breaking news
Education cess
-
NIAT: విద్యతో పాటు.. ఉద్యోగానికి కూడా
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) 2020 మార్గదర్శకంలో భారతదేశ విద్యావ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ మార్పుల్లో UGC, AICTE సంస్థలు విద్యను నైపుణ్యానికి పెద్దపీట వేయాలని ఎంతో కృషి చేసి అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ ఆశయాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి నెక్ట్స్‌వేవ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ (NIAT) ప్రారంభించిన యూనివర్సిటీ భాగస్వామ్య మోడల్‌ను భారతదేశంలోని పలు UGC ఆమోదం పొందిన యూనివర్సిటీలలో అమలు చేస్తున్నారు. నైపుణ్య ఆధారిత విద్యను దేశవ్యాప్తంగా అనుకరించదగినదిగా ఈ మోడల్ దృఢంగా నిలిచింది.“విద్యార్థులకు స్థిరమైన కెరీర్ ఫలితాలు తీసుకువచ్చేలా యూనివర్సిటీలను బలపరచడమే ఈ భాగస్వామ్యం లక్ష్యం” అని నెక్ట్స్‌వేవ్ & NIAT వ్యవస్థాపకుడు మరియు సీఈవో రాహుల్ అట్లూరి తెలిపారు. “ఒకవైపు యూనివర్సిటీ అకడమిక్ ప్రోగ్రామ్‌ను తమదైన విధంగా కొనసాగిస్తుంది. మరోవైపు విద్యార్థులు ఇండస్ట్రీకి సిద్ధమవడానికి అవసరమైన ప్రతిదీ - హ్యాండ్-ఆన్ స్కిల్ ట్రైనింగ్, ఇండస్ట్రీ ప్రాక్టికల్ సెషన్లు, కౌన్సెలింగ్, ఇంటర్న్‌షిప్, పే మెంట్స్ ఇలా కావలసిన అన్ని విషయాల్లో NIAT తోడ్పాటు అందిస్తోంది” అన్నారు.ఈ భాగస్వామ్యంలో యూనివర్సిటీ కరికులంను మెరుగుపరచడానికి NIAT ఇన్సైట్స్ ఇస్తుంది. ఈ ఇన్సైట్స్ను 3,000కు పైగా కార్పొరేట్ కంపెనీలు, 10,000కి పైగా టెక్ ప్రొఫెషనల్ కమ్యూనిటీ, తమ అంతర్గత R&D, ప్రొడక్ట్ డెవలప్మెంట్ వంటి అనేక మూలాల నుంచి NIAT సేకరిస్తోంది. ఈ ఇన్సైట్స్ను NIAT యూనివర్సిటీలకు సక్రియ రిపోర్ట్, వైట్ పేపర్ రూపంలో సమరిస్తుంది. వీటిలో తాజా ఇండస్ట్రీ ట్రెండ్స్, జాబ్ రోల్స్, స్కిల్స్ వంటి అంశాలు స్పష్టంగా ఉంటాయి. ముఖ్యంగా AI/ML, సైబర్ సెక్యూరిటీ వంటి 4.0 టెక్నాలజీలకు సంబంధించిన విషయాలు ఉంటాయి. ఈ రిపోర్ట్ ఆధారంగా యూనివర్సిటీలు UGC, AICTE నిబంధనలకు అనుగుణంగా తమ అకడమిక్ కౌన్సిల్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఆమోదంతో తమ కరికులంను ఆధునీకరించుకుంటాయి.అధునాతన టెక్నాలజీలలో ప్రాక్టికల్ స్కిల్ పెంపొందించేందుకు కౌశల్య శిక్షణ కూడా NIAT మోడల్లో మరో ముఖ్య అంశం. విద్యార్థులకు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉండే టెక్నాలజీలపై పట్టు సాధించే విధంగా ప్రాక్టికల్ ట్రైనింగ్, ల్యాబ్, హ్యాండ్-ఆన్ కోడింగ్ సెషన్స్ ఉంటాయి.అలాగే, NIAT 10,000+ టెక్ ప్రొఫెషనల్స్ నెట్‌వర్క్‌ను ఉపయోగించి అందులోని ఒకరు ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్‌గా నియమించి, వారు మెంటర్ చేయడం వలన విద్యార్థులు ఇండస్ట్రీలో వాడే తాజా టూల్స్ మరియు టెక్నాలజీలపై పట్టు సాధిస్తారు.“ప్రపంచ స్థాయి నిపుణులుగా తయారవాలంటే డిగ్రీతో పాటు స్కిల్, అప్టిట్యూడ్ అవసరం. NIAT సహకారంతో మా విద్యార్థులు బ్లూస్కిల్కు అనుగుణంగా శిక్షణ పొందుతున్నారు” అని పూణేలోని అజీంక్య డీవై పాటిల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్.కె. జైన్ అన్నారుఅనుభవపూరితంగా నేర్చుకోవాలంటే ఒక అధునాతన టెక్నాలజీ వ్యవస్థ అవసరం అవుతుంది. అందుకే NIAT ఆరంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లెర్నింగ్ పాత్‌ను యూనివర్సిటీల్లో అమలు చేస్తున్నారు. ఈ వ్యవస్థ విద్యార్థులు రియల్ వరల్డ్ ప్రాజెక్టులు చేయగలుగుతారు, చేసిన పనిపై వెంటనే లైవ్ ఫీడ్‌బ్యాక్ పొందగలుగుతారు, మరియు ఏ అంశంలో బలహీనత ఉందో చూపించి ఎలా మెరుగుపరుకోవాలో సూచిస్తుంది. ఇవి ఇప్పటివరకు టాప్ కంపెనీల బూట్క్యాంపుల్లో మాత్రమే ఉండేవి, కాని ఇప్పుడు విద్యార్థులకు యూనివర్సిటీ లెవెల్లో ఈ సదుపాయాలు NIAT అందిస్తోంది.యెనెపోయా డీమ్డ్ యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ ఫర్హాద్ యనపోయా మాట్లాడుతూ.. “ఇండస్ట్రీకి సంబంధించిన టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవడం ప్రతి విద్యార్థికి అవసరం. NIAT సపోర్ట్ తో మా డిగ్రీ ప్రోగ్రాం మరింత శక్తివంతంగా మారింది. విద్యార్థులను టెక్నాలజీ రంగంలో స్థిరమైన కెరీర్‌కు సిద్ధం చేస్తుంది” అని అన్నారు.ఈ తరానికి కావలసింది కేవలం తరగతి గదులు కాకుండా, టెక్ తో కూడిన ఆధునాతన క్లాసులు. దృష్టిని పెంచుకుని NIAT యూనివర్సిటీలకు ఒక ప్రామాణిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ పేబుక్ అందిస్తోంది. ఇది Stanford, MIT, Harvard వంటి టాప్ యూనివర్సిటీలను బెంచ్‌మార్క్ చేసి, భారతీయ విద్యా పరిసరాలకు తగినట్లు రూపకల్పన చేయబడింది. హై-స్పీడ్ Wi-Fi, టెక్ టూల్స్‌కు సపోర్ట్ చేసే సౌండ్ AV సిస్టమ్, సౌండ్-ప్రూఫ్ గదులు, కమ్ఫర్టబుల్ మరియు ఎరోనామిక్ సీటింగ్, టీమ్‌వర్క్‌కు తగిన కోలాబరేటివ్ లేఅవుట్ వంటి ప్రాజెక్టు బేస్ లెర్నింగ్‌కు అవసరమైన సదుపాయాలు ఉంటాయి. అంతేకాకుండా, పేబుక్లోకి ఎర్గబుల్ బిల్ ఆఫ్ క్వాంటిటీస్, వెండర్ టెంప్లేట్లు, రోలౌట్ మైల్‌స్టోన్స్ కూడా ఉంటాయి. దీనివల్ల యూనివర్సిటీలు AICTE నిబంధనలతో పాటు ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మెయింటైన్ చేసుకోగలుగుతాయి.NIATతో భాగస్వామ్యంలో యూనివర్సిటీలకు లభించే మరో గొప్ప విషయం ఇండస్ట్రీతో ఉండే డైరెక్ట్ కనెక్షన్. 3,000కి పైగా టెక్ కంపెనీలలోని అవకాశాలకు విద్యార్థులను కనెక్ట్ చేస్తుంది. యూనివర్సిటీ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు స్థిరమైన కెరీర్ కోసం సరైన ఇంటర్న్షిప్స్, మాక్ అసెస్మెంట్లు, ఇండస్ట్రీ పే మెంట్ సెషన్లు ఉంటాయి. అంతేకాకుండా, ప్రతి విద్యార్థి ప్రగతిని ట్రాక్ చేసేందుకు డేటా డ్యాష్‌బోర్డులు కూడా అందుబాటులో ఉంటాయి. దీనివల్ల యూనివర్సిటీలు ఒక్కో విద్యార్థి ఎంతగా ప్రిపేర్ అయ్యాడో, ఏం అవసరమో స్పష్టంగా తెలియగలుగుతాయి.చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు & ఛాన్సలర్ డాక్టర్ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ.. “ప్రస్తుత ప్రపంచంలో స్థిరమైన కెరీర్ కోసం డిగ్రీతోపాటు స్కిల్స్ కూడా అవసరం. మా యూనివర్సిటీ నుంచి డిగ్రీ, NIAT నుంచి ఇండస్ట్రీ-రెడీ సర్టిఫికేట్ అందుతాయి. ఇది విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడానికి ఎంతో కీలకం” అని అన్నారు.విద్యార్థులకు ఒకవైపు యూనివర్సిటీ నుంచి UGC అప్రూవ్ బీటెక్ డిగ్రీ, మరొకవైపు NIAT నుంచి ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేట్ (IRC) కూడా లభిస్తుంది. ఈ IRC అనేది విద్యార్థులు చేసిన స్కిల్ ట్రైనింగ్, ప్రాజెక్టులు, అసెస్మెంట్ల బేస్‌పై ఇచ్చే సర్టిఫికేట్. డిగ్రీతో పాటు స్కిల్ సర్టిఫికేట్ రావడం వలన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయి. దీనితో పాటు, మల్టిడిసిప్లినరీ, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనే UGC/AICTE లక్ష్యాలకు కూడా సరిపోతుంది.అరోరా డీమ్డ్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్రీలత చెపురే మాట్లాడుతూ, “2025-26 నుంచి NIATతో కలిసి, మా కాంపస్‌లో డిగ్రీకు తోడుగా అప్స్కిలింగ్ ట్రైనింగ్ ద్వారా విద్యార్థులకు పూర్తి సెట్ అందించనాం. వారి కెరీర్ బలంగా ప్రారంభమవుతుందని మా నమ్మకం,” అన్నారు.మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫీజు పూర్తిగా క్వియర్గా ఉంటుంది. విద్యార్థులు అకాడమిక్ ఫీజు యూనివర్సిటీకి నేరుగా చెల్లించాలి. ఇంకా, NIAT అందించే ఇండస్ట్రీ రెడినెస్ ప్రోగ్రామ్ కోసం వేరుగా (ఐచ్చికంగా) ఫీజు ఉంటుంది. ఫీజులు వేరుగా ఉండడం వలన UGC, AICTE నిబంధనలకు పూర్తి గా అనుగుణంగా ఉంటుంది.నెక్ట్స్‌వేవ్ & ఎన్ఐఏటీ సహ వ్యవస్థాపకులు & సీఈఓ రాహుల్ అట్లూరి.. ఇదే ప్రభుత్వం కోరుకునే నైపుణ్యాధారిత విద్య అని అన్నారు. “UGC, AICTE ఈ మార్పులకు కీలకమైన సంస్కరణలు తీసుకొస్తున్నాయి. వాటికి అనుగుణంగా మేము ఒక పకా మోడల్ రూపొందించాం. ఇది ఇప్పుడు యూనివర్సిటీలలో, విద్యార్థుల భవిష్యత్తులో నిజంగా మార్పు తీసుకొస్తుంది. డిగ్రీతో పాటు, ఒక భరోసా కలిగిన భవిష్యత్తును కూడా ఇస్తుంది ఈ భాగస్వామ్యం,” అన్నారు. -
పేద పిల్లలకు చదువెందుకంటోన్న ఆటవిక పాలకులు
-
మనో వైకల్యమే మహా విషాదం
ఎటుచూసినా పోటీ ప్రపంచం.. పిల్లలు ఇప్పట్నుంచే చదువులో అత్యుత్తమంగా లేకుంటే భవిష్యత్‌లో వెనుకబడిపోతారనే అనవసర ఆందోళన.. మార్కులు సాధించే యంత్రాలుగా చూస్తూ వారిపై తీవ్ర ఒత్తిడి.. తాము సాధించలేని లక్ష్యాలు, తాము నెరవేర్చుకోలేని ఆశలను వారసులు తీర్చాల్సిందే అనే పంతం.. మరోవైపు దీనికి ఆజ్యం పోసేలా ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల ధోరణి.. వెరసి పిల్లల యోగక్షేమాలు, ఆటపాటలు, మానసిక ఉల్లాసం గురించి పట్టించుకోకుండా విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్న తల్లిదండ్రులు చివరకు బిడ్డల ప్రాణాలను తీసేందుకు సైతం వెనుకాడడం లేదు. తాజాగా కాకినాడలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరు.. ఏడేళ్లు, ఆరేళ్ల వయసున్న తన ఇద్దరి కుమారులను పోటీ ప్రపంచంలో రాణించలేరనే కారణంతో నిర్దాక్షిణ్యంగా చంపేయడమే కాక తాను కూడా ప్రాణాలు తీసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రులు పిల్లల విషయంలో ధోరణి మార్చకోకుంటే మున్ముందు ఇలాంటి ఘటనలు మరిన్ని చూడాల్సి వస్తుందేమోనని విద్యావేత్తలు, మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి తీరు మారాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. సాక్షి, స్పెషల్ డెస్క్ : తల్లిదండ్రుల్లో విపరీత పోకడలకు కారణం.. ప్రైమరీ స్కూల్ స్థాయి నుంచే పోటీ వాతావరణం నెలకొనడం. ఆడుతూ పాడుతూ ఆహ్లాద వాతావరణంలో చదువుకోవాల్సిన వయసులో పిల్లలు సహచరులతో పోటీ పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో పిల్లల విజయం తమదిగా, సమాజంలో తమకు గుర్తింపుగా భావిస్తున్న తల్లిదండ్రులు ప్రతికూల ఫలితం వస్తే తట్టుకోలేక ఆ కోపాన్ని పిల్లలపై చూపుతున్నారు. పిల్లలు ఏదైనా అంశంలో వెనుకబడితే, ఆశించినంత రాణించకపోతే తల్లిదండ్రులు తమ ప్రకోపాన్ని ప్రదర్శిస్తున్నారు. తమ బిడ్డల భుజం తట్టి భరోసా ఇవ్వాల్సింది పోయి భయపెడుతున్నారు. మార్కులు తక్కువ వస్తే పరిష్కారం చూపకుండా నలుగురి ముందు తిట్టడం, కొట్టడం చేస్తున్నారు. దీంతో పిల్లల్లో ఆత్మన్యూనత పెరుగుతోంది. సమస్యలను తల్లిదండ్రులకు చెప్పుకోలేక కుంగిపోతున్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు విపరీత ధోరణులతో ప్రవర్తిస్తున్నారు.లాభపడుతున్న కార్పొరేట్ స్కూళ్లు కార్పొరేట్ స్కూళ్లు ఐదో తరగతి నుంచే ఐఐటీ, నీట్ ఫౌండేషన్ అంటూ తల్లిదండ్రులకు వల వేస్తున్నాయి. వీటిలో చేర్చితే తమ పిల్లలు ఐఐటీల్లో, ఎయిమ్స్‌ల్లో అడుగు పెట్టడం ఖాయమనే ఆలోచనతో ఏ మాత్రం వెనక్కుతగ్గకుండా.. రూ.లక్షల్లో ఫీజులు కడుతున్నారు. ఫలితాలు ఏ మాత్రం తేడా వచి్చనా.. తమ కోపతాపాలకు పిల్లలను గురి చేస్తున్నారు. పలుచన అవుతామనే ఆందోళనతో.. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఇలా ప్రవర్తించడానికి.. సమాజంలో తమ పేరు, ప్రఖ్యాతులు పోతాయని లేదా కొలీగ్స్, ఇతరుల ముందు పలుచన అవుతామనే ఆందోళనే కారణమని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. పిల్లలు తమ ఆస్తి అని, వారిపై అన్ని హక్కులు, అధికారాలు తమకు ఉన్నాయని భావిస్తున్నారు. తమ కలలను నెరవేర్చడానికే పిల్లలు ఉన్నారనే ప్రమాదకర భావన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఏ మాత్రం ప్రతికూలంగా మారినా ఎంతటి తీవ్ర చర్యకైనా వెనుకాడట్లేదు. ఇలాంటి పరిస్థితి రాకుండా తల్లిదండ్రులకు ముందు కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డెల్యూజనల్ డిజార్డర్స్ మానసిక రుగ్మత అంటే పిచ్చి ఒక్కటే అనుకుంటున్నారని, అదొక్కటే కాదని, రకరకాల ఆలోచనా విధానాలని నిపుణులు చెబుతున్నారు. వీటినే డెల్యూజనల్ డిజార్డర్స్ (భ్రాంతి రుగ్మత) అంటారని వివరిస్తున్నారు. వ్యక్తిలో అంతులేని నిరాశ, భాగస్వామి పట్ల అనుమానం, ఆరి్థక, సామాజిక ఒత్తిళ్లు, ఏదో వైపరీత్యం జరగబోతుందన్న ఊహ, ప్రమాదంపై భయం, మితిమీరిన, తప్పుదారి పట్టిన ప్రేమలు, తీవ్ర మానసిక రుగ్మతలు వంటివి దుర్ఘటనలకు దారితీస్తున్నాయని అంటున్నారు. తమ వల్ల ఏదీ కావడం లేదని, దేనికీ పనికిరామేమోనని, సమాజం తమను చెడుగా ఊహించుకుంటోందేమోనన్న ఆలోచనలు ఎక్కువైనవారు చివరకు తమ పిల్లలను చంపేసి, తామూ చనిపోవాలన్న నిర్ణయానికి వస్తున్నారని పేర్కొంటున్నారు. ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు శ్రేయోభిలాషులు, హితులు, సన్నిహితుల వద్ద చర్చించినా ఫలితం దొరుకుతుందని వైద్యులు చెబుతున్నారు. వారు పెరిగిన పరిస్థితులు కూడా ఓ కారణం పేరెంట్స్ ప్రతికూల వాతావరణంలో పెరిగితే.. అదే రీతిలో పిల్లలతో వ్యవహరించే ప్రమాదం ఉంది. కాకినాడ ఘటనపై పెద్దఎత్తున చర్చ జరగాలి. పిల్లల తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇవ్వాలి. పోటీ ప్రపంచంలో పరీక్షలు, ఫలితాలు అనివార్యంగా మారిన మాట వాస్తవం. కానీ, వీటితోనే పిల్లల భవిష్యత్తు అని భావించకూడదు. పిల్లల్లోని నైపుణ్యాలను గుర్తించి, వాటిలో రాణించేందుకు ప్రోత్సహిస్తే ఫలితాలు ఉంటాయి. –ఆర్.సి.రెడ్డి, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్తల్లిదండ్రుల్లో మార్పు రావాలితల్లిదండ్రులు విపరీత పోకడలకు ప్రస్తుత పరీక్షల విధానం కూడా ఓ కారణం. దీనికి పరిష్కారంగా.. వినూత్నంగా జాతీయ విద్యా విధానాన్ని రూపొందించారు. సీబీఎస్ఈ కూడా రెండుసార్లు వార్షిక పరీక్షల విధానాన్ని ప్రతిపాదిస్తోంది. తల్లిదండ్రుల్లోనూ మార్పు రావాలి. సృజనాత్మకత, శక్తియుక్తుల ఆధారంగా చదివేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే వారి భవితకు ప్రమాదం ఏర్పడుతుంది. –సీతామూర్తి, ప్రిన్సిపాల్, సిల్వర్ ఓక్స్ స్కూల్, హైదరాబాద్తీవ్ర మానసిక సమస్య కన్నబిడ్డలను చంపేయడం ఓ తీవ్రమైన మానసిక సమస్య. ఈ తరహా సమస్యలతో బాధపడేవారిని కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. అందులో ప్రధానమైనది చిన్న పిల్లల చర్యలపై తీవ్రంగా స్పందిస్తుండడం. ఇటువంటి వారికి పిల్లలను దూరంగా ఉంచాలి. మానసిక వైద్యుడికి చూపించాలి. – డాక్టర్ వి.వరప్రసాద్, మానసిక వ్యాధుల నిపుణుడు, జీజీహెచ్, కాకినాడగుడ్ పేరెంటింగ్ ముఖ్యం పేరెంటింగ్ అంటే పిల్లలను కఠిన నిబంధనలతో పెంచడం కాదు. వారి ఇష్టాయిష్టాలను తెలుసుకుని అందుకు అనుగుణంగా పెంచడమే గుడ్ పేరెంటింగ్. పిల్లల గురించి విపరీతంగా ఊహించుకోవడం, మంచి ఉద్యోగం పొందడం లేదా పరీక్షలో నెగ్గడమే అచీవ్‌మెంట్‌గా భావిస్తున్నారు. అందువల్లే సమస్యలొస్తున్నాయి. –డాక్టర్ వీరేందర్, ప్రముఖ సైకాలజిస్ట్ -
సేవల పన్ను 2.15 లక్షల కోట్లు
తొలిసారిగా కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాల్ని దాటిన సేవల వసూళ్లు న్యూఢిల్లీ: సేవల పన్ను. 1994లో నాటి ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఈ పన్ను... తొలిసారిగా 2014-15లో ఏకంగా కస్టమ్స్, ఎక్సయిజ్ సుంకాలను కూడా దాటేయబోతోంది. దీన్ని బట్టి తెలియట్లేదూ... మన దేశంలో సేవలకున్న ప్రాధాన్యం. ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తే ఖజానాకు సర్వీస్ ట్యాక్స్ కన్నా ఎక్కువ వసూళ్లనిస్తున్నవిపుడు రెండే..! ఒకటి కార్పొరేట్ ట్యాక్స్. రెండు ఆదాయపు పన్ను. సర్వీస్ ట్యాక్స్ అంటే: ఫైనాన్స్ చట్టం పరిధిలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కొన్ని సేవలపై వసూలు చేసే పన్ను ఇది. సేవలందించేవారు ప్రభుత్వానికి ఈ మొత్తం చెల్లించి... దాన్ని సేవలందుకున్న వారి దగ్గర వసూలు చేస్తారు. ఇది కూడా ఎక్సయిజు, సేల్స్ ట్యాక్స్ మాదిరిగా పరోక్ష పన్నే. ప్రస్తుతం ఈ పన్ను 12 శాతం. దీనిపై ఎడ్యుకేషన్ సెస్ 2%, ఉన్నత విద్య సెస్ 1% కలిపితే మొత్తం 12.36 శాతమవుతోంది.