సీజేఐపై  ఎక్స్‌లో పోస్టు..కేరళం కాంగ్రెస్‌కు ధిక్కార నోటీస్‌ | Supreme Court Issues Notice To Kerala Congress On Post Targeting CJI | Sakshi
Sakshi News home page

సీజేఐపై  ఎక్స్‌లో పోస్టు..కేరళం కాంగ్రెస్‌కు ధిక్కార నోటీస్‌

Nov 7 2026 5:54 AM | Updated on Nov 7 2026 5:54 AM

Supreme Court Issues Notice To Kerala Congress On Post Targeting CJI

న్యూఢిల్లీ: ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ లక్ష్యంగా సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టినందుకు సుప్రీంకోర్టు శుక్రవారం కేరళం కాంగ్రెస్‌ కార్యవర్గానికి ధిక్కార నోటీసు జారీ చేసింది. న్యాయవ్యవస్థ స్వతంత్రతను రాజకీయ అనుకూలతగా, సంస్థాగతమైన బలహీనతగా చూడరాదంటూ ఈ సందర్భంగా జస్టిస్‌ అరవింద్‌ కుమార్, జస్టిస్‌ విపుల్‌ ఎం పంచోలీల ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

దేశ రాజ్యాంగమే అత్యున్నతమని, ఏ వ్యక్తి లేదా రాజకీయ సంస్థ అయినా ఆ తర్వాత స్థానంలోనే ఉంటాయని స్పష్టం చేసింది. అక్టోబర్‌ 12వ తేదీన కేరళం కాంగ్రెస్‌ విభాగం ఎక్స్‌ ఖాతాలో సీజేఐకి వ్యతిరేకంగా ఓ పోస్టు వచి్చంది. వివాదాస్పదంగా మారిన ఆ పోస్టును అనంతరం తొలగించారు. సంబంధిత వ్యక్తిని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ వెల్లడించారు. అయితే, ఆ పోస్టుపై సీజేఐ తరఫున వినీత్‌ జిందాల్‌ అనే లాయర్‌ ఫిర్యాదు చేశారు.

 అక్టోబర్‌ 30వ తేదీన సుప్రీంలో రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. శుక్రవారం విచారణ సందర్భంగా కేరళం ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(కేపీసీసీ) తరఫున హాజరైన లాయర్‌.. ఆఫీస్‌ బేరర్స్‌కు తెలియకుండానే ఎక్స్‌లో ఆపోస్టు వచి్చందని వివరించారు. అప్పుడే దీనిపై బేషరతుగా క్షమాపణ చెప్పామన్నారు. అయితే, కాంగ్రెస్‌ విభాగం చర్యను ఎలాంటి ధిక్కారంగా భావించాలనేది త్వరలోనే నిర్ణయిస్తామని పేర్కొంటూ ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement