ఒక కుటుంబంలోని తరాలకు కళల్లోనూ లేదా తెలివి తేటల్లోనో వారసత్వంగా రావడం చూశాం. కానీ ఎక్కడైనా.. జనన తేదీ, నెల తరతరాల వారసత్వంగా కొనసాగడం గురించి విన్నారా..?!. ఔను మీరు వింటుంది నిజమే. ఏదో ఒకటి రెండు సార్లు యాదృశ్చికంగా జరగలేదు. ఏకంగా ఐదు తరాలు ఒకే తేదీన జన్మించి ప్రపంచ గిన్నిస్ రికార్డునే ఆశ్చర్యపర్చి..రికార్డులకెక్కింది ఆ కుటుంబం.
Five generations born on September 14: అసలేం జరిగిందంటే..అమెరికాకు చెందిన ఒక కుటుంబానికి సెప్టెంబర్ 14 ఒక సాధారణ తేదీ కాదు. అదొక కుటుంబ వారసత్వం. ఐదు తరాలు ఒకే పుట్టిన రోజుని జరుపుకుంటున్నాయి. ఈ కథ 1907లో మొదలైంది. అప్పుడు విల్బర్ హార్లో సెప్టెంబర్ 14న జన్మించారు. అయోవాలోని బ్రూక్స్‌లో పోస్ట్‌మాస్టర్‌గా పనిచేస్తూ, ఒక జనరల్ స్టోర్‌ని కూడా నడుపుతుండేవారు.
తను పుట్టిన రోజు భవిష్యత్తులో తన కుటుంబానికి ఒక ప్రత్యేక గుర్తింపుగా మారుతుందని అస్సలు ఊహించి ఉండడాయన. సరిగ్గా 42 ఏళ్ల తర్వాత సెప్టెంబర్ 1949, 14న విల్బర్ ఆయన భార్యకు కుమార్తె యాడీ హార్లో జన్మించింది. అలా రెండు తరాలు ఒకే పుట్టినరోజుని జరుపుకున్నాయి. ఆవేళ ఆ దంపతులు యాదృశ్చికం అనుకున్నారు. అది అలానే కొనసాగుతుందని అప్పుడు తెలియదు వాళ్లకు.
ఆ తర్వాత 1972లో యాడీకి ఒక కుమారుడు డొనాల్డ్ హార్లో జన్మించాడు. అతని పుట్టిన రోజు కూడా అదే నెల, అదే తేదీ (సెప్టెంబర్ 14నే). ఆ తర్వాత 1997లో డొనాల్డ్ కుమార్తె ఎమ్మా కూడా సెప్టెంబర్ 14నే జన్మించింది. ఈసారి మాత్రం ఆ కుటుంబ వారసత్వ పరంపర జనన తేదీ వస్తుందా? ..దాన్ని తాను కొనసాగిస్తానా? అని సందేహించింది ఎమ్మా. అయితే ఆ అనుమానాన్ని పటాపంచలు చేస్తూ..గతేడాది ఎమ్మా, తన భర్త వ్యాట్‌లకు కుమారుడు ఆర్థర్ బెల్ ఆశ్చర్యకరంగా మళ్లీ సెప్టెంబర్ 14నే జన్మించాడు.
తన తల్లి, తాత, ముత్తాత, ముత్తాత తల్లి పుట్టిన రోజునే ఈ బుల్లి ఆర్థర్ జన్మించి..అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. కాదు పుట్టుకే రికార్డుగా మారి..ఆ కుటుంబాలో ఘనంగా వేడుకలు చేసుకునేందుకు దారితీసింది. అంటే సుమారు 118 ఏళ్ల కాలవ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదు తరాలు ఒకే తేదీన జన్మించి రికార్డు సృష్టించారు. దాంతో ‘ఒకే రోజున అత్యధిక తరాలు జన్మించిన ఫ్యామిలీ’గా ఆ కుటుంబం గిన్నిస్ రికార్డుని సొంతం చేసుకుంది.
కుటుంబ వృక్షానికి కారణమైన పుట్టిన రోజు వేడుకగా జరుపుకుంటోంది ఆ ఫ్యామిలీ. కాగా ఎమ్మాకి ఆర్థర్ రెండో సంతానం. పైగా ఈ కుటుంబ సబ్యులు తమ తరాల పుట్టినరోజు తేదీని అంత తేలిగ్గా మర్చిపోవడం సాధ్యం కాదు కూడా. విచిత్రం ఏంటంటే ఈ ఐదు పుట్టిన రోజుల్లో పుట్టిన వాళ్ల జెండర్లు కూడా ఒక పరంపరగా వచ్చాయి. మొదట అబ్బాయి, ఆ తర్వా అమ్మాయి..ఇలా వరుస సాగింది. అది కూడా ఒక శతాబ్దానికి పైగా ఆ పరంపర కొనసాగడం విశేషం.
మరో ట్విస్ట్ ఏంటంటే..
విల్బర్ అతడి భార్య అడ్డీలు మిస్సౌరీలో కలుసుకుని మేరీవిల్లేలో వివాహం చేసుకున్నారు. ఇదే ప్రదేశంలో ఎమ్మా, వ్యాట్‌లు కూడా కలుసుకున్నారు. ఆఖరికి ఆ కుటుంబంలోని దంపతులు కలుకున్న ప్రదేశాలు కూడా ఒకటే. చెప్పాలంటే ఓ మూవీని తలపించే కథఈ కుటుంబ స్టోరీ. ఇది నిజంగా కష్టపడో, అదృష్టం చేత వచ్చేది కాదు, గాడ్ గిఫ్ట్ అని చెప్పొచ్చు ఆ కుటుంబ రికార్డుని.
కాగా ఇప్పటి వరకు ఆ కుటుంబంలో ఆ సెప్టెంబర్ 14 అనేది పెద్ద వేడుక అయితే..ఈసారి మాత్రం మరింత ప్రత్యేకం ఎందుంటే ..గిన్నిస్ రికార్డుని సొంత చేసుకున్న నెలగా చిరస్మరణీయంగా మారిపోతుంది ఆ తేదీ. ఇది అలాంటి ఇలాంటి మిస్టరీ కాదు... ఈ కుటుంబ వృక్ష కథ విని వైద్యులే విస్తుపోయారు కూడా.
ఇదీ చదవండి: బయో మెడికల్ ఇంజనీర్ టు పవర్‌ఫుల్ ఐపీఎస్ అధికారిగా..!


