జపాన్‌లో పుష్ప-2.. అక్కడ కూడా తగ్గేదేలే..! | Pushpa 2 makes top 10 highest grossing Indian films at Japan box office | Sakshi
Sakshi News home page

Pushpa 2 The Rule: జపాన్‌లో పుష్ప-2.. అక్కడ కూడా తగ్గేదేలే..!

Feb 6 2026 9:10 PM | Updated on Feb 6 2026 9:14 PM

Pushpa 2 makes top 10 highest grossing Indian films at Japan box office

ఐకాన్ స్టార్‌ అ‍ల్లు ‍అర్జున్- సుకుమార్‌ కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ మూవీ పుష్ప-2. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఏకంగా వరల్డ్‌ వైడ్‌గా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ చిత్రాల జాబితాలో రెండో పేస్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కంటే ముందు అమిర్ ఖాన్ మూవీ దంగల్‌ రూ.2200 కోట్ల వసూళ్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

అయితే జపాన్‌లో మన తెలుగు సినిమాలతో పాటు ఇండియన్ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే మన హిట్ సినిమాలను జపనీస్‌లోకి డబ్ చేసి అక్కడ రిలీజ్ చేస్తుంటారు. ఇటీవల పుష్ప-2 మూవీని కూడా జపాన్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ మూవీని జనవరి 16న జపాన్‌లో 'పుష్ప కున్రిన్' అనే పేరుతో విడుదల చేశారు. గతంలో రిలీజైన టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్ అక్కడ ప్రభంజనం సృష్టించింది. ఏకంగా జపాన్ బాక్సాఫీస్ వద్ద రూ.139.73 కోట్ల వసూళ్లతో ఇప్పటికీ ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతోంది.

ఇటీవల జపాన్‌లో రిలీజైన పుష్ప-2 సైతం జపాన్ ‍బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. తాజాగా మూవీ రిలీజైన 14 రోజుల్లోనే ఇండియన్ చిత్రాల జాబితాలో టాప్‌-10లో అడుగుపెట్టేసింది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ.రూ.6.06 కోట్ల వసూళ్లతో ఆమిర్ ఖాన్ నటించిన ధూమ్ 3 (రూ6.03 కోట్లు) వసూళ్లను అధిగమించి 10వ స్థానంలో నిలిచింది. దీంతో జపాన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 భారతీయ చిత్రాలలో పుష్ప 2 చోటు దక్కించుకుంది. కాగా.. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా మెప్పించింది. 

జపాన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితా..

  • ఆర్ఆర్ఆర్ -  రూ.139.73 కోట్లు

  • ముత్తు     - రూ.23.39 కోట్లు

  • బాహుబలి 2: ది కన్‌క్లూజన్    - రూ.17.61 కోట్లు

  • 3 ఇడియట్స్- రూ.9.81 కోట్లు

  • ఇంగ్లీష్ వింగ్లీష్- రూ.9.24 కోట్లు

  • ది లంచ్‌బాక్స్- రూ.8.66 కోట్లు

  • సాహో-  రూ.7.56 కోట్లు

  • మగధీర-  రూ.7.51 కోట్లు

  • ఎంతిరన్ (రోబో - రూ.6.33 కోట్లు

  • పుష్ప 2: ది రూల్- రూ.6.06 కోట్లు 
     

Advertisement
 
Advertisement
Advertisement