
ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ (Radhika Sarath Kumar) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రాధిక తల్లి, సీనియర్ నటుడు ఎం.ఆర్ రాధ సతీమణి గీత (86) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం (సెప్టెంబర్ 21న) రాత్రి మరణించారు. గీత మృతితో రాధిక కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

అంత్యక్రియలు
నేడు సాయంత్రం చెన్నైలోని బెసెంట్ నగర్ శ్మశాన వాటికలో గీత అంత్యక్రియలు జరపనున్నట్లు కుటంబసభ్యులు వెల్లడించారు. ప్రముఖ నటుడు మద్రాస్ రాజగోపాల్ రాధాకృష్ణన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. అతడి ముగ్గురు భార్యలు సరస్వతి, ధనలక్ష్మి, గీత ద్వారా మొత్తం 12 మంది సంతానం జన్మించారు. వారిలో హీరోయిన్లు రాధిక శరత్ కుమార్, నిరోషా ఉన్నారు.
చదవండి: 25 ఏళ్ల తర్వాత విజయ్, జ్యోతికల హిట్ సినిమా రీరిలీజ్