
ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 (Cannes Film Festival)లో నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఫ్యాన్స్‌లోని ప్యారిస్ లో జరుగుతున్న 78వ కాన్స్ ఉత్సవాల్లో వరుగా రెండోరోజు తన అద్భుతమైన లుక్‌తో అందర్నీ అలరించింది. మాజీ మిస్ యూనివర్స్. మొదటి రోజు చీర, కెంపుల హారం, సింధూరంతో అటు ఫ్యాన్స్‌ను, ఇటు ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంది. రెండో రోజు లుక్‌లో భారతీయత ఉట్టిపడేలా దర్శనమిచ్చి వావ్ అనిపించింది.
కాన్స్ వేడుకలో రెండో రోజు ఐశ్వర్య రాయ్ మోడ్రన్ డ్రెస్‌లో కనిపించింది. కానీ ఇందులో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను మేళవించడం విశేషం. ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లాక్ వెల్వెట్ డ్రెస్‌లో ఆమె తళుక్కున మెరిసింది. ముఖ్యంగా చేతితో గీతలోని సంస్కృత శ్లోకాన్ని ఎంబ్రాయిడరీ చేయించుకోవడం విశేషంగా నిలిచింది.

బనారసీ కేప్‌పై భగవద్గీతలోని ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోఽస్త్వకర్మణి ’ అనే శ్లోకాన్ని తీర్చిదిద్దుకుంది. వెండి, బంగారం, బొగ్గు , నలుపు రంగుల్లో, మైక్రో గ్లాస్ స్ఫటికాలతో చేతితో ఎంబ్రాయిడరీ చేసినట్టు డిజైనర్ తెలిపారు. అలాగే వారణాసిలో చేతితో నేసిన ఈ కేప్ పై భగవత్ గీతలోని సంస్కృత శోక్లాన్ని ఎంబ్రాయిడరీ చేసినట్టు వెల్లడించారు. దీంతో ఐష్ లుక్‌పై ఫ్యాషన్ వర్గాలు సహా, సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి.
ఐశ్వర్య ఫస్ట్ లుక్ సంప్రదాయం, గుర్తింపుకు చిహ్నంగా ఉండగా, రెండవది పునఃనిర్మాణం ఫ్యాషన్‌కి గుర్తు అని వ్యాఖ్యానించారు. 78వ వార్షిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 13 న ప్రారంభమైనాయి.రేపటితో(24) ఈ వేడుకలు ముగియనున్న సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్ లుక్‌కి ఫిదా