హైదరాబాద్‌లో ఓ షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన సమంతకు చేదు అనుభవం ఎదురైంది. సమంత ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. కొద్దిరోజుల్లోనే సమంత ఒక కార్యక్రమం కోసం వస్తున్నడంతో ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఒక్కసారిగా జనం ఎగబడటంతో భద్రతా సిబ్బంది ఆమెను కారు వరకు తీసుకెళ్లడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సెలబ్రిటీల పట్ల పెరుగుతున్న ఈ వెర్రి అభిమానంపై నెట్టింట తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. చదువుకున్న యువతనే ఎక్కువగా ఇలాంటి పనులు చేస్తున్నడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం కోసం పట్టుచీరలో ఎంతో హుందాగా వెళ్లిన సమంత.. ఆ కార్యక్రమం ముగించుకుని కారు వైపు వెళ్తుండగా చాలామంది ఆమెను చుట్టుముట్టారు. దీంతో భద్రతా సిబ్బంది అతికష్టంతో ఆమెను సురక్షితంగా కారు వరకు చేర్చారు. అక్కడికి వచ్చిన వారిని అదుపు చేయడం కూడా వారికి కష్టంగా మారింది. వారి మధ్యలో సమంత నడవలేని పరిస్థితి ఉన్నప్పటికీ ఆమె చిరునవ్వుతోనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్ లులూ మాల్‌లో నిధి అగర్వాల్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. 'ది రాజా సాబ్' సినిమా సాంగ్ ఈవెంట్ నుంచి ఆమె తిరిగి వెళ్తుండగా తనకు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. తనపై చేతులు కూడా వేయడంతో నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నిధి కూడా ఇదే ఘటనపై ఈవెంట్ నిర్వాహుకులను తప్పుబట్టింది. వరుసుగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో కొందరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సెలబ్రిటీలకు కనీస ప్రైవసీ కూడా ఉండదా..? అంటూ భగ్గుమంటున్నారు. అభిమానం హద్దులు దాటుతోందని విమర్శలు వస్తున్నాయి.
Why do some fans in the South still struggle with boundaries, even after the Rajasaab incident? Passion is great, but respect and personal space matter too.#SamanthaRuthPrabhu pic.twitter.com/FgIqH51OCg
— Cineholic (@Cineholic_india) December 21, 2025


