
సీనియర్ నటి రాధిక శరత్ కుమార్(Radhika Sarathkumar) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లి మరణంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇవాళ చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లోని రాధిక నివాసంలో తల్లి గీత పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాధిక ఫుల్ ఎమోషనలయ్యారు. ఈ విషాదం సమయంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చారు. ఇవాళ సాయంత్రం చెన్నైలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. రాధిక సోదరి, నటి నిరోష కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
రాధిక తల్లి, సీనియర్ నటుడు ఎం.ఆర్ రాధ సతీమణి గీత (86) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు తారలు ఆమె మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తన తల్లిని గుర్తు చేసుకుంటూ రాధిక సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. రాధిక కుమార్తె రాయనే మిథున్ తన అమ్మమ్మను తలచుకుంటూ భావోద్వేగాని గురైంది.
(ఇది చదవండి: రాధిక శరత్ కుమార్ ఇంట తీవ్ర విషాదం)