కిడ్స్ స్పెషల్
మన ఇంగ్లిష్
భూమిపై ఎక్కడ చూసినా నీరే కనిపించే సముద్రం.. కానీ ఇంగ్లీషులో మాత్రం అన్నింటినీ ఒకే పేరుతో పిలవరు! నీటి విస్తీర్ణం, భూమి చుట్టూ ఉన్న తీరు, రెండు భూభాగాల మధ్య ఉన్న దూరాన్ని బట్టి పేర్లు మారిపోతాయి. మరి ఓషన్, సీ, గల్ఫ్, బే, స్ట్రెయిట్, ఛానల్ మధ్య తేడాలేంటో తెలుసుకుందామా?
సముద్రం అనే ఒక్క తెలుగు మాటకు ఇంగ్లీషులో చాలా మాటలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ల దగ్గర సముద్రం అంటే అన్నీ ఒకే రకం కాదు, సైజును బట్టి, లోతును బట్టి, ఒడ్డును బట్టి వేరు వేరు పేర్లు పెట్టారు.
Ocean: అతిపెద్ద సముద్రం. ప్రపంచంలో 5 ఓషన్లే ఉన్నాయి. Pacific Ocean, Atlantic Ocean. ఓషన్ అంటే చాలా లోతైనది, విశాలమైనది.
Sea: ఓషన్ కంటే చిన్నది. కొంత భూమి చుట్టూ ఉన్నది. Arabian Sea, Red Sea, Mediterranean Sea లాగా.
Gulf: సముద్రం భూమిలోకి లోతుగా చొచ్చుకుని వచ్చిన భాగం. Gulf of Mexico, Persian Gulf లాగా.
Bay: గల్ఫ్ కంటే చిన్నది, అర్ధవృత్తాకారంగా ఉన్న భాగం. Bay of Bengal.
Strait: రెండు భూభాగాల మధ్య ఉన్న ఇరుకైన నీటి దారి. Strait of Malacca.
Channel: స్ట్రైట్ లాగానే, కానీ కొంచెం వెడల్పైనది. English Channel.
ఇదీ చదవండి: పులివేషం ఎక్కడ పుట్టిందో తెలుసా?


