భారత్‌కు మరో టారిఫ్ షాక్?..‘సెక్షన్ 301’ అస్త్రంతో ట్రంప్ దూకుడు! | US plans higher tariffs on India and China over subsidies | Sakshi
Sakshi News home page

భారత్‌కు మరో టారిఫ్ షాక్?..‘సెక్షన్ 301’ అస్త్రంతో ట్రంప్ దూకుడు!

Nov 25 2026 8:59 AM | Updated on Nov 25 2026 9:08 AM

US plans higher tariffs on India and China over subsidies

వాషింగ్టన్‌: ప్రపంచ దేశాలకు బిగ్‌ షాక్‌ ఇచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సిద్ధమయ్యారు. భారత్ సహా 16 దేశాలపై కొత్తగా టారిఫ్‌లు విధించనున్నారు. దీనివల్ల భారత్‌పై 15 శాతం లేదా అంతకంటే ఎక్కువ దిగుమతి సుంకం పడే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం ప్రకారం.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అధ్యక్షుడి అత్యవసర అధికారాల పేరుతో ట్రంప్‌ ఎడాపెడా విధిస్తున్న దిగుమతి సుంకాలకు అమెరికా సుప్రీంకోర్టు కళ్లెం వేసింది. దీంతో ప్రత్యామ్నాయంగా ‘సెక్షన్ 301’ అస్త్రాన్ని ప్రయోగించేందుకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమైంది.

చైనా, భారత్, దక్షిణ కొరియా, జపాన్‌, యూరోపియన్‌ దేశాలు తమ పరిశ్రమలకు భారీగా సబ్సిడీలు ఇస్తూ తక్కువ ధరకే వస్తువుల్ని ఉత్పత్తి చేస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. ఆ వస్తువులను అమెరికన్ మార్కెట్‌లో చౌకగా విక్రయించడం వల్ల, స్థానిక పరిశ్రమలు పోటీ పడలేక దెబ్బతింటున్నాయని వాదిస్తోంది. అందుకే ఆయా దేశాలపై అదనపు సుంకాలు విధించాలని నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో ‘సెక్షన్ 301’పై తాము చేపడుతున్న విచారణ ఈ వారంలో తుది దశకు చేరుకుంటుందని అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. మరోవైపు, సుప్రీంకోర్టు తీర్పు, కొత్త టారిఫ్ పరిణామాలతో భారత్‌-అమెరికాల మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ విచారణ పూర్తయితే చైనా, యూరోపియన్‌ యూనియన్‌తో పాటు మరో 14 దేశాలపై భారీ టారిఫ్‌లు విధించేందుకు అమెరికా సన్నద్ధమవుతోంది. ఈ సుంకాల పెంపుతో భారత్‌కు చెందిన ఫార్మాస్యూటికల్స్ (మందులు), టెక్స్‌టైల్స్ (వస్త్రాలు), కెమికల్స్, ఇంజనీరింగ్ గూడ్స్ రంగాలపై ఎక్కువ ప్రభావం పడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement