బయో మెడికల్‌ ఇంజనీర్‌ టు పవర్‌ఫుల్‌ ఐపీఎస్‌ అధికారిగా..! | Success Story: Left Job In America Became IPS Officer On First Attempt | Sakshi
Sakshi News home page

Niharika Bhatt: బయో మెడికల్‌ ఇంజనీర్‌ టు పవర్‌ఫుల్‌ ఐపీఎస్‌ అధికారిగా..!

Nov 16 2026 2:20 PM | Updated on Nov 16 2026 2:24 PM

Success Story: Left Job In America Became IPS Officer On First Attempt

విదేశాల్లో ఆమెకు మంచి అద్భుతమైన కెరీర్‌ ఉంది. అయితే అది తనకు వద్దని దేశ సేవే మిన్న అంటూ..సివిల్స్‌ వైపు అడుగులు వేసి..తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్‌గా ఎంపికైంది. అంతేగాదు ఔత్సాహిక సివిల్స్‌ అభ్యర్థులకు గెలుపొందడానికి పలు సూచనలు సలహాలు కూడా ఇస్తోందామె. 

Niharika Bhatt UPSC Journey: ఆ ధీర వనితే నిహారిక భట్‌. మొరాదాబాద్‌లో జన్నించిన నిహారిక లక్నోలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసింది. ఆ తర్వాత అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్‌ మిచిగాన్‌ నుంచి ఎంటెక్‌ పట్టా అందుకుంది. వాషింగ్టన్‌ డీసీలో పరిశోధకురాలిగా పనిచేసింది. అప్పట్లో ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన కెరీర్‌ లభించే అవకాశం ఉంది. 

కానీ విధి మరోలా తలిచింది. ఆమెకు మదిలో ఎప్పిటి నుంచో దేశ సేవ చేయాలనే కోరిక బలంగా ఉండేది. అదే ఆమెను అమెరికా నుంచి సొంత గడ్డకు వచ్చేలా చేసింది. ఆ తర్వాత ఆమె సివిల్స్‌ వైపు అడుగులు వేసి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి ఐపీఎస్‌గా ఎంపికైది. ఆమె తన వృత్తిని రిషికేశ్‌లో ఎస్‌హెచ్‌ఓ (SHO)గా ప్రారంభించారు. 

ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని నార్త్ డిస్ట్రిక్ట్‌లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP)గా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే ఔత్సాహిక సివిల్స్‌ అభ్యర్థులకు విజయం సాధించడానికి పాటించాల్సిన ముఖ్య సూత్రాలెంటో కూడా వెల్లడించారామె.

అవేంటంటే..

  • ఏ పోటీ పరీక్షలోనైనా విజయం సాధించడానికి కీలకమైనది ఒకే పుస్తకాన్ని పదే పదే చదవండి. పుస్తకాలు కలెక్ట్‌ చేసుకున్నంత మాత్రం విజయం వరించదని అంటోందామె. నిర్ధిష్ట అంశానికి సంబంధించిన నాణ్యమైన పుస్తకాన్ని ఎంచుకుని పదేపదే చదవాలన్నారు. 

  • ఏదైనా అంశంపై పట్టు సాధించాలంటే..దానిని అనేకసార్లు అధ్యయనం చేసి..లోతైన అవగాహన పెంచుకోవాలన్నారు. అలాగే ఒకే పుస్తకాన్ని పదే పదే చదివితే ఆ అంశంపై అవగాహన పెరుగుతుంది. ఈ విధానమే పరీక్షలో మెరుగైన సమాధానాలు రాయడానికి ఎంతగానో తోడ్పడుతుందన్నారు. 

  • ఇక్కడ నిహారిక భట్‌ ఎలాంటి కోచింగ్‌ లేకుండానే విజంయ సాధించారామె. ఆమె వార్తాపత్రికలు చదవడం, సమకాలీన అంశాలపై అవగాహన, వివిధ విషయాలపై ప్రాథమికగా అవగాహన తదితరాలన్నీ సివిల్స్‌ ప్రిపరేషన్‌లో అత్యంత కీలకమని నొక్కి చెప్పారామె. 

  • చివరగా వసరులు కాదని, దృఢ నిశ్చయమే గమ్యాన్ని చేర్చడంలో హెల్ప్‌ అవుతుందని అన్నారు. 

  • ప్రస్తుతం అంతర్జాలం యువతకు ఒక వరమని అన్నారు. 

  • అలాగే ముఖ్యంగా సైన్స్ నేపథ్యం ఉన్న విద్యార్థులు, హ్యుమానిటీస్ సబ్జెక్టులలో సమాధానాలు రాయడానికి ఒక ప్రత్యేక శైలి అవసరమని అన్నారు. దీనిని అర్థం చేసుకోవాలంటే, ఈ అంశంపై మంచి అవగాహన ఉన్న వ్యక్తులను సంప్రదించాలి. ఈ శైలిని అభ్యసించడానికి తనకు కూడా కొంత సమయం పట్టిందని చెప్పుకొచ్చారామె.

ఇదీ చదవండి: డబ్బు నిలవాలంటే..ఈ జంట చెప్పే మనీ హ్యాక్స్‌ ఇవే..!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement