సర్‌లో పేర్లు రాని వారికి అవకాశమిచ్చాం
వీరిపై ఎటువంటి చర్యలు తీసుకోబోం
సుప్రీంకోర్టులో ఎన్నికల కమిషన్ అఫిడవిట్
న్యూఢిల్లీ: గతంలో ఓటరుగా నమోదైనప్పటికీ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ముసాయిదా జాబితాలో పేర్లు రాని వారు ఫాం–6 ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని, దీనిపై అధికారులు విచారణ జరుపుతారేమోనని భయపడాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది. అయితే, ఆ దరఖాస్తుదారు లేదా ఓటరు ఇప్పటికే మరే ఇతర పార్లమెంటరీ లేదా అసెంబ్లీ నియోజకవర్గంలో నమోదై ఉండకూడదు, వారు ఇచ్చిన డిక్లరేషన్ చట్టబద్ధమైందిగా ఉండాలని తెలిపింది.
ఈ అంశంపై ఓటర్లలో భయాందోళనలను నివృత్తి చేస్తూ స్థానిక భాషల్లో సైతం పూర్తి స్పష్టతతో విస్తృత ప్రచారం చేపట్టాలని నవంబర్ 6వ తేదీన జారీ చేసిన సర్క్యులర్ ద్వారా చీఫ్ ఎలక్టోరల్ అధికారులను ఆదేశించామని తెలిపింది. ఈ మేరకు ఈసీ తాజాగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖ లు చేసింది.
సర్ ప్రక్రియ సమయంలో ఏఎస్‌డీడీ (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్) కారణాలతో ఓటరు జాబితా నుంచి తొలగింపునకు గురైన వారు తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించాలంటూ సుప్రీంకోర్టు ఇటీవల విచారణ సందర్భంగా ఇచ్చిన సూచనను సైతం పరిగణనలోకి తీసుకున్నామని వివరించింది. ఓటరు ప్రయోజనాలను కాపాడేందుకు ఇతర చర్యలు సైతం తీసుకున్నామంది. ‘నివాసం మారని ఓటర్లు, గతంలో ఎన్యుమరేషన్ ఫాంను సమరి్పంచకపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ అనెగ్జర్–బి ప్రకటనతో పాటు సంతకం చేసిన ఎన్యుమరేష న్ ఫాంను సమరి్పంచవచ్చు. వారు దీనిని స్వయంగా/ కుటుంబ సభ్యుల ద్వారా లే దా ఈఆర్‌వో/ఏఈఆర్‌వో/బీఎల్‌వోలకు అందజేయవచ్చు. ఈసీఐనెట్ పోర్టల్‌లో ఇ–సైన్తో ఆన్‌లైన్ సైతం అందజేయవచ్చు’ అని ఈసీ అఫిడవిట్‌లో వివరించింది.
డేటా డిజిటలైజేషన్‌తో సమస్యలు
పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉండటం, డేటా డిజిటలైజేషన్ వల్ల సమస్యలు ఎల్లప్పుడూ తలెత్తుతూనే ఉంటాయని ఈసీ తన అఫిడవిట్‌లో అత్యున్నత న్యాయస్థానానికి వివరించింది. ‘తుది ఓటరు జాబితాలో చేర్చుకునే అవకాశాన్ని అన్ని విధాలుగా అర్హులైన ఏ ఒక్కరూ కోల్పోకుండా చూసేందుకు కట్టుబడి ఉన్నాం అదే సమయంలో నకిలీలను తొలగించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించాం. ఎన్నికల ప్రక్రియ పవిత్రతను కాపాడే రాజ్యాంగ బాధ్యతకు కమిషన్ కట్టుబడి ఉంది. భారీ సంఖ్యలో ఓటర్లు ఉండటం, మొత్తం డేటా డిజిటలైజేషన్ కారణంగా కొన్ని పొరపాట్లు దొర్లడం సర్వసాధారణం. భవిష్యత్తులోనూ ఇవి రావచ్చు. అయితే, జాబితాలో ఏవిధమైన లోపాలు రాకుండా సరిదిద్దే విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటాం’అని ఈసీ పేర్కొంది.
సర్‌లో భాగంగా చేపట్టే ఈ మొత్తం ప్రక్రియ చట్టబద్ధమైనది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ముగ్గురు ఎన్నికల కమిషనర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు’అని పేర్కొ న్నారు. అంతిమంగా, ఓటరు నమో దు కోసం ఉపయోగించే చట్టబద్ధమైన ఫాం– 6లో ఎలాంటి మార్పులు చేయలేదని, ఫాం–6ను సవరించారన్న ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సర్ ప్రక్రియ ద్వారా ఈసీ కోట్లాది మంది అర్హులైన ఓటర్ల పేర్ల ను తొలగించిందంటూ, ఈసీతోపా టు ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.


