
పిల్లలూ... అమ్మంటే ఎందుకు ఇష్టమో ఎప్పుడైనా అమ్మకు చెప్పారా? ప్రేమతో హగ్ చేసుకుని ‘అమ్మా... నువ్వంటే ప్రాణం’ అని చె΄్పారా? అమ్మ అదే మాట మనతో ఎన్నిసార్లు అనుంటుంది. అమ్మ మీద ఇష్టం అమ్మకు చెబుతుండాలి. ఇవాళ ‘మదర్స్ డే’. ఒక కాగితం మీద ‘బెస్ట్ మామ్ ఇన్ ది వరల్డ్’ హెడ్డింగ్ పెట్టి అమ్మ ఎందుకు గొప్పదో రాసి గిఫ్ట్‌గా ప్రెజెంట్ చేయండి
పిల్లలూ... మీకు ‘గమ్’ తెలుసు కదా. అది తనకూ మీకూ పూసి మీతో అంటుకు΄ోవడం తప్ప అమ్మ మీ కోసం అన్నీ చేస్తుంది. మీ ఆకలే తన ఆకలి. మీ నిద్రే తన నిద్ర. మీ నవ్వే తన నవ్వు. మీరు ఎక్కడకు అడుగులు వేసినా ఆమె కళ్లు వెనుకే వస్తుంటాయి. మీరు బయట ఆడుకుంటుంటే ఆమె ఇంట్లో నుంచే మీ ఆటను ఇమాజిన్ చేస్తుంది.

మీకు దెబ్బ తగలగానే మీరు వచ్చి చెప్పే ముందే ఆమెకు తెలిసి΄ోతుంది. మీరంటే అంత ఇష్టం అమ్మకు. మరి మీక్కూడా ఇష్టమేగా. మే 11 ‘మదర్స్ డే’ సందర్భంగా పేపర్ మీద ఆ ఇష్టాన్నంతా పెట్టి అమ్మకు ప్రెజెంట్ చేద్దామా. కొందరు పిల్లలు మదర్స్ డేకు అమ్మకు ఎలాంటి లెటర్స్ రాశారో చూడండి. మీరు ఇంకా డిఫరెంట్‌గా ట్రై చేయండి.

మై డియర్ మామ్...
నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే గాడ్ కంటే ఎక్కువ ఇష్టం. మా క్లాస్‌లో అందరూ సీక్రెట్స్ ఫ్రెండ్స్‌తో చెప్పుకుంటారు. నేను నీతో చెబుతా. ఎందుకంటే నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. ఇంగ్లిష్ మీడియమ్ స్కూల్లో సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకోవాల్సి వస్తే నువ్వే ఇంట్లో తెలుగు నేర్పించావు. ఎంత మంచి టీచర్‌వి నువ్వు. మా స్కూల్లో నీ లాంటి టీచర్ ఉంటే అందరూ ఫస్టే. అమ్మా.... నువ్వు సింగర్‌వా. అప్పుడప్పుడు హమ్ చేస్తుంటావు. నేను వింటుంటాలే. ఆ హమ్ చేసే అమ్మ ఇంకా ఇష్టం నాకు. నీకు మదర్స్ డే హగ్స్.
– శ్రావ్య, క్లాస్ 7, మదనపల్లి

డియర్ అమ్మా...
థ్యాంక్యూ... ఎప్పుడూ కారులో డాడీ పక్కన నన్ను కూచోబెట్టి నువ్వు వెనక కూచుంటావు. డాడీ నిన్ను ముందు కూచోమన్నా పాపకు అక్కడే ఇష్టం’ అంటావు. దారిలో నువ్వే దిగి ఐస్‌క్రీమ్ కొనుక్కొని వస్తావు. నేను బ్యాడ్ కలర్స్‌తో డ్రస్ సెలెక్ట్ చేసుకుంటే మంచి డ్రస్ చూపించి ఇదే బాగుందని ఒప్పిస్తావు. ముందు కోపం వచ్చినా రాను రాను అది నా ఫేవరెట్ డ్రస్ అవుతుంది. అమ్మా... నాకేం కావాలో నీకు అన్నీ తెలుసు. నేను నీ కోసం బాగా చదువుకుని బెస్ట్‌గా ఉంటానని ఈ మదర్స్ డే రోజు ప్రామిస్ చేస్తున్నా. లవ్ యూ.
– మౌనిక, క్లాస్ 8, హైదరాబాద్

టు మై బెస్ట్ మామ్...
అమ్మా... ఫస్ట్ ఈ బ్యూటిఫుల్ వరల్డ్‌లోకి నన్ను తీసుకు వచ్చినందుకు థ్యాంక్స్. నా కోసం నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నావో నాకు తెలుసు. ఇంట్లో నువ్వు, నేను మాత్రమే ఉంటాం. డాడీ మనతో లేకున్నా నేను ఆ ఆబ్సెన్స్ ఫీలవకుండా డబుల్ ఎనర్జీతో కష్టపడతావ్.
నా ఆథార్ కార్డ్ కరెక్షన్ కోసం నువ్వు పరేషాన్‌గా తిరుగుతుంటే ఏడుపు వచ్చింది. నాకు కొంచెం బాగా లేకున్నా హాస్పిటల్‌కు పరిగెత్తుతావ్. రాత్రంతా నిద్ర పోకుండా చూస్తావ్. నీకు ఎవరూ లేరని అనుకోకు. నేనున్నాను. నాకు నువ్వే మమ్మీవి... డాడీవి. ఐ రెస్పెక్ట్ యూ. cherish every moment we share, and I look forward to many more memories together. హ్యాపీ మదర్స్ డే.
– దివ్య, క్లాస్ 10, విజయవాడ
గుడ్ మార్నింగ్ అమ్మా...
మదర్స్ డే రోజు నీ కోసం రాస్తున్న లెటర్ ఇది. ఇలా రాయడం నాకు వెరీ న్యూ. ఏం రాయాలి? నీకు పెట్స్ అంటే ఇష్టం లేదు. నాకు ఇష్టం. రాకీ గాణ్ణి తెచ్చుకుంటానని అన్నప్పుడు గట్టిగట్టిగా వద్దన్నావ్. నేను హర్ట్ అయ్యి రాత్రంతా ఏడ్చానని ఓన్లీ ఫర్ మీ ఓకే చేశావ్. అదిప్పుడు నాకు మాత్రమే కాదు నీక్కూడా బెస్ట్ ఫ్రెండే. అమ్మా... థ్యాంక్యూ ఫర్ యువర్ అన్‌కండీషనల్ లవ్.
– నీ నందు/ఎర్రపండు, క్లాస్ 9, వాల్టేర్

మామ్... మొమ్మ... మమ్మ... అమ్మ
‘మామ్’ అనే పదం పిల్లల నుంచే వచ్చింది! తల్లిని ‘మామ్’ ‘మొమ్మ’ ‘మమ్మ’ అని పిలిచే పేర్లు ప్రపంచంలోని వివిధ భాషల్లో ఉన్నాయి. పసిబిడ్డలు పూర్తిగా మాట్లాడలేని రోజుల్లో చేసే శబ్దాల నుంచే ఈ పేర్లు పుట్టాయి అంటారు భాషావేత్తలు.
మదర్నింగ్ సండేస్
‘మదర్స్ డే’ మూలాలు పురాతన గ్రీకు, రోమన్ సంప్రదాయాలలో ఉన్నాయి. 16వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో ‘మదర్నింగ్ సండేస్’ రోజు పిల్లలు ఎక్కడ ఉన్నా తమ తల్లి దగ్గరికి వచ్చి ఆమె కోసం కేక్ తయారుచేసేవారు.
మదర్స్ డే స్టాంప్
తల్లుల గౌరవార్థం అమెరికాలో 1934లో మే 2న వయొలెట్ స్టాంప్‌ను విడుదల చేశారు. జేమ్స్ మెక్ నీల్ విస్లర్ ప్రసిద్ధ కళాఖండం ‘΄ోర్రై్టయిట్ ఆఫ్ మై మదర్’ ఆధారంగా ఈ స్టాంప్‌ను రూ΄÷ందించారు.
మదర్ ఆఫ్ మదర్స్ డే
వర్జీనియా(అమెరికా)కు చెందిన కాపీరైటర్ అన్నా జార్వీస్‌కు ‘మదర్ ఆఫ్ మదర్స్ డే’ అని పేరు. అమెరికా అంతర్యుద్ధ కాలంలో జార్వీస్ అమ్మ ఆన్ ఇరువైపుల సైనికులను దృష్టిలో పెట్టుకొని ‘మదర్స్ వర్క్ క్లబ్’లను నిర్వహించేది.
యుద్ధ సమయంలో తన తల్లి సాగించిన శాంతి ప్రయత్నాలకు గుర్తుగా, గౌరవార్థంగా ‘మదర్స్ డే’ను ప్రారంభించింది అన్నా జార్వీస్. 1908లో వెస్ట్ వర్జీనియాలోని గ్రాఫ్టన్ నగరంలో, ఫిలడెల్ఫియాలో మొదటి అధికారిక ‘మదర్స్ డే’ వేడుకలు మే నెలలోని రెండో ఆదివారం జరిగాయి. మొదటి అధికారిక ‘మదర్స్ డే’ 1914 మే 10న జరిగింది.
మదర్స్ డే ప్రేయర్
వర్జీనియా(యూఎస్) టేలర్ కౌంటీలోని ఆండ్రూస్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చిని అంతర్జాతీయ మాతృదినోత్సవ మందిరంగా పిలుస్తారు. ‘మదర్స్ డే’ గురించి అన్నా జార్వీస్ ఆలోచించిన ప్రదేశంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ మందిరంలో ప్రతి సంవత్సరం ‘మదర్స్ డే’ ప్రార్థన నిర్వహిస్తారు.
(చదవండి: అమ్మ వల్లే డాక్టర్‌నయ్యా!)