రూ.4.10 లక్షలు తగ్గిన 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు ధర! | VinFast VF MPV 7 Price Reduced By Over Rs 4 Lakh In India | Sakshi
Sakshi News home page

రూ.4.10 లక్షలు తగ్గిన 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు ధర!

Nov 5 2026 1:45 PM | Updated on Nov 5 2026 1:49 PM

VinFast VF MPV 7 Price Reduced By Over Rs 4 Lakh In India

పండుగ సమయంలో.. ఎలక్ట్రిక్ కారు కొనాలని చూస్తున్న వారికి విన్‌ఫాస్ట్ శుభవార్త చెప్పింది. తన 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు విఎఫ్7 ధరను భారీగా తగ్గించినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌లో లాంచ్ అయిన విన్‌ఫాస్ట్ వీఎఫ్7 ధర అప్పట్లో రూ.24.49 లక్షలుగా ఉండేది. ఇప్పుడు ఏకంగా రూ.4.10 లక్షలు తగ్గించి రూ.20.39 లక్షలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీపావళి పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ధర తగ్గింపు ప్రకటించింది. దీంతో పెద్ద కుటుంబం కోసం 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా మారనుంది.

బ్యాటరీ, రేంజ్
విన్‌ఫాస్ట్ వీఎఫ్7 60.13 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇందులో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 204 హార్స్ పవర్, 280 న్యూటన్ మీటర్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 517 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఛార్జింగ్ విషయానికి వస్తే 80kW డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దీనితో కేవలం 30 నిమిషాల్లోనే బ్యాటరీని 10 నుంచి 70 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. 6.9kW ఏసీ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. అంతేకాదు.. కంపెనీ 3.5kW పోర్టబుల్ ఛార్జర్‌ను కూడా అందిస్తోంది.

ఫీచర్స్
ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ ఉన్నాయి. ఫోర్ స్పీకర్స్ ఆడియో సిస్టమ్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, లెథరెట్ సీట్లు వంటి ఫీచర్లు అందించారు. రెండో వరుస సీట్లను ముందుకు జరుపుకోవచ్చు, వెనక్కి వాల్చుకోవచ్చు. మూడో వరుసలో కూర్చునే ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏసీ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఆరు విధాలుగా అడ్జస్ట్ చేసుకునే డ్రైవర్ సీటు వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.

ఇదీ చదవండి: రూ.2,100 కోట్ల లగ్జరీ హోటల్.. చివరకు అందుకే అమ్మేశారట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement