ఉత్తరాఖండ్‌లో హ్యాట్రిక్‌ సాధించాలి  | Amit Shah Confident of BJP Hat-Trick Victory in Uttarakhand | Sakshi
Sakshi News home page

ఉత్తరాఖండ్‌లో హ్యాట్రిక్‌ సాధించాలి 

Nov 7 2026 5:49 AM | Updated on Nov 7 2026 5:49 AM

Amit Shah Confident of BJP Hat-Trick Victory in Uttarakhand

బీజేపీ శ్రేణులకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పిలుపు  

డెహ్రాడూన్‌:  ఉత్తరాఖండ్‌లో హ్యాట్రిక్‌ సాధించాలని బీజేపీ నేతలు, కార్యకర్తలకు కేంద్ర హోంశాఖ మంత్రి, పార్టీ సీనియర్‌ నేత అమిత్‌ షా పిలుపునిచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 65కు పైగా స్థానాలు గెలుచుకోవాలనే లక్ష్యంగా నిర్దేశించారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్ర 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం డెహ్రాడూన్‌లో జరిగిన బహిరంగ సభలో అమిత్‌ షా ప్రసంగించారు. 

ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ‘ముస్లిం విశ్వవిద్యాలయం’కోసం ఆందోళన జరిగిందని గుర్తుచేశారు. నేడు బీజేపీ ప్రభుత్వం అక్రమ ప్రార్థన మందిరాలు, మదర్సాలను తొలగిస్తోందని, ప్రభుత్వ భూములను కాపాడుతోందని తెలిపారు. అంతేకాకుండా, ‘ఉత్తరాఖండ్‌ గళం’కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాం«దీకి చేరాలని అన్నారు. హల్దా్వనిలో 29 ఎకరాల ప్రభుత్వ భూమి నుంచి ఆక్రమణలను తొలగించాలని ఆదేశించినప్పుడు రాహుల్‌ గాంధీ అసహనానికి గురయ్యారని విమర్శించారు.

 చొరబాటుదారులను కాపాడే ప్రయత్నాలు మానుకోవాలని ప్రతిపక్షాలకు సూచించారు. ఉత్తరాఖండ్‌ను సురక్షితమైన, సంపన్నమైన రాష్ట్రంగా మార్చాలని, ఈ దేవభూమిని దేశ సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దాలన్న తమ ధ్యేయమని అమిత్‌ షా ప్రకటించారు. రాష్ట్రంలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, 65కు స్థానాలను బీజేపీ గెలుచుకోవడం తథ్యమన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించాలని పార్టీ కార్యకర్తలను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement