'ఏడేళ్లప్పుడు ఆ ఒక్క సంఘటన..‍ ‍‍ ఆ దెబ్బకు మారిపోయా' | Tollywood actress Renu Desai Comments About How to Become Vegan | Sakshi
Sakshi News home page

Renu Desai: 'ఏడేళ్ల వయసులో ఆ సంఘటన.. శాకాహారిగా మార్చేసింది'

Feb 6 2026 9:39 PM | Updated on Feb 6 2026 10:04 PM

Tollywood actress Renu Desai Comments About How to Become Vegan

టాలీవుడ్ నటి రేణు దేశాయ్ ఇటీవల వార్తల్లో నిలిచిన సంగ తెలిసిందే. కుక్కల సంరక్షణ గురించి మాట్లాడగా.. అది కాస్తా కాంట్రవర్సీకి దారితీసింది. తన పర్సనల్‌ లైఫ్‌ గురించి కామెంట్స్ చేయవద్దని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. కేవలం తాను కుక్కుల క్షేమం కోసమే పనిచేస్తున్నానని చాలా సార్లు వెల్లడించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రేణు దేశాయ్.. తాను వేగాన్‌గా మారడానికి కారణాలను పంచుకుంది.

తనకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు ఒక మేక పిల్లను బలి ఇవ్వడం చూశానని రేణు దేశాయ్ తెలిపింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్ వెజ్ ముట్టుకోలేదని రేణు వెల్లడించింది. మాది బ్రాహ్మణ కుటుంబమని.. అయినప్పటికీ నాన్న మాంసం తినేవారని పేర్కొంది. కానీ మా అమ్మ మమ్మల్ని తినద్దని ఎప్పుడు ఆపలేదని.. కానీ నేను తినకూడదని నిర్ణయించుకున్నాని రేణు దేశాయ్ పంచుకుంది. ఏడేళ్ల వయసులో ఆ సంఘటన చూసినప్పటి నుంచి పూర్తి వేగాన్‌గా మారిపోయానని తెలిపింది. మా అమ్మ కఠినమైన శాకాహారి..వెల్లుల్లి, ఉల్లిపాయలు కూడా తినకపోయేదని రేణు వివరించింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement