నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’. మురళీ మనోహర్ దర్శకత్వంలో డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో నరేశ్ అగస్త్య మాట్లాడుతూ– ‘‘నిన్న (శుక్రవారం) మ్యాట్నీ షోస్ నుంచే 90 శాతం థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి.
కొన్ని ల్యాగ్ సీన్స్, సాంగ్స్ ట్రిమ్ చేశాం. ఆ ట్రిమ్ అయిన వెర్షన్‌కూ రెస్పాన్స్ బాగుంది. ప్రేక్షకులు ఎంటర్‌టైన్ అవుతూ నవ్వుకుంటున్నారు. చిన్న సినిమాకు నిర్మాణ విలువలు బాగుంటే, ఎంత మంచి క్వాలిటీతో సినిమా స్క్రీన్ మీదకు వస్తుందనే విషయానికి ‘గుర్రం ΄ాపిరెడ్డి’ ఓ ఉదాహరణ’’ అని చెప్పారు. ‘‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ చిత్రం వల్ల మా సినిమా మార్నింగ్ షోస్ కాస్త స్లోగా మొదలయ్యాయి. సాయంత్రానికి 90శాతం ఆక్యుపెన్సీతో మా సినిమా ప్రదర్శితం కావడం హ్యాపీ’’ అని చెప్పారు మురళీ మనోహర్. ‘‘థియేటర్స్ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ప్రేక్షకులు ఇంకొంత సపోర్ట్ చేసి, మా సినిమాను హిట్ చేయాలి’’ అని కోరారు వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, యాక్టర్స్ జీవన్ కుమార్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, వంశీధర్ కోసిగి, మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ మాట్లాడారు.


