అక్కినేని నాగచైతన్య- శోభిత ధూళిపాళ జంట ఇటీవలే మొదటి పెళ్లిరోజును సింపుల్‌గా జరుపుకున్నారు. ఫస్ట్ యానివర్సరీ రోజు తమ పెళ్లిరోజు వీడియోను అభిమానులతో పంచుకున్నారు. వీరిద్దరూ కలిసున్న ఫోటోలను తరచూ కాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వదులుతూ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుంటారు. అయితే ఈసారి చై-శోభితతో పాటు సమంత కూడా కలిసున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఫ్యామిలీ ఫోటో
అవును, చై, శోభిత, సమంత.. ముగ్గురూ కలిసి సెల్ఫీకి పోజిచ్చారు. కాకపోతే ఇక్కడ సమంత అంటే హీరోయిన్ సామ్ కాదులెండి. శోభిత సోదరి! ఆమె పేరు కూడా సమంతనే కావడంతో ఈ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది. చై మాజీ భార్య పేరు, మరదలి పేరు ఒకటే కావడంతో ఈ ఫోటో చర్చనీయాంశంగా మారింది.
చై వైవాహిక జీవితం
హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత.. ఏ మాయ చేసావే మూవీలో తొలిసారి జంటగా నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమను పెద్దలు కూడా ఒప్పుకోవడంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. క్యూట్ కపుల్‌గా కనిపించే ఈ జంట మధ్య తర్వాత తెలియని అగాధం ఏర్పడింది. దీంతో నాలుగేళ్ల వైవాహిక బంధానికి ఫుల్‌స్టాప్ పెడుతూ 2021లో విడాకులు తీసుకున్నారు.
రెండో పెళ్లి
తర్వాత చై.. హీరోయిన్ శోభిత ధూళిపాళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2024 డిసెంబర్ 4న వీరి వివాహం జరిగింది. అటు సమంత కూడా కొంతకాలంగా ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమాయణం నడిపింది. 2025 డిసెంబర్ 1న ఆ ప్రేమను పెళ్లి బంధంగా మార్చింది. కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో సామ్-రాజ్ రెండో పెళ్లి చేసుకున్నారు.
#NagaChaitanya seen with his wife #Sobhita and her sister #Samantha pic.twitter.com/FxOsh9ldFS
— Milagro Movies (@MilagroMovies) December 21, 2025


