ఢిల్లీలో పెద్ది | Ram Charan Shoots for Peddi in Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో పెద్ది

Dec 22 2025 2:01 AM | Updated on Dec 22 2025 2:01 AM

Ram Charan Shoots for Peddi in Delhi

రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. ‘ఉప్పెన’ మూవీ ఫేమ్‌ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బొమన్‌ ఇరానీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు.పాన్‌ ఇండియా ఫిల్మ్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా చిత్రీకరణ  ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతోంది. రాష్ట్రపతి భవన్‌ పరిసరాల్లో రామ్‌ చరణ్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు బుచ్చిబాబు.

ఈ సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించిన ఫోటోలు లీక్‌ అయ్యాయి. చేతిలో సంచితో మాస్‌ లుక్‌లో నడుచుకుంటూ వెళుతున్న రామ్‌ చరణ్‌ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలను చూసిన మెగా ఫ్యాన్స్  ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి  విడుదలైన ‘చికిరి చికిరి...’పాట 150 మిలియన్లకుపైగా వ్యూస్‌ సాధించినట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సహ నిర్మాత: ఇషాన్‌ సక్సేనా, కెమెరా: ఆర్‌. రత్నవేలు, ఎగ్జిక్యూటివ్‌ ప్రోడ్యూసర్‌: వి.వై.ప్రవీణ్‌ కుమార్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement