డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని నిర్వహించడం అంతే ముఖ్యం. ప్రస్తుతం ఉన్న ఆర్థిక సవాళ్లను తట్టుకుంటూ ముందుకు సాగాలంటే తెలివిగా ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటూ సంపదను నిర్మించక తప్పదు. అందుకోసం ఏం చేయాంటే..
భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి, సంపదను ఆదా చేయడానికి తెలివిగా డబ్బుని నిర్వహించడం ముఖ్యం. దాన్నే చేస్తున్నారు ఈ ముస్కాన్ మిట్టల్ ఆశిష్ గుప్తా దంపతులు. ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి, ఆదాయ మార్గాలను పెంచుకునేలా తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం కోసం తాము ఈ ఆరు ఆర్థిక అలవాట్లను పాటిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
సోషల్‌మీడియా వేదికగా అందుకు సంబంధించిన ట్రిక్స్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు ఇలా. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో ఆర్థికంగా ముందుకు సాగడానికి తాను, తన భార్య ఆరు అలవాట్లను పాటిస్తున్నటు చెబుతూ ఈ జాబితాను వెల్లిడించారు.
ముందుగా కారు జోలికే పోలేదన్నారు. కొనాలనే ఆలోచనకే దూరంగా ఉన్నామన్నారు. అందువల్ల పెద్దగా రుణాలు, ఆర్థిక బాధ్యతలు లేవని చెప్పారు ముస్కాన్.
తమకు మెరుగైన ఆర్థిక ప్రారంభాన్ని అందించడంలో తమ పేరెంట్స్ చేసిన త్యాగాలే కారణమని అన్నారు ఈ దంపతులు.
అలాగే తాము తమ పేరెంట్స్‌తో కలిసి ఉంటున్నామని, వాళ్లు తరుచు యాత్రలు చేస్తుంటారని అన్నారు. ఇది చాలామంది ఇష్టపడి అంశ అని అది అంగీరిస్తున్నాని కూడా అన్నారు. ఇక తాము పేరెంట్స్‌తో ఉంటూ వాళ్లు యాత్రలు చేస్తున్నప్పుడూ ఇల్లు ఖాళీగా ఉందనే భావన రాకుండా తాము భర్తీ చేయడమే గాక..తమ మధ్య మంచి అవగాహన ఉంది కాబట్టి సమస్యలు వచ్చే ఛాన్స్ తక్కువ అని చెప్పారు.
ఇక తాము సోష్ మీడియాలో కంటెంట్ సృష్టించి డబ్బు సంపాదించడం ప్రారంభించామని, చాలామంచి ఉపయోగకరమైన ఆదాయ మార్గంగా పేర్కొన్నారు ఆ దంపతులు.
అలాగే తాము ఆల్కహాల్‌కి దూరంగా ఉంటామని ఎప్పుడో..ఆరు నెలలకొకసారి అని చెప్పారు.
ఇక తాము ఖరీదైన వస్తువుల కంటే ఆ వస్తువు పనిచేసే అనుభవానికే లేదా వ్యాలిడిటీకే ప్రాధాన్యత ఇస్తామన్నారు. విలాసవంతమైన బ్యాగులు, ఖరీదైన వాచీలు, ఫ్యాన్సీ బట్టలపై ఖర్చే చేయమని చెప్పారు. దానికి బదులుగా కొత్త విషయాలు నేర్చుకోవడంపై, కలిసి ఎదగడంపై ఖర్చు చేసేందుకు ఇష్టపడతామని అన్నారు.
దీంతోపాటు ఆదాయన్ని పెంచుకునే రిస్క్ తీసుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు తాము తీసుకున్న అతి పెద్ద రిస్క్ తమ సోషల్ మీడియా పేజీని ప్రారంభించడమేనని అన్నారు. అందుకు తన భార్య ముస్కాన్ ఎంతగానో మద్దతిచ్చిందని తెలిపాడు ఆశిష్.
చివరగా ఆర్థికపరమైన, వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడూ తోడుగా నిలిచే భాగస్వామి ఉండటం అత్యంత ప్రధానమని..అప్పుడ డబ్బుని సునాయాసంగా ఆదా చేయగలరని చెబుతున్నారు ఈ దంపతులు. సో ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించి చూడండి మరి..!.
ఇదీ చదవండి: అందమైన గ్రే రంగు చీరలో శృతి హాసన్ బ్యూటిఫుల్ లుక్..!


