breaking news
Radhika Sarath Kumar
-
సినిమా సూపర్ హిట్.. డైరెక్టర్‌కి కాస్ట్లీ కారు గిఫ్ట్
సినిమా హిట్ అయితే హీరోలకు లేదా దర్శకులకు నిర్మాత.. కారు గిఫ్ట్ ఇవ్వడం లాంటివి టాలీవుడ్లో చూస్తూనే ఉంటాం. మిగతా ఇండస్ట్రీల్లోనూ ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పుడు అలా తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ నిర్మాతగానూ అడపాదడపా మూవీస్ చేస్తుంటాడు. అలా ఈ ఏడాది ఓ మూవీ నిర్మించగా అది ఊహించని సక్సెస్ అందుకుంది. ఇప్పడా చిత్ర దర్శకుడికే ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ 'కలర్స్' స్వాతి.. ఫొటోలు వైరల్)రాధిక ప్రధాన పాత్రలో శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించిన సినిమా 'థాయ్ కిళవి'. ఈ ఏడాది ఫిబ్రవరి చివరలో థియేటర్లలో రిలీజైంది. రీసెంట్‌గానే విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఫైనల్ రన్ పూర్తి చేసుకుని మొత్తంగా రూ.80 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఈ సందర్భంగా మూవీ టీమ్ అంతా కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం నిర్మాత శివకార్తికేయన్.. దర్శకుడు శివకుమార్‌కి రూ.20 లక్షలు విలువ చేసే మహీంద్రా బీఈ6 కారుని బహుకరించాడు.ఇకపోతే శివకుమార్ మురుగేశ్ ప్రస్తుతం శివకార్తికేయన్ హీరోగా 'సెయాన్' అనే సినిమాని తీస్తున్నాడు. కుమారస్వామి నేపథ్య కథతో దీనిని తెరకెక్కిస్తున్నారు. కమల్ హాసన్ నిర్మాత కాగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్.(ఇదీ చదవండి: ఓటీటీలో సూపర్ హిట్ సినిమా 'తాయ్ కిళవి' తెలుగు రివ్యూ) View this post on Instagram A post shared by Sivakarthikeyan Productions (@skprodoffl) -
అంత్యక్రియల ప్రదేశాన్ని సర్కస్‌లా చేసేశారు.. రాధిక అసహనం
రెండు రోజుల క్రితం తమిళ ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూశారు. ఆయనకు అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. అయితే అంత్యక్రియల్లో కొందరు కెమెరాలు పట్టుకుని భాగ్యరాజ్‌కు నివాళి అర్పించేందుకు వచ్చిన సెలబ్రిటీలని ఇబ్బంది పెట్టారు. నటి రాధిక కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొంది. ఆరోజే మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ అని వేడుకుంది. ఆ వీడియో వైరల్ కాగా ఇప్పుడు సోషల్ మీడియాలోనూ తన అసహనాన్ని బయటపెట్టింది.'అంత్యక్రియలనేవి దుఃఖంతో బాధపడుతున్న కుటుంబ సభ్యుల వ్యక్తిగత విషయం. హంగామా చేసేందుకు వ్యూస్ కోసం ప్రయత్నించే వేదిక కాదు. అంతిమ సంస్కారాల టైంలో మీడియాని నిషేధించాల్సిందే' అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా దీన్ని రీట్వీట్ చేసిన రాధిక.. కచ్చితంగా నిషేధం విధించాలి అని రాసుకొచ్చింది. ఇక భాగ్యరాజ్‌తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురైంది.50 ఏళ్ల స్నేహానికి వీడ్కోలు. ఎక్కడా ఆర్భాటం లేకుండా ప్రతి సందర్భంలోనూ నా కుటుంబానికి అండగా నిలిచారు. నిజంగా ఇది షాకింగ్ వీడ్కోలు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు నివాళులు అర్పించాల్సిన ప్రదేశం ఓ సర్కస్ అయిపోయింది. ఇంత కఠినంగా మనం ఎప్పుడూ మారిపోయాం? ప్రభుత్వం, ఇండస్ట్రీ దీనిపై చర్చించాలి. అంత్యక్రియల టైంలో ప్రోటొకాల్ ఉండేలా చర్యలు తీసుకోవాలి. చనిపోయిన వాళ్లకు, ఆత్మకు గౌరవం ఇవ్వాలి' అని రాధిక తన ఆవేదన వ్యక్తం చేసింది.pic.twitter.com/dE4PWoyHRG— Radikaa Sarathkumar (@realradikaa) June 29, 2026கையெடுத்து கும்பிடறன், TRP வேணாம்னு சினிமால நடிச்சி தரோம் , கொஞ்சம் பிரைவேசி கொடுங்க #Bhagyaraj #Radhika pic.twitter.com/PdbuKivcW1— Behind Talkies (@BehindTalkies) June 27, 2026 -
రాధిక కంటే నేనే బాగా చేసేదాన్ని: షకీలా
షకీలా పేరు ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఎలాంటి కొత్త సినిమాలు చేయడం లేదు. 80-90ల్లో చాలా చిత్రాల్లో వ్యాంప్ క్యారెక్టర్స్ చేసిన ఈమె.. అప్పట్లో స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ కాల క్రమంలో మూవీ ఛాన్సుల రాకపోవడంతో కనుమరుగైపోయింది. మూడేళ్ల క్రితం అంటే తెలుగు బిగ్‌బాస్ 7వ సీజన్లోనూ పాల్గొంది. కానీ రెండో వారమే ఎలిమినేట్ అయి బయటకొచ్చింది. తాజాగా ఓ తమిళ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన షకీలా.. రాధిక 'తాయ్ కిళవి' గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటుడు)'నిజంగా చెప్పాలంటే 'తాయ్ కిళవి'లో రాధిక బదులు నేను ఉంటే ఇంకా బాగా చేసేదాన్ని. ఈ మధ్యే ఓ తెలుగు సినిమాలో మేకప్ లేకుండా నటించాను. ఆ రోల్ నాకు అద్భుతమైన కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అందుకే రాధిక కంటే నేనే బాగా చేసేదాన్ని అనిపించింది' అని షకీలా చెప్పుకొచ్చింది.సీనియర్ నటి రాధిక లీడ్ రోల్ చేసిన తమిళ సినిమా 'తాయ్ కిళవి'.. ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలోకి రిలీజై హిట్ అయింది. పపుంతాయ్ అనే గడుసు వృద్ధురాలిగా రాధిక అదరగొట్టేసింది. హీరో శివకార్తికేయన్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించాడు. హాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరించింది. తమిళనాడులోని ఉసిలంపట్టి ప్రాంతానికి చెందిన 75 ఏళ్ల మహిళ జీవితం, ఆమె కుటుంబం చుట్టూ సాగే కథే ఈ సినిమా. అమ్మాయిలు ఈ సినిమా చూస్తే కచ్చితంగా వాళ్ల ఆలోచన మార్పు వచ్చే అవకాశముంది. (ఇదీ చదవండి: రాధిక 'తాయ్ కిళవి' సినిమా తెలుగు రివ్యూ) -
'వాట్ ఏ గిఫ్ట్'.. త్రిషకు రాధికా, ఛార్మి బర్త్ డే విషెస్..!
తమిళనాడులో విజయ్ గెలుపు తర్వాత ఆమెపైనే అందరి దృష్టి పడింది. ఎన్నికల ముందు నుంచే ఆమెపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. విజయ్‌తో రిలేషన్లో ఉన్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. అయినా తాను ఎక్కడా స్పందించకుండా సైలెంట్‌గానే ఉండిపోయింది. తాజాగా ఎన్నికల్లో విజయ్ విజయంతో అందరు త్రిష పేరునే జపిస్తున్నారు. ఫలితాల రోజే త్రిష బర్త్ డే కావడం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ విజయం త్రిషకు విజయ్ ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ సైతం విజయ్- త్రిష రిలేషన్ కన్ఫామ్ చేసింది. త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. వాట్ ఏ గిఫ్ట్ అంటూ రాసుకొచ్చింది. టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి సైతం త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. దర్శకుడు పూరి జగన్నాధ్, త్రిషతో దిగిన ఫోటోను షేర్ చేసింది. మీ ప్రత్యేకమైన రోజున ప్రత్యేక వేడుక.. మీరు మా అదృష్ట దేవత.. ఈ పుట్టినరోజు చరిత్ర పుస్తకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నా చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఛార్మి పోస్ట్ చేసింది. టాలీవుడ్ నటి లక్ష్మీ మంచు కూడా త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. డబుల్ సెలబ్రేషన్ అంటూ పోస్ట్ చేసింది.కాగా.. త్రిష తన పుట్టినరోజు ఉదయాన్ని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత నేరుగా ఆమె చెన్నైలోని విజయ్ నివాసానికి వెళ్లారు. టీవీకే విజయం సాధించడంతో విజయ్ను ప్రత్యేకంగా కలిశారు. దీంతో విజయ్-త్రిష రిలేషన్‌పై అభిమానులకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే విజయ్ సతీమణి విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో జూన్ 15న విచారణకు రానుంది. కాగా.. తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాల్లో విజయ్ స్థాపించిన టీవీకే 108 స్థానాలను గెలిచింది. -
ఓటీటీలో సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ
ఒకప్పటి హీరోయిన్ రాధిక లీడ్ రోల్ చేసిన లేటెస్ట్ తమిళ సూపర్ హిట్ సినిమా 'తాయ్ కిళవి'. నిర్మాతల్లో హీరో శివకార్తికేయన్ ఒకరు. రూ.10 కోట్ల బడ్జెట్ పెడితే ఏకంగా రూ.81 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. థియేటర్లలో అద్భుతంగా ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మృణాల్ ఠాకుర్ రొమాంటిక్ సినిమా)కథేంటి?పపున్‌తాయ్(రాధిక) ఓ పల్లెటూరి బామ్మ. ఊరిలో అందరూ ఈమె దగ్గర అప్పు తీసుకుంటారు. కానీ వడ్డీ వసూలు చేయడానికి వస్తుందంటే మాత్రం అందరూ తప్పించుకుని పారిపోతుంటారు. దీంతో ఈమె ఎప్పుడు చచ్చిపోతుందా అని శాపనార్థాలు పెడుతూ ఉంటారు. మరోవైపు ఆస్తి గొడవల కారణంగా ముగ్గురు కొడుకులు ఈమెని వదిలేసి వెళ్లిపోతారు. కట్నంగా మాట్లాడుకున్న మిగిలిన బంగారం ఇవ్వలేదని అల్లుడు, ఈమె కూతురు సురులి(రైచల్ రెబెకా)ని వదిలేస్తాడు. దీంతో కూతురు, మనవడిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటుంది. ఓ రోజు పపున్తాయ్కి పక్షవాతం వచ్చి మాట పడిపోతుంది. ఏదో సైగ మాత్రం చేస్తుంటుంది. ఈమె చనిపోవడం పక్కా అనుకుని ఆస్తి పంచుకోవడానికి కొడుకులు, కోడళ్లు తిరిగొస్తారు. అయితే ఈమె దగ్గర 160 తులాల బంగారం ఉందనే రహస్యం తెలుస్తుంది. మరి ఆ బంగారం ఎక్కడుంది? దీనికోసం కొడుకులు, కోడళ్లు ఏం చేశారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఒకప్పుడు బంధాలు, బంధుత్వాలు ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడంతా డబ్బుమయం అయిపోయింది. డబ్బు లేకపోతే సొంత కొడుకులు కూడా తల్లిదండ్రులని పట్టించుకోరు. అలా డబ్బు వల్ల రోజురోజుకీ దారుణంగా మారుతున్న మానవ సంబంధాల్ని కామెడీగా, ఎమోషనల్‌గా చూపిస్తూ చివరలో అద్భుతమైన సందేశం ఇచ్చిన సినిమా 'తాయ్ కిళవి'. చూస్తున్నంతసేపు ఇది సినిమాలా అనిపించదు. మన పక్కనే ఉండే చాలామంది వ్యక్తులా జీవితంలా అనిపిస్తుంది.మనం ఊళ్లలో చూసే గడుసు బామ్మలు ఎలా ఉంటారో పపున్‌తాయ్ కూడా అలానే ఉంటుంది. మాటతీరు, ప్రవర్తన, ఊరిలో ప్రతిఒక్కరిపై చూపించే ఆజమాయిషీ లాంటివి చూపిస్తూ ఈమె పాత్రని పరిచయం చేశారు. ఈమెకు పక్షవాతం రావడంతో కథలో సంఘర్షణ మొదలవుతుంది. ఆస్తి పంచుకోవాలని ఆరాటపడుతూ తల్లి ఎప్పుడు చనిపోతుందా అని ఈమె కొడుకులు, కోడళ్లు చేసే పనులు కాస్త అతిగా అనిపిస్తాయి. నిజ జీవితంలో మరీ ఇలా ప్రవర్తించేవాళ్లు ఉంటారా అనిపిస్తుంది. ఎప్పుడైతే 160 తులాల బంగారం గురించి కొడుకులకు తెలుస్తుందో స్టోరీ ట్రాక్‌లో పడుతుంది. అప్పటినుంచి వచ్చే ప్రతి సీన్, చుట్టూ ఉండే పాత్రలు ప్రవర్తించే విధానం ఆసక్తికరంగా అనిపిస్తుంది.ఫస్టాఫ్ అంతా కామెడీగా ఉన్నప్పటికీ సెకండాఫ్‌లో పపున్తాయ్ని ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత వైద్యులు వ్యవహరించే తీరు కూడా నవ్విస్తుంది. కానీ సమాజంలో జరుగుతున్న పలు విషయాల్ని గుర్తుచేస్తాయి. చివరగా ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత బామ్మ తన సైగలకు అర్థం చెప్పినప్పుడు ఇదెక్కడి ట్విస్ట్ రా బాబోయ్ అనిపిస్తుంది. నిజంగా ఈమె దగ్గర అంత బంగారం ఉందా లేదా అనే సీన్ ఆకట్టుకుంది. అలానే మహిళలు ఒకరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఎలా బతకాలో పపున్‌తాయ్, ఆమె కూతురితో చెప్పించే సీన్స్ అయితే భావోద్వేగానికి గురిచేస్తాయి. వీటికి ప్రతి మహిళ కనెక్ట్ అవుతుంది. అన్ని ప్లస్సులేనా మైనస్సులు లేవా అంటే ఉన్నాయి. కాకపోతే చాలా తక్కువగానే ఉన్నాయి.ఎవరెలా చేశారు?పపున్‌తాయ్ అనే వృద్ధురాలిగా రాధిక అదరగొట్టేసింది. ప్రారంభంలో పది నిమిషాలు, చివరి అరగంట మాత్రమే ఈమె కనిపిస్తుంది. కానీ గెటప్, క్లైమాక్స్‌లో ఈమె చెప్పే డైలాగ్స్ సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. మిగతా నటీనటులు ఎవరూ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. కానీ మూవీ చూస్తున్నంతసేపు అదేం పెద్ద సమస్యగా అనిపించదు. ఫస్టాప్ లో కాస్త అతి అనిపిస్తుంది కానీ కథలో లీనమైన తర్వాత అవేం పెద్దగా గుర్తుండవు. కమల్ హాసన్ పాటల రిఫరెన్స్‌లతో వచ్చే హంగామా కూడా అలరించింది.'జీవితంలో ఎవరైనా డబ్బు అవసరం లేదని అంటే వాళ్లు డబ్బు సమస్య లేకుండా బతుకుతున్నారని అర్థం. అలాంటి వాళ్ల మాటలు విని మీరు కూడా అలా బతికితే.. అమ్మ నగలు దాచిపెట్టిందా? నాన్న ఆస్తి రాకపోతుందా? అని ఎదురుచూడాల్సి వస్తుంది' అని బామ్మ చెప్పే డైలాగ్.. మనిషికి డబ్బు ఎంత అవసరమో చెప్పకనే చెబుతుంది. డైరెక్టర్ శివకుమార్ మురుగేశన్ రాసుకున్న స్టోరీ గానీ తీసిన విధానం గానీ సూపర్. సాంకేతికంగానూ మూవీ బాగుంది. ప్రస్తుతం హాట్‌స్టార్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రాన్ని కుటుంబంతో కలిసి చూడొచ్చు. వీకెండ్ ఏదైనా మంచి సినిమా చూద్దామనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా) -
రాధికా శరత్‌కుమార్ రికార్డ్.. తొలి హీరోయిన్గా గుర్తింపు
ఇండస్ట్రీలో సినిమా విడుదల తర్వాత వచ్చిన కలెక్షన్స్‌ను బట్టే ఫలితం నిర్ణయిస్తారు. ముఖ్యంగా తెలుగు పరిశ్రమలో బడ్జెట్ పేపరుతో టికెట్ రేట్లు పెంచడం వల్ల ప్రేక్షకులు థియేటర్‌కు దూరం అవుతున్నారు. సినిమాకు పెట్టిన పెట్టుబడి కేవలం వారంలోనే రాబట్టుకోవాలనే ఉద్దేశంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తమకు నచ్చినట్లు టికెట్ రేట్లు పెంచుతున్నారని విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ నటించిన తాయి కిళవై చిత్రం తక్కువ టికెట్ ధరలతోనే భారీ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.తను నటించిన కొత్త సినిమా పదిరోజుల కలెక్షన్స్‌పై రాధికా శరత్‌కుమార్ ఇలా మాట్లాడారు.. ' రూ. 150 రూపాయల టికెట్ ధరతోనే మా సినిమా రూ. 60 కోట్ల వరకు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. స్టార్ హీరోల సినిమాలకు టికెట్ ధరలు రూ. 1500 నుంచి 2000 వరకు ఉంటున్న విషయం తెలసిందే. అయినప్పటికీ కలెక్షన్స్ పెద్దగా వచ్చిన దాఖలు లేదు. ఈ మూవీ కోసం బడ్జెట్ రూ. 9 కోట్లు మాత్రమే పెట్టారు.. బాక్సాఫీస్ లెక్కలు సరిగ్గా అంచనా వేసుకుంటే స్టార్ హీరోల కంటే మేము పెద్ద విజయం సాధించినట్టే అవుతుంది. మంచి కథ, కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సినిమాను చూస్తారు.' అని ఆమె చెప్పింది. అధిక టికెట్ రేట్లు లేకుండానే పెద్ద విజయాలు సాధించవచ్చని తమ సినిమా చూపించిందని ఆమె గుర్తు చేశారు.రాధిక చేసిన వ్యాఖ్యలు చాలామందిని ఆలోచింపచేస్తున్నాయి. ఆమె మాట్లాడింది నిజమే కదా అంటూ పోస్టులు పెడుతున్నారు. చాలా మంది స్టార్ హీరోల సినిమా కలెక్షన్స్‌పై రాధిక ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చారని భావిస్తున్నారు. బారీ బడ్జెట్ సినిమాల పేరుతో టికెట్ ధరలు పెంచడంపై ప్రేక్షకులు అసంతృప్తితో వున్న విషయం తెలిసిందే.తమిళ చిత్ర పరిశ్రమలో తొలిసారిగా, ఒక హీరోయిన్ తాను తీసుకునే రెమ్యునరేషన్‌తో పాటుగా లాభాల వాటాను అందుకున్న నటిగా రాధికా రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమా ఇండస్ట్రీలో ఈ విషయం ఒక రికార్డ్‌గా నిలిచిపోతుంది. అన్ని పరిశ్రమలలో గేమ్-ఛేంజర్ అవుతుందని ఈ విషయంపై రాధికా అన్నారు. సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు హీరోలకు మాత్రమే ఇలాంటి అవకాశం ఉండేదని. తాజాగా తాయి కిళవి కొత్త ట్రెండ్‌కు తెరతీసిందని ఆమె అన్నారు. నిర్మాత శివకార్తికేయన్‌ను అభినందించాలని ఆమె కొనియాడారు. -
రాధిక శరత్‌కుమార్ డిఫరెంట్ రోల్ మూవీ.. ఆసక్తిగా ట్రైలర్
సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం తాయ్ కిజవి. ఈ మూవీలో ఇంతకు ముందెన్నడు కనిపించని లుక్‌లో రాధికా కనిపించనుంది. ఈ సినిమాకు శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని హీరో శివ కార్తికేయన్ నిర్మించారు. ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్ వృద్ధురాలిగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఫిబ్రవరి 27న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ప్రస్తుతానికి కేవలం తమిళంలోనే రిలీజ్ కానుంది. తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేసే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఈ చిత్రంలో సింగమ్ పులి, అరుళ్ దాస్, బాల శరవణన్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
డిఫరెంట్ రోల్లో రాధిక.. మేకప్ తీయడానికే రెండు గంటలా?
సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆమె తాయ్ కిజావి అనే మూవీలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఇంతకు ముందెన్నడు చేయని రోల్లో కనిపించనుంది. ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్స్ చూస్తుంటే.. అస్సలు రాధికను గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఈ మూవీ కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధిక ఈ పాత్ర గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.ఈ సినిమాలో నా కొత్త లుక్ కోసం నటుడు కమల్‌హాసన్ నుంచి సలహాలు తీసుకున్నానని రాధిక తెలిపారు. రోజూ మేకప్ వేసుకునేందుకు 5 గంటలు.. దానిని తీసేందుకు 2 గంటల సమయం పట్టిందని వెల్లడించారు. మొదట తాను ఈ సినిమాలో ఆ పాత్ర చేసేందుకు ఆసక్తిగా చూపలేదని అన్నారు. తనకు ఇష్టం లేదని చెప్పినా.. దర్శకుడు శివకుమార్ మురుగేశన్ దాదాపు రెండేళ్ల పాటు నా చుట్టే తిరిగారని రాధిక పేర్కొన్నారు. అంతే కాకుండా తన భర్త శరత్‌కుమార్ సలహాతోనే ఈ మూవీలో నటించానని చెప్పారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఫిబ్రవరి 20న థియేటర్లలో సందడి చేయనుంది. A story I believed in.A film I’m proud to present.#ThaaiKizhavi — https://t.co/ewdDBtXOevIntroducing @Dir_SivakumarM.@realradikaa Ma’am in a never-before-seen role.A fun ride awaits you in theatres worldwide from 20 February, 2026 😊👍@KalaiArasu_ @Sudhans2017… pic.twitter.com/IOINaiJZzc— Sivakarthikeyan (@Siva_Kartikeyan) December 24, 2025 -
'ఆట' డ్యాన్స్ షో కొత్త సీజన్.. ఎప్పటినుంచంటే?
డ్యాన్స్ రియాలిటీ షోలలో ఒక ప్రభంజనం ఆట. తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన ‘ఆట’మరోసారి వచ్చేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా మరోసారి ఎందరో ప్రతిభావంతులైన డ్యాన్సర్లను వెలుగులోకి తీసుకురాబోతోంది. బుల్లితెర పాపులర్ డ్యాన్స్ షో ‘ఆట’ సరికొత్త సీజన్ ఫిబ్రవరి 7న ప్రారంభమవుతోంది. జీ తెలుగులో ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. టీవీలో కంటే రెండు రోజుల ముందుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో ఎపిసోడ్స్ రిలీజ్ కానున్నాయి.16 మంది మధ్య పోటీఈసారి ఆట షోకి ఎనర్జిటిక్ యాంకర్ సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఆట టైటిల్ కోసం నలుగురు మెంటార్స్ కావ్య, విష్ణుప్రియ, వంశీ, సమీరా భరద్వాజ్ మార్గదర్శకత్వంలో 16 మంది ప్రతిభావంతులు పోటీపడనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి రాధికా శరత్‌కుమార్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, మెగా డాటర్ నిహారిక కొణిదెల న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. ఆట షో ప్రారంభ ఎపిసోడ్లో అద్భుతమైన ప్రదర్శనలతో కంటెస్టెంట్స్ పోటీపడేందుకు సిద్ధమయ్యారు. హిట్ సాంగ్స్‌తో మొదలుఇటీవల బ్లాక్‌బస్టర్ హిట్ సాంగ్స్ ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి..’, ‘చుట్టమల్లే..’, ‘గిర గిర గిర గింగిరానివే..’ వంటి పాటలకు అద్భుతమైన కొరియోగ్రఫీతో కంటెస్టెంట్లు, మెంటర్లు డ్యాన్స్ చేసి అలరించనున్నారు. అంతేకాదు, యాంకర్ సుధీర్ ప్రస్థానంపై కంటెస్టెంట్ అక్షత ప్రదర్శన అందరినీ ఆకట్టుకోనుంది. కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్న రాప్టర్ యువరాజ్ కంటెస్టెంట్‌గా ఆట టైటిల్ పోరులో దిగనున్నారు. అద్భుతమైన ప్రదర్శనలు, భావోద్వేగ క్షణాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగనున్న ఈ షోను ఈ వీకెండ్ నుంచి చూసేయండి.. -
తల్లి అంత్యక్రియలు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన రాధిక!
సీనియర్ నటి రాధిక శరత్ కుమార్(Radhika Sarathkumar) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లి మరణంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇవాళ చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లోని రాధిక నివాసంలో తల్లి గీత పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాధిక ఫుల్ ఎమోషనలయ్యారు. ఈ విషాదం సమయంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చారు. ఇవాళ సాయంత్రం చెన్నైలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. రాధిక సోదరి, నటి నిరోష కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. రాధిక తల్లి, సీనియర్ నటుడు ఎం.ఆర్ రాధ సతీమణి గీత (86) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు తారలు ఆమె మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తన తల్లిని గుర్తు చేసుకుంటూ రాధిక సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. రాధిక కుమార్తె రాయనే మిథున్ తన అమ్మమ్మను తలచుకుంటూ భావోద్వేగాని గురైంది.(ఇది చదవండి: రాధిక శరత్ కుమార్ ఇంట తీవ్ర విషాదం) -
రాధిక శరత్ కుమార్ ఇంట తీవ్ర విషాదం
ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ (Radhika Sarath Kumar) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రాధిక తల్లి, సీనియర్ నటుడు ఎం.ఆర్ రాధ సతీమణి గీత (86) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం (సెప్టెంబర్ 21న) రాత్రి మరణించారు. గీత మృతితో రాధిక కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అంత్యక్రియలునేడు సాయంత్రం చెన్నైలోని బెసెంట్ నగర్ శ్మశాన వాటికలో గీత అంత్యక్రియలు జరపనున్నట్లు కుటంబసభ్యులు వెల్లడించారు. ప్రముఖ నటుడు మద్రాస్ రాజగోపాల్ రాధాకృష్ణన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. అతడి ముగ్గురు భార్యలు సరస్వతి, ధనలక్ష్మి, గీత ద్వారా మొత్తం 12 మంది సంతానం జన్మించారు. వారిలో హీరోయిన్లు రాధిక శరత్ కుమార్, నిరోషా ఉన్నారు.చదవండి: 25 ఏళ్ల తర్వాత విజయ్, జ్యోతికల హిట్ సినిమా రీరిలీజ్ -
15 మంది పనోళ్లు.. కూతుళ్లు లేరు, కొడుకూ లేడు, అందుకే..
కోలీవుడ్ స్టార్ దంపతులు శరత్‌కుమార్- రాధిక (Radhika Sarathkumar) తమ లగ్జరీ బంగ్లా నుంచి బయటకు వచ్చేశారు. చెన్నైలోని ఈసీఆర్‌లో ఉన్న విలాసవంతమైన భవనంలో కొన్నేళ్లుగా నివసిస్తున్న వీరు మరో ఇంటికి షిఫ్ట్ అయ్యారు. అందుకు గల కారణాన్ని శరత్‌కుమార్ వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. మేము ఉన్న ఇల్లు 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మా ఇంటికి ఏడు ద్వారాలున్నాయి. అందుకే ఇల్లు మారాంప్రతిరోజు రాత్రి ఆ తలుపులకు గడియపెట్టడం కూడా ఇబ్బందవుతోంది. కొడుకు విదేశాల్లో చదువుకుంటున్నాడు. కూతుళ్లకు పెళ్లిళ్లయిపోయి ఎవరి జీవితంలో వారు బిజీగా ఉన్నారు. మా ఇంట్లో 15 మంది పనివాళ్లున్నా సరే.. రాధిక ఒక్కరే ఆ పెద్ద ఇంటిని చూసుకోవడం కష్టమవుతోంది. అందుకే ఇల్లు మారాం. ప్రస్తుతం ఆ ఇంటిని ఓ ఐటీ కంపెనీకి అద్దెకిచ్చాం అని చెప్పుకొచ్చాడు. శరత్‌కుమార్ చివరగా 3BHK సినిమాలో కనిపించాడు. గణేశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మంచికు పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ సైతం 3BHK మూవీపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. పర్సనల్ లైఫ్రాధిక.. 1985లో నటుడు ప్రతాప్ పోతన్‌ను పెళ్లాడింది. ఏడాదికే అతడికి విడాకులిచ్చేసి బ్రిటీష్ వ్యక్తి రిచర్డ్ హార్డీని పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు రయానే జన్మించింది. రెండేళ్లకే ఈ దంపతులు కూడా విడిపోయారు. 2001లో నటుడు శరత్‌కుమార్‌ను మూడో పెళ్లి చేసుకుంది. శరత్‌కుమార్‌కు ఇది రెండో పెళ్లి! ఈయన మొదటగా 1984లో చాయాదేవిని పెళ్లి చేసుకోగా వీరికి వరలక్ష్మి, పూజ అని ఇద్దరు కూతుర్లు జన్మించారు. 2000వ సంవత్సరంలో చాయాతో విడాకులు తీసుకున్న శరత్‌కుమార్ మరుసటి ఏడాది రాధికను పెళ్లాడాడు. రాధిక- శరత్ జంటకు రాహుల్ జన్మించాడు.చదవండి: మిరాయ్.. టికెట్ రేట్లు పెంచడం లేదు: తేజ సజ్జా -
ఆపరేషన్ వల్ల చాలా బాధలు పడ్డాను.. ఎవరూ అడగలేదు: రాధికా శరత్‌కుమార్
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధికకు సర్జరీ జరిగింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని చెబుతూ సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. కష్ట సమయంలో మహిళలు ఎలాంటి దృఢ సంకల్పంతో ఉండాలో ఆమె తెలిపారు. కొద్దిరోజుల క్రితం ఆమె కాలికి తీవ్రమైన గాయం అయినట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు దాని గురించి రాధికా ఎక్కడా స్పందించలేదు.అయితే, తాజాగా రాధికా శరత్ కుమార్ తన గాయం గురించి ఇలా చెప్పారు. 'గత రెండు నెలలుగా చాలా బాధలు పడుతున్నాను. ఎవరూ నా వర్క్, నా గురించి మాట్లాడలేదు. రెండు సినిమాల్లో పనిచేస్తున్న సమయంలో నేను అధిక బరువు ఉన్న బ్లింకర్లు ధరించడం వల్ల నా మోకాలికి తీవ్రమైన గాయం అయింది. అప్పుడు నా మోకాలి వద్ద విపరీతమైన నొప్పి కలిగింది. నొప్పి నివారణ కోసం ఎన్నో మందులతో పాటు మోకాలి బ్రేస్, క్రయోథెరపీ వంటి వాటిని పాటించాను. కానీ, ఎలాంటి ఫలితం లేదు. తప్పని పరిస్థితిలో రెండు నెలల క్రితం సర్జరీ చేపించుకున్నాను.' అని ఆమె తెలిపారు. ప్రస్తుతం తాను బాగున్నట్లు కూడా చెప్పారు.నొప్పి భరిస్తూనే సినిమా ఎలా పూర్తి చేశారని తన స్నేహితుడు ఒకరు ఆశ్చర్యపోయాడని రాధిక గుర్తుచేసుకున్నారు. ఆ నిర్మాతలు కృతజ్ఞతలు ఏమైనా చెప్పారా..? అని కూడా ఆ స్నేహితుడు అడిగినట్లు రాధిక చెప్పుకొచ్చారు. కానీ, తనకు కృతజ్ఞతలు వంటి వాటిని పట్టించుకోనని రాధిక చెప్పారు. అలాంటివి ఎప్పుడూ తాను ఆశించలేదని, ఉత్తమంగా పనిపై మాత్రమే దృష్టి పెడతానని ఆమె పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి స్త్రీ తనను తాను మరింతగా ప్రేమించుకోవాలని, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలని కోరుకుంటున్నట్లు ఆమె అన్నారు. ఇతరులు చూపే సింపతీ తీసుకోవద్దని తెలిపారు. అయితే, శస్త్రచికిత్స జరిగినప్పుడు తన భర్త శరత్ కుమార్ తనను చిన్నపిల్లలా చూసుకున్నారని ఆమె గుర్తుచేసుకున్నారు. తన జీవితంలో మూలస్థంభంలాంటి వ్యక్తి తన భర్తే అంటూ ఆమె చెప్పారు. View this post on Instagram A post shared by Radikaa Sarathkumar (@radikaasarathkumar) -
పెళ్లికి రావాలని సీఎం స్టాలిన్‌ను ఆహ్వానించిన వరలక్ష్మి శరత్ కుమార్
కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో ప్రముఖ నటిగా రాణిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతోంది. ప్రియుడు నికోలయ్ సచ్దేవ్తో ఏడడుగులు వేయబోతోంది. మార్చిలో వీరి నిశ్చితార్థం జరిగింది. జూలై 2న థాయ్‌ల్యాండ్‌లో పెళ్లి జరగనుందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తమిళనాట ఉన్న ప్రముఖలను వివాహానాకి రావాలని వరలక్ష్మి కుటుంబ సభ్యులు ఆహ్వానం అందిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.తాజాగా శరత్‌కుమార్ తన కుమార్తె వరలక్ష్మి వివాహానికి రావాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దంపతులకు ఆహ్వానం అందించారు. శరత్‌కుమార్ మొదటి భార్య ఛాయకు వరలక్ష్మి జన్మించిందనే విషయం తెలిసిందే. స్టాలిన్‌ను కలుసుకున్న వారిలో రాధిక ఆమె కుమార్తె రియాన్ కూడా ఉంది. వీరందరితో పాటు వరలక్ష్మి సోదరి పూజా కూడా ఉండటం విశేషం. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ను కలుసుకున్న సమయంలో శరత్‌కుమార్, రాధిక, వరలక్ష్మి విడివిడిగా ఫొటోలు దిగారు. వరలక్ష్మి తన ఎక్స్ పేజీలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.Met the Hon'ble Chief Minister Thiru @mkstalin sir & Durga mam and seeked their blessings..Congratulations on your win sir...Thank you so much for meeting us..@realsarathkumar @realradikaa @rayane_mithun #poojasarathkumar pic.twitter.com/Gopld9K2dl— 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) June 8, 2024 -
రజనీకాంత్ ఇంట్లో శరత్‌కుమార్ కుటుంబం.. పెళ్లికి రమ్మని ఆహ్వానం
తెలుగులో టాప్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతోంది. ప్రియుడు నికోలయ్ సచ్దేవ్తో ఏడడుగులు వేయబోతోంది. మార్చిలో వీరి నిశ్చితార్థం జరిగింది. జూలై 2న థాయ్‌ల్యాండ్‌లో పెళ్లి జరగనుందని ప్రచారం జరుగుతోంది. అప్పుడే వీరి ఇంట పెళ్లి పనులు షురూ అయ్యాయి.పెళ్లికి ఆహ్వానంపెళ్లి పత్రికల పంపిణీ మొదలైంది. గురువారం (జూన్ 6న) రజనీకాంత్‌ను కుటుంబసమేతంగా కలిసి తన పెళ్లికి రమ్మని ఆహ్వానించింది. ఈ మేరకు రజనీకాంత్‌తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తలైవా సర్‌ను, లతా ఆంటీని కలిసి పెళ్లికి ఆహ్వానించాను. నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నందుకు థాంక్యూ సర్. ఐశ్వర్య రజనీకాంత్.. నువ్వెప్పటిలాగే ఎంతో ప్రేమగా మాట్లాడావు అని రాసుకొచ్చింది. ఫోటోలో రజనీకాంత్ దంపతులతో పాటు వరలక్ష్మి తల్లిదండ్రులు రాధిక- శరత్‌కుమార్ ఉన్నారు.సినిమాల సంగతులు..వరలక్ష్మి శరత్‌కుమార్.. పొడా పొడి సినిమాతో హీరోయిన్గా అరంగేట్రం చేసింది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించింది. అయితే హీరోయిన్గా మాత్రమే చేయాలని రూల్ పెట్టుకోలేదు. పవర్ఫుల్ పాత్ర అయితే చాలనుకుంది. అందుకే సహాయకనటిగా ఎక్కువ సినిమాలు చేసింది. తెనాలి రామకృష్ణ ఎల్ఎల్బీ, జాంబి రెడ్డి, నాంది, యశోద, వీరసింహా రెడ్డి, మైఖేల్ చిత్రాలతో తెలుగువారినీ అలరించింది. ఇటీవల హనుమాన్ మూవీతో బ్లాక్‌బస్టర్ అందుకుంది. Got to meet our thalaivar @rajinikanth sir and invite him and latha aunty...thank you sir for always being so warm and loving..thank you @ash_rajinikanth for veinf so sweet as always..the apple didn't fall far from the tree..❤️❤️@realsarathkumar @realradikaa #chayadevi… pic.twitter.com/X2alVW8VoD— 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) June 6, 2024చదవండి: Manamey X Review: ‘మనమే’ టాక్ ఎలా ఉందంటే.. -
భార్య కోసం పొర్లుదండాలు.. ప్చ్, ఫలించని పూజలు!
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్రస్థాయిలో పోటీ నడుస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపు ప్రకారం ఎన్డీయే కూటమి ఆధిక్యంలో ఉంది. మరోసారి నరేంద్రమంత్రి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాలని కోరుకుంటూ సినీ నటుడు శరత్‌కుమార్ సోమవారం నాడు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.తమిళనాడులోని విరుదునగర్ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న తన సతీమణి, నటి రాధిక విజయం సాధించాలని, అలాగే వారణాసిలో నరేంద్రమోదీ గెలవాలని ఆలయంలో పొర్లుదండాలు పెట్టారు. అనంతరం భార్యతో కలిసి గుడిలో విశేష పూజలు నిర్వహించారు.ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్‌లో విరుదునగర్‌లో రాధిక మూడోస్థానానికి పడిపోయారు. విజయప్రభాకరన్ (డీఎండీకే), మాణిక్యం ఠాగూర్ (కాంగ్రెస్)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. వీరి మధ్య ఓట్ల తేడా 32గా ఉంది. దీంతో ఈ ఇద్దరిలోనే ఒకరికి గెలుపు తథ్యమని తెలుస్తోంది. రాధిక ఓడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. Actor Sarathkumar visited the Sri Parasakthi Mariamman temple in Virudhunagar to pray for his wife and NDA candidate Radhika's success, as the counting of votes will be held on June 4.#actor #sarathkumar #visited #srioarasakthitemplE #wifesuccess @radhikasarath pic.twitter.com/eLJ5KbXEB8— Pradeep (@PRADEEPDEE2) June 3, 2024చదవండి: 100 మార్క్ దాటనున్న కాంగ్రెస్ : 2014 తరువాత ఇదే తొలిసారి -
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
గతేడాదిలో 'సలార్'తో ట్రెండింగ్‌లోకి వచ్చిన శ్రియా రెడ్డి తాజాగా 'తలైమై సేయలగం' వెబ్ సిరీస్‌తో రానుంది. తమిళంలో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్‌లో కాంతార ఫేమ్ కిషోర్ మరో లీడ్రోల్లో నటిస్తోన్నాడు. జీ5 వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ ఈ సిరీస్‌ను రిలీజ్ చేస్తున్నారు.తలైమై సేయలగం పేరుతో తెరకెక్కుతోన్న ఈ పొలిటికల్ డ్రామా సిరీస్‌ను భారీ అంచనాలతో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో శ్రియారెడ్డితో పాటు కస్తూరి, భరత్, రమ్య నంబీశీన్, దర్శన గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ వసంత బాలన్ ఈ పొలిటికల్ మ్యాజిక్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సిరీస్ గురించి కీలక సమాచారాన్ని మేకర్స్ ప్రకటించారు. మే 17 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోందని తెలిపారు.రీసెంట్గా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాధిక శరత్‌కుమార్ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆమె తమిళనాడు నుంచి బీజేపీ అభ్యర్థిగా లోకసభ ఎన్నికల బరిలో ఉన్న విషయం తెలిసిందే. తమిళనాడులో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రాడాన్ మీడియా వర్క్స్ పతాకంపై ఆమె నిర్మిస్తుంది. ఈ సిరీస్‌కు గిబ్రాన్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. -
నటి రాధికకు జంటగా దళపతి విజయ్ తండ్రి.. సినిమాలో మాత్రం కాదు
తమిళ స్టార్ డైరెక్టర్, హీరో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళంలో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన ఆయన తెలుగులోనూ ఎన్నో చిత్రాలు రూపొందించారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన దేవాంతకుడు, చట్టానికి కళ్లులేవు, పల్లెటూరి మొనగాడు వంటి సినిమాలను రూపొందించి టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. తన సొంత డైరెక్షన్లోనే తనయుడిని హీరోగా మార్చారు. చదవండి: ఉత్తమ దర్శకుడిగా అంతర్జాతీయ అవార్డును కైవసం చేసుకున్న ‘బలగం’ వేణు ‘వెట్రి’ అనే సినిమాతో విజయ్‌ని బాలనటుడిగా తెరంగేట్రం చేయించిన ఆయన ‘నాలైయ’ తీర్పు మూవీతో హీరోగా మార్చారు. అలా తన దర్శకత్వంలో విజయ్‌తో సినిమాలు చేసి స్టార్ హీరోగా గుర్తింపు ఇచ్చారు. అలా కోలీవుడ్‌కు ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన ఆయనకు ఈ మధ్య పెద్దగా సక్సెస్ రావడం లేదు. ప్రస్తుతం అడపదడపా చిత్రాలు చేస్తూ వస్తున్న ఆయన తాజాగా బుల్లితెర ఎంట్రీ ఇచ్చారు. త్వరలో ప్రసారం కాబోయే ఈ సీరియల్లో ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్‌తో ఆయన జతకట్టబోతున్నారు. చదవండి: హైదరాబాద్‌లోని ఆలయంలో ఓం రౌత్ ప్రత్యేక పూజలు, ఫొటోలు వైరల్ ఈ సీరియల్ పేరు కిజాగు వాసల్. దీనిని నటి రాధిక నిర్మించడం విశేషం. ఇక స్టార్ డైరెక్టర్, విజయ్ తండ్రి అయిన ఆయన టీవీ సీరియల్లో నటించడంపై దళపతి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు మీ కొడుకు పరువు తీస్తున్నారంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. కాగా విజయ్‌కి ఆయన గతంలో మనస్పర్థలు వచ్చిన సంగతి తెలిసిందే. విభేదాల వల్ల విజయ్, ఆయన తండ్రి కోర్టు మెట్లు కూడా ఎక్కారు. అప్పట్లో ఈ వ్యవహరం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. Life takes us on different journeys and teaches us many things. We will grow to be the best version of ourselves. Need everyone’s good wishes as Radaan launches “Kizhaku Vaasal” on #VijayTV @vijaytelevision , with #sachandrasekar sir leading the cast, with a great crew🙏🙏 pic.twitter.com/hxV2wDNHF1 — Radikaa Sarathkumar (@realradikaa) April 5, 2023 -
ఉగాదికి రిలీజవుతున్న కాజల్ ఘోస్టీ
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ ఉగాదికి ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచేందుకు సిద్ధమయ్యారు. కళ్యాణ్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్, రాధికా శరత్ కుమార్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘ఘోస్టి’. ఈ నెల 17న విడుదలైన ఈ చిత్రాన్ని ‘కోస్టి’ పేరుతో గంగ ఎంటర్టైన్ మెంట్స్ ఈ నెల 22న తెలుగులో విడుదల చేస్తోంది. ‘‘హారర్ కామెడీగా రూపొందిన చిత్రం ‘కోస్టి’. ఇందులో తండ్రి, కుమార్తె మధ్య అనుబంధంతో పాటు థ్రిల్ అంశాలు కూడా ఉన్నాయి. ఆడియన్స్ ఉలిక్కిపడే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఇన్ స్పెక్టర్ ఆరతి పాత్రలో కాజల్ బాగా నటించారు. గ్యాంగ్‌స్టర్ దాస్‌గా దర్శకుడు కేఎస్ రవికుమార్ చేశారు. సామ్ సీఎస్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఉగాదికి తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదం అందించే చిత్రమిది’’ అని యూనిట్ పేర్కొంది. -
ఉగాదికి భయపెడతానంటున్న కాజల్ అగర్వాల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ ఉగాదికి ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమయ్యారు. కాజల్ అగర్వాల్, రాధికా శరత్‌కుమార్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘ఘోస్టీ’. ఈ చిత్రం గంగ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెలుగులో విడుదల కానుంది. ‘‘ఘోస్టీ’లో పోలీస్‌గా, సినిమా హీరోయిన్గా కాజల్ ద్విపాత్రాభినయం చేశారు. ఆత్మలకు, కాజల్ పాత్రలకు సంబంధం ఏంటి? అనేది ఆసక్తిగా ఉంటుంది. ప్రేక్షకులను నవ్వించడంతో పాటు ఉత్కంఠకు గురి చేసే చిత్రమిది. ఉగాదికి తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
జీవితగా వస్తున్న రాధికా శరత్ కుమార్..
రక్షిత్ అట్లూరి హీరోగా, సంకీర్తనా విపిన్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. వెంకట సత్య దర్శకత్వంలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రంలో జీవితపాత్ర చేస్తున్న రాధికా శరత్‌కుమార్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘స్వాతిముత్యం, స్వాతి కిరణం’ లాంటి ప్రజాదరణ పొందిన చిత్రాల తర్వాత ‘ఆపరేషన్ రావణ్’లో నటనకి ప్రాధాన్యం ఉన్న జీవితపాత్ర చేశాను. తెలుగుతోపాటు తమిళంలో ఏక కాలంలో విడుదల కానున్న ఈ చిత్రంలో నటించడం సంతోషంగా ఉంది’’ అన్నారు రాధిక. -
బ్యాడ్ న్యూస్ చెప్పిన నటి వరలక్ష్మి శరత్ కుమార్.. వీడియో వైరల్
Varalaxmi Sarath Kumar Tested Covid 19 Positive: కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్. అనేక చిత్రాల్లో నటించి ప్రత్యేకమైన గుర్తుంపు తెచ్చుకుంది. తెలుగులో రవితేజ 'క్రాక్' సినిమాలో జయమ్మగా, అల్లరి నరేశ్ 'నాంది' మూవీలో లాయర్‌గా ప్రేక్షకుల మన్ననలు పొందింది. ప్రస్తుతం తమిళంతోపాటు తెలుగులోనూ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ తన ఫ్యాన్స్‌కు బాధాకరమైన న్యూస్ చెప్పింది. ఆమె కరోనా బారిన పడినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది. అన్ని రకాల జాగ్రత్తలు పాటించినప్పటికీ నాకు కొవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఇటీవల నన్ను కలిసిన వారందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. అలాగే, సెట్లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చూడాలి. ఎందుకంటే నటీనటులు అన్నిసార్లు సెట్లో మాస్కులు ధరించలేరు. కాబట్టి చుట్టూ ఉన్న వాళ్లందరూ ఇకనైనా మాస్కులు ధరించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అని వరలక్ష్మి శరత్ కుమార్ పేర్కొంది. చదవండి: స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్ !.. ఫొటోలు వైరల్ పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ.. మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్ Covid Positive..inspite of all precautions..actors plz start insisting on masking up the entire crew bcos we as actors cant wear masks.. Those who have met me or been in contact with me plz watch out for symptoms and get checked.. Plz be careful and mask up..covid is still here pic.twitter.com/MyegWOSQ5a — 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) July 17, 2022 నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోపై సెలబ్రిటీలు, నెటిజన్లు 'గెట్ వెల్ సూన్' అని స్పందిస్తున్నారు. 'జాగ్రత్త వరూ.. నీకు మరింత ధైర్యం, బలం చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా' అని నటి రాధిక కామెంట్ చేశారు. కాగా వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం సమంత 'యశోద', 'బాలయ్య 107', 'హనుమాన్', 'శబరి' వంటి తదితర చిత్రాల్లో నటిస్తోంది. చదవండి: అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. చోర్ బజార్లో రూ.100 పెట్టి జాకెట్ కొన్నా: స్టార్ హీరో చిరంజీవి సమర్పణలో హిందీ చిత్రం.. తెలుగులో.. -
సీనియర్ నటి రాధిక సినిమాలో హీరోగా చిరంజీవి..
Chiranjeevi Movie With Radhika Sarathkumar Radaan Banner: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం 'ఆచార్య'తో ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇదే కాకుండా చిరంజీవి చేతిలో మెహర్ రమేశ్ తెరకెక్కిస్తున్న భోళా శంకర్, మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్‌తోపాటు బాబీ డైరెక్షన్లో మెగా154 చిత్రం సెట్స్‌పై ముస్తాబవుతున్నాయి. తాజాగా చిరంజీవి మరో సినిమాలో నటించనున్నట్లు సమాచారం. సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ నిర్మాణంలో ఓ కొత్త సినిమాకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అఫిషియల్‌గా ఆదివారం (మే 1) సోషల్ మీడియా వేదికగా రాధిక తెలిపారు. భవిష్యత్తులో మా రాడాన్ బ్యానర్లో ప్రాజెక్ట్ చేసేందుకు మీరు ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు. కింగ్ ఆఫ్ మాస్ అయిన మీతో బ్లాక్ బస్టర్ తీసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని రాధిక ట్వీట్ చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. చదవండి: అజిత్-విజయ్‌తో మల్టీ స్టారర్.. డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలివే.. Thank you dear @KChiruTweets for giving your consent to do a project for #radaan @realsarathkumar In the near future. Looking forward to making a blockbuster with the King of Mass🙏🙏🙏 — Radikaa Sarathkumar (@realradikaa) May 1, 2022 -
మా నాన్నతో ఎంజీఆర్‌కు జరిగిన గొడవను వెబ్ సిరీస్‌గా తీస్తున్నా: రాధిక
Radhika About Her Father MR Radha And MGR: రాధిక శరత్ కుమార్.. తెలుగు ప్రేక్షకులు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 80, 90లో స్టార్ హీరోయిన్గా ఆమె సౌత్ ఇండస్ట్రీలో చక్రం తిప్పారు. ‘న్యాయంగా కావాలి’ సినిమాలో ధైర్యవంతమైన యువతిగా.. స్వాతిముత్యంలో అభినయం పోషించిన రాధిక ఫైర్‌బ్రాండ్ అనే గుర్తింపు పొందారు. దాదాపు ఆమె దక్షిణాదికి చెందిన అందరు స్టార్ హీరోలు, లెజెండరి నటులతో కలిసి నటించారు. తమిళ నటుడు ఎం.ఆర్ రాధా వారసురాలిగా ఇండస్ట్రీకి వచ్చిన రాధిక తనకంటు సొంత గుర్తింపును ఎర్పరుచుకున్నారు. చదవండి: కాజల్ కొడుకు పేరు ఏంటో తెలుసా? ప్రస్తుతం తల్లి పాత్రలు, సీరియల్స్‌లో నటిస్తూనే మరోపక్క సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా మారారు. ఇటీవల ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంలో నటించారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె ఓ షోకు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా రాధిక పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. న్యాయం కావాలి సినిమా టైంలో చిరంజీవిని కొట్టే సీన్ నిజంగా కొట్టానని, దీనికి తను 23 టేకులు తీసుకున్నానన్నారు. ఆ తర్వాత చూస్తే చిరంజీవి ముఖం ఎర్రగా వాచిపోయిందంటూ రాధిక ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. చదవండి: కొత్త జంటకు రణ్‌బీర్ తల్లి కళ్లు చెదిరే ఫ్లాట్ గిఫ్ట్, ఖరీదెంతంటే! ఆనంతరం ఆమె తమిళ ఇండస్ట్రీలో తన తండ్రి ఎం.ఆర్ రాధా, ఎంజీఆర్ మధ్య చోటు చేసుకున్న వివాదంపై తాను ఓ వెబ్ సీరిస్ తీస్తున్నట్లు చెప్పారు. కాగా ఆమె తండ్రి ఎం.ఆర్. రాధా హీరోగానే కాదు, పవర్ఫుల్ విలన్‌గా కూడా ప్రేక్షకులను మెప్పించారు. అదే సమయంలో తన తండ్రికి, ఎంజీఆర్‌తో మధ్య వివాదస్పద గొడవలు చోటు చేసుకున్నాయి. అయితే వాటిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఆ విషయాలను గురించి రాధిక మాట్లాడుతూ.. ‘మా ఫాదర్ వివాదాస్పదమైన వ్యక్తి అనే విషయం తెలిసిందే. అప్పట్లో ఆయనకి .. ఎంజీఆర్‌కి ఏవో గొడవలు ఉండేవి. చదవండి: బాహుబలిని మించిన సినిమా తీస్తా: కమల్ ఆర్ ఖాన్ వాళ్లిద్దరి మధ్య చోటుచేసుకున్న కాల్పుల సంఘటన గురించి చాలామందికి తెలుసు. ఆ సంఘటన నేపథ్యంలోనే ఒక వెబ్ సిరీస్ చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. జులై నుంచి ఈ వెబ్ సిరీస్ షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతుంది. నా కెరియర్ నా చేతిలో ఉండాలనే ఉద్దేశంతోనే 'రాడాన్' సంస్థను స్థాపించాను. మా బ్యానర్ మంచి పేరు తెచ్చుకోవడం ఆనందంగా ఉంది. మా బ్యానర్ ద్వారా మరిన్ని మంచి ప్రాజెక్టులు చేయాలనే ఆలోచనలో ఉన్నాము’ అని ఆమె చెప్పుకొచ్చారు. -
కొడుకును చంపినవాడే ఇంటికొస్తే.. 'గాలివాన' వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: గాలివాన జానర్: క్రైమ్ అండ్ మిస్టరీ, థ్రిల్లర్ నటీనటులు: సాయి కుమార్, రాధికా శరత్ కుమార్, చాందిని చౌదరి, నందిని రాయ్, చైతన్య కృష్ణ, శరణ్య, తాగుబోతు రమేష్ తదితరులు దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి నిర్మాత: శరత్ మరార్ సంగీతం: హరి గౌర సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ ఓటీటీ: జీ5 విడుదల తేది: ఏప్రిల్ 14, 2022 ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ 'జీ5' తనదైన ముద్ర వేస్తూ వెబ్ సిరీస్‌లు, సినిమాలతో ముందుకు సాగుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే బీబీసీతో కలిసి జీ5, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్స్ 'గాలివాన' వెబ్ సిరీస్‌ను నిర్మించాయి. ఈ వెబ్ సిరీస్‌తో సీనియర్ నటుడు సాయి కుమార్, రాధికా శరత్ కుమార్‌లు తొలిసారిగా డిజిటల్ తెరకు పరిచయమయ్యారు. కిర్రాక్ పార్టీ, తిమ్మరుసు చిత్రాల దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి ఈ వెబ్‌సిరీస్‌ను డెరెక్ట్ చేశాడు. సాయి కుమార్, రాధికా శరత్ కుమార్‌తోపాటు చాందిని చౌదరి, నందిని రాయ్, చైతన్య కృష్ణ, అశ్రిత, శరణ్య ప్రదీప్, తాగుబోతు రమేష్ తదితరులు నటించిన ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 14న జీ5లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్న 'గాలివాన' వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. కథ: కొమర్రాజు (సాయి కుమార్) కూతురు గీత, సరస్వతి (రాధికా శరత్ కుమార్) కుమారుడు అజయ్ వర్మ చిన్నప్పటి నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. హనీమూన్‌కు వెళ్లిన ఈ జంటను శ్రీను అనే యువకుడు దారుణంగా హత్య చేస్తాడు. తర్వాత కారులో పారిపోతూ గాలివాన కారణంగా సరస్వతి ఇంటి ముందు యాక్సిడెంట్‌కు గురవుతాడు. తీవ్ర గాయాలపాలైన శ్రీనును సరస్వతి కుటుంబ సభ్యులు కాపాడి చికిత్స అందించడానికి సిద్ధమవుతారు. ఇంతలో వారి కూతురు అల్లుడిని చంపింది శ్రీనునే అని తెలుస్తుంది. ఆ మరసటి రోజు శ్రీను హత్యకు గురవుతాడు. శ్రీను చంపింది ఎవరు ? తమ వాళ్లను చంపిన వ్యక్తి తమ ఇంట్లోకి వస్తే ఆ కుటుంబ సభ్యులు ఏం చేశారు ? అసలు గీత, అజయ్ వర్మలను శ్రీను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది ? అనేది 'గాలివాన' వెబ్ సిరీస్ కథ. విశ్లేషణ: బీబీసీ మినీ సిరీస్‌గా వచ్చిన 'వన్ ఆఫ్ అజ్'కు అఫిషియల్ రీమేక్‌గా తెరకెక్కిందే 'గాలివాన' వెబ్ సిరీస్. కిర్రాక్ పార్టీ, తిమ్మరుసు వంటి రీమేక్ సినిమాలను డైరెక్టర్ చేసిన శరణ్ కొప్పిశెట్టి ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఇదివరకూ శరణ్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేసినవి రీమేక్ చిత్రాలే కావడంతో ఈ బీబీసీ మినీ సిరీస్‌ను కూడా తెలుగు నేటివిటీకి తగినట్లే చిత్రీకరించాడు. పల్లెటూరులో జరిగే ఈ కథకు అనువుగా పాత్రల ఎంపిక బాగుంది. ఆయుర్వేద వైద్యుడిగా సాయి కుమార్, ముగ్గురు పిల్లల ఒంటరి తల్లిగా రాధికా శరత్ కుమార్. సరస్వతి పిల్లలుగా చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, తదితరులు వారి పాత్రలకు చక్కగా సరిపోయారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటను హత్య చేయడంతో ప్రారంభమైన 'గాలివాన' ఆసక్తిగా ఉంటుంది. తర్వాత మర్డర్ చేసిన వ్యక్తి దంపతుల ఇంటి ముందు యాక్సిడెంట్‌కు గురికావడం, అతనే కిల్లర్ అని ఆ కుటుంబ సభ్యులకు తెలవడం, ఇంతలో అతను కూడా చంపబడటం థ్రిల్లింగ్‌గా ఫస్ట్ ఎపిసోడ్ సాగుతోంది. ఇక తర్వాత ఎపిసోడ్లు సాదాసీదాగా ఉంటాయి. కొంచెం సీరియల్ అనుభూతిని కలిగిస్తాయి. అయితే తమ పిల్లల హత్యతో రెండు కుటుంబాలు ఎలాంటి వేదనకు గురయ్యాయి అనేది చాలా చక్కగా చూపించారు. పాత్రల పరిచయం, వారి స్వభావం చూపించే ప్రయత్నంలో కొంతవరకు బోరింగ్‌గా అనిపిస్తుంది. తర్వాత జంటను చంపిన కిల్లర్ పట్టుకునేందుకు వచ్చిన పోలీస్ ఆఫిసర్‌గా నందిని రాయ్ ఎంట్రీతో కథలో ఆసక్తి మొదలవుతుంది. ఒక పక్క నందిని రాయ్ కిల్లర్‌ను పట్టుకునే ప్రయత్నం చేయగా మరోవైపు కిల్లర్ శవాన్ని మాయం చేసే పనిలో రెండు కుటుంబాలు ఉండటం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ఈ సీన్లు కొద్దివరకు 'దృశ్యం' మూవీని తలపిస్తాయి. అలాగే కిల్లర్ శ్రీనును హత్య చేసింది తమలోని వారే అని ఒకరిపై ఒకరు అనుమానపడటం మనుషులను పరిస్థితులను ఎలా మారుస్తాయే తెలిసేలా అద్దం పడుతాయి. సరస్వతి భర్త ఎపిసోడ్ నిడివి పెంచినట్లే ఉంది గానీ అంతగా ఆకట్టుకోలేదు. ఒక ట్విస్ట్ తర్వాత ఒక ట్విస్ట్‌తో చివరి రెండు ఎపిసోడ్స్ ఉత్కంఠభరితంగా సాగాయి. 7 ఎపిసోడ్లు కాకుండా కొన్ని ఎపిసోడ్లు తీసేస్తే ఈ వెబ్ సిరీస్ మరింతబాగా ఆకట్టుకునేది. ఎవరెలా చేశారంటే ? ఆయుర్వేద వైద్యుడిగా, గ్రామానికి పెద్ద దిక్కుగా సాయి కుమార్ నటన బాగుంది. ఆయన పాత్రకు తన నటనతో న్యాయం చేశారనే చెప్పవచ్చు. ఇక రాధిక శరత్ కుమార్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముగ్గురు పిల్లల ఒంటరి తల్లిగా, భర్త వదిలేసిన భార్యగా, అనవసరపు ఆలోచనలతో భయపడిపోయే గృహిణిగా ఆమె సరస్వతి పాత్రలో ఒదిగిపోయారు. చైతన్య కృష్ణ, చాందిని చౌదరి, అశ్రిని వేముగంటి, శరణ్య ప్రదీప్ వారి పరిధి మేర బాగానే నటించారు. నందిని రాయ్ తన నటనతో ఆకట్టుకున్న ఆ పాత్ర అంతగా ప్రభావం చూపించలేకపోయింది. నందినిరాయ్కు అసిస్టెంట్‌గా అంజి పాత్రలో తాగుబోతు రమేష్ నటన బాగుంది. సీనియర్ లేడీ కమెడియన్ శ్రీ లక్ష్మీ రెండు, మూడు సన్నివేశాల్లో కనిపించి పర్లేదనిపించారు. టెక్నికల్ టీం వర్క్ బాగుంది. హరి గౌర బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. అయితే థ్రిల్లర్ సినిమాలు ఫాస్ట్ స్క్రీన్ ప్లేతో ముందుకు సాగితే.. వెబ్ సిరీస్‌లు మాత్రం కాస్త నెమ్మదిగానే నారేట్ చేయబడుతాయి. ఎండింగ్లో వచ్చే ట్విస్ట్‌లు, కారణాలు బాగుంటే ఆ వెబ్ సిరీస్ ఆకట్టుకున్నట్టే. మొత్తంగా ఈ 'గాలివాన' వెబ్ సిరీస్ థ్రిల్లింగ్ కంటే మిస్టీరియస్‌గా బాగానే ఆకట్టుకుంటుంది. -
ఈ అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ కానున్న క్రైం థ్రిల్లర్ ‘గాలివాన’, ఎక్కడంటే
సీనియర్ నటుడు సాయి కుమార్, రాధిక శరత్ కుమార్‌లు నటించిన వెబ్ సిరీస్ గాలివాన. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రస్తుతం ఓటీటీల హావా సాగుతున్న నేపథ్యంలో జీ5 సంస్థ తనదైన ముద్రను వేస్తూ ముందుకు కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లను ప్రేక్షకులకు అందిస్తోంది. ఈక్రమంలో తాజాగా 'గాలివాన' వెబ్ సిరీస్‌ను ఈ రోజు అర్థరాత్రి (ఏప్రిల్ 14) నుంచి స్ట్రీమింగ్ చేయబోతోంది. చదవండి: అందుకే మీకు చరణ్ డామినేషన్ ఎక్కువ ఉందనిపిస్తుంది ఈ వెబ్ సిరీస్ లో రాధిక, సాయికుమార్‌లతో పాటు చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, అశ్రిత, శరణ్య ప్రదీప్, తాగుబోతు రమేశ్ తదితరులు నటించారు. కుటుంబ అనుబంధాలకు సంబంధించిన ఎమోషన్స్ తో ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. క్వాలిటీ పరంగా ఈ వెబ్ సిరీస్ భారీగా కనిపిస్తోంది. మదర్ సెంటిమెంట్, క్రైమ్ థిల్లర్ అంశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు. ఈ సిరీస్‌ను బీబీసీ స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించారు. #Gaalivaana storm arriving tomorrow exclusively on #ZEE5.#StormComingSoon 🌪🌪 #GaalivaanaOnZEE5 #PremieresTomorrow #AZEE5Original @realradikaa #SaiKumar @iChandiniC @99_chaitu @ImNandiniRai #ThagubothRamesh #SharanyaPradeep @nseplofficial @bbcstudiosindia @sharandirects pic.twitter.com/qO5v67qmAM — ZEE5 Telugu (@ZEE5Telugu) April 13, 2022 -
చిరంజీవిని 23 సార్లు కొట్టాను, ఎందుకంటే?: రాధిక
మెగాస్టార్ చిరంజీవి, అలనాటి హీరోయిన్ రాధికా శరత్‌కుమార్ జంటగా ఎన్నో సినిమాలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పలు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అందుకున్నాయి. ప్రస్తుతం తల్లి పాత్రలు చేస్తున్న రాధిక చిరంజీవి సినిమాలో విలన్‌గా చేయడానికైనా రెడీ కానీ ఆయనకు మదర్‌గా మాత్రం నటించనని ఇటీవలే తెగేసి చెప్పింది. తాజాగా ఓ షోకు విచ్చేసిన ఆమె ఒక సినిమాలో చిరంజీవిని కొట్టానని చెప్పుకొచ్చింది. 'న్యాయం కావాలి సినిమా నా లైఫ్ టర్నింగ్ పాయింట్. అందులో చిరంజీవిని కొట్టికొట్టి మాట్లాడే సన్నివేశం ఉంటుంది. 23 టేక్స్ తీసుకున్నాను. ఆ తర్వాత చిరంజీవి ముఖం చూస్తే మొత్తం రెడ్ కలర్ అయిపోయింది. అంత గట్టిగా కొట్టేశాను. ఇండస్ట్రీలో హీరోయిన్గా ఉంటే తర్వాత తల్లిపాత్రలు చేయాలనే ఫార్మాట్ ఉంది. అది ఫాలో అవడం నాకిష్టం లేదు. అందుకే బుల్లితెరపై సీరియల్స్ చేశాను' అని రాధిక చెప్పుకొచ్చింది. కాగా రాధిక ఇటీవల విడుదలైన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలో ముఖ్యపాత్రలో కనిపించిన విషయం తెలిసిందే! చదవండి: గని సినిమా ఫెయిల్యూర్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్ దటీజ్ రామ్‌చరణ్, ఆయన వ్యక్తిత్వానికి ఇదే ఎగ్జాంపుల్! -
చిరంజీవిపై నటి రాధిక ఆసక్తికర వ్యాఖ్యలు, ఏం చెప్పిందంటే
Radhika Interesting Comments On Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై సినీయర్ నటి, అలనాటి హీరోయిన్ రాధిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాధిక, చిరంజీవి కలిసి ఎన్నో సినిమాల్లో జంటగా నటించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక పరిశ్రమలో రాధిక, చిరంజీవిలు ఇప్పటికీ మంచి స్నేహితులు. ఈ క్రమంలో ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన రాధిక ఈ సందర్భంగా చిరంజీవి గురించి చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. చిరంజీవి సెల్ఫ్‌మేడ్ మ్యాన్ అంటూ కొనియాడారు. చదవండి: ‘గని’ టీంకు రాష్ట్ర ప్రభుత్వం షాక్, తగ్గించిన టికెట్ రేట్స్ ‘ఆయన తన కష్టంతో పైకి వచ్చారు. ఇప్పటికీ అంతే డేడికేషన్‌తో పని చేస్తున్నారు. మెగాస్టార్ అయినప్పటికీ చాలా ఒదిగి ఉంటారు. అందరితో బాగా కలిసిపోతారు. మేమంతా కలిసినప్పడు చిన్నపిల్లాడిలా అల్లరి చేస్తుంటారు’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం తల్లి పాత్రలు చేస్తున్న రాధిక చిరంజీవి సినిమాలో అవకాశం వస్తే ఎలాంటి రోల్ చేస్తారని అడగ్గా.. ఆయనకు విలన్‌గా ఆయినా చేస్తాను కానీ, తల్లి పాత్రలు అసలు చేయనంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అనంతరం తాను ఒక నటినని, ఎలాంటి పాత్రలైన చేస్తానని చెప్పారు. చదవండి: RC15: ఒక్క ఫైట్ సీన్‌కే రూ. 10 కోట్లు ఖర్చు పెట్టించిన శంకర్! ప్రస్తుత టాలీవుడ్ హీరో గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న హీరోలందరూ తనకు ఇష్టమని, జూనియర్ ఎన్టీఆర్‌కు తాను అభిమానని తెలిపారు. తారక్ ఎనర్జీ లెవల్స్ ఫెంటాస్టిక్ అంటూ అతడిపై ప్రశంసలు కురిపించారు. అలాగే మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్‌లను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని, ఇప్పుడు వారు స్టార్ హీరోలుగా ఎదగడం చూస్తుంటే చాలా గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. కాగా ఇటీవల విడుదలైన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీలో రాధిక, శర్వానంద్‌కు తల్లిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో రాధికతో పాటు ఖుష్బు సుందర్, ఊర్వశీలు కూడా ప్రధాన పాత్రలు పోషించారు. -
మరోసారి కరోనా బారిన పడ్డ హీరో శరత్ కుమార్
కరోనా మహమ్మారి ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒకరకంగా అది వ్యాపిస్తూనే ఉంది. ఇప్పటికే టాలీవుడ్లో పలువురు సెలబ్రిటీలు కరోనాతో పోరాడుతుండగా తాజాగా ప్రముఖ నటుడు, నటి రాధిక భర్త శరత్ కుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఆయన ట్వీట్ చేస్తూ.. ‘నా సన్నిహితులు, శ్రేయోభిలాషులందరికీ శుభ సాయంత్రం. ఈ సాయంత్రం నేను కరోనా వైరస్ పాజిటివ్‌గా పరీక్షించాను. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాను. ఇటీవల కాలంతో నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నారు’ అంటూ శరత్ కుమార్ ట్వీట్లో రాసుకొచ్చారు. కాగా గతంలో కూడా ఆయన మహమ్మారి బారిన పడ్డారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తాజాగా తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ షూటింగ్ సమయంలో ఆయనకు కరోనా సొకింది. తాజాగా మరోసారి ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో శరత్ కుమార్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Good evening my near and dear friends relatives and my brothers and sisters In the political party,this evening I have tested positive and have self isolated myself,I humbly request all the dear ones who have been in contact for the past week to test yourself immediately — R Sarath Kumar (@realsarathkumar) February 1, 2022 -
రాధిక, ఊర్వశి ‘నవరాత్రి’ పాట.. సిగ్గు పడిన రష్మిక
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో సీనియర్ నటీమణులు రాధిక శరత్ కుమార్, ఊర్వశి, ఖుష్బూ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా నవరాత్రి సందర్భంగా ఈ మూవీ షూటింగ్ స్పాట్లో రాధిక, ఊర్వశితో కలిసి రష్మికతో చేసిన వీడియో వైరల్‌గా మారింది. అందులో.. శివాజీ గణేశన్, ‘మహానటి’ సావిత్రి కలిసి నటించిన తమిళ సూపర్ హిట్ మూవీ ‘నవరాత్రి’ లోని పాపులర్ సాంగ్ ‘నవరాతిరి.. శుభరాతిరి’ని సీనియర్ నటీమణులు పాడారు. ఆ సమయంలో మధ్యలో ఉన్న రష్మిక సిగ్గు పడుతూ ఉన్న ఆ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. చదవండి: శర్వానంద్ చిత్రంలో ముగ్గురు సీనియర్ హీరోయిన్స్ A #Navaratri special with the doll @iamRashmika a #favourite song reminiscing #savithri #amj aadavallu meeku joharllu special😀😀😀 pic.twitter.com/ACMCiEbVw5 — Radikaa Sarathkumar (@realradikaa) October 7, 2021 -
చిరు ఇంట్లో పీవీ సింధుకు సత్కారం, టాలీవుడ్ ప్రముఖుల హాజరు
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఘనంగా సత్కరించారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోలు కింగ్ నాగార్జున, అల్లు అరవింద్, రానా, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, శర్వానంద్ పలువురు హీరోలతో పాటు హీరోయిన్లు సుహాసిని, రాధిక శరత్ కుమార్ తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. సినీ ప్రముఖుల మధ్య మెగాస్టార్, అల్లు అరవింద్ తదితరులు సింధును సత్కరించి అనంతరం ఆమె సాధించిన మెడల్‌తో వారంతా ఫొటోలు దిగారు. చదవండి: ప్రభాస్ అస్సలు అలాంటి వాడు కాదు: కృతి సనన్ ఇందుకు సంబంధించిన వీడియోను చిరంజీవి తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేస్తూ.. ‘దేశం గర్వించేలా వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన మన పీవీ సింధుని ఆత్మీయుల మధ్య సత్కరించుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది’ అంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అలాగే పీవీ సింధును కలవడం చాలా సంతోషంగా ఉందంటూ పలువురు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో సింధు కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌లో వరుసగా రెండుసార్లు పతకం సాధించిన భారతీయ క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించింది. చదవండి: ‘మా’ ఎన్నికలు: ప్రకాశ్ రాజ్ ఆఫీసులో బిగ్‌బాస్ సభ్యులకు నైట్ పార్టీ! View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
లైకా ప్రొడక్షన్స్ కొత్త సినిమా.. హీరోయిన్గా ప్రముఖ నటి
చెన్నై: లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ యువ నటుడు అధర్వ మురళి కథానాయకుడిగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ సంస్థ నిర్మిస్తున్న 22వ చిత్రం ఇది. రాజ్‌కిరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఎ.సర్గుణం కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నటి రాధిక శరత్‌కుమార్, ఆర్.కె.సురేష్, జై ప్రకాష్ ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. కథానాయికగా ఓ ప్రముఖ నటి నటించినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం శుక్రవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సహజత్వంతో కూడిన కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. చిత్ర షూటింగ్‌ను తిరువయ్యారు పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా ఒకే షెడ్యూల్లో పూర్తి చేసినట్లు చెప్పారు. దీనికి జిబ్రాన్ సంగీతాన్ని, లోకనాథన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. -
ద్రవిడ పార్టీల పెత్తనం చెల్లదంటున్న రాధిక శరత్ కుమార్
-
కమల్ సీఎం కావడం ఖాయం: రాధిక
సాక్షి, చెన్నై: తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు సర్వేలో స్పష్టమైంది, సుపరిపాలనే లక్ష్యంగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన ఐజేకే కూటమి గెలుపు తథ్యం, కమల్‌హాసన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని సమత్తువ మక్కల్ కట్చి (ఎస్ఎంకే) అగ్రనేత, నటి రాధిక ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సారి కొత్త కూటమి. విద్య, వైద్యరంగంలో ప్రసిద్ధులైన ఇండియా జన నాయక కట్చి అధ్యక్షులు రవి పచ్చముత్తు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షులు కమల్‌హసన్, నా భర్త, సమత్తువ మక్కల్ కట్చి అధినేత శరత్‌కుమార్‌లతో కూటమిగా ఏర్పడ్డాం. ఎప్పుడూ లీడింగ్ పార్టీలకే ఓటు వేసిన ప్రజలు ఒక మార్పు రావాలని ఆశిస్తున్నారు. ఇవ్వాలని మేము ఆశిస్తున్నాం. మాది ఒక బలమైన కూటమి. ప్రజలు ఒక మార్పు రావాలని కోరుకునే క్రమంలో విద్యావంతులు, మేధావులు ఉంటారు. వారంతా ఏకగ్రీవంగా మార్పు కోసం ఎదురుచూస్తున్నారు. ఇది చాలా అరుదైన ప్రగతిశీల ఆలోచన. గుడ్ గవర్నెస్ కోసం మాకు ఓటు వేయాలి. పరిపాలనలో ఒక మార్పు తీసుకొస్తామని ప్రజలకు ప్రమాణం చేస్తున్నాం. ఎస్ఎంకే మేనిఫెస్టో, ఎంఎన్ఎం మేనిఫెస్టోలు తరచి చూస్తే సుపపరిపాలనకు, వాస్తవికతకు దగ్గరగా అద్దం పడుతున్నాయి. భావితరాల కోసం కమల్‌హాసన్ మంచి చేస్తారనే నమ్మకం ప్రజలందరికీ ఉంది. అందుకే కమల్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని విశ్వసిస్తున్నట్లు రాధిక తెలిపారు. -
‘800’ వివాదం.. జనాలకు ఏం పని లేదా?!
చెన్నై: హీరో విజయ్ సేతుపతి క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’లో నటించవద్దంటూ నిరసనలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ విజయ్ సేతుపతికి మద్దతుగా నిలిచారు. నమ్మక ద్రోహి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న చిత్రంలో నటించొద్దని విజయ్ సేతుపతికి దర్శకుడు భారతీరాజా సూచించిన విషయం తెలిసిందే. అంతేగాక పలు తమిళ సంఘాలు కూడా దేశద్రోహి సినిమాలో నటించవద్దంటూ డిమాండ్ చేస్తున్నాయి. దీంతో రాధిక శుక్రవారం వరుస ట్వీట్లు చేస్తూ విజయ్ సేతుపతికి, చిత్ర పరిశ్రమకు సంఘీభావం తెలిపారు. రాజకీయాలను, వినోదాన్ని కలపవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. (చదవండి: ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో నటించొద్దు!) రాధిక ట్వీట్ చేస్తూ.. ‘జనాలకు ఏం పని లేదా.. ఒక నటుడిని, క్రికెటర్‌ను కలపడం అర్థం లేని వివాదం. ముత్తయ్య మురళీధరన్‌ను కోచ్‌గా నియమించిన ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ప్రజలు ఎందుకు ప్రశ్నించడం లేదు’ అన్నారు. అలాగే ‘‘సన్‌రైజర్స్, సన్ టెలివిజన్ ఛానెల్‌కు బలమైన రాజకీయ అనుబంధం ఉంది. అయినప్పటికి రాజకీయాలను, క్రికెట్‌ను, వినోదాన్ని వృత్తిపరంగా తగిన మార్గంలో స్ఫష్టంగా నిర్వహిస్తోంది. అలాంటప్పుడు రాజకీయాలకు దూరంగా చిత్ర పరిశ్రమను, వినోదాన్నేందుకు చూడకూడదు’’ అని ప్రశ్నించారు. అయితే తను ఈ విషయాన్ని వివాదం చేయాలనుకోవడం లేదన్నారు. కేవలం సినీ పరిశ్రమకు, నటులకు న్యాయపరమైన మద్దతునిచ్చే ప్రయత్నంలో తటస్థతకు, పక్షపాతరహితానికి సాక్ష్యం ఇచ్చేందుకే సన్‌రైజర్స్ పేరును వాడాను అంటూ రాధిక మరో ట్వీట్లో స్పష్టం చేశారు. (చదవండి: విజయ్ సేతుపతికి జంటగా నిత్యా మీనన్) #muthaiyamuralitharan biopic &asking @VijaySethuOffl not to act😡do these people hav no work??why not ask @SunRisers why he is the head coach, team belongs to a Tamilian with political affiliations?VSP is an actor, and do not curb an actor. VSP&cricket both don’t warrant nonsense — Radikaa Sarathkumar (@realradikaa) October 16, 2020 అయితే ఎమ్మెస్ శ్రీపతి దర్శకత్వంలో 800 పేరుతో శ్రీలంక క్రికెటర్ మురళీధరన్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మురళీధరన్‌గా విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలో ఫస్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. శ్రీలంక మతవాదానికి పూర్తిగా మద్దతు పలికిన వ్యక్తి ముత్తయ్య అని అలాంటి నమ్మకద్రోహి జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న చిత్రంలో విజయ్ సేతుపతి నటించవద్దంటూ దర్శకుడు భారతీరాజు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. అంతేగాక 800కు వ్యతిరేకంగా పలు తమిళ సంఘాలు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. దర్శకుడు శీను రామస్వామి, చేరన్ కూడా ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్రలో నటించొద్దని విజయ్‌సేతుపతికి విజ్ఞప్తి చేశారు. (చదవండి: విజయ్ సేతుపతికి జంటగా నిత్యా మీనన్) my intention of that tweet was not to create any room for controversies but was to support the film industry and the connected artists within prejudices. That's why I brought in #Sunrisers name as a testimony of non biased, neutral and professional approach — Radikaa Sarathkumar (@realradikaa) October 16, 2020 -
జ్యోతికకు రాధిక అభినందనలు
నటి జ్యోతికను సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ అభినందించారు. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం పొన్మగల్ వందాల్. దర్శకుడు కే. భాగ్యరాజ్, పార్దిబన్, పాండ్య రాజ్ ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రాన్ని 2–డీ ఎంటర్టైనర్ పతాకంపై సూర్య నిర్మించారు. ఈ చిత్రం విడుదలకు ముస్తాబైంది. అయితే లాక్ డౌన్ కారణంగా విడుదలలో జాప్యం జరిగింది. దీంతో నిర్మాత సూర్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదే ఓటీటీ ఫ్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ ద్వారా చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. చదవండి: జగన్ గారికి ధన్యవాదాలు ఈ మేరకు పొన్మగల్ వందాల్ చిత్రం ఈ నెల 29న అమెజాన్ ప్రైమ్ టైమ్ లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఆన్లైన్ లో మీడియా ప్రతినిధులతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. జ్యోతిక భేటీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో స్పష్టమైన తమిళ భాషను మాట్లాడిన జ్యోతికకు నటి రాధిక శరత్ కుమార్ అభినందనలు తెలిపారు. ఆమె తన ట్విట్టర్ లో పేర్కొంటూ ఆత్మవిశ్వాసంతో చాలా స్పష్టంగా తమిళంలో మాట్లాడటాన్ని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. తను ఎంతగా శ్రమిస్తున్నారో అర్థం అవుతోందని అన్నారు. ఉత్తరాది నుంచి వచ్చి అంత అంకిత భావంతో పని చేస్తున్న ఏకైక నటి జ్యోతిక అని రాధికా శరత్ కుమార్ అభినందించారు. -
రాధిక నాకు తల్లి కాదు!
చెన్నై : నటి రాధికా శరత్‌కుమార్ తనకు తల్లి కాదు అని పేర్కొంది నటి వరలక్ష్మీశరత్‌కుమార్. సంచలనాలకు మారు పేరు ఈ బ్యూటీ. అంతేకాదు తెగువ, ధైర్యం వంటి వాటిలో తనకు తానే సాటి అని చెప్పవచ్చు. విదేశాల్లో పెరిగిన వరలక్ష్మీశరత్‌కుమార్ మంచి బెల్లీ డాన్సర్ అన్నది చాలా మందికి తెలియదు. పోడాపోడీ చిత్రంతో కథానాయకిగా పరిచయమైన ఈ అమ్మడు ఆ తరువాత కన్నడంలో నటించింది. తాజాగా తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చింది. ఇక తమిళంలో అయితే పాత్రలో నటించడానికి అవకాశం ఉంటే అది కథానాయకి అయినా, ప్రతినాయకి అయినా, ఇంకేదయినా నటించడానికి సై అంటోంది. అలా చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న వరలక్ష్మీశరత్‌కుమార్ అతి తక్కువ కాలంలోనే 25 చిత్రాలను దాటేసింది. (‘చాన్స్ కోసం గదికి రమ్మన్నారు’) కాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ పేర్కొంటూ తనకు కోపం ఎక్కువని, రౌడీనని, చిన్న వయసు నుంచి ఏది సరి అనిపిస్తే అది చేసేస్తానని చెప్పింది. అందుకే తనతో మాట్లాడడానికి చాలా మంది భయపడతారని అంది. మరో విషయాన్ని కూడా వరలక్ష్మీశరత్‌కుమార్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. నటి రాధికశరత్‌కుమార్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. తమిళంలో కిళక్కే పోగుమ్ రైల్ చిత్రంతో కథానాయకిగా పరిచయమైన ఈమె ఆ తరువాత తమిళం, తెలుగు సహా ఇతర భాషల్లో నటించి తనదైన ముద్రను వేసుకున్నారు. ఇప్పటికీ ముఖ్య పాత్రల్లో నటిస్తూ, మరో పక్క బుల్లితెర రాణిగా రాణిస్తున్న ప్రముఖ నటి రాధికాశరత్‌కుమార్. అయితే ఈమె నటుడు శరత్‌కుమార్‌ను రెండవ వివాహం చేసుకున్నారన్న విషయం తెలిసిందే. కాగా శరత్‌కుమార్ మొదటి భార్య కూతురు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. ఈమె ఇంటర్వ్యూలో పలు విషయాలను తనదైన స్టైల్లో చెప్పారు. అందులో ముఖ్యంగా తాను రాధికను ఆంటీ అనే పిలుస్తానని చెప్పింది. ఎందుకంటే ఆమె తన తల్లి కాదని అంది. తన తండ్రి రెండవ భార్య. తనకు అమ్మ అంటే ఒక్కరేనని పేర్కొంది. తనకే కాదు ఎవరికైనా అమ్మ ఒక్కరే అని అంది. అందుకే రాధిక తనకు తల్లి కాదని, ఆంటీ అని చెప్పింది. అయితే తాను ఆమెను తన తండ్రి శరత్‌కుమార్‌తో సమానంగా గౌరవం ఇస్తానని చెప్పి దటీజ్ వరలక్ష్మీశరత్‌కుమార్ అనిపించుకుంది. ఆమె బోల్డ్నెస్కు ఇంతకన్నా రుజువు ఏం కావాలి. -
23 నుంచి ‘కోటీశ్వరి’ వచ్చేస్తోంది..
సాక్షి, చెన్నై: మహిళల కోసం ప్రత్యేకంగా ఓ గేమ్ షోను కలర్స్ తమిళ చానల్ నిర్వహించేందుకు సిద్ధమైంది. శనివారం జరిగిన కార్యక్రమంలో ఈ షోలో విజేతగా నిలిచే వారికి రూ. కోటి చెక్కును పరిచయం చేస్తూ నటి రాధికా శరత్‌కుమార్, కలర్స్ చానల్ తమిళ్ బిజినెస్ హెడ్ అనూప్ చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఈనెల 23వ తేదీ రాత్రి 8 గంటలకు కలర్స్ తమిళ టీవీ చానల్లో నటి రాధికా వ్యాఖ్యాతగా (హోస్ట్‌గా) వ్యవహరించనున్న కోటీశ్వరి గేమ్ షో కార్యక్రమం ప్రారంభమవుతుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ షో ప్రసారం అవుతుంది. కలర్స్ తమిళ టీవీ చానల్, స్టూడియో నెక్ట్స్ సంయుక్తంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా కలర్స్ చానల్ వ్యాపారాధ్యక్షుడు అనూప్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మహిళల ప్రతిభకు అద్దంపట్టే రీతిలో కోటీశ్వరి గేమ్ షో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాధికా శరత్ కుమార్ 15 ప్రశ్నలు వేస్తారని, వాటికి రూ. 1000 నుంచి రూ. 1 కోటి బహుమతి ఉంటుందని అన్నారు. పోటీదారులు అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబితే రూ. కోటి బహుమతి గెలుచుకోవచ్చని తెలిపారు. గేమ్ ఆడే సమయంలో పోటీ దారులు 50కి 50 శాతం, ఆడియన్స్ పోల్, ఆస్క్ ది ఎక్స్‌పోల్ (నిపుణుల వద్ద సమాధానాలు కోరడం), ప్లిప్ (కొన్ని సమాధానాలలో ఒకదాన్ని ఎంపిక చేయడం) వంటి నాలుగు విధాలైన హెల్ప్లైన్లు ఉంటాయని వివరించారు. ఈ గేమ్‌షోలో పాల్గొనడం కోసం ఇప్పటి వరకు 3,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. -
రాధిక శరత్‌కుమార్ సరికొత్త అవతారం..
మహిళల కోసం ప్రత్యేకంగా ఓ గేమ్ షోను కలర్స్ తమిళ చానల్ నిర్వహించేందుకు సిద్ధమైంది. శనివారం జరిగిన కార్యక్రమంలో ఈ షోలో విజేతగా నిలిచే వారికి రూ. కోటి చెక్కును పరిచయం చేస్తూ నటి రాధికా శరత్‌కుమార్, కలర్స్ చానల్ తమిళ్ బిజినెస్ హెడ్ అనూప్ చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఈ ఈనెల 23వ తేది రాత్రి 8 గంటలకు కలర్స్ తమిళ టీవీ చానల్లో నటి రాధికా వ్యాఖ్యాతగా (హోస్ట్‌గా) వ్యవహరించనున్న కోటీశ్వరి గేమ్ షో కార్యక్రమం ప్రారంభమవుతుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ షో ప్రసారం అవుతుంది. కలర్స్ తమిళ టీవీచానల్, స్టూడియో నెక్ట్స్ సంయుక్తంగా నిర్వహించనుంది. నిపాన్ పెయింట్స్, అరుణ్ ఏఎక్స్సెల్లో, కోటక్ మహేంద్ర బ్యాంక్, తమిళ్ మేట్రిమోని యాప్ ఈ కార్యక్రమానికి కో ప్రకటన దారులుగా ఉన్నారు. ఈ విషయంగా కలర్స్ చానల్ వ్యాపారాధ్యక్షుడు అనూప్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మహిళల ప్రతిభకు అద్దంపట్టే రీతిలో కోటీశ్వరి గేమ్ షో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాధికా శరత్ కుమార్ 15 ప్రశ్నలు వేస్తారని, వాటికి రూ. 1000 నుంచి రూ. 1 కోటి బహుమతి ఉంటుందని అన్నారు. పోటీదారులు అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబితే రూ. కోటి బహుమతి గెలుచుకోవచ్చని తెలిపారు. గేమ్ ఆడే సమయంలో పోటీ దారులు 50కి 50 శాతం, ఆడియన్స్ పోల్, ఆస్క్ ది ఎక్స్‌పోల్ (నిపుణుల వద్ద సమాధానాలు కోరడం), ప్లిప్ (కొన్ని సమాధానాలలో ఒకదాన్ని ఎంపిక చేయడం) వంటి నాలుగు విధాలైన హెల్ప్లైన్లు ఉంటాయని వివరించారు. ఈ గేమ్‌షోలో పాల్గొనడం కోసం ఇప్పటి వరకు 3,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. -
మహిళలకు మాత్రమే!
నటిగా ఎప్పుడో నిరూపించుకున్నారు రాధిక. వెండితెరపై సినిమాలతో, బుల్లితెరపై సీరియల్స్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇప్పుడు ఆమె కొందరిని కోటీశ్వరులను చేయబోతున్నారు. క్విజ్‌లో క్వశ్చన్స్కు సరైన సమాధానాలు చెబితే కోటీశ్వరులు అయిపోయే అవకాశం ఉన్న షోను హోస్ట్ చేయబోతున్నారు. ఈ షోలో మరో విశేషం ఏంటంటే.. ఇందులో కేవలం మహిళలు మాత్రమే పాల్గొంటారట. హిందీ పాపులర్ టీవీ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షో ఆధారంగా ఈ షోను డిజైన్ చేశారని టాక్. ఆల్రెడీ ఈ షోకు సంబంధించిన ఫొటోషూట్‌లో కూడా పాల్గొన్నారు రాధిక. డిసెంబరు నుంచి ఓ ప్రముఖ చానెల్లో ఈ షో ప్రసారం కానుంది. ఈ షోకు ‘కోడీశ్వరి’ అనే పేరు పెట్టాలనకుంటున్నారట. అంటే.. కోటీశ్వరి అని అర్థం. -
రాధిక, శరత్‌కుమార్‌లను అరెస్ట్ చేయండి
పెరంబూరు: నటుడు శరత్‌కుమార్, ఆయన సతీమణి రాధికా శరత్‌కుమార్‌లను అరెస్ట్ చేయాల్నిందిగా న్యాయస్థానం పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే, రెడియన్స్ మీడియా సంస్థకు నటుడు శరత్‌కుమార్, రాధికాశరత్‌కుమార్, మరో నిర్మాత లిస్టిన్ స్టీఫెన్ చెల్లించాల్సిన రూ.2 కోట్లు ఇవ్వకపోవడంతో వారిని అరెస్ట్ చేయాల్సిందిగా చెన్నై , సైదాపేట కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నటుడు శరత్‌కుమార్, రాధికా శరత్‌కుమార్, లిస్టిన్ స్టీఫెన్ కలిసి ఇంతకు ముందు కొన్ని చిత్రాలను నిర్మించారు. ఆ సమయంలో వారు రేడియన్స్ మీడియా సంస్థ నుంచి తీసుకున్న రుణం రూ.2 కోట్లకుగానూ చెక్కును ఇచ్చారు. అయితే ఆ చెక్కు బౌన్స్ అయ్యింది. దీంతో ఆ రేడియన్స్ మీడియా సంస్థ తరఫున శరత్‌కుమార్, రాధికాశరత్‌కుమార్, లిస్టింగ్ స్టీఫెన్‌లపై చెన్నై, సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ కేసు విచారణలో భాగంగా శుక్రవారం కోర్టుకు హాజరు కావలసిన శరత్‌కుమార్, రాధికాశరత్‌కుమార్, లిస్టింగ్ స్టీఫెన్లు రాలేదు.దీంతో వారిని అరెస్ట్ చేయాల్సిందిగా న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసుపై తదుపరి విచారణను జూలై 12వ తేదీకి వాయిదా వేశారు. -
తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే
పెరంబూరు: తప్పెవరు చేసినా, శిక్ష అనుభవించాల్సిందేనని నటుడు, దక్షిణ భారత నటీనటుల సంఘం( నడిగర్‌సంఘం) కార్యదర్శి విశాల్ పేర్కొన్నారు. ఈ సంఘంకు ఎన్నికల 23వ తేదీన ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుత కార్యవర్గం అయన విశాల్ జట్టు మళ్లీ పోటీకి దిగగా,వారికి పోటీగా దర్శక,నటుడు కే.భాగ్యరాజ్ నేతృతకవంలో ఐసరిగణేశ్, ఉదయ,ప్రశాంత్ బరిలోకి దిగుతున్నారు.దీంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఓటు బ్యాంకు కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. అందులో భాగంగా నటుడు విశాల్ ఇటీవల ఒక వీడియోను విడుదల చేసిన విషయం,దానిపై నటి వరలక్ష్మీశరత్‌కుమార్, రాధికాశరత్‌కుమార్‌లు ఆయనపై ద్వజమెత్తిన విషయం విదితమే.నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ విశాల్ చర్యల్ని తీవ్రంగా ఖండించింది. ఇక నటి రాధికాశరత్‌కుమార్ సిగ్గుమాలిన చర్య అంటూ విశాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరికి బదులిచ్చే విధంగా నటుడు విశాల్ స్పంధించారు. ఆయన పేర్కొంటూ నడిగర్‌సంఘం ఎన్నికల గురించి పలు రకాల ప్రచారం జరుగుతోందన్నారు. వాటిని ఎలా ఎదుర్కోవాలన్నదే ఇప్పుడు తీసుకోవలసిన చర్యలని పేర్కొన్నారు. ఒక వ్యక్తిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అన్నది అంత సాధారణంగా జరగదన్నారు.అన్నీ పూర్తిగా విచారించిన తరువాతనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని అన్నారు. తనతో సహా ఎవరైనా తప్పు చేస్తే శిక్షను అనుభవించాల్సిందేనని అన్నారు. తాము సంఘానికి ఏం చేశామన్నది చెప్పాల్సి వచ్చినప్పుడు నటుడు శరత్‌కుమార్ పేరును ప్రస్ధావించాల్సి వచ్చిందనీ,అందులో తప్పు లేదనీ అన్నారు.కాగా ఇంత జరుగుతున్నా న డిగర్ సంఘ మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్ మౌనంగానే ఉండటం విశేషం. అంతే కాకుండా ఈ ఎన్నికల వ్యవహారం గురించి స్పంధించాల్సిందిగా మీడియా కోరగా తాను ఆ సంఘంలో సభ్యుడినే కాదనీ,అలాంటప్పుడు ఎలా స్పంధిస్తాననీ శరత్‌కుమార్ బదులిచ్చారు. -
విశాల్ మంచివాడు కాదని తెలిసిపోయింది
చెన్నై ,పెరంబూరు: నటుడు విశాల్ మంచివాడు కాదని అందరికీ తెలిసిపోయిందని నటి రాధికా శరత్‌కుమార్ వ్యాఖ్యానించారు. విశాల్ బృందానికి ఓటమి తప్పదన్నారు. 2015లో జరిగిన దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల్లో అప్పటి సంఘ అధ్యక్షుడు శరత్‌కుమార్‌కు పోటీగా విశాల్ బరిలోకి దిగి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ తరువాత విశాల్ బృందం శరత్‌కుమార్, రాధారవిలు నడిగర్ సంఘంలో పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సంఘానికి చెందిన సెంగల్‌పట్టులోని స్థలాన్ని అమ్ముకున్నారనే కేసు ఇప్పటికీ కోర్టు విచారణలో ఉంది. దీంతో నటి రాధిక శరత్‌కుమార్ అప్పట్లో విశాల్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు. దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో విశాల్ బృందం మళ్లీ పోటీకి సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో వారికి పోటీగా రాధికా శరత్‌కుమార్ ఎన్నికల బరిలో ఢీ కొనడానికి రెడీ అవుతున్నట్టు, సామాజిక మాధ్యమాలతో పాటు కొన్ని టీవీ ఛానెళ్లలోనూ తీవ్ర ప్రచారం జరుగుతోంది. కాగా ఈ విషయం గురించి స్పందించిన రాధికా శరత్‌కుమార్ తాను గానీ, తన భర్త శరత్‌కుమార్ గానీ నడిగర్ సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేసే ఆలోచన గానీ, ఆసక్తిగానీ లేదన్నారు. తమకు అంత సమయం లేదని వ్యాఖ్యానించారు. అయితే నటుడు విశాల్ మంచి వాడు కాదన్న విషయం అందరికీ తెలిసిందని అన్నారు. అందుకు తమకు సంతోషంగా ఉందన్నారు. తాను గత నెల 7వ తేదీనే షూటింగ్ నిమిత్తం కేరళాకు వెళ్లినట్లు తెలిపారు. కాగా తన సోదరుడు పోటీ చేస్తున్నాడా? అనే విషయాన్ని తనకు తెలియదన్నారు. అయితే ఎన్నికల్లో విశాల్‌కు వ్యతిరేకంగా ఎవరైనా పోటీ చేస్తే వారికి తమ మద్దతు ఉంటుందని రాధికా శరత్‌కుమార్ వెల్లడించారు. -
లేడీ డాన్
‘నకరాల్ పడితే తోల్ తీస్తా’ అని వీర మాస్ లెవల్లో రౌడీలకు వార్నింగ్ ఇస్తున్నారు నటి రాధికా శరత్‌కుమార్. ఆమె పోలీసాఫీసర్ పాత్ర చేయడం లేదు. వార్నింగ్ ఇస్తుంది డాన్ పాత్రలో. శరణ్ దర్శకత్వంలో అరవ్, కావ్వథాపర్, రాధికా శరత్‌కుమార్ ముఖ్య పాత్రలుగా ‘మార్కెట్ రాజా ఎంబీబీఎస్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అరవ్ లోకల్ డాన్ అండ్ రైల్వే కండక్టర్ పాత్రలో నటిస్తున్నారు. రాధిక డాన్‌గా నటిస్తున్నారు. ‘‘అరవ్ తల్లిగా రాధిక డాన్ పాత్రలో కనిపిస్తారు. ఆమె యాక్టింగ్‌లో ఎం.ఆర్. రాధ (రాధిక తండ్రి, ప్రముఖ తమిళ నటుడు) బాడీ లాంగ్వేజ్‌ను ఆడియన్స్ చూస్తారు. వాయిస్ మాడ్యులేషన్ కూడా అలానే ఉంటుంది’’ అని దర్శకుడు అన్నారు. ఈ సినిమా చిత్రీకరణ 80 శాతం పూర్తయింది. నెక్ట్స్ షెడ్యూల్‌ను చెన్నైలో ప్లాన్ చేశారు. సిమ్మన్ కె. కింగ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. -
హరికృష్ణ హఠాన్మరణంపై చలించిపోయిన సిమ్రాన్
సాక్షి, చెన్నై : సినీ నటుడు, రాజ్యసభ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మృతి వార్త వినగానే దిగ్భ్రాంతికి గురయ్యానని సీనియర్ నటి భానుప్రియ అన్నారు. హరికృష్ణ మృతి చెందారంటే ఇంకా నమ్మలేకున్నానని అన్నారు. ఆయన మృతిపట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారామె. ఆయనతో రెండు చిత్రాలు చేశానని, సెట్లో ఆయన అందరితో కలివిడిగా అభిమానంగా ఉంటారని తెలిపారు. తన కుటుంబం అంటే హరికృష్ణకు చాలా అభిమానమన్నారు. ఆయన మృతి చిత్రసీమకే కాదు ఆయనను అభిమానించే వారందరికీ తీరనిలోటేనన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భగవంతుడు ఆ కుటుంబానికి బాధను తట్టుకునే ధైర్యాన్ని ఇవ్వాలని వేడుకున్నారు. షాక్ గురయ్యా : రాధికా శరత్ కుమార్ నందమూరి హరికృష్ణ మృతి వార్త వినగానే షాక్‌కు గురయ్యానని సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ అన్నారు. ఆయన మృతిపట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారామె. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. చాలా బాధ కలిగింది : సిమ్రాన్ కారు ప్రమాదంలో మరణించిన నందమూరి హరికృష్ణకు నటి సిమ్రాన్ సంతాపం తెలిపారు. ఆయన హఠాన్మరణం చాలా బాధకలిగించిందని ఆమె అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హరికృష్ణకు మంచిపేరు తెచ్చిపెట్టిన సీతయ్య సినిమాలో ఆయనకు జోడిగా సిమ్రాన్ నటించిన సంగతి తెలిసిందే. -
మళ్లీ ఆ రోజులు రావు
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(94)మంగళవారం సాయంత్రం కన్నుమూశారు.అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు మంగళవారం ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయనను కడసారి చూడాలని కోరికతో అభిమానులు, డీఎంకే శ్రేణులు ఆసుపత్రి వద్దకు భారీగా తరలి వస్తున్నారు. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మృతిపై దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇతర పలువురు రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాల ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాప సందేశాలను పోస్ట్ చేశారు. అటు కళైంగర్ మరణంపై తమిళ నటి రాధికా శరత్ కుమార్ స్పందించారు. తనకు సంబంధించినంతవరకు, తమిళనాట మళ్లీ అలనాటి రాజకీయాలను, ఆ రోజులను మళ్లీ చూడలేమని ట్వీట్ చేశారు. మనకిది చీకటి రోజు, నా మనస్సు, హృదయం ఆ అధినాయకుడి జ్ఞాపకాలతో నిండిపోయింది. తమిళుల ఆత్మగౌరవం కోసం కృషి చేసిన గొప్ప నాయకుడాయన. ఆయన ఆత్మ శాశ్వతమంటూ రాధిక కన్నీటి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. ఫోటోను షేర్ చేశారు. తమిళ హీరో, రాజకీయ నాయకుడు రజనీకాంత్ కూడా కరుణానిధి మరణంపై ట్విటర్లో సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు. ఇది చీకటిరోజు. ఆ కళాకారుడి జీవితంలోని ఈ రోజుని నా జీవితంలో మర్చిపోలేను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి అని ట్వీట్ చేశారు. హీరో సిద్ధార్ద్ స్పందిస్తూ..తమిళ దిగ్గజం నేలకొరిగింది. తమిళనాట ఆయనకు ఆయనే సాటి. ఒక గొప్ప సమకాలీన రాజకీయనాయకుడిని, ఇటు సృజనాత్మక దురంధరుడిని కోల్పోయింది. ఆయన లేని లోటు పూడ్చలేదని ట్విట్ చేశారు. అటు కరుణానిధి ఆరోగ్యం ఈ రోజు మధ్యాహ్నం నుంచి బాగా విషమించడంతో రాష్టంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఆయన ఇక మనకు లేరని చివరికి వైద్యులు ధృవీకరించడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నగరంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. Dark day for us, my mind and heart is full of memories of this tall leader @kalaignar89 , man who instilled and strived for the pride of Tamils. His spirit will always live on, will miss him terribly. A tall and great leader gone, bid him a tearful adieu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/zk6GlwLG2v — Radikaa Sarathkumar (@realradikaa) August 7, 2018 The Last #Tamil Titan has fallen. Former TN CM #MKarunanidhi was an incomparable man. #TamilNadu has lost at once its greatest contemporary political and creative enigma. Our beautiful language #Tamil will miss #Kalaignar #Karunanidhi This void he has left will take ages to fill. — Siddharth (@Actor_Siddharth) August 7, 2018 -
'ఇంద్రసేన' మూవీ రివ్యూ
టైటిల్ : ఇంద్రసేన జానర్ : ఫ్యామిలీ యాక్షన్ డ్రామా తారాగణం : విజయ్ ఆంటోని, డయానా చంపికా, మహిమా, జ్యువెల్ మేరి, రాధా రవి, సంగీతం : విజయ్ ఆంటోని దర్శకత్వం : జి. శ్రీనివాసన్ నిర్మాత : రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని బిచ్చగాడు సినిమాతో తెలుగు నాట సంచలన విజయం సాధించిన విజయ్ ఆంటోని ఆ తరువాత విడుదలైన సినిమాలతో ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో మరోసారి తనకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన సెంటిమెంట్ నే నమ్ముకొని ఇంద్రసేన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి మరోసారి విజయ్ ఆంటోని మ్యాజిక్ రిపీట్ అయ్యిందా,,.? అమ్మ సెంటిమెంట్ లాగే తమ్ముడు సెంటిమెంట్ కూడా సక్సెస్ సాధించిందా..? కథ : ఇంద్ర సేన (విజయ్ ఆంటోని) తను ప్రేమించిన అమ్మాయి తన కళ్లముందే ప్రమాదంలో చనిపోవటంతో తాగుబోతుగా మారిపోతాడు. ఎప్పుడు తను ప్రేమించిన అమ్మాయి సమాధి మీదే పడుకొని తాగుతూ ఉంటాడు. పెళ్లి చేస్తే బాగుపడతాడని తల్లిదండ్రులు ప్రయత్నించినా.. తాగుబోతు అన్న ముద్ర పడటంతో ఎవరు అమ్మాయిని ఇచ్చేందుకు ఒప్పకోరు. అదేసమయంలో అచ్చు ఇంద్రసేనలా ఉండే అతని తమ్ముడు రుద్రసేనకు పెళ్లి కుదురుతుంది. (సాక్షి రివ్యూస్) కానీ ఇంద్రసేన చేసిన ఓ చిన్నపోరపాటు వాళ్ల జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది. హ్యతకేసులో ఇంద్రసేనకు ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది. రుద్రసేన ఉద్యోగం పోగొట్టుకుంటాడు.. పెళ్లి ఆగిపోతుంది. వాళ్ల వ్యాపారాలను కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఏడేళ్ల తరువాత ఇంద్రసేన జైలు నుంచి బయటకు వచ్చేసరికి పరిస్థితులన్ని మారిపోతాయి. రుద్రసేన రౌడీగా మారతాడు. తన వల్లే తన కుటుంబం ఇలా ఇబ్బందుల్లో పడిందని భావించిన ఇంద్రసేన ఎలాగైన తమ్ముడికి తిరిగి మామూలు జీవితం ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఇంద్రసేన ఏం చేశాడు..? అన్నదే మిగతా కథ. విశ్లేషణ : బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన విజయ్ ఆంటోని, ఇంద్రసేనగా మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ద్విపాత్రాభినయం చేసిన విజయ్, లుక్ విషయంలో వేరియేషన్ చూపించినా.. నటన పరంగా రెండు క్యారెక్టర్లలో పెద్దగా వేరియేషన్ ఏమీ లేదు. హీరోయిన్ల పాత్రలకు అంతగా ఇంపార్టెన్స్ లేకపోవటం, వారు తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న తారలు కూడా కాకపోవటంతో పెద్దగా కనెక్ట్ కాలేరు. రాధ రవిలాంటి ఒకరిద్దరు నటులు తప్ప తెలుగు ఆడియన్స్ గుర్తు పట్టగలిగే వారు లేకపోవటంతో డబ్బింగ్ సినిమ ఆచూస్తున్నామన్న భావనే కలుగుతుంది. తన ప్రతీ సినిమాను డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించే విజయ్ ఈ సినిమా విషయంలో కూడా అదే ఫాలో అయ్యాడు. అన్నదమ్ముల కథను ఆకట్టుకునే కథనంతో తెరకెక్కించే ప్రయత్నం చేశారు. (సాక్షి రివ్యూస్)దర్శకుడు శ్రీనివాసన్ సినిమాను పూర్తిగా తమిళ ప్రేక్షకులను దృష్టిలోపెట్టుకొని తెరకెక్కించినట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగినా.. సెకండ్ హాఫ్ యాక్షన్ మోడ్ లో సాగటం ఆకట్టుకుంటుంది. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ తెలుగు ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంటాయన్న దాని మీదే సినిమా విజయం ఆదారపడి ఉంటుంది. ప్లస్ పాయింట్స్ : ఎమోషనల్ సీన్స్ సినిమా నిడివి మైనస్ పాయింట్స్ : తమిళ నేటివిటి - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
ప్రేక్షకులకు నచ్చేది... హిట్టయ్యేదే కమర్షియల్ సినిమా!
‘‘నేను మంచి నటుణ్ణి కాదు. కానీ, మంచి కథలు ఎంచుకుని అందుకు తగ్గట్టు భావోద్వేగాలు పలికిస్తా. నా దృష్టిలో కమర్షియల్ సినిమా అంటూ ప్రత్యేకంగా ఉండదు. ప్రేక్షకులకు నచ్చేది... హిట్టయ్యేదే కమర్షియల్ సినిమా. ‘బిచ్చగాడు’ నచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది’’ అన్నారు విజయ్ ఆంటోని. ఆయన హీరోగా జి. శ్రీనివాసన్ దర్శకత్వంలో రాధికా శరత్‌కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ ‘అన్నాదొరై’. తెలుగులో ‘ఇంద్రసేన’గా రేపు విడుదలవుతోందీ సినిమా. విజయ్ ఆంటోని చెప్పిన విశేషాలు... ► తమిళనాడు రాజకీయాల నేపథ్యంలో తీసిన సినిమా కాదిది. దర్శకుడు శ్రీనివాసన్‌కు ఓ కవల సోదరుడు ఉండేవాడు. తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీశాడు. ► అన్నాతమ్ముళ్ల కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఇంద్రసేన, రుద్రసేన అన్నదమ్ములు. ప్రేమించిన అమ్మాయిని కోల్పోయిన ఇంద్రసేన వ్యసనాలకు బానిస అవుతాడు. పీఈటీ టీచర్ అయిన రుద్రసేనకు అనుకోని సమస్య వస్తుంది. ఆయా పరిస్థితుల్లో అన్నాతమ్ముళ్లు తీసుకున్న నిర్ణయాలు ఏంటన్నదే కథ. ► అందంగా కట్ చేస్తే... టీజర్ బాగుంటుంది. ప్రేక్షకులను మోసం కూడా చేస్తుంది. అందుకే, పది నిమిషాల సినిమాని చూపించాం. దీని ద్వారా ప్రధాన కథ తెలిసే అవకాశం ఉండదు. కానీ, ప్రేక్షకుల్లో సినిమాపై ఉత్సుకత, క్రేజ్ పెంచొచ్చు. ‘భేతాళుడు’కీ ఇలాగే చేశాం. ► భారతదేశం చాలా పెద్దది. జనాభా కూడా ఎక్కువే. అందువల్ల జీఎస్టీపై అభిప్రాయాన్ని ఒక్కసారి చెప్పలేం. ఏడెనిమిదేళ్లు పడుతుంది. మా సినిమాలో జీఎస్టీపై ఓ పాట ఉంది. అందులో ఎవర్నీ విమర్శించకున్నా సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పడంతో జీఎస్టీ పదం వినిపించకుండా చేశాం. ► నేను చేసే ప్రతి పనిని ఓ ప్రేక్షకుడిగా ఆలోచిస్తా. నా పని సిన్సియర్‌గా చేయాలనుకుంటాను. అంతేకానీ, ఇంకా ఇంకా ఏదో కావాలంటూ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయను. నా లిమిట్స్ నాకు తెలుసు. బయటి నిర్మాతలైతే ఒత్తిడి ఉంటుందన్నది నా ఆలోచన. అందుకే నా సంస్థలో చేస్తా. ► తెలుగులో కథలు వింటున్నా. త్వరలో డైరెక్ట్ సినిమా చేయబోతున్నా. నాకు యాక్టింగ్ అంటేనే ఇష్టం. దర్శకులు మంచి కథలతో నా వద్దకొస్తున్నారు. నిర్మాణంపైన శ్రద్ధ వహిస్తున్నా. నా చిత్రాలకు సంగీతం కూడా అందిస్తున్నా. ఇతర సినిమాలకు సంగీతం అందించాలనో... డైరెక్టర్ అవ్వాలనో ఆలోచన లేదు. ప్రస్తుతం తమిళ్లో రెండు సినిమాలు చేస్తున్నా. -
అప్పుడు మదర్.. ఇప్పుడు బ్రదర్
‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ మార్క్ సంపాదించుకున్నారు విజయ్ ఆంటోని. వైవిధ్యమైన సినిమాలతో వరుస కమర్షియల్ సక్సెస్‌లు అందుకుంటున్న ఆయన నటించిన తాజా చిత్రం ‘ఇంద్రసేన’. జి. శ్రీనివాసన్ దర్శకత్వంలో రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘బిచ్చగాడు’ సినిమాలో మదర్ సెంటిమెంట్‌కు తన నటనతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షాన్ని కురిపించారు విజయ్. ‘ఇంద్రసేన’ చిత్రంలో బ్రదర్ సెంటిమెంట్‌తో ఆకట్టుకోనున్నారు. బ్రదర్ సెంటిమెంటే కాదు.. హై ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, ట్రైలర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా అద్భుతంగా వచ్చింది. ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు–సాహిత్యం: భాష్యశ్రీ, సంగీతం–కూర్పు: విజయ్ ఆంటోని, కెమెరా: కె.దిల్‌రాజ్, లైన్ ప్రొడ్యూసర్: శాండ్రా జాన్సన్. -
తెలుగు సినిమా చేస్తున్న 'బిచ్చగాడు'
చిన్న సినిమాగా విడుదలై ఘనవిజయం సాధించిన బిచ్చగాడు, హీరో విజయ్ ఆంటోనికి ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ తీసుకువచ్చింది. గతంలో నకిలీ, సలీం లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఆంటోని, బిచ్చగాడు సినిమాతో స్టార్ గా మారిపోయాడు. దీంతో విజయ్ ఆంటోని తాజా చిత్రం భేతాలుడు తెలుగు రైట్స్ ను 30 కోట్ల పెట్టి సొంతం చేసుకున్నారు. ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా.. వసూళ్లు మాత్రం బాగానే సాధించింది. తనను ఇంతగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకుల కోసం ఓ స్ట్రయిట్ తెలుగు సినిమా చేసేందుకు అంగీకరించాడు విజయ్ ఆంటోని. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాను రాధిక శరత్ కుమార్ రాడన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. విజయ్ ఆంటోనిని సంగీత దర్శకుడిగా పరిచయం చేసింది కూడా ఇది బ్యానర్. అందుకే తెలుగులో అదే బ్యానర్ లో పరిచయం అయితే సెంటిమెంట్ పరంగా కలిసొస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు బిచ్చగాడు. -
రాధికా శరత్‌కుమార్‌కు నోటీస్ జారీ చేస్తాం
-
రాధికా శరత్‌కుమార్‌కు నోటీస్ జారీ చేస్తాం
తమిళసినిమా: నటి రాధిక శరత్‌కుమార్‌కు నోటీస్ జారీ చేస్తామని దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్ అన్నారు. సంఘం కార్యవర్గ సమావేశం శనివారం సాయంత్రం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో జరిగింది. ఈ సమావేశంలో పలు విషయాల గురించి చర్చించినట్లు తెలిసింది.అయితే తమిళనాడు యావత్తు ప్రకంపనలు సృష్టిస్తున్న శింబు బీప్ సాంగ్ వ్యవహారం చర్చకు రానట్టు సమాచారం. అనంతరం విలేకరుల ప్రశ్నలకు సంఘం సభ్యులు బదులిచ్చారు.ముఖ్యంగా శింబు విషయంలో సంఘం జోక్యం చేసుకోలేదన్న నటి రాధిక శరత్‌కుమార్ ఆరోపణపై స్పందిస్తూ రాధిక శరత్‌కుమార్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని తీవ్రంగా ఖండించారు. వాస్తవానికి శింబు బీప్ సాంగ్ వ్యవహారంలో ఆయన కుటుంబ సభ్యులతో సంప్రదించామన్నారు. అయితే ఆ సమస్యను వారు కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పారని వివరించారు. అంతే కాదు ఈ విషయమై శింబుతో కూడా మాట్లాడామని,సమస్య పరిష్కారానికి తగిన సహాయం చేస్తామని చెప్పామన్నారు. అందుకు ఆయన సరిగా స్పందించలేదని తెలిపారు. అలాంటప్పు డు తామేమి చేయగలమని అని అన్నారు. కాగా సంఘంపై అసత్య ఆరోపణలు చేస్తున్న నటి రాధికా శరత్‌కుమార్‌ను వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయనున్నట్లు దానికి ఆమె వివరణ ఇచ్చే తీరాలని సంఘం అధ్యక్షుడు నాజర్ అన్నారు. దక్షిణ భారత నటీనటుల సంఘం అందులోని సభ్యులందరికీ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.బీప్ సాంగ్ వ్యవహారం కారణంగా శింబును సంఘం నుంచి తొలగించమని నాజర్ స్పష్టం చేశారు. 8జీ చట్టం అమలు అదే విధంగా సంఘాభివృద్ధికి విరాళాలు సేకరిస్తామని, దాతలు టాక్స్ మినహాయింపు,అదే విధంగా డిపాజిట్ల విషయంలో 8జీ చట్టాన్ని తీసుకొస్తామని సంఘం కార్యదర్శి విశాల్ వెల్లడించారు. ఈ విషయమై బ్యాంక్‌లో వినతిపత్రాన్ని అప్లై చేస్తామని తెలిపారు. ఇకపోతే తమిళనాడులో వరద భాదితులను ఆదుకునే విధంగా సేకరించిన విరాళాలు మొత్తం ఒక కోటీ మూడు లక్షల రూపాయల్ని ముఖ్యమంతి సహాయనిధికి అందించినట్లు తెలిపారు. -
విజయాల బాటలో విక్రమ్
ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ నటుల్లో విక్రమ్ ప్రభు పేరు ముందు ఉంటుంది. కుంకి తో తొలి విజయాన్ని అందుకున్న ఈయన చిత్రం తరువాత చిత్రం చేసుకుంటూ వరుసగా విజయాలను అందుకుంటున్నారు. ఇటీవలే శిఖరం తొడు చిత్రంతో మంచి విజయాన్ని పొందిన విక్రమ్ ప్రభు ఈసారి తన చిత్రాల వేగాన్ని పెంచారు. ప్రస్తుతం ఎళిల్ దర్శకత్వంలో వెళ్లైక్కార దురై చిత్రంతో పాటు ఎఎల్ విజయ్ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నారు. మ్యాజిక్ ఫ్రేమ్స్ పతాకంపై నటుడు శరత్‌కుమార్, రాధిక శరత్‌కుమార్, ఎస్టిన్ స్టీఫెన్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇదు ఎన్న మాయం అనే పేరును నిర్ణయించా రు. ఏఎల్ విజయ్, అమలాపాల్‌ను వివాహం చేసుకున్న తరువాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంంగా నిర్మాణం జరుపుకుంటోంది. ఇదే మ్యాజిక్ ఫ్రేమ్స్ పతాకంపై శరత్‌కుమార్ హీరోగా చండమారుతం అనే చిత్రం తెరకెక్కుతోంది. అదే విధంగా ధనుష్, కాజల్ అగర్వాల్ జంటగా మారి చిత్రాన్ని ఈ సంస్థే నిర్మిస్తోంది.


