సొంతిల్లు కట్టుకోవాలనుకుంటున్న వారు ఇది తెలుసుకోవాల్సిందే.. | What is samosa skirting If you dont get it done on your stairs | Sakshi
Sakshi News home page

సొంతిల్లు కట్టుకోవాలనుకుంటున్న వారు ఇది తెలుసుకోవాల్సిందే..

Nov 5 2026 8:51 PM | Updated on Nov 5 2026 8:56 PM

What is samosa skirting If you dont get it done on your stairs

సొంత ఇల్లు ఉండాలన్నది ప్రతి ఒక్కరి కల. అప్పు చేసైనా సరే చాలా మంది సొంతిల్లు కట్టుకుంటున్నారు. అటువంటి సమయంలో ఇంటి నిర్మాణం గురించి కాస్తయినా తెలుసుకోవాలుకుంటారు. ఇంటి మెట్ల నిర్మాణంలో సమోసా స్కర్టింగ్‌ గురించి మీకు తెలుసా?

సమోసా స్కర్టింగ్‌ అనేది అందంతో పాటు మన్నిక, పరిశుభ్రతకు ఉపయోగపడే ప్రత్యేకమైన రాతి, టైల్స్‌ కటింగ్‌ విధానం. మెట్లకు గ్రానైట్‌ లేదా టైల్స్‌ అమర్చేటప్పుడు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. దీనివల్ల మెట్లకు, గోడలకు మధ్య ఉండే ఖాళీలను కప్పేయడంతో పాటు నిర్మాణానికి చక్కని రూపం వస్తుంది.

ఈ విధానంలో రాయిని త్రిభుజాకారంలో లేదా అడ్డంగా కోస్తారు. ఇలా కోసిన ముక్కలు సమోసా ఆకారంలో కనిపిస్తాయి. అందుకే దీనికి సమోసా స్కర్టింగ్‌ అనే పేరు వచ్చింది. ఒక పెద్ద రాతి ముక్కను అడ్డంగా కోయడం ద్వారా మెట్లకు ఇరువైపులా ఉపయోగించేందుకు రెండు స్కర్టింగ్‌ ముక్కలను తయారు చేయవచ్చు. దీనివల్ల రాయి వృథా కాకుండా ఉంటుంది.

మెట్లకు సమోసా స్కర్టింగ్‌ ఎందుకు ముఖ్యం? 
ఇంటి మెట్ల నిర్మాణంలో సమోసా స్కర్టింగ్‌  అనేది అందంతో పాటు మన్నిక, పరిశుభ్రతకు ఉపయోగపడే ప్రత్యేకమైన రాతి, టైల్స్‌ కటింగ్‌ విధానం. మెట్లకు గ్రానైట్‌ లేదా టైల్స్‌ అమర్చేటప్పుడు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. దీనివల్ల మెట్లకు, గోడలకు మధ్య ఉండే ఖాళీలు కప్పడంతో పాటు నిర్మాణానికి చక్కని రూపం వస్తుంది.

ఈ విధానంలో రాయిని త్రిభుజాకారంలో లేదా అడ్డంగా కోస్తారు. ఇలా కోసిన ముక్కలు సమోసా ఆకారంలో కనిపిస్తాయి. అందుకే దీనికి సమోసా స్కర్టింగ్‌ అనే పేరు వచ్చింది. ఒక పెద్ద రాతి ముక్కను అడ్డంగా కోయడం ద్వారా మెట్లకు ఇరువైపులా ఉపయోగించేందుకు రెండు స్కర్టింగ్‌ ముక్కలను తయారు చేయవచ్చు. దీనివల్ల రాయి వృథా కాకుండా ఉంటుంది.

త్రిభుజాకారంలో కోసిన టైల్స్‌ లేదా గ్రానైట్‌ ముక్కలను మెట్ల అంచులు, మూలల్లో అమర్చుతారు. దీనివల్ల మెట్లకు స్పష్టమైన అంచులతో కూడిన ఆకర్షణీయమైన రూపం వస్తుంది. ఇల్లు కూడా మరింత అందంగా కనిపిస్తుంది.

సమోసా స్కర్టింగ్‌తో ప్రయోజనాలివే..

- గోడలకు రక్షణ: మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పాదరక్షలు లేదా పాదాలు గోడలకు తగులుతుంటాయి. దీంతో గోడలకు వేసిన రంగు, ప్లాస్టర్‌ దెబ్బతింటాయి. స్కర్టింగ్‌ ఏర్పాటు చేస్తే ఈ సమస్యను తగ్గించవచ్చు.

- దుమ్ము, ధూళి చేరకుండా: మెట్లకు, గోడలకు మధ్య ఉండే సన్నని ఖాళీలను స్కర్టింగ్‌ పూర్తిగా కప్పేస్తుంది. దీంతో అక్కడ దుమ్ము, చెత్త పేరుకుపోవు. శుభ్రం చేయడం కూడా సులభమవుతుంది.

- తేమ నుంచి రక్షణ: మెట్లను నీటితో కడిగేటప్పుడు లేదా తుడిచేటప్పుడు గోడల కింది భాగానికి నీరు తగిలే అవకాశం ఉంటుంది. దీనివల్ల గోడలకు తేమ సమస్య ఏర్పడవచ్చు. స్కర్టింగ్‌ ఈ తేమ గోడలకు నేరుగా చేరకుండా అడ్డుకుంటుంది.

- అందమైన రూపం: మెట్లు, గోడల మధ్య కలయికను చక్కగా కప్పి ఉంచుతుంది. దీనివల్ల మెట్లకు శుభ్రమైన, ఆకర్షణీయమైన, నాణ్యమైన రూపం లభిస్తుంది.

అందువల్ల ఇంటి మెట్లకు సమోసా స్కర్టింగ్‌ ఏర్పాటు చేయడం కేవలం అందం కోసమే కాదు. గోడల రక్షణ, పరిశుభ్రత, మన్నికను దృష్టిలో పెట్టుకుని కూడా ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement