రూ. 12 లక్షల సంపాదన చాలు : హౌస్ హస్బెండ్‌గా ఉండిపోతా! | Indian Man Wants To Be FullTime Homemaker Seeks Wife Earning At Least Rs 12 Lakh | Sakshi
Sakshi News home page

రూ. 12 లక్షల సంపాదన చాలు : హౌస్ హస్బెండ్‌గా ఉండిపోతా!

Nov 16 2026 4:09 PM | Updated on Nov 16 2026 4:20 PM

Indian Man Wants To Be FullTime Homemaker Seeks Wife Earning At Least Rs 12 Lakh

ఇంటి పని, వంట పనిచేసుకుంటూ హౌస్ హస్బెండ్‌గా ఉంటానంటూ ఒక భారతీయ యువకుడు రెడ్డిట్ (Reddit) లో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.  సాధారణ  సంప్రదాయానికి భిన్నంగా తన కాబోయే భార్య ఉద్యోగం చేసి సంపాదిస్తే, తాను మాత్రం  పూర్తిగా ఇంట్లో ఉండి అన్నీ చక్కబెట్టుకుంటానని  చెప్పడం వైరల్‌గా మారింది.అంతేకాదు, తనకు కాబోయే భార్యకు కనీసం ఏడాదికి రూ. 12 లక్షల ఆదాయం ఉండాలని నిబంధన పెట్టాడు.

తనకు కాబోయే భార్యకు ఉండాల్సిన లక్షణాల గురించి  వివరిస్తూ అతను ఒక పోస్ట్‌ పెట్టాడు. భార్య తనకు నచ్చిన ఉద్యోగం, కెరీర్ లేదా వ్యాపారం చేసుకుంటూ,ప్రధాన సంపాదనపరురాలిగా  కుటుంబ పోషణ బాధ్యత తీసుకుంటే, తాను వంటపని ఇల్లు శుభ్రపరచడం, బట్టలు ఉతకడం లాంటి ఇంటి పనులన్నీ చూసు కోవడానికి సిద్ధంగా ఉన్నానని తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.  ప్రేమ, సమానత్వంతో కూడిన దాంపత్య జీవితాన్ని కోరుకుంటున్నట్లు తెలిపాడు. అంతేకాదు తనకు పిల్లలువద్దని (చైల్డ్‌ఫ్రీ వివాహం) కూడా అతను స్పష్టం చేశాడు. అయితే భారతదేశంలోని మహిళలు సిద్ధంగా ఉంటారా అనే  సందేహం చేశాడు. ఈ విషయంలో తాను చాలా సీరియస్‌, తనలాంటి ఆలోచనలున్న భాగస్వామి కోసం వెతుకుతున్నానని చెప్పాడు.

ఇదీ చదవండి: 14 ఏళ్ల బంధానికి ముగింపు : మంత్రి భార్య ప్రకటన

ఆ తర్వాత తన పోస్ట్‌ను ఎడిట్ చేస్తూ, తన ఎత్తు, రూపం , కుటుంబ నేపథ్యం వంటి వివరాలను కూడా పంచుకున్నాడు.  అయితే తనకు కాబోయే భార్యకు కనీసం ఏడాదికి రూ. 12 లక్షల ఆదాయం ఉండాలని నిబంధన పెట్టడం విశేషం.

ఇదీ చదవండి: ఒక యమున, రెండు చిత్రాలు : బీజేపీ, ఆప్‌ మాటల యుద్ధం

ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి. సంప్రదాయబద్ధంగా మహిళలకు మాత్రమే పరిమితమైన ఇంటి పనులను చేయడానికి ఒక పురుషుడు స్వచ్ఛందంగా ముందుకు రావడాన్ని కొందరు అభినందించారు. వివాహ వ్యవస్థలో మహిళలు నిర్వర్తించే బాధ్యతలను పురుషులు కూడా బహిరంగంగా స్వీకరించడం ప్రోత్సాహకరంగా ఉందని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. అయితే, ఆ యువకుడు రిలేషన్‌షిప్‌లో సర్దుబాట్లు చేసుకోవడానికి , రాజీ పడటానికి కూడా అంతే సిద్ధంగా ఉంటాడా అని మరొక రెడ్డిట్ యూజర్ సందేహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement