మీ వల్ల కాదు.. హోంను వదిలేయండి | Amit Shah step down from his portfolio to former role as bjp president | Sakshi
Sakshi News home page

మీ వల్ల కాదు.. హోంను వదిలేయండి

Nov 6 2026 5:44 AM | Updated on Nov 6 2026 5:44 AM

Amit Shah step down from his portfolio to former role as bjp president

మళ్లీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టండి 

అమిత్‌ షాకు కాంగ్రెస్‌ పార్టీ సూచన

న్యూఢిల్లీ: ‘ఇండియా’కూటమి నవంబర్‌ 1న ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీని ‘ఘుస్‌పైఠియా బచావో’కార్యక్రమంగా అభివరి్ణస్తూ హోంమంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ తప్పుబట్టింది. హోంమంత్రి తన మంత్రిత్వ శాఖను నిర్వహించలేకపోతున్నారని, ఆయన తిరిగి బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని సూచించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ మీడియా, ప్రచార విభాగం అధిపతి పవన్‌ ఖేరా గురువారం ‘ఎక్స్‌’లో స్పందించారు.‘‘మోటా భాయ్‌.. హోం శాఖ మీ నియంత్రణలో లేనప్పుడు, ఇంకా ఆ కురీ్చని ఎందుకు పట్టుకుని వేలాడుతున్నారు? ఏడేళ్లు గడిచినా దేశంలోని 3 కోట్ల మంది చొరబాటుదారుల సమస్యను పరిష్కరించలేకపోయారు. 

మణిపూర్‌ పరిస్థితి మూడేళ్లుగా అదుపులోకి రాలేదు. ఇప్పుడు అరుణాచల్‌ప్రదేశ్‌లో కూడా పరిస్థితులు మీ అదుపులో లేవు. పుల్వామా దాడి జరిగింది, పహల్గామ్‌ దాడి జరిగింది. ఎర్రకోట వద్ద పేలుడు సంభవించింది. ఢిల్లీ సమీపంలోనే 300 కిలోల ఆర్‌డీఎక్స్‌ దొరికింది. ఇది మీరు అదుపు చేసే విషయం కాదు. కాబట్టి, దీనిని వదిలేయండి. మీరు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టండి. అప్పుడు మిమ్మల్ని ఎవరూ ఏమీ అడగరు. హోంశాఖను పట్టుకుని దేశం అనే నౌకను ఎందుకు ముంచేస్తున్నారు? నితిన్‌ నబీన్‌కు ఏ పనీ సరిగ్గా చేయడం చేతకావడం లేదు. అతన్ని కూడా వదిలేయండి. అప్పుడు అతను సంతోషంగా ఉంటాడు, మీరు కూడా సంతోషంగా ఉండవచ్చు. భారతదేశం మీ నుంచి విముక్తి పొందాలని ఎదురుచూస్తోంది. ఏది ఏమైనా, ఎవరి పని వారు చేస్తేనే బాగుంటుంది’’అని పవన్‌ ఖేరా చురక అంటించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement