మహనీయుల బాల్యం
పిల్లలూ... గొప్పవాళ్లు ఊరికే గొప్పవాళ్లు అవరు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉంటారు. మన గత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ బాల్యం కూడా అలాంటిదే. ఆయన 1932 సెప్టెంబర్ 26న పంజాబ్ ్ర΄ాంతంలో ఉన్న ‘గాహ్’ అనే మారుమూల గ్రామంలో జన్మించారు.
చిన్నతనంలోనే తల్లి అమృత్ కౌర్ మరణించడంతో, నానమ్మ వద్దే మన్మోహన్ పెరిగారు. ఆ రోజుల్లో ఆయన పుట్టిన ఊరిలో కరెంటు లేదు. చదువుకోవాలంటే ప్రతిరోజూ మైళ్ల దూరం కాలిబాటన నడిచి పక్క ఊరిలోని బడికి వెళ్లాల్సి వచ్చేది. పగలు బడికి వెళ్లి, రాత్రిళ్లు ఇంట్లో ఒక చిన్న కిరోసిన్ దీపం మసక వెలుగులో కూర్చుని గంటల తరబడి పుస్తకాలు చదివేవారు.
ఆ మసక వెలుగులో చదవడం వల్లే చిన్నతనంలోనే ఆయన కంటి చూపు మందగించి కళ్లద్దాలు పెట్టుకోవాల్సి వచ్చింది! ‘నా దగ్గర ఉన్నదల్లా నా చదువు మాత్రమే, దాన్ని ఎవరూ దొంగిలించలేరు’ అని నానమ్మతో చెప్పేవారు. ఆ కిరోసిన్ దీపం వెలుగులో మొదలైన ఆయన చదువు ప్రయాణం ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల దాకా సాగి, చివరికి భారతదేశ ప్రధాని పీఠంపై కూర్చోబెట్టింది.
ఇదీ చదవండి: నక్షత్రమండలంలో మన సురశ్రీ పాట!


