సీమా ఖన్నా రిపోర్టింగ్‌లో మార్పులేదు.. ఈసీ స్పష్టత | Poll Body On New Work Order Amid Row about Seema Khanna | Sakshi
Sakshi News home page

సీమా ఖన్నా రిపోర్టింగ్‌లో మార్పులేదు.. ఈసీ స్పష్టత

Nov 5 2026 9:19 PM | Updated on Nov 5 2026 9:19 PM

Poll Body On New Work Order Amid Row about Seema Khanna

సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం (ఈసీ) డైరెక్టర్ జనరల్ (ఐటీ) సీమా ఖన్నా రిపోర్టింగ్ విధానంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ఆమె నేతృత్వంలోని విభాగాలకు సంబంధించిన ఫైళ్లను సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ పవన్ కుమార్ శర్మ ద్వారా పంపించాలని నవంబర్ 4న జారీ చేసిన తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వచ్చాయి.

సీమా ఖన్నా రిపోర్టింగ్ వ్యవస్థలో హోదాపరంగా ఎలాంటి మార్పు లేదని ఒక ఈసీ అధికారి తెలిపారు. ఆమె ఎప్పటినుంచో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ స్థాయి అధికారికే నివేదిస్తున్నారని ఆ అధికారి వెల్లడించారు.

అంతర్గత విధుల కేటాయింపుపై ఎన్నికల కమిషనర్లు వివేక్ జోషి, సుఖ్‌బీర్ సింగ్ సంధు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. జూలై 28, 2026న జారీ చేసిన ఉత్తర్వులు అమల్లోకి రాలేదని, ఇద్దరు కమిషనర్ల సంయుక్త ఆదేశాల మేరకు వాటిని నిలిపివేసినట్లు ఈసీ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.

ఇక మరోవైపు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SSR) చేపట్టనున్నట్లు ఈసీ ఇప్పటికే ప్రకటించింది. ఎస్‌ఐఆర్‌లో పేర్లు నమోదు కానివారితో పాటు తొలిసారి ఓటు హక్కు పొందిన అర్హుల కోసం ఈ ప్రక్రియ చేపట్టనుంది. ఈ నెల 30న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. డిసెంబర్ 12 వరకు అభ్యంతరాలు, దరఖాస్తులు స్వీకరించి, 2027 జనవరి 16లోగా వాటిని పరిష్కరిస్తారు. అనంతరం తుది ఓటర్ల జాబితాను జనవరి 21, 2027న ప్రకటించనున్నారు.

ఇదీ చదవండి: మరోసారి సీజేపీ ‘జంతర్ మంతర్’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement