ప్రాణాలతో ఉండరు అని వార్నింగ్ ఇచ్చారు. దీంతో, మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా పశ్చిమ రష్యాలోని కర్క్స్‌లో కొంత భూభాగాన్ని ఉక్రెయిన్ సేనలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఘాటుగా స్పందించారు. ఈ సందర్బంగా పుతిన్ తాజాగా మాట్లాడుతూ..‘కర్క్స్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ (Ukraine) సేనలు లొంగిపోతే వారు ప్రాణాలతో ఉంటారు. ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోతే వారి ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వగలను. లేదంటే పరిస్థితి మరోలా ఉంటుంది. రష్యా ఫెడరేషన్తో పాటు అంతర్జాతీయ చట్టాల ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటాం. మానవతా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్న ట్రంప్ పిలుపు నాకు అర్థమైంది. ఆయన సూచన మేరకు ఓ విషయాన్ని వెల్లడిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, పుతిన్ వ్యాఖ్యలపై ఉక్రెయిన్ సేనల్లో టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ను కనికరించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు తాను విజ్ఞప్తి చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. యుద్ధంలో ఆ దేశ పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. కీవ్ సేనలను అన్ని వైపుల నుంచి రష్యా దళాలు చుట్టుముట్టాయని తెలిపారు. అందుకే.. ఉక్రెయిన్ సైనికులపై కనికరం చూపాలని తాను పుతిన్‌కు విజ్ఞప్తి చేశానని చెప్పారు. లేకపోతే రెండో ప్రపంచయుద్ధం తర్వాత జరిగే అతి దారుణమైన ఊచకోతగా ఇది మిగిలిపోతుందని అన్నారు. కాల్పుల విరమణకు సంబంధించి రష్యా నుంచి మంచి సంకేతాలు వస్తున్నాయని, మాస్కోతో జరిపిన చర్చలు ఫలించే అవకాశం ఉందన్నారు. యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణకు సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నానని పుతిన్ చేసిన ప్రకటనపై ట్రంప్ సంతృప్తి వ్యక్తం చేశారు.⚡️ BREAKING: President Putin responded to President Trump regarding his appeal to spare Ukrainian soldiers in the Kursk region:“We have read today’s appeal from President Trump to spare the lives of servicemen of the Ukrainian Army in the Kursk region. In this regard, please… pic.twitter.com/RmmbqO1oS3— 🇷🇺Russia is not Enemy (@RussiaIsntEnemy) March 14, 2025 -
పుతిన్‌కు యుద్దమే ఇష్టం.. ట్రంప్ ప్లాన్ కష్టమే: జెలెన్స్కీ
కీవ్: ఉక్రెయిన్-రష్యా మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై కసరత్తు జరుగుతున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ఆరోపణలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం తిరస్కరణకు పుతిన్ సన్నద్ధమవుతున్నారని జెలెన్స్కీ అన్నారు. అలాగ, ఉక్రెయిన్ ప్రజలనే చంపాలన్నదే పుతిన్ లక్ష్యం అంటూ వ్యాఖ్యలు చేశారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా జెలెన్స్కీ మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తిరస్కరించడానికి కారణాలు వెతుకుతున్నారు. కాల్పుల విరమణను ఆలస్యం చేయడానికి, అమలుకాకుండా ఉండేందుకు పుతిన్ సన్నద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే కాల్పుల విరమణ ఒప్పందానికి పుతిన్ కండీషన్స్ పెడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కారణంగా ఈ విషయం నేరుగా చెప్పడానికి భయపడుతున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తూ మా దేశ ప్రజలు చంపాలన్నదే పుతిన్ లక్ష్యం. అందుకే కాల్పుల విరమణ ఒప్పందం అంగీకరించకుండా సాకులు వెతుకుతున్నారు.షరతులు లేని కాల్పుల విరమణ కోసం అమెరికా ప్రతిపాదన చేసింది. ఉక్రెయిన్ ఈ ప్రతిపాదనను అంగీకరించింది. దీనిపై పర్యవేక్షణ ధృవీకరణను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు అమెరికా కూడా తెలిపింది. ఇది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. కాల్పుల విరమణ సమయంలో, దీర్ఘకాలిక భద్రత, శాశ్వత శాంతి గురించి అన్ని ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేయడం, యుద్ధాన్ని ముగించడానికి ఒక ప్రణాళికను సిద్ధంగా ఉంచాం. ఉక్రెయిన్ వీలైనంత త్వరగా నిర్మాణాత్మకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది. మేము దీని గురించి అమెరికా ప్రతినిధులతో కూడా మేము చర్చించాం. ఉక్రెయిన్‌తో యూరోపియన్ భాగస్వాములు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మిత్రదేశాలకు దీని గురించి తెలుసు.ఈ ప్రక్రియను క్లిష్టతరం చేసే పరిస్థితులను మేము ఏర్పాటు చేయడం లేదు. రష్యా కారణంగానే కాల్పుల విరమణ ఒప్పందం ఆలస్యమవుతోంది. పుతిన్ సంవత్సరాల తరబడి శాంతి లేకుండా యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు అతనిపై ఒత్తిడి పెంచాల్సిన సమయం ఆసన్నమైంది. పుతిన్‌పై ఆంక్షలు విధించాలి. ఈ యుద్ధాన్ని ముగించమని రష్యాను బలవంతం చేయడానికి మేము ప్రతీ ఒక్కరితో కలిసి పని చేస్తూనే ఉంటాము. అని చెప్పుకొచ్చారు. Right now, we have all heard from Russia Putin’s highly predictable and manipulative words in response to the idea of a ceasefire on the front lines—at this moment he is, in fact, preparing to reject it.Of course, Putin is afraid to tell President Trump directly that he wants… pic.twitter.com/SWbYwMGA46— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) March 13, 2025మరోవైపు.. కాల్పుల విరమణ ప్రతిపాదనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా స్పందించారు. మాస్కోలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ.. ట్రంప్ ఆలోచన సరైందే. కచ్చితంగా మేం మద్దతిస్తాం. అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని మా అమెరికా మిత్రులతో ఇతర భాగస్వాములతో చర్చిస్తాం. ఒప్పందం ఉల్లంఘన కాకుండా.. సరైన యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. యుద్ధం ఆపాలన్న ప్రతిపాదనకు మేం అంగీకరిస్తున్నాం. అయితే కాల్పుల విరమణ.. శాశ్వత శాంతి దిశగా సాగుతుందన్న ఆశాభావంతో అందరం ముందుకు వెళ్లాలి. సమస్య మూలాలను తొలగించాలి’ అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఉక్రెయిన్ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్న ట్రంప్‌నకు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే.. భారత్, చైనా, దక్షిణాఫ్రికా నేతలకూ కృతజ్ఞతలు చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందంలో ఈ మూడు దేశాలు కూడా కీలక పాత్ర పోషించాయని పుతిన్ సంకేతం ఇచ్చారు. -
దానివల్ల ఏమీ ఉపయోగం లేదు: అమెరికాకు తేల్చి చెప్పిన రష్యా
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ ల మధ్య అమెరికా జరుపుతున్న శాంతి చర్చలు ఇప్పట్లో సఫలీకృతం అయ్యేటల్లు కనిపించడం లేదు. ‘ మేము వెనక్కి తగ్గం అంటే.. మేము కూడా వెనక్కి తగ్గేదే లేదు’ అన్నట్లుగా ఉంది ఇరు దేశాల పరిస్థితి. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుపుతున్నప్పటికీ అది కాస్తా విఫలయత్నంగానే మిగిలి ఉంది. ఒకవైపు వైట్ హౌస్ వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో జరిపిన చర్చలు వాగ్వాదానికి దారి తీశాయే తప్ప వాటిలో ఎటువంటి ముందడుగు పడలేదు. అదే సమయంలో రష్యాను కూడా కాస్త తగ్గే ఉండమని ట్రంప్ చేస్తున్న విజ్ఞప్తిని కూడా ఆ దేశం పెద్దగా పట్టించుకోవడం లేదు. కనీసం 30 రోజుల శాంతి ఒప్పందంతో ఇరు దేశాల యుద్ధం ఓ కొలిక్కి వస్తుందని ఆశించిన అమెరికాకు ఇరు దేశాల వైఖరి ఏమాత్రం మింగుడు పడటం లేదు.అది ఉక్రెయిన్ ఆర్మీ ఊపిరి తీసుకునేందుకే..తాజాగా అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఆడ్వైజర్ మికీ వాల్ట్ కు ఇదే విషయాన్ని రష్యా స్పష్టం చేసింది. 30 రోజుల మీ శాంతి ఒప్పందం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అత్యంత కీలక విషయాలు చూసే యురీ ఉషాకోవ్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఫోన్ లో అమెరికాకు తేల్చిచెప్పారు.‘మీరు కోరుకునే మా ఇరుదేశాల 30 రోజుల శాంతి ఒప్పందం(కాల్పుల విరమణ ఒప్పందం)తో ఎటువంటి ఉపయోగం లేదు. అది కేవలం ఉక్రెయిన్ ఆర్మీ కి కాస్త రిలాక్స్ కావడానికి మాత్రమే పనికొస్తుంది. మేము కోరుకునేది శాశ్వత శాంతి ఒప్పందం. రష్యా చట్టబద్ధమైన ప్రయోజనాలను" కాపాడే దీర్ఘకాలిక శాంతియుత పరిష్కారం కోసం రష్యా లక్ష్యంగా పెట్టుకుంది. మా తాపత్రయం అంతా దానిపైనే ఉంది. అంతే కానీ 30 రోజుల శాంతి ఒప్పందం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు’ అని అమెరికాకు తేల్చిచెప్పారు. ఫలితంగా ఇరు దేశాల శాంతి ఒప్పందం మళ్లీ మొదటికొచ్చినట్లయ్యింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జెలెన్ స్కీ భేటీ తర్వాత.. రష్యా మళ్లీ ఉక్రెయిన్ పై దాడులకు దిగింది. అదే సమయంలో ఆ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టిన ఉక్రెయిన్ సైతం తాము కూడా తాడో పేడో తేల్చుకుంటామనే రీతిలో యుద్ధ రంగంలోకి దూకింది. ఆ క్రమంలోనే రష్యాపై మెరుపు దాడి చేసింది. సుమారు 300 పైగా డ్రోన్ల సాయంతో రష్యాపై విరుచుకుపడింది. ఈ దాడితో ప్రాణనష్టం, ఆస్తినష్టం కూడా అధికంగా వాటిల్లినట్లు తెలుస్తున్నప్పటికీ, దానిపై రష్యా అధికారిక ప్రకటన ఏమీ చేయలేదు.అమెరికాకు పుతిన్ డిమాండ్స్.. రష్యాకు ట్రంప్ సీరియస్ వార్నింగ్ -
అమెరికాకు పుతిన్ డిమాండ్స్.. రష్యాకు ట్రంప్ సీరియస్ వార్నింగ్
వాష్టింగన్/మాస్కో: ఉక్రెయిన్-రష్యా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదుర్చేందుకు అమెరికా ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌తో డీల్ చేసుకునేందుకు రష్యా పలు డిమాండ్లను అమెరికా ముందుకు తీసుకొచ్చినట్టు యూఎస్‌కు చెందిన ఇద్దరు అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో అమెరికా ప్రతినిధులు రష్యాకు బయలుదేరడం విశేషం.ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపు, అమెరికాతో సంబంధాల మెరుగు కోసం రష్యా పలు డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఓ జాబితాను సిద్దం చేసి రష్యాకు చెందిన అధికారులు అమెరికాకు అందజేశారు. అయితే, జాబితాలో రష్యా ఏం కోరిందనే విషయం మాత్రం వెల్లడి కాలేదు. ఇక,గత మూడు వారాలుగా పలు నిబంధనలపై అమెరికా, రష్యా అధికారులు చర్చించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా డిమాండ్లు ఏంటి? అనేది చర్చనీయాంశంగా మారింది.మరోవైపు.. యుద్ధంలో 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనపై చర్చించేందుకు అమెరికా ప్రతినిధులు రష్యా బయల్దేరారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వైట్‌హౌస్ వద్ద మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ..‘మా ప్రతినిధులు రష్యాకు బయల్దేరారు. కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరిస్తారనే ఆశిస్తున్నాం. లేదంటే యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. అదే జరిగితే మాస్కో ఆర్థికంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది రష్యాకే వినాశకరంగా మారుతుంది. అలాంటి ఫలితాన్ని నేను కోరుకోవట్లేదు. శాంతిని సాధించడమే నా లక్ష్యం. రష్యా అంగీకరిస్తే అది గొప్ప నిర్ణయం అవుతుంది. లేదంటే ప్రజలు మరణిస్తూనే ఉంటారు’ అని స్పష్టం చేశారు.Trump threatens Putin with 'devastating' punishment if he doesn't agree to 30-day ceasefire with Ukraine. pic.twitter.com/vU6rLTX479— Daily Mail Online (@MailOnline) March 12, 2025ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ మాత్రం కీవ్‌కు నాటో సభ్యత్వం ఇవ్వాలని ముందు నుంచి డిమాండ్ చేస్తోంది. ఉక్రెయిన్‌లో విదేశీ దళాలను మోహరించకూడదని చెబుతోంది. ఈ మేరకు అమెరికాతో కూడా చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ డిమాండ్లపైనే రష్యా కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్ను నాటోలో చేర్చకూడదనే వాదనలు వినిపిస్తోంది. మాస్కో కాల్పుల విరమణకు సంతకం చేయకపోతే ఆంక్షల వలయంలో చిక్కుకోవాల్సి ఉంటుంది. -
జెలెస్కీ గ్రీన్‌సిగ్నల్.. పుతిన్ ప్లానేంటి?
జెద్దా: మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్దానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.అమెరికా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ విషయమై సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా ఉన్నతాధికారుల స్థాయిలో చర్చలు జరిగాయి. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా చర్చించారు. ఈ క్రమంలో అమెరికా (USA) ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో, సైనిక సాయం, నిఘా భాగస్వామ్యానికి సంబంధించి తక్షణమే ఉక్రెయిన్‌పై విధించిన ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఇక ఖనిజాల తవ్వకానికి సంబంధించి సాధ్యమైనంత త్వరగా ఒప్పందానికి వచ్చేందుకు రెండు దేశాలు నిర్ణయానికి వచ్చాయి.ఈ సందర్బంగా అమెరికా తరఫున విదేశాంగ మంత్రి మార్కో రుబియో మాట్లాడుతూ.. ఉక్రెయిన్ కాల్పుల విరమణకు ఓకే చెప్పింది. ఇది యుద్దం ముగింపునకు కీలక పరిణామం. ఈ చర్చల సారాంశాన్ని రష్యాకు కూడా తెలియజేస్తాం. ఇప్పుడు బంతి పుతిన్ చేతిలో ఉంది. రష్యా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి’ అని చెప్పుకొచ్చారు. ఇక, ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందానికి సంబంధించి రష్యాతో అమెరికా మాట్లాడనుంది.🚨 BREAKING: Ukraine has agreed to a US proposal for a 30-day ceasefire, contingent on Russia’s acceptance.The US will also resume military aid to Ukraine and lift the pause on intelligence-sharing as part of the agreement.#VMNews pic.twitter.com/FN8QlYlE7C— Virgin Media News (@VirginMediaNews) March 11, 2025రష్యాపైకి ఉక్రెయిన్ డ్రోన్లు..మరోవైపు.. ఉక్రెయిన్ మంగళవారం రష్యాపైకి అతిపెద్ద డ్రోన్ల దాడికి దిగింది. రష్యాలోని 10 ప్రాంతాలపైకి దూసుకొచ్చిన 337 డ్రోన్లను కూల్చివేసినట్టు రష్యా మిలటరీ తెలిపింది. డ్రోన్ల దాడిలో ఒకరు చనిపోగా పదుల సంఖ్యల జనం గాయపడినట్లు రష్యా తెలిపింది. యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో ఉక్రెయిన్–అమెరికా మధ్య సౌదీ అరేబియాలోని జెడ్డాలో మంగళవారం చర్చలు మొదలవడానికి కొద్ది గంటల ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. తాజా దాడిపై ఉక్రెయిన్ స్పందించలేదు. అత్యధికంగా సరిహద్దుల్లోని కస్క్ ప్రాంతంలోకి వచ్చిన 126 డ్రోన్లను కూల్చినట్లు రష్యా మిలటరీ తెలిపింది. రాజధాని మాస్కో దిశగా వచ్చిన మరో 91 డ్రోన్లను ధ్వంసం చేశామంది. ఇంకా, సరిహద్దులకు సమీపంలోని బెల్గొరోడ్, బ్రయాన్‌స్‌్క, వొరొనెజ్‌తోపాటు సుదూర ప్రాంతాలైన కలుగ, లిప్‌ట్‌స్‌్క, నిజ్నీ నొవ్‌గొరోడ్, ఒరియోల్, రైజాన్‌లపైకి కూడా ఇవి వచ్చాయని వివరించింది. -
నువ్ చాలా డేంజర్! నీ వల్ల మాకు భారమే తప్ప.. ఏం లాభం లేదు!
నువ్ చాలా డేంజర్! నీ వల్ల మాకు భారమే తప్ప.. ఏం లాభం లేదు! -
పుతిన్‌కు ట్రంప్ భారీ ఆఫర్.. అమెరికా ప్లాన్ ఏంటి?
వాషింగ్టన్: ఉక్రెయిన్-రష్యా యుద్ధం వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విస్టు మీద ట్విస్ట్ ఇస్తున్నారు. రష్యాకు పూర్తి మద్దుతుగా నిలుస్తూ ఉక్రెయిన్‌కు వరుస షాక్‌లు ఇస్తున్నారు. ఇందులో భాగంగా ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా (Russia)పై అమెరికా గతంలో విధించిన ఆంక్షలను తొలగించాలని ట్రంప్ నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం. ఈమేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం తర్వాత నాటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. రష్యాపై పలు ఆంక్షలు విధించారు. పుతిన్‌ను కంట్రోల్ చేసేందుకు ట్రేడింగ్‌కు సంబంధించిన ఆంక్షలు పెట్టారు. ఇక, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ ఆంక్షలను తొలగించే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మద్దతుగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే యుద్ధం ముగింపుతో పాటు మాస్కోతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నారు.ఇందులో భాగంగా రష్యాకు చెందిన కొన్ని సంస్థలు, వ్యక్తులకు ఉపశమనం కల్పించే దిశగా ట్రంప్ సర్కారు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా జాబితాను సిద్ధం చేయాలని విదేశీ వ్యవహరాలు, ట్రెజరీ మంత్రిత్వ శాఖలను వైట్‌హౌస్ కోరినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. రాబోయే రోజుల్లో దీనిపై రష్యన్ ప్రతినిధులతో అమెరికా అధికారులు చర్చలు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఆంక్షలను తొలగించే క్రమంలో ప్రతిగా మాస్కో నుంచి వాషింగ్టన్ ఏం ఆశిస్తుందనే విషయాలు మాత్రమే తెలియాల్సి ఉంది. దీంతో, అమెరికా ప్లాన్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న వేళ జెలెన్స్కీకి ట్రంప్ వరుస షాక్‌లిస్తున్నారు. తాజాగా రష్యా (Russia)తో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అందించే మిలిటరీ సాయాన్ని అమెరికా నిలిపివేసింది. ఈ మేరకు వైట్‌హౌస్‌కు చెందిన ఓ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఉక్రెయిన్‌తో ఖనిజాల ఒప్పందం విషయం సందర్బంగా ట్రంప్, జెలెన్స్కీ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. BREAKING: The U.S. is preparing to ease sanctions on Russia as President Trump pushes to restore ties and end the war in Ukraine - Reuters pic.twitter.com/D1b16R5WMT— Libs of TikTok (@libsoftiktok) March 3, 2025 -
జెలెన్స్కీకి భారీగా పెరిగిన మద్దతు.. రష్యా స్పందన ఇదే..
కీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), జెలెన్స్కీ మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి. వైట్‌హౌస్‌లో ఇరువురి మధ్య భేటీ రసాభాసగా, వాగ్వాదంతో ముగిసింది. దీంతో ఎలాంటి ఒప్పందం లేకుండానే జెలెన్స్కీ (Zelenskyy) వైట్‌హౌస్‌ను వీడారు. ఈ క్రమంలో పలు దేశాల నేతలు జెలెన్స్కీకి మద్దుతు తెలుపుతున్నారు. ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు.ట్రంప్, జెలెన్స్కీ భేటీ అనంతరం యూరోపియన్ యూనియన్‌కు చెందిన నేతలు స్పందించారు. ఈ సందర్బంగా పోలిష్ ప్రధాన మంత్రి డొనాల్డ్ టస్క్ స్పందిస్తూ.. జెలెన్స్కీ మీరు ఒంటరి కాదు అంటూ చెప్పుకొచ్చారు. ఈ మేరకు సంఘీభావం తెలుపుతూ సందేశం విడుదల చేశారు.👉బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ స్పందిస్తూ.. ఉక్రెయిన్‌కు మద్దుతు ఉంటుందన్నారు.👉ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్పందిస్తూ.. ఉక్రెయిన్ రక్షణ, భవిష్యత్తు గురించి చర్చించడానికి యూరోపియన్ దేశాలు, ఇతర మిత్రదేశాలతో అత్యవసర శిఖరాగ్ర సమావేశానికి పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ అండగా ఉండాలన్నారు.Russia illegally and unjustifiably invaded Ukraine. For three years now, Ukrainians have fought with courage and resilience. Their fight for democracy, freedom, and sovereignty is a fight that matters to us all.Canada will continue to stand with Ukraine and…— Justin Trudeau (@JustinTrudeau) February 28, 2025👉కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందిస్తూ.. రష్యా చట్టవిరుద్ధంగా, అన్యాయంగా ఉక్రెయిన్‌పై దాడి చేసింది. మూడు సంవత్సరాలుగా ఉక్రేనియన్లు ధైర్యంతో పోరాడుతున్నారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సార్వభౌమాధికారం కోసం వారి పోరాటం మనందరికీ మేలు కొలుపు. న్యాయమైన, శాశ్వత శాంతిని సాధించడంలో ఉక్రేనియన్లకు కెనడా అండగా నిలుస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ నేతలకు జెలెన్స్కీ ధన్యవాదాలు తెలిపారు.ఇది కూడా చదవండి: జెలెన్స్కీతో ట్రంప్ వాగ్వాదం.. దద్దరిల్లిన వైట్‌హౌస్👉యూరోపియన్ యూనియన్ చీఫ్‌లు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, ఆంటోనియో కోస్టా స్పందిస్తూ.. ఉక్రెయిన్ జెలెన్స్కీ ఎప్పుడూ ఒంటరి కాదు. మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మేమందరం మీతో న్యాయమైన, శాశ్వత శాంతి కోసం పని చేస్తూనే ఉంటాము. దైర్యంగా ఉండంటి అని అన్నారు.👉ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్పందిస్తూ.. రష్యా అనే దురాక్రమణతో ముందుకు సాగుతోంది. ఉక్రెయిన్‌కు అందరం అండగా ఉండాలి. ఉక్రెయిన్‌కు సాయం చేయడానికి, రష్యాపై ఆంక్షలు విధించడానికి ముందుకు రావాలన్నారు.👉మరోవైపు.. రష్యా మాత్రం ఉక్రెయిన్‌పై మరోసారి సెటైరికల్ కామెంట్స్ చేసింది. ట్రంప్, జెలెన్స్కీ వాడీవేడీ చర్చపై రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ స్పందిస్తూ.. ఈ పరిణామం ఉక్రెయిన్‌కు చెంపదెబ్బ లాంటిదన్నారు. జెలెన్ స్కీకి ఇలా జరగాల్సిందే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.JD Vance and Trump just put Zelensky in his place. Wow. Watch this.pic.twitter.com/zndgjKEPKz— End Wokeness (@EndWokeness) February 28, 2025జరిగింది ఇదీ..ఇదిలా ఉండగా.. రష్యా చేస్తున్న యుద్ధానికి తెర దించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్స్కీ శుక్రవారం వైట్ హౌస్‌కి వచ్చారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఆయన ఒత్తిడి చేశారు. ఇది ట్రంప్‌నకు ఆగ్రహం తెప్పించింది. అనంతరం, అరుపులు, బెదిరింపులతో వాగ్వాదానికి దారితీసింది. ఉక్రెయిన్ (Ukraine) తీరు మూడో ప్రపంచయుద్ధానికి దారితీయవచ్చని.. జెలెన్స్కీ వైపు వేలెత్తి చూపిస్తూ ట్రంప్ కోపంగా చెప్పారు. కానీ, జెలెన్స్కీ మాత్రం ఉక్రెయిన్ ప్రజల కోసం ట్రంప్ బెదిరింపులకు లొంగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం, జెలెన్స్కీని టార్గెట్ చేస్తూ ట్రంప్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రష్యాతో శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సుముఖంగా లేరని అన్నారు. ఇదే సమయంలో పుతిన్ మాత్రం శాంతి కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. -
Russia-Ukraine war: యుద్ధం @ మూడేళ్లు
ఉక్రెయిన్. రష్యా దురాక్రమణ జెండా ఎగరేసి దూసుకురావడంతో అస్థిత్వమే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్న పొరుగుదేశం. అణ్వస్త్ర సామర్థ్యం, అమేయ సైన్యంతో కొద్దికొద్దిగా ఆక్రమించుకుంటూ వస్తున్న రష్యాను నిలువరించేందుకు ఉక్రెయిన్ యుద్ధంచేస్తూ శతథా ప్రయత్నాలు చేయబట్టి రేపటికి సరిగ్గా మూడేళ్లు. ఈ మూడేళ్లలో రష్యా కన్నెర్రజేసి వేలాది సైన్యంతో చేస్తున్న భీకర గగనతల, భూతల దాడుల్లో ఉక్రెయిన్‌లో సాధారణ ప్రజల వేలాది కలల సౌధాలు పేకమేడల్లా కూలి నేలమట్టమయ్యాయి. వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. శివారు గ్రామాలు, పట్టణాలన్నీ మరుభూములుగా మారిపోయాయి. ఎక్కడ చూసినా మరణమృదంగం నిరాటంకంగా వినిపిస్తోంది. సైనికులు పిట్టల్లా రాలిపోయారు. మార్షల్ లా ప్రయోగించి జెలెన్స్కీ ప్రభుత్వం యువత మొదలు నడివయసు వారిదాకా దమ్మున్న వారందరినీ రణక్షేత్రంలోకి దింపి పోరాటం చేయిస్తోంది. దశాబ్దాల నాటి దౌత్య ఒప్పందాలను ఉల్లంఘించిందని, నాటోలో చేరాలనుకుంటోందని పలు సాకులు చూపి రష్యా సమరశంఖం పూరించింది. దీంతో హఠాత్తుగా యుద్ధంలో కూరుకుపోయినా ఉక్రెయిన్ తన మిత్రబృందం నుంచి అందుతున్న అధునాతన ఆయుధాలతో రష్యాను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ లక్షలాది మంది రష్యన్ సైనికులను నేలకూల్చింది. దీంతో అణ్వస్త్ర బూచి చూపించి భయపెడుతున్న పుతిన్‌కు యుద్ధాన్ని ఆపడమే ఉత్తమమని అగ్రరాజ్య నయా నాయకుడు డొనాల్డ్ ట్రంప్ టెలీఫోన్ మంతనాలు చేయడంతో యుద్ధం మొదలైన మూడేళ్ల తర్వాత తొలిసారిగా కీలక మలుపు తీసుకుంది. వాస్తవానికి ఈ మలుపు తుది మలుపు అని, ట్రంప్ పట్టుదలతో యుద్ధాన్ని ఆపబోతున్నారని అంతర్జాతీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. 36 నెలల తర్వాత అయినా ఉక్రెయిన్ ఊపిరి పీల్చుకుంటుందో లేదోనని, యుద్ధప్రభావిత విపరిణామాలతో తిప్పలుపడుతున్న ఎన్నో ప్రపంచదేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.అత్యంత భీకర ఘర్షణరెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో వెలుగుచూసిన అతిపెద్ద వైరం ఇదే. వాస్తవానికి తాజా యుద్ధానికి పునాదులు పదేళ్ల క్రితమే పడ్డాయి. 2014లో ఉక్రెయిన్‌లోని క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఉన్నపళంగా ఆక్రమించుకుంది. ఆనాటి నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్ పైకి రష్యా దండయాత్ర మొదలెట్టింది. వందల కొద్దీ చిన్నపాటి క్షిపణులు ప్రయోగిస్తూ వేలాది సైనికులను కదనరంగంలోకి దింపింది. తొలిరోజుల్లో రాజధాని కీవ్‌దాకా దూసుకొచ్చి భీకర దాడులు చేసిన రష్యా ఆ తర్వాత ఆక్రమణ వేగాన్ని అనూహ్యంగా తగ్గించింది. ఉక్రెయిన్ వైపు నుంచి ప్రతిఘటన కూడా దీనికి ఒక కారణం. ఉక్రెయిన్ తొలినాళ్లలో యుద్ధంలో తడబడినా ఆ తర్వాత అగ్రరాజ్యం, యూరప్ దేశాల ఆర్థిక, ఆయుధ, నిఘా బలంతో చెలరేగిపోయింది. ధాటిగా దాడులు చేస్తూ పుతిన్ పటాలానికి ముచ్చెమటలు పట్టించింది. దీంతో మరింత శక్తివంతమైన ఆయుధాలను రష్యా బయటకుతీయక తప్పలేదు. దీంతో డ్రోన్లకు ఉక్రెయిన్ పనిచెప్పింది. దృఢత్వానికి చిరునామా అయిన అత్యంత ఖరీదైన వేలాది రష్యన్ యుద్ధట్యాంక్‌లను సైతం సులువుగా చవకైన డ్రోన్లతో పేల్చేసి జెలెన్స్కీ సేన పలు యుద్ధక్షేత్రాల్లో పైచేయి సాధించింది. 18 శాతం ఆక్రమణఅంతర్జాతీయ మీడియా కథనాలు, రష్యా, ఉక్రెయిన్ ఉన్నతాధికారులు పలు సందర్భాల్లో వెల్లడించిన గణాంకాలను బట్టి చూస్తే ఇప్పటిదాకా రష్యా ఉక్రెయిన్‌లోని కేవలం 18 శాతం భూభాగాన్ని మాత్రమే ఆక్రమించుకోగలిగింది. కీవ్, లివివ్, డినిప్రో, ఒడెసా వంటి ప్రధాన నగరాలపై దాడి ప్రభావం లేదు. అమెరికా, ఇతర మిత్ర దేశాల నుంచి ఉక్రెయిన్‌కు అందుతున్న భారీ ఆయుధాలే ఇందుకు ప్రధాన కారణం. ఎప్పటికప్పుడు ఆయుధాలు, మందుగుండు, సైనిక ఉపకరణాలు, ఆర్థిక సాయం అందడంతోపాటు అంతర్జాతీయంగా లభిస్తున్న నైతిక మద్దతుతో రెట్టించిన ఉత్సాహంతో ఉక్రెయిన్ సైనికులు కదనరంగంలో ధైర్యంగా ముందడుగు వేయగల్గుతున్నారు. యుద్ధంలో రష్యా దాదాపు ఏకాకిగా మారింది. రహస్యంగా ఉత్తరకొరియా, చైనా, ఇరాన్ వంటి దేశాల నుంచి ఆయుధాలు, డ్రోన్లు తదితర ఆయుధాలు, కిరాయి సైనికులు తప్పితే రష్యాకు బయటి దేశాల నుంచి ఎలాంటి సాయం అందట్లేదు. అమెరికా తదితర దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షల కత్తి గుచ్చాయి. సొంత దేశంలోనూ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న రష్యన్లు కోట్లలో ఉన్నారు. యుద్ధం కారణంగా విదేశీ వస్తువుల లభ్యత తగ్గి, డిమాండ్ పెరిగింది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగి రష్యన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయుధం చేతికిచ్చి యుద్ధానికి పుతిన్ పంపిస్తాడన్న ముందస్తు అంచనాతో తొలినాళ్లలోనే వేలాది మంది యువ రష్యన్లు దేశం నుంచి పారిపోయారు. చివరకు ఖైదీలు, నిందితులను సైతం పుతిన్ సైన్యంలో చేరి్పంచుకుని ఉక్రెయిన్‌తో పోరాటం చేయిస్తున్నారు.అన్ని రంగాలు తిరోగమనం నష్టాలు చెప్పకపోయినా అంతర్జాతీయంగా తగ్గిన వాణిజ్యంతో ఉక్రెయిన్ నష్టాలు చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయికి చేరుకున్నాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. బాంబు దాడుల్లో ఆనకట్టలు, రహదారులు, భవనాలు, వ్యవసాయ క్షేత్రాలు, పాఠశాలలు, కర్మాగారాలు ఇలా మౌలికవసతుల వ్యవస్థ బాగా దెబ్బతింది. వ్యవసాయం తగ్గిపోయింది. నిరుద్యోగం పెరిగింది. ఇలా ఎన్నో రంగాలు తిరోగమన పథంలో పయనిస్తున్నాయి. దేశ జీడీపీకి వందల బిలియన్ డాలర్ల నష్టం చేకూరింది. వాణిజ్య, పరిశ్రమ రంగానికి సంబంధించి దాదాపు రూ.15 లక్షల కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.5.8 లక్షల కోట్ల నష్టాలు వాటిల్లాయి. రవాణా, వాణిజ్యం, ఎగుమతులు, వ్యవసాయం, విద్యుత్, పరిశ్రమల రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి వందల బిలియన్ డాలర్ల నిధులు అవసరమవుతాయని ఓ అంచనా. ఉక్రెయిన్‌కు మిత్ర దేశాల నుంచి భారీ స్థాయిలో సాయం అందుతున్నా అది ఎక్కువగా సైనిక, రక్షణపర సాయమే తప్పితే సాధారణ ప్రజల జీవితాలను బాగుచేసేది కాదు. దీంతో యుద్ధంలో ఉక్రెయిన్ తన భూభాగాలను మాత్రమే కాదు భవిష్యత్తును కొంత కోల్పోతోందనేది వాస్తవం. ఉక్రెయిన్‌కు అపార ఆస్తినష్టం రష్యా వైపు సైనికులు, ఆయుధాల రూపంలో నష్టం కనిపిస్తుంటే ఉక్రెయిన్ వైపు అంతకుమించి ఆస్తినష్టం సంభవించింది. లక్షల కోట్ల రూపాయల విలువైన భవనాలు నేలమట్టమయ్యాయి. పెద్ద సంఖ్యలో జనావాసాలపై దాడులతో పెద్దసంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇక దాదాపు లక్షకుపైగా ఉక్రెయిన్ సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు 4 లక్షల మంది సైనికులు గాయాలపాలయ్యారు. ఇక స్వస్థలాలు సమరక్షేత్రాలుగా మారడంతో లక్షలాది మంది స్వదేశంలోనే యుద్ధంజాడలేని సుదూర ప్రాంతాలకు తరలిపోయారు. పక్కనే ఉన్న పోలండ్, రొమేనియా దేశాలుసహా అరడజనుకుపైగా దేశాలకు దాదాపు 60 లక్షల మంది శరణార్థులుగా వలసవెళ్లారు. దాదాపు ఉక్రెయిన్ వైపు యుద్ధంలో ఎంత నష్టం జరిగిందనేది స్పష్టంగా తెలీడం లేదు. అమెరికా సహా యూరప్ దేశాల ప్రభుత్వాలు, ఆయా దేశాల్లోని ప్రధాన మీడియా సంస్థలు సైతం ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్ సైన్యం, పౌరుల్లో నైతిక స్థైర్యం సడలకూడదనే ఉద్దేశంతో యుద్ధ నష్టాలను తక్కువ చేసి చూపిస్తున్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.యుద్ధంలో రక్తమోడుతున్న రష్యాఅణ్వ్రస్తాలు లేకున్నా ఉక్రెయిన్‌తో యుద్ధం అంత తేలిక కాదని పుతిన్‌కు రానురాను అర్థమైంది. రష్యాకు తగ్గట్లు ఉక్రెయిన్ సైతం అధునాతన యుద్ధవ్యూహాలను అమలుచేస్తుండటంతో రష్యా వైపు నష్టం భారీగానే ఉంది. అంతర్జాతీయ యుద్ధ పరిశీలనా బృందాలు, సంస్థలు, వార్తాసంస్థల నివేదికలు, అంచనాల ప్రకారం యుద్ధంలో ఏకంగా 8,66,000 మంది రష్యా సైనికులు చనిపోయారు. ఉక్రెయిన్ విషయంలో చూస్తే కేవలం లక్షకుపైగా సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఏకంగా 10,161 రష్యన్ యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్ ధ్వంసంచేసింది. ఉక్రెయిన్‌లో ఎన్నికలొచ్చేనా?రష్యా దాడులు మొదలెట్టగానే జెలెన్స్కీ తమ దేశంలో మార్షల్ లా ప్రయోగించారు. సైనికపాలన వంటి అత్యయిక స్థితి అమల్లో ఉన్న కారణంగా ఉక్రెయిన్‌లో ఇప్పట్లో ఎన్నికలు సాధ్యంకాదు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించాలంటే పార్లమెంట్లో ఏకాభిప్రాయ నిర్ణయం ద్వారా మార్షల్ లాను తొలగించాలి. యుద్ధం జరుగుతుండగా మార్షల్ లాను చట్టప్రకారం తొలగించడం అసాధ్యం. దీంతో ఇప్పట్లో ఎన్నికలు కష్టమని భావిస్తున్నారు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించినా జెలెన్స్కీ జాతీయభావం, యుద్ధంలో రష్యాను దీటుగా ఎదుర్కొంటున్నానని చెప్పి మళ్లీ అధికారం కైవసం చేసుకుంటారని విపక్ష పారీ్టలు విమర్శిస్తున్నాయి. యుద్ధంలో ట్రంప్‌కార్డ్ జెలెన్స్కీ మొండిపట్టుదలతో యుద్ధాన్ని ఇక్కడిదాకా తెచ్చారని సంచలన ఆరోపణలు చేసిన అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ వడివడిగా తీసుకుంటున్న నిర్ణయాలు యుద్ధమేఘాలను శాశ్వతంగా తరిమేస్తాయన్న ఆశలు ఒక్కసారిగా చిగురించాయి. తొలిసారిగా రష్యా విదేశాంగ మంత్రి స్థాయి కీలక నేతలతో ఇటీవల మొదలైన చర్చల ప్రక్రియను ఇప్పుడు యుద్ధంలో కీలకదశగా చెప్పొచ్చు. మంతనాలు మరింత విస్తృతస్థాయిలో జరిగితే మూడేళ్ల యుద్ధానికి ముగింపు ఖాయమనే విశ్లేషణలు పెరిగాయి. ఇప్పటిదాకా ఆక్రమించిన ప్రాంతం రష్యాకే చెందుతుందని, ఇప్పటి ‘వాస్తవాదీన రేఖ’నే అంగీకరిస్తూ జెలెన్స్కీని ఒప్పించాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్‌కు ఒప్పకోకపోతే మిత్రదేశాల నుంచి ఎలాంటి సాయం అందకుండా అడ్డుకుంటానని ట్రంప్ హెచ్చరించి జెలెన్స్కీని దారికి తెస్తారని భావిస్తున్నారు. అధునాతన ఆయుధాలతో దూసుకొస్తున్న రష్యా సేనలను అడ్డుకోవాలంటే ఉక్రెయిన్‌కు విదేశీ ఆయుధసాయం తప్పనిసరి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో జెలెన్స్కీ అమెరికా పెట్టే షరతులకు ఒప్పకోక తప్పదని, యుద్ధం ఒక రకంగా ముగింపు దిశలో పయనిస్తోందని వార్తలొచ్చాయి. యుద్ధం అంకెల్లో.. చనిపోయిన రష్యా సైనికులు 8,66,000కుపైగా చనిపోయిన ఉక్రెయిన్ సైనికులు 1,00,000కుపైగా ఇప్పటిదాకా రష్యా ఆక్రమించుకున్న ఉక్రెయిన్ ప్రాంతం 18 శాతం సగటున రోజుకు రష్యా ఆక్రమణ రేటు 16.1 చదరపు కిలోమీటర్లు ఉక్రెయిన్‌కు యూరప్ దేశాల నుంచి అందిన ఆర్థిక సాయం రూ. 14 లక్షల కోట్లు యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్‌కు ఇచ్చిన రుణాలు రూ. 2 లక్షల కోట్లు– సాక్షి, నేషనల్ డెస్క్ -
పుతిన్, జెలెన్స్కీ కలిసిపోవాలి: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధం ముగియాలంటే జెలెన్ స్కీ, పుతిన్ కలిసిపోవాలని సూచించారు. ఇదే సమయంలో లక్షలాది మంది ప్రజల చావులు ఆగాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు ట్రంప్.రష్యా-ఉక్రెయిన్ వివాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. తాజాగా ట్రంప్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ మధ్య నేను కాల్పల విరమణను చూడాలనుకుంటున్నాను. ఆ ఒప్పందాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నా. ఇప్పటికైనా యుద్ధం ఆపాలని కోరుకుంటున్నాను. కీవ్, మాస్కో మధ్య యుద్ధం ఆగిపోవాలంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలవాల్సిన అవసరం ఉంది. రెండు దేశాల్లో లక్షలాది మంది ప్రజల చావులు ఆగాలని కోరుకుంటున్నాం కాబట్టి అది జరిగి తీరాలన్నారు.#WATCH | Washington | On the Russia-Ukraine conflict, US President Donald Trump says, "President Putin and President Zelenskyy have to get together because we want to stop the war and stop killing millions of people... I want to see a ceasefire, and I want to get the deal done...… pic.twitter.com/404opUoyGl— ANI (@ANI) February 21, 2025అలాగే, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అమెరికాను పెద్దగా ప్రభావితం చేయదు. కానీ, యూరప్‌ను ప్రభావితం చేస్తోంది. యుద్ధం కారణంగా అమెరికా భారీగా సాయం($300 బిలియన్ల) అందించింది. యూరప్ కూడా పెద్ద మొత్తంలో సాయం($100 బిలియన్ల) చేయాల్సి వచ్చింది. బైడెన్ వారికి డబ్బు ఇచ్చారని అన్నారు. ఇదే సమయంలో, ఖనిజ నిక్షేపాల్లో వాషింగ్టన్కు వాటా ఇచ్చేందుకు ఉక్రెయిన్ త్వరలోనే అంగీకారం తెలిపే అవకాశం ఉందని వెల్లడించారు.మరోవైపు.. ట్రంప్ ఇప్పటికే జెలెన్స్కీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్ వాదనను తప్పుబట్టారు. కాస్త భూమితో పోయేదాన్ని జెలెన్స్కీ యుద్ధం వరకూ తీసుకొచ్చారని నిందించారు. ఇప్పుడు ఎక్కువ భూమి సహా పెద్దసంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందన్నారు. యుద్ధానికి ఉక్రెయినే కారణమని, పోరు మొదలుకావడానికి ముందే సంధి చేసుకొని ఉండాల్సిందని అన్నారు. మూడేళ్లుగా ఆ పనిని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. -
ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం: పుతిన్
మాస్కో: ఉక్రెయిన్ సంక్షోభం మూడో ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న వేళ.. కీలక పరిణామం చోటు చేసుకుంది. శాంతి చర్చల్లో రష్యా(Russia) ఓ అడుగు ముందుకు వేసింది. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో అవసమైతే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నారు అని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి. సౌదీ అరేబియా వేదికగా అమెరికా దౌత్య వేత్తలతో రష్యా అధికారులు చర్చలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో.. మాస్కో నుంచి ఈ ప్రకటన వెలువడడం విశేషం.ఉక్రెయిన్ సంక్షోభం(Ukraine Crisis) ముగిసేలా ఓ ఒప్పందం కోసం ఈ సమావేశం జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఆ చర్చల అజెండాపై ఇప్పుడే ఎలాంటి ప్రకటన చేయబోమని క్రెమ్లిన్ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక.. అమెరికాతో చర్చలు ఇరాన్‌తో సంబంధాలను దెబ్బ తీయొచ్చన్న వాదనను క్రెమ్లిన్ తోసిపుచ్చింది. అయితే తమ ప్రతినిధులు లేకుండానే శాంతి చర్చలు జరుపుతుండడంపై ఉక్రెయిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము లేకుండా జరిపే ఎలాంటి చర్చలకు, ఒప్పందాలకు తాము గుర్తింపు ఇవ్వబోమని అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. మరోవైపు నాటో దేశాలు కూడా రియాద్ వేదికగా జరుగుతున్న ఈ సమావేశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఒకానొక దశలో.. ఇది మాస్కో-వాషింగ్టన్ మధ్య సంబంధాలు బలపర్చుకునే సమావేశాలుగానే నాటో మిత్రపక్షాలు భావిస్తున్నాయి. -
నవాల్నీ మృతికి ఏడాది
మాస్కో: వ్లాదిమిర్ పుతిన్ ఏకఛత్రాధిపత్యాన్ని ధిక్కరిస్తూ, ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ రష్యాలో కీలక విపక్షనేతగా ఎదిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమ నాయకుడు అలెక్సీ నవాల్నీ మరణించి ఏడాది అయింది. ఈ ఏడాదిలో విపక్షాలను ఏకతాటి మీదకు తెచ్చి ప్రభుత్వ వ్యతిరేకోద్యమాన్ని నడిపే సత్తా ఉన్న నేత లేకుండా పోయాడు. దాంతో రష్యా విపక్షాలు నాయకత్వ లోపంతో ఇబ్బందులు పడుతున్నాయి. విపక్ష పార్టీల్లో ఐక్యత లోపించడం ప్రధాన సమస్యగా తయారైంది. 47 ఏళ్ల నవాల్నీ 2024 ఏడాది ఫిబ్రవరి 16న రష్యా మారుమూల ఆర్కిటిక్ ఖండ సమీపంలోని పీనల్ కాలనీ కారాగారంలో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఆయన మరణానికి కారణాలను రష్యా వెల్లడించలేదు. దీంతో రష్యా ప్రభుత్వమే ఆయనను చంపేసిందని విపక్షాలు ఆరోపించాయి. 2020లో సెర్బియా పర్యటనలో ఉన్నప్పుడు నవాల్నీపై నరాల సంబంధ విషప్రయోగం జరిగిన అంశాన్ని విపక్షాలు గుర్తుచేశాయి. నవాల్నీ మృతితో ఇప్పుడు పుతిన్ ఆగడాలకు అడ్డేలేకుండా పోయిందని ఒలెగ్ ఇవనోవ్ వ్యాఖ్యానించారు. 2022లో ఉక్రెయిన్ను రష్యా ఆక్రమించడం మొదలెట్టాక నవాల్నీ మద్దతుదారు అయిన ఇవనోవ్ రష్యాను వీడి అమెరికాలోని లాస్ఏంజెలెస్లో స్థిరపడ్డారు. ‘‘ రష్యా విపక్షంలో ఇన్నాళ్లూ ఉన్న ఏకైక ఆశాదీపం నవాల్నీ. ఆ దీపాన్ని ఆర్పేశారు. ఇన్నాళ్లూ మా దేశంలో ఏదైనా మంచి మార్పు చోటుచేసుకుని, మంచి రోజులు వస్తాయని ఆశపడ్డాం. నవాల్నీ మరణంతో మా ఆశలు అడుగంటాయి. విపక్షాలు పుతిన్‌ను ఎదుర్కొంటాయన్న ఆశ దాదాపు పూర్తిగా చచ్చిపోయింది’’ అని ఇవనోవ్ ఆవేదన వ్యక్తంచేశారు. అద్భుతమైన ప్రసంగాలు ఇచ్చే నవాల్నీ మరణం తర్వాత ఆయన తరఫున వాదించిన లాయర్లనూ ‘తీవ్రవాదులు’గా పేర్కొంటూ పుతిన్ ప్రభుత్వం జైలుపాలుచేసింది. అరెస్టు భయంతో నవాల్నీ మద్దతుదారులు రష్యాను వీడారు. కొందరు స్వదేశంలో ఉన్నా మౌనంగా ఉండిపోయారు. -
మా ప్రమేయం లేని ఒప్పందాలను అంగీకరించం: జెలెన్స్కీ
కెమెల్నిత్స్కీ (ఉక్రెయిన్): యుద్ధ విరమణపై తమ ప్రమేయం లేని ఎలాంటి చర్చలు తమకు ఆమోదయోగ్యం కాదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. వాటిని తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్– రష్యా యుద్ధ విరమణ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం రష్యా అ« ద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. తర్వాత ఆయన జెలెన్స్కీతోనూ చర్చలు జరిపారు. చర్చలకు చొరవ తీసుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించాక.. జెలెన్స్కీ గురువారం దీనిపై తొలిసారిగా స్పందించారు. ‘ప్రతీది పుతిన్ ప్రణాళిక ప్రకారం జరగడానికి వీల్లేదు. దీన్ని మేము అంగీకరించం, అనుమతించం’ అని జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఒక స్వతంత్ర దేశంగా మా ప్రమేయం లేని ఎలాంటి చర్చలూ మాకు ఆమోదయోగ్యం కాదని మా మిత్రదేశాలకు స్పష్టం చేస్తున్నాని తెలిపారు. శాంతి చర్చలకు ఉక్రెయిన్, యూరప్‌లను దూరంగా పెట్టడం సబబు కాదని నాటో దేశాలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం అసాధ్యమని, రష్యా ఆక్రమిత భూభాగాలను ఉక్రెయిన్ వదులుకోవాల్సి ఉంటుందని అమెరికా రక్షణ మంత్రి పీటే హెగ్సెత్ బుధవారం వ్యాఖ్యానించడంతో.. నాటో దేశాలు చర్చలు ఏకపక్షంగా ఉంటాయేమోనని ఆందోళన చెందుతున్నాయి. ఉక్రెయిన్‌కు అన్యాయం చేస్తున్నారనే వాదనను హెగ్సెత్ గురువారం ఖండించారు. ‘ఉక్రెయిన్ ప్రమేయం లేకుండా ఉక్రెయిన్ గురించి చర్చలు ఉండకూడదు. ఉక్రెయిన్ వాదనకు చర్చల్లో ప్రాధాన్యం దక్కాలి’ అని బ్రిటన్ రక్షణమంత్రి జాన్ హీలి అన్నారు. -
పుతిన్‌తో ఫోన్ కాల్ ఎఫెక్ట్.. ఉక్రెయిన్‌కు షాకిచ్చిన ట్రంప్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉక్రెయిన్‌కు వరుస షాక్‌లు ఇస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడిన తర్వాత ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధంపై స్పందిస్తూ కీవ్ నాటో సభ్యత్వం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో జెలెన్స్కీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎందుకంటే ఉక్రెయిన్‌తో శాంతి చర్చల్లో రష్యా ప్రధాన డిమాండ్లలో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం.తాజాగా ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌లో దాదాపు 90 నిమిషాల పాటు సుదీర్ఘంగా ఫోన్‌కాల్‌లో మాట్లాడారు. అనంతరం, ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలు మొదలవుతాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో రష్యా అధినేత పుతిన్‌తో తాను ఈ శాంతి చర్చల కోసం తొలిసారి సౌదీ అరేబియాలో భేటీ కావచ్చని ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ పేర్కొన్నారు. తేదీలు ఇంకా ఫిక్స్ కాలేదని వెల్లడించారు. అలాగని ఈ భేటీలో భారీ జప్యం జరగదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సౌదీ యువరాజు కూడా భాగం కావచ్చని వెల్లడించారు.మరోవైపు.. రష్యా ఆక్రమణలో ఉన్న భూమి ఉక్రెయిన్ తిరిగి పొందే అవకాశాల్లేవని ట్రంప్ బాంబు పేల్చారు. దీంతో క్రిమియా సహా రష్యా ఆక్రమణల్లోని ప్రాంతాలపై ఉక్రెయిన్ ఆశలకు చెక్ పెట్టినట్టు అయ్యింది. అలాగే, కీవ్ నాటో సభ్యత్వం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని తేల్చిచెప్పారు. దీంతో, ఉక్రెయిన్‌కు డబుల్ స్ట్రోక్ తగిలింది.REPORTER: The borders and the lack of NATO membership -- ultimately these are both demands Russia has made. Is there not a danger of handing Russia a win?TRUMP: Well I think if you look at the war, the way the war is going, you'll have to make your own determination pic.twitter.com/ZGQru3Of2g— Aaron Rupar (@atrupar) February 12, 2025ఇదిలా ఉండగా.. ట్రంప్‌తో ఫోన్‌కాల్ చర్చలపై జెలెన్స్కీ స్పందిస్తూ..‘మా మధ్య సమగ్రంగా చర్చలు జరిగాయి. కీవ్‌లో నిజమైన శాంతిని తీసుకొచ్చేందుకు ఏం చేయాలనే అంశంపై మాట్లాడుకొన్నాం. వీటిల్లో దౌత్య, సైనిక, ఆర్థిక అంశాలున్నాయి. తాను, పుతిన్‌తో మాట్లాడినట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. పుతిన్, రష్యాపై ఒత్తిడి తీసుకురావడానికి అమెరికా శక్తి సరిపోతుందని నేను భావిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఉక్రెయిన్‌కు రష్యా ఝలక్
మాస్కో: ఉక్రెయిన్‌కు రష్యా ఝలక్ ఇచ్చింది. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ చేసిన ప్రతిపాదనను మాస్కో వర్గాలు తోసిపుచ్చాయి శాంతి ఒప్పందంలో భాగంగా.. భూభాగాల పరస్పర మార్పిడికి సిద్ధమని జెలెన్స్కీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. అందుకు తమ దేశం ఏనాటికీ అంగీకరించబోమని రష్యా ప్రకటించింది.ఇది ఎన్నటికీ జరగదు. రష్యా తన భూభాగాన్ని మార్పిడి చేసే అంశాన్ని ఎన్నడూ చర్చించలేదు.. చర్చించబోదు కూడా అని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు. రష్యా భూభాగాల్లో అడుగుపెట్టిన ఉక్రెయిన్ బలగాలను తరిమి కొట్టడం లేదంటే నాశనం చేస్తుందని పేర్కొన్నారాయన. రష్యాతో భూభాగ మార్పిడికి తాము సిద్ధంగా ఉన్నామని, అందుకు ఉక్రెయిన్ భూభాగాలను రష్యా విడిచి పెట్టాలని జెలెన్స్కీ షరతు విధించారు. ఈ సందర్బంగా వాటిలో ఏ భూభాగాలను తిరిగి తీసుకుంటారని మీడియా అడగ్గా తమ భూభాగాలన్నీ ముఖ్యమైనవే అన్నారు. ఏవి తిరిగి తీసుకోవాలనే విషయంపై చర్చల అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు.అయితే ఈ వ్యాఖ్యలపై చర్చ నడుస్తున్న వేళ.. కీవ్‌పై రష్యా బలగాలు డ్రోన్ దాడులు జరపగా ఒకరు మరణించారు. మరోవైపు.. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం మూడో ఏడాదిలోకి అడుగుపెట్టబోతోంది. ఈ క్రమంలో.. శాంతి చర్చలు జరిగేలా డొనాల్డ్ ట్రంప్ కృషి చేయాలని జెలెన్స్కీ కోరుతున్నారు. తమవద్ద అరుదైన ఖనిజ నిల్వలు అధికంగా ఉన్నాయని.. వాటివల్ల అమెరికా కంపెనీలకు లాభాలు చేకూరుతాయని చెబుతున్నారు. -
పుతిన్‌కు షరతు.. అమెరికాకు జెలెన్ స్కీ బంపరాఫర్!
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వేళ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా(Russia) ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాలను పుతిన్ విడిచిపెడితే తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను అప్పగిస్తామని జెలెన్ స్కీ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తాము అనుకున్నది జరగాలంటే రష్యా-ఉక్రెయిన్ల మధ్య చర్చలు జరిగేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చొరవ చూపాలని చెప్పుకొచ్చారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘రష్యాతో భూభాగ మార్పిడికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే, ఉక్రెయిన్ భూభాగాలను రష్యా విడిచిపెడితే మా అధీనంలో ఉన్న కుర్స్క్‌ను వారికి అప్పగిస్తామం’ అని అన్నారు. ఈ సందర్బంగా వాటిలో ఏ భూభాగాలను తిరిగి తీసుకుంటారని మీడియా అడగ్గా తమ భూభాగాలన్నీ ముఖ్యమైనవే అన్నారు. ఏవి తిరిగి తీసుకోవాలనే విషయంపై చర్చల అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో తాము అనుకున్నది జరగాలంటే రష్యా-ఉక్రెయిన్ల మధ్య చర్చలు జరిగేలా డొనాల్డ్ ట్రంప్ కృషి చేయాలని కోరారు. రష్యా నుంచి తమ భూభాగాలను ఉక్రెయిన్‌కు అప్పగించినందుకు అమెరికాలో పలు ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు జెలెన్ స్కీ ప్రకటించారు. తమవద్ద అరుదైన ఖనిజ నిల్వలు అధికంగా ఉన్నాయని.. వాటివల్ల అమెరికా కంపెనీలకు లాభాలు చేకూరుతాయని తెలిపారు. ఉక్రెయిన్లోనూ ఉద్యోగాలు సృష్టించవచ్చని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. 2014లో రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకుంది. అనంతరం డోనెస్క్, ఖేర్సన్, లుహాన్స్క్, జాపోరిజ్జియా ప్రాంతాలను తన నియంత్రణలోకి తీసుకుంది. అయినప్పటికీ వాటిపై పుతిన్‌కు మాత్రం పూర్తి నియంత్రణ లేదు. ఉక్రెయిన్‌పై యుద్దం సందర్భంగా కూడా రష్యా పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే.JUST IN: 🇺🇦🇷🇺 Ukrainian President Zelensky says he's prepared to offer a territory swap with Russia as part of peace deal negotiations to end the war. pic.twitter.com/N9w9uoYfnl— BRICS News (@BRICSinfo) February 11, 2025 -
‘నేనంటే పుతిన్‌కు భయం’
కీవ్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌పై (vladimir putin) ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్స్కీ (Volodymyr Zelenskyy) సెటైర్లు వేశారు. మూడేళ్లుగా యుద్ధం జరుగుతున్నా మాతో చర్చలు జరిపేందుకు పుతిన్ భయపడుతున్నారు. శక్తివంతమైన నేత భయపడుతున్నారు’ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఉక్రెయిన్-రష్యాల దేశాల యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ (donald trump) స్పందించారు. ఇరు దేశాదినేతలు యుద్ధానికి ముగింపు పలికేలా శాంతి చర్చలు జరపాలని హితువు పలికారు. లేదంటే ఇరు దేశాలపై అమెరికా కఠిన ఆంక్షలు విధించాల్సి వస్తుందని హెచ్చరించారు.అయితే, ట్రంప్ హెచ్చరికలపై పుతిన్ స్పందించారు. ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు తాను సిద్ధమేనని తెలిపారు. కానీ, చట్టవిరుద్ధంగా మార్షల్‌లా విధించిన జెలెన్స్కీతో తాము చర్చలు జరపబోమన్నారు. ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు మేం సిద్ధం. జెలెన్స్కీ మాతో జరిగే చర్చల్లో పాల్గొంటే. నేను పాల్గొనను. మా తరుఫున ప్రతినిధుల్ని పంపిస్తాం. చర్చలు కూడా మాకు అనుకూలంగా జరగగాలి’ అని వ్యాఖ్యనించారు. Today, Putin once again confirmed that he is afraid of negotiations, afraid of strong leaders, and does everything possible to prolong the war. Every move he makes and all his cynical tricks are aimed at making the war endless.In 2014, Russia started a hybrid war against…— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) January 28, 2025పుతిన్ నిర్ణయంపై జెలెన్ స్కీ మండి పడ్డారు. పుతిన్ స్వార్ధపరడు. మూడేళ్లుగా యుద్ధం జరగుతుంటే కనీసం మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. మాతో మాట్లాడేందుకు పుతిన్ .. అదే అత్యంత శక్తివంతమైన నేత భయపడుతున్నారు.యుద్ధంపై అమెరికా-రష్యాలు చర్చలు జరిపితే అందులో ఉక్రెయిన్ పాల్గొనకపోతే ఎలా? అదే జరిగితే మా ప్రయోజనాలు దెబ్బతినట్లే. తన స్వలాభం కోసం పుతిన్ తన చర్యల ద్వారా డొనాల్డ్ ట్రంప్‌ను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజమైన శాంతికి రష్యా కట్టుబడి ఉంటే యుద్ధానికి ముగింపు పలకొచ్చు. కానీ పుతిన్ ఆ పని మాత్రం చేయరు. ఉద్దేశ్యపూర్వకంగా చర్చలు జరపకుండా.. యుద్ధాన్ని కొనసాగించేందుకే ఇష్టపడతారని’ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 👉చదవండి : మతిలేని యుద్ధం ఆపండి -
‘పుతిన్ హత్యకు అమెరికా కుట్ర?’
వాషింగ్టన్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ను హతమార్చేందుకు అమెరికా ప్రయత్నించింది. ఇప్పుడీ వ్యాఖ్యలు అంతర్జాతీయ మీడియాలో చర్చాంశనీయంగా మారింది. అయితే ఈ వ్యాఖ్యల్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. అందుకు కారణం ప్రముఖ అమెరికన్ పండిట్, మాజీ ఫాక్స్ న్యూస్ యాంకర్ టక్కర్ కార్ల్సన్ (Tucker Carlson)..తన ‘ది టక్కర్ కార్లసన్ షో’ పాడ్‌కాస్ట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ రచయిత మాట్ తైబీతో పాడ్‌కాస్ట్‌లో కార్ల్సన్ మాట్లాడుతూ.. పుతిన్‌ను హత్య చేసేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్ ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపణలు చేశారు. జోబైడెన్ ప్రభుత్వం పుతిన్‌ను చంపేందుకు ప్రయత్నించింది. ఇది పిచ్చి, మతిలేని చర్య అని అన్నారు. 🇺🇸🇷🇺 Tucker Carlson said that the Biden administration tried to kill Vladimir PutinThe goal is to start World War III and sow chaos. Carlson said this during an interview with journalist Matt Taibbi. pic.twitter.com/k7STerZxFg— Маrina Wolf (@volkova_ma57183) January 28, 2025అయితే, కార్లసన్ వ్యాఖ్యల్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని జోబైడెన్ మద్దతు దారులు స్పష్టం చేస్తున్నారు. అందుకు ఊతం ఇచ్చేలా 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీ మోసం జరిగిందని, అందుకు అర్ధం పర్ధంలేని ఆధారాల్ని టెలికాస్ట్ చేసి ఫాక్స్ న్యూస్‌లో ఉద్యోగం కోల్పోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దీనికితోడు పుతిన్‌ను హత్య చేసేందుకు జోబైడెన్ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించిన కార్లసన్ అందుకు తగిన ఆధారాల్ని ఎందుకు చూపించలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ ఆరోపణలపై జోబైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా స్పందించలేదు, అయితే క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఈ విషయంపై వ్యాఖ్యానించారు, పుతిన్ భద్రతను నిర్ధారించడానికి రష్యన్ ప్రత్యేక సేవలు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. -
మతిలేని యుద్ధం ఆపండి
వాషింగ్టన్: ఉక్రెయిన్‌తో మతిలేని యుద్ధానికి ఇకనైనా తెరదించాలని రష్యా అధినేత పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హితవు పలికారు. యుద్ధాన్ని ముగించేలా ఉక్రెయిన్‌తో ఒప్పందానికి రావాలని సూచించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. పుతిన్‌తో సాధ్యమైనంత త్వరగా సమావేశమవుతానని చెప్పారు. యుద్ధం ఆపకపోతే రష్యాపై కఠిన ఆంక్షలు విధించక తప్పదని ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆంక్షల భయంతో పుతిన్ వెనక్కి తగ్గుతారని మీరు భావిస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, అది నాకు తెలియదు అని ట్రంప్ బదులిచ్చారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధక్షేత్రంలో అమాయకులు బలైపోతున్నారని, అందుకే తక్షణమే ఆ యుద్ధం ఆగిపోవాలని తాను కోరుకుంటున్నట్లు పునరుద్ఘాటించారు. రష్యాతో సంధికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సిద్ధంగా ఉన్నారని ట్రంప్ తెలిపారు. అబార్షన్ వ్యతిరేక ఉద్యమకారులకు ట్రంప్ క్షమాభిక్షషికాగో: అబార్షన్లకు వ్యతిరేకంగా క్లినిక్‌ల వద్ద నిరసన తెలిపిన ఉద్యమకారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్షమాభిక్ష ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేయడం తనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. శాంతియుతంగా నిరసనలు చేపట్టిన వీరికి శిక్షలు విధించడం సరికాదని తెలిపారు. 2020 అక్టోబర్‌లో వాషింగ్టన్‌లోని అబార్షన్ క్లినిక్‌ను దిగ్బంధించి, తలుపులు మూసి తాళాలు వేసి నిరసన తెలిపిన లారెన్ హార్డీతోపాటు మరో 9 మంది సహ నిందితులకు ట్రంప్ క్షమాభిక్ష ప్రకటన వర్తించనుంది. -
చర్చలకు రాకపోతే ఆంక్షలే : పుతిన్‌కు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: రష్యా అధినేత పుతిన్‌ను కలుసుకోవడానికి ఆసక్తితో ఉన్నానని, ఎప్పుడైనా సరే ఆయనతో చర్చలకు తాను సిద్ధమని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. చర్చలకు ముందుకు రాకపోతే రష్యాపై అదనపు ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. చర్చల బల్ల వద్ద కలుసుకుందామని పుతిన్‌కు సూచించారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో ఇప్పటికే లక్షలాది మంది మరణించారని ఆవేదన వ్యక్తంచేశారు. సైనికులతోపాటు సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడం, నగరాలు, పట్టణాలు శిథిలాలుగా మారుతుండడం బాధాకరమని అన్నారు. మీడియాలో వస్తున్న వార్తల కంటే ఉక్రెయిన్‌లో మృతుల సంఖ్య అధికంగా ఉందన్నారు. వాస్తవాలు చెప్పడం లేదని మీడియాపై మండిపడ్డారు. ట్రంప్ స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. నాలుగేళ్ల క్రితం తాను అధ్యక్షుడిగా ఎన్నికై ఉంటే ఉక్రెయిన్–రష్యా యుద్ధం జరిగేది కాదని స్పష్టంచేశారు. సమర్థుడైన పాలకుడు అధికారంలో ఉంటే యుద్ధాలకు ఆస్కారం ఉండదని అన్నారు. పుతిన్ చాలా తెలివైన వ్యక్తి అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తమ గత అధ్యక్షుడు జో బైడెన్‌ను, రష్యా ప్రజలను పుతిన్ అగౌరవపర్చారని ఆక్షేపించారు. పుతిన్ గురించి తనకు బాగా తెలుసని చెప్పారు. తాను పదవిలో ఉంటే మధ్యప్రాచ్యంలో సంక్షోభం తలెత్తేది కాదని పునరుద్ఘాటించారు. 200 మిలియన్ డాలర్లు అధికంగా ఖర్చు చేశాం ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా, ఆర్థిక సాయం నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తామని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడుతున్నామని, త్వరలో పుతిన్‌తోనూ మాట్లాడుతామని చెప్పారు. ‘‘ఉక్రెయిన్– రష్యా యుద్ధానికి యూరోపియన్ యూనియన్ కంటే అమెరికా 200 మిలియన్ డాలర్లు అధికంగా ఖర్చు చేసింది. మాతో సమానంగా యూరోపియన్ యూనియన్ భారం భరించాల్సిందే. మేము ఎక్కువ ఖర్చు పెట్టాం అంటే నిజంగా మూర్ఖులమే. అందులో సందేహం లేదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. శాంతిని కోరుకుంటున్నట్లు జెలెన్స్కీ తనతో చెప్పారని వివరించారు. ఏం జరుగుతుందో చూద్దామని చెప్పారు. పుతిన్ ఎప్పుడు కోరుకుంటే అప్పుడు చర్చలకు సిద్ధమని ట్రంప్ తేలి్చచెప్పారు. యుద్ధంలో మరణాలు ఇక ఆగిపోవాలని అన్నారు. కృత్రిమ మేధలో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు చైనా నుంచి వచ్చే దిగుమతులపై 10 శాతం టారిఫ్ విధించాలని భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. చైనా నుంచి ఫెంటానైల్ అనే ప్రమాదకరమైన మాదకద్రవ్యం రాకుండా అడ్డుకోనున్నట్లు చెప్పారు. చైనా నుంచి మెక్సికో, కెనడా వంటి దేశాలకు, అక్కడి నుంచి అమెరికాకు ఫెంటానైల్ చేరుకుంటోందని ఆందోళన వ్యక్తంచేశారు. డ్రగ్స్‌తోపాటు అక్రమ వలసదార్లను అమెరికాలోకి పంపిస్తున్న దేశాల ఉత్పత్తులపై భారీగా పన్నులు విధిస్తామని ఆయన గతంలోనే హెచ్చరించిన సంగతి తెలిసిందే. కృత్రిమ మేధ(ఏఐ) మౌలిక సదుపాయాల కల్పనకు 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఒక కొత్త కంపెనీ ద్వారా నిధులు ఖర్చు చేస్తామన్నారు. ఒరాకిల్, సాఫ్ట్‌బ్యాంక్, ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో ఈ కంపెనీని స్థాపిస్తామన్నారు. స్టార్గేట్గా పిలిచే ఈ ప్రాజెక్టు ద్వారా లక్ష ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. -
‘ఘోర విమానం ప్రమాదంలో రష్యాదే తప్పు’.. ఇదిగో సాక్ష్యం
బాకో: ల్యాండింగ్ సమయంలో అజర్ బైజాన్ ఎయిర్‌లైన్స్ (Azerbaijan Airlines)కు చెందిన జె2-8243 విమానం కజకిస్థాన్ కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 38 మంది మృతి చెందగా..29 మంది తీవ్రంగా గాయపడ్డారు.అయితే, ఈ ప్రమాదంపై ఆదివారం (డిసెంబర్ 29) అజర్ బైజాన్ ప్రెసిడెంట్ ఇల్హామ్ అలీయేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా ప్రాంతం నుంచి జరిపిన కాల్పుల వల్లే అజర్ బైజాన్ విమానం ప్రమాదానికి గురైందని చెప్పారు. విమాన ప్రమాదానికి గల కారణాల్ని మాస్కో దాచే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అమాయకుల ప్రాణాల్ని బలి తీసుకున్న రష్యా అందుకు బాధ్యత వహిస్తూ.. చేసిన తప్పును ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు.‘అజర్ బైజాన్ ఎయిర్‌లైన్స్ ప్రమాదానికి గల కారణాల్ని దాచేందుకు రష్యాలోని ఓ వర్గం అసత్య ప్రచారం చేస్తుందని, తప్పుడు కథనాలతో మసిపూసి మారేడు కాయ చేస్తుంది. విమాన ప్రమాదం జరిగిన కారణ వేరయితే, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మాస్కో చెబుతున్న కారణాలు వేరేలా ఉన్నాయి. చేసిన తప్పును అంగీకరించడం, అజర్ బైజాన్‌కు క్షమాపణలు చెప్పడం, విమాన ప్రమాదం జరిగిన తీరుతెన్నుల గురించి ప్రజలకు వివరించాలి అని’ఇల్హామ్ అలీయేవ్ రష్యాకు సూచించారు. President Aliyev: “First, Russia must apologize to Azerbaijan. Second, it must admit its guilt. Third, it must punish the culprits, hold them criminally responsible, and pay compensation to the Azerbaijani state as well as to the affected passengers and crew members. These are… pic.twitter.com/5N16w4Zhfw— Nasimi Aghayev🇦🇿 (@NasimiAghayev) December 29, 2024కాగా, ప్రమాదం జరిగిన రోజున ఉక్రెయిన్ డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు గ్రోజ్ని సమీపంలో రష్యా గగనతల రక్షణ వ్యవస్థ క్షిపణులను ప్రయోగిస్తోంది. ఆ సమయంలో రష్యా క్షిపణి తాకడం కారణంగా విమానం కూలిందంటూ ఉక్రెయిన్‌తో పాటు అజర్ బైజాన్ కూడా ఆరోపించింది. ఈ క్రమంలోనే అజర్ బైజాన్ విమాన ప్రమాదాన్ని రష్యా ‘విషాదకరమైన సంఘటన’ అని పిలిచినందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అజర్బైజాన్ ప్రెసిడెంట్ ఇల్హామ్ అలీయేవ్‌ను క్షమాపణలు కోరారు. కానీ, రష్యా జరిపిన క్షిపణుల ప్రయోగం వల్లే విమానం కూలినట్లు ఎక్కడా ప్రస్తావించలేదు. -
టార్గెట్ రష్యా.. ఉక్రెయిన్‌కు బైడెన్ బంపరాఫర్
మాస్కో: ఇటీవల కాలంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడులను తీవ్రతరం చేసింది. ఈ క్రమంలోనే క్రిస్టమస్ వేళ ఉక్రెయిన్ను టార్గెట్ చేస్తూ రష్యా భీకర దాడులకు పాల్పడింది. 70కి పైగా క్షిపణులు, 100కు పైగా డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు మరోసారి అమెరికా అండగా నిలిచింది.రష్యా దాడుల నుంచి కీవ్‌ను రక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు అందిస్తామని వెల్లడించారు. దీనిపై ఇప్పటికే తాను రక్షణ మంత్రిత్వశాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ ప్రజలు చలి నుంచి రక్షణ పొందకుండా ఉండడమే రష్యా దాడి వెనుక ఉద్దేశం. గ్రిడ్ వ్యవస్థను నాశనం చేసి వారికి విద్యుత్ సరఫరా అందకుండా మాస్కో కుట్ర పన్నింది అంటూ సంచలన కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ విషయంలో బైడెన్ ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ట్రంప్ అధికారంలోకి వచ్చేనాటికి ఉక్రెయిన్‌కు మరింత ఎక్కువ సాయం అందించాలనే ఉద్దేశంతో బైడెన్ సర్కారు వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే 725 మిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించగా.. దానికి అదనంగా మరో 988 మిలియన్ డాలర్ల ఆయుధ సామగ్రిని ఇస్తామని బైడెన్ కార్యవర్గం హామీ ఇచ్చింది. అమెరికా నుంచి కీవ్‌కు 2022 నుంచి ఇప్పటి వరకు 62 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు, ఇతర సాయం అందించారు.మరోవైపు.. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధం చేస్తున్న దేశాలకు అమెరికా సాయం అందించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో చర్చలు జరపాలని చెప్పుకొచ్చారు. -
ఉక్రెయిన్‌పై 70 మిసైళ్లు, 100 డ్రోన్లతో రష్యా దాడి
కీవ్ : ఈ వారం ప్రారంభంలో రష్యా వెన్నులో భయం పుట్టించేలా 9/11 దాడుల తరహాలో ఉక్రెయిన్ దాడి చేసింది. కజాన్ నగరంలోని బహుళ అంతస్తుల భవనాలపై మొత్తం 8 డ్రోన్లు చొచ్చుకెళ్లాయి. ఈ దాడికి రష్యా తాజాగా ప్రతీకారం తీర్చుకుంది. ఉక్రెయిన్‌పై 70మిసైళ్లు,100 డ్రోన్లతో విరుచుకుపడింది.క్రిస్టమస్ పర్వదినాన రష్యా చేసిన దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఖండించారు. తమ దేశ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై అమానవీయంగా దాడి చేసిందని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.‘ప్రపంచం మొత్తం క్రిస్టమస్ వేడుకల్లో ఉంటే ఉక్రెయిన్‌పై రష్యా భారీ ఎత్తున దాడికి దిగింది. దాడి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ముందస్తు ప్రణాళికలో భాగంగా వ్యూహాత్మకంగా జరిగింది. దాడి మాత్రమే కాదు. దాడి ఎప్పుడు చేయాలనేది ముందే నిర్ణయించుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉద్దేశ్యపూర్వకంగా ఈ విధ్వంసానికి తెరలేపారు. ఇంతకంటే అమానుషం ఏముంటుంది?’ అని జెలెన్స్కీ ప్రశ్నించారు. Every massive Russian strike requires time for preparation. It is never a spontaneous decision. It is a deliberate choice – not only of targets but also of timing and date.Today, Putin deliberately chose Christmas for an attack. What could be more inhumane? Over 70 missiles,… pic.twitter.com/GMD8rTomoX— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) December 25, 2024ఉక్రెయిన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై రష్యా భారీ దాడి చేసిందని ఉక్రెయిన్ ఇంధన మంత్రి జర్మన్ గలుష్చెంకో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..శత్రువు(రష్యా) మళ్లీ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై భారీగా దాడి చేస్తోంది. శత్రు దాడి నుంచి ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ప్రతికూల ప్రభావం పడకుండా రక్షణ చర్యలు తీసుకుంటునట్లు చెప్పారు. నగరాలపై దాడులుఒక బాలిస్టిక్ క్షిపణి మంగళవారం సెంట్రల్ ఉక్రెయిన్ నగరమైన క్రివీ రిహ్‌లోని అపార్ట్మెంట్ భవనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. 15మంది గాయపడ్డారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 32 అపార్ట్మెంట్లతో కూడిన నాలుగు అంతస్తుల రెసిడెన్షియల్ బ్లాక్‌పై దాడి జరిగినట్లు మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఒలెక్సాండర్ విల్కుల్ టెలిగ్రామ్‌లో వెల్లడించారు.అదే సమయంలో రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. తమ బలగాలు 59 ఉక్రేనియన్ డ్రోన్లను రాత్రిపూట కూల్చివేసాయని, ఉక్రేనియన్ వైమానిక దళం నల్ల సముద్రం నుండి కాలిబర్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని, అయితే వాటిని వేటిపై ప్రయోగించారనే విషయంపై స్పష్టత లేదని పేర్కొంది. -
పుతిన్ పగ.. అణు యుద్ధానికి టైమ్ ఫిక్స్
-
ఉగ్ర ముద్ర తొలగించేలా.. పుతిన్ కీలక నిర్ణయం
మాస్కో: రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. పలు సంస్థలపై వేసిన ఉగ్రవాద ముద్ర తొలగించేలా కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఉగ్రవాద ముద్రను తొలగించే హక్కును కోర్టులకు అప్పగించింది. సంబంధిత చట్టాన్ని రష్యా పార్లమెంట్ ఆమోదించింది. దీంతో ఆఫ్గాన్ తాలిబన్లు, సిరియా తిరుగుబాటు దారులతో సంబంధాలను ఏర్పరుచుకునేందుకు అవకాశం రష్యాకు కలగనుంది. రష్యా తెచ్చిన కొత్త చట్టం ప్రకారం.. కోర్టులు సదరు సంస్థలు ఉగ్రవాద కార్యకలాపాలకు దూరంగా ఉన్నట్లు గుర్తించాల్సి ఉంటుంది. అనంతరం, ఉగ్రవాద జాబితాలో ఆయా సంస్థలకు కోర్టులు విముక్తి కలిగిస్తాయి. ఇందుకోసం రష్యా ప్రాసిక్యూటర్ జనరల్ ఒక నిషేధిత సంస్థ ఉగ్రవాదానికి దూరంగా ఉందని వివరిస్తూ కోర్టుకు విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడు న్యాయమూర్తి ఉగ్రవాద జాబితాలో సదరు సంస్థను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేయొచ్చు. రష్యా ఉగ్రవాద జాబితాలో ఫిబ్రవరి 2003లో తాలిబాన్, 2020లో సిరియాను చేర్చింది. అయితే, 20 సంవత్సరాల యుద్ధం తర్వాత 2021 ఆగస్టులో బాధ్యతలు చేపట్టిన ఆఫ్గన్ తాలిబాన్ ప్రభుత్వంపై రష్యా మెరుగైన సంబంధాలను కొనసాగిస్తుంది. ఉగ్రవాదంపై పోరులో ఇప్పుడు తాలిబాన్ మిత్రదేశమని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పలు మార్లు వ్యాఖ్యానించారు. సిరియాలో ఆరు దశాబ్దాల అసద్‌ల కుటుంబ పాలన నుంచి సిరియాకు చెందిన హయత్ తహ్రీర్ అల్ షామ్ విముక్తి కలిగించింది. అదే సంస్థపై రష్యా విధించిన ఉగ్ర ముద్రను తొలగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. -
బాంబు దాడిలో రష్యా ఆర్మీ జనరల్ మృతి
మాస్కో: రష్యా రాజధానిలోని మాస్కోలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో రష్యా ఆర్మీ సీనియర్ జనరల్ మృత్యువాతపడ్డారు. ఆర్మీ అణు, జీవ, రసాయన భద్రతా విభాగం చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్(54) మంగళవారం కార్యాలయానికి వెళ్లేందుకు తన నివాసం ఆవరణలోని కారు వద్దకు రాగా ఆ పక్కనే స్కూటర్లో అమర్చిన బాంబు పేలింది. ఘటనలో కిరిల్లోవ్తోపాటు ఆయన సహాయకుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీని వెనుక తమ సీక్రెట్ సర్వీస్(ఎస్‌బీయూ) హస్తముందని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. సోమవారం జనరల్ కిరిల్లోవ్‌పై పలు నేరారోపణలను సంధించిన ఎస్‌బీయూ, మరునాడే ఈ చర్యకు పాల్పడటం గమనార్హం. ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు ముందుకు సాగుతున్న వేళ తాజా పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయి న్లో రష్యా పాల్పడు తున్న దారుణాల్లో కిరిల్లోవ్ కీలకంగా ఉన్నారంటూ కెనడా, బ్రిటన్ తదితర దేశాలు ఆయనపై ఆంక్షలు విధించాయి. ఉక్రెయిన్ ఆర్మీపై నిషేధిత రసాయన ఆయుధాల వినియోగానికి కిరిల్లోవ్ ఆదేశాలే కారణమని సోమవారం ఎస్‌బీయూ ఆరోపణలు చేసింది. ‘కిరిల్లోవ్ యుద్ధ నేరస్తుడు, తమ న్యాయబద్ధమైన లక్ష్యం’ అంటూ వ్యాఖ్యానించింది. 2022 ఫిబ్రవరిలో రష్యా దురాక్రమణ మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రంలో 4,800 పర్యా యాలకుపైగా రష్యా రసాయన ఆయుధాలను ప్రయోగించినట్లు ఎస్‌బీయూ ఆరోపిస్తోంది. మొదటి ప్రపంచ యుద్ధంలో వాడిన క్లోరోపిక్రిన్ అనే విష వాయువును ఉక్రెయిన్ బలగాలపై రష్యా ప్రయోగించినట్లు అమెరికా అంటోంది. ఈ ఆరోపణలను రష్యా తీవ్రంగా ఖండించింది.తగు రీతిలో ప్రతీకారం తప్పదుజనరల్ కిరిల్లోవ్‌ను చంపేందుకు స్కూటర్లో అమర్చిన బాంబును రిమోట్‌తో పేల్చినట్లు గుర్తించామని రష్యా అధికారులు చెప్పారు. రష్యా దీనిని ఉగ్రవాద చర్యగా పేర్కొంది. ఉక్రెయిన్ను తగు రీతిలో దండిస్తామని ప్రకటించింది. అధ్యక్షుడు పుతిన్ సారథ్యంలోని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదెవ్ స్పందిస్తూ..సైనిక వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఉక్రెయిన్ ఈ చర్యకు పాల్పడిందన్నారు. ఆ దేశ సైనిక, రాజకీయ నాయకత్వం ప్రతీకార చర్యలను ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. గతంలోనూ ఇటువంటి దాడుల్లో పలువురు రష్యా ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. వీటికి ఉక్రెయినే కారణమని రష్యా నిందించింది.🛑Breaking🛑Senior Russian General Igor Kirillov, head of Russia’s NBC defense forces, killed in a scooter bomb explosion in Moscow (Dec 17). pic.twitter.com/Zn9hhzuz3D— Taymur Malik (@Taymur918) December 17, 2024 -
చైనాకు చెక్.. పుతిన్‌తో భారత్ భారీ ఒప్పందం
ఢిల్లీ: భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో రాజ్‌నాథ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, రక్షణ సహాకారంపై చర్చించారు. రష్యా స్నేహితులకు భారత్ అన్నివేళలా అండగా నిలుస్తుందని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో రష్యాతో భారత ప్రభుత్వం భారీ రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది.రష్యా పర్యటనలో రాజ్‌నాథ్ సింగ్ కీలక ఒప్పందంపై చర్చించారు. రాడార్ వ్యవస్థకు సంబంధించిన భారీ రక్షణ ఒప్పందాన్ని రష్యాతో భారత్ కుదుర్చుకుంది. సుమారు నాలుగు బిలియన్ డాలర్ల ఖరీదైన ఒప్పందం తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. లాంగ్ రేంజ్ వార్నింగ్ రాడార్ వ్యవస్థ వోరోనెజ్ రాడార్(Radar Voronezh)ను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయనున్నది. ఆ ఒప్పందానికి చెందిన సంప్రదింపులు తుది దశలో ఉన్నట్లు భారత ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.దేశ రక్షణ విషయంలో కేంద్రం టెక్నాలజీని పెంచే ఉద్దేశంతో ముందడుగు వేసింది. మిస్సైల్ బెదిరింపుల్ని గుర్తించి, ట్రాక్ చేసేందుకు సామర్థ్యాన్ని పెంచుకోవాలని భారత్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే రాడార్ వ్యవస్థ కొత్త టెక్నాలజీపై ఫోకస్ పెట్టింది. అయితే, అల్మాజ్-ఆంటే కార్పొరేషన్ కంపెనీ వోరోనేజ్ రేడార్లను ఉత్పత్తి చేస్తున్నది. ఏరోస్పేస్ ఎక్విప్మెంట్, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్ సిస్టమ్స్, రేడార్ల ఉత్పత్తిలో ఆ సంస్థ అగ్రస్థానంలో ఉన్నది.Russia is talks to sell gigantic radar to india.Almaz-Antey’s Voronezh radar detects missiles, aircraft, and threats up to 6,000–8,000 km, supporting Russia’s missile defence network. pic.twitter.com/AmCWaX01Rs— Abhimanyu Manjhi (@AbhimanyuManjh5) December 10, 2024ఈ నేపథ్యంలోనే సుదీర్ఘ దూరం నుంచి క్షిపణుల కదలికల్ని రాడార్లతో పసికట్టేందుకు ఈ కొనుగోలు చేపట్టనున్నారు. అధునాతన రాడార్ వ్యవస్థ చైనా, దక్షిణ, మధ్య ఆసియా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఎక్కడి నుంచి అయినా ముప్పును గుర్తించగలదు. దాదాపు 8 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలిస్టిక్ క్షిపణులు, విమానాలను వోరోనేజ్ రాడార్ వ్యవస్థ గుర్తిస్తుందని అధికారులు అంటున్నారు. కొన్ని దేశాల వద్దే ఉన్న ఇలాంటి టెక్నాలజీని ఇప్పుడు భారత్ కూడా సొంతం చేసుకోనున్నట్లు రష్యా చెబుతోంది.ఇక, ఇటీవల అల్మేజ్-ఆంటే బృందం భారత్‌లో పర్యటించింది. మేకిన్ ఇండియాలో భాగంగా సుమారు 60 శాతం రాడార్ వ్యవస్థను భారతీయ కంపెనీల ఉత్పత్తులతోనే నిర్మించనున్నారు. కర్నాటకలోని చిత్రదుర్గలో దీన్ని ఇన్స్టాల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ అడ్వాన్స్డ్ డిఫెన్స్ , ఏరోస్పేస్ సౌకర్యాలు ఉన్నాయి. -
సిరియా అధ్యక్షుడి ఆచూకీ గల్లంతు.. రష్యా కీలక ప్రకటన
డమాస్కస్: సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ చెందారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో రష్యా కీలక ప్రకటన చేసింది. బషర్ అల్-అసద్ బ్రతికే ఉన్నారంటూ పరోక్షంగా వ్యాఖ్యానించింది. కానీ ఆయన జాడ గురించి ప్రస్తావించలేదు. ఆదివారం సిరియా దేశం మొత్తాన్ని రెబల్స్ పూర్తిగా ఆక్రమించారు. దీంతో బషర్ ఆల్-అసద్ అధ్యక్ష పదవిని రెబల్స్‌కు అప్పగించారు. కుటుంబ సభ్యులతో కలిసి విమానంలో పరారయ్యారు. ఆ విమానాన్ని రెబల్స్ కూల్చి వేశారని, కూల్చి వేతతో బషర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరణించినట్లు అంతర్జాతీయ కథనాలు వెలుగులోకి వచ్చాయి.అయితే, అనూహ్యంగా రష్యా కీలక ప్రకటన చేసింది. శాంతియుతంగా అధికారాన్నిఅప్పగించాలని రెబల్స్ ఆదేశాలు ఇవ్వడంతో బషర్ అల్ అసద్ తన పదవిని విడిచిపెట్టారని, ఆపై దేశం విడిచి వెళ్లినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.కానీ, అసద్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో రష్యా చెప్పలేదు. దేశం వదిలే వెళ్లే సమయంలో జరిపిన చర్చలలో తాము పాల్గొనలేదని పేర్కొంది. మరోవైపు, సిరియాని రెబల్స్ స్వాధీనం చేసుకున్న పరిణామల నేపథ్యంలో రష్యా సైనిక స్థావరాలను హై అలర్ట్‌లో ఉంచామని, అయితే ప్రస్తుతానికి వాటికి ఎలాంటి తీవ్రమైన ముప్పు లేదని పేర్కొంది.అసద్‌కు అండగా రష్యాసిరియాలో 2015లో తిరుగుబాటు దళాలకు వ్యతిరేకంగా అసద్ ప్రభుత్వానికి రష్యా అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రత్యర్థి వర్గంపై పెద్దఎత్తున దాడులకు పాల్పడింది. బషర్ ఆల్-అసద్ పదవి విడిచి పెట్టిన అనంతరం జరుగుతున్న వరుస పరిణామలపై రష్యా గమనిస్తుంది. -
మేకిన్ ఇండియా పాలసీ భేష్ : పుతిన్
మాస్కో: భారత్ ప్రధాని నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇండియా ఫస్ట్ పాలసీ మేకిన్ ఇండియా అద్భుతమని రష్యాలో జరుగుతున్న15వ వీటీబీ ఇన్వెస్ట్ ఫోరమ్‌లో కొనియాడారు. ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో పుతిన్ మాట్లాడుతూ.. ‘అభివృద్ధి కోసం స్థిరమైన వాతావరణాన్ని పెంపొందించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలు అమోఘం. తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా రూపొందించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించి చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల్లో స్థిరమైన వాతావరణాన్ని కొనసాగించేందుకు మోదీ నేతృత్వంలోని భారత్ చేస్తున్న ప్రయత్నాలు భాగున్నాయి. ఈ సందర్భంగా భారత్ తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. -
పుతిన్, కిమ్ మధ్య కుదిరిన డేంజర్ డీల్..
మాస్కో: రష్యా, ఉత్తరికొరియా మధ్య మరో కీలక ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య మిలిటరీ ఒప్పందం అమలులోకి వచ్చింది. ఈ మేరకు నార్త్ కొరియాకు చెందిన అధికారిక న్యూస్ ఏజెన్సీ కేసీఏన్ఏ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా రెండు దేశాల మిలటరీ తమకు అవసరమైన సమయాల్లో సాయం చేసుకోనుంది.రష్యా, ఉత్తర కొరియా మిలిటరీ ఒప్పందం అమల్లోకి వచ్చింది. పరస్పరం మిలిటరీ సాయం చేసుకోవడానికి ఈ ఏడాది జూన్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఒప్పందం చేసుకున్నారు. అయితే, పశ్చిమ దేశాలు విధించే ఆంక్షలను సంయుక్తంగా ఎదుర్కోవడం, ఆపత్కాల సమయంలో తక్షణ మిలిటరీ సాయం చేసుకునేలా రెండు దేశాల ఒప్పందం కుదిరింది. ఇక, అణ్వాయుధాలు కలిగిన ఉత్తర కొరియా తన బలగాలను పంపించి రష్యాకు సాయం చేస్తోందని అమెరికా, ఉక్రెయిన్ దేశాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో రక్షణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. పుతిన్‌కు సాయం చేసేందుకు రష్యా సైన్యంలోకి నార్త్ కొరియాకు చెందిన దాదాపు పది వేల మంది సైనికులను పంపినట్టు అమెరికా ఆరోపించింది. మరోవైపు.. రష్యా, కొరియా దేశాల మధ్య జరిగిన ఈ కీలక ఒప్పందానికి ప్రతిఫలంగా మాస్కో.. కిమ్‌కు అధునాతన టెక్నాలజీ అందజేయనుందని వార్తలు వెలువడ్డాయి. పైగా యుద్ధభూమిలో పోరాడటం వల్ల కిమ్ సైనికులు రాటుదేలే అవకాశం ఉందని ఆయా దేశాలకు చెందిన నేతలు చెబుతున్నారు. ఇక, ఇప్పటికే వేల సంఖ్యలో నార్త్ కొరియా సైనికులు ట్రైనింగ్ తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఉక్రెయిన్‌తో రష్యా పోరులో భాగంగా పుతిన్‌కు ఉత్తర కొరియా బలగాలు ఎంతో సాయం చేసే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌పై మరింత ధీటుగా దాడులు చేసేందుకు పుతిన్ ప్లాస్ చేసినట్టు సమాచారం. #BREAKING North Korea, Russia defence treaty has come into force: KCNA pic.twitter.com/3ODW1bg5Bl— AFP News Agency (@AFP) December 4, 2024 -
భారత పర్యటనలో వ్లాదిమిర్ పుతిన్.. షెడ్యూల్ ఖరారు
మాస్కో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన ఖరారైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పుతిన్.. వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్‌కు రానున్నారు. పర్యటనకు సంబంధించి భారత్ పంపిన తాత్కాలిక షెడ్యూల్ తమకు అందిందని పుతిన్ సహాయకుడు యూరి ఉషకోవ్ చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. దేశాల పర్యటనపై పుతిన్,మోదీల మధ్య ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం.. ఇప్పటికే మోదీ రష్యాలో పర్యటించగా.. ఈ సారి పుతిన్ భారత్‌లో పర్యటించనున్నట్లు యూరి ఉషకోవ్ తెలిపారు.మోదీ ఈ ఏడాది రెండుసార్లు రష్యాలో పర్యటించారు. జులైలో రష్యా రాజధాని మాస్కోలో 22వ రష్యా-ఇండియా సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్‌లో మోదీ పాల్గొన్నారు. రెండోసారి ఈ అక్టోబర్ నెలలో కజాన్ వేదికగా జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సుకు హాజరయ్యారు. -
రష్యా రక్షణ బడ్జెట్ రూ.10 లక్షల కోట్లు!
కీవ్: ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రక్షణ వ్యయాన్ని రికార్డు స్థాయిలో పెంచారు. 2025 బడ్జెట్లో 32.5శాతాన్ని జాతీయ రక్షణకు కేటాయించారు. రక్షణ వ్యయంగా 13.5 ట్రిలియన్ రూబుల్స్ (రూ.పది లక్షల కోట్లు) కేటాయించినట్లు ఆదివారం ప్రకటించారు. గత ఏడాది మొత్తం బడ్జెట్లో 28.3శాతం రక్షణకు కేటాయించగా.. ఈ ఏడాది 32.5శాతానికి చేరింది. రష్యా పార్లమెంటు ఉభయ సభలు, స్టేట్ డ్యూమా, ఫెడరేషన్ కౌన్సిల్ బడ్జెట్ ప్రణాళికలను ఆమోదించాయి. -
నన్ను క్షమించండి ఏంజిలా మెర్కల్ : పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. జర్మనీ మాజీ ఛాన్సలర్ (ప్రధాని) ఏంజిలా మెర్కల్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. 17 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘటనను ఆయన తాజాగా గుర్తు చేసుకున్నారు. 17ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే?పుతిన్‌కు శునకాలంటే మహా ప్రాణం. అందుకే దేశాది నేతలతో జరిగే సమావేశాల్లో సైతం శునకాలు పుతిన్‌తో దర్శనమిస్తుంటాయి. అయితే, 17ఏళ్ల క్రితం అంటే 2007 సోచి నగరంలో పుతిన్- అప్పటి జర్మనీ ప్రధాని ఏంజిలా మెర్కల్ మధ్య ఓ సమావేశం జరిగింది. అయితే ఆ మీటింగ్‌కు పుతిన్‌తో పాటు ఆయన పెంపుడు శునకం లాబ్రడార్ కోని కూడా తీసుకువచ్చారు. సమావేశంలో జరుగుతున్నంత సేపు మెర్కల్తో పాటు పుతిన్ చుట్టూ తచ్చాడుతూ కనిపించింది. దీంతో స్వతహాగా శునకాలంటే భయపడే మెర్కల్ లాబ్రడార్ కోని చూసి ఆందోళనకు గురయ్యారు. నాటి ఘటనపై తాను రాసిన పుస్తకంలో మెర్కల్ ‘ఫ్రీడమ్’ అనే టైటిల్‌తో ప్రస్తావించారు. అందులో పుతిన్ తనని భయపెట్టాలని తన శునకాన్ని సమావేశానికి తెచ్చారని అర్ధం వచ్చేలా రాశారు. తాజాగా విడుదల మెర్కల్ పుస్కకంలో 2007 నాటి ఘటనపై వ్లాదిమిర్ పుతిన్ బహిరంగంగానే స్పందించారు. మెర్కల్‌కు మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. -
పేరు మార్చుకుని పుతిన్ కూతురు రహస్య జీవనం.. ఎక్కడ ఉన్నారంటే?
మాస్కో: ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతున్న నాటి నుంచి వ్లాదిమిన్ పుతిన్ ప్రతీరోజు వార్తల్లో నిలుస్తున్నారు. ఇదే సమయంలో పుతిన్.. కుటుంబ సభ్యు గురించి కూడా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక, తాజాగా పుతిన్ రహస్య కుమార్తె తన పేరు మార్చుకుని పారిస్ లో ఉంటున్నారని సమాచారం. ఈ మేరకు పలు కథనాలు వెలువడ్డాయి.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించి మరో విషయం బయటకు వచ్చింది. పుతిన్, సెత్వాన్ క్రివోనోగిఖ్ కుమార్తె ఎలిజావేటా క్రివోనోగిఖ్ పేరు బయటకు వచ్చింది. ఎలిజావేటా ప్రస్తుతం తన పేరు మార్చుకుని లాయిజా రోజోవా అనే పేరుతో పారిస్ లో ఉంటున్నారని ఉక్రెయిన్ కు సంబంధించిన మీడియా పలు కథనాల్లో వెల్లడించింది. అయితే, ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి రోజోవా రహస్యంగా పారిస్ లో ఉంటున్నట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. వ్యాపారవేత్త అయిన సెత్వాన్ క్రివోనోగిఖ్(49) పుతిన్ భాగస్వామిగా ఉన్నారని మీడియాలో పలు కథనాలు వెల్లడయ్యాయి. ఇక, అంతకుముందు కూడా పుతిన్ మరో కూతురు కేథరిన్ టిఖోనోవా గురించి కూడా ప్రపంచానికి తెలిసింది. కేథరినా ఒక డ్యాన్సర్(జిమ్నాస్టిక్). ఆమె రష్యాకు చెందిన బిలియనీర్ ను వివాహం చేసుకుంది. వారిద్దరూ 2017లో విడిపోయారు.🚨 Vladimir Putin has an illegitimate daughter living under a pseudonym in Paris where she works as a DJ: pic.twitter.com/twtwfxWqyM— Emmanuel Rincón (@EmmaRincon) November 29, 2024 -
ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదు: పుతిన్ షాకింగ్ కామెంట్స్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదంటూ పుతిన్ చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారం సమయంలో ట్రంప్ పై జరిగిన హత్యాయత్నాలే తనను షాక్ కు గురిచేశాయని తెలిపారు.పుతిన్ తాజాగా ఖజికిస్తాన్ లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా తెలివైన వ్యక్తి. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా ట్రంప్ వెనుకాడరు. అయితే, ట్రంప్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. ఆయన ప్రాణాలకు రక్షణ లేదు. అమెరికా ఎన్నికల ప్రచార సమయంలో ఆయనపై జరిగిన దాడులే ఇందుకు నిదర్శనం. ఎన్నికల సమయంలో ఆయన కుటుంబ సభ్యులపై కూడా దాడులు జరిగాయి. వీటన్నింటినీ ట్రంప్ అర్థం చేసుకోవాలి అని సూచనలు చేశారు. ఇదే సమయంలో ట్రంప్.. యుద్ధాలను సైతం ఆపేయగలరని పుతిన్ కితాబు ఇచ్చారు.ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో పెన్సిల్వేనియాలో ట్రంప్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో ఓ వ్యక్తి తుపాకీతో కాల్చడంతో ట్రంప్ చెవి దగ్గరి నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ క్రమంలో ట్రంప్ చెవికి గాయమైంది. -
అణుయుద్ధంగా మారనుందా?
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం 1,000 రోజుల మార్కును దాటేసింది. అమెరికా అనూహ్యంగా ఇచ్చిన అనుమతితో ఉక్రెయిన్ ఏటీఏసీఎంఎస్ క్షిపణులను రష్యా మీద ప్రయోగించింది. ఉత్తర కొరియా దళాలను ఈ యుద్ధంలో చేర్చిందనీ, ఇరాన్ సరఫరా చేసిన డ్రోన్లను ఉపయోగిస్తోందనీ రష్యా మీద ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల యుద్ధ పరిధి రెండు దేశాలను దాటి, బహుళజాతి స్వభావానికి విస్తరించినట్టయింది. దీనికితోడు పుతిన్ తమ అణ్వా యుధ సిద్ధాంతాన్ని సవరించడం ద్వారా ఆందోళనను రేకెత్తించారు. 1962 క్యూబా సంక్షోభంలో అమెరికా, రష్యాల్లోని రాబందులు ఘర్షణను తీవ్రతరం చేయాలని కోరినప్పటికీ, అధినేతలు వివేకంతో వ్యవహరించారు. కానీ, ఈ అస్థిర కాలంలో అలాంటి వివేకం సాధ్యమా?రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నవంబర్ 19 నాటికి 1,000 రోజుల మార్కును దాటేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నవంబర్ 17న అమెరికా సైన్యపు టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్(ఏటీఏసీఎంఎస్)ను ఉపయోగించే అధికా రాన్ని ఉక్రెయిన్‌కు కట్టబెట్టగానే ఆ యుద్ధం పరాకాష్ఠకు చేరుకుంది.ఈ నిర్ణయం ద్వారా, ‘అంకుల్ జో’ ఎట్టకేలకు ‘ధైర్య ప్రదర్శన’ చేసినట్లుగా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కాకతాళీయమో, ఉద్దేశ పూర్వకమో గానీ యుద్ధంలో ఆకస్మికమైన, ప్రమాదకరమైన పెరుగు దల స్పష్టంగా కనబడుతోంది.తీవ్రతను పెంచిన జో!దీర్ఘ–శ్రేణి పాశ్చాత్య తయారీ క్షిపణులను ఉపయోగించే ఆమోదం కోసం ఉక్రెయిన్ చాలా కాలంగా ఎదురుచూస్తోంది. అయితే యుద్ధాన్ని ఇద్దరు ప్రత్యర్థులకే పరిమితం చేసే వివేకంతో, సంయమనం చూపుతూ వాషింగ్టన్ దీనిని నిలిపి ఉంచింది. అలాంటిది బైడెన్ అధ్యక్షత దాని ‘అత్యంత బలహీన’ దశలో ఉన్నప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. వైట్ హౌస్ పీఠం కోసం నవంబర్ మొదట్లో అమెరికా ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత, జనవరి 20న కొత్త అధ్యక్షుడు (డోనాల్డ్ ట్రంప్) బాధ్యతలు స్వీకరించే సంధి కాలం ఇది.ఉక్రెయిన్ తన కొత్త ఆయుధాలను ఉపయోగించడంలో ఎక్కువ సమయాన్ని పోగొట్టుకోలేదు. నవంబర్ 20న రష్యాలోని లక్ష్యాలపై ఏటీఏసీఎంస్ క్షిపణులను ప్రయోగించింది. పైగా, బ్రిటన్ సరఫరా చేసిన స్టార్మ్ షాడో క్షిపణులతో అనంతర దాడిని కొనసాగించింది.అంతకుముందు, ఉత్తర కొరియా దళాలను ఈ యుద్ధంలో చేర్చిందనీ, ఇరాన్ సరఫరా చేసిన డ్రోన్లను కూడా ఉప యోగిస్తుందనీ రష్యా మీద ఆరోపణలు వచ్చాయి. తద్వారా రష్యా– ఉక్రెయిన్ మధ్య నుండి యుద్ధ పరిధి రెండు దేశాలను దాటి, విస్తృత బహుళ జాతి స్వభా వానికి విస్తరించినట్టయింది.భయాన్ని పెంచిన రష్యాఅయితే మాస్కో దాదాపు వెంటనే ప్రతీకారం తీర్చుకుంది. నవంబర్ 21న రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ తమ సైన్యం తూర్పు ఉక్రేనియన్ నగరమైన డ్నిప్రోపై ‘కొత్త సాంప్రదాయిక మధ్యంతర శ్రేణి క్షిపణి’ని ఉపయోగించి దాడి చేసిందని ప్రకటించారు. దీన్ని ఒరేష్నిక్గా వర్గీకృతమైన ప్రయోగాత్మక మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణిగా గుర్తిస్తున్నారు.అమెరికన్, బ్రిటిష్ దీర్ఘ–శ్రేణి ఆయుధాల వినియోగానికి ప్రతి స్పందనగా, నవంబర్ 21న రష్యన్ సాయుధ దళాలు ఉక్రెయిన్ సైనిక–పారిశ్రామిక సముదాయాలలో ఒకదానిపై దాడిని నిర్వహించా యని పుతిన్ పేర్కొన్నారు. ‘హైపర్సోనిక్ ఒరేష్నిక్ క్షిపణిని ఉప యోగించడానికి కారణం ఏమిటంటే, అమెరికా నేతృత్వంలోని కూటమి ఈ యుద్ధాన్ని మరింత మారణ హోమంవైపు పెంచాలని నిర్ణయించుకుంటే, రష్యా దృఢమైన రీతిలో ప్రతిస్పందిస్తుంది. రష్యా ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉంది. ఎవరైనా ఇప్పటికీ దీనిని అనుమానించినట్లయితే, వారలా చేయకూడదు. ఎల్లప్పుడూ రష్యా ప్రతిస్పందన తగురీతిలో ఉంటుంది’ అని పుతిన్ పేర్కొన్నారు.ఈ ప్రతిస్పందన అణ్వాయుధ సహితంగా ఉంటుందా? అనేక ఐరోపా దేశాలు భయపడే ఘోరమైన దృష్టాంతం ఇది. పుతిన్ తమ అణ్వాయుధ సిద్ధాంతాన్ని సవరించడం ద్వారా ఈ ఆందోళనను మరింతగా రేకెత్తించారు.రష్యా మునుపటి అణు సిద్ధాంతం, సాంప్రదాయ నమూనాలో రూపొందినది. అంటే అణ్వాయుధం అంతటి విధ్వంసకరమైన సామ ర్థ్యాన్ని ఉపయోగించడం గురించి ఆలోచించకుండా, కేవలం ప్రత్యర్థిని, అంటే అమెరికాను ‘నిరోధించడానికి’ మాత్రమే ఉద్దేశించబడింది. రెండవ షరతు ఏమిటంటే, రాజ్య ఉనికికి ముప్పు కలిగించే సాంప్రదాయ సైనిక దాడిని తిప్పికొట్టడం.అయితే, మాస్కో సవరించి ప్రకటించిన నవంబర్ సిద్ధాంతం మొత్తం పరిధిని విస్తరించింది. అణుశక్తి మద్దతు ఉన్న అణుయేతర శక్తి ద్వారా ఎదురయ్యే ఏ దాడినైనా సరే... ఉమ్మడి దాడిగా పరిగణి స్తామని రష్యా పేర్కొంది. అలాగే, మిలిటరీ కూటమిలోని ఒక సభ్య దేశం (ఈ సందర్భంలో, అమెరికా నేతృత్వంలోని కూటమి) చేసే ఏ దాడినైనా మొత్తం కూటమి చేసిన దాడిగా పరిగణిస్తామని కూడా రష్యా స్పష్టం చేసింది.2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ యుద్ధం ప్రారంభ దశ నుండి కూడా మాస్కో తన అణు సామర్థ్యం గురించి యోచిస్తోంది. అయితే, ఒక అవగాహన ప్రకారం రష్యా ఈ రెడ్ లైన్ ను దాటదనీ, దీనిని కేవలం ఒక బెదిరింపుగా మాత్రమే చూడాలనీ కొంరు పాశ్చాత్య వ్యాఖ్యాతలు కొట్టేశారు. కానీ అలాంటి ఆత్మసంతృప్తి తప్పుదారి పట్టించేదీ, ప్రమాదకరమైనదీ కావచ్చు.వివేకం కలిగేనా?అమెరికాకూ, మునుపటి సోవియట్ యూనియన్ కూ మధ్య 1962 క్యూబా క్షిపణి సంక్షోభం ఆ సంవత్సరం అక్టోబర్ మధ్యలో ప్రారంభమై ప్రపంచాన్ని దాదాపుగా అణుయుద్ధంలోకి నెట్టింది. అమెరికా అధ్యక్షుడు జాన్ కెన్నెడీ, సోవియట్ అధ్యక్షుడు నికితా కృశ్చేవ్ అనే ఇద్దరు నాయకులు చివరి నిమిషంలో ప్రదర్శించిన వివేకం కారణంగా ఈ విధ్వంసకరమైన పరస్పర హనన కార్యక్రమం నిలిచిపోయింది. వారు 1962 నవంబర్ 20న సంయుక్తంగా దీనికి ‘మంగళం పాడేయాలని’ నిర్ణయించుకున్నారు.రెండు దేశాల్లోని రాబందులు ఆ ఘర్షణను తీవ్రతరం చేయాలని కోరినప్పటికీ, శిఖరాగ్ర స్థాయిలో అధినేతలు దృఢమైన రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. సోవియట్ జలాంతర్గామి కెప్టెన్ ప్రదర్శించిన వ్యూహాత్మక సంయమనం కారణంగా అదృష్టవశాత్తూ అణు నిషేధం ఉల్లంఘనకు గురికాలేదు. ప్రస్తుత అస్థిర కాలంలో అలాంటి సంయ మనం పాటిస్తారా?ఒరేష్నిక్ను ఆవిష్కరించడం ద్వారా, రేడియేషన్ లేకుండా అణ్వా యుధానికి దగ్గరగా ఉండే అసాధారణ సామర్థ్యాన్ని రష్యా ప్రదర్శించింది. ఒరేష్నిక్ అనేది 2,500 కి.మీ. పరిధి కలిగిన కొత్త తరం రష్యన్ మధ్యంతర శ్రేణి క్షిపణి అనీ, దీన్ని 5,000 కి.మీ. పరిధి వరకు విస్తరించవచ్చనీ రష్యన్ మీడియా నివేదించింది.సహజసిద్ధంగా హైపర్ సోనిక్ అయిన ఈ క్షిపణి వేగం ‘మాక్ 10–మాక్ 11’ మధ్య ఉంటుంది (గంటకు 12,000 కి.మీ. కంటే ఎక్కువ). అంటే దీన్ని గుర్తించడం కష్టం. పైగా, ప్రస్తుత క్షిపణి నిరోధక సాంకేతికత ఈ క్షిపణిని అడ్డగించలేదు. కాలినిన్ గ్రాడ్లోని రష్యన్ స్థావరం నుండి దీన్ని ప్రయోగిస్తే యూరోపియన్ రాజధానులను చాలా తక్కువ సమయంలో (సెకన్లలో) ఢీకొంటుంది: వార్సా 81; బెర్లిన్ 155; పారిస్ 412; లండన్ 416. రష్యా ఉప విదే శాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ అక్టోబర్ 3న ప్రకటన చేస్తూ, అణ్వా యుధ శక్తుల మధ్య ప్రత్యక్ష సాయుధ ఘర్షణ ప్రమాదాన్ని తక్కువ అంచనా వేయలేమని పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం 1,000 రోజుల మార్కును దాటింది. ఇది క్లిష్టమైన శిఖరాగ్రానికి సిద్ధంగా ఉంది. ఒక పౌర అణు ప్రమాదం లేదా ఉద్దేశపూర్వక సైనిక సంఘటన రెండూ విపత్తుతో కూడి ఉంటాయి. పైగా అమెరికా పాలనలో అత్యంత బలహీనమైన ప్రస్తుత దశ ఏ సంభావ్యతకూ అవకాశం ఇవ్వకూడదు. బైడెన్ పాలన తర్వాత వస్తున్న ట్రంప్ 2.0 అధ్యక్షత విఘాతం కలిగించేదిగానూ, దుస్సాహ సికంగానూ ఉంటుంది. మొత్తం మీద 2025 సంవత్సరం మరింత అల్లకల్లోలంగా ఉండబోతోంది.సి. ఉదయ్ భాస్కర్ వ్యాసకర్త ఢిల్లీలోని సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
యుద్ధానికి తెర దించేందుకు..రష్యా రెడీ!
రెండున్నరేళ్లు దాటిన యుద్ధం. కనీవినీ ఎరగని విధ్వంసం. ఇరువైపులా లెక్కకైనా అందనంత ఆస్తి, ప్రాణనష్టం. యుద్ధంలో నిజమైన విజేతలంటూ ఎవరూ ఉండరని ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నిరూపిస్తోంది. అగ్ర రాజ్యపు అపార ఆర్థిక, సాయుధ సంపత్తి ముందు ఏ మూలకూ చాలని ఉక్రెయిన్ యుద్ధంతో కకావికలైంది. ఆర్థికంగా, సైనికంగా మాత్రమే గాక జనాభాపరంగా, అన్ని రకాలుగానూ దశాబ్దాలు గడిచినా కోలుకోలేనంతగా నష్ట పోయింది. అమెరికా, యూరప్ దేశాల ఆర్థిక, సాయుధ దన్నుతో నెట్టుకొస్తున్నా ట్రంప్ రాకతో ఆ సాయమూ ప్రశ్నార్థకంగా మారేలా కన్పిస్తోంది. అదే జరిగితే చేతులెత్తేయడం మినహా దాని ముందు మరో మార్గం లేనట్టే. ఇంతటి యుద్ధం చేసి రష్యా కూడా సాధించిన దానికంటే నష్టపోయిందే ఎక్కువ. అందులో ముఖ్యమైనది సైనిక నష్టం. యుద్ధంలో ఇప్పటికే ఏకంగా 2 లక్షల మందికి పైగా రష్యా సైనికులు మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి! దీనికి తోడు కనీసం మరో 5 లక్షల మంది సైనిక విధులకు పనికిరానంతగా గాయపడ్డట్టు సమాచారం. ఇది ఆ దేశానికి కోలుకోలేని దెబ్బే. యువతను నిర్బంధంగా సైన్యంలో చేర్చుకునే ప్రయత్నాలూ పెద్దగా ఫలించడం లేదు. యుద్ధ భూమికి పంపుతారనే భయంతో రష్యా యువత భారీ సంఖ్యలో వీలైన మార్గంలో దేశం వీడుతోంది. దాంతో సైనికుల కొరత కొన్నాళ్లుగా రష్యాను తీవ్రంగా వేధిస్తోంది. మరో దారి లేక సైన్యం కోసం ఉత్తర కొరియా వంటి దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి! దీనికి తోడు సుదీర్ఘ యుద్ధం కారణంగా ప్రధానమైన ఆయుధ నిల్వలన్నీ దాదాపుగా నిండుకోవడంతో రష్యాకు ఎటూ పాలుపోవడం లేదు. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను ఇంకా కొనసాగించే విషయంలో స్వదేశంలోనే తీవ్ర వ్యతిరేకత ఉందని ఇప్పటికే రుజువైంది. ఈ నేపథ్యంలో యుద్ధానికి ఏదో రకంగా తెర పడాలని ఉక్రెయిన్‌తో పాటు రష్యా కూడా కోరుకుంటున్నట్టు సమాచారం. ఇటీవలి పుతిన్ ఉన్నత స్థాయి భేటీలో ఈ అంశమూ చర్చకు వచ్చిందంటున్నారు.ఇవీ షరతులు...→ భూతల యుద్ధంలో ఉక్రెయిన్ నుంచి రష్యా సైన్యానికి గతంలోలా కొన్నాళ్లుగా పెద్దగా ప్రతిఘటన ఎదురవడం లేదు.→ దాంతో నెనెట్స్క్ తదితర ఉక్రెయిన్ భూభాగాల్లోకి రష్యా నానాటికీ మరింతగా చొచ్చుకుపోతోంది.→ కానీ ఇందుకు చెల్లించుకోవాల్సి వస్తున్న సైనిక, ఆయుధ మూల్యం తదితరాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఆలోచనలో పడేసినట్టు వార్తలొస్తున్నాయి. ఏదోలా ఉక్రెయిన్‌పై యుద్ధానికి తెర దించేందుకే ఆయన మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.→ కొన్ని ప్రధాన షరతులకు ఉక్రెయిన్ అంగీకరించే పక్షంలో యుద్ధా్దన్ని నిలిపేసేందుకు పుతిన్ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టు అమెరికా ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి.→ ఆక్రమిత ప్రాంతాలకు తోడు మరింత భారీ భూభాగాన్ని ఉక్రెయిన్ తమకివ్వాలని పుతిన్ పట్టుబడుతున్నారు.→ అది కనీసం అమెరికాలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన వర్జీనియా పరిమాణంలో ఉండాలని కోరుతున్నారు.→ ఉక్రెయిన్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ నాటోలో సభ్యత్వం ఇవ్వరాదని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ డిమాండ్‌ను నాటో పరిగణనలోకే తీసుకోవద్దని కోరుతున్నారు. యుద్ధంలో మరణించిన రష్యా సైనికులు: 1.5 లక్షల నుంచి 2లక్షలుగాయపడ్డ సైనికులు: 5 లక్షల పైచిలుకువామ్మో సైన్యం!రష్యా యువతలో వణుకుసైన్యంలో చేరడమనే ఆలోచనే రష్యా యువతకు పీడకలతో సమానం! కొత్తగా చేరేవారిని వేధించడంలో రష్యా సైనికుల ట్రాక్ రికార్డు సాధారణమైనది కాదు! రిటైరైన తర్వాత కూడా వాటిని గుర్తుకు తెచ్చుకుంటూ వణికిపోయే పరిస్థితి! వాటి బారిన పడే బదులు బతికుంటే బయట బలుసాకైనా తినొచ్చని రష్యా యూత్ భావిస్తుంటారు. డెడొవ్షినా అని పిలిచే ఈ వేధింపుల జాఢ్యం ఇప్పటిది కాదు. రష్యా సైన్యంలో 17వ శతాబ్దం నుంచే ఉందని చెబుతారు. దీనికి భయపడి రష్యా యువత సైన్యంలో చేరకుండా ఉండేందుకు వీలైనంతగా ప్రయత్నిస్తుంటుంది. ఉక్రెయిన్ యుద్ధంలో కనీవినీ ఎరగనంత సైనిక నష్టం జరుగుతుండటంతో భారీగా రిక్రూట్మెంట్కు రష్యా రక్షణ శాఖ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. యువతీ యువకులకు వారి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా సైన్యంలో చేరాలని పేర్కొనే ‘డ్రాఫ్ట్ నోటీస్’ పంపిస్తోంది. దాంతో సైనిక జీవితాన్ని తప్పించుకునేందుకు రష్యా యువత లక్షలాదిగా విదేశాల బాట పట్టారు. అలా వెళ్లలేని వారిలో చాలామంది ఫేక్ మెడికల్‌గా అన్‌ఫిట్ సర్టిఫికెట్లు సమర్పిస్తుంటారు. ఆ క్రమంలో అవసరమైతే తమ ఎముకలు తామే విరగ్గొట్టుకుంటారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! దాంతో చెచెన్యా, యకుట్జియా, దగెస్తాన్ వంటి సుదూర ప్రాంతాల నుంచి సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన యువతను రక్షణ శాఖ కొన్నాళ్లుగా ప్రధానంగా టార్గెట్ చేస్తోంది. ఖైదీలను నిర్బంధంగా సైన్యంలో చేరుస్తోంది. ఇలాంటి వారిని సైన్యంలో దారుణంగా చూస్తున్నారు. చనిపోతే మృతదేహాలను గుర్తించి గౌరవప్రదంగా కుటుంబీకులకు అప్పగించే పరిస్థితి కూడా ఉండటం లేదు! దీనికి తోడు రష్యాలో మామూలుగానే సైనికులు దారుణమైన పరిస్థితుల్లో పని చేయాల్సి ఉంటుంది. వారికి అత్యంత అవసరమైన పౌష్టికాహారానికే దిక్కుండదు! పైగా సరైన వైద్య సదుపాయమూ అందదు. సంక్షేమం దేవుడెరుగు, చివరికి సైనికుల భద్రతకు కూడా ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యమివ్వదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మామూలు సమయాల్లోనే పరిస్థితి ఇలా ఉంటుందంటే ఇక యుద్ధ సమయాల్లోనైతే సైనికుల భద్రత, సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశాన్నీ సర్కారు అక్షరాలా గాలికే వదిలేస్తుంది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
వచ్చే ఏడాది భారత్‌లో పుతిన్ పర్యటన!
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించే వీలుంది. దశాబ్దాల స్నేహం, బలమైన రక్షణ, వాణిజ్య బంధాలు, పరస్పరసహకారాలతో ఇరుదేశాల ద్వైపాక్షిక బంధం పటిష్టంగా ఉన్న నేపథ్యంలో వార్షిక పర్యటనల్లో భాగంగా వచ్చే ఏడాది పుతిన్ భారత్‌కు రావొచ్చని దౌత్యవర్గాలు మంగళవారం వెల్లడించాయి. పుతిన్ పర్యటన వేళ రష్యా ఏఏ అంశాలపై భారత్‌తో ఒప్పందాలు చేసుకోవచ్చు అనేది ఇంకా ఖరారుకాలేదని తెలుస్తోంది. ఈ ఏడాది జూలైలో భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా రాజధాని మాస్కోలో పర్యటించి పుతిన్‌తో విస్తృతస్థాయి చర్చలు జరిపిన విషయం విదితమే. భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతంకానుందని మంగళవారం రష్యా అధ్యక్ష కార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో పుతిన్ భారత పర్యటన ఖాయమని దాదాపు స్పష్టమైంది. మంగళవారం ఆయన భారత సీనియర్ సంపాదకులతో వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘ పుతిన్ త్వరలోనే భారత్‌లో పర్యటిస్తారు. అయితే పర్యటన తేదీలపై ఇరుదేశాలు సంప్రదింపులు జరపాల్సి ఉంది’ అని పెస్కోవ్ అన్నారు. అయితే ఏ తేదీల్లో ఎన్ని రోజులు భారత్‌లో పుతిన్ పర్యటిస్తారన్న వివరాలను దిమిత్రీ వెల్లడించలేదు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు మోదీ గత నెలలో కజక్‌స్తాన్‌లో పర్యటించిన విషయం తెల్సిందే. దీర్ఘశ్రేణి క్షిపణులను ఉక్రెయిన్‌కు అందించాలని బైడెన్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెస్కోవ్ మాట్లాడారు. ‘‘అమెరికా నిర్ణయం ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో మరింత ఆజ్యంపోస్తోంది. యుద్ధం మరింతగా విస్తరించడం ఖాయం. బైడెన్ ప్రభుత్వం యుద్ధానికే మద్దతు పలుకుతోంది. శాంతిస్థాపనకు కాదు. రష్యాపై అధునాతన ఆయుధాల వినియోగానికి అమెరికా పచ్చజెండా ఊపిన నేపథ్యంలో మేం కూడా మా అణ్వస్త్ర విధానాన్ని సవరించాల్సిన సమయమొచ్చింది’’ అని పెస్కోవ్ అన్నారు. అణ్వాయుధ వినియోగానికి సంబంధించిన కీలక దస్త్రంపై పుతిన్ సంతకం చేసిన వేళ పెస్కోవ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం?
రష్యాపై యూఎస్ తయారీ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులతో ఉక్రెయిన్ దాడులు. తీవ్రస్థాయిలో మండిపడుతున్న రష్యా. దీన్ని అమెరికాతో కలిసి చేసిన సంయుక్త దాడిగానే పరిగణిస్తామని ప్రకటన. అణు దాడితో దీటుగా బదులిచ్చేందుకు వీలుగా రష్యా అణు విధానాన్ని సవరిస్తూ అధ్యక్షుడు పుతిన్ నిర్ణయం. ‘ఏ క్షణాన్నయినా అణు యుద్ధం ముంచుకు రావచ్చు, జాగ్రత్తగా ఉండండి’ అంటూ ప్రజలకు యూరప్ దేశాల ‘వార్ గైడ్‌లైన్స్’. సోమవారం ఒక్క రోజే శరవేగంగా జరిగిన తీవ్ర ఆందోళనకర పరిణామాలివి! ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి తెర తీసి సరిగ్గా 1,000 రోజులు పూర్తయిన నాడే చోటుచేసుకున్న ఈ తీవ్ర పరిణామాలు గుబులు రేపుతున్నాయి. ఇప్పటికే నాల్కలు చాస్తున్న యుద్ధ జ్వాలలు మరింతగా విస్తరించి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా అన్న ఆందోళనలు సర్వత్రా తలెత్తుతున్నాయి.అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ విజయంతో ఉక్రెయిన్ యుద్ధానికి తెర పడుతుందని, పశ్చిమాసియా కల్లోలమూ కాస్త అదుపులోకి వస్తుందని భావిస్తున్న తరుణంలో అంతర్జాతీయంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇందుకు బీజం పడింది. అమెరికా అందజేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాలో సుదూర లక్ష్యాలపై దాడుల నిమిత్తం వాడేందుకు ఉక్రెయిన్‌కు ఆయన అనుమతివ్వడం ఒక్కసారిగా ఉద్రిక్తతలను రాజేసింది. దీన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న ఉక్రెయిన్ మంగళవారమే రష్యాపై యూఎస్ దీర్ఘశ్రేణి ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టం (ఏటీఏసీఎంస్) బాలిస్టిక్ క్షిపణులను ఎడాపెడా ప్రయోగించింది. రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతమే లక్ష్యంగా దాడులకు దిగింది. ఈ క్షిపణులను ఉక్రెయిన్ యుద్ధంలో వాడటం ఇదే తొలిసారి. అలాంటి చర్యలకు దిగితే తీవ్రస్థాయి ప్రతిస్పందన తప్పదని ఇప్పటికే హెచ్చరించిన రష్యా ఈ పరిణామంపై భగ్గుమంది. తమ భూభాగాలపైకి కనీసం ఆరు అమెరికా తయారీ ఏటీఏసీఎంఎస్ క్షిపణులు వచ్చి పడ్డాయని ధ్రువీకరించింది. వాటిలో ఐదింటిని కూల్చేయడంతో పాటు ఆరో దాన్నీ ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా అణు దాడులు! తాజా పరిణామాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ మండిపడుతున్నారు. మంగళవారం ఆయన రక్షణ తదితర శాఖల అత్యున్నత స్థాయి అధికారులతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ క్షిపణి దాడులను అమెరికాతో కలిసి చేసిన సంయుక్త దాడిగానే పరిగణించాలని నిర్ణయించారు. అందుకు వీలు కలి్పంచేలా దేశ అణు విధానానికి సవరణ కూడా చేశారు! దాని ప్రకారం సంప్రదాయ ఆయుధాలతో రష్యాపై జరిగే దాడికి ఏ అణ్వాయుధ దేశమైనా మద్దతిస్తే దాన్ని ఆ రెండు దేశాల సంయుక్త దాడిగానే పరిగణిస్తారు. సదరు దేశాలపై అణు దాడులకు దిగుతారా అన్నదానిపై సవరణలో స్పష్టత ఇవ్వలేదు. కాకపోతే రష్యాపై భారీ స్థాయి వైమానిక, బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణి దాడులు జరిగితే అణ్వాయుధాలతో బదులిచ్చేందుకు అది వీలు కలి్పస్తుండటం విశేషం! అంతేగాక మిత్ర దేశమైన బెలారస్‌పై దుందుడుకు చర్యలకు దిగినా అణ్వాయుధాలతో బదులు చెప్పేందుకు తాజా సవరణ అనుమతించనుంది! ఉక్రెయిన్‌కు మరింత సాయం చేయకుండా యూరప్ దేశాలను నియంత్రించడంతో పాటు అవసరమైతే దానిపై అణ్వాయుధ ప్రయోగానికి, అమెరికాపై సైనిక చర్యకు కూడా దిగడం పుతిన్ తాజా నిర్ణయాల ఉద్దేశమని భావిస్తున్నారు. అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణులతో ఉక్రెయిన్ చేసిన తాజా దాడులకు బదులుగానే అణు విధాన సవరణ జరిగిందా అన్న ప్రశ్నకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ నేరుగా బదులివ్వలేదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా అణు విధానాన్ని అప్డేట్ చేయాల్సిందిగా పుతిన్ ఆదేశించారంటూ నర్మగర్భంగా స్పందించారు. ఇటీవలి కాలంలో రష్యా అణు విధానానికి పుతిన్ సవరణ చేయడం ఇది రెండోసారి. రష్యాకు దన్నుగా ఉత్తర కొరియా సైన్యం కూడా ఉక్రెయిన్‌పై యుద్ధంలో పాల్గొంటుండటం తెలిసిందే. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు అమెరికా ఇప్పటికే ప్రకటించింది. దీర్ఘశ్రేణి క్షిపణుల వాడకానికి అనుమతి దాని పర్యవసానమేనంటున్నారు. ఈ నేపథ్యంలో యుద్ధ జ్వాలలు త్వరలో కొరియా ద్వీపకల్పం దాకా విస్తరించినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బైడెన్ మతిలేని విధానాలతో ట్రంప్ పగ్గాలు చేపట్టే నాటికే ప్రపంచాన్ని పెనుయుద్ధం ముంగిట నిలిపేలా ఉన్నారని ఆయన కుమారుడు జూనియర్ ట్రంప్ మండిపడటం తెలిసిందే.నిత్యావసరాలు నిల్వ చేసుకోండితాజా పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా కన్పిస్తుండటంతో యూరప్ దేశాలు భీతిల్లుతున్నాయి. అలాంటి పరిస్థితే తలెత్తితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ స్వీడన్, ఫిన్లండ్, నార్వే, డెన్మార్క్ తదితర నాటో సభ్య దేశాలు తమ పౌరులను హెచ్చరించడం విశేషం. ‘‘ఏ క్షణంలోనైనా అణు యుద్ధం ముంచుకు రావచ్చు. సిద్ధంగా ఉండండి’’ అంటూ స్వీడన్ ఏకంగా ఇంటింటికీ కరపత్రాలే పంచుతోంది. ‘సంక్షోభమో, యుద్ధమో వస్తే...’ అనే శీర్షికతో కూడిన 52 లక్షల కరపత్రాలను సోమవారం నుంచి వారం పాటు పంచనుంది! అది నిజానికి 32 పేజీలతో కూడిన డాక్యుమెంట్. ‘‘మనపై ఎవరైనా దాడికి తెగబడితే దేశ స్వాతంత్య్ర పరిరక్షణకు అందరమూ ఒక్కటవుదాం’’ అని అందులో పౌరులకు స్వీడన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. దాంతోపాటు, ‘‘పిల్లల డైపర్లు, బేబీ ఫుడ్, దీర్ఘకాలం నిల్వ ఉండే ఆహార పదార్థాలు, మంచినీరు తదితరాలన్నింటినీ వీలైనంతగా సేకరించి పెట్టుకోండి’’ అని సూచించింది. అంతేగాక బాంబు దాడులు జరిగితే వాటిబారి నుంచి ఎలా తప్పించుకోవాలి, గాయపడితే రక్తస్రావాన్ని నిరోధించేందుకు, ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ఏం చేయాలి, యుద్ధ బీభత్సం చూసి భీతిల్లే చిన్నారులను ఎలా సముదాయించాలి వంటి వివరాలెన్నో పొందుపరిచింది.‘‘పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వీడన్ ఇలాంటి చర్యకు దిగడం ఇది ఐదోసారి. నార్వే కూడా ఇలాంటి ‘యుద్ధ’ జాగ్రత్తలతో ప్రజలకు ఎమర్జెన్సీ పాంప్లెంట్లు పంచుతోంది. ‘పూర్తిస్థాయి యుద్ధంతో పాటు ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే వారం దాకా ఇల్లు కదలకుండా గడిపేందుకు సిద్ధపడండి’ అంటూ అప్రమత్తం చేస్తోంది. డెన్మార్క్ కూడా కనీసం మూడు రోజులకు పైగా సరిపడా సరుకులు, మంచినీరు, ఔషధాలు తదితరాలు నిల్వ ఉంచుకోవాలంటూ తన పౌరులందరికీ ఇప్పటికే ఈ–మెయిళ్లు పంపింది! ఫిన్లండ్ కూడా అదే బాట పట్టింది. ‘రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండండి. నిత్యావసరాలను వీలైనంతగా సేకరించి పెట్టుకోండి’ అంటూ తన పౌరులకు ఆన్లైన్ బ్రోషర్లు పంపింది.అపారంగా అణ్వాయుధాలు రష్యా వద్ద వేలాదిగా అణ్వాయుధాలు పోగు పడి ఉన్నాయి. ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో అణు వార్హెడ్లున్న దేశం రష్యానే. 1994లో సోవియట్ నుంచి విడిపోయేనాటికి ఉక్రెయిన్ వద్ద కూడా భారీగానే అణ్వాయుధాలుండేవి. ఆ జాబితాలో ప్రపంచంలో మూడో అతి పెద్ద దేశంగా ఉక్రెయిన్ ఉండేది. కానీ రష్యాతో ఒప్పందంలో భాగంగా తన అణ్వాయుధాలన్నింటినీ నాశనం చేసింది. కాకపోతే అమెరికాతో పాటు అణు సంపత్తి ఉన్న పలు దేశాలు ఉక్రెయిన్‌కు దన్నుగా ఉన్నాయి.క్షిపణులే మాట్లాడతాయి భారీ క్షిపణి దాడులకు మాకు అనుమతి లభించిందంటూ మీడియా ఏదేదో చెబుతోంది. కానీ దాడులు జరిగేది మాటలతో కాదు. వాటిని ముందుగా చెప్పి చేయరు. ఇక మా తరఫున క్షిపణులే మాట్లాడతాయి. – ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్‌తో పోరుకు రెడీ.. నార్త్ కొరియా కిమ్ సంచలన నిర్ణయం!
ప్యాంగ్యాంగ్: అణ్వాయుధాల తయారీలో ఉత్తర కొరియా దూసుకెళ్తోంది. అమెరికాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కిమ్ జోంగ్ ఉన్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అపరిమిత సంఖ్యలో అణ్వాయుధాలను తయారు చేయాలని నార్త్ కొరియా అధికారులకు కిమ్ ఆదేశాలు జారీ చేశారు. కిమ్ ఆర్ఢర్తో కొరియా అధికారులు అణ్వాయుధాలపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో కిమ్ జోంగ్ ఉన్ అప్రమత్తమయ్యారు. గత ట్రంప్ పాలనలో అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా వ్యూహాలను ఎదుర్కొనేందుకు కిమ్ ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అపరిమిత సంఖ్యలో అణ్వాయుధాలు తయారుచేయాలని కిమ్ మరోసారి తన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఇటీవల తన అధికారులతో కిమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణకొరియాతో కలిసి అమెరికా అణ్వస్త్ర వ్యూహాలకు పదునుపెట్టడాన్ని ఖండించారు. జపాన్‌తో కలిసి ఆసియా నాటో ఏర్పాటుచేయాలన్న ఆలోచనలను ఆయన తప్పుపట్టారు.మరోవైపు, దక్షిణ కొరియా, అమెరికాపై దాడి చేయడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలను కిమ్ సేనలు వేగంగా పెంచుకొంటున్నాయి. అణ్వాయుధాలు, ఖండాంతర క్షిపణులను వేగంగా తయారుచేస్తోంది. ఇక, ఉత్తర కొరియా త్వరలోనే న్యూక్లియర్ బాంబు పరీక్ష నిర్వహించవచ్చని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సంస్థలు రెండు వారాల క్రితం నివేదికలు ఇచ్చాయి.ఇదిలా ఉండగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో జెలెన్ స్కీకి అమెరికా సహాకరించడాన్ని కిమ్ తీవ్రంగా ఖండించారు. రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ను పశ్చిమ దేశాలు పావుగా వాడుకుంటున్నాయని ఆరోపించారు. అమెరికా ప్లాన్ ప్రకారమే తన పలుకుబడి పెంచుకునేందుకు ఉక్రెయిన్‌కు సహకరిస్తోందన్నారు. 🚨#BREAKING: North Korea's Kim Jong Un Is Calling For A "New Cold War"This comes in response to the Biden Administration's recent actions in the East.Kim Jong Un also calls for UNLIMITED EXPANSION OF HIS NUCLEAR WEAPONS.Thoughts? pic.twitter.com/naRaJLkTs8— Donald J. Trump News (@realDonaldNewsX) November 18, 2024 -
రష్యా-ఉక్రెయిన్ వార్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. పుతిన్‌కు ఫోన్!
వాషింగ్టన్: గత రెండున్నరేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రెండు దేశాల మధ్య పోరులో ఇప్పటికే వేల సంఖ్యలో సామన్య పౌరులు మృతిచెందారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు.అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్ మొదటిసారిగా మార్-ఎ-లాగో బహిరంగ కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ..‘రష్యా-ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధంపై వచ్చిన నివేదికను పరిశీలించాను. గత రెండున్నరేళ్లలో వేలాదిమంది మరణించారు. నేను అధికారంలోకి వచ్చిన అనంతరం రష్యా-ఉక్రెయిన్ల యుద్ధాన్ని ఆపేస్తాను. అలాగే, పశ్చిమాసియాలోనూ శాంతిస్థాపనకు కృషి చేస్తాను అంటూ హామీ ఇచ్చారు. ఇదే సమయంలో అమెరికా సైన్యాన్ని బలోపేతం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఇదిలా ఉండగా.. అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, తాను అధికారంలోకి వస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ ఇదివరకే పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఇక, ఇటీవల ఈవిషయంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ ఫోన్లో మాట్లాడి.. యుద్ధాన్ని విస్తరించొద్దని కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికైనా రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు నిలిచిపోవాలని దేశాలు కోరుతున్నాయి. This is what POTUS TRUMP wants for ending RUSSIA UKRAINE war , he wants this 800 miles line to be declared LAC with buffer zones on both sides pic.twitter.com/FJEpf4nCXk— VINAY. KUMAR DELHI (@wadhawan2011) November 15, 2024 -
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ట్రంప్ ఫోన్‌కాల్
-
ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరమవుతున్న వేళ.. అనూహ్య పరిణామం
వాషింగ్టన్: రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికీ తెలియడంలేదు. అయితే పలు దేశాలు ఈ యుద్ధాన్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ జాబితాలో భారత్ కూడా ఉంది. తాజాగా అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇందుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.వాషింగ్టన్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి, ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించి తగిన సలహాలు ఇచ్చారని, ఈ యుద్ధాన్ని తీవ్రతరం చేయవద్దని కోరారని తెలుస్తోంది. అలాగే ఐరోపాలో అమెరికాకు ఉన్న బలమైన సైనిక ఉనికి గురించి రష్యాను హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించే మార్గాలపై చర్చించారు. ఉపఖండంలో శాంతిని కొనసాగించే ప్రయత్నాల గురించి కూడా చర్చించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. ఇదివరకే ఫోన్లో మాట్లాడిన సంగతి తెలిసిందే. కాగా ట్రంప్ తాజాగా పుతిన్‌తో సంభాషించడంపై ఉక్రెయిన్ ప్రభుత్వానికి సమాచారం అందించినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. అయితే ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం దీనిని ఖండించింది. ఈ ఫోను సంభాషణ గురించి ఉక్రెయిన్‌కు ఎలాంటి ప్రాథమిక సమాచారం ఇవ్వలేదని, ఇది తప్పుడు రిపోర్టు అని పేర్కొంది. BREAKING: 🇺🇸🇷🇺 President-elect Donald Trump holds phone call with Russia's Vladimir Putin to discuss de-escalating the war in Ukraine. pic.twitter.com/2pDW1vARaE— BRICS News (@BRICSinfo) November 10, 2024మరోవైపు ట్రంప్‌తో ఉక్రెయిన్‌పై చర్చించేందుకు పుతిన్ సిద్ధంగా ఉన్నారని రష్యా ప్రకటించింది. అయితే రష్యా తన డిమాండ్లను మార్చుకోవడానికి సిద్ధంగా ఉందని దీని అర్థం కాదని కూడా రష్యా స్పష్టం చేసింది. కాగా ఇప్పటివరకూ పుతిన్- ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ అధికారికంగా ధృవీకరణ పొందలేదు. స్కై న్యూస్ వంటి ప్రధాన వార్తా నెట్‌వర్క్‌లు కూడా ఈ నివేదికను స్వతంత్రంగా ధృవీకరించలేదు.ఇది కూడా చదవండి: పేజర్ దాడులు మా పనే: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు -
రష్యాకు ‘అక్టోబర్’ షాక్.. రోజుకు 1500 మంది సైనికుల మృతి!
లండన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై.. దాదాపు మూడేళ్లు గడుస్తోంది. అయితే.. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అత్యంత దారుణమైన ప్రతిఘటనను అక్టోబర్ నెలలో రష్యా బలగాలు ఎదుర్కొన్నాయని బ్రిటన్ సాయుధ దళాల అధిపతి అన్నారు. అక్టోబర్‌లో రోజుకు సగటున 1,500 మంది రష్యన్ సైనికులు మరణించటం లేదా గాయపడటం జరిగిందని బిట్రన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ టోనీ రాడాకిన్ తెలిపారు.‘‘రష్యా తన యుద్ధంలో మరణించిన వారి సంఖ్యను వెల్లడించలేదు. అయితే ఫిబ్రవరి 2022లో రష్యా.. ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించినప్పటి నుండి గత నెలలో అత్యధికంగా సైనికులను కోల్పోయింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆశయం కారణంగా సమామరు 7 లక్షమ మంది మరణించటం లేదా గాయపడటం జరిగింది. పుతిన్ ఆశయం కోసం రష్యా ఈ భారీ నష్టం, నొప్పి, బాధ భరించవల్సి వచ్చింది. చాలా తక్కువ భూభాగం కోసం అధిక సైన్యం నష్టపోయింది. రష్యా ప్రభుత్వం.. రక్షణ, భద్రతపై ప్రజా వ్యయంలో 40 శాతానికి పైగా ఖర్చు చేస్తోంది. అధ్యక్షుడు పుతిన్ దేశంపై అధిక భారం వేశారు. ఉక్రెయిన్‌కు బ్రిటన్ మద్దతు ఇస్తునే ఉంటుంది. అది అధ్యక్షుడు పుతిన్ గ్రహించవలసిన సందేశం. ఉక్రేనియన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి భరోసా’’ అని అన్నారు.రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాటంలో ఉక్రెయిన్ బలమైన మద్దతుదారులలో బ్రిటన్ ఒకటి. ఉక్రెయిన్‌కు బిలియన్లకొద్ది పౌండ్లతో సైనిక సహాయంతో పాటు ఆయుధాలు, బలగాలకు శిక్షణను అందిస్తోంది. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్ధ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి పాశ్చాత్య దేశాల భవిష్యత్తు నిబద్ధత గురించి ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో బ్రిటన్ ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్ ఉక్రెయిన్‌కు మద్దతును మరోసారి ప్రకటించటం గమనార్హం.చదవండి: కెనడాలో టెంపుల్‌పై దాడి.. ఖలిస్తానీ నిరసన నిర్వాహకుడు అరెస్ట్ -
ట్రంప్ గెలుపుపై పుతిన్ రియాక్షన్ ఇదే
మాస్కో: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు పుతిన్ అవునని సమాధానం ఇచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదల తర్వాత గురువారం రష్యాలోని సోచిలో ఓ అంతర్జాతీయ సదస్సు జరిగింది. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుతిన్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్‌తో చర్చలు జరపడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు.. అందుకు తాను సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.అదే సమయంలో ఏడాది జులైలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నంపై స్పందించారు. హత్యాయత్నం జరిగిన అనంతరం ట్రంప్ చూపించిన తెగువ, ధైర్యం తనను ఆకట్టుకుందన్నారు. పుతిన్‌తో మాట్లాడలేదుఅధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తాను 70 మంది దేశాది నేతలతో మాట్లాడానని ట్రంప్ తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమెక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌ను గెలిపించాలని పిలుపున్చిన పుతిన్‌తో తాను మాట్లాడలేదని ట్రంప్ వెల్లడించారు. -
PM Narendra Modi: చర్చలు, దౌత్యానికే మా మద్దతు
కజన్: సంఘర్షణలు, సమస్యల పరిష్కారానికి చర్చలు, దౌత్యమార్గాలే శ్రేయస్కరమని ప్రధాని మోదీ మరోసారి తేల్చిచెప్పారు. శాంతియుత మా ర్గంలో చర్చలు, సంప్రదింపులకే తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఏ సమస్యకైనా యుద్ధాలతో పరిష్కారం లభించందని స్పష్టంచేశారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడానికి శాంతి చర్చలకు శ్రీకారం చుట్టాలని ఇరుపక్షాలకు పిలుపునిచ్చారు.రష్యాలోని కజన్ నగరంలో బుధవారం 16వ ‘బ్రిక్స్’ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. బ్రిక్స్ అనేది విభజన సంస్థ కాదని, మొత్తం మానవాళి ప్రయోజనాల కోసం పనిచేస్తే సంస్థ అనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని కూటమికి సూచించారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు, సంఘర్షణలు, ఆర్థిక అనిశి్చతి, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి సవాళ్లపై మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచాన్ని సరైన మార్గంలో నడిపించేలా బ్రిక్స్ సానుకూల పాత్ర పోషించగలదని చెప్పారు. బ్రిక్స్ వైవిధ్యంతో కూడిన, సమగ్ర వేదిక అని వివరించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు వద్దు ‘‘యుద్ధానికి కాదు.. చర్చలు, దౌత్యానికే మా మద్దతు ఉంటుంది. కోవిడ్–19 సంక్షోభాన్ని మనమంతా కలిసికట్టుగా అధిగమించాం అదే తరహాలో ముందు తరాలకు సురక్షితమైన, బలమైన, సౌభాగ్యవంతమైన భవిష్యత్తును అందించడానికి నూతన అవకాశాలు మనం సృష్టించగలం. ప్రస్తుత సవాళ్ల నేపథ్యంలో బ్రిక్స్‌పై ప్రపంచ దేశాలకు ఎన్నో అంచనాలున్నాయి. వాటిని నెరవేర్చేలా మనం పనిచేయాలి. ఉగ్రవాద భూతాన్ని అంతం చేయడానికి అన్ని దేశాలూ కలిసికట్టుగా కృషి చేయాలి. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పనికిరావు. అందరూ ఒకే ఆలోచనతో ఉంటేనే లక్ష్యం సాధించడం సులువవుతుంది. యువతను ఉగ్రవాదం, తీవ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిని అడ్డుకోవడానికి కఠిన చర్యలు అవసరం. అంతర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో సమగ్ర తీర్మానం చేసేలా మనమంతా కలిసి ఒత్తిడి పెంచాలి. అలాగే సైబర్ భద్రత, సురక్షితమైన కృత్రిమ మేధ(ఏఐ) వినియోగం కోసం మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, ప్రపంచ వాణిజ్య సంస్థతోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థల్లో సమగ్ర సంస్కరణలు అవసరం. నిరి్ధష్ట గడువులోగా సంస్కరణలు వచ్చేలా మనం ఉమ్మడిగా ముందుకు సాగాలి. బ్రిక్స్‌లో మన ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అంతర్జాతీయ సంస్థలకు బ్రిక్స్ ప్రత్యామ్నాయం అనే భావన రాకూడదు. ఆయా సంస్థలను సంస్కరించే వేదిక అనే అభిప్రాయం అందరిలోనూ కలగాలి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడాన్ని మనం కర్తవ్యంగా స్వీకరించాలి. ఆహార భద్రత, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, నీటి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. బ్రిక్స్‌లోకి మరికొన్ని భాస్వామ్య దేశాలను ఆహా్వనించడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఈ విషయంలో కూటమి దేశాలు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలి. అదేసమయంలో బ్రిక్స్ వ్యవస్థాపక సభ్యదేశాలను గౌరవించాలి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. కూటమిలోకి మరో ఐదు దేశాలు బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) కూటమిలో చేరేందుకు గ్లోబల్ సౌత్ దేశాలు ఎంతగానో ఆసక్తి చూపుతున్నాయని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చెప్పారు. ఈ విషయంలో ఆయా దేశాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల పట్ల చురుగ్గా స్పందించాలని కూటమిలోని సభ్యదేశాలకు సూచించారు. కొత్త దేశాలను కూటమిలో భాగస్వాములుగా చేర్చుకోవాలని బ్రిక్స్ ప్రస్తుత సదస్సులో నిర్ణయించినట్లు తెలిపారు. బ్రిక్స్‌లో తాజాగా ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) సభ్యదేశాలుగా చేరాయి. బ్రిక్స్ ప్రయాణంలో ఇదొక కీలకమైన ఘట్టమని జిన్‌పింగ్ చెప్పారు. ఆయన బుధవారం బ్రిక్స్ సదస్సులో మాట్లాడారు. వచ్చే ఐదేళ్లలో బిక్స్ దేశాల్లో 10 ఓవర్సీస్ లెరి్నంగ్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. వీటిలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. భారత ఆర్థిక ప్రగతి సూపర్: పుతిన్ భారత ఆర్థిక ప్రగతి అద్భుతమంటూ బ్రిక్స్ సదస్సు వేదిక సాక్షిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రస్తుతించారు. ఈ విషయంలో బ్రిక్స్ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందన్నారు. ‘‘హెచ్చు వృద్ధి రేటు సాధించాల్సిన అవసరాన్ని గురించి దేశాధినేతలుగా మనమంతా తరచూ మాట్లాడుతుంటాం. ప్రధాని మోదీ దాన్ని విజయవంతంగా సాధించి చూపిస్తున్నారు. 7.5 శాతం వృద్ధి రేటుతో భారత్‌ను మనందరికీ ఆదర్శంగా నిలిపారు. ఆయన సాధిస్తున్న విజయాలకు అభినందనలు. బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నందుకు మోదీకి ధన్యవాదాలు’’ అన్నా రు. ద్వైపాక్షిక వర్తకంలో భారత్, రష్యా సాధిస్తున్న వృద్ధి పట్ల పుతిన్ సంతృప్తి వెలిబుచ్చారు. ఉగ్రవాదంతో అందరికీ ముప్పు బ్రిక్స్ సదస్సు అనంతరం కూటమి నేతలు బుధవారం ఒక ఉమ్మడి డిక్లరేషన్ విడుదల చేశారు. ఉగ్రవాదాన్ని ‘ఉమ్మడి ముప్పు’గా పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని నియంత్రించడానికి నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలని తీర్మానించారు. ఉగ్రవాదం అనేది ఏ ఒక్క మతం, జాతీయత, నాగరికతకు సంబంధించింది కాదని ఉద్ఘాటించారు. అది ఏ రూపంలో ఉన్నా ఖండించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఉగ్రవాద నియంత్రణ చర్యలను మరింత బలోపేతం చేయాలని బ్రిక్స్ కూటమి నేతలు నిర్ణయించారు. ప్రపంచానికి ముప్పుగా మారిన వాతావరణ మార్పులను కూడా డిక్లరేషన్‌లో ప్రస్తావించారు. అజర్బైజాన్లో జరగబోయే కాప్–29 సదస్సులో వాతావరణ మార్పులకు సంబంధించి ఒక పరిష్కారం మార్గం వెలువడే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నామని తెలిపారు. -
ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి...అన్నివిధాలా సహకరిస్తాం: మోదీ
కజాన్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి తక్షణం శాంతియుత పరిష్కారం కనుగొనాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ఎలాంటి సాయమైనా చేసేందుకు భారత్ సదా సిద్ధమని ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఈ మేరకు హామీ ఇచ్చారు. 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మంగళవారం రష్యాలోని కజాన్ నగరం చేరుకున్నారు. గత మూడు నెలల్లో మోదీ రష్యా వెళ్లడం ఇది రెండోసారి. కజాన్ చేరిన కాసేపటికే ఆయన పుతిన్‌తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్ యుద్ధంతో పాటు పలు అంశాలపై నేతలిద్దరూ లోతుగా చర్చించుకున్నారు.‘‘ఉక్రెయిన్ సంక్షోభానికి తెర దించే విషయమై మీతో నేను నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నా. నేను ముందునుంచీ చెబుతున్నట్టుగా ఏ సమస్యకైనా శాంతియుత పరిష్కారమే ఏకైక మార్గం’’ అని ఈ సందర్భంగా పుతిన్‌కు మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఆయనతో అన్ని విషయాలపైనా అర్థవంతమైన చర్చ జరిగినట్టు అనంతరం ప్రధాని వెల్లడించారు.ఉక్రెయిన్‌పై రెండేళ్లకు పైగా జరుపుతున్న యుద్ధాన్ని విరమించేలా పుతిన్‌ను ఒప్పించి సంక్షోభానికి తెర దించగలిగింది మోదీ ఒక్కరేనని ప్రపంచ దేశాధినేతలంతా అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి భేటీకి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. రెండు రోజుల పాటు జరగనున్న బ్రిక్స్ సదస్సులో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో కూడా మోదీ సమావేశమయ్యారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఆయన బుధవారం భేటీ కానున్నారు. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ మేరకు వెల్లడించారు.నాకు, మోదీకి మధ్య అనువాదం అవసరమే లేదునవ్వులు పూయించిన పుతిన్ వ్యాఖ్యలు మోదీతో భేటీ సందర్భంగా పుతిన్ చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. ‘‘భారత్‌తో రష్యా బంధం ఎంత బలంగా ఉందంటే నా మాటలను అర్థం చేసుకోవడానికి బహుశా మీకు అనువాదం కూడా అవసరం లేదేమో!’’ అని మోదీని ఉద్దేశించి పుతిన్ అన్నారు. దాంతో ప్రధానితో సహా భేటీలో పాల్గొన్న ఇరు దేశాల ఉన్నతాధికారులు తదితరులంతా చిరునవ్వులు చిందించారు. భారత్‌తో రష్యా బంధం అత్యంత ప్రత్యేకమైనది. ఎంతో దృఢమైనది. అది నానాటికీ మరింతగా బలపడుతోంది’’ అని ఈ సందర్భంగా పుతిన్ అన్నారు.బ్రిక్స్‌కు పెరుగుతున్న ప్రాధాన్యంఅంతర్జాతీయంగా బ్రిక్స్ కూటమి ప్రాధా న్యం నానాటికీ పెరుగుతోందని మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘కీలకమైన అంతర్జాతీయ అంశాలపై చర్చలకు బ్రిక్స్ ప్రధాన వేదికగా మారుతోంది. అభివృద్ధి, పరస్పర సహకారం, వాతావరణ మార్పులు, ఆర్థిక సహకారం, దేశాల మధ్య పలు రకాలైన కీలక సరఫరా వ్యవస్థల నిర్మాణం వంటివాటిపై నూతన ఆలోచనల కలబోతకు కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. గతేడాది పలు కొత్త దేశాలు బ్రిక్స్ సభ్యులుగా చేరాయి. మరెన్నో దేశాలు చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ శాంతి, ప్రగతికి సంబంధించిన పలు కీలక అంశాలపై బ్రిక్స్ దేశాధినేతలతో ఫలవంతమైన చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు. ఈ కూటమి 2006లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనాలతో బ్రిక్ పేరిట ఏర్పాటైంది. 2010లో దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్‌గా మారింది. గతేడాది ఈజిప్‌్ట, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ కూడా కూటమిలో చేరాయి.కాల పరీక్షకు నిలిచిన బంధం: మోదీగత మూడు నెలల్లోనే రష్యాలో ఇది తన రెండో పర్యటన అని మోదీ గుర్తు చేసుకున్నారు. ‘‘ఇరు దేశాల మధ్య నానాటికీ బలపడుతున్న ప్రగాఢ బంధానికి, స్నేహానికి, సమన్వయానికి ఇది సూచిక. రష్యా, భారత మైత్రి కాలపరీక్షకు నిలిచిన బంధం. భారత ఆర్థికాభివృద్ధిలో, భద్రతలో రష్యాది కీలక పాత్ర’’ అంటూ ప్రస్తుతించారు. చరిత్రాత్మక కజాన్ నగరంలో భారత్ నూతన కాన్సులేట్‌ను తెరవడం పట్ల ఆనందంగా ఉందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. గత జూలైలో కూడా ఆయన రష్యాలో పర్యటించడం తెలిసిందే. ఆ సందర్భంగా పుతిన్‌తో జరిగిన శిఖరాగ్ర భేటీలో పలు విషయాలపై లోతుగా చర్చించారు. -
ట్రంప్ గెలిస్తే.. పుతిన్ కీవ్‌లో కూర్చుంటారు: కమల
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే.. చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొవల్సి వస్తుందని ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ హెచ్చరించారు. విస్కాన్సిన్లోని పార్టీ మద్దతుదారులతో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.‘‘డొనాల్డ్ ట్రంప్ ప్రమాదకరమైన వ్యక్తి అని అమెరికా ప్రజలు గుర్తించటం చాలా ముఖ్యమని భావిస్తున్నా. ఇదే విషయాన్ని నేను చాలా బహిరంగంగా చెప్పాను. ట్రంప్ మళ్లీ అమెరికాకు అధ్యక్షుడిగా ఎంపికైతే కలిగే పరిణామాలు చాలా క్రూరంగా ఉంటాయి. నవంబర్ 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. అమెరికా మిత్రపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. ట్రంప్ పొగడ్తలకు సులభంగా తన ఆలోచనలను మార్చుకుంటారు. కోవిడ్ సమయంలో ఆయన ఏం చేశారో అందరికీ తెలుసు. తన వ్యక్తిగత ప్రయోజనం కోసం (రష్యన్ అధ్యక్షుడు) వ్లాదిమిర్ పుతిన్‌కు రహస్యంగా కోవిడ్ పరీక్షల పరికరాలు పంపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ పదేపదే చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఆయన ఒక రోజులో పరిష్కరిస్తానని చెప్పారు. లొంగిపోవడం ద్వారా అమెరికా ప్రెసిడెంట్ అటువంటి సమస్యను పరిష్కరించాలని అమెరికన్లుగా మనం భావిస్తున్నామని నేను అనుకోను. డోనాల్డ్ ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడైతే వ్లాదిమిర్ పుతిన్ ఏకంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో కూర్చుంటారు. ట్రంప్ తనను అభిమానించే వ్యక్తులను సంతోషపెట్టాలని అనుకుంటారు’’ అని అన్నారు. ఇక.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి సంబంధించి ఇటువంటి వ్యాఖ్యలు ట్రంప్ గంతంలో కూడా చేసిన విషయం తెలిసిందే. -
భారతీయ సినిమాలంటే ఇష్టం.. బాలీవుడ్‌పై పుతిన్ ప్రశంసలు
మాస్కో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఈనెల 22, 23 తేదీల్లో రష్యాలోని కజాన్ వేదికగా జరిగే 16వ బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొనాలని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్యానించారు. దీంతో ప్రధాని మోదీ.. రష్యా పర్యటనకు మరోసారి వెళ్లనున్నారు.ఈ నేపథ్యంలో అధ్యక్షుడు పుతిన్ రష్యా మీడియాతో మాట్లాడుతూ.. భారతీయు సినిమాలు, బాలీవుడ్‌పై ప్రసంశలు కురిపించారు. భారతీయ సినిమాలకు తమ దేశంలో అత్యంత ప్రజాదరణ ఉందని అన్నారు. బ్రిక్స్ సభ్య దేశాలలో సినిమా షూటింగ్‌లకు రష్యా ప్రోత్సాహకాలు అందిస్తుందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. పుతిన్ మాట్లాడుతూ..‘‘ బ్రిక్స్ సభ్య దేశాలను పరిశీలిస్తే.. రష్యాలో భారతీయ చలనచిత్రాలకు అధిక ప్రజాదరణ ఉందని నేను భావిస్తున్నా. మాకు ప్రత్యేకంగా టీవీ ఛానెల్ ఉంది. భారతీయ చలనచిత్రాలపై చాలా ఆసక్తిని కలిగి ఉన్నాం. ఈ ఏడాది మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం సందర్భంగా బ్రిక్స్ దేశాల్లోని సినిమాలను పరిచయం చేస్తాం. #WATCH | On being asked about if Russia will give incentives to BRICS memeber states for shooting of films in the country, Russian President Putin says, "If we look at BRICS member states, I think in this country Indian films are most popular. We have a special TV channel with… pic.twitter.com/w0QGNdH0IV— ANI (@ANI) October 18, 2024 ..నేను భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కావడానికి సిద్ధంగా ఉన్నా. ఈ ప్రతిపాదనపై నా స్నేహితుడు మోదీతో చర్చించడానికి ఎదురు చూస్తూన్నా. తమ మధ్య మా మధ్య 100 శాతం సానుకూల ఒప్పందాలు జరుగుతాయని నమ్మకం ఉంది. ఇక.. భారతీయ చలనచిత్రాలు మాత్రమే కాకుండా వారి సంస్కృతులకు ప్రాతినిధ్యం వహించే బ్రిక్స్ దేశాల నటీనటులు, చైనీస్, ఇథియోపియన్ నటులు ఉన్నారు. అదేవిధంగా మేం థియేట్రికల్ ఫెస్టివల్ నిర్వహించాలని బ్రిక్స్ దేశాలతో చర్చించాం. సినిమా అకాడమీని కూడా నెలకొల్పాం’’ అని పుతిన్ అన్నారు.ఇక.. గడిచిన నాలుగు నెలల్లో ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తరువాత తొలిసారి మాస్కోలో ఈ ఏడాది జులై నెలలో మోదీ పర్యటించారు. ఆ సమయంలో 22వ భారత్–రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. 2006లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలు బ్రిక్ గ్రూపును ప్రారంభించాయి. 2010లో దక్షిణాఫ్రికా చేరిన తరువాత అది బ్రిక్స్‌గా మార్చారు. 2024 జనవరిలో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు కూడా చేరాయి. ప్రస్తుతం ఈ బ్రిక్స్ గ్రూపులో పది దేశాలు ఉన్నాయి. -
ఎన్నికల వేళ ట్విస్ట్.. పుతిన్‌కు ట్రంప్ సీక్రెట్ కాల్స్?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గత అధ్యక్ష ఎన్నికల ఓటమిచెంది పదవి నుంచి దిగిపోయిన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పలు ప్రైవేట్ ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నారని వచ్చిన ఆరోపణలను బుధవారం క్రెమ్లిన్ ఖండించింది. ఇటీవల బాబ్ వుడ్వార్డ్ తాను రాసిన ‘వార్’ అనే పుస్తకంలో ట్రంప్,పుతిన్ రహస్య ఫోన్ కాల్స్ విషయాలను ప్రస్తావించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్, పుతిన్ ఫోన్ సంభాషణ తీవ్ర సంచలనంగా మారింది. అయితే.. తాజాగా ఈ ఆరోపణలపై రష్యా స్పందించింది. మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవిలో ఉన్నప్పుడు కోవిడ్ మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉందని క్రెమ్లిన్ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు.#BREAKING : Kremlin denies calls between Trump and Putin The Russian Presidential spokesman, Dmitry Peskov, has denied information alleging that former US President Donald Trump had spoken on the phone with Russian President Vladimir Putin seven times after the former left… pic.twitter.com/8rbppPeRgD— upuknews (@upuknews1) October 9, 2024 అయితే ఆ సమయంలో తాము కోవిడ్ -19 పరీక్ష పరికరాలను అమెరికాకు పంపినట్లు ధృవీకరించారు. కానీ, ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఇరు నేతలు చాలాసార్లు ఫోన్లో మాట్లాడుకున్నారని పుస్తకంలోని వాదనను ఆయన తీవ్రంగా ఖండించారు. బాబ్ వుడ్వార్డ్ తన పుస్తకంలో చేసిన ఆరోపణలను ‘నిజం కాదు’ అని కొట్టిపారేశారు.బాబ్ వుడ్వార్డ్ తాను రాసిన ‘వార్’ అనే పుస్తకం వారం రోజులల్లో మార్కెట్లోకి విడుదల కానుంది. అయితే అంతకంటే ముందే కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. 2024 ప్రారంభంలో ట్రంప్ తన ఫ్లోరిడా రిసార్ట్ మార్-ఎ-లాగోలో ఉన్నప్పుడు పుతిన్‌తో.. మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రైవేట్ కాల్‌ను ఏర్పాటు చేశారు. ఇరు నేతల మధ్య ఇలాంటి ఫోన్ సంభాషణ కేవలం ఒక్కసారి మాత్రమే జరగలేదని ఆ పుస్తకంలో బాబ్ వుడ్వార్డ్ ప్రస్తావించటం చర్చనీయాంశంగా మారింది.చదవండి: హెజ్బొల్లా చితికి పోయింది: అమెరికా -
అమెరికా సహా పశ్చిమ దేశాలకు పుతిన్ వార్నింగ్
-
న్యూక్లియర్ వార్‌కు సిద్ధం.. పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్
మాస్కో: ఉక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో రష్యాపై దాడులను ఉక్రెయిన్ తీవ్రతరం చేసింది. రష్యాపై దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌కు పలు దేశాలు సాయం అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటో దేశాలను పుతిన్ తీవ్రంగా హెచ్చరించారు. పశ్చిమ దేశాలపై అణ్వాయుధాలతో దాడి చేసేందుకు రెడీ అయినట్టు హింట్ ఇచ్చాడు.అమెరికా, యూకే సాయంతో ఉక్రెయిన్.. రష్యాపై భీకర దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే రష్యాపై బాంబు దాడికి ఉపయోగించే ‘స్టార్మ్ షాడో’ క్రూయిజ్ క్షిపణిని గత వారం యూకే క్లియర్ చేసింది. యూకే పీఎం కైర్ స్టార్మర్.. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను కలవడానికి వాషింగ్టన్ కూడా వెళ్లారు. రష్యా గడ్డపై ఉక్రెయిన్ ఆయుధాల వినియోగంపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. ఈ మేరకు రష్యా ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది. దీంతో, అప్రమత్తమైన రష్యా.. పశ్చిమ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు.తాజాగా రష్యా భద్రతా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. తమ దేశంపై అణు సామర్థ్యం లేని రాజ్యం, అణు సామర్థ్యం కలిగిన దేశం మద్దతుతో మా దేశంపై దాడి చేసినప్పుడు రష్యా ఫెడరేషన్‌పై సంయుక్త దాడిగా పరిగణిస్తామని పుతిన్ తెలిపారు. ఈ క్రమంలో తాము అణు దాడులు చేసేందుకు వెనుకాడబోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. BREAKING:🇷🇺 Vladimir Putin: "We will use NUCLEAR weapons if a mass enemy missile or UAV is launched towards Russia, or when these weapons cross into Russian territory" pic.twitter.com/oDJz1zTTzU— Megatron (@Megatron_ron) September 25, 2024 పుతిన్ హెచరిక తర్వాత రష్యా తన అణు ముసాయిదాలో సవరణలు చేసింది. తాజా సవరణలు ప్రకారం ప్రత్యర్థులు విమానాల ద్వారా భారీ దాడులు చేయడం, క్రూజ్ క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించినప్పుడు అణ్వస్త్రాలను వినియోగించేందుకు రష్యా నిర్ణయం తీసుకుంటుంది. ఇక పశ్చిమ దేశాలు తాము సరఫరా చేసిన దీర్ఘశ్రేణి ఆయుధాలతో రష్యా భూభాగంపై ఉక్రెయిన్ దాడి చేసేందుకు అనుమతిస్తే కీవ్‌తో జరుగుతున్న యుద్ధంలో నాటో కూడా చేరినట్లవుతుందని పుతిన్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: 1982 to 2024: ఇజ్రాయెల్ వర్సెస్ హెజ్జ్బొల్లా రక్తచరిత్ర -
కమలా హారీస్‌కు పుతిన్ మద్దతు.. ట్విస్ట్ ఇచ్చిన లావ్రోవ్
మాస్కో: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచ దేశాల ఫోకస్ ఉంది. ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే చర్చ కూడా నడుస్తోంది. ఎన్నికల్లో పలు దేశాలు నేతలు ఎవరికి మద్దతు ఇస్తున్నారనే అంశం కూడా ఎన్నికల్లో కీలక కానుంది. ఇక, కమలా హారీస్‌కే తమ మద్దతు అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో పుతిన్ వ్యాఖ్యలపై రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ క్లారిటీ ఇచ్చారు.అమెరికా అధ్యక్ష ఎన్నికలపై లావ్రోవ్ తాజాగా స్పందిస్తూ.. ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్‌కు మద్దతు ఉంటుందని పుతిన్ సరదాగా మాత్రమే అన్నారు. పుతిన్ అప్పుడప్పుడు జోక్స్ వేస్తుంటారు. అందులో భాగంగానే ఇలా మాట్లాడారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మా జోక్యం ఏమీ ఉండదు. ఇంతకుముందు, ఇప్పుడు.. ఎన్నికల్లో జోక్యం చేసుకోము. మా వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదు అంటూ కామెంట్స్ చేశారు. BREAKING: Russian Foreign Minister Sergei Lavrov said in an interview with Sky News Arabia that Putin was JOKING when he said he wanted Kamala Harris to win the election in November.— Amanda Liyang (@esraa28305334) September 22, 2024ఇదిలా ఉండగా.. కొద్దిరోజులు క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్.. అమెరికా ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కమలాతో పనిచేయడం సులువని తనదైన శైలిలో మాట్లాడారు. అయితే, హారీస్ ఎంపికలో జో బైడెన్ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానన్నారు. ఏదేమైనా.. ఆ దేశ అధ్యక్షుడు ఎవరనే విషయాన్ని అక్కడివారే నిర్ణయిస్తారని ముగించారు.అనంతరం, పుతిన్ వ్యాఖ్యలపై వైట్‌హౌస్ వర్గాలు స్పందించాయి. పుతిన్ కామెంట్స్‌కు అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ కౌంటరిచ్చారు. అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరనే విషయాన్ని నిర్ణయించేది కేవలం స్థానికులే. మా అధ్యక్ష ఎన్నికలపై పుతిన్ మాట్లాడటం ఆపేస్తే మంచింది. ఈ ఎన్నికల్లో మీ జోక్యాన్ని ఎవరూ కోరుకోవడం లేదు. భవిష్యత్‌లో కూడా ఎన్నికల గురించి మాట్లాడకండి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: బైడెన్‌తో చర్చలు ఫలించాయి: ప్రధాని మోదీ -
లంచ్ బ్రేక్‌లో లవ్వు!
అసలే జననాల రేటు తగ్గుతోంది. అది చాలదన్నట్టుగా రెండున్నరేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం రష్యా సైనికులను భారీగా బలి తీసుకుంటోంది. దీనికి తోడు నిర్బంధంగా సైన్యంలో చేరాల్సి వస్తుండటంతో యువకులు భారీ సంఖ్యలో దేశం వీడుతున్నారు. వెరసి రష్యాలో జనాభా శరవేగంగా తగ్గిపోతోంది. ఈ పరిణామం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను తీవ్రంగా ఆందోళన పరుస్తోంది. దాంతో ఎలాగైనా జనాభాను ఇతోధికంగా పెంచి దేశసేవ చేయాలంటూ రష్యన్లకు ఆయన తాజాగా విజ్ఞప్తి చేశారు. అందుకోసం రోజూ పని మధ్యలో లంచ్, టీ విరామ సమయాల్లో కూడా వీలైనంతగా కిందా మీదా పడాల్సిందిగా సూచించారు! పుతిన్ ఇచి్చన ఈ గమ్మత్తైన పిలుపుపై నెటిజన్లు అంతే ఆసక్తికరమైన కామెంట్లు కూడా చేస్తున్నారు. లంచ్, కాఫీ బ్రేకులను సంతానోత్పత్తికి వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాల్సిన అవసరం చాలా ఉందని రష్యా ఆరోగ్య మంత్రి యెవగనీ షెస్తోపలోవ్ కూడా పేర్కొనడం విశేషం. ఇది ఆచరణ సాధ్యమా అన్న ప్రశ్నలను ఆయన కొట్టిపారేశారు. ‘‘దయచేసి రోజంతా పనిలో బిజీగా ఉంటున్నామని చెప్పకండి. అది పసలేని సాకు మాత్రమే. సృష్టికార్యానికి ఆఫీసు పని అడ్డంకి కారాదు. లంచ్, కాఫీ బ్రేక్... ఇలా ప్రతి అవకాశాన్నీ సెక్స్ కోసం గరిష్టంగా ఉపయోగించుకోండి. లేదంటే కాలం ఎవరి కోసమూ ఆగదు. బేబీలను కనేందుకు బ్రేక్ టైంలో కష్టపడండి’’ అంటూ హితబోధ కూడా చేశారు.పడిపోతున్న ప్రజనన నిష్పత్తి ఏ దేశంలోనైనా జనసంఖ్య స్థిరంగా ఉండాలన్నా ప్రజనన నిష్పత్తి కనీసం 2.1గా ఉండాలి. రష్యాలో అది నానాటికీ తగ్గిపోతోంది. ప్రస్తుతం ప్రతి మహిళకూ కేవలం 1.4గా ఉంది. 2024 తొలి అర్ధ భాగంలో గత పాతికేళ్లలోనే అత్యంత తక్కువ జననాల రేటు నమోదైంది! ఇది దేశ భవిష్యత్తుకు మరణశాసనమేనంటూ క్రెమ్లిన్ హాహాకారాలు చేస్తోంది.తొలి కాన్పుకు రూ.9.4 లక్షలు! జననాల రేటును పెంచేందుకు రష్యా పలు చర్యలకు దిగింది. అబార్షన్, విడాకులు అత్యంత కష్టసాధ్యంగా మార్చేసింది. పిల్లల్ని కని పెంచడమే మహిళల ప్రధాన బాధ్యతంటూ ప్రముఖులు, మత పెద్దలతో చెప్పిస్తోంది. చెల్యాబిన్స్క్ ప్రావిన్స్ తొలి కాన్పుకు ఏకంగా రూ.9.4 లక్షలు ప్రకటించింది!– సాక్షి, నేషనల్ డెస్క్ -
నా మంచి స్నేహితుడు మోదీ రాక కోసం ఎదురు చూస్తున్నా: పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ నా స్నేహితుడి కోసం ఎదురు చూస్తున్నాం. ఆయనకు నా శుభాకాంక్షలు’అని రష్యా మీడియా సమావేశంలో పుతిన్ చెప్పినట్లు పేర్కొంది.బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం రష్యాలోని సెయింట్ పీటర్స్ వర్గ్లో పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పుతిన్‌తో దోవల్ కరచాలనం చేశారు. ఆ ఫొటోల్ని భారత్‌లోని రష్యన్ రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.🇷🇺🤝🇮🇳 On September 12, #Russia's President Vladimir Putin had a meeting with Ajit Doval, National Security Advisor to the Prime Minister of #India, at the Konstantinovsky Palace in #StPetersburg. 👉🏻 https://t.co/vFQ64S4vMq#RussiaIndia #DruzhbaDosti pic.twitter.com/KxcD9aciDG— Russia in India 🇷🇺 (@RusEmbIndia) September 12, 2024 గత నెలలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన చర్చల సారాంశాన్ని అజిత్ దోవాల్ పుతిన్‌కు వివరించారు. మోదీ ఆదేశాల మేరకు రష్యా పర్యటనకు వచ్చినట్లు అజిత్ దోవాల్ పుతిన్‌కు వివరించారు. ఈ చర్చల్లో సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు రష్యాలోని కజన్ వేదికగా బ్రిక్స్ దేశాల సదస్సు జరగనుంది. ఆ సదస్సుకు మోదీ వస్తే, ఆయనతో విడిగా భేటీ కావాలనుకుంటున్నట్లు దోవల్‌కు పుతిన్ చెప్పారు.ఇదే అంశాన్ని రష్యా మీడియా సైతం ప్రస్తావించింది.ఇదీ చదవండి : బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సీటుకు ఎసరు..రంగంలోకి సంపన్న మహిళరష్యన్ ఎంబసీ సైతం మోదీ రష్యా పర్యటన సందర్భంగా భారత్ - రష్యాల మధ్య కుదిరిన ఒప్పందాల అమలుకు సంబంధించి వచ్చిన ఫలితాలు,సమీప భవిష్యత్తుకు సంబంధించిన అవకాశాలను వివరించేందుకు బ్రిక్స్ సదస్సు సందర్భంగా అక్టోబర్ 22న ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించాలని పుతిన్ ప్రతిపాదించారు అని టెలిగ్రామ్‌లో విడుదల చేసిన ఒక ప్రకటనలో రష్యన్ ఎంబసీ తెలిపింది.కాగా, ఉక్రెయిన్ పర్యటనలో ఆదేశ అధ్యక్షుడు వ్లాదమీర్ జెలెన్ స్కీతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. కొనసాగుతున్న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని యుద్ధాన్ని ముగించేలా ఉక్రెయిన్-రష్యాలు చర్చలు జరుపుకోవాలని, ఈ రెండు దేశాల్లో శాంతిని పునరుద్ధరించడానికి భారత్ క్రియాశీల పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని మోదీ అన్నారు. -
మోదీ గొప్ప స్నేహితుడు: పుతిన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు ప్రశంసలు కురిపించారు. మోదీ తనకు గొప్ప మిత్రుడంటూ పొగిడారు. రష్యాలోని కజాన్‌లో వచ్చే నెలలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్రానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా(బ్రిక్స్) దేశాల జాతీయ భద్రతాదారుల సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం అజిత్ దోవల్ అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. మోదీతో భేటీకి ఆసక్తిగా ఉన్నట్లు ఈ సందర్భంగా పుతిన్ తెలిపారు. దాదాపు మూడు వారాల క్రితం ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లో జరిపిన పర్యటన, అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చల వివరాలను దోవల్ ఆయనకు వివరించారు. ‘బ్రిక్స్ శిఖరాగ్రం సమయంలో అక్టోబర్ 22వ తేదీన మోదీతో సమావేశమవ్వాలని, రెండు దేశాల మధ్య విజయవంతంగా అమలవుతున్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం, భద్రతా పరమైన అంశాలపై చర్చించాలని అధ్యక్షుడు పుతిన్ ప్రతిపాదించారు’ అని రష్యా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే నెల 22–24 తేదీల్లో రష్యాలోని కజాన్ నగరంలో బ్రిక్స్ శిఖరాగ్రం జరగనుంది. జూలైలో మోదీ రష్యాలో పర్యటించారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారత్, బ్రెజిల్, చైనాలకు కీలకంగా ఉన్నాయని ఇటీవల పుతిన్ పేర్కొనడం తెలిసిందే. కాగా, బ్రిక్స్ శిఖరాగ్రానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా హాజరవనున్నారు. ఈ విషయాన్ని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ధ్రువీకరించారు. గురువారం ఆయన పుతిన్‌తో సమావేశమయ్యారు. -
పుతిన్ ఆకస్మిక చర్చల ప్రతిపాదన
ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమనీ, అందుకు ఇండియా, చైనా, బ్రెజిల్ మధ్యవర్తిత్వం వహించాలనీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నెల 5న చేసిన ఆకస్మిక ప్రతిపాదన ఆసక్తిని కలిగించింది. చర్చలకు ఆయన సుముఖతను చూపటం ఇది మొదటిసారి కాదు. యుద్ధం రెండున్నరేళ్ల క్రితం మొదలు కాగా చర్చల ప్రస్తావనలు గతేడాదిగా వస్తూనే ఉన్నాయి. కొన్నిసార్లు స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యూరోపియన్ దేశాల అధినేతలు, వివిధ అంత ర్జాతీయ సంస్థల బాధ్యులు ఈ మాట అంటూనే ఉన్నారు. కానీ కొన్ని కీలకమైన షరతులను పుతిన్ మొదటి నుంచీ పెడుతున్నారు. వీటిని జెలెన్స్కీ అంతే బలంగా తిరస్కరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చర్చలంటూ జరిగినా, అవి ఎలా ముందుకు సాగేదీ ఎవరూ చెప్పలేరు.జెలెన్స్కీ గత జూన్‌లో స్విట్జర్లాండ్‌లో తొంభైకి పైగా దేశాలతో శాంతి సదస్సు నిర్వ హించారు. కానీ ఆ సదస్సుకు ఆయన రష్యాను ఆహ్వానించలేదు. ఆ కారణంగా చైనా వెళ్లలేదు. అంతలోనే ఆయన, త్వరలో మరొక సదస్సు జరపగలమనీ, దానికి రష్యాను ఆహ్వానించగలమనీ ప్రకటించారు. ఆ సదస్సుకు హాజరయ్యేటట్లు రష్యాను ఒప్పించవలసిందిగా కోరేందుకు తన విదేశాంగ మంత్రి దిమిత్రి కునేబాను చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వద్దకు రాయబారం పంపారు. ఉక్రెయిన్ ప్రతి పాదనలు ఏమిటో చూసి అపుడు స్పందించగలమన్నది రష్యా జవాబు.ఇవన్నీ జూన్, జూలై పరిణామాలు. అటువంటిది ఇపుడు పుతిన్ ఆకస్మికంగా చర్చల ప్రతిపాదన చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది ఆకస్మికం, ఆశ్చర్యకరంగా తోచటానికి మరికొన్ని కారణాలు న్నాయి. జూన్, జూలై పరిణామాల తర్వాత, కొంత వెనుకముందులుగా చర్చలు ప్రారంభం కావచ్చునని పలువురు భావిస్తుండగా, ఆ తర్వాత కొద్ది వారాలకే ఉక్రెయిన్ సైన్యం తమకూ, రష్యాకూ మధ్యగల ఉత్తర సరిహద్దు నుంచి రష్యాకు చెందిన కర్స్క్ ప్రాంతంపై వేలాది సైన్యంతో మెరుపుదాడి చేసి తగినంత భూభాగాన్ని తన అధీనంలోకి తెచ్చుకుంది. ఇది మరొక ఆశ్చర్యకర పరిణామం. ఎందుకంటే, యుద్ధం జరుగుతున్నది తూర్పు ప్రాంతాలలో. అక్కడ రష్యాది పూర్తి పై చేయిగా ఉండి రోజురోజుకూ ముందుకు చొచ్చుకొస్తున్నారు. ప్రస్తుతం పోక్రొవ్స్‌క్ అనే అతి కీలకమైన కూడలి పట్టణం వద్ద యుద్ధం కేంద్రీకృతమై ఉంది. ఆ పట్టణాన్ని కోల్పోతే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతమంతా ప్రమాదంలో పడుతుంది. స్వయంగా ఉక్రె యిన్ సైన్యం చెప్తున్న దానిని బట్టి ఆ కేంద్రం కొద్ది రోజులలోనే రష్యా చేజిక్కవచ్చు. అటువంటి విపత్కర స్థితిలో పోక్రొవ్స్క్కు అదనపు బలాలను పంపి రక్షించుకునేందుకు బదులు కర్స్క్పై దాడి ఎందుకు అన్న సందేహాలు తలెత్తాయి.ఆ చర్చను కొద్దిసేపు వాయిదా వేసి ప్రస్తుతానికి వస్తే, చర్చల మాట రెండు వైపుల నుంచీ కొత్త కాదు. కానీ, అందుకు ఇండియా, చైనా, బ్రెజిల్ మధ్యవర్తిత్వం వహించాలనటం కొత్తమాట. ఇక్కడ ఒక స్పష్టీకరణ అవసరం. వ్లాడివాస్టోక్లో జరుగుతున్న ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం సదస్సు సందర్భంగా ఈ మాట వచ్చింది. ఒక విలేఖరి ప్రశ్నకు సమాధానంగా పుతిన్ ఈ మాట అన్నట్లు వార్తలలో కనిపించింది గానీ, అది నిజం కాదని ఆ వీడియోను చూసినపుడు అర్థమవుతుంది. పుతిన్ ఒక లిఖిత ప్రకటనను చదవటం అందులో కనిపిస్తుంది. అనగా, ముందే ఆలోచించి చెప్పిన మాట అది. వార్తలలో వెలువడిన దానిని బట్టి రష్యా అధ్యక్షుడు అన్నది, చర్చలకు తాము సిద్ధం. అందుకు ఇండియా, చైనా, బ్రెజిల్ మధ్య వర్తిత్వం వహించాలి. వారీ పని చేయగలరు. యుద్ధంతో ముడిపడి ఉన్న అన్ని సమస్యలను వారు పరిష్కరించగలరనే విశ్వాసం ఉంది. ఈ అంశంపై తాను వారితో నిరంతరం సంప్రదిస్తున్నాను. జెలెన్స్కీ, బైడెన్ ఇరువురితో మోదీ మాట్లాడగలరు. అంతర్జాతీయ సంబంధాలలో కీలక పాత్ర వహించేందుకు మోదీకి ఇది మంచి అవకాశం అన్నది పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వ్యాఖ్య. యథా తథంగా ఈ మాటలు ముఖ్యమైనవే. పుతిన్ మరికొన్ని ముఖ్యమైన మాటలన్నారు. వీడియోలో వినిపించిన ఆ మాటలు ఎందువల్లనో వార్తలలో కనిపించలేదు. అవి, ఉక్రెయిన్‌తో చర్చలకు షరతుల వంటివి. అవి ఈ విధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ పాలనలో గల డొనెటెస్క్, లుహాన్స్క్, ఖేర్సాన్, జపోరిజిజియా అనే నాలుగు తూర్పు ప్రాంతాలను రష్యాకు వదలి వేస్తున్నట్లు ప్రకటించాలి. (ఇప్పటికే రష్యా అధీనంలో గల క్రిమియా గురించి ఆయన ప్రస్తావించలేదు గానీ, ఆ విషయమై రాజీకి, చర్చలకు అవకాశం లేదని గతంలోనే అన్నారు.) ‘నాటో’లో చేరబోమని కూడా ఉక్రెయిన్ ప్రకటించాలి. ఆ నాలుగు ప్రాంతాల నుంచి సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించాలి. ఇవి జరిగితే ‘అదే నిమిషంలో’ యుద్ధాన్ని విరమించి చర్చలను ప్రకటిస్తాము.అనగా ఇవి చర్చలకు షరతులన్నమాట. ఈ షరతులను పుతిన్ మొదటినుంచీ పెడుతున్నారు. ఆ విషయంలో రాజీ లేదంటున్నారు. వీటిని జెలెన్స్కీ తమ వైపు నుంచి అంతే బలంగా తిరస్కరిస్తున్నారు. పైగా, రష్యా 2014లో ఆక్రమించిన క్రిమియాను తిరిగి ఇవ్వవలసిందేనంటున్నారు. ఇదే మాట ఇటీవల కూడా పునశ్చరించారు. పైన పేర్కొన్న నాలుగు ప్రాంతాలలో గణనీయమైన భాగాన్ని ప్రస్తుత యుద్ధంలో రష్యా ఆక్రమించుకోగా, అక్కడి నుంచి ఖాళీ చేయాలంటున్నారు. నాటో సభ్యత్వం తమ హక్కని వాదిస్తున్నారు. అనగా, ఇవన్నీ చర్చలకు పుతిన్, జెలెన్స్కీల షరతులన్నమాట. తమ సార్వ భౌమత్వం, భౌగోళిక సమగ్రతల పరిరక్షణకు అవసరమని జెలెన్స్కీ చెబుతున్నారు. నాటో కూటమి విస్తరణ నుంచి ఆత్మరక్షణకూ, ఆ నాలుగు ప్రాంతాలలో మెజారిటీలో గల రష్యన్ భాషీయులపై చిరకాలంగా సాగుతున్న ఉక్రెయిన్ వేధింపులు, తరచూ ప్రాణ హననం నుంచి వారిని రక్షించుకునేందుకు ఇది తప్పనిసరి అని రష్యా వాదిస్తున్నది. ఈ షరతులలోని సహేతుకతలలోకి వెళితే రెండు వైపులా న్యాయం కనిపిస్తుంది. ఉక్రెయిన్ భౌగోళిక సమగ్రతకు రక్షణ ఉండవలసిందే. అదే విధంగా, అమెరికన్ నాటో కూటమి క్రమంగా రష్యా సరిహద్దుల వైపు విస్తరిస్తూ, ఉక్రెయిన్ను నాటోలో చేర్చు కొనజూస్తూ, రష్యా అస్తిత్వానికే ముప్పు తలపెడుతున్నపుడు, వారు ఆత్మరక్షణ కోసం ప్రయత్నించరాదని అనలేము. అట్లాగే, పై నాలుగు ప్రాంతాలలోని రష్యన్ భాషీయులపై మొదటినుంచీ తీవ్రమైన వేధింపు మాట నిజమైనందున, వారికి రక్షణ అవసరం.ఈ విధమైన పరిస్థితులు, షరతుల మధ్య ఇండియా, చైనా, బ్రెజిల్‌లు రాజీ మార్గం కనుగొనటం ఎంత మాత్రం తేలిక కాదు. ఉభయ పక్షాలు ఈ షరతులు విధించటం, వాటిని వారు పరస్పరం తిరస్కరించటం ఇప్పటికే పలుమార్లు జరిగాయి. నాటో ద్వారా ప్రపంచాధిపత్యం అనే లక్ష్యం గల అమెరికా, ఆ కూటమిలో చేరరాదని ఒకవేళ ఉక్రెయిన్ నిర్ణయించుకున్నా అందుకు సమ్మతించే అవకాశం కనిపించదు. ఆ విధంగా మధ్యవర్తుల బాధ్యత మరింత క్లిష్టతర మవుతుంది. అదట్లుంచి భారత్, చైనా, బ్రెజిల్ ప్రముఖ దేశాలు కావటమే గాక రష్యాతో పాటు బ్రిక్స్ కూటమిలో భాగస్వాములు. తన ఆధిపత్యానికి నష్టమని భావించే అమెరికా ఆ కూటమిని భంగ పరిచేందుకు మొదటినుంచి ప్రయత్నిస్తున్నది. ఈ పరిస్థితులన్నింటి మధ్య, ఒకవేళ అసలు ఈ ముగ్గురి మధ్యవర్తిత్వమంటూ సాకారమైనా, అది ఏ విధంగా ముందుకు సాగేదీ ఎవరూ చెప్పలేరు. ఇంతకూ ఈ ప్రతిపాదనకు జెలెన్స్కీ స్పందన ఏమిటో తెలియదు... ఆయన ఇండియా, చైనాల పాత్రను ఇప్పటికే కోరి ఉన్నప్పటికీ.తిరిగి యుద్ధం విషయానికి వస్తే, కర్స్క్పై ఉక్రెయిన్ దాడిలోని ఉద్దేశం రష్యన్ సైన్యాన్ని పోక్రొవ్స్‌క్ నుంచి అటు మళ్లించేట్లు చేయటమని సైనిక నిపుణులు ఊహాగానాలు చేశారు. కానీ రష్యన్ వ్యూహకర్తలు ఆ పని చేయక పోక్రొవ్స్క్ను, ఇతర తూర్పు ప్రాంతా లను ఆక్రమించే పని సాగిస్తున్నారు. ఆ విధంగా కర్స్క్ వ్యూహం విఫలమైందని ఇపుడు ఉక్రెయిన్ సైన్యాధికారులే అంగీకరిస్తున్నారు. ఉక్రెయిన్ కొత్త సైన్యాధిపతి జనరల్ అలెగ్జాండర్ సిరిస్కియీ కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ, కర్స్క్ వైపు నుంచి కూడా తమపై దాడికి రష్యా ఆలోచించటంతో దానిని నిరోధించేందుకు తామే ముందు దాడి చేశామన్నారు గానీ అది నిజమని తోచదు. అటువైపు రష్యన్ యుద్ధ సన్నాహాలు అసలు లేనే లేవు. పుతిన్ ప్రతిపాదనకు రాగల రోజులలో జెలెన్స్కీ స్పందనలు వచ్చినపుడు గానీ ఈ విషయమై కొంత స్పష్టత రాదు.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
వాళ్లు సంక్షోభాన్ని పోగొట్టగలరు
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన ‘సైనికచర్య’ కారణంగా తలెత్తిన సంక్షోభాన్ని భారత్, బ్రెజిల్, చైనా పోగొట్టగలవని రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యానించారు. వ్లాడివోస్తోక్ నగరంలో జరుగుతున్న ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరమ్ ప్లీనరీ సెషన్లో పుతిన్ మాట్లాడారు. ‘‘ భారత్, బ్రెజిల్, చైనాలతో నిరంతరం టచ్‌లోనే ఉన్నా. సంక్షోభం సమసిపోయేలా చేసేందుకు ఈ మూడు దేశాలు తీవ్రంగా కృషిచేస్తున్నాయి. చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్ సుముఖంగా ఉంటే నేనూ అందుకు సిద్ధమే’’ అని అన్నారు. ఉక్రెయిన్‌తో చర్చలకు భారత్ సాయపడగలదని రష్యా అధ్యక్షుడి అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అన్నారు. ‘‘ చర్చలకు నాయకత్వంవహించే సత్తా మోదీకి ఉంది. ఆయన అయితేనే అటు పుతిన్‌తో ఇటు జెలెన్స్కీ, అమెరికాతో స్వేచ్ఛగా మాట్లాడగలరు. అంతర్జాతీయ సంబంధాల్లో కీలక భూమిక పోషించేందుకు భారత్‌కు ఇది సువర్ణావకాశం’’ అని దిమిత్రి అన్నారు. #RussianPresident #Putin Says | 📢Have never refused from peace talks with Ukraine. Says, Istanbul agreement should be the basis📢Also adds, China, Brazil, India could be the mediators in peace talks📢"Biden recommended to support Harris, we will do the same".… pic.twitter.com/RUwWsH9Ihb— CNBC-TV18 (@CNBCTV18Live) September 5, 2024 -
కిమ్‌కు పుతిన్ గిఫ్ట్..ఈ సారి ప్రత్యేకంగా..
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదమీర్ పుతిన్..ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్కి 24 మేలిమి జాతి గుర్రాల్ని బహుమతిగా ఇచ్చారు.ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తుంది. అయితే ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు తమకు యుద్ధ సామాగ్రిని సరఫరా చేయాలని కొద్ది రోజుల క్రితం పుతిన్.. కిమ్ జోంగ్ ఉన్ని కోరారు. పుతిన్ విజ్ఞప్తితో వెను వెంటనే కిమ్ జోంగ్ ఉన్ ఆఘమేఘాల మీద రష్యాకు యుద్ధ సామాగ్రిని పంపించారు. అందుకు ప్రతిఫలంగా పుతిన్.. ఉత్తర కొరియా అధ్యక్షుడికి గుర్రాల్ని బహుకరించినట్లు అంతర్జాతీయ కథనాలు చెబుతున్నాయి. రష్యా పంపిన గుర్రాల్లో కిమ్‌కు అత్యంత ఇష్టమైన ఓర్లోవ్ ట్రోటర్ జాతికి చెందిన 19 స్టాలియన్లు, ఐదు మరే జాతి గుర్రాలు ఉన్నట్లు టైమ్స్ నివేదించింది. ఈ ఏడాది జూన్‌లో పుతిన్ ఉత్తర కొరియాలో 24 ఏళ్ల తర్వాత తొలిసారి పర్యటించారు. ఈ పర్యటనలో పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ మధ్య సైనిక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. పంగ్సన్ అనే తెల్లటి వేటాడే శునకాలను పుతిన్‌కు కిమ్ గిఫ్ట్‌గా ఇచ్చారు కిమ్. అందుకు.. రష్యా అధ్యక్షుడు కూడా ఆరుస్ లిమోసిన్ కారును బహుకరించారు.ఆ తర్వాత కిమ్‌కు 447 మేకలను ఇచ్చారు. తాజాగా మేలి జాతికి చెందిన గుర్రాలను నియంత కిమ్‌కు బహుమతిగా ఇచ్చారు. -
శాంతియత్నాలు ఆపొద్దు!
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం పరిసమాప్తికి భిన్న మార్గాల్లో జరుగుతున్న ప్రయత్నాలు కాస్తా ఆ రెండు పక్షాల మొండి వైఖరులతో స్తంభించినట్టే కనబడుతోంది. రష్యాపై మరిన్ని దాడులు జరిపితే అది చర్చలకు సిద్ధపడుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భావిస్తుండగా... దాన్ని పూర్తిగా లొంగ దీసుకునే వరకూ యుద్ధం ఆపే ప్రసక్తి లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికార ప్రతినిధి తాజాగా తేల్చిచెప్పారు. యుద్ధం మొదలయ్యాక రెండు దేశాలతోనూ ఐక్యరాజ్యసమితితోపాటు భిన్న సంస్థలూ, దేశాలూ చర్చలు సాగిస్తూనే ఉన్నాయి. కానీ ఎవరికి వారు అంతిమ విజయం తమదేనన్న భ్రమల్లో బతుకున్నంత కాలం సమస్య తెగదు. అలాగని ఏదో మేరకు సమస్యలు పరిష్కారమవుతున్నాయన్నది వాస్తవం. ఉదాహరణకు హోరాహోరీ సమరం సాగుతున్నప్పుడు రెండేళ్ల క్రితం ఉక్రెయిన్ నుంచి ఆహారధాన్యాలు, ఎరువులు, పొద్దుతిరుగుడు నూనె ఉత్పత్తుల ఎగుమతులు నిలిచి పోగా ఐక్యరాజ్యసమితి చొరవ తీసుకుని రష్యా, ఉక్రెయిన్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించింది. అప్పటికి యుద్ధం మొదలై ఆర్నెల్లు దాటింది. ఫలితంగా నిరుడు జూలై నాటికి దాదాపు మూడు న్నర కోట్ల టన్నుల ఆహారధాన్యాలు ఎగుమతయ్యాయి. ప్రపంచానికి ఆహార సంక్షోభం తప్పింది. ఇటీవలే ఈ రెండు దేశాల మధ్యా యుద్ధ ఖైదీల మార్పిడి కూడా జరిగింది. ఇరువైపులా చెరో 115 మంది సైనికులకూ చెర తప్పింది. తెర వెనక తుర్కియే సంక్షోభ నివారణకు ప్రయత్నిస్తుండగా ప్రధాని మోదీ అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ సందర్శించి ఇరు దేశాల అధినేతలతోనూ మాట్లాడారు. వచ్చే నెలలో ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్లినప్పుడు ఆయన మరోసారి జెలెన్స్కీని కలవ బోతున్నారు. అలాగే అక్టోబర్‌లో బ్రిక్స్ సమావేశాల కోసం రష్యా వెళ్లబోతున్నారు. మోదీ ఉక్రెయిన్ వెళ్లినందుకు పుతిన్ కినుక వహించినట్టే, అంతక్రితం రష్యా వెళ్లినందుకు జెలెన్స్కీ నిష్ఠూరాలాడారు. ఇప్పటికైతే ఉక్రెయిన్ ఒకవైపు నువ్వా నేనా అన్నట్టు రష్యాతో తలపడుతున్నా... డ్రోన్లతో, బాంబులతో నిత్యం దాడులు చేస్తున్నా చర్చల ప్రస్తావన తరచు తీసుకొస్తోంది. రష్యా చర్చలకు వచ్చి తీరుతుందని జెలెన్స్కీ ఇటీవల అన్నారు. అయితే ఇదంతా ఊహలపై నిర్మించుకున్న అంచనా. నిరంతర దాడులతో రష్యాకు గత్యంతరం లేని స్థితి కల్పిస్తే... ఆ దేశం చర్చలకు మొగ్గుచూపుతుందన్నది ఈ అంచనా సారాంశం. నిజానికి నాటో దేశాలు నిరంతరం సరఫరా చేస్తున్న మారణా యుధాలతో, యుద్ధ విమానాలతో ఉక్రెయిన్ దాదాపు మూడేళ్లుగా తలపడుతూనే ఉంది. పర్యవనసానంగా గతంలో కోల్పోయిన కొన్ని నగరాలను అది స్వాధీనం చేసుకుంది కూడా! కానీ రష్యా ప్రతిదాడులతో అవి ఎన్నాళ్లుంటాయో, ఎప్పుడు జారుకుంటాయో తెలియని స్థితి ఉంది. అత్యుత్సాహంతో ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధాలను, ఎఫ్–16 యుద్ధ విమానాలను తరలించిన అమెరికా నెలలు గడుస్తున్నా వాటి వినియోగానికి ఇంతవరకూ అనుమతినివ్వనే లేదు. ఉదాహరణకు ఉపరితలం నుంచి ప్రయోగించే సైనిక వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థ (ఏటీఏసీఎం) 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని అవలీలగా ఛేదిస్తుంది. బ్రిటన్–ఫ్రాన్స్ సంయుక్తంగా రూపొందించిన స్టార్మ్ షాడో 250 కిలోమీటర్ల దూరంలోని దేన్నయినా ధ్వంసం చేస్తుంది. ఈ రకం క్షిపణుల్ని గగనతలం నుంచి ప్రయోగిస్తారు. మరోపక్క జర్మనీ తయారీ టారస్ క్షిపణి కూడా ఇటువంటిదే. పైగా ఇది అమెరికా తయారీ క్షిపణిని మించి శక్తిమంతమైంది. 500 కిలోమీటర్లకు మించిన దూరంలోని లక్ష్యాన్ని గురిచూసి కొడుతుంది. ఇవన్నీ ఇంచుమించు ఏడాదిగా ఉక్రెయిన్ సైనిక స్థావరాల్లో పడివున్నాయి. ఎందుకైనా మంచిదని కాబోలు అమెరికా తన ఎఫ్–16లను నేరుగా ఉక్రెయిన్‌కు ఇవ్వకుండా నెదర్లాండ్స్, డెన్మార్క్‌లకు పంపి వారి ద్వారా సరఫరా చేసింది. వీటి వినియోగానికి ఉక్రెయిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని బ్రిటన్, ఫ్రాన్స్ పట్టుబడుతుండగా అమెరికాతోపాటు జర్మనీ కూడా ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అదే జరిగితే యుద్ధ తీవ్రత మరింత పెరిగి, రష్యా ఎంతకైనా తెగించే పరిస్థితి ఏర్పడొచ్చునని అమెరికా, జర్మనీ ఆందోళన పడుతున్నాయి. తన భూభాగంలోకి చొచ్చుకొచ్చి ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేస్తున్నా రష్యా నిర్లిప్తంగా ఉండిపోతుండగా ఈ అనవసర భయాలేమిటన్నది బ్రిటన్, ఫ్రాన్స్‌ల వాదన. కానీ ఒకసారంటూ ఎఫ్16లు వచ్చి పడితే, అత్యాధునిక క్షిపణులు విధ్వంసం సృష్టిస్తే రష్యా ఇలాగే ఉంటుందనుకోవద్దని పెంటగాన్ హెచ్చరిస్తోంది. తప్పనిసరైతే ఉక్రెయిన్ సరిహద్దుల ఆవల ఉన్న రష్యా స్థావరాలను లక్ష్యంగా చేసుకోమంటున్నది. ఈమధ్య క్రిమియాపై దాడికి అనుమతించింది. కానీ కూటమి మధ్య ఏకాభిప్రాయం కుదిరితే తప్ప రష్యా నగరాల జోలికి పోవద్దని చెబుతోంది. అంతగా భయపడితే అసలు ఇలాంటి ఆయుధాలు, యుద్ధ విమానాలు తరలించటం దేనికి? అవేమైనా ఎగ్జిబిషన్‌కు పనికొచ్చే వస్తువులా? వాటిని చూసి రష్యా ‘పాహిమాం’ అంటూ పాదాక్రాంతమవుతుందని అమెరికా నిజంగానే భావించిందా? యుద్ధం ఏళ్లతరబడి నిరంతరం కొనసాగుతుంటే ఎప్పుడో ఒకప్పుడు పరిస్థితి చేజారే ప్రమాదం ఉంటుంది. కనుక అమెరికా, పాశ్చాత్య దేశాలు వివేకంతో మెలగాలి. యుద్ధ విరమణకు సకల యత్నాలూ చేయాలి. దాడులతో ఒత్తిడి తెస్తే రష్యా దారికొస్తుందనుకుంటున్న ఉక్రెయిన్‌కు తత్వం బోధపడాలంటే ముందు అమెరికా సక్రమంగా ఆలోచించటం నేర్చుకోవాలి. ఉక్రెయిన్–రష్యా ఘర్షణ, గాజాలో ఇజ్రాయెల్ ఊచకోతలు ఆగనంతవరకూ ప్రపంచం సంక్షోభం అంచున ఉన్నట్టే లెక్క. అందుకే ప్రపంచ దేశాలు అప్రమత్తం కావాలి. శాంతి నెలకొల్పడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. -
ఉక్రెయిన్ పర్యటనపై.. పుతిన్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : ప్రధాని మోదీ ఇటీవల ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఆ పర్యటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడారు. ఈ మేరకు మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈరోజు పుతిన్‌తో మాట్లాడినట్లు ఎక్స్ వేదికగా తెలిపిన ప్రధాని మోదీ..భారత్-రష్యా దేశాల ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాలను మరింత బలోపేతం దిశగా అడుగులు పడే చర్యలపై చర్చించారు. దీంతో పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత ఎప్పుడూ తటస్థంగా లేదని, తాము ఎల్లప్పుడూ శాంతి వైపే ఉన్నామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌తో వివాదాన్ని శాతియుతంగా పరిష్కరించుకోవాలని, అక్కడ శాంతి-స్థిరత్వం కోసం భారత్ పూర్తి మద్దతు అందిస్తుందని చెప్పాము’అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. Spoke with President Putin today. Discussed measures to further strengthen Special and Privileged Strategic Partnership. Exchanged perspectives on the Russia-Ukraine conflict and my insights from the recent visit to Ukraine. Reiterated India’s firm commitment to support an early,…— Narendra Modi (@narendramodi) August 27, 2024 -
ఉక్రెయిన్ సైన్యం మెరుపు దాడులు.. రష్యాలో ఎమర్జెన్సీ!
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరో స్టేజ్‌కు చేరుకుంది. ఉక్రెయిన్ సైన్యం రష్యాను వణికిస్తోంది. రష్యా భూభాగంలోకి ప్రవేశించిన ఉక్రెయిన్ సైన్యం కస్క్ రీజియన్‌లో దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల మేర భూభాగాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. ఇక, తాజాగా సరిహద్దుల్లోని బెల్గోరోడ్‌ను టార్గెట్ చేసింది. దీంతో, ఆ ప్రాంతంలో రష్యా అధికారులు ఎమర్జెన్సీ విధించారు.కాగా, ఉక్రెయిన్ సేనలు రష్యా భూభాగంలోకి దూసుకెళ్తున్నాయి. రష్యా సైన్యాన్ని వెనక్కి తరుముకుంటూ ఆ దేశంలోకి ఉక్రెయిన్ సైన్యం అడుగుపెట్టింది. ఇక, ఇప్పటికే రష్యా భూభాగంలోకి ప్రవేశించిన ఉక్రెయిన్ సైన్యం కస్క్ రీజియన్‌లో దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల మేర భూభాగాన్ని తమ అధీనంలోకి తీసుకొందని ఆ దేశ సైనిక కమాండర్ జనరల్ ఒలెక్సాండర్ సిర్స్కీ వెల్లడించారు. మరోవైపు.. తాజాగా రష్యా సరిహద్దుల్లోని బోల్గోరోడ్పై దాడులు మొదలుపెట్టాయి. దీంతో, అక్కడ ఎమర్జెన్సీ విధించినట్లు అక్కడి గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్వోక్ ప్రకటించారు. దేశంలో ఫెడరల్ ఎమర్జెన్సీ విధించాలని తాము కోరుతున్నట్లు ఆయన వెల్లడించారు. Belgorod Governor Vyacheslav Gladkov's declaration of a state of emergency signals a significant escalation in Ukrainian cross-border attacks, reflecting a strategic shift towards targeting deep into Russian territory. The state of emergency is not just a security measure, but…— Prof. Jamal Sanad Al-Suwaidi (@suwaidi_jamal) August 14, 2024 ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ సైన్యం ముందుకు వస్తుండటంతో ఇప్పటికే ఇక్కడ పలు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించడం మొదలుపెట్టారు. గత వారం ఉక్రెయిన్ సేనలు వ్యూహం మార్చి రష్యా భూభాగంలో ఎదురుదాడులు మొదలుపెట్టాయి. ఇక, రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఇతర దేశాల సైన్యం రష్యా భూభాగంలోకి ప్రవేశించడం ఇదే తొలిసారి. ఇక బెల్గోరోడ్ ప్రాంతంలో షెబ్కినో నగరం, ఉస్టింకా గ్రామాలపై కీవ్ సేనలు డ్రోన్ దాడులు జరిపాయి. 🇺🇦Ukrainian soldiers are advancing to the front line, reinforcing their position in Kursk.#UkraineRussiaWar #Kurskregion #AFU #RussiaUkraineWar #Belgorod pic.twitter.com/gGJN0sAV4L— WorldCrisisMonitor (@WorldCrisisMoni) August 14, 2024 అయితే, ఉక్రెయిన్ దాడులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ స్పందించారు. ఈ క్రమంలో పుతిన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ సేనలతో సాగుతున్న భీకర పోరులో మాస్కో విజయం సాధిస్తుందన్నారు. రష్యా రక్షణ శాఖ కూడా ఉక్రెయిన్ డ్రోన్లను తమ సైన్యం కూల్చివేసినట్టు ప్రకటించింది. #UkraineRussiaWar Kursk operation is only the beginning, Ukraine is preparing the next strike, Putin destroying Russia #UkraineRussiaWar #Kursk #Russia #RussiaUkraineWar #RussiaUkraine #Ukraine #UkrainianArmy #UkraineRussiaConflict #Belgorod pic.twitter.com/PH8NzMTY6A— भीम सेना🦂(BALVEER SINGH JATAV) (@akshayhate) August 14, 2024 -
ట్రంప్‌కు పుతిన్ భయపడ్డారా?
న్యూయార్క్: అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో దేశంపై యుద్ధం చేయలేదని రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి, సెనేటర్ జేడీ వాన్స్ అన్నారు. ఆయన ఆదివారం సీబీఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైనా, రష్యాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాను పోటీదారుగా, ప్రత్యర్థిగా గుర్తిస్తూ ఆ దేశాన్ని ఎదుర్కొవడానికి గల బలమైన అంతర్జాతీయ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని తమ పార్టీ కోరుకుంటుందని అన్నారు. చైనాను నిరోధించగల అంతర్జాతీయ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటే మా టార్గెట్‌గా భావిస్తున్నాం. మేము చైనాతో యుద్ధానికి చేయకూడదని అనుకుంటున్నాం. కానీ ఖచ్చితంగా చైనా మకు విరోధి దేశమే. ఆ విషయం చైనీయులకు కూడా తెలుసు. చైనా టన్నుల కొద్దీ ఫెంటానిల్‌ను తయారు చేస్తుందిని, అమెరికాలోకి అనుమతిస్తున్నారు. అయితే డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ఈ విషయంలో ఏమీ చేయలేదని అన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ కార్మికులతో కూడిన శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ అమెరికాకు ఉంది. చైనాను వాణిజ్యపరంగా ఎదుర్కొవల్సి వస్తే.. పోరాడి గెలుస్తాం. కానీ కమలా హారిస్ చేసిన పనిని మేము చేయలేము. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మంచి సంబంధాలను కలిగి ఉన్నందుకు కమలా హారిస్‌తో సహా డెమోక్రాట్లు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి చేశారనే విషయం మనం గుర్తుంచుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, వ్లాదిమిర్ పుతిన్ మరో దేశంపై యుద్ధం చేయలేదని వాన్స్ అన్నారు. -
రష్యా పైశాచికత్వం!.. ఉక్రెయిన్ సైనికుల శరీర భాగాలతో..
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న వేళ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. రష్యా సైనికుల ఆగడాలు పీక్ స్టేజ్ చేరుకున్నాయి. యుద్ధంలో చనిపోయిన ఉక్రెయిన్ సైనికుల అవయవాలను రష్యా అమ్ముకుంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఉక్రెయిన్ యుద్ధ ఖైదీల కుటుంబాల సభ్యులు ఆరోపిస్తున్నారు.కాగా, ఫ్రీడమ్ టు డిఫెండర్స్ ఆఫ్ మారియుపోల్ గ్రూప్ అధిపతి లారీసా సలేవా తెలిపిన వివరాల ప్రకారం.. రష్యా సైన్యంలో చేతిలో బంధీలుగా ఉండి చనిపోయిన ఉక్రెయిన్ సైనికుల బాడీల్లో పలు అవయవాలు మిస్ అయినట్టు గుర్తించారు. అయితే, రష్యాకు సంబంధించిన జైళ్లలో ఉక్రెయిన్ సైనికులకు దారుణంగా హింసించి చంపేశారు. అనంతరం, వారి మృతదేహాలను ఉక్రెయిన్‌కు పంపించారు. అయితే, సైనికుల మృతదేహాలను కుటుంబ సభ్యులు పరిశీలించడంతో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.సైనికుల శరీరభాగాలు తేడాగా ఉండటంతో పరిశీలించగా.. వారి అవయవాలు దొంగిలించారని గుర్తించాం. రష్యా సైనికులు దారుణాలకు ఒడిగట్టారు. అవయవాలు దొంగతనం చేసిన బ్లాక్ మార్కెట్ వాటిని అమ్ముకున్నారు. ఉక్రెయిన్ ఖైదీలను చిత్ర హింసలకు గురి చేసి చంపి.. వారి అవయవాలతో వ్యాపారం చేస్తోంది. ప్రపంచం మొత్తం ఈ దారుణాల గురించి స్పందించాలి. వెంటనే ఈ దురగతాలను ఆపాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. రష్యా సైన్యం చేతిలో బంధీలుగా మారి విడుదలైన సైనికులు బలహీనంగా ఉన్నారని, వారి ఆరోగ్యం క్షీణిస్తోందని ఓ సైనికుడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆమె కోరారు. కాగా, ఈ ఆరోపణలను రష్యా తీవ్రంగా ఖండించింది. తమపై ఇలాంటి ఆరోపణలు కరెక్ట్ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మొదలై దాదాపు రెండేళ్లు గడుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు పదివేల మంది ఉక్రెయిన్ సైనికులు రష్యా సైన్యం చేతిలో బంధీలుగా ఉన్నట్టు సమాచారం. కాగా, వారంతా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అని సైనికుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. -
రష్యా సరిహద్దులో హైటెన్షన్.. యూఎస్ బాంబర్ విమానాలు ప్రత్యక్షం!
మాస్కో: అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ రష్యా, అమెరికా మధ్య ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తమ దేశ సరిహద్దులోకి వచ్చిన అమెరికాకు చెందన బాంబర్ విమానాలను రష్యా అడ్డుకుంది. దీంతో, రెండు దేశాల మధ్య ఘర్షణ మరోసారి మొదలైంది.వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన బాంబర్ విమానాలు తమ దేశ సరిహద్దు సమీపంలోకి వచ్చాయని రష్యా ఆరోపించింది. తమ సరిహద్దుకు సమీపించిన రెండు వైమానిక విమానాలను తమ ఫైటర్ జెట్లతో అడ్డుకున్నామని రష్యా రక్షణశాఖ వెల్లడించింది. వాటిని అమెరికా వాయుసేనకు చెందిన బీ-52హెచ్ వ్యూహాత్మక బాంబర్లుగా తమ సైన్యం గుర్తించిందని తెలిపింది. ఆర్కిటిక్‌లోని బారెంట్స్ సముద్రంలో ఈ పరిణామం చోటుచేసుకుందని వెల్లడించింది.BREAKING 🇷🇺⚡🇺🇸 Russia said Sunday that it scrambled fighter jets to prevent two US strategic bomber planes from crossing its border over the Barents Sea in the Arctic.“As the Russian fighters approached, the American strategic bombers corrected their flight course, moving away… pic.twitter.com/5kjGYWndfM— Lou Rage (@lifepeptides) July 21, 2024ఇదిలా ఉండగా.. అమెరికా మాత్రం రష్యా ఆరోపణలను ఖండించింది. అంతర్జాతీయ జలాల మీదుగా విమానాలతో గస్తీ నిర్వహిస్తుండటం సాధారణ ప్రక్రియేనని పేర్కొంది. తటస్థ గగనతలంలో వీటిని చేపట్టామని, అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగానే నడుచుకున్నామని స్పష్టం చేసింది. దీంతో, రెండు దేశాల మధ్య మళ్లీ మాటల యుద్ధం ప్రారంభమైంది. మరోవైపు.. ఇటీవలి కాలంలో అమెరికా పట్ల రష్యా దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై దాడుల సమయంలో నుంచి బైడెన్, పుతిన్ మధ్య పరోక్షంగా వార్ నడుస్తూనే ఉంది. ఇక, రష్యాపై అమెరికా ఆంక్షలు కూడా విధించింది. -
‘బ్రిక్స్’ పార్లమెంట్ రానున్నదా?
ఈ నెల 11–12 తేదీలలో జరిగిన బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సమావేశాల్లో రష్యా అ«ధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ బ్రిక్స్ పార్లమెంట్ ఏర్పాటు ప్రస్తావన చేశారు. ఆ మాట విని ప్రపంచమంతా ఉలిక్కిపడింది. ఆ కొత్త సంస్థ యూరోపియన్ పార్లమెంటుకు, లేదా అసలు ఐక్యరాజ్య సమితికే పోటీ కాకున్నా సమాంతర సంస్థ కాగలదా అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యింది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌కు పోటీయా అన్నట్లు ఇప్పటికే బ్రిక్స్ బ్యాంక్ ఏర్పడింది. బ్రిక్స్ దేశాల మధ్య, దానితో పాటు తమ ద్రవ్య మారకాలను అంగీకరించే దేశాలతో అమెరికన్ డాలర్ బదులు తమ కరెన్సీలలోనే లావాదేవీలు జరపటం పెరిగిపోతున్నది. ఈ పరిణామాలన్నీ అమెరికా ఆధిపత్యాన గల ఏకధ్రువ ప్రపంచాన్ని బహుళ ధ్రువ ప్రపంచంగా తిరుగులేకుండా మార్చుతున్నాయి.ప్రస్తుతం ప్రపంచమంతటా చర్చ జరుగు తున్న సరికొత్త విషయం బ్రిక్స్ పార్లమెంట్ నిజంగా ఏర్పడవచ్చునా అన్నది! ‘బ్రిక్స్’ గురించి తెలిసిందే. ‘బ్రిక్స్’ పార్లమెంటరీ ఫోరం మాట విన్నదే. కానీ ‘బ్రిక్స్’ పార్లమెంట్ కొత్త మాట. పార్లమెంటరీ ఫోరం సమావేశాలు ఈ నెల 11–12 తేదీలలో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగినప్పుడు, మొదటి రోజున ప్రారంభోపన్యాసం చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, ఉరుములేని పిడుగువలె బ్రిక్స్ పార్లమెంట్ ఏర్పాటు ప్రస్తావన చేశారు. ఆ మాట విని ప్రపంచమంతా ఉలికి పడింది. ఆయన ఆలో చనలోని ఉద్దేశమేమిటి? ‘బ్రిక్స్’ దేశాలు అందుకు సమ్మతిస్తాయా? ఆ కొత్త సంస్థ లక్ష్యాలేమిటి? అది యూరోపియన్ పార్లమెంటుకు, లేదా అసలు ఐక్యరాజ్య సమితికే పోటీ కాకున్నా సమాంతర సంస్థ కాగలదా? అనే ప్రశ్నలు శరపరంపరగా తలెత్త్తటం మొదలైంది. ఇది ముఖ్యంగా పాశ్చాత్య దేశాలకు కలవరపాటు కలిగిస్తున్నదనేది గమనించవలసిన విషయం.ఇందుకు సంబంధించి తెలుసుకోవలసిన సమాచారాలు కొన్నున్నాయి. అంతకన్నా ముఖ్యంగా అర్థం చేసుకోవలసిన అంత ర్జాతీయ విషయాలు చాలా ముఖ్యమైనవి కొన్నున్నాయి. ఇందులో మొదటగా సమాచారాలను చూద్దాం. ‘బ్రిక్స్’ అనే సంస్థ మొదట ‘బ్రిక్’ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) అనే పేరిట 2006లో ఏర్పడింది. తర్వాత 2011లో సౌత్ ఆఫ్రికా చేరికతో ‘బ్రిక్స్’ అయింది. ఈ సంవత్సరం ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరాయి. తమను కూడా చేర్చుకోవాలంటూ మరొక పాతిక దేశాల వరకు దరఖాస్తు చేసుకున్నాయి. ‘బ్రిక్స్’ సభ్యదేశాలు 2009లో పార్లమెంటరీ ఫోరంను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ ఫోరం 10వ సమావేశాలు ఈ నెలలో జరిగినపుడే పుతిన్ తన ప్రతిపాదన చేశారు. ఆ సమావేశంలో మన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా పాల్గొన్నారు. నిజానికి బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం అన్నది సభ్య దేశాల పార్లమెంట్ స్పీకర్ల ఫోరం. అందుకు భిన్నంగా, పుతిన్ ప్రతిపాదన కొత్తగా ఒక ఉమ్మడి పార్లమెంటును ఏర్పాటు చేసుకోవటం. ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సమావేశాలు వచ్చే అక్టోబర్‌లో రష్యాలోని కజాన్ నగరంలో జరగ నున్నాయి. ఈ ప్రతిపాదన అపుడు అధికారికంగా చర్చకు వచ్చి,అందరూ ఆమోదించే పక్షంలో ఆచరణకు వస్తుంది. ఈలోగా ఈ విషయమై ప్రపంచమంతటా చర్చలు సాగుతాయి. మరొకవైపు సభ్య దేశాల మధ్య ముందస్తు సంప్రదింపులు జరగగలవని వేరే చెప్ప నక్కరలేదు. పోతే, బ్రిక్స్ లక్ష్యాలే బ్రిక్స్ పార్లమెంటు లక్ష్యాలు, విధులు కాగలవని భావించవచ్చు. బ్రిక్స్ 2006లో ఏర్పడింది. ఎందుకు? ఈ 18 సంవత్సరాలలో ఆ సంస్థ చేసిందేమిటి? అన్నవి మొదట ఉత్పన్న మయే ప్రశ్నలు. ఇది ప్రధానంగా ఆర్థిక, వాణిజ్యపరమైన సంబంధాల కోసం ఏర్పడినటువంటిది. పరస్పర సంబంధాలతో పాటు ఇతర దేశా లతో ఆర్థిక, వాణిజ్య సంబంధాల అభివృద్ధి కూడా ఈ పరిధిలోకి వస్తుంది. బ్రిక్స్‌కు రాజకీయపరమైన, సైనికమైన, వ్యూహాత్మకమైన లక్ష్యాలు ఏవీ లేవని, గత 18 సంవత్సరాలుగా అదే ప్రకారం పని చేస్తున్నదనేది గమనించవలసిన విషయం. అంతే గమనించవలసిందేమంటే తన ఆర్థిక లక్ష్యాల ప్రకారం బ్రిక్స్ చాలా సాధించింది. ఉదాహరణకు తాజా లెక్కల ప్రకారం, పాశ్చాత్య దేశాల కూటమి అయిన జీ–7 జీడీపీ ప్రపంచంలో 29 శాతం మాత్రమే కాగా, బ్రిక్స్ జీడీపీ 36.8 శాతానికి చేరింది. ఆర్థిక రంగంలో జరుగుతున్నదాని సూచనలను బట్టి చూడగా ఈ వ్యత్యాసం ఇంకా పెరుగుతూ పోగలదన్నది నిపుణుల అంచనా. అది చాల దన్నట్లు మునుముందు సౌదీ అరేబియా, ఇండోనేషియా, మెక్సికో తదితర దేశాలు చేరినపుడు పరిస్థితి ఏమిటో ఊహించవచ్చు. అమె రికా శిబిరానికి బ్రిక్స్ అంటే సరిపడకపోవటానికి ముఖ్యకారణం ఇదే. లోగడ ఆసియాలో ఏషియాన్, ఆఫ్రికాలో ఎకోవాస్, ఇఎసి, లాటిన్ అమెరికాలో సదరన్ కామన్ మార్కెట్ వంటివి ఏర్పడ్డాయి. ఏషియాన్ గొప్పగా విజయవంతం కాగా తక్కినవి అంతగా కాలేదు. పైగా వాటిలో అమెరికా జోక్యాలు బాగా సాగినందున తమకు పోటీగా మారలేదు. తమను అధిగమించటం అంతకన్నా జరగలేదు. బ్రిక్స్ రికార్డు వీటన్నిటికి భిన్నంగా మారింది. ఆ సంస్థ ఆమెరికా జోక్యానికి సమ్మతించలేదు. ఇండియాతో సహా ఎవరూ ఒత్తిళ్లకు లొంగలేదు. ఇది చాలదన్నట్లు అర్థికాభివృద్ధిలో తమను మించిపోతున్నారు. ఒత్తిళ్లను కాదని ఇదే సంవత్సరం ఈజిప్టు, యూఏఈ వంటివి చేరాయి. ఇరాన్‌ను చేర్చుకోరాదన్న ఒత్తిడికి బ్రిక్స్ సమ్మతించలేదు. అదే పద్ధతిలో సౌదీ, టర్కీ, ఇండోనేషియా, లిబియా, మెక్సికో వంటివి ముందుకు వస్తున్నాయి. ఇదంతా చాలదన్నట్లు, ప్రపంచంపై పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆధిపత్యాన్ని సవాలు చేసే పరిణామాలు మరికొన్ని జరుగుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌కు పోటీయా అన్నట్లు బ్రిక్స్ బ్యాంక్ ఒకటి 2014 లోనే ఏర్పడింది. అమెరికన్ డాలర్ ప్రాబల్యాన్ని అరికట్టేందుకు బ్రిక్స్ కరెన్సీ అయితే ఇంకా రూపొందలేదు గానీ, బ్రిక్స్ దేశాలకు చెల్లింపుల కోసం బ్రిక్స్ చెయిన్ పేరిట ఒక సాధనం చలామణీలోకి వచ్చింది. అట్లాగే ఈ దేశాల మధ్య, దానితో పాటు తమ ద్రవ్య మార కాలను అంగీకరించే దేశాలతో అమెరికన్ డాలర్ బదులు తమ కరెన్సీ లలోనే లావాదేవీలు జరపటం పెరిగిపోతున్నది. బ్రిక్స్ బ్రిడ్జ్ పేరిట మరొక చెల్లింపుల పద్ధతి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నింటి ప్రభావాలతో పాశ్చాత్య ప్రపంచపు ఆర్థిక ప్రాబల్యం, పారిశ్రామికాభివృద్ధి, వాణిజ్యం క్రమంగా బలహీనపడుతున్నాయి. ఉదాహరణకు ప్రస్తుత సంవత్సరంలో బ్రిక్స్ సగటు అర్థికాభివృద్ధి 3.6 శాతం మేర, జీ–7 దేశాలది కేవలం 1 శాతం మేర ఉండగలవని అంచనా. ప్రపంచంలో ఇప్పటికే రెండో అతిపెద్ద ఆర్థికశక్తిగా మారిన చైనా మరొక దశాబ్దం లోపలే అమెరికాను మించగలదన్నది అంతటా వినవస్తున్న మాట. ఈ పరిణామాలన్నీ అమెరికా ఆధిపత్యాన గల ఏకధ్రువ ప్రపంచాన్ని బహుళధ్రువ ప్రపంచంగా తిరుగులేకుండా మార్చుతున్నాయి. ఈ శతాబ్దం ఆసియా శతాబ్దం కాగలదనే జోస్యాలు ఆ విధంగా బలపడుతున్నాయి. చైనా ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో అమెరికా ఒత్తిళ్లను కాదని ఇప్పటికి 150 దేశాలు చేరటం, అందులో వారి శిబిరానికి చెందినవి కూడా ఉండటం ఈ ఆర్థిక ధోరణులకు దోహదం చేస్తున్నది.ఈ విధమైన ప్రభావాలను ముందుగానే అంచనా వేసి కావచ్చు అమెరికన్లు, యూరోపియన్లు మొదటినుంచే బ్రిక్స్‌ను, బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివును అడ్డుకునేందుకు, బ్రిక్స్‌లోని సభ్య దేశాలను ఒత్తిడి చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తూ వస్తున్నాయి. రకరకాల ఆంక్షలు ఏదో ఒక సాకుతో విధించటం (ఇండియాపై కూడా), వివిధ దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను భంగపరచజూడటం అందులో భాగమే. భారత, రష్యాల విషయంలోనూ అదే వైఖరి చూపటానికి తాజా ఉదాహరణ ఈ నెల ఎనిమిదిన ప్రధాని మోదీ, పుతిన్‌ను కలవటంపై ఆగ్రహించటం. అమెరికా శిబిరం ప్రజాస్వామ్యమనీ, ఆసియా దేశాల స్వేచ్ఛ అనీ, అంతర్జాతీయ నియమాలకూ, ఐక్య రాజ్యసమితి ఛార్టర్‌కూ కట్టుబడటమనీ నీతులు చాలానే చెప్తుంది. కానీ అందుకు విరుద్ధమైన తమ చర్యల గురించి ఎన్ని రోజుల పాటైనా చెప్పవచ్చు.వీటన్నింటికి విరుగుడుగా తక్కిన ప్రపంచ దేశాలు తీసుకుంటున్న వివిధ చర్యలలో, బ్రిక్స్ పార్లమెంట్ అనే కొత్త ప్రతిపాదన ఒక ముందడుగు కాగల అవకాశం ఉంది. ప్రపంచ దేశాల మధ్య సమా నత్వ ప్రాతిపదికగా పరస్పర సహకారానికి, ఇతోధికాభివృద్ధికి అవస రమైన చర్చలు బ్రిక్స్ పార్లమెంటులో జరగాలన్నది తన ఆలోచన అయినట్లు పుతిన్ చెప్తున్నారు. టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
నాటో భేటీ వేళ రష్యా యాత్రా?
వాషింగ్టన్: నాటో శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో పర్యటించడంపై అమెరికా అసంతృప్తితో ఉన్నట్టు బ్లూంబర్గ్ నివేదిక పేర్కొంది. ఇది భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపగలదని ఆ దేశ ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు చెప్పుకొచి్చంది. ‘‘పుతిన్‌ను మోదీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న తీరు అమెరికా ప్రభుత్వం లోపల, వెలుపల విమర్శలకు దారి తీసింది. వాషింగ్టన్లో నాటో సదస్సు జరుగుతుండగా మోదీ రష్యాలో పర్యటించడం బైడెన్ యంత్రాంగానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టించింది. పుతిన్‌ను అంతర్జాతీయ సమాజంలో ఒంటరిని చేయాలన్న నాటో ప్రయత్నాలకు ఇది గండి కొట్టింది. అందుకే అమెరికా విదేశాంగ శాఖ ఉప మంత్రి కర్ట్ కాంప్‌బెల్ జూలై మొదట్లోనే భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాట్రాతో మాట్లాడారు. మోదీ రష్యా పర్యటన షెడ్యూల్ మార్చుకోవాల్సిందిగా కోరారు’’ అని నివేదిక వివరించింది. ఈ ఉదంతంపై విదేశాంగ శాఖ స్పందించాల్సి ఉంది. అమెరికాతో స్నేహాన్ని తేలిగ్గా తీసుకోవద్దని భారత్‌లో ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెట్టీ గురువారం మీడియాతో సమావేశంలో నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. అవి రష్యా పర్యటనను ఉద్దేశించేనని చెబుతున్నారు. రష్యాను విశ్వసనీయమైన దీర్ఘకాలిక మిత్ర దేశంగా భారత్ పరిగణించడం పొరపాటని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ అభిప్రాయపడ్డారు. -
మా ఆర్మీలో భారతీయులు ఉండాలనుకోలేదు: రష్యా
ఢిల్లీ: భారతీయ పౌరులు రష్యా దేశ సైన్యంలో భాగం కావాలని తాము ఎప్పుడూ కోరుకోలేని భారత్‌లోని రష్యా దౌత్యవేత్త రోమన్ బాబుష్కిన్ అన్నారు. ప్రధాని మోదీ రష్యా పర్యటన ముగిసిన నేపథ్యంలో బుధవారం బాబుష్కిన్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘భారతీయ పౌరులు రష్యా సైన్యంలో భాగం కావాలని మేము ఎప్పుడూ కోరుకోలేదు. ఏజెంట్లు మోసం చేయటం వల్ల కొంత మంది టూరిస్టు విసాలపై వచ్చి రష్యా ఆర్మీలో చేరుతున్నారు. ఈ వ్యవహారంలో ఇరు దేశాలు దర్యాప్తు చేసి సమస్యకు త్వరలోనే పరిష్కారం కనుక్కొని చర్యలు తీసుకుంటాం. ఈ వ్యహారంపై భారత్, రష్యా ఒకే ఆలోచనతో ఉంది. అందుకే త్వరలో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయాలనుకోవటం లేదు.మేము చాలా స్పష్టంగా ఉన్నాం. మా సైన్యంలో భారత పౌరులు భాగంకావాలని కోరుకోవటం లేదు. ఈ విషయంపై ఇప్పటి వరకు రష్యా అధికారులు సైతం ఎటువంటి ప్రకటన చేయలేదు. చాలా మంది భారతీ పౌరులు కేవలం డబ్బుల కోసమే రష్యా ఆర్మీలో చేరుతన్నారు. అలాంటి వారిని మేము ఎట్టిపరిస్థితుల్లో కూడా చేర్చుకోము. కేవలం 50 నుంచి 100 మంది భారతీయులు మాత్రమే రష్యా సైన్యంలో ఉన్నారు. ఇది అంత ప్రభావం చూపే విషయం కాదు. రష్యా ఆర్మీలో సహయకులుగా చేరుతున్న పలువురు భారతీయులకు సరైన విసాలు కూడా లేవు. చాలా వరకు వారంతా టూరిస్ట్ వీసా మీద రష్యాకు వస్తున్నారు ’’ అని అన్నారు.ఇది చదవండి: భారతీయులకు భారీ ఊరట.. మోదీ పర్యటనతో పుతిన్ కీలక నిర్ణయంఇక.. రెండు రోజుల రష్యా పర్యటనలో ప్రధాని మోదీ.. రష్యా ఆర్మీలో ఉన్న భారతీయ పౌరులను విడుదల చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలు జరిపారు. దీనిపై రష్యా సైతం సానూకూలంగా స్పందిస్తూ.. తమ ఆర్మీలో సహయకులుగా పనిచేస్తున్న భారతీయులను స్వదేశానికి పంపిస్తామని హామీ ఇచ్చింది. -
మన అభివృద్ధి ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది
మాస్కో: భారత్ అద్భుత పురోగతి సాధిస్తోందని, దేశాభివృద్ధి చూసి ప్రపంచమే నివ్వెరపోతోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మాస్కో పర్యటనలో ఉన్న మోదీ మంగళవారం అక్కడి ప్రవాసభారతీయులనుద్దేశించి ప్రసంగించారు. ‘మోదీ మోదీ’, ‘మోదీ ఉంటే ఏదైనా సాధ్యమే’ నినాదాల నడుమ నరేంద్ర మోదీ మాట్లాడారు. ‘‘ 140 కోట్ల మంది భారతీయుల శక్తిసామర్థ్యాలను వినియోగించుకుంటూ భారత్ దీటుగా ఎదుగుతోంది. భారతీయులంతా వికసిత్ భారత్ కలను నిజంచేసుకునేందుకు కృతనిశ్చయంతో ముందుకుసాగుతున్నారు. 2014కు ముందు భారత్‌లో పరిస్థితి వేరేలా ఉండేది.కానీ ఇప్పుడు భారత్ పూర్తి ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతోంది. ఆత్మవిశ్వాసమే భారత్‌కున్న అతిపెద్ద మూలధనం. మీలాంటి ప్రజల ఆశీస్సులు ఉంటే పెద్ద ఆశయాలను సైతం దేశం సాధించగలదు. అనుకున్న లక్ష్యాలను భారత్ చేరుకోవడం మీరందరూ చూస్తున్నారు. రాబోయే రోజుల్లో భారత్ తన నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తూ నూతన అధ్యాయనాన్ని లిఖించబోతోంది. సవాళ్లకే సవాల్ విసిరే గుణం నా డీఎన్ఏలోనే ఉంది. సరిగ్గా నెలరోజుల క్రితం మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టా. మూడో దఫాలో మూడు రెట్లు వేగంతో పనిచేస్తా.భారత ఆకాంక్షలను నెరవేరుస్తా. భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరింపజేయాలనేదే మా ప్రభుత్వ సంకల్పం. పేదల కోసం మూడు కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తాం. మూడు కోట్ల మంది పేద మహిళలు లక్షాధికారులను చేస్తాం. గత పదేళ్లలో భారత్‌లో కనిపించిన అభివృద్ధి ఒక ట్రైలర్ మాత్రమే. వచ్చే పదేళ్లలో అంతకుమించిన అభివృద్ధిని మీరు చూడబోతున్నారు’’ అని మోదీ అన్నారు.సర్వకాల సర్వావస్థలయందు స్నేహితుడే రష్యాతో భారత బంధాన్ని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘రష్యా అనే పేరు వినబడగానే ప్రతి భారతీయుని మదిలో మెదిలే ఒకే ఒక్క వాక్యం.. సర్వకాల సర్వావస్థలయందు తోడుగా నిలిచే స్నేహితుడు. నమ్మకమైన నేస్తం’ అని మోదీ కొనియాడారు. ‘అన్ని కాలాల్లోనూ రష్యాతో భారత స్నేహం కొనసాగుతుంది. రష్యాలో గడ్డకట్టే చలిలో ఉష్ణోగ్రత సున్నా డిగ్రీ సెల్సియస్‌కు పడిపోతుందేమోగానీ ఇండియా–రష్యా స్నేహబంధం ఎల్లప్పుడూ ‘ప్లస్’లోనే నులివెచ్చగా ఉంటుంది అని మోదీ అన్నారు. రష్యాతో పర్యాటకం, వాణిజ్యం, విద్యా రంగాల్లో బంధం బలోపేతానికి భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాలో కొత్తగా రెండు నగరాల్లో భారత కాన్సులేట్లను ఏర్పాటుచేయబోతోంది. ప్రధాని మోదీ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. కజన్, యెకటేరిన్‌బర్గ్ నగరాల్లో వీటిని నెలకొల్పుతారు. ప్రస్తుతం సెయింట్‌పీటర్స్‌బర్గ్, వ్లాడివోస్టోక్ నగరాల్లో మాత్రమే భారత కాన్సులేట్లు పనిచేస్తున్నాయి.ఇరుదేశాల ద్వైపాక్షిక బంధాల బలోపేతానికి కృషిచేస్తున్నందుకు సూచికగా ప్రధాని మోదీని పుతిన్ ‘ ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’ పురస్కారంతో సత్కరించారు. రష్యా అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయ నేతగా మోదీ రికార్డ్ సృష్టించారు. ఈ పురస్కారాన్ని భారతీయులకు అంకితం చేస్తున్నానని పురస్కారం స్వీకరించిన సందర్భంగా మోదీ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. రష్యాలో తొలి క్రైస్తవ మత బోధకుడైన సెయింట్ ఆండ్రూ పేరిట 1698 సంవత్సరంలో రష్యా చక్రవర్తి పీటర్ కృషితో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడం ప్రారంభించారు. -
బాంబులు, తూటాల నడుమ... శాంతి చర్చలు సాగవు: ప్రధాని మోదీ
మాస్కో: బాంబులు, తుపాకులు, తూటాల వర్షం నడుమ శాంతి చర్చలు ఎప్పటికీ ఫలప్రదం కాబోవని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారం ఎప్పటికైనా చర్చలతోనే లభిస్తుంది తప్ప యుద్ధ క్షేత్రంలో కాదని కుండబద్దలు కొట్టారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో పిల్లల ఆస్పత్రిపై జరిగిన క్షిపణి దాడిపై తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. రెండు రోజుల రష్యా పర్యటనలో భాగంగా మంగళవారం ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో క్రెమ్లిన్ భవనంలో మోదీ 22వ ఇండో–రష్యా శిఖరాగ్ర చర్చలు జరిపారు. ముక్కుపచ్చలారని అమాయక చిన్నారులు దాడిలో పదుల సంఖ్యలో బలైన వైనం హృదయాలను తీవ్రంగా కలచివేస్తోందంటూ ఆవేదన వెలిబుచ్చారు.చర్చల వివరాలను మీడియాతో పంచుకుంటూ విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాట్రా ఈ మేరకు వెల్లడించారు. పుతిన్, మోదీ గాఢాలింగనంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర అభ్యంతరం వెలిబుచి్చన నేపథ్యంలో ప్రధాని తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సోమవారం పుతిన్‌తో వ్యక్తిగత సంభాషణ సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధంపై లోతుగా చర్చించినట్టు మోదీ వెల్లడించారు. ‘‘సమస్యకు చర్చల ద్వారానే ముగింపు పలకాలన్నదే భారత వైఖరి. ఈ విషయాన్ని అంతర్జాతీయ సమాజానికి స్పష్టం చేయదలచా. అందుకు అన్నివిధాలా సాయపడేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధమే. నేను చెప్పిన అన్ని విషయాలనూ పుతిన్ ఓపిగ్గా విన్నారు.ఉక్రెయిన్ సమస్యపై అభిప్రాయాలను పంచుకున్నారు. యుద్ధానికి తెర దించేందుకు ఆసక్తికరమైన మార్గాలు చర్చ సందర్భంగా తెరపైకొచ్చాయి’’ అని ప్రధాని వివరించారు. భారత్‌ను పట్టి పీడిస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని కూడా ప్రస్తావించారు. ఉక్రెయిన్ సంక్షోభ నివారణకు మోదీ చేస్తున్న ప్రయత్నాలకు పుతిన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపినట్టు టాస్ వార్తా సంస్థ పేర్కొంది. అన్ని అంశాలపైనా మోదీ, తాను మనసు విప్పి మాట్లాడుకున్నట్టు పుతిన్ వెల్లడించారు.అనంతరం ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ నేతలిద్దరూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మాస్కో సిటీ హాల్‌పై, కశీ్మర్లో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదుల ప్రాణాంతక దాడిని తీవ్రంగా నిరసించారు. ఉగ్రవాదంపై పోరులో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని ఇవి గుర్తు చేశాయన్నారు. ఉక్రెయిన్ సమస్య పరిష్కారానికి మోదీ చేసిన శాంతి ప్రతిపాదనలతో నాటో కూటమి ఏకీభవించకపోవచ్చని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ అన్నారు.ద్వైపాక్షిక బంధం మరింత సుదృఢంకొన్నేళ్లుగా ప్రపంచాన్ని వేధిస్తున్న ఆహార, ఇంధన, ఎరువుల కొరత భారత్‌లో రైతులకు ఎదురవకుండా రష్యా అందిస్తున్న సహకారం అమూల్యమంటూ మోదీ కొనియాడారు. ‘‘పుతిన్‌తో చర్చలు అత్యంత ఫలప్రదంగా సాగాయి. వర్తకం, వాణిజ్యం, భద్రత, వ్యసాయం, టెక్నాలజీ వంటి పలు రంగాలపై లోతుగా చర్చించాం. పలు రంగాల్లో రష్యాతో బంధాన్ని మరింతగా విస్తరించడమే మా లక్ష్యం’’ అని స్పష్టం చేశారు. ఐరాసతో పాటు పలు అంతర్జాతీయ వేదికలపై పలు అంశాల్లో భారత్, రష్యా సన్నిహితంగా కలిసి పని చేస్తున్నాయని పుతిన్ అన్నారు.‘‘ఇరు దేశాలదీ దశాబ్దాలకు పైబడ్డ సుదృఢమైన బంధం. భారత్‌తో రష్యా వర్తకం గతేడాది ఏకంగా 66 శాతం పెరిగింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే మరో 20 శాతం పెరుగుదల నమోదైంది’’ అని అన్నారు. అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌లో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్రానికి మోదీని ఈ సందర్భంగా పుతిన్ ఆహా్వనించారు. అనంతరం మోదీ రష్యా పర్యటన ముగించుకుని ఆస్ట్రియా రాజధాని వియన్నా చేరుకున్నారు. భారత ప్రధాని ఆ దేశంలో పర్యటించనుండటం 41 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.రష్యా సైన్యంలోని భారతీయులకు విముక్తి!ఉక్రెయిన్ కదనరంగంలో రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను స్వదేశానికి పంపేందుకు రష్యా అంగీకరించింది. పుతిన్ వద్ద ఈ అంశాన్ని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారని సబంధిత వర్గాలు వెల్లడించాయి. యుద్ధంలో పని చేస్తున్న భారతీయులను క్షేమంగా స్వదేశానికి పంపిస్తామని పుతిన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రష్యాలో ఉపాధి కల్పిస్తామంటూ కొందరు భారతీయ యువకులను ఏజెంట్లు రష్యాకు తీసుకెళ్లి అక్కడి సైన్యం సహాయకులుగా నియమించిన సంగతి తెలిసిందే. -
ఉక్రెయిన్‌తో సంక్షోభం.. శాంతి పునరుద్ధరణకు భారత్ సిద్ధం: పుతిన్‌తో మోదీ
మాస్కో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం మాస్కో చేరుకున్న ఆయనకు.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేకంగా ఆతిథ్యమిచ్చారు. పుతిన్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ భేటీలో రష్యా ఆర్మీలో పనిచేస్తున్న భారతీయుల విముక్తి, ఉక్రెయిన్ యుద్దం వంటి కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.ఉక్రెయిన్‌తో రస్యా కొనసాగుతున్న యుద్ధాన్ని ప్రస్తావిస్తూ.. యుద్ధం దేనికి పరిష్కారం అవ్వదని ప్రధాని మోదీ పుతిన్‌తో అన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో శాంతిని పునరుద్ధరించడానికి సహాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉన్నట్లు పుతిన్‌కు చెప్పారు. భారత్ శాంతికి అనుకూలంగా ఉందని తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి ఇద్దరూ ‘ఓపెన్ మైండ్’తో చర్చలు జరిపినట్లు మోదీ చెప్పారు.“ఉక్రెయిన్‌తో యుద్ధం గురించి ఓపెన్ మైండ్‌తో చర్చించడం నాకు సంతోషంగా ఉంది. యుద్ధంపై ఒకరి ఆలోచనలను మరొకరు చాలా గౌరవంగా విన్నాం. యుద్ధమైనా, ఘర్షణలైనా, ఉగ్రదాడులైనా.. ఎవరికైనా ప్రాణహాని జరిగినప్పుడు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరికీ బాధ కలుగుతుంది. అమాయక పిల్లలు చనిపోవడం చూస్తుంటే హృదయాన్ని కదిలిస్తుంది. ఆ బాధ వర్ణనాతీతం. దీనిపై కూడా నేను మీతో చర్చించాను," అని మోదీ పేర్కొన్నారు.రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి పునరుద్ధరణకు సహకరించేందుకు భారత్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని పుతిన్‌తో చెప్పారు.భారత్ శాంతికి అనుకూలంగా ఉందని మేము మీతో పాటు ప్రపంచానికి హామీ ఇస్తున్నానని తెలిపారు. ఇక శాంతిపై పుతిన్ మాట్లాడిన మాటలు ఆశాజనకంగా ఉన్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: పుతిన్‌కు మోదీ హగ్.. జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు -
రష్యా పర్యటనలో మోదీ, పుతిన్ ఆలింగనం.. స్పందించిన జెలెన్స్కీ
న్యూఢిల్లీ: భారత్, రష్యాల మైత్రీ బంధాన్ని మరింత బలంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రధాని మోదీ రెండ్రోజుల నిమిత్తం రష్యాలో పర్యటిస్తున్నారు. 22వ ఇండో–రష్యా శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మోదీ సోమవారం రష్యా చేరుకున్నారు. మంగళవారం ఉదయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని మోదీ అల్పాహారం అనంతరం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ధ్వైపాక్షిక సంబంధాలపై విస్తృతస్థాయి చర్చలు జరిపారు.తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ స్పందించారు. మోదీ పర్యటన, పుతిన్‌ను ఆలింగనం చేసుకోవడంపై తాను తీవ్ర నిరాశకు గురయ్యానని తెలిపారు. ఇది శాంతి ప్రయత్నాలలకు పెద్ద దెబ్బగా భావించారు.రష్యా క్షిపణుల దాడికి గురైన పిల్లల ఆసుపత్రికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. ‘ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య నేత(మోదీ) మాస్కోలో ప్రపంచంలోని అత్యంత రక్తపాత నేరస్థుడిని కౌగిలించుకోవడం చాలా నిరాశకు గురి చేసింది. ఇది శాంతి ప్రయత్నాలకు ఓ వినాశకరమైన దెబ్బ’. అని పేర్కొన్నారు.లోక్‌సభ ఎన్నికల తర్వాత తమ దేశంలో పర్యటించాల్సిందిగా ప్రధాని మోదీని జెలెన్స్కీ ఆహ్వానించారు. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం మోదీని ఆహ్వానించారు. ఈ ఏడాది మార్చిలో రష్యా అధ్యక్షుడిగా పుతిన్ తిరిగి ఎన్నికైన తర్వాత ప్రధాని ఇరువురు నేతలతో మాట్లాడారు.మోదీ, పుతిన్ మధ్య.. ఉక్రెయిన్ను రష్యా దురాక్రమించిన అంశం, రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా భారతీయులను రిక్రూట్ చేసుకుని ఉక్రెయిన్ యుద్ధక్షేత్రాలకు తరలించిన ఉదంతాలు చర్చకు వచ్చింది. తమ ఆర్మీలో పనిచేస్తున్న భారతీయుల్ని స్వదేశానికి పంపించేలా పుతిన్ అంగీకరిస్తున్నట్లు జాతీయ, అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో రష్యా సైన్యంలోని భారతీయులకు విముక్తి లభించినట్లైంది.కాగా 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక మోదీ రష్యాకు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరిసారి 2022 సెప్టెంబర్‌లో ఉజ్బెకిస్థాన్‌లో షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అధ్యక్షుడు పుతిన్‌ను కలిశారు. ఆ సమయంలో ‘ఇది యుద్ధ యుగం కాదు’ అని పుతిన్‌తో అన్నారు. చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే వివాదానికి పరిష్కారం కనుగొనగలమని నొక్కి చెప్పారు. -
భారతీయులకు భారీ ఊరట.. మోదీ పర్యటనతో పుతిన్ కీలక నిర్ణయం
మాస్కో: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా ఆర్మీలో భారతీయులు సైతం పనిచేస్తున్నారు. ఇటీవల యుద్ధ ప్రాంతాల్లో ఉక్రెయిన్ సైనికులు జరిపిన దాడిలో రష్యా ఆర్మీలో పని చేస్తున్న ఇద్దరు భారతీయులు మరణించారు.అయితే రష్యా పర్యటనలో మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చించారు. అనంతరం తమ ఆర్మీలో పనిచేస్తున్న భారతీయుల్ని స్వదేశానికి పంపించేలా అంగీకరిస్తున్నట్లు పుతిన్ చెప్పారంటూ జాతీయ, అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.ఏజెంట్ల చేతిలో మోసంకొంతకాలం క్రితం విదేశాల్లో భారీ మొత్తంలో జీతాలు చెల్లిస్తామంటూ పలువురు ఏజెంట్లు సుమారు 12 మంది భారతీయుల్ని మోసపూరితంగా హద్దులు దాటించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేసేందుకు రష్యా ఆర్మీకి సహాయంగా పంపించారు. రష్యా ఆర్మీ ధరించిఅందుకు ఊతం ఇచ్చేలా ఈ ఏడాది ప్రారంభంలో పంజాబ్, హర్యానాలకు చెందిన వారు రష్యా ఆర్మీ ధరించి ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న వీడియోలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోల్లో ఎక్కువ శాలరీ వస్తుందనే ఆశతో ఏజెంట్లను ఆశ్రయిస్తే వాళ్లు తమని అక్రమంగా రష్యా ఆర్మీలోకి జాయిన్ చేయించినట్లు తెలిపారు. వేరే గత్యంతరం లేక రష్యా ఆర్మీలో పని చేస్తున్నామని, తమని రక్షించమని కోరుకుంటూ ఓ వీడియోను విడుదల చేశారు.ఆ వీడియోపై కేంద్రం స్పందించింది. అక్రమంగా రష్యా ఆర్మీలో పనిచేస్తున్న రక్షించేలా పుతిన్‌ను సంప్రదిస్తామని హామీ ఇచ్చింది. తక్షణ చర్యల్లో భాగంగా పౌరుల్ని మోసం చేస్తున్న ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. రష్యాలో భారత్ దౌత్య విజయంతాజా పర్యటనలో మోదీ రష్యా ఆర్మీలో భారతీయుల అంశంపై పుతిన్ చర్చించడం, అందుకు ఆయన భారతీయుల్ని విడుదల చేసేందుకు విముఖత వ్యక్తం చేయడం రష్యాలో భారత్ దౌత్య విజయం సాధించినట్లైంది. -
రష్యా పర్యటనలో ప్రధాని మోదీ (ఫోటోలు)
-
మాస్కోలో మోదీ. నేడు పుతిన్‌తో ప్రధాని మోదీ విస్తృతస్థాయి చర్చలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
India-Russia relations: మాస్కోలో మోదీ.. నేడు పుతిన్‌తో చర్చలు
మాస్కో/న్యూఢిల్లీ: భారత్, రష్యాల మైత్రీ బంధాన్ని నూతన సమున్నత శిఖరాలకు చేర్చడమే లక్ష్యంగా ప్రధాని మోదీ రెండ్రోజుల రష్యా పర్యటన ఆరంభమైంది. 22వ ఇండో–రష్యా శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మోదీ సోమవారం రష్యాకు విచ్చేశారు. మంగళవారం ఉదయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని మోదీ అల్పాహారం అనంతరం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. విస్తృతస్థాయి చర్చలు జరపనున్నారు. తర్వాత దౌత్య, అధికారిక బృందాలతో కలిసి వార్షిక శిఖరాగ్ర సదస్సులో ఇరుదేశాల మధ్య పటిష్ట మైత్రి, సహకార బంధంపై సమగ్ర, లోతైన చర్చలు జరపనున్నారు. ఉక్రెయిన్ను రష్యా దురాక్రమించిన అంశం చర్చకొచ్చే అవకాశముంది. రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా భారతీయులను రిక్రూట్ చేసుకుని ఉక్రెయిన్ యుద్ధక్షేత్రాలకు తరలించిన ఉదంతాలు చర్చకొచ్చే అవకాశముంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక మోదీ రష్యాకు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మోదీకి పుతిన్ విందు...మాస్కో శివారులోని నోవో–ఒగార్యోవో అధికార నివాసంలో మోదీని పుతిన్ సాదరంగా ఆహా్వనించారు. ఆప్యాయంగా ఇరునేతలూ హత్తుకున్నారు. ఈ సందర్భంగా రాత్రి మోదీకి పుతిన్ ప్రత్యేక విందు ఇచ్చారు. మోదీ పాలనలో భారత్ సాధించిన అభివృద్ధిని పుతిన్ ఈ సందర్భంగా కొనియాడారు. అంతకుముందు‡మాస్కో విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి రష్యా మొదటి ఉపప్రధాని డెనిస్ మాన్ట్సురోవ్ సాదర స్వాగతం పలికారు. అక్కడే మోదీ రష్యా సైనికుల సైనికవందనం స్వీకరించారు. ది కార్ల్టన్ హోటల్ల్లో మోదీకి పెద్దసంఖ్యలో భారత సంతతి ప్రజలు స్వాగతం పలికారు. హిందీ పాటలకు భారతీయులు, రష్యా కళాకారులు నృత్యంచేస్తూ మోదీని ఆనందంలో ముంచెత్తారు. ‘ఇప్పుడే మాస్కో నేలపై అడుగుపెట్టా. మిత్రుడు పుతిన్‌తో భేటీకి ఎదురుచూస్తున్నా. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకోబోతున్నా. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతల స్థాపనకు ఇరువురం మా వంతు కృషిచేస్తాం’’ అని మోదీ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. -
రష్యాలో మోదీకి ఘన స్వాగతం.. హిందీ పాటకు డ్యాన్స్‌లతో..
మాస్కో: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మోదీ రష్యాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మాస్కోలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. మోదీ రాక సందర్భంగా రష్యన్ డ్యాన్స్ ట్రూప్ ప్రత్యేకంగా దాండియా, గర్భా నృత్యంతో ప్రధానికి స్వాగతం పలికింది.ఇక, మాస్కోలో ల్యాండ్ అయిన తర్వాత మోదీ ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ట్విట్టర్లో..‘మాస్కో దిగాను. రెండు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ఎదురు చూస్తున్నాను. ముఖ్యంగా భవిష్యత్ సహకార రంగాలలో మన దేశాల మధ్య బలమైన సంబంధాలు మన ప్రజలకు ఎంతో మేలు చేస్తాయి’ అంటూ కామెంట్స్ చేశారు. Landed in Moscow. Looking forward to further deepening the Special and Privileged Strategic Partnership between our nations, especially in futuristic areas of cooperation. Stronger ties between our nations will greatly benefit our people. pic.twitter.com/oUE1aC00EN— Narendra Modi (@narendramodi) July 8, 2024 ఇదిలా ఉండగా.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు మోదీ మాస్కో వెళ్లిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు మోదీ రష్యాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, రక్షణ, ఆర్థిక సహకారంపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇక, మోదీ కోసం పుతిన్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో ప్రధాని ముచ్చటించనున్నారు. ఇక, రష్యా పర్యటనను ముగించుకుని మోదీ ఆస్ట్రియా వెళ్లనున్నారు. 40 ఏళ్ల తర్వాత ఆ దేశంలో పర్యటించనున్న తొలి ప్రధాని మోదీనే కావడం విశేషం. PM Modi was greeted with a heartfelt welcome by the Indian community in Moscow, Russia. pic.twitter.com/attIdUeuzP— Chandrajiban Chakma (@Chandrajiba4BJP) July 8, 2024 PM Modi received a warm reception and a Guard of Honour upon his arrival in Moscow, Russia. pic.twitter.com/oM2NtUO1mW— Chandrajiban Chakma (@Chandrajiba4BJP) July 8, 2024 -
రష్యాలో మోదీ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నుంచి రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. 22వ ఇండో–రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. పలు రంగాల్లో విస్తృతస్థాయి సహకారంపై వారు చర్చిస్తారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగాక మోదీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి. మూడేళ్ల విరామం తర్వాత భారత్–రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమిట్‌లో చర్చించబోయే అంశాలు, తీసుకోబోయే ఉమ్మడి నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చివరిసారిగా 2021 డిసెంబర్లో ఢిల్లీలో ఈ సదస్సు జరిగింది. సోమవారం మధ్యాహ్నం రష్యాకు మోదీ చేరుకున్నాక పుతిన్ ఇచ్చే ప్రత్యేక విందు కార్యక్రమానికి మోదీ హాజరుకానున్నారు. తర్వాత శిఖరాగ్ర సదస్సు జరగనుంది. మరుసటి రోజు రష్యాలోని భారతీయసంతతి వ్యక్తులతో మోదీ మాట్లాడతారు. తర్వాత క్లెమ్లిన్‌లో అనామక సైనికుల స్మారకం వద్ద అంజలి ఘటిస్తారు. తర్వాత మాస్కోలో ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు.ఆస్ట్రియాలోనూ పర్యటనరష్యా పర్యటన తర్వాత 9వ తేదీన మోదీ ఆస్ట్రియాకు వెళ్తారు. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డీర్ బెల్లాన్, చాన్స్‌లర్ కార్ల్ నెహామెర్‌లతో విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ‘ఆస్ట్రియా, భారత్ మైత్రీబంధానికి 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ మోదీతో చర్చల కోసం సిద్ధంగా ఉన్నా’ అని నెహామెర్ శనివారం ‘ఎక్స్’లో చేసిన పోస్ట్‌కు మోదీ ఆదివారం స్పందించారు. ‘‘ ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేసేందుకు, సహకారంలో కొత్త పథాలను అన్వేషించేందుకు మీతో చర్చల కోసం ఎదురుచూస్తున్నా’’ అని మోదీ ఆదివారం ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. భారత ప్రధాని ఒకరు ఆస్ట్రియాలో పర్యటిస్తుండటం గత 40 ఏళ్లలో ఇదే తొలిసారికావడం విశేషం. భారత్, ఆస్ట్రియాకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలతో మోదీ భేటీ కొనసాగుతుంది. మాస్కోతోపాటు వియన్నాలోని భారతీయ సంతతి ప్రజలతో ప్రధాని ముచ్చటించనున్నారు. -
కిమ్ మనసు గెల్చుకున్న పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మనసు గెల్చుకున్నారు. తన ప్యాంగ్యాంగ్ పర్యటన సందర్భంలో రష్యన్ మేడ్ లగ్జరీ కారు ఒకదానిని కిమ్‌కు బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్ని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ధృవీకరించగా.. ఓ టీవీ ఛానెల్ ఇందుకు సంబంధించిన ఫుటేజీని ప్రదర్శించింది. రష్యాలో తయారైన ఆరస్ లిమోసిన్ కారు.. తన కాన్వాయ్‌లోనూ ఉపయోగిస్తున్నారు పుతిన్. అదే కారును ఆయన గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు స్వయంగా కారును పుతిన్ నడపగా, పక్కనే కిమ్ కూర్చుని ఆ ప్రయాణాన్ని ఆస్వాదించారు.Russia’s Vladimir Putin drives North Korea’s Kim Jong-un in Russian Limousine#Ytshorts #Russia #Northkorea #Putin #KimJonun #RussianLimousine pic.twitter.com/qJvVrKMoR7— Business Today (@business_today) June 20, 2024VIDEO CREDITS: Business Today గతేడాది సెప్టెంబర్‌లో కిమ్, రష్యాలో పర్యటించారు. ఆ టైంలో తన కాన్వాయ్‌లోని వాహనాలను పుతిన్ స్వయంగా కిమ్‌కు చూపించి.. ఇద్దరూ సరదాగా ప్రయాణించారు. ఆ టైంలో కిమ్ ఈ కారుపై మనుసు పారేసుకున్నారని, దీంతో ఇప్పుడు పుతిన్ ఇప్పడు ఆ కారును సర్ప్రైజ్ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి.ఇదిలా ఉంటే.. కిమ్ విలాస ప్రియుడనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖరీదైన వస్తువులు, కార్లను ఆయన తన ఖాతాలో ఉంచుకున్నారు. అయితే.. ఉత్తర కొరియాలోకి విలాసవంతమైన గూడ్స్ వెళ్లకుండా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిషేధం విధించింది. అయినప్పటికీ అక్రమ మార్గంలో కిమ్ వాటిని తెప్పించుకుంటారని దక్షిణ కొరియా ఆరోపిస్తుంటుంది.Caption this...pic.twitter.com/ilIUhnxxw1— Mario Nawfal (@MarioNawfal) June 20, 2024ఇదిలా ఉంటే.. దాదాపు 24 సంవత్సరాల తర్వాత నార్త్ కొరియాలో అడుగుపెట్టారు పుతిన్. కొరియా జనం కేరింతలతో అట్టహాసంగా పుతిన్‌కు ఆహ్వానం లభించింది. ఈ సందర్భంగా ఇరు దేశాల అధినేతలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. మరోవైపు.. అమెరికా ఒత్తిడి, ఆంక్షలను ఎదుర్కోవడంలో భాగంగా భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడమే లక్ష్యంగా వీళ్లిద్దరూ పని చేస్తున్నట్లు వాళ్ల వాళ్ల ప్రకటనలను బట్టి స్పష్టమవుతోంది. -
వియత్నాంతో పుతిన్ చెట్టపట్టాల్
హనోయి: యుద్ధోన్మాదంతో ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగాక అంతర్జాతీయ మద్దతు కరువైన తరుణంలో రష్యా ఆసియా దేశాలతో మైత్రికి మొగ్గుచూపుతోంది. అందులోభాగంగానే ఉత్తర కొరియా పర్యటన ముగించుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం అక్కడి నుంచి నేరుగా వియత్నాం చేరుకున్నారు. అధికారిక పర్యటనలో భాగంగా గురువారం వియత్నాం అధ్యక్షుడు టో లామ్‌తో విస్తృతస్థాయి చర్చలు జరిపారు. విద్య, శాస్త్ర సాంకేతికత, చమురు, సహజవాయువుల అన్వేషణ, ఆరోగ్య రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అణు శాస్త్ర సాంకేతికతపై ఉమ్మడి పరిశోధనకూ అంగీకరించారు. -
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు పూర్తి మద్ధతు: ఉత్తర కొరియా
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ఉత్తర కొరియాలో పర్యటిస్తున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానం మేరకు రెండు రోజులు (ఈనెల18,19) అక్కడ పుతిన్ పర్యటిస్తున్నారు. ప్యోంగ్యాంగ్ విమానాశ్రయానికి స్వయంగా వెళ్లిన కిమ్, పుతిన్‌కు ఆహ్వానం పలికారు. అనంతరం ప్యోంగ్యాంగ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఇరువురు పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ద్వైపాక్షిక చర్చలు జరిపారు.ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యాకు తమ పూర్తి మద్ధతు ఉంటుందని కిమ్ హామీ ఇచ్చారు. ఇరుదేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి, అమెరికా ఆధిప్యత విధానాలకు వ్యతిరేకంగా పోరేండేందుకు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు పుతిన్ పేర్కొన్నారు. ఇరు దేశాల మద్య ఆర్థిక, సైనిక సహకారాన్ని విస్తరించేందుకు అంగీకరించినట్లు తెలిపారు.యుద్ధంలో తమ పాలసీలకు మద్ధతు ప్రకటించడంపై కిమ్‌కు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. అయితే యుద్ధంలో తమకు ఆయుధాలను పంపాలని కిమ్‌ను కోరినట్టు తెలుస్తోంది. దీనికి బదులుగా ఉత్తర కొరియాకు ఆర్థికంగా, సాంకేతికంగా రష్యా సాయం చేయనున్నట్టు సమాచారం.ఇక ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర సమయంలో పుతిన్ పర్యటనకు రావడం.. అమెరికా సహా దాని మిత్రదేశాలను ఆందోళనకు గురిచేసింది. అణ్వాయుధాలు, క్షిపణి పరీక్షలతో నిత్యం శత్రు దేశాలను కవ్వించే ఉత్తర కొరియా చేతికి రష్యా అత్యాధునిక సాంకేతికత అందితే మరింత ప్రమాదమని పశ్చిమ దేశాల్లో ఆందోళన నెలకొంది.ఇదిల ఉండగా అంతర్జాతీయంగా ఇరుదేశాలపై కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఒకవైపు.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు.. ఉత్తర కొరియా ఆయుధ పరీక్షలు, ఇతర దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఈ పరిణామాల నడుమ.. వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తర కొరియాలో పుతిన్ పర్యటించడం 24 ఏళ్లలో ఇదే తొలిసారి. కాగా గత ఏడాది సెప్టెంబరులో కిమ్ జోంగ్ ఉన్ రష్యాలో పర్యటించిన సంగతి తెలిసిందే.