పండుగ వేళ మరో ధరల పెంపు.. నెయ్యి, వెన్న, పనీర్‌ కొత్త రేట్లు! | Price Hike Before Diwali Paneer Rates Hiked Karnataka After Milk Ghee | Sakshi
Sakshi News home page

పండుగ వేళ మరో ధరల పెంపు.. నెయ్యి, వెన్న, పనీర్‌ కొత్త రేట్లు!

Nov 5 2026 4:52 PM | Updated on Nov 5 2026 4:56 PM

Price Hike Before Diwali Paneer Rates Hiked Karnataka After Milk Ghee

దీపావళి పండుగకు ముందే కర్ణాటకలోని వినియోగదారులకు మరో ధరల షాక్‌ తగిలింది. నందిని బ్రాండ్‌కు చెందిన నెయ్యి, వెన్న, పనీర్‌తో పాటు తృప్తి పాల ధరలను బెంగళూరు మిల్క్‌ యూనియన్‌ (బాముల్‌) పెంచింది. కొత్త ధరలు నవంబర్‌ 4 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇటీవల కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ (కేఎంఎఫ్‌) పాలు, పెరుగు ధరలను పెంచిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

పనీర్‌ ధరలు
సవరించిన ధరల జాబితా ప్రకారం.. రెగ్యులర్ నందిని పన్నీర్ 200 గ్రాముల ప్యాకెట్ ధర రూ .115 కాగా, 500 గ్రాముల ప్యాక్ ధర రూ .260 గా ఉంది. ఒక కిలో ప్యాక్ ధర ఇప్పుడు రూ. 485. ఇక 200 గ్రాముల ప్యాకెట్లో విక్రయించే మీడియం ఫ్యాట్ పన్నీర్ ధర రూ.110కు చేరింది.

నెయ్యి ధరలు ఇలా.. 
200 మిల్లీలీటర్ల నెయ్యి సాచెట్ ధర ఇప్పుడు రూ. 95. అర లీటరు సాచెట్‌ ధర రూ. 425 కాగా, లీటరు సాచెట్ల ధర రూ. 850. ఇక పెట్ జార్లలో విక్రయించే నెయ్యి ధర 50 ఎంఎల్‌కు రూ.65, 100 ఎంఎల్‌కు రూ.100, 200 మిల్లీలీటర్లకు రూ.180, అర లీటరుకు (500 ఎంఎల్‌) రూ.435, లీటరుకు రూ.870గా ఉంది. ఐదు లీటర్ల ప్యాక్ ధర ఇప్పుడు రూ.4,250గా ఉంది. లీటరు నెయ్యి టిన్ ధర రూ.870 కాగా, 15 కిలోల నెయ్యి టిన్ ధర రూ.14,100గా ఉంది.

వెన్న, తృప్తి పాల ధరలు

సాల్టెడ్‌ వెన్న 100 గ్రాముల ప్యాక్‌ రూ.90, 500 గ్రాముల ప్యాక్‌ రూ.380కు చేరింది. అన్‌సాల్టెడ్‌ వెన్న 200 గ్రాములు రూ.160, 500 గ్రాములు రూ.390గా నిర్ణయించారు. ఫ్యామిలీ ప్యాక్‌ ధర రూ.90గా ఉంది. తృప్తి పాలు 135 మి.లీ. ప్యాక్‌ రూ.11, 450 మి.లీ. ప్యాక్‌ రూ.33కు విక్రయించనున్నారు.

కాగా ఇంతకు ముందే నవంబర్‌ 1 నుంచి కర్ణాటకలో నందిని పాల ధరలు లీటరుకు కనీసం రూ.8 పెరిగాయి. కొవ్వు శాతం ఆధారంగా కొన్ని రకాల పాలపై పెంపు రూ.12 వరకు ఉంది. టోన్డ్‌ పాలు రూ.46 నుంచి రూ.54కు, హోమోజెనైజ్డ్‌ పాలు రూ.47 నుంచి రూ.56కు పెరిగాయి. పెరుగు ధర లీటరుకు రూ.54 నుంచి రూ.68కు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement