సముద్ర ఆవరణ వ్యవస్థకు ముప్పు.. ఏం చేయాలంటే.. | Why Marine Scientists Urging for Integrated Ocean Monitoring | Sakshi
Sakshi News home page

సముద్ర ఆవరణ వ్యవస్థకు ముప్పు.. ఏం చేయాలంటే..

Nov 5 2026 11:32 AM | Updated on Nov 5 2026 11:32 AM

Why Marine Scientists Urging for Integrated Ocean Monitoring

పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రత, హీట్‌వేవ్‌, చేపల వలస, పగడపు దిబ్బల నష్టం (కొరల్ బ్లీచింగ్), నాచు వ్యాపించడం (ఆల్గల్ బ్లూమ్స్) వంటి పర్యావరణ ముప్పులు ప్రపంచవ్యాప్తంగా సముద్ర ఆవరణ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో మత్స్య సంపదను, తీర ప్రాంత ప్రజల ఉపాధిని కాపాడుకోవడానికి సముద్ర పర్యవేక్షణలో సరికొత్త సమగ్ర విధానాన్ని అవలంబించాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

కొచ్చిలో ప్రారంభమైన మూడు రోజుల అంతర్జాతీయ ‘ట్రెవర్ సఫారీ’ సదస్సులో ఈ అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. మత్స్య, జలచరాల పెంపకంలో రిమోట్ సెన్సింగ్ చిత్రాల సోషల్‌ అప్లికేషన్లపై ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 దేశాల నుంచి 300 మందికి పైగా శాస్త్రవేత్తలు, వాతావరణ నిపుణులు, సముద్ర పరిశోధకులు హాజరయ్యారు. కేంద్రీయ సముద్ర మత్స్య పరిశోధనా సంస్థ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది.

సాంకేతికత అనుసంధానం

సముద్రాల్లో వస్తున్న భౌతిక, జీవసంబంధ మార్పులను పక్కాగా అంచనా వేయడానికి శాటిలైట్ రిమోట్ సెన్సింగ్, సముద్ర పరిశీలనలు, వాతావరణ నమూనాలు, ఏఐ, క్షేత్రస్థాయి డేటాలను అనుసంధానించాలని నిపుణులు కోరారు. దీనిద్వారా సకాలంలో హెచ్చరికలు జారీ చేసేందుకు వీలవుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ సదస్సును ప్రారంభించిన యూకేలోని ‘పర్చర్‌షిప్ ఫర్ అబ్జర్వేషన్ ఆఫ్ ది గ్లోబల్ ఓషన్’ (పీఓజీఓ) సీఈఓ డాక్టర్ సోఫీ సీయవా వెల్లడించిన వివరాల ప్రకారం.. పొటెన్షియల్‌ ఫిషింగ్‌ జోన్లను గుర్తించడం, హానికరమైన ఆల్గల్ బ్లూమ్‌లను పసిగట్టడం, మెరైన్ హీట్‌వేవ్‌లను అంచనా వేయడంలో సాంకేతిక నూతన ఆవిష్కరణలు అత్యంత కీలకం. ఇప్పటికే పీఓజీఓ సంస్థ 102 దేశాల నుంచి సుమారు 1,500 మంది యువ సముద్ర శాస్త్రవేత్తలకు శిక్షణనిచ్చి సముద్ర పరిశీలనలను ప్రపంచవ్యాప్తంగా బలోపేతం చేసిందని ఆమె గుర్తుచేశారు.

భారత అంతరిక్ష పరిశోధనల పాత్ర

ఇస్రో పరిధిలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎన్.అపర్ణ మాట్లాడుతూ.. భారతదేశం చేపట్టిన అధునాతన సముద్ర పరిశీలన ఉపగ్రహాలు సముద్ర ఆవరణ వ్యవస్థల పర్యవేక్షణను మరింత బలోపేతం చేస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఈఓ-06 (ఓషన్‌శాట్-3) ఉపగ్రహంలోని ‘ఓషన్ కలర్ మానిటర్-3’ (ఓసీఎం-3) సముద్ర ఉత్పాదకతను, క్లోరోఫిల్-ఏ గాఢత మార్పులను గుర్తించడంలో అద్భుతంగా పనిచేస్తోందన్నారు. ఈ సాంకేతికత ఆధారంగా సిఫారసు చేసిన ప్రాంతాలలో మత్స్యకారులు వేటాడినప్పుడు సాధారణ ప్రాంతాలతో పోలిస్తే 1.5 రెట్ల నుంచి 4 రెట్లు అధికంగా చేపల దిగుబడి వస్తున్నట్లు సీఎంఎఫ్‌ఆర్‌ఐ నివేదిక వెల్లడించింది.

ఇదీ చదవండి: డబ్బును దాచుకుంటే దరిద్రం!?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement