మూడో ప్రపంచ యుద్ధమే.. ట్రంప్‌ వ్యాఖ్యలకు రష్యా వార్నింగ్‌ | Russia Ex President Dmitry Medvedev Warns Donald Trump Of World War 3 After Putin Criticism | Sakshi
Sakshi News home page

మూడో ప్రపంచ యుద్ధమే.. ట్రంప్‌ వ్యాఖ్యలకు రష్యా వార్నింగ్‌

May 29 2025 7:20 AM | Updated on May 29 2025 8:02 AM

Dmitry Medvedev World War Comments Trump after Putin criticism

మాస్కో: అమెరికా, రష్యా మధ్య మాటల మంటలు పరాకాష్టకు చేరుతున్నాయి. ఉక్రెయిన్‌తో శాంతి చర్చల్లో పాల్గొనకపోవడం ద్వారా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ నిప్పుతో చెలగాటం ఆడుతున్నారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శించడం తెలిసిందే. ‘నేనే లేకుంటే రష్యా లెక్కలేనన్ని దుస్సంఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చేది’ అంటూ పుతిన్‌ తీరును ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.

ఈ నేపథ్యంలో ట్రంప్‌ వ్యాఖ్యలపై రష్యా మాజీ అధ్యక్షుడు, పుతిన్‌ సన్నిహితుడు దిమిత్రి మెద్వెదేవ్‌ ఘాటుగా స్పందించారు. ‘‘నాకు తెలిసిన అతి పెద్ద దుస్సంఘటన ఒక్కటే. మూడో ప్రపంచ యుద్ధం! నా మాటల ఆంతర్యాన్ని ట్రంప్‌ అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నా’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ప్రపంచం మొత్తాన్నీ యుద్ధంలోకి లాగుతామన్నదే మెద్వెదేవ్‌ ఆంతర్యమని విశ్లేషకులు అంటున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవి నిజంగా నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలని ట్రంప్‌ సీనియర్‌ సలహాదారు, ఉక్రెయిన్‌ ప్రత్యేక రాయబారి కీత్‌ కెల్లాగ్‌ విమర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement