breaking news
Kids Special
-
అమ్మంటే బలే ఇష్టం...ఎందుకో చెప్పనా..?
పిల్లలూ... అమ్మంటే ఎందుకు ఇష్టమో ఎప్పుడైనా అమ్మకు చెప్పారా? ప్రేమతో హగ్ చేసుకుని ‘అమ్మా... నువ్వంటే ప్రాణం’ అని చె΄్పారా? అమ్మ అదే మాట మనతో ఎన్నిసార్లు అనుంటుంది. అమ్మ మీద ఇష్టం అమ్మకు చెబుతుండాలి. ఇవాళ ‘మదర్స్ డే’. ఒక కాగితం మీద ‘బెస్ట్ మామ్ ఇన్ ది వరల్డ్’ హెడ్డింగ్ పెట్టి అమ్మ ఎందుకు గొప్పదో రాసి గిఫ్ట్‌గా ప్రెజెంట్ చేయండిపిల్లలూ... మీకు ‘గమ్’ తెలుసు కదా. అది తనకూ మీకూ పూసి మీతో అంటుకు΄ోవడం తప్ప అమ్మ మీ కోసం అన్నీ చేస్తుంది. మీ ఆకలే తన ఆకలి. మీ నిద్రే తన నిద్ర. మీ నవ్వే తన నవ్వు. మీరు ఎక్కడకు అడుగులు వేసినా ఆమె కళ్లు వెనుకే వస్తుంటాయి. మీరు బయట ఆడుకుంటుంటే ఆమె ఇంట్లో నుంచే మీ ఆటను ఇమాజిన్ చేస్తుంది. మీకు దెబ్బ తగలగానే మీరు వచ్చి చెప్పే ముందే ఆమెకు తెలిసి΄ోతుంది. మీరంటే అంత ఇష్టం అమ్మకు. మరి మీక్కూడా ఇష్టమేగా. మే 11 ‘మదర్స్ డే’ సందర్భంగా పేపర్ మీద ఆ ఇష్టాన్నంతా పెట్టి అమ్మకు ప్రెజెంట్ చేద్దామా. కొందరు పిల్లలు మదర్స్ డేకు అమ్మకు ఎలాంటి లెటర్స్ రాశారో చూడండి. మీరు ఇంకా డిఫరెంట్‌గా ట్రై చేయండి.మై డియర్ మామ్...నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే గాడ్ కంటే ఎక్కువ ఇష్టం. మా క్లాస్‌లో అందరూ సీక్రెట్స్ ఫ్రెండ్స్‌తో చెప్పుకుంటారు. నేను నీతో చెబుతా. ఎందుకంటే నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. ఇంగ్లిష్ మీడియమ్ స్కూల్లో సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకోవాల్సి వస్తే నువ్వే ఇంట్లో తెలుగు నేర్పించావు. ఎంత మంచి టీచర్‌వి నువ్వు. మా స్కూల్లో నీ లాంటి టీచర్ ఉంటే అందరూ ఫస్టే. అమ్మా.... నువ్వు సింగర్వా. అప్పుడప్పుడు హమ్ చేస్తుంటావు. నేను వింటుంటాలే. ఆ హమ్ చేసే అమ్మ ఇంకా ఇష్టం నాకు. నీకు మదర్స్ డే హగ్స్.– శ్రావ్య, క్లాస్ 7, మదనపల్లిడియర్ అమ్మా...థ్యాంక్యూ... ఎప్పుడూ కారులో డాడీ పక్కన నన్ను కూచోబెట్టి నువ్వు వెనక కూచుంటావు. డాడీ నిన్ను ముందు కూచోమన్నా పాపకు అక్కడే ఇష్టం’ అంటావు. దారిలో నువ్వే దిగి ఐస్‌క్రీమ్ కొనుక్కొని వస్తావు. నేను బ్యాడ్ కలర్స్‌తో డ్రస్ సెలెక్ట్ చేసుకుంటే మంచి డ్రస్ చూపించి ఇదే బాగుందని ఒప్పిస్తావు. ముందు కోపం వచ్చినా రాను రాను అది నా ఫేవరెట్ డ్రస్ అవుతుంది. అమ్మా... నాకేం కావాలో నీకు అన్నీ తెలుసు. నేను నీ కోసం బాగా చదువుకుని బెస్ట్‌గా ఉంటానని ఈ మదర్స్ డే రోజు ప్రామిస్ చేస్తున్నా. లవ్ యూ.– మౌనిక, క్లాస్ 8, హైదరాబాద్టు మై బెస్ట్ మామ్...అమ్మా... ఫస్ట్ ఈ బ్యూటిఫుల్ వరల్డ్‌లోకి నన్ను తీసుకు వచ్చినందుకు థ్యాంక్స్. నా కోసం నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నావో నాకు తెలుసు. ఇంట్లో నువ్వు, నేను మాత్రమే ఉంటాం. డాడీ మనతో లేకున్నా నేను ఆ ఆబ్సెన్స్ ఫీలవకుండా డబుల్ ఎనర్జీతో కష్టపడతావ్. నా ఆథార్ కార్డ్ కరెక్షన్ కోసం నువ్వు పరేషాన్‌గా తిరుగుతుంటే ఏడుపు వచ్చింది. నాకు కొంచెం బాగా లేకున్నా హాస్పిటల్‌కు పరిగెత్తుతావ్. రాత్రంతా నిద్ర పోకుండా చూస్తావ్. నీకు ఎవరూ లేరని అనుకోకు. నేనున్నాను. నాకు నువ్వే మమ్మీవి... డాడీవి. ఐ రెస్పెక్ట్ యూ. cherish every moment we share, and I look forward to many more memories together. హ్యాపీ మదర్స్ డే.– దివ్య, క్లాస్ 10, విజయవాడగుడ్ మార్నింగ్ అమ్మా...మదర్స్ డే రోజు నీ కోసం రాస్తున్న లెటర్ ఇది. ఇలా రాయడం నాకు వెరీ న్యూ. ఏం రాయాలి? నీకు పెట్స్ అంటే ఇష్టం లేదు. నాకు ఇష్టం. రాకీ గాణ్ణి తెచ్చుకుంటానని అన్నప్పుడు గట్టిగట్టిగా వద్దన్నావ్. నేను హర్ట్ అయ్యి రాత్రంతా ఏడ్చానని ఓన్లీ ఫర్ మీ ఓకే చేశావ్. అదిప్పుడు నాకు మాత్రమే కాదు నీక్కూడా బెస్ట్ ఫ్రెండే. అమ్మా... థ్యాంక్యూ ఫర్ యువర్ అన్‌కండీషనల్ లవ్.– నీ నందు/ఎర్రపండు, క్లాస్ 9, వాల్టేర్మామ్... మొమ్మ... మమ్మ... అమ్మ‘మామ్’ అనే పదం పిల్లల నుంచే వచ్చింది! తల్లిని ‘మామ్’ ‘మొమ్మ’ ‘మమ్మ’ అని పిలిచే పేర్లు ప్రపంచంలోని వివిధ భాషల్లో ఉన్నాయి. పసిబిడ్డలు పూర్తిగా మాట్లాడలేని రోజుల్లో చేసే శబ్దాల నుంచే ఈ పేర్లు పుట్టాయి అంటారు భాషావేత్తలు.మదర్నింగ్ సండేస్‘మదర్స్ డే’ మూలాలు పురాతన గ్రీకు, రోమన్ సంప్రదాయాలలో ఉన్నాయి. 16వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో ‘మదర్నింగ్ సండేస్’ రోజు పిల్లలు ఎక్కడ ఉన్నా తమ తల్లి దగ్గరికి వచ్చి ఆమె కోసం కేక్ తయారుచేసేవారు.మదర్స్ డే స్టాంప్తల్లుల గౌరవార్థం అమెరికాలో 1934లో మే 2న వయొలెట్ స్టాంప్‌ను విడుదల చేశారు. జేమ్స్ మెక్ నీల్ విస్లర్ ప్రసిద్ధ కళాఖండం ‘΄ోర్రై్టయిట్ ఆఫ్ మై మదర్’ ఆధారంగా ఈ స్టాంప్‌ను రూ΄÷ందించారు.మదర్ ఆఫ్ మదర్స్ డేవర్జీనియా(అమెరికా)కు చెందిన కాపీరైటర్ అన్నా జార్వీస్కు ‘మదర్ ఆఫ్ మదర్స్ డే’ అని పేరు. అమెరికా అంతర్యుద్ధ కాలంలో జార్వీస్ అమ్మ ఆన్ ఇరువైపుల సైనికులను దృష్టిలో పెట్టుకొని ‘మదర్స్ వర్క్ క్లబ్’లను నిర్వహించేది. యుద్ధ సమయంలో తన తల్లి సాగించిన శాంతి ప్రయత్నాలకు గుర్తుగా, గౌరవార్థంగా ‘మదర్స్ డే’ను ప్రారంభించింది అన్నా జార్వీస్. 1908లో వెస్ట్ వర్జీనియాలోని గ్రాఫ్టన్ నగరంలో, ఫిలడెల్ఫియాలో మొదటి అధికారిక ‘మదర్స్ డే’ వేడుకలు మే నెలలోని రెండో ఆదివారం జరిగాయి. మొదటి అధికారిక ‘మదర్స్ డే’ 1914 మే 10న జరిగింది.మదర్స్ డే ప్రేయర్వర్జీనియా(యూఎస్) టేలర్ కౌంటీలోని ఆండ్రూస్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చిని అంతర్జాతీయ మాతృదినోత్సవ మందిరంగా పిలుస్తారు. ‘మదర్స్ డే’ గురించి అన్నా జార్వీస్ ఆలోచించిన ప్రదేశంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ మందిరంలో ప్రతి సంవత్సరం ‘మదర్స్ డే’ ప్రార్థన నిర్వహిస్తారు. (చదవండి: అమ్మ వల్లే డాక్టర్‌నయ్యా!) -
అరటికాయతో బజ్జీలు కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి!
కావలసినవి: అరటికాయలు – 2 (మీడియం సైజువి, ముందుగా ఉడికించి, తొక్క తీసి, చల్లారాక మధ్యలో గింజల భాగం తొలగించి, మెత్తగా గుజ్జులా చేసుకోవాలి) అటుకులు – అర కప్పు (కొన్ని నీళ్లల్లో నానబెట్టి, పేస్ట్‌లా చేసుకోవాలి), కొత్తిమీర తరుగు – కొద్దిగా జొన్నపిండి – పావు కప్పు, జీలకర్ర – అర టీ స్పూన్ జీడిపప్పులు – 10 (నానబెట్టి పేస్ట్‌లా చేసుకోవాలి) చాట్ మసాలా – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్ పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు – కొద్దికొద్దిగా (అభిరుచిని బట్టి) నూనె – సరిపడా. ఉప్పు – తగినంత తయారీ: ముందుగా అరటికాయ గుజ్జు, అటుకుల పేస్ట్ వేసుకుని దానిలో కారం, చాట్ మసాలా, జొన్నపిండి, తగినంత ఉప్పు, జీలకర్ర, జీడిపప్పు పేస్ట్, కొత్తిమీర తరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఇతర కూరగాయల తురుము వంటివి కలుపుకోవచ్చు. అనంతరం ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి ఫింగర్స్లా, పొడవుగా చిత్రంలో ఉన్న విధంగా ఒత్తుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. వాటిని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. (చదవండి: దేశ దేశాల నామాయణం! పేర్లు మార్చకున్న దేశాలు ఇవే! ) -
నక్క పగటి కల
ఒక సింహం అడవికి రాజయ్యింది. రాజన్నాక పక్కన మంత్రి ఉండాలిగా మరి... అందుకే సింహం అదే వ్యాపకంలో పడింది. ఆ విషయం నక్కకు తెలిసింది. ఎలాగైనా అది ఆ మంత్రి పదవిని చేజిక్కించుకోవాలనుకుంది. ఒక రోజు నక్క పనిగట్టుకొని సింహం ఉన్న గుహవైపు వెళ్లింది. ధైర్యం చేసి గుహ లోపలకు దూరింది. సింహం కనిపించింది. నక్క వెంటనే ఒక నమస్కార బాణం సింహంపై విసిరింది. ఆ నమస్కార బాణానికి సింహం మొహమాటంలో పడిపోయింది. ఏమిటిలా వచ్చావని నక్కతో మాట కలిపింది. కొత్తగా రాజు అయిన మిమ్మల్ని అభినందించడానికి వచ్చానని నక్క సమాధానమిచ్చింది. సింహానికి చాలా ఆనందమనిపించింది. అభినందనలు తెలిపిన నక్కకు ధన్యవాదాలు తెలిపింది. ఆ రోజు నుంచి నక్క రెచ్చిపోయింది. రోజూ అది సింహం వద్దకు వెళ్లడం ఆరంభించింది. రోజుకొక జంతువు మీద సింహానికి ఫిర్యాదు చేస్తుండేది. ఒకరోజు సింహం కంటే ఎత్తుగా ఉంటానని ఏనుగుకి గర్వమని చెప్పింది. మరొకరోజు సింహానికి సమ ఉజ్జీనని పులి ప్రగల్భాలు పలుకుతుందని చెప్పింది. ఇంకోరోజు తనలాగ రెండు కాళ్లతో సింహం నడవలేదని ఎలుగుబంటి హేళన చేస్తుందని చెప్పింది. ఇలా రోజూ నక్క అడవిలోని ప్రతి జంతువూ సింహాన్ని తేలిక చేసి మాట్లాడుతున్నట్లు చెబుతుండేది. తానొక్కటే తమ వద్ద భయభక్తులతో ఉంటానని సింహానికి నూరి పోస్తుండేది. రోజూ ఒకే తీరుగా నక్క చెబుతున్న మాటలు సింహం ఎన్నాళ్లు వినగలదు?! కొన్నాళ్లకు ఆ మాటలు సింహానికి విసుగనిపించాయి. ఒకసారి చిరాకు పడి ‘‘అడవిలో నేను సంచారం చేస్తున్నప్పుడు అన్ని జంతువులూ భయభక్తులు ప్రదర్శిస్తున్నాయే! అవి ఏనాడూ నన్ను చులకన చేయలేదే!’’ అని సింహం నక్కతో అంది..! ‘‘మీరు అమాయకులు! నా మాట నమ్మండి. మీరు కనిపించేసరికి జంతువులు వంకరదండాలు పెడుతున్నాయి. మీరది తెలుసుకోలేక పోతున్నారు. ఈ పరిస్థితుల్లో నాలాంటి మంత్రి మీ పక్కన ఉంటేనే మీ ప్రాణానికి భద్రత! మీ శ్రేయస్సు కోరి చెప్పాను. ఆపైన మీ ఇష్టం!’’ అని నంగనాచిలా పలికింది నక్క! సింహానికి నక్క ఎత్తుగడ అర్థమయింది. అరికాలి మంట నెత్తికెక్కింది దానికి! ‘‘ఏయ్ జిత్తులమారి నక్కా! నీ పన్నాగం నాకు అర్థమైంది. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు! అన్ని జంతువులనూ చెడ్డ చేసి మంత్రి అయిపోవాలనుకుంటున్నావా? ఎవరిలోనూ మంచిని చూడలేని నిన్ను మంత్రిగా పెట్టుకుంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదడానికి సిద్ధమైనట్టే! నా కోపాన్ని మరీ రెచ్చగొట్టకు పో!’’ అంది సింహం. తన కల పగటి కలే అయిందనుకుంది నక్క. ఒక్క క్షణం కూడా సింహం ముందు నిలబడలేదు. బతుకు జీవుడా అని పారిపోయింది. -
నాకూ మమ్మీ, డాడీ ఉన్నారు
చేతికి వచ్చిన గింజ ఎక్కడ పుట్టిందో మనకు తెలియదు.. ఇప్పుడది అనాథ! దాన్ని మనం ‘విత్తు’ చేస్తే.. దానికి ప్రేమ, అనురాగం, రక్షణలాంటి పోషకాలు ఇస్తే.. ఇంకేముంది.. మిగతా కథ మీకు తెలుసు! గింజను పెంచుకోకపోతే మనం అనాథలమవుతాం! ‘ఏంటీ విశేషం.. స్వీట్స్ పంచుతున్నారు?’ కాజూబర్ఫీ అందుకుంటూ అడిగింది సరిత. ‘మా దీప క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయింది సరితగారూ.. ’ మెరుస్తున్న కళ్లతో చెప్పింది సంగీత. ‘కంగ్రాట్స్ అండీ’ చూపుల్లోనూ అభినందన తెలిపింది సరిత.థ్యాంక్స్ అంటూ వెళ్లిపోతున్న సంగీతనే చూస్తుండిపోయింది ఆమె. గడిచిన కాలం గుర్తొచ్చింది. దాదాపు పదేళ్ల కిందట (విజయవాడలో)... నర్సమ్మ.. తమ కాలనీలోనే ఉన్న స్కూల్లో ఆయా. ఆమె భర్త పచ్చి తాగుబోతు. ఏంచేసేవాడు కాదు. ఆ ఇంటిని తన రెక్కల కష్టంమ్మీదే నడిపేది నర్సమ్మ. ఉదయం ఆరు నుంచి స్కూల్ టైమ్ వరకూ ఇళ్లల్లో పనిచేసేది. మళ్లీ సాయంకాలం స్కూల్ అయిపోయాక ఇళ్లల్లో పనికొచ్చేది. అలా ఆ అపార్ట్మెంట్, థర్డ్ ఫ్లోర్‌లోని తమ నాలుగు ఫ్లాట్లలో కూడా చేసేది. ఉన్న ఇద్దరాడపిల్లలను బాగా చదివించాలని ఆమె తపన. తాగీతాగీ లివర్ చెడిపోయి భర్త చనిపోయాడు. అతను ఉన్నా ఏనాడూ ఆ నమ్మకాన్నివ్వలేదు కాబట్టి భర్త మరణం నర్సమ్మను పెద్దగా కుంగదీయలేదు. కాని విధి ఆ పని చేసింది. నర్సమ్మ శరీరంలో క్యాన్సర్ కణాన్ని ప్రేరేపించి. దాంతో భర్త పోయిన యేడాదికి పేగు క్యాన్సర్‌తో నర్సమ్మా చనిపోయింది. అప్పటికి ఆమె పెద్ద కూతురికి పదేళ్లు, చిన్న కూతురికి ఎనిమిదేళ్లు. అనాథలయ్యారు. ఈ నాలుగు ఫ్లాట్ల వాళ్లే నర్సమ్మ అంత్యక్రియలు జరిపించారు. ఆ ఇద్దరు ఆడపిల్లల పరిస్థితే ఎవరికీ మింగుడు పడలేదు. నర్సమ్మ తాలూకు బంధువులెవరి జాడా లేదు. ఆ పిల్లల్ని ఎక్కడ పెట్టాలి? ఆడపిల్లలు కాబట్టి బాధ్యత తీసుకోవడానికి ఎవరూ రాలేదు. కనీసం హాస్టల్లో పెట్టి చదివించడానిక్కూడా ఈ ఫ్లాట్లల్లో ఉన్నవాళ్లు ధైర్యం చేయలేదు. అప్పుడు ముందుకొచ్చింది సంగీత. అప్పటికే తనకు ఇద్దరు ఆడపిల్లలు. అయినా ఈ ఇద్దరినీ దత్తత తీసుకొంది. ఆ పిల్లల్లో ఒక పిల్లే దీప. నర్సమ్మ పెద్ద బిడ్డ. ఈ కుటుంబమూ ఆ పిల్లను పెద్ద కూతురిగానే భావిస్తోంది. ఆ ఇద్దరు అమ్మాయిలను తమ పిల్లలతో సమానంగా చదివిస్తోంది. నర్సమ్మ చిన్న కూతురు కూడా చదువులో చురుకు. సివిల్స్‌కి ప్రిపేర్ చేయించాలనే ఆలోచనలో ఉన్నారు సంగీత దంపతులు. ఆ రోజు వాళ్లు ఈ ఇద్దరినీ అక్కున చేర్చుకోకపోతే ఈ రోజు ఏ స్థితిలో ఉండేవారో? రెండేళ్ల నాటి ఇంకో సంఘటన.. ఇది తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం, నిమ్మపల్లి అనే ఊళ్లో జరిగింది. గుమ్మడిదారి భవాని, భార్గవి, విష్ణు తోబుట్టువులు. రెండేళ్ల కిందట తల్లిదండ్రులను కోల్పోయారు. అనాథలైన ఈ ముగ్గురి గురించి సాక్షి దినపత్రికలో చదివి తెలుసుకున్న అప్పటి సిరిసిల్ల డీఎస్పీ దామెర నర్సయ్య, వేములవాడ రూరల్ సీఐ మాధవి కలిసి ఈ ముగ్గురు పిల్లలను దత్తత తీసుకున్నారు. అబ్బాయి విష్ణును రంగినేని ట్రస్ట్‌లో, అమ్మాయిలిద్దరినీ తగంళ్లపల్లి కస్తూరిబా పాఠశాలలో చేర్పించారు. ఈ ఇద్దరు అమ్మాయిల సంరక్షణ, చదువు, ఖర్చులన్నిటినీ సీఐ మాధవే చూసుకుంటున్నారు.ఇప్పుడు.. భవాని పదోతరగతి (మొన్నటి) పరీక్షల్లో 9.7 జీపీఏ సాధించింది. ‘మేడమ్ నన్నెప్పుడు.. ‘‘అమ్మలా అడుగుతున్నా.. టెన్త్‌లో టెన్‌కి టెన్ జీపీఏ తెచ్చుకోవాలి’ అంటూ ఎంకరేజ్ చేసేవారు’ అని భవాని గుర్తుచేసుకుంది. ‘భవాని చురుకైన పిల్ల. మెరిట్ సాధిస్తుందని నాకు ముందే తెలుసు. నా నమ్మకాన్ని నిలబెట్టింది’ అని గర్వంగా చెప్పారు సీఐ మాధవి.అక్కడొక దీప.. ఇక్కడొక భవాని... మరెక్కడో ఒక పవన్.. ఇంకెక్కడో నిరంజన్... కొన్నాళ్లు తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగి ప్రమాదవశాత్తో.. దురదృష్టవశాత్తో వాళ్లను కోల్పోయి ఆ ప్రేమకు దూరమైన వాళ్లు. మరికొందరు పిల్లలైతే పుట్టుకతోనే అమ్మానాన్నేంటి.. అసలు నా అన్నవాళ్లే లేక అనాథ శరణాలయంలోని ఊయల ఒడి ఆసరాగా.. తమ చిట్టిపిడికిటి చిరుభద్రతతోనే పెరుగుతున్నారు. అమ్మానాన్న, అవ్వాతాత, అత్తామామ, పిన్నిబాబాయ్, అక్క, అన్న, చెల్లి, తమ్ముడు .. వంటి బంధాలు, మంచిచెడు, మర్యాదమన్నన, చదువుసంస్కారం వంటి పెంపక విలువలూ అందక.. సమాజానికి బానిసలుగానో.. బెడదగానో తేలుతున్నారు. దత్తత ఈ పౌరులు బానిసలుగానో, బెడదగానో తయారవడం భారత భవితవ్యానికి అత్యంత ప్రమాదకరం. అందుకే ఈ పొత్తిళ్ల బాల్యానికి అమ్మ ప్రేమ అండకావాలి. ఆ బుజ్జి అడుగులకు నాన్న చేతి ఆప్యాయత అందాలి. ఆ కుటుంబం లోని మిగిలిన అనూరాగాలకూ వీళ్లూ పాత్రులు కావాలి. మార్గం దత్తత. ప్రేమను పంచాలనుకునే దయామయులందరికీ! అమ్మతనాన్ని చాటుకోవడానికి పేగు బంధమే ఉండక్కర్లేదు. నాన్నరికం చూపించుకోవడానికి రక్తసంబంధమే కానక్కర్లేదు. చలించే మనసుంటే చాలు. ఆ బిడ్డలకు అమ్మానాన్న కావచ్చు. వాళ్లకు కొత్త జీవితమివ్వచ్చు! దత్తత పూర్తిగా మానవత్వానికి సంబంధిందే అయినా ఆ అనాథల క్షేమం కోసం దానికి చట్టభద్రతనూ కల్పించారు. అంటే ఈ పిల్లలకు, వాళ్లను పెంచుకునే వారికి మధ్య బాంధవ్యాలన్నీ పారదర్శకమేనన్నమాట. అచ్చంగా మన సొంత వాళ్లతో ఉన్నట్లే. పరాయి వాళ్లను సొంతం చేసుకోవడమన్నట్లే! మూడే అక్షరాలు .. నూరేళ్ల జీవితానికి రక్ష దత్తత.. మూడు అక్షరాలే. కాని నూరేళ్ల జీవితానికి నిండైన రక్షణ కల్పిస్తోంది. అనాథలుగా మిగిలిపోకుండా అనురాగాల పందిరి కిందకు చేరుస్తోంది. తద్వారా అమ్మానాన్న అనే హోదానే కాకుండా ఆ జీవితాలకు ఓ అర్థం కల్పించే బృహత్తర అవకాశాన్ని ఇస్తోంది. మానవతామూర్తులుగా నిలబెడుతోంది. మానవరూపంలో ఉన్న దైవాలుగా నీరాజనాలు అందిస్తోంది. నేను, నువ్వు దాటి మనం అనే పెద్దమాటను ప్రమోట్ చేస్తోంది. పరాయి బిడ్డలతో సొంత కుటుంబ పరిధిని విస్తృతంకావిస్తోంది. అనాథలను దత్తత తీసుకున్న సెలబ్రెటీలు సలీంఖాన్, హెలెన్... అర్పితాఖాన్ అర్పితాఖాన్ తెలిసే ఉంటుంది. సల్మాన్ ఖాన్ చెల్లెలు. ఆమె నచ్చిన, మెచ్చిన వరుడితో హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో అంగరంగవైభవంగా పెళ్లిచేశారు సల్మాన్ ఖాన్ అండ్ బ్రదర్స్. ఆ అర్పితాఖాన్ ఆ సోదరులకు రక్తం పంచుకుపుట్టిన తోబుట్టువు కాదు. ప్రేమను పంచుకొని పెరిగిన సోదరి. సలీమ్ ఖాన్, హెలెన్ల దత్త కుమారి. సుస్మితాసేన్.. రెనీ.. అలీషా సుస్మితా విశ్వసుందరిగా జగమంతా పరిచయమే. ఆమె మనసూ విశ్వమంత విశాలమైనదని నిరూపించుకున్నారు. అనాథలకు అమ్మగా ఉంటానని విశ్వసుందరి వేదిక మీద చెప్పిన మాటను చేతల్లోకి తెచ్చారు. తన 25 వ యేట రినీ అనే ఓ వీథిబాలను దత్తత తీసుకొని అమ్మ అయ్యారు. అలాగే 2010లో అలీషా అనే ఇంకో అనాథనూ అక్కున చేర్చుకొని రినీకి తోబుట్టువును చేశారు. సింగిల్ మదర్‌గానే ఆ ఇద్దరినీ పెంచుతున్నారు. రవీనా టండన్.. ఛాయ.. పూజ నటిగా రవీనా కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే తన దూరపు బంధువు.. వరుసకు కజిన్ అవుతుంది. ఆమె పిల్లలను దత్తత తీసుకుంది. ఆ ఇద్దరే ఛాయ, పూజ. కజిన్ కుటుంబం అప్పుల్లో కూరుకుపోయి రోడ్డున పడ్డప్పుడు ఆ ఇద్దరు ఆడపిల్లల పెంపకం బాధ్యతను స్వీకరించింది రవీనా. అప్పటికి ఆమె వయసు కేవలం 21 ఏళ్లు. మిథున్ చక్రవర్తి.. దిషాని డిస్కోకింగ్.. మిథున్ చక్రవర్తి పేరు ఈ తరానికీ తెలిసే ఉంటుంది. బాలీవుడ్ హీరో. దిషాని అనే అనాథను దత్తత తీసుకొని తనెంత కారుణ్యమూర్తో తెలియజేశాడు. ఈ అమ్మాయిని తన ముగ్గురు కొడుకులు మహాక్షయ్, ఉష్మే, నమాషిలతో సమానంగా పెంచాడు. దిబాకర్ బెనర్జీ... ఈ పేరు చెప్పగానే వినిపించే సినిమా షాంఘై, నిన్నటి డిటెక్టివ్ బ్యోమ్‌కేశ్ బక్షీ.. ఎట్సెట్రా. ఈ బాలీవుడ్ డైరెక్టర్ కూడా ముంబైలోని ఓ అనాథాశ్రమం నుంచి ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నాడు. నీలం.. అహానా నీలం.. 80, 90ల్లోని బాలీవుడ్ హీరోయిన్. ఒకటిరెండు తెలుగు సినిమాల్లోనూ నటించారు. బాలీవుడ్ నటుడు సమీర్ సోనీని పెళ్లి చేసుకున్నారు. వీళ్ల పెళ్లయిన రెండేళ్లకు అహానా అనే అనాథ పిల్లను దత్తత తీసుకున్నారు. కునాల్.. రాధ ఫనా సినిమా ఎంత హిట్టో తెలుసు కదా! ఆ సినిమా దర్శకుడే కునాల్ కొహ్లీ. అతనూ ఓ ఏడునెలల చిన్నారిని దత్తత తీసుకున్నాడు. ఆ అమ్మాయికి రాధ అని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు కునాల్, ఆయన భార్య రవీనా. రాహుల్‌బోస్.. బాలీవుడ్ అండ్ బెంగాలీ యాక్టర్. పూర్ణ సినిమాతో తెలుగువాళ్లకూ పరిచయం అయ్యాడు. సామాజిక సేవలో ముందుంటాడు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక అనాథాశ్రమాన్ని నడిపిస్తున్నాడు. అందులోంచి ఆరుగురు పిల్లలను దత్తత తీసుకున్నాడు. శోభన.. అనంతనారాయణి నటిగా, భరతనాట్య కళాకారిణిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు శోభన. ఆమె ఓ అనాథను అక్కున చేర్చుకున్నారు. అనంత నారాయణి అని పేరు పెట్టుకొని సింగిల్ పేరెంట్‌గానే ఆ పాపను పెంచుతున్నారు. కేరళలోని తనకు ఇష్టమైన గురవాయూర్ గుడిలో ఆ దత్తపుత్రికకు శాస్త్రోక్తంగా అన్నప్రాశన కావించారు. నిఖిల్ అద్వాని.. కేయా బాలీవుడ్ డైరెక్టర్. కేయా అనే అనాథను దత్తత తీసుకున్నాడు. ప్రీతీజింటా... హృషీకేశ్‌లోని మదర్ మిరాకిల్ అనే స్కూల్లోని 34 మంది అనాథలను దత్తత తీసుకొని వాళ్లను చదివిస్తున్నారు ప్రీతి జింటా. అనాథలను అక్కున చేర్చుకొని వాళ్లకు కొత్త జీవితాన్ని అందించిన ప్రేమమూర్తులు హాలీవుడ్‌లోనూ ఉన్నారు. హాలీవుడ్లో దత్తత అనగానే గుర్తొచ్చే మొదటి పేరు ఎంజలీనాజోలీ. ఆ తర్వాత జాబితా పెద్దగానే ఉంది. మడోన్నా, సాండ్రా బుల్లక్, మేరీ లూయీస్ పార్కర్, షరాన్ స్టోన్, టామ్ క్రూజ్, నికోల్ కిడ్మన్.. వీళ్లంతా ఆ వరుసలో ఉంటారు. ముగింపు.. దత్తత.. వ్యక్తిగత విషయమే. అయినా సామాజిక బాధ్యతనూ ఇముడ్చుకున్న ప్రక్రియ. మనలోని మానవత్వానికి నిదర్శనం! మనసున్న మనుషులున్నంత వరకూ ఎవరూ అనాథలు కారని నిరూపించే ఆలంబన! ఈ భూమ్మీద పడ్డవారందరికీ బతికే హక్కు ఉంది. మంచి జీవితాన్ని ఆస్వాదించే అవసరమూ ఉంది. ఆ హక్కు వాళ్లది. ఆ అవసరం మనం తీరుద్దాం! మనకు ఒక బిడ్డ చాలు.. దత్తతతో ఇంకో బిడ్డను మనలో కలుపుకుందాం!