డిఫరెంట్‌ రోల్‌లో రాధిక.. మేకప్ తీయడానికే రెండు గంటలా? | Radhika about Her Look In Latest Movie Thaai Kizhavi goes Viral | Sakshi
Sakshi News home page

Radhika: డిఫరెంట్‌ రోల్‌లో రాధిక.. మేకప్ తీయడానికే రెండు గంటలా?

Feb 10 2026 9:22 PM | Updated on Feb 10 2026 9:35 PM

Radhika about Her Look In Latest Movie Thaai Kizhavi goes Viral

సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆమె తాయ్ కిజావి అనే మూవీలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఇంతకు ముందెన్నడు చేయని రోల్‌లో కనిపించనుంది. ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్స్‌ చూస్తుంటే.. అస్సలు రాధికను గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఈ మూవీ కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. తాజాగా  ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధిక ఈ పాత్ర గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

ఈ సినిమాలో నా కొత్త లుక్‌ కోసం నటుడు కమల్‌హాసన్‌ నుంచి సలహాలు తీసుకున్నానని రాధిక తెలిపారు. రోజూ మేకప్‌ వేసుకునేందుకు 5 గంటలు.. దానిని తీసేందుకు 2 గంటల సమయం పట్టిందని వెల్లడించారు. మొదట తాను ఈ సినిమాలో ఆ పాత్ర చేసేందుకు ఆసక్తిగా చూపలేదని అన్నారు. తనకు ఇష్టం లేదని చెప్పినా.. దర్శకుడు శివకుమార్‌ మురుగేశన్‌ దాదాపు రెండేళ్ల పాటు నా చుట్టే తిరిగారని రాధిక పేర్కొన్నారు. అంతే కాకుండా తన భర్త శరత్‌కుమార్‌ సలహాతోనే ఈ మూవీలో నటించానని చెప్పారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం  ఫిబ్రవరి 20న థియేటర్లలో సందడి చేయనుంది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement