పరిస్థితులు ఎలా ఉన్నా పోరాడటం అంటే ఇదే..! | Woman who survived 4th-floor fall scores 92 Percent in class 12, Now works | Sakshi
Sakshi News home page

పరిస్థితులు ఎలా ఉన్నా పోరాడటం అంటే ఇదే..! నాలుగో అంతస్తు నుంచి అమాంతం..

Nov 24 2026 12:43 PM | Updated on Nov 24 2026 12:43 PM

Woman who survived 4th-floor fall scores 92 Percent in class 12, Now works

కొందరికే పరిస్థితులు ఎలా ఉంటాయంటే..దారి తీరు తెన్ను లేని విధమైన అగోమ్య గోచరంగా ఉంటాయి. బయట పడటం అటుంచి..పోరాడటం ఎలాగో తెలియని గడ్డు పరిస్థితులు..కానీ అలాంటి స్థితిని కూడా ఛేజ్‌ చేసి మరి డిగ్రీ మీద డిగ్రీలు చేస్తూ.. మంచి వృత్తి జీవితాన్ని నిర్మించుకుని యువతకు ఆదర్శంగా నిలిచిందామె. అంతేగాదు ఇంకా ఆ సవాళ్లు చిన్నగా ఇబ్బంది పెడుతున్న స్టడీస్‌కి బ్రేక్‌ వేయకపోగా, మరో డిగ్రీ చేసేందుకు రెడీ అవుతోందట.

ఆ ధీర వనిత స్టోరీని ‘ఫీల్‌గుడ్‌థాట్స్‌’ అనే ఖాతా సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో షేర్‌ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ పోస్ట్‌లో "ఒక బిల్డింగ్‌ నాలుగో అంతస్తు నుంచి 16 ఏళ్ల అమ్మాయి అనూహ్యంగా పడిపోయి ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంది. బతికే అవకాశం కేవలం 10% మాత్రమే ఉందని వైద్యులు పేర్కొన్నారు. బతికే అవకాశాలు లేకపోయినా..ఆ స్థితిలో కూడా ఇంటర్‌ పరీక్షలు రాసిందట ఆమె. నిజానికి ఆ ఆకస్మిక ప్రమాద సమయంలో పడిపోతున్నప్పడూ తన కాళ్లపైనే బ్యాలెన్స్‌ అయ్యింది. దాంతో ఆమె కుడికాలికి తీవ్ర గాయాలయ్యాయని ఆమె సోదరుడు తెలిపాడు. 

ఆ టైంలో ఆమె స్పృహలోనే ఉందని అన్నాడు. బతికే అవకాశాలు లేకపోయినా..తమ వంతు ప్రయత్నంగా కొన్ని శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు చెప్పారని అన్నాడు. అలా ఆమె రెండేళ్ల పాటు ఆస్ప్రతిలోనే ప్రాణాలతో పోరాడిందట. కోలుకోవడం అత సులభం కాలేదు. పైగా ఆమె మళ్లీ నడవడం అన్నది కూడా కష్టమనే అన్నట్లుగా సందేహం వ్యక్తం చేశారట. అలాంటి స్థితిలో కూడా ఆ అమ్మాయి తన చదువుని కొనసాగించడమే కాదు..ఇంటర్‌ బోర్డు పరీక్షల్లో ఏకంగా 92% మార్కులు సాధించిందట. 

అప్పుడు ఆమె ఇంకా నడవలేని స్థితిలో ఉన్నందున అంబులెన్స్‌లో పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లారట. అక్కడ స్ట్రెచర్‌పై పడుకుని బోర్డు పరీక్షలు రాసిందట ఆమె. ఆ స్థితిలో కూడా మెరిట్‌ మార్కులు తెచ్చుకోవడంతో ఆమె కాలేజ్‌ తన టాలెంట్‌ని గుర్తించి  ఎక్సెప్షనల్ స్టూడెంట్ అవార్డుని, ఒక మొబైల్‌ ఫోన్‌ని బహుకరించిందట. ఆ సక్సెస్‌ అనంతరం ఆమె భౌతిక శాస్త్రం, హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో రెండు డిగ్రీలు పూర్తి చేసిందట ఆమె. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని గూగుల్ అనుబంధ సంస్థలో పనిచేస్తోందట. 

అంతేగాదు తన మూడవ డిగ్రీ ఎంబీఏ చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు రాసుకొచ్చారు. ఇప్పటికీ నడవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నప్పటికీ..తన వ్యక్తిగత సవాళ్లను అధిగమించేలా ఉన్నత విద్యను అభ్యసిస్తూ..మంచి వృత్తి జీవితాన్ని నిర్మించుకోవాలనే ఆమె దృఢ సంకల్పానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే కదూ..!. ఆమె కథ ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా..మన గమనం ఆగిపోకూడదనే గొప్ప సందేశాన్ని అందించడం విశేషం. జీవితమంటే పోరాటం..పోరాటంలోనే ఉందే జయం అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఆ ధైర్యశాలి. 

ఇదీ చదవండి: చీరకట్టులో మహిళా పారిశ్రామికవేత్త సైకిల్‌ రైడ్‌..!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement