బిల్కిస్ బానో కేసులో 17 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన ఇద్దరికి ఊరట | Bilkis Bano Case: 2 Convicts Get Bail From Supreme Court After 17 Years In Jail | Sakshi
Sakshi News home page

బిల్కిస్ బానో కేసులో 17 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన ఇద్దరికి ఊరట

Nov 16 2026 3:46 PM | Updated on Nov 16 2026 3:57 PM

Bilkis Bano Case: 2 Convicts Get Bail From Supreme Court After 17 Years In Jail

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం, హత్యల కేసులో ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 17 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన నేపథ్యంలో బిపించంద్ జోషి, ప్రదీప్ మోధియాల జీవిత ఖైదు శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ అక్టోబర్ 28న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

వారి అప్పీల్‌లో చట్టపరమైన, వాస్తవపరమైన అంశాలను పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. వీరిలో జోషి తీవ్ర వైకల్యంతో బాధపడుతున్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది. అయితే, నేరాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇవ్వడాన్ని ప్రభుత్వ న్యాయవాది వ్యతిరేకించారు.

కాగా.. ఈ కేసులో గతంలో పెరోల్‌/రిమిషన్‌పై విడుదలైన 11 మంది దోషుల ముందస్తు విడుదలను 2024 జనవరిలో సుప్రీంకోర్టు రద్దు చేసింది. గుజరాత్ ప్రభుత్వానికి దోషులకి రిమిషన్ (శిక్ష తగ్గింపు) మంజూరు చేసే అధికారం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు దోషులు రెండు వారాల్లో లొంగిపోవాలని కూడా ఆదేశించింది. దాంతో వారంతా తిరిగి జైలుకు వెళ్లారు.

ఇదీ చదవండి: జవాన్లపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు హతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement